PVsindhu
-
పీవీ సింధుకు దీపిక ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్
ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్ అంటూ ట్రెండ్‌కు తగ్గట్టు చాలా చాలెంజ్‌లు చూశాం. అదే విధంగా ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్. శానిటరీ ప్యాడ్‌ను చేతిలో పట్టుకున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. అవును.. నా చేతిలో ఉన్నది శానిటరీ ప్యాడే. ఇందులో సిగ్గుపడాల్సింది ఏమీ లేదు. అంతే కాదు మీరు(ట్యాగ్ చేసిన వ్యక్తులు) కూడా ఇలా శానిటరీ ప్యాడ్ పట్టుకొని ఫొటో పోస్ట్ చేయమని చాలెంజ్ చేస్తున్నా అంటూ.. సామాన్యుల దగ్గరి నుంచి మొదలు పెడితే బాలీవుడ్ స్టార్ల వరకు అందరు ఈ ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్‌లో పాల్గొనడమేకాకుండా తమకు తెలిసినవారిని ఈ చాలెంజ్ స్వీకరించాలంటూ సవాలు విసురుతున్నారు. దీనిలో భాగంగానే నటుడు అక్షయ్ కుమార్ విసిరిన ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్‌ను దీపికా పదుకోన్ స్వీకరించారు. అంతేకాకుండా ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్ స్వీకరించాలని భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు సవాలు విసిరారు. అక్షయ్‌కుమార్, రాధికా ఆప్టే, సోనమ్ కపూర్ ముఖ్య తారలుగా ఆర్.బాల్కీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ప్యాడ్‌మ్యాన్’. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆమిర్‌ఖాన్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్’ స్టార్ట్ చేశారు. అరుణాచలమ్ మురుగనాథమ్ అనే వ్యక్తి తక్కువ ధరకు లభ్యమయ్యే శానిటరీ నేప్కిన్లను తయారు చేసి, తన గ్రామంలో ఉన్న మహిళలకు అందజేసేవారు. ఆ విధంగా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచిన అరుణాచలమ్ కథతో ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ తీశారు. ఇతరుల్లో అవగాహన కలిగించే ఈ చిత్రం ప్రేక్షకులకు చేరువ అవ్వాలని ఆమిర్ ఈ ‘ప్యాడ్‌మ్యాన్’ చాలెంజ్‌కు నాంది పలికారు. అమిర్ స్టార్ట్ చేసిన ఈ చాలెంజ్‌ను ఇప్పుడు బాలీవుడ్ ప్రముఖులే కాకుండా చాలా మంది స్వీకరించి, తమకు తెలిసిన వాళ్లని సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ చాలెంజ్ విసురుతున్నారు. ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కాకుండా సోషల్ అవేర్నెస్ కోసం స్టార్ట్ చేసిన చాలెంజ్. ఈ చాలెంజ్ ముఖ్య ఉద్దేశం ప్యాడ్స్ గురించి మాట్లాడటానికి మనం సిగ్గుపడకూడదని. ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. ప్యాడ్‌మ్యాన్ చాలెంజ్.. మరిన్ని చిత్రాలు -
కృష్ణపట్నంపోర్టులో సింధు సందడి
ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టులో ఆదివారం రియో ఒలంపిక్స్ రజత పతక విజేత కుమారి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లు సందడి చేశారు. పోర్టు సెక్యూరిటీగార్డుల గౌరవవందనం స్వీకరించారు. పోర్టు ఎండీ శశిధర్ ఆమెకు వెండి రాకెట్ బహూకరించారు. కోచ్ గోపీచంద్‌కు రోలెక్స్ వాచ్ బహుమానంగా అందజేశారు. గోపాలపురంలోని కేఎస్‌ఎస్‌పీఎల్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులతో సింధు ముచ్చటించారు. పోర్టు యాజమాన్యం ద్వారా వారికి రాకెట్లు పంపిణీ చేశారు. పోర్టు దినదినాభివృద్ధి చెందుతోందని వారు ప్రశంసించారు. -
‘ఆమె ఆడుతున్నంతసేపు కన్నీళ్లు ఆగలేదు’
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ ఫైనల్లో పీవీ సింధు అద్భుతంగా ఆడిందని ఫ్లయింగ్ సిక్ మిల్కా సింగ్ ప్రశంసించారు. ఆమె ఆటతీరు తామంతా గర్వించేలా ఉందని వ్యాఖ్యానించారు. ఆమె ఆడుతున్నంతసేపు తన కళ్లలో నీళ్లు ఆగలేదని వెల్లడించారు. సింధు విజయం ఘనత కోచ్ పుల్లెల గోపీచంద్ కు దక్కుతుందని అన్నారు. కోచ్ లందరూ గోపీచంద్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే కోచ్ లు కష్టించి పనిచేయాల్సిన అవసరముందని మిల్కా సింగ్ అభిప్రాయపడ్డారు. -
క్వార్టర్స్‌లో సింధు, ప్రణయ్
మకావు: భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు.. మకావు ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్‌లో సింధు 21-16, 16-21, 21-19తో ఫెనిత్రి (ఇండోనేసియా)పై గెలిచింది. పురుషుల ప్రిక్వార్టర్స్‌లో సాయి ప్రణీత్ 16-21, 21-19, 17-21తో ద్వికుంకురో (ఇండోనేసియా) చేతిలో ఓడగా... ప్రణయ్ 17-21, 21-19, 21-14తో లిన్ (చైనీస్‌తైపీ)పై గెలిచాడు.