Milkha Singh
-
Olympics: హృదయం ముక్కలైన వేళ!.. ఎనిమిది సార్లు ఇలాగే..
ప్రతీ ఒక్క అథ్లెట్ అంతిమ లక్ష్యం ఒలింపిక్స్ పతకం సాధించడమే అనడంలో సందేహం లేదు. ఆశయాన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురైనా ధీటుగా నిలబడి కలను పండించుకుని.. మెడల్స్ మెడలో వేసుకునే వారు ‘విజేతలు’గా ప్రశంసలు అందుకుంటారు.అయితే.. గుమ్మడికాయంత ప్రతిభ ఉన్నా ఆవగింజంత అదృష్టం లేక ఆఖరి మెట్టుపై బోల్తా పడి నిరాశతో వెనుదిరిగిన వాళ్లు ‘పరాజితులు’గా మిగిలిపోతారు. ప్యారిస్ ఒలింపిక్స్-2024 నేపథ్యంలో.. అలా పతకం గెలిచే దిశగా వచ్చి ఓటమితో ముగించిన భారత క్రీడాకారుల గురించి తెలుసుకుందాం.ఫుట్‌బాల్ జట్టుమెల్బోర్న్ ఒలింపిక్స్-1956లో భారత పురుషుల ఫుట్‌బాల్ జట్టుకు ఇలాంటి పరాభవం ఎదురైంది. ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియాను క్వార్టర్ ఫైనల్లో 4-2తో ఓడించిన భారత్ సెమీస్‌కు దూసుకువెళ్లింది.నాడు మన ఆటగాడు నివిల్లే డిసౌజా ఆసీస్‌తో మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ కొట్టి ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఫుట్‌బాలర్‌గా నిలిచాడు.సెమీ ఫైనల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తాడని భావించిన వాళ్లకు నిరాశే ఎదురైంది. యుగోస్లేవియాతో సెమీస్‌లో భారత్ ఆరంభంలో గట్టిపోటీనిచ్చినా ద్వితీయార్థ భాగంలో అనూహ్యంగా పుంజుకుంది ప్రత్యర్థి. ఫలితంగా భారత్ ఓటమిపాలైంది.ఈ క్రమంలో కాంస్యం కోసం బల్గేరియా జట్టుతో పోటీపడ్డ భారత ఫుట్‌బాల్ టీమ్ 0-3తో ఓడి పతకాన్ని చేజార్చుకుంది.‘ఫ్లైయింగ్ సిఖ్’ హృదయం ముక్కలైన వేళ..రోమ్ ఒలింపిక్స్-1960లో భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ తృటిలో కాంస్య పతకం కోల్పోయాడు. 400 మీటర్ల పరుగు పందెంలో.. ప్రత్యర్థుల వేగాన్ని అంచనా వేసే క్రమంలో చూపు తిప్పిన మిల్కాకు అదే శాపమైంది.ప్రత్యర్థిని గమనించే క్రమంలో వేగం తగ్గించిన మిల్కా.. సెకనులో పదో వంతు తేడాతో వెనకబడి నాలుగోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తన జీవితంలో అత్యంత చేదు జ్ఞాపకంగా ఈ అనుభవం మిగిలిపోయింది.ఆ తర్వాత రెండేళ్లకు ఆసియా క్రీడల్లో రెండు స్వర్ణాలు గెలిచినా ఒలింపిక్ పతకం చేజారిన తీరును తాను మరువలేనని దివంగత మిల్కా సింగ్ గతంలో ఓం సందర్భంలో తెలిపారు. భారత మహిళా హాకీ జట్టు చేజారిన మెడల్1980లో తొలిసారిగా భారత మహిళా హాకీ జట్టు విశ్వ క్రీడల్లో పాల్గొంది. ఆ యేడు మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌కు నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, గ్రేట్ బ్రిటన్ వంటి మేటి జట్లు దూరంగా ఉన్నాయి.నాడు యూనియన్ ఆఫ్ సోవియట్ సోషలిస్టు రిపబ్లికన్స్(యూఎస్ఎస్ఆర్) అఫ్గనిస్తాన్‌పై దురాక్రమణకు పాల్పడిన తీరును నిరసిస్తూ.. క్రీడల్లో పాల్గొనకుండా బాయ్‌కాట్ చేశాయి. ఈ క్రమంలో భారత మహిళా జట్టుకు పెద్దగా పోటీ లేకుండా పోవడంతో పతకంతో తిరిగి వస్తుందనే ఆశ చిగురించింది.అయితే, యూఎస్ఎస్ఆర్తో చివరగా తలపడ్డ భారత్ 1-3తో ఓడి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.పరుగుల రాణికి చేదు అనుభవంలాస్ ఏంజెల్స్-1984 ఒలింపిక్స్‌లో ఉషపైనే భారత్ ఆశలు పెట్టుకుందిపెట్టుకుంది. అయితే, మిల్కా సింగ్ మాదిరే ఆమె కూడా తృటిలో పతకం చేజార్చుకుంది.400 మీటర్ల హార్డిల్స్ పోటీలో సెకనులో వందో వంతు తేడాతో వెనుకబడ్డ ఈ ‘పయ్యోలీ ఎక్స్‌ప్రెస్’ హృదయం ముక్కలైంది. రొమేనియాకు చెందిన క్రిస్టియానా కోజోకరో మూడోస్థానంలో నిలవగా.. పీటీ ఉష పతకం లేకుండా రిక్త హస్తాలతో వెనుదిరిగింది. టెన్నిస్‌లో చేజారిన కాంస్యంలాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు రెండు దశాబ్దాల తర్వాత మరోసారి భారత్ కాంస్యానికి చేరువగా వచ్చింది. అయితే, పాత కథే పునరావృతమైంది.ఈసారి టెన్నిస్ మెన్స్ డబుల్స్‌లో భారత్‌కు పరాభవం ఎదురైంది. లియాండర్ పేస్- మహేశ్ భూపతి ద్వయం క్రొయేషియా జోడీ మారియో ఆన్సిక్- ఇవాన్ జుబిసిక్తో జరిగిన మారథాన్ మ్యాచ్‌లో 6-7 6-4 14-16 తేడాతో ఓడిపోయారు.కాంస్యం కోసం జరిగిన ఈ మ్యాచ్‌లో ఓటమి ఎదురుకావడంతో నిరాశగా నిష్క్రమించారు. అంతకు ముందు సెమీస్‌లో జర్మనీ జంట నికోలస్ కీఫర్- రైనెర్ షట్లర్ చేతిలో పరాజయం పాలై ఫైనల్స్ చేరే సువర్ణావకాశం చేజార్చుకున్నారు పేస్- భూపతి.ఇక ఇదే ఒలింపిక్స్‌లో భారత మహిళా వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవీ సైతం 48 కేజీల విభాగంలో ఫైనల్ అటెంప్ట్‌లో డిస్క్వాలిఫై అయింది.మొత్తంగా 190 కిలోలు ఎత్తిన కుంజరాణి బ్రాంజ్ మెడలిస్ట్ ఆరీ విరాథ్వార్న్(థాయిలాండ్) కంటే పది కేజీలు తక్కుగా లిఫ్ట్ చేసినందుకు పతకానికి దూరమైంది.లండన్ ఒలింపిక్స్‌లోనూ ఇలాగేఈసారి షూటింగ్లో భారత్ పతకానికి చేరువగా వచ్చింది. జోయ్‌దీప్ కర్మాకర్ మెన్స్ 50 మీటర్ల రైఫిల్ ప్రోన్ ఈవెంట్లో ఫైనల్ చేరాడు. బ్రాండ్ మెడల్ విజేత కంటే 1.9 పాయింట్లు వెనుకబడి కాంస్యం గెలిచే అవకాశం పోగొట్టుకున్నాడు.మరో‘సారీ’ ఇదే ‘కర్మ’ భారత్ నుంచి ఒలింపిక్స్‌లో తొలిసారిగా జిమ్నాస్టిక్స్ విభాగంలో తలపడిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్. రియో డి జెనిరో-2016 ఒలింపిక్స్‌లో అంచనాలు లేకుండా బరిలోకి దిగిన ఈ త్రిపుర అమ్మాయి.. నాలుగో స్థానంలో నిలిచింది.కాంస్యం గెలిచిన అమ్మాయి.. దీపా స్కోరు చేసిన పాయింట్లకు వ్యత్సాసం 0.150 కావడం గమనార్హం.టోక్యోలోనూ కలిసిరాలేదుదాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత టోక్యో ఒలింపిక్స్-2020లో భాగంగా భారత మహిళా హాకీ జట్టు మరోసారి పతకం గెలిచే అవకాశం ముంగిట నిలిచింది.క్వార్టర్ ఫైనల్లో అనూహ్య రీతిలో పటిష్ట ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌లో అడుగుపెట్టిన రాణీ రాంపాల్ బృందంపై ప్రశంసల జల్లు కురిసింది.అయితే, కీలకమైన సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓటమి తప్పలేదు. దీంతో స్వర్ణం ఆశ చేజారినా.. కాంస్యం గెలుస్తారనే నమ్మకం మాత్రం చావలేదు.అయితే, గ్రేట్ బ్రిటన్ జట్టు భారత్ ‘కంచు’ ఆశలపై నీళ్లు చల్లింది. 4-3తో ఓడించి కాంస్యాన్ని ఎగురేసుకుపోయింది. ఈ ఓటమితో భారత జట్టుతో పాటు వంద కోట్లకు పైగా భారతీయుల హృదయాలూ ముక్కలయ్యాయి.ఇదే ఒలింపిక్స్‌లో గోల్ఫర్ అదితి అశోక్ కూడా ఇలాగే నాలుగో స్థానంతో సరిపెట్టుకుని చరిత్ర సృష్టించే అవకాశాన్ని కోల్పోయింది.ఇప్పటి వరకు ఎన్ని పతకాలంటే..విశ్వ క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 35 పతకాలు గెలిచింది. భారత హాకీ పురుషుల జట్టు 1928- 1956 మధ్య కాలంలో వరుసగా ఆరుసార్లు పసిడి పతకాలు గెలిచింది.ఆ తర్వాత 1964, 1980లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. ఇక మళ్లీ షూటర్ అభినవ్ బింద్రా, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మాత్రమే భారత్‌కు పసిడి అందించారు.చదవండి: పక్షవాతాన్ని జయించి.. ప్యారిస్ ఒలింపిక్స్‌లో టీమిండియా స్టార్! -
Flying Sikh: ‘ది గ్రేట్’ మిల్కా...
అతని పరుగు... భారత క్రీడను ‘ట్రాక్’పై ఎక్కించింది అతని పరుగు... పతకాలు తెచ్చింది అతని పరుగు... రికార్డులకెక్కింది అతని పరుగు... పాఠమైంది అతని పరుగు... తెరకెక్కింది ఇప్పుడాయన ఊపిరి ఆగిపోతే ఆ పరుగు... గుండెలను బాదుకొంది. ట్రాక్ అండ్ ఫీల్డ్ భోరున విలపిస్తోంది. క్రీడా, రాజకీయ, సినీరంగాలను విషాదంలో ముంచింది. అథ్లెట్ ఆణిముత్యం లేడని, ఇక రాడనే వార్తను ఎంతకీ జీర్ణించుకోలేకపోతోంది. ‘ఫ్లయింగ్ సిఖ్’ మిల్కా సింగ్ అంటే త్రుటిలో చేజారిన పతకం, చేతికందిన స్వర్ణాలు, రికార్డుకెక్కిన ఘనతలు, విడుదలైన సినిమానే కాదు. కచ్చితత్వం. కష్టపడేతత్వం. దేశవిభజనలో సర్దార్జీ ప్రాంతం పాక్‌లో కలిసింది. బాల్యంలోనే అనాథ అయ్యాడు. విభజనానంతర ఘర్షణల్లో మిల్కా తల్లిదండ్రుల్ని పాకిస్తానీయులు చంపేశారు. 15 ఏళ్ల కుర్రతనంలో బిక్కుబిక్కుమంటూ భారత్ వచ్చాడు. బూట్లు తుడిచాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్‌లోని షాప్‌లో క్లీనర్‌గా చేరాడు. చిల్లర దొంగతనాలు చేసి జైలుకెళ్లాడు. అతని సోదరి నగలు అమ్మి మిల్కాను బయటకి తీసుకొచ్చింది. పడరాని పాట్లు ఎన్నో పడి నాలుగో ప్రయత్నంలో భారత ఆర్మీ(1952)లో చేరాడు. సికింద్రాబాద్‌లో విధులు. ఇక్కడే అతని అడుగులు ‘పరుగు’వైపు మళ్లించాయి. ఆ పరుగు కాస్తా అథ్లెటిక్స్‌తో ప్రేమలో పడేసింది. ఆ ప్రేమే పతకాల పంటకు దారితీసింది. ఈ పతకాలు భారతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో దిగ్గజాన్ని చేశాయి. టాప్–10లో నిలిస్తే మరో గ్లాసు పాలు! సర్దార్ జీ చరిత్ర అప్పుడు... ఇప్పుడు... ఎప్పుడైనా ఘన చరితే. భవిష్యత్ తరాలకు అతని జీవన యానం పాఠం నేర్పుతుంది. మన పయనం పూలపాన్పు కాదని... గమ్యం చేరేదాకా పోరాటం తప్పదని బోధిస్తుంది. సికింద్రాబాద్‌లో విధులు నిర్వర్తిస్తుండగా... క్రాస్ కంట్రీ పోటీల్లో పరుగెత్తేవాడు. ఆర్మీ కోచ్ గురుదేవ్ ఆ పోటీల్లో టాప్–10లో నిలిస్తే మరో గ్లాస్ పాలు ఇచ్చే ఏర్పాటు చేస్తానంటే ఆరో స్థానంలో నిలిచాడు. అక్కడ ప్రత్యేక శిక్షణతో తన పరుగులో వేగాన్ని అందుకున్నాక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో పోటీపడ్డాడు. తర్వాత రెండేళ్లకే సర్దార్ చరిత్ర లిఖించడం మొదలు పెట్టాడు. కామన్వెల్త్ గేమ్స్ (1958–ఇంగ్లండ్)లో 400 మీ. పరుగులో స్వర్ణం నెగ్గిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కాడు. అదే ఏడాది టోక్యో ఆసియా క్రీడల్లో 200 మీ., 400 మీ. బంగారు పతకాలు సాధించాడు. 1960 రోమ్ ఒలింపిక్స్‌లో 0.1 సెకను తేడాతో 400 మీ. ఈవెంట్లో కాంస్య పతకాన్ని కోల్పోయాడు. కానీ అతని 45.6 సెకన్ల జాతీయ రికార్డు 38 ఏళ్లపాటు చెక్కు చెదరలేదు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు... చండీగఢ్: తీరని శోకాన్ని మిగిల్చివెళ్లిన మిల్కా సింగ్ మృతి యావత్ దేశాన్ని కంటతడి పెట్టిస్తోంది. కరోనాతో కనుమూసిన ఆయన అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో ముగించారు. ప్రముఖ గోల్ఫర్, మిల్కా కుమారుడు జీవ్ మిల్కాసింగ్ అంత్యక్రియలు నిర్వహించగా, కుటుంబ సభ్యులు, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు, పంజాబ్ గవర్నర్ వి.పి.సింగ్ బద్నోర్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల మంత్రులు మన్‌ప్రీత్ సింగ్ బాదల్, సందీప్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని నివాళి మిల్కా సింగ్ మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, క్రికెట్ దిగ్గజం సచిన్, కెప్టెన్ కోహ్లితో పాటు సినీలోకానికి చెందిన హేమాహేమీలు అమితాబ్ బచ్చన్, మోహన్‌లాల్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, మహేశ్‌బాబు అజయ్ దేవ్‌గణ్, ఫర్హాన్ అక్తర్, అనిల్ కపూర్, తాప్సీ, సన్నీ డియోల్, సోనూ సూద్, సంజయ్‌దత్ తదితరులు సామాజిక మాధ్యమాల్లో నివాళులు అర్పించారు. భారత అథ్లెటిక్ ఆణిమూత్యాన్నే కోల్పోయిందని, యువతకు ఆయనే స్ఫూర్తి ప్రదాత అని ఈ సందర్భంగా సినీ దిగ్గజాలంతా కొనియాడారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. -
దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ మృతి: ఫర్హాన్ అక్తర్ భావోద్యేగం
పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్(91) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు మహమ్మారితో పోరాడిన ఆయన ఇటీవల కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా సంబంధిత సమస్యలతో శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణవార్త దేశం మొత్తాన్ని విషాదంలో నింపింది. సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి సాధారణ ప్రజల వరకు ఆయన మృతివకి సంతాపం ప్రకటిస్తున్నారు. అలాగే బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ మిల్కా సింగ్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్యేగానికి లోనయ్యాడు. కాగా ఆయన జీవిత కథ ఆధారంగా ‘బాగ్ మిల్కా బాగ్’ మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో లీడ్‌రోల్‌ల పోషించిన అక్తర్ అచ్చం ఆయనలా అనుసరించి ఈ పాత్రలో జీవించాడు. 2013లో వచ్చిన ఈ చిత్రం బి-టౌన్‌కు బాక్‌బ్లస్టర్ హిట్‌ను అందించింది. ఈ సందర్భంగా ఈ మూవీ సమయంలో మిల్కా సింగ్‌తో ఉన్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఫర్హాన్ ఎమోషనల్ పోస్టు షేర్ చేశాడు. అతడు ట్వీట్ చేస్తూ ‘మీరు లేరని వార్తను నేను ఇంకా నమ్మలేక పోతున్న. లోలోపల ఏదో అవుతోంది. నా మనసు ఇంకేదో చెబుతుంది. మీరు భౌతికంగా మాకు దూరమయ్యారు. కానీ నిజం ఏంటంటే మీరేప్పుడూ మా మధ్యే ఉంటారు. ఓ ఐడియా, కలలకు మీరోక ప్రతినిధి. ప్రతి ఒక్కరిని ప్రేమించే పెద్ద మనసున్న గొప్ప వ్యక్తి మీరు. డౌన్ టూ ఎర్త్ పర్సన్. ఓ తండ్రిగా, స్నేహితుడిగా మీతో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరు చాలా అదృష్టవంతులు. మీరు ఎంతో మందికి స్ఫూర్తి. మీరు మా హీరో. నా హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటాను సార్’ అంటూ ఫర్హాన్ రాసుకొచ్చాడు. కాగా ఫర్హాన్‌తో పాటు బిగ్‌బీ అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, ప్రియాంక చొప్రా తదితరులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు మృతికి సంతాపం తెలుపుతున్నారు. ❤️🙏🏽 pic.twitter.com/Ti2I457epP — Farhan Akhtar (@FarOutAkhtar) June 19, 2021 -
మిల్కా సింగ్ మృతి కి నివాళి అర్పించిన బీసీసీఐ
ముంబై: లెజండరీ అథ్లెట్.. ద ఫ్లయింగ్ సిక్కుగా ఖ్యాతి గాంచిన మిల్కా సింగ్ మృతి పట్ల బీసీసీఐ నివాళి అర్పించింది. మిల్కా సింగ్ మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చినట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ట్వీట్ చేశారు. భారత్‌కు చెందిన అతిగొప్ప క్రీడాకారుడు మిల్కా సింగ్ అని, భారతీయ యువత అథ్లెటిక్స్ వైపు మళ్లేందుకు మిల్కా సింగ్ ఆదర్శంగా నిలిచారని, అతనితో దగ్గర పరిచయం ఉన్నట్లు సౌరవ్ గంగూలీ తెలిపారు. బీసీసీఐ కార్యదర్శి జే షా కూడా నివాళి అర్పించారు. మిల్కాసింగ్ మృతి విషాదాన్ని మిగిల్చిందని, తరతరాలు ఎంతో మంది క్రీడాకారులకు మిల్కా ప్రేరణగా నిలిచారని, అసాధ్యం అంటూ ఏదీ లేదని ఆయన నిరూపించారని, మిల్కా మృతి పట్ల నివాళి అర్పిస్తున్నట్లు జే షా చెప్పారు. ఏషియా క్రీడల్లో స్ప్రింట్ విభాగంలో మిల్కాసింగ్ నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించాడు. సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్, మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఇండియన్ క్రికెట్ టీమ్ కోచ్ రవిశాస్త్రి మిల్కాసింగ్ మృతి పట్ల నివాళి అర్పించారు. చదవండి: ఊరించి... ఉసూరుమనిపించి... -
మిల్కా సింగ్ మృతికి చిరంజీవి, మహేశ్, బాలకృష్ణ సంతాపం
పరుగుల వీరుడు, ఫ్లయింగ్ సిఖ్‌గా ఖ్యాతిగాంచిన భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్(91) కరోనాతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. దాదాపు నెల రోజుల పాటు మహమ్మారితో పోరాడిన ఆయన ఇటీవల కోలుకున్నారు. ఈ క్రమంలో కరోనా సంబంధిత సమస్యలతో శుక్రవారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా ఆయన మృతికి సంతాపం తెలిపారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, సూపర్ మహేశ్ బాబు, నందమూరి బాలకృష్ణతో పాటు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మిల్కా సింగ్ మృతికి నివాళులు అర్పించారు. పరుగుల వీరుడు #MilkhaSinghJi మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్ట ను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయి లో రెపరెప లాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి🙏 — Chiranjeevi Konidela (@KChiruTweets) June 19, 2021 మెగాస్టార్ ట్టీట్ చేస్తూ.. ‘పరుగుల వీరుడు #MilkhaSinghJi మరణం బాధాకరం. తన అద్భుతమైన ప్రతిభతో దేశ ప్రతిష్ట ను, భారత పతాకాన్ని అంతర్జాతీయస్థాయిలో రెపరెప లాడించిన భరతమాత ముద్దబిడ్డ మిల్కా సింగ్. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ఎంతో ఎత్తుకు ఎదిగిన ఆయన కొన్ని తరాలకు స్ఫూర్తి ప్రదాత. మిల్కా సింగ్ కు నివాళి’ అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేశారు. Deeply saddened by the passing away of sports legend #MilkhaSingh. A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2021 ఇక మహేశ్ బాబు ట్వీట్ చేస్తూ.. ‘మీ మరణం నాకెంతో మనస్థాపం కలిగించింది. మీ నష్టం పూడ్చలేనింది. మీరు అథ్లెట్స్‌కి స్పూర్తివంతంగా ఉంటారు’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ సైతం ‘మిల్కా సింగ్ మరణ వార్త చాలా హృదయ విదారకం. స్వాతంత్య్రం తర్వాత ఎలా నడుచుకోవాలో చూపించారు. మీరు రాబోయే తరాలకు స్పూర్తి. మా హీరో మీరు. దేశం మిమ్మల్ని ఎప్పుడు గుర్తుంచుకుంటుంది. మీ జీవితం నుండి ఎంతో మంది ప్రేరణ పొందుతారు’ అంటూ ఆయన మృతికి నివాళులు అర్పించారు. Heartbreaking News to hear that flying Sikh legend Milkha Singh sir is no more. The nation will always remember you sir and seek an inspiration from your life forever. Om Shanti#MilkhaSinghJi pic.twitter.com/4lKhQA2aYx — Nandamuri Balakrishna™ (@NBK_Unofficial) June 19, 2021 చదవండి: మిల్కాసింగ్ అస్తమయం: బావురుమన్న అభిమానులు ఒలింపిక్స్‌లో స్వర్ణం మిస్సయిన మిల్కా సింగ్.. -
మిల్కాసింగ్ అస్తమయం: బావురుమన్న అభిమానులు
సాక్షి, న్యూఢిల్లీ : పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ (91) అస్తమయం అటు క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అటు "ఫ్లయింగ్ సిక్’’ మిల్కా సింగ్ మరణంపై రాజకీయ, వ్యాపార, సినిమా రంగ ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. దాదాపు నెల రోజులపాలు కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన కోలుకున్న అనంతరం కరోనా సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గత ఐదు దశాబ్దాలుగా ఎందరికో స్పూర్తిగా నిలిచిన మిల్కా సింగ్ నిష్క్రమణతో ప్రపంచ వ్యాపప్తంగా ఆయన అభిమానులో శోకసంద్రంలో ముగినిపోయారు. ఇంకా రాజకీయ, క్రీడా వ్యాపార ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా దిగ్గజాలు ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘మీ మరణం ప్రతి భారతీయుడి హృదయంలో తీవ్ర శూన్యతను మిగిల్చింది, కాని మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు" అని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు. ‘ మీ మరణం విచారకరం. దిగులు మేఘాలు ఆవరించాయి’ అంటూ పరుగుల రాణి పీటీ ఉష సంతాపం తెలిపారు. ఇంకా సునీల్ చేత్రి, సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు. (ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్‌ది చెరగని ముద్ర: సీఎం జగన్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) Dark clouds of sadness prevail with the demise of my idol and inspiration Milkha Singhji. His story of sheer determination and hard work inspired millions and will continue to do so. As a tribute to him, students of Usha School paid homage to the legend. Rest in Peace 🙏 pic.twitter.com/mLBQQ2ge3v — P.T. USHA (@PTUshaOfficial) June 19, 2021 A hero, an inspiration, a legend. His legacy will live on for generations to come. Rest in Peace, Milkha Singh sir. — Jasprit Bumrah (@Jaspritbumrah93) June 18, 2021 ఇంకా ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర కూడా ట్విటర్ ద్వారా మిల్కాసింగ్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘మిల్కా సింగ్ గొప్పదనాన్ని మా తరం ఎలా వివరించగలదు? ఆయన అథ్లెట్ మాత్రమే కాదు. వలసవాదం నుండి బయటపడిన తరువాత కూడా అసురక్షితంగా ఉన్న సమాజానికి ప్రతీక…మనం ప్రపంచంలోనే అత్యుత్తముడు ఆయన. తమకెంతో విశ్వాసాన్నిచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఓం శాంతి’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. (దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత) How can my generation explain what Milkha Singh meant to us? He wasn’t just an athlete. To a society still suffering the insecurities of post-colonialism he was a sign that we could be the best in the world. Thank you, Milkha Singhji, for giving us that confidence. Om Shanti 🙏🏽 — anand mahindra (@anandmahindra) June 18, 2021 స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణంపై బాలీవుడ్, టాలీవుడ్, ఇతర సినీరం ప్రముఖులు కూడా నివాళులు అర్పించారుబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆయన మరణం తీవ్రవిచారం వ్యక్తం చేశారు. నటి ప్రియాంక చోప్రా దేశానికి ఆయన చేసిన సేవలను మరవలేనివంటూ సింగ్‌తో తనతొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్లయింగ్ సిక్ భౌతికంగా దూరమైనా ఆయన ఉనికి సజీవమే. తనతోపాటు లక్షలాది మంది ప్రేరణ రెస్ట్ ఇన్ పీస్ మిల్కా సింగ్ సార్ అని పేర్కొన్నారు. తాప్సీ ‘ఫ్లయింగ్ సిఖ్ మనకు దూరమై పోయారంటూ ట్వీట్ చేశారు. Incredibly sad to hear about the demise of #MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen! May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir 🙏🏻 — Akshay Kumar (@akshaykumar) June 19, 2021 Warm and welcoming, you made our first meeting so so special. I have been inspired by your excellence, touched by your humility, influenced by your contribution to our country. Om Shanti #Milkha ji. Sending love and prayers to the family. #MilkhaSingh — PRIYANKA (@priyankachopra) June 18, 2021 Deeply saddened by the passing away of sports legend #MilkhaSingh. A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2021 కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ ఉమెన్ నేషనల్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ (85) ఈ నెల13న కోవిడ్ కారణంగానే కన్నుమూయడం విషాదం. మిల్కా సింగ్‌కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు జీవ్ మిల్కా సింగ్ కూడా ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు. -
మా అమ్మాయి న్యూయార్క్‌లో డాక్టర్..
న్యూఢిల్లీ: మాజీ ఒలింపియన్ ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కాసింగ్ పుత్రికోత్సాహంతో పొంగిపోతున్నారు. వైద్యురాలిగా తన కుమార్తె అందిస్తున్న సేవలను చూసి తండ్రిగా గర్వపడుతూనే.. కన్నబిడ్డ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందుతున్నారు. కరోనా విలయ తాండవం చేస్తున్న అమెరికాలోని న్యూయార్క్‌లో ఆయన కుమార్తె మోనా మిల్కా సింగ్ వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ‘మా అమ్మాయి మోనా మిల్కా సింగ్ న్యూయార్క్‌లో డాక్టర్‌గా పనిచేస్తోంది. కరోనా బాధితులకు ఆమె సేవలు అందిస్తుండటం చూసి మేమంతా గర్వపడుతున్నాం. ప్రతి రోజు మాతో ఫోన్లో మాట్లాడుతుంది. మా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని చెబుతూ ఉంటుంది. కోవిడ్-19 విజృంభణ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఆమె ఆరోగ్యం గురించి కంగారు పడుతున్నామ’ని మిల్కా సింగ్ చెప్పారు. అయితే తన కుమార్తె ఎలాంటి భయాలు లేకుండా వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తోందన్నారు. కాగా, కరోనాపై పోరులో వైద్య సిబ్బంది ముందండి పోరాడుతున్నారు. కరోనా సోకి అమెరికాలో 45 వేల మందిపైగా చనిపోగా, వీరిలో దాదాపు సగం మంది న్యూయార్క్ రాష్ట్రానికి చెందినే వారే కావడం గమనార్హం. అమెరికాలో 8 లక్షల మందిపైగా కరోనా బారిన పడ్డారు. ప్రపంచవ్యాప్తంగా 25 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇది చదవండి: వరుస దాడులా.. సిగ్గుచేటు -
భారత మాజీ క్రికెటర్ మృతి
చెన్నై:భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్(75) కన్నుమూశారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటుకు గురైన మిల్కాసింగ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.1960 కాలంలో భారత్ తరపున ఆయన నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడారు. మిల్కాసింగ్ కు అన్నయ్య అయిన క్రిపాల్ సింగ్ దేశం తరపున క్రిపాల్ సింగ్ 14 టెస్టు మ్యాచ్ లు ఆడారు. వీరిద్దరూ 1961-62 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అయిన మిల్కా సింగ్ ఒక మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ ఏట తొలి టెస్టు ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించారు. అప్పటి మద్రాసు(నేటి తమిళనాడు) రాష్ట్రం తరపున రంజీ మ్యాచ్ లు ఆడారు. -
మేడమ్ టుస్సాడ్స్‌లో మిల్కా సింగ్ మైనపు విగ్రహం
చండీగఢ్: భారత దిగ్గజ అథ్లెట్ మిల్కా సింగ్ స్థానికంగా జరిగిన ఓ కార్యక్రమంలో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు. డిసెంబర్ 1న ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోని స్పోర్ట్స్ జోన్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు. 1958 కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొన్నప్పటి మిల్కా ఫోజును పోలి ఈ విగ్రహం ఉంటుంది. తాను మరణించిన తర్వాత యువ అథ్లెట్లకు ఈ మైనపు బొమ్మ స్ఫూర్తిగా ఉంటుందని 85 ఏళ్ల మిల్కా సింగ్ అన్నారు. ‘ఇది చాలా గొప్ప విషయం. సమున్నత వ్యక్తుల మధ్య నా విగ్రహం కూడా ఉండబోతున్నందుకు గౌరవంగా ఉంది. ఈ చివరి దశలో మిల్కా సింగ్ మరికొన్నేళ్లు జీవించేందుకు ఇది ఉపయోగపడుతుంది. అయితే నేను మరణించాక ఈ విగ్రహం భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుంది’ అని మిల్కా అన్నారు. -
డబ్ల్యూహెచ్ఓ అంబాసిడర్‌గా మిల్కాసింగ్
న్యూఢిల్లీ: ‘ఫ్లయింగ్ సిక్కు’ మిల్కాసింగ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) గుడ్‌విల్ అంబాసిడర్‌గా నియమించింది. ఆగ్నేయాసియా ప్రాంతంలో క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు గాను ఆయనకు ఈ గుర్తింపు ఇస్తున్నట్లు పేర్కొంది. గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఆయన.. ఈ ప్రాంతంలో అసంక్రామిక వ్యాధులను క్రీడలు, వ్యాయామాల ద్వారా తగ్గించే కార్యాచరణలో పాల్గొంటారని తెలిపింది. ఆరోగ్యంగా జీవించేందుకు క్రీడలు, వ్యాయామాలు ఎంతగానో దోహదం చేస్తాయనేందుకు 80 ఏళ్ల మిల్కాసింగ్ ఒక మంచి ఉదాహరణ అని సంస్థ పేర్కొంది. ఆగ్నేయాసియా ప్రాంతంలో అసంక్రామిక వ్యాధుల కారణంగా ఏటా 8.5 మిలియన్ల మంది చనిపోతున్నారని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. రోజువారీ వ్యాయామాల ద్వారా వ్యాధులను అరికట్టడంతో పాటు గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి వాటిని రాకుండా పూర్తిగా అడ్డుకోవచ్చని తెలిపింది. ఈ ప్రాంతంలోని 70 శాతం బాలురు, 80 శాతం బాలికలు ఎటువంటి ఆటలు, శారీరక వ్యాయామాలు చేయటం లేదని వివరించింది. 80 ఏళ్ల వయస్సుల్లోనూ ఆయన పరుగులో చురుగ్గా పాల్గొంటున్నారని మిల్కాసింగ్‌ను కొనియాడింది. ఆయన కృషితో ఈ ప్రాంతంలో వ్యాయామాలు, ఆటలపై అవగాహన పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఆగ్నేయాసియా దేశాల్లో ఆట స్థలాల అభివృద్ధి, పౌరులు వ్యాయామం చేసుకునేందుకు, ఆటలు ఆడుకునేందుకు తగిన పరిస్థితులు కల్పించేలా ప్రభుత్వాలను కోరనున్నట్లు వెల్లడించింది. -
‘ఆమె ఆడుతున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ ప్రశంసించారు. ఆమె ఆటతీరు తామంతా గర్వించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె ఆడుతున్నంతసేపు తన కళ్లలో నీళ్లు ఆగలేదని వెల్లడించారు. సింధు విజయం ఘనత కోచ్ పుల్లెల గోపీచంద్ కు దక్కుతుందని అన్నారు. కోచ్ లందరూ గోపీచంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్ లు కష్టించి పనిచేయాల్సిన అవసరముందని మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. -
'సల్మాన్ ఖాన్‌ను పీకేయండి'
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ క్రీడలకు భారత గుడ్‌విల్ అంబాసిడర్‌గా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌ను నియమించడంపై క్రీడాకారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని తాజాగా భారత క్రీడా దిగ్గజం, లెజండరీ స్ప్రింటర్ మిల్ఖాసింగ్ తప్పబట్టారు. ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌గా క్రీడారంగానికి చెందిన వ్యక్తిని నియమిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇది అవాంఛిత నియామకం అని, దీనిని వెంటనే మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు. సల్మాన్ ఖాన్‌కు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకంగా కాదని, కానీ క్రీడల దృష్ట్య ఆయనను తొలగించాలని అన్నారు. షూటింగ్, అథ్లెటిక్స్, వాలీబాల్ వంటి క్రీడలకు చెందిన ఆటగాళ్లే భారత్‌కు నిజమైన రాయబారులని, క్రీడా రాయబారిగా ఎవరినైనా నియమించాలని భావిస్తే.. వారు తప్పకుండా క్రీడారంగానికి చెందినవారై ఉండాలని ఆయన అన్నారు. ప్రముఖ రెజర్ల్ యోగేశ్వర్ దత్ కూడా సల్మాన్ నియామకాన్ని తప్పుబట్టిన సంగతి తెలిసిందే. సల్మాన్‌ఖాన్‌కు ఉన్న అర్హత ఏమిటని, ఆయనను రియో ఒలింపిక్స్ గుడ్ విల్ రాయబారిగా నియమించారని యోగేశ్వర్ దత్ ప్రశ్నించారు. -
మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి!
పుట్టింది: నవంబర్ 20, 1929 జన్మస్థలం: ల్యాల్‌పూర్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) ప్రస్తుతం ఉండేది: చండీగఢ్‌లో అందరూ పిలిచే ముద్దుపేరు: ఫ్లయింగ్ సిఖ్ కొన్ని విజయాలు ⇒1958 ఆసియా క్రీడోత్సవాల్లో 200 మీటర్ల పరుగుపందెం విజేత ⇒1958 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత ⇒1958 కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో 440 యార్డుల పరుగుపందెంలో విజేత ⇒1959లో పద్మశ్రీ పురస్కారం ⇒1962 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత " నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే.. " అంతర్జాతీయ వేదికపై అథ్లెటిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం సాధించి పెట్టిన ఏకైక క్రీడాకారుడాయన. అరవై ఏడేళ్లుగా మరే భారతీయ క్రీడాకారుడూ అందుకోలేనన్ని విజయాలు ఉన్నాయి ఆయన ఖాతాలో. దాదాపు ఎనభై అంతర్జాతీయ రేసుల్లో విజేతగా నిలిచారు. ‘ఫ్లయింగ్ సిఖ్’ అంటూ అందరితో ముద్దుగా పిలిపించుకున్నారు. ఆయనే - మిల్కాసింగ్. భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై ఎగురవేసిన మిల్కా ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారు. జీవితం, విజయాలు, యువతరానికి సూచనల లాంటి పలు అంశాలపై మిల్కా సింగ్ ‘సాక్షి ఫ్యామిలీ’తో ముచ్చటించారు... సికింద్రాబాద్‌లో అడుగు పెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. మీకు ఈ నగరంతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి వివరిస్తారా? సికింద్రాబాద్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. 1951లో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్లో చేరాను నేను. నా పరుగు అప్పుడే మొదలయ్యింది. ‘ఆర్మీ బ్యారక్స్’లో ఉండేవాణ్ణి. రైలు పట్టాల మీద రైళ్లతో పోటీపడి పరుగులు తీసేవాడిని. రన్నింగ్ సాధన మొదలుపెట్టేసరికి నాకు నాలుగొందల మీటర్లు, వంద మీటర్లు అనే లెక్కలు ఉంటాయని తెలియదు. వాటి గురించి ఈఎంఈలో చేరిన తర్వాతే తెలిసింది. చేరిన కొత్తలో మమ్మల్నందరినీ ఐదు మైళ్లు పరుగెత్తమని చెప్పారు. వేగంగా పరుగెత్తినవారిలో మొదటి పదిమందిని తదుపరి శిక్షణ కోసం పంపిస్తామని, వాళ్లు భారత సైన్యం, భారతదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారనీ చెప్పారు. నేను టాప్ 10లో స్థానం పొందాను. అథ్లెట్‌గా అది నా తొలి విజయం. అప్పట్లో మిమ్మల్ని ప్రోత్సహించి, అండగా నిలిచినవారెవరు? మా కోచ్ హవల్దార్ గురుదేవ్ సింగ్. సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్టేడియంలో ఆయన ఆధ్వర్యంలోనే శిక్షణ పొందాను. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పుడీ నగరాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? హైదరాబాద్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇది క్రీడానగరంగా మారిపోయింది. ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు ఉద్భవిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారు. ఈ విషయంలో పుల్లెల గోపీచంద్ లాంటి వారు చేస్తోన్న కృషి అమోఘం. క్రీడల విషయంలో నగరాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నందుకు వారిని మెచ్చుకుని తీరాలి. మిల్కాసింగ్ దేశానికే స్ఫూర్తి. మరి మీకెవరు స్ఫూర్తి? అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ జెండాను సగర్వంగా ఎగుర వేయాలని భావించాను. అందుకే, కష్టపడి సాధన చేశాను. అవరోధాల్ని అధిగమించాను. నాకు ప్రేరణగా నిలిచింది - చార్లీ జెన్కిన్స్. 1956లో నాలుగొందల మీటర్ల రేసులో గెలిచి ఒలింపిక్స్ బంగారుపతకం సాధించారాయన. ఆయన్ని చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఆయన సాధించారు కదా, నేను సాధించలేనా అనుకున్నాను. అనుకున్నది సాధించాను. అందుకే అందుకు ఆయన నాలో రగిలించిన స్ఫూర్తి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌లో మన ప్రాభవం ఎలా ఉందంటారు? ఆ విషయంలో చాలా నిరాశపడుతున్నాను. గత అరవయ్యేళ్లలో మన దేశంలో మరో మిల్కాసింగ్ జన్మించకపోవడం నిజంగా దురదృష్టం. 120 కోట్ల జనాభాలో ఉండేది కేవలం ఒక్క మిల్కాసింగేనా?! మరో మిల్కాసింగ్‌ని మనం తయారు చేయలేమా?! దీన్ని బట్టి అర్థమవుతోంది మన దేశంలో క్రీడల పట్ల ఎంత అశ్రద్ధ ఉందో. పీటీ ఉష, అంజూ జార్జ్ లాంటి ఎవరో కొందరు అథ్లెట్లుగా రాణించారు తప్ప, గొప్పగా చెప్పుకోవడానికి మనకంటూ పెద్దగా ఎవరూ లేకపోవడం బాధాకరం. ఈ పరిస్థితిని మార్చడానికి మనమేం చేయాలి? మిల్కాసింగ్లు నగరాల్లో దొరకరు అన్న వాస్తవాన్ని ముందు గ్రహించాలి. దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటి మూలల్లోకి వెళ్లి వెతకాలి. ఉత్సాహం, ప్రతిభ ఉన్న యువతను వెతికి పట్టాలి. శిక్షణనివ్వాలి. నిజం చెప్పాలంటే ఇప్పటి పిల్లలో క్రీడల పట్ల ఆసక్తి కాస్త తక్కువగానే ఉంది. ఇక నగరాల్లోని పిల్లల విషయానికొస్తే... ఆటలాడటానికి కావలసినంత శక్తి కూడా వారిలో కొరవడుతోంది. అందుకే వాళ్లు క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ లాంటి వాటిని ఎంచుకుంటున్నారు తప్ప... శారీరక శ్రమ అధికంగా ఉండే అథ్లెటిక్స్ను ఎంచుకోవడం లేదు. అందుకే గ్రామాల్లోకి వెళ్లమంటున్నాను. అథ్లెట్లు అక్కడే దొరుకుతారు. మీకిప్పుడు ఎనభయ్యేళ్లు దాటాయి. అయినా ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం? నా వయసు ఎనభయ్యారు. అయినా ఇంకా పరుగులు తీస్తున్నాను, రేసుల్లో పాల్గొంటున్నాను. నిజానికి నాకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. కంటిచూపు కాస్త తగ్గింది. నడుంనొప్పి వస్తోంది. అయినా నేను వాటిని లెక్క చేయకపోవడమే నా ఫిట్నెస్ సీక్రెట్. నేనెప్పుడూ అనుకుంటాను... టీనేజర్లతో సమానంగా నేనూ పరుగెత్తగలనని. అదే నన్ను ఉత్తేజితుణ్ణి చేస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే నన్నింత పటిష్ఠంగా ఉంచింది. నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే... నీరసం అదే ఎగిరిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను నా నోటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాను. అలా కాకుండా ఏది పడితే అది తినేశామా... బీపీ, షుగర్, ఒబెసిటీ, గుండె జబ్బులు అంటూ వరుసపెట్టి సమస్యలు వచ్చేస్తాయి.కాబట్టి ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్తపడతాను. నోటిని అదుపులో ఉంచుకోవడం కూడా నాకు మేలు చేసింది. నేనెప్పుడూ అతిగా మాట్లాడను. అనవసర విషయాలు అస్సలు మాట్లాడను. కాబట్టి గొడవలు, వివాదాలు నా దగ్గరకు రావు. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. మనసు బాగుంటే శరీరమూ బాగుంటుంది కదా! మీ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం తీశారు. ఆ సినిమా తీస్తామన్నప్పుడు మీకేమనిపించింది? చాలా సంతోషం వేసింది. సినిమా కూడా చాలా బాగా తీశారు. ఫర్హాన్ అఖ్తర్ నా పాత్రను అద్భుతంగా పోషించారు. నిజానికి నన్ను అందరూ మర్చిపోయిన సమయంలో ఈ సినిమా వచ్చి, నన్ను మళ్లీ జనబాహుళ్యంలో ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక... రకరకాల వేడుకలకు నన్ను రమ్మని ఆహ్వానిస్తూ నాలుగొందల వరకూ ఉత్తరాలు వచ్చాయి. నా జీవితాన్ని అంత అందంగా చూపించి, నన్ను మళ్లీ అందరికీ దగ్గర చేసినందుకు ఆ టీమ్‌కి నేనెప్పుడూ కృత జ్ఞుడినై ఉంటాను. ఇన్నేళ్ల కెరీర్లో తీరని కోరిక ఏదైనా ఉందా? ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్‌లో బంగారు పతకం ప్రదానం చేస్తున్న ప్పుడు ఆ క్రీడాకారుడి జాతీయ గీతాన్ని గౌరవసూచకంగా వినిపిస్తారు. కానీ, అథ్లెటిక్స్ విషయంలో వేదిక మీద మన జాతీయ గీతాన్ని వినే అదృష్టం ఇంతవరకూ కలగలేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది మాత్రమే కాక... మరో మిల్కాసింగ్‌ను చూడాలన్న కోరిక కూడా అలాగే ఉంది. నాలాంటి మరొకరు రావాలి. మన దేశానికి బంగారు పతకం తేవాలి. నేను చనిపోయేలోపు ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలనుంది! భావితరాలకు మీరిచ్చే సందేశం? కష్టపడండి. కృషి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈ మూడూ పెంచుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. - కె.జయదేవ్ -
హైదరాబాద్ 10k రన్
-
నెక్లెస్ రోడ్లో 10కె రన్ ప్రారంభం
-
నెక్లెస్ రోడ్డులో 10 కే రన్ ప్రారంభం
హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులోని పీపుల్ ప్లాజాలో 10కే రన్ ఆదివారం ఉదయం ప్రారంభమైంది. ఈ రన్‌ను భారత మాజీ అథ్లెట్ల మిల్కా సింగ్ ప్రారంభించారు. ఈ రన్లో వేలాది మంది యువతియువకులు పాల్గొన్నారు. నగరంలో 12వ సారి 10 కే రన్ నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ టెన్‌కే రన్ ఫౌండేషన్ వెల్లడించింది. 10 కే రన్ విజేతలకు రూ. 30 లక్షల ప్రైజ్ మనీ అందజేస్తామని తెలిపింది. 10 కే రన్ నేపథ్యంలో నెక్లెస్ రోడ్డులో పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. ఈ రోడ్డులో ఉదయం 10 గంటల వరకు ట్రాఫిక్ అంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. -
'చనిపోయేలోపు భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉంది'
హైదరాబాద్:తాను చనిపోయేలోపు ఒలింపిక్స్ లో భారత్ స్వర్ణం సాధిస్తే చూడాలని ఉందని అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ తెలిపాడు. శనివారం హైదరాబాద్ కు వచ్చిన మిల్కాసింగ్ మీడియాతో ముచ్చటించాడు. తాను ప్రస్తుతం 63 వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సంగతిని మిల్కాసింగ్ గుర్తు చేసుకున్నాడు. భారతదేశంలో వందల కోట్ల మంది ప్రజలున్నా చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఒలింపిక్స్ కు సెలెక్ట్ అవుతున్నారన్నాడు. ఇది నిజంగా చాలా బాధాకరమన్నాడు. క్రీడాకారులు మంచి ఫిట్ నెస్ గా ఉండాలని, అందుకు ఆరోగ్యమైన ఆహారం తీసుకోవాలని సూచించాడు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులకు తగినంత ప్రోత్సాహం అందించాలన్నాడు. -
ఏఎఫ్‌ఐకు మిల్కాసింగ్ మద్దతు!
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్ ఫెడరేషన్(ఏఎఫ్ఐ)కు అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ మద్దుతుగా నిలిచాడు. దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో పురుషుల రిలే టీంను పంపకపోవడాన్నిఈ దిగ్గజ అథ్లెటిక్ సమర్ధించాడు. ' ఆ విభాగంలో భారత్ పేలవంగా ఉంది. 4/400 విభాగం నుంచి భారత అథ్లెటిక్ జట్టును ఆసియా గేమ్స్ కు పంపకపోవడం సరైన నిర్ణయం' అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు. భారత అథ్లెటిక్స్ వారి అర్హతకు సంబంధించి శిక్షణా కార్యక్రమంలోనే పరీక్షించుకోవాలని తెలిపాడు. ఏఎఫ్ఐ కమిటీ 56 మంది అథ్లెటిక్స్ ను భారత్ నుంచి ఎంపిక చేసినా.. వారిని తిరిగి పరీక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు. -
ప్రసాదంలా పంచుతున్నారు
క్రీడా అవార్డులపై మిల్కాసింగ్ వ్యాఖ్య బెంగళూరు: దేశంలో క్రీడల అవార్డులకు విలువ లేకుండా చేస్తున్నారని, ఎవరికి పడితే వాళ్లకు అవార్డులను ప్రసాదంలా పంచుతున్నారని భారత అథ్లెటిక్ దిగ్గజం మిల్కాసింగ్ ధ్వజమెత్తారు. ‘ఒలింపిక్స్, ఆసియాగేమ్స్, కామన్వెల్త్ క్రీడల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవార్డులు ఇవ్వాలి. ఈసారి అర్జున అవార్డుల ఎంపిక మరీ అన్యాయంగా ఉంది’ అని మిల్కా అన్నారు. తన జీవిత కాలంలో ఒలింపిక్స్‌లో భారత్‌కు అథ్లెటిక్స్‌లో పతకం చూడలేనేమో అని అన్నారు. ‘వికాస్ గౌడ, క్రిష్ణ పూనియాల ప్రయత్నాలను నేను తక్కువ చేయడం లేదు. కానీ ఒలింపిక్స్‌లో పతకం సాధించటానికి మన ప్రమాణాలు సరిపోవడం లేదు. ఆ దిశగా మన ప్రయత్నాలు సాగుతున్నాయని కూడా అనుకోవడం లేదు’ అని మిల్కాసింగ్ వ్యాఖ్యానించారు. -
ఓ ఖైదీ... ఓ సిపాయి... ఓ అథ్లెట్ కలిపితే మిల్కా సింగ్
1947... దేశ విభజన సమయం.. పాకిస్థాన్ నుంచి హిందువులు.. భారత్ నుంచి ముస్లింలు వలసలు సాగిస్తున్న వేళ... అనుకోకుండా మత కలహాలు.. లక్షల మంది ఊచకోత... ఈ దురాగతాలను ఓ చిన్నారి ప్రత్యక్షంగా చూశాడు.. ఎంతలా అంటే కళ్లెదుటే తన తల్లిదండ్రులతోపాటు సోదరుడు, ఇద్దరు చెల్లెళ్లను ముష్కరులు దారుణంగా నరికి చంపారు.. ప్రాణం అరచేతిలో పెట్టుకుని పాక్ నుంచి ఢిల్లీకి శరణార్థిలా వచ్చాడు.. తోడు లేదు.. నీడ లేదు.. తినడానికి తిండి లేదు.. ఎలాగో పెరుగుతున్నాడు.. ఏం చేయాలో అర్థం కావడం లేదు.. ఇలాంటి నేపథ్యం ఉన్న వ్యక్తి ఆలోచనలు పెడదారి పట్టడం ఖాయం. ఇతడూ అలాగే ఆలోచించాడు.. ఓ దశలో బందిపోటు అవుదామనుకున్నాడు.. అయితే తన అదృష్టమో.. దేశ సౌభాగ్యమో క్రీడాకారుడయ్యాడు.. దేశం గర్వించే స్థాయిలో ప్రపంచ యవనికపై మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించాడు.. అతడెవరో కాదు ఫ్లయింగ్ సిఖ్‌గా పిలుచుకునే మిల్కా సింగ్. ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉన్న పంజాబ్ ప్రావిన్స్‌లోని గోవింద్‌పురా అనే గ్రామం మిల్కా జన్మస్థలం. తనకు 15 మంది తోబుట్టువులు. వీరిలో విభజనకు ముందే ఎనిమిది మంది మరణించారు. మత కలహాల బారి నుంచి తప్పించుకునేందుకు మిల్కా ఢిల్లీకి పయనమయ్యాడు. కొద్దికాలంపాటు అక్కడే ఉన్న తన సోదరి ఇంట్లో ఉన్నాడు. ఓసారి టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించినందుకు తీహార్ జైల్లో గడపాల్సి వచ్చింది. మరికొద్ది రోజులు పురానా ఖిల్లాలోని శరణార్థి శిబిరంలో తలదాచుకున్నాడు. ఈ దశలోనే జీవితంపై ఆశ లేకుండా నిరాసక్తంగా గడపసాగాడు. అప్పట్లో చంబల్ లోయను బందిపోటు ముఠాలు గడగడలాడించేవి. తను కూడా వారిలాగే తయారవుదామనుకున్నాడు. ఆర్మీలో ప్రవేశం అయితే ఇలాంటి విపరీత ఆలోచనలను సోదరుడు మల్కన్ సింగ్ దారి మళ్లించాడు. అప్పుడే భారత సైన్యంలో ప్రవేశాలు జరుగుతున్నాయి. తమ్ముడిని కూడా అటు పంపించాడు. 1951లో తన నాలుగో ప్రయత్నంలో మిల్కా సైన్యంలో ప్రవేశించగలిగాడు. సికింద్రాబాద్‌లోని ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ సెంటర్లో పోస్టింగ్. ఇక్కడే తనకు అథ్లెటిక్స్‌తో పరిచయమైంది. దీంట్లో ఎంపికయ్యేందుకు... తను చిన్నప్పుడు పాఠశాల కోసం 10 కి.మీ. పరిగెత్తిన అనుభవం పనికివచ్చింది. అథ్లెటిక్స్‌లో శిక్షణకు ఎంపికయ్యాడు. అయితే అప్పటిదాకా అలాంటి పోటీ ఒకటి ఉంటుందనే విషయం కూడా మిల్కాకు తెలీదు. తను సొంతంగా కూడా కఠోర శ్రమ కొనసాగించాడు. నడుముకు టైర్ కట్టుకుని మైదానాల్లో పరిగెత్తి తన సామర్థ్యాన్ని పెంచుకున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో.. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌లో 200మీ., 400 మీ.లలో మిల్కా సింగ్ పోటీపడ్డాడు. అయితే అంత పెద్ద స్థాయి ఈవెంట్స్‌లో పాల్గొనే అనుభవం లేకపోవడంతో హీట్స్ దశలోనే వెనుదిరగాల్సి వచ్చింది. కానీ 400 మీ.లో చాంపియన్‌గా నిలిచిన చార్లెస్ జెన్కిన్స్... మిల్కాసింగ్‌కు మార్గనిర్దేశకుడిగా నిలిచాడు. ఎలా శిక్షణ తీసుకోవాలనే విషయంలో తను విలువైన సూచనలిచ్చాడు. తదనంతరం 1958లో జరిగిన జాతీయ క్రీడలు, ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకాలతో దూసుకెళ్లాడు. అలాగే అదే ఏడాది జరిగిన బ్రిటిష్ ఎంపైర్ అండ్ కామన్వెల్త్ గేమ్స్‌లో 400 మీ. పరుగును 46.6 సెకన్లలో పూర్తి చేసి... స్వర్ణం సాధించాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడు మిల్కానే. ఈ క్రీడల్లో ఇప్పటికీ వ్యక్తిగత అథ్లెటిక్స్‌లో భారత్ నుంచి స్వర్ణం సాధించిన రికార్డు మిల్కా పేరిటే ఉండడం విశేషం. 1960 రోమ్ ఒలింపిక్స్.. మిల్కా పేరు ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిన ఒలింపిక్స్ ఇదే. అప్పటికే తగిన అనుభవం, లెక్కలేనన్ని పతకాలతో మిల్కా సింగ్ మంచి ఊపు మీదున్నాడు. 400 మీ.లో కచ్చితంగా పతకం దక్కించుకుంటాడనే అందరూ భావించారు. ఫైనల్ రేసు ప్రారంభమైన తర్వాత ధాటిగా పరిగెత్తాడు. 250 మీటర్ల వరకు తనదే టాప్ పొజిషన్. ఇక్కడ కొద్దిగా నెమ్మదించి తల తిప్పుతూ తన తోటివారి పరుగును గమనించాడు. అంతే ఇదే అదనుగా మిగతా అథ్లెట్స్ బుల్లెట్లా దూసుకెళుతూ మిల్కాను అధిగమించారు. అయినా పూర్తి స్థాయిలో పరుగు తీసి సెకన్లో వందో వంతు తేడాతో మూడో స్థానాన్ని కోల్పోయాడు. అయితేనేం 45.6 సెకన్లలో పరుగు పూర్తి చేసి అంతకు ముందు ఉన్న ఒలింపిక్ రికార్డును అధిగమించాడు (ఈ రేసులో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన నలుగురూ పాత ఒలింపిక్ రికార్డు (45.7 సెకన్లు)ను అధిగమించారు). 1962లో జరిగిన ఆసియా గేమ్స్‌లో 400మీ., 4ఁ100మీ. రేసులో స్వర్ణాలు గెలిచాడు. మెడల్స్ అన్నీ జాతీయం తన జీవిత కాలంలో దక్కిన పతకాలన్నీ మిల్కా సింగ్ జాతికి ప్రదానం చేశాడు. మొదట్లో ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వీటిని ప్రదర్శనకు ఉంచినా తదనంతరం పాటియాలాలోని స్పోర్ట్స్ మ్యూజియంకు తరలించారు. రోమ్ ఒలింపిక్స్‌లో తను ధరించిన షూస్ కూడా ఇక్కడున్నాయి. -
సచిన్‌ను క్రీడా మంత్రిని చేయాలి: మిల్కా సింగ్
పణజి: భారత్‌లో క్రీడలు మరింతగా అభివృద్ధి చెందాలంటే మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను క్రీడా మంత్రిగా చేయాలని అథ్లెటిక్స్ దిగ్గజం మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. ‘సచిన్ క్రీడా మంత్రిగా వ్యవహరిస్తే ఈ దేశంలో ఆటల అభివృద్ధికి తోడ్పడతాడు. ఓ ఆటగాడైతే నే చిత్తశుద్ధితో పనిచేసే వీలుంటుంది’ అని మిల్కా అన్నారు. అలాగే క్రీడాకారుల్లో భారతరత్న అవార్డు దక్కేందుకు అందరికన్నా ధ్యాన్చంద్కే ఎక్కువ అర్హత ఉందన్నారు. మరోవైపు రాజకీయ నాయకులు, ధనవంతులు భారత క్రీడా సంఘాలను తమ గుప్పిట్లో పెట్టుకుని తీరని హాని చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే దేశం క్రీడల్లో ముందడుగు వేయడం లేదని ఆవేదన చెందారు. భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ప్రచారం కల్పిస్తున్నారని, మీడియా తన ధోరణిని మార్చుకోవాలని సూచించారు. చైనా తరహాలో క్రీడలను ప్రోత్సహించాలని మిల్కా అన్నారు. -
సచిన్‌ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్
బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్‌ను క్రీడలమంత్రిని చేయాలని భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ సూచించాడు. 'భారత క్రీడారంగం అభివృద్ది చెందాలంటే సచిన్‌ను క్రీడలమంత్రిని చేయాలి. క్రీడారంగానికి అంకితభావంతో, నిజాయితీగా సేవ చేయాలంటే ఓ క్రీడాకారుడే సాధ్యం' అని మిల్కా సింగ్ అన్నాడు. సచిన్ టెండూల్కర్ ఇటీవల రిటైర్మెంట్ పలికిన సంగతి తెలిసిందే. అదే రోజు భారత ప్రభుత్వం సచిన్‌కు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'ను ప్రధానం చేయనున్నట్టు ప్రకటించింది. ముంబైకర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రాష్ట్రపతి కోటాలో ఆయనను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మిల్కాసింగ్ సచిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. భారతరత్న అవార్డు గురించి ప్రస్తావిస్తూ.. క్రీడారంగంలో తొలుత ఈ పురస్కారం అందుకోవడానికి అర్హుడైన వ్యక్తి హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు. -
భారతరత్నకు సచిన్ అర్హుడే
నోయిడా: ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు. అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు. పలు అంశాలపై మిల్కా అభిప్రాయలు ఆయన మాటల్లోనే... సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. ముందు ధ్యాన్‌చంద్‌కు ఇవ్వాల్సింది: సచిన్‌కు భారతరత్న ఇవ్వడంలో నాకెలాంటి వ్యతిరేకత లేదు. అయితే ముందుగా ఈ అవార్డును దశాబ్దాల క్రితమే అంతర్జాతీయ క్రీడాలోకంలో భారత పతాకాన్ని ఎగిరేలా చేసిన హాకీ వీరుడు ధ్యాన్‌చంద్‌కు ఇస్తే బాగుండేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పటికైనా ఈ అవార్డు ఆయనకు దక్కాలి. మొత్తానికి ఆటగాళ్లకు ‘భారతరత్న’ ద్వారాలు తెరుచుకోవడం సంతోషకరం. క్రీడాకారులను గవర్నర్లుగా నియమించాలి: దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి. మీడియాకు క్రికెట్ అంటేనే మోజు: క్రికెట్ గురించి మీడియా విపరీతమైన కవరేజ్ ఇస్తుంటుంది. అయితే మా జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లు, ఐఓఏ కూడా బీసీసీఐని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఆటగాళ్ల గురించి క్రికెట్ బోర్డు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. -
ఆటగాళ్లను గవర్నర్లను చేయాలి: మిల్కా సింగ్
నొయిడా:దేశంలో చాలామంది క్రీడాకారులకు మంచి విజ్ఞానం ఉంది. వారిని ఆయా రాష్ట్రాలకు గవర్నర్లుగా లేక రాయబారులుగా నియమించాలి. రాజకీయ నాయకులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ ఈ పదవులకు ఎంపిక అవుతున్నప్పుడు ఆటగాళ్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోరని అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ ప్రశ్నించాడు ప్రతిష్టాత్మక భారతరత్న పురస్కారం అందుకునే అర్హత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఉందని తెలిపాడు. దేశంలోని యువతకు అతడు మార్గదర్శకుడని కొనియాడారు. ఓ క్రికెటర్‌గా విజయవంతమవడమే కాకుండా తన ప్రవర్తనతో కూడా తోటి ఆటగాళ్లకన్నా ముందున్నాడన్నారు. అయితే తనకన్నా ముందు హాకీ మాంత్రికుడు ధ్యాన్‌చంద్‌కు ఈ ఘనత దక్కితే బాగుండేదని అన్నారు. మొత్తానికి ఈ అవార్డును క్రీడాకారులకు కూడా ఇవ్వనుండడం ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారు. సచిన్ వినయం అపూర్వం: చాన్నాళ్లుగా సచిన్ ఆదర్శప్రాయుడిగా ఉంటున్నాడు. చాలాసార్లు నేను అతడిని కలుసుకున్నాను. ఎప్పుడు కలిసినా నా పాదాలకు నమస్కరిస్తాడు. అతడి ప్రవర్తనకు ముగ్ధుడయ్యే వాడిని. క్రికెటర్‌గా ఎంతో పేరున్నా చాలా అణుకువగా ఉంటాడు. తన విజయాలను నెత్తికెక్కించుకోని ఆటగాడని మిల్కాసింగ్ తెలిపాడు. -
బాలీవుడ్ తెరపై అజారుద్దీన్ గా అజయ్ దేవగన్?
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రముఖుల జీవిత కథా చిత్రాల జోరు పెరిగింది. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథతో బాలీవుడ్ లో విడుదలైన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విజయం సాధించడంతో మరికొంత మంది 'బయోపిక్'లపై దృష్టి సారించారు. తాజాగా ప్రముఖ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ జీవిత కథను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాత ఏక్తా కపూర్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. అయితే అజారుద్దీన్ పాత్రను బాలీవుడ్ లో ఏ హీరోతో చేయించాలనే సందిగ్ధంలో పడినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ జీవిత కథ ఆధారంగా రూపొందే చిత్రానికి కునాల్ దేశ్ ముఖ్ దర్శకత్వం వహించనున్నారు. తెరపై అజారుద్దీన్ పాత్రను పోషించడానికి బాలీవుడ్ హీరోలు అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మీలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ పాత్ర అజయ్, ఇమ్రాన్ లలో ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే. -
భాగ్ బస్టర్