
చెన్నై:భారత మాజీ క్రికెటర్ ఏజీ మిల్కా సింగ్(75) కన్నుమూశారు. శుక్రవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో గుండె పోటుకు గురైన మిల్కాసింగ్ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.1960 కాలంలో భారత్ తరపున ఆయన నాలుగు టెస్టు మ్యాచ్ లు ఆడారు. మిల్కాసింగ్ కు అన్నయ్య అయిన క్రిపాల్ సింగ్ దేశం తరపున క్రిపాల్ సింగ్ 14 టెస్టు మ్యాచ్ లు ఆడారు. వీరిద్దరూ 1961-62 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించారు.
ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ అయిన మిల్కా సింగ్ ఒక మంచి ఫీల్డర్ కూడా. తన 17వ ఏట రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన మిల్కాసింగ్.. 18వ ఏట తొలి టెస్టు ఆడారు. మిల్కాసింగ్ తన ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఎనిమిది సెంచరీలతో నాలుగు వేలకు పైగా పరుగులు సాధించారు. అప్పటి మద్రాసు(నేటి తమిళనాడు) రాష్ట్రం తరపున రంజీ మ్యాచ్ లు ఆడారు.
Comments
Please login to add a commentAdd a comment