కృష్ణపట్నంపోర్టుతో జిల్లా అభివృద్ధి | central minister visited kpport | Sakshi
Sakshi News home page

కృష్ణపట్నంపోర్టుతో జిల్లా అభివృద్ధి

Published Sun, Oct 23 2016 12:10 AM | Last Updated on Mon, Sep 4 2017 6:00 PM

కృష్ణపట్నంపోర్టుతో జిల్లా అభివృద్ధి

కృష్ణపట్నంపోర్టుతో జిల్లా అభివృద్ధి

  •  కేంద్ర మంత్రి హన్సరాజ్‌ గంగారామ్‌  
  •  ముత్తుకూరు  : కృష్ణపట్నంపోర్టు ద్వారా నెల్లూరు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి  చెందుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారామ్‌ అన్నారు. పోర్టులో శనివారం  ఆయన పర్యటించారు.  పరిపానల భవనంలో ఏర్పాటు చేసిన పోర్టు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పోర్టు ఎండీ శశిధర్, సీఈఓ అనిల్‌ ఎండ్లూరితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ పోర్టులో సెక్యూరిటీ నిఘా, భద్రతలను ఈ కంట్రోల్‌ సెంటర్‌ నుంచి పర్యవేక్షణ చేయవచ్చన్నారు. పోర్టులో వ్యాపారవేత్తలకు అవసరమైన సకల మౌలిక సదుపాయాలున్నాయన్నారు.  
    సెక్యూరిటీ గౌరవ వందనం స్వీకరణ 
     కేంద్రమంత్రి హన్సరాజ్‌ తొలుత సీవీఆర్‌ సెక్యూరిటీ కేంద్రం సందర్శించి, సెక్యూరిటీ గార్డుల గౌరవ వందనం స్వీకరించారు. ఆవరణలో మొక్కలు నాటి క్యాప్స్‌ ద్వారా నిర్వహిస్తున్న నైపుణ్య శిక్షణ కేంద్రాలను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. సీవీఆర్‌ ఫౌండేషన్‌ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలు అడిగితెలుసుకొన్నారు. సీఓఓ చక్రవర్తి, సుబ్బారావు, పీఆర్వో వేణుగోపాల్, ఐటీ విభాగం ప్రతినిధులు మృదుల, భరత్‌రెడ్డి, జిల్లా ఎస్పీ విశాల్‌గున్ని, డీఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, సీఐ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

పోల్

Advertisement