న్యూఢిల్లీ: పిన్న వయస్సులోనే చదరంగంలో విశ్వవిజేతగా నిలిచిన గుకేశ్‌పై ప్రశంసల వర్షం కురిసింది. రాష్ట్రపతి, ప్రధాని మొదలు పలువురు గుకేశ్ విజయాన్ని కొనియాడారు.
అతిపిన్న వయస్సులోనే ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ సాధించిన గుకేశ్‌కు హృదయపూర్వక అభినందనలు. నిన్ను చూసి యావత్ జాతి గర్వపడుతోంది. ప్రపంచ చెస్‌లో భారత్ కూడా ప్రచండ శక్తి అని నీ విజయం చాటింది. భారతీయులందరి తరఫున నీకు శుభాకాంక్షలు. భవిష్యత్తులోనూ నీవు ఇలాగే రాణించాలి.
–రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
అభినందనలు గుకేశ్. కెరీర్ తొలినాళ్లలోనే
సంచలన విజయం సాధించావు. ఆటలో నీ ప్రతిభ, చేసిన కఠోర కృషి, కనబరిచిన అంకితభావం అసాధారణం. ఈ విజయం భారత చెస్ పుటల్లో కేవలం నీ పేరును లిఖించడమే కాదు... కలల్ని సాకారం చేసుకోవాలనుకునే లక్షల మంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తుంది. భవిష్యత్‌లో మరెన్నో ఘనతలు, ఘనవిజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
–ప్రధాని నరేంద్ర మోదీ
ప్రపంచ చాంపియన్‌షిప్ గెలిచిన గుకేశ్‌కు శుభాభినందనలు. నీవు సాధించిన టైటిల్ చెస్‌కే గర్వకారణం. భారత్ ఉప్పొంగిపోయే విజయం నీది. వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ అకాడమీ (వాకా) గరి్వంచే క్షణాలివి. మాజీ చాంపియన్ అయిన నాకూ ప్రత్యేక క్షణాలను మిగిల్చావు. ప్రతి రౌండ్లో డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్ మెరుగ్గా ఆడినా... నీవు ఎదుర్కొన్న తీరు మాత్రం అద్భుతం.
–విశ్వనాథన్ ఆనంద్, ప్రపంచ మాజీ చాంపియన్
ప్రపంచ చాంపియన్‌గా ఆవిర్భవించిన గుకేశ్‌కు కంగ్రాట్స్. ఒత్తిడిని జయించిన తీరు... ప్రతీ రౌండ్‌లోనూ కనబరిచిన నీ ఆటతీరుకు హ్యాట్సాఫ్! నీ దృఢ సంకల్పంతో యావత్ దేశాన్ని గర్వించేలా చేశావ్. నీవు సాధించింది ఓ టైటిల్ మాత్రమే కాదు... యువతరం ప్రేరణ పొందే విజయగాథ నీది. ఇంకెన్నో విజయాలు, మరెన్నో సాఫల్యాలు నీ ముందుంటాయి.
–బీజింగ్ ఒలింపిక్స్
స్వర్ణ పతక విజేత అభినవ్ బింద్రా
‘గుకేశ్... 64 గడుల్లో హద్దులెరుగని అవకాశాల్ని సృష్టించావు. ఆనంద్ అడుగు జాడల్లో భారత కొత్త చెస్ కెరటంగా అవతరించావు. –సచిన్ టెండూల్కర్
మా ఆటలో మరో కొత్త ప్రపంచ చాంపియన్ అవతరించాడు. గుకేశ్... కంగ్రాట్స్.
–ప్రపంచ చెస్ సమాఖ్య
Comments
Please login to add a commentAdd a comment