
‘ఆమె ఆడుతున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ ప్రశంసించారు. ఆమె ఆటతీరు తామంతా గర్వించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె ఆడుతున్నంతసేపు తన కళ్లలో నీళ్లు ఆగలేదని వెల్లడించారు.
సింధు విజయం ఘనత కోచ్ పుల్లెల గోపీచంద్ కు దక్కుతుందని అన్నారు. కోచ్ లందరూ గోపీచంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్ లు కష్టించి పనిచేయాల్సిన అవసరముందని మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు.