టైటిల్: విశ్వం
నటీనటులు: గోపీచంద్, కావ్యథాపర్, నరేశ్, సునీల్, వెన్నెల కిశోర్, సుమన్, ప్రగతి తదితరులు
నిర్మాణ సంస్థలు: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి
దర్శకత్వం: శ్రీనువైట్ల
సంగీతం: చైతన్ భరద్వాజ్
సినిమాటోగ్రఫీ: కేవీ గుహన్
విడుదల తేది: అక్టోబర్ 11, 2024
శ్రీనివైట్లకు ఈ మధ్యకాలంలో సరైన హిట్ సినిమాలే లేదు. చివరగా అమర్ అక్బర్ ఆంటోనీ(2018)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో గ్యాప్ తీసుకున్నాడు. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత ‘విశ్వం’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్‌కు మచి స్పందన లభించింది. దానికి తోడు ప్రమోషన్స్ కూడా బారిగా చేయడంతో ‘విశ్వం’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించింది? విజయదశమి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం శ్రీను వైట్లకు విజయం దక్కిందా లేదా? రివ్యూలో చూద్దాం.
కథేటంటే..
కేంద్ర మంత్రి సీతారామరాజు(సుమన్)కు హత్యకు గురవుతాడు. ఈ హత్యను దర్శన అనే బాలిక కళ్లారా చూస్తుంది. హంతకులు ఆ బాలికను చంపేందుకు ప్రయత్నిస్తారు. ఓ రోజు దర్శన ప్యామిలి మొత్తం కొండగట్టుకు వెళ్ళ్తుండగా కొంతమది వారిపై అటాక్ చేస్తారు. గోపిరెడ్డి(గోపీచంద్) వచ్చి వారిని రక్షిస్తాడు. అనంతరం తాను బిల్డర్ బుల్ రెడ్డి కొడుకునని పరిచయం చేసుకొని దర్శన ఫ్యామిలీకి దగ్గరవుతాడు. అసలు గోపిరెడ్డి ఎవరు? దర్శనను ఎందుకు కాపాడుతున్నాడు? కేంద్రమంత్రిని చంపిందెవరు? ఈ హత్యకు ఇండియాలో జరగబోయే ఉగ్రవాద చర్యలకు గల సంబంధం ఏంటి? ఇండియాలో సెటిలైన పాకిస్తాన్ ఉగ్రవాది ఖురేషి(జిష్షుసేన్ గుప్తా) చేస్తున్న కుట్ర ఏంటి? ఈ కథలో బాచిరాజు(సునీల్) పాత్ర ఏంటి? కాస్ట్యూమ్ డిజైనర్ సమైరా (కావ్యథాపర్)తో గోపిరెడ్డి ప్రేమాయణం ఎలా సాగింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
స్టార్ హీరోలతో కూడా కామెడీ చేయించి హిట్ కొట్టిన చరిత్ర శ్రీనువైట్లది. ఆయన సినిమాలో కామెడీతో పాటు కావాల్సినన్ని కమర్శియల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీక్వెన్స్ కూడా ఉంటాయి. అయితే గత కొన్నాళ్లుగా శ్రీనువైట్ల మ్యాజిక్ తెరపై పని చేయడం లేదు. అందుకే ఈ సారి తన పంథా మార్చుకొని ‘విశ్వం’ తెరకెక్కించానని ఓ ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల చెప్పారు. సినిమాలో కామెడీ కొత్తగా ఉంటుందని బలంగా చెప్పారు. మరి సినిమాలో నిజంగా కొత్త కామెడీ ఉందా? కొత్తకథను చెప్పాడా? అంటే లేదనే చెప్పాలి.
శ్రీనువైట్ల గత సినిమాల మాదిరే విశ్వం కథనం సాగుతుంది. టెర్రరిస్ట్ బ్యాగ్‌డ్రాప్ స్టోరీకి చైల్డ్ సెంటిమెంట్ జోడించి, తనకు అచ్చొచ్చిన కామెడీ పంథాలోనే కథనం నడిపించాడు. పాయింట్ బాగున్నా.. తెరపై చూస్తే మాత్రం పాత సినిమాలే గుర్తొస్తుంటాయి. ఫస్టాఫ్‌లో జాలిరెడ్డి(పృథ్వి), మ్యాంగో శ్యామ్(నరేశ్) కామెడీ ట్రాక్ నవ్వులు పూయిస్తుంది. హీరోయిన్‌లో ప్రేమాయణం, యాక్షన్ సీక్వెన్స్ రొటీన్‌గా ఉంటాయి. ఇంటర్వెల్ ముందు వచ్చే యాక్షన్ సీన్ బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో హీరో ప్లాష్ బ్యాక్ స్టోరీ ఆకట్టుకుంటుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలన్నీ సాగదీతగా అనిపిస్తాయి. ట్రైన్ ఎపిసోడ్ కూడా ప్రమోషన్స్‌లో చెప్పినంత గొప్పగా ఏమీ ఉండదు కానీ..కొన్ని చోట్ల మాత్రం నవ్వులు పూయిస్తుంది. వెన్నెల కిశోర్ కామెడీ జస్ట్ ఓకే అనిపిస్తుంది. విలనిజం బలంగా లేకపోవడం కూడా సినిమాకు మైనస్సే. క్లైమాక్స్‌లో వచ్చే చిన్న ట్విస్ట్ ఆకట్టుకుంటుంది.
ఎవరెలా చేశారంటే..
గోపిరెడ్డి పాత్రకి గోపిచంద్ పూర్తి న్యాయం చేశాడు. ఎప్పటి మాదిరే యాక్షన్ సీన్స్ ఇరగదీశాడు. స్టెప్పులు కూడా బాగానే వేశాడు. ప్లాష్‌బ్యాక్ స్టోరీలో గోపీచంద్ నటన బాగుంటుంది. కావ్యథాపర్ పాత్ర నిడివి తక్కువే అయినా.. ఉన్నంతలో బాగానే నటించింది. నరేశ్, పృథ్వీల కాంబోలో వచ్చే కామెడీ సీన్లు సినిమాకు ప్లస్ అయింది. సునీల్ పాత్ర ఇంపాక్ట్ సినిమాపై అంతగా ఏమి ఉండదనే చెప్పాలి. సుమన్, ప్రగతి, వెన్నెల కిశోర్‌తో పాటు మిలిగిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతికంగా సినిమా పర్వాలేదు. చైతన్ భరద్వాజ్ నేపథ్య సంగీతం బాగుంది. భీమ్స్ కంపోజ్ చేసిన 'గుంగురూ గుంగురూ' పాట థియేటర్‌లో ఈళలు వేయిస్తుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో తొలగించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
-రేటింగ్: 2.25/5
Comments
Please login to add a commentAdd a comment