'సల్మాన్ ఖాన్‌ను పీకేయండి'
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తాజాగా భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్ తప్పబట్టారు. ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్య ఆయనను తొలగించాలని అన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లే భారత్‌కు నిజమైన రాయబారులని, క్రీడా రాయబారిగా ఎవరినైనా నియమించాలని భావిస్తే.. వారు తప్పకుండా క్రీడారంగానికి చెందినవారై ఉండాలని ఆయన అన్నారు.
ప్రముఖ రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న అర్హత ఏమిటని, ఆయనను రియో ఒలింపిక్స్ గుడ్ విల్ రాయబారిగా నియమించారని యోగేశ్వర్ దత్ ప్రశ్నించారు.