
ఏఎఫ్ఐకు మిల్కాసింగ్ మద్దతు!
న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్ ఫెడరేషన్(ఏఎఫ్ఐ)కు అథ్లెటిక్ లెజెండ్ మిల్కాసింగ్ మద్దుతుగా నిలిచాడు. దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరుగుతున్న ఆసియా గేమ్స్ లో పురుషుల రిలే టీంను పంపకపోవడాన్నిఈ దిగ్గజ అథ్లెటిక్ సమర్ధించాడు. ' ఆ విభాగంలో భారత్ పేలవంగా ఉంది. 4/400 విభాగం నుంచి భారత అథ్లెటిక్ జట్టును ఆసియా గేమ్స్ కు పంపకపోవడం సరైన నిర్ణయం' అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు.
భారత అథ్లెటిక్స్ వారి అర్హతకు సంబంధించి శిక్షణా కార్యక్రమంలోనే పరీక్షించుకోవాలని తెలిపాడు. ఏఎఫ్ఐ కమిటీ 56 మంది అథ్లెటిక్స్ ను భారత్ నుంచి ఎంపిక చేసినా.. వారిని తిరిగి పరీక్షించాల్సిన అవసరం కూడా ఉందన్నాడు.