సచిన్ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్ | Milkha Singh says Make Sachin Tendulkar sports minister | Sakshi
Sakshi News home page

సచిన్ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్

Published Tue, Dec 10 2013 11:00 PM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

సచిన్ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్

సచిన్ను క్రీడలమంత్రిని చేయాలి: మిల్కాసింగ్

బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ను క్రీడలమంత్రిని చేయాలని భారత అథ్లెట్ దిగ్గజం మిల్కా సింగ్ సూచించాడు. 'భారత క్రీడారంగం అభివృద్ది చెందాలంటే సచిన్ను క్రీడలమంత్రిని చేయాలి. క్రీడారంగానికి అంకితభావంతో, నిజాయితీగా సేవ చేయాలంటే ఓ క్రీడాకారుడే సాధ్యం' అని మిల్కా సింగ్ అన్నాడు.
సచిన్ టెండూల్కర్ ఇటీవల రిటైర్మెంట్ పలికిన సంగతి తెలిసిందే. అదే రోజు భారత ప్రభుత్వం సచిన్కు అత్యున్నత పౌరపురస్కారం 'భారతరత్న'ను ప్రధానం చేయనున్నట్టు ప్రకటించింది. ముంబైకర్ ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నాడు. రాష్ట్రపతి కోటాలో ఆయనను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో మిల్కాసింగ్ సచిన్ గురించి కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం. భారతరత్న అవార్డు గురించి ప్రస్తావిస్తూ.. క్రీడారంగంలో తొలుత ఈ పురస్కారం అందుకోవడానికి అర్హుడైన వ్యక్తి హాకీ దిగ్గజం ధ్యాన్చంద్ అని మిల్కాసింగ్ అభిప్రాయపడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement