కృష్ణపట్నంపోర్టులో సింధు సందడి
ముత్తుకూరు: కృష్ణపట్నంపోర్టులో ఆదివారం రియో ఒలంపిక్స్ రజత పతక విజేత కుమారి పీవీ సింధు, కోచ్ గోపీచంద్‌లు సందడి చేశారు. పోర్టు సెక్యూరిటీగార్డుల గౌరవవందనం స్వీకరించారు. పోర్టు ఎండీ శశిధర్ ఆమెకు వెండి రాకెట్ బహూకరించారు. కోచ్ గోపీచంద్‌కు రోలెక్స్ వాచ్ బహుమానంగా అందజేశారు. గోపాలపురంలోని కేఎస్‌ఎస్‌పీఎల్‌లో వివిధ పాఠశాలల విద్యార్థులతో సింధు ముచ్చటించారు. పోర్టు యాజమాన్యం ద్వారా వారికి రాకెట్‌లు పంపిణీ చేశారు. పోర్టు దినదినాభివృద్ధి చెందుతోందని వారు ప్రశంసించారు.