ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్‌కు రానుందా..? | Gopichand Viswam Movie Expected OTT Release Date, Check Streaming Platform Details | Sakshi
Sakshi News home page

ఓటీటీలో 'విశ్వం'.. అప్పుడే స్ట్రీమింగ్‌కు రానుందా..?

Published Tue, Oct 29 2024 7:24 AM | Last Updated on Tue, Oct 29 2024 9:37 AM

Gopichand Viswam Movie Will OTT Streaming Date Locked

శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్, కావ్యా థాపర్‌ జంటగా నటించిన చిత్రం 'విశ్వం'. బాక్సాఫీస్‌ వద్ద కాస్త పర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో విడుదల కానుంది. దీపావళి కానుకగా అక్టోబర్‌ 31న చాలా సినిమాలు  థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి. దీంతో విశ్వం చిత్రాన్ని దాదాపు అన్ని స్క్రీన్స్‌ నుంచి తొలగించే ఛాన్స్‌ ఉంది. ఈ క్రమంలోనే ఈ మూవీని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌లో ఉన్నారట. దోనేపూడి చక్రపాణి సమర్పణలో పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్‌పై టీజీ విశ్వ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మించారు.

దసరా సందర్భంగా అక్టోబర్‌ 11న విడుదలైన 'విశ్వం' పెద్దగా కలెక్షన్స్‌ రాబట్టలేకపోయింది. దీంతో ఈ చిత్ర నిర్మాతలకు నష్టాలు తప్పలేదని సమాచారం. ఇప్పుడు కాస్త త్వరగా ఓటీటీలో అయినా విడుదల చేస్తే కొంతైనా సేఫ్‌ కావచ్చని మేకర్స్‌ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే దీపావళి కానుకగా నవంబర్‌ 1న 'విశ్వం' సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయునున్నట్లు  తెలుస్తోంది. 

కేవలం 20 రోజుల్లోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నడంతో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ ఉండే అవకాశం ఉంది. అయితే, అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. ఈ సినిమా క‌థ పెద్దగా ఆక‌ట్టుకోక‌పోయినా కామెడీతో ఓటీటీ ప్రేక్షకులను తప్పకుండా మెప్పిస్తుందని చెప్పవచ్చు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement