బకూ (అజర్‌బైజాన్): భారత యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద పెను సంచలనం సృష్టించాడు. ప్రపంచకప్ చెస్ టోర్నీ ఓపెన్ విభాగంలో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానా (అమెరికా)తో జరిగిన సెమీఫైనల్లో 18 ఏళ్ల ప్రజ్ఞానంద 3.5–2.5తో గెలుపొందాడు. ఫైనల్ చేరడంద్వారా ప్రజ్ఞానంద వచ్చే ఏడాది జరిగే క్యాండిడేట్ టోర్నీకి అధికారికంగా అర్హత సాధించాడు.
దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత ప్రపంచకప్ టోర్నీలో ఫైనల్ చేరిన రెండో భారతీయ ప్లేయర్‌గా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు. నిరీ్ణత రెండు క్లాసికల్ గేమ్‌లు ముగిశాక ప్రజ్ఞానంద, కరువానా 1–1తో సమంగా ఉండటంతో విజేతను నిర్ణయించేందుకు సోమవారం టైబ్రేక్ గేమ్‌లు నిర్వహించారు. 25 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లు కూడా ‘డ్రా’గా ముగియడంతో స్కోరు 2–2తో సమమైంది.
అనంతరం 10 నిమిషాల నిడివిగల రెండు ర్యాపిడ్ గేమ్‌లను ఆడించారు. తొలి గేమ్‌లో తమిళనాడు కుర్రాడు ప్రజ్ఞానంద 63 ఎత్తుల్లో గెలిచాడు. ఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన రెండో గేమ్‌లో కరువానా ‘డ్రా’ చేసుకోవడంతో ప్రజ్ఞానంద విజయం ఖరారైంది. ప్రపంచ నంబర్‌వన్ మాగ్నస్ కార్ల్‌సన్ (నార్వే)తో ప్రజ్ఞానంద ఫైనల్లో తలపడతాడు. రెండు క్లాసికల్ గేమ్‌లలో భాగంగా వీరిద్దరి మధ్య తొలి గేమ్ నేడు జరుగుతుంది.
చదవండి: Asia Cup 2023: రాహుల్, శ్రేయస్ పునరాగమనం
Comments
Please login to add a commentAdd a comment