
క్రీడాకారుల అవసరాలపై దృష్టి పెట్టండి: ఆనంద్
రియో ఒలింపిక్స్‌కు మరో మూడున్నర నెలల సమయమే ఉన్నందున వివాదాలకు దూరంగా ఉంటూ... ఈ క్రీడలకు అర్హత పొందిన క్రీడాకారుల అవసరాలను గుర్తించాలని భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ అభిప్రాయపడ్డాడు. భారత బృందానికి హీరో సల్మాన్ ఖాన్‌ను గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించడాన్ని వివాదం చేయకూడదన్నాడు. ఈసారి ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌కు తాను అర్హత పొందనప్పటికీ... ఇప్పటికైతే తన మదిలో రిటైర్మెంట్ ఆలోచన లేదని స్పష్టం చేశాడు.