సాక్షి, న్యూఢిల్లీ : పరుగుల వీరుడు, లెజండరీ అథ్లెట్ మిల్కాసింగ్ (91) అస్తమయం అటు క్రీడాభిమానులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అటు "ఫ్లయింగ్ సిక్’’ మిల్కా సింగ్ మరణంపై రాజకీయ, వ్యాపార, సినిమా రంగ ప్రముఖులను విస్మయానికి గురిచేసింది. దాదాపు నెల రోజులపాలు కరోనా మహమ్మారితో పోరాడిన ఆయన కోలుకున్న అనంతరం కరోనా సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతిపై మరణంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
గత ఐదు దశాబ్దాలుగా ఎందరికో స్పూర్తిగా నిలిచిన మిల్కా సింగ్ నిష్క్రమణతో ప్రపంచ వ్యాపప్తంగా ఆయన అభిమానులో శోకసంద్రంలో ముగినిపోయారు. ఇంకా రాజకీయ, క్రీడా వ్యాపార ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడా దిగ్గజాలు ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘మీ మరణం ప్రతి భారతీయుడి హృదయంలో తీవ్ర శూన్యతను మిగిల్చింది, కాని మీరు రాబోయే తరాలకు స్ఫూర్తిగా నిలుస్తారు" అని ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ నివాళులర్పించారు. ‘ మీ మరణం విచారకరం. దిగులు మేఘాలు ఆవరించాయి’ అంటూ పరుగుల రాణి పీటీ ఉష సంతాపం తెలిపారు. ఇంకా సునీల్ చేత్రి, సురేష్ రైనా, అనిల్‌కుంబ్లే, జస్‌ప్రీత్ బుమ్రా, వెంకటేశ్ ప్రసాద్ తదితరులు ట్విటర్ ద్వారా తమ విచారాన్ని వ్యక్తం చేశారు.
(ప్రపంచ అథ్లెటిక్స్‌లో మిల్కాసింగ్‌ది చెరగని ముద్ర: సీఎం జగన్)
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Dark clouds of sadness prevail with the demise of my idol and inspiration Milkha Singhji. His story of sheer determination and hard work inspired millions and will continue to do so. As a tribute to him, students of Usha School paid homage to the legend.
— P.T. USHA (@PTUshaOfficial) June 19, 2021
Rest in Peace 🙏 pic.twitter.com/mLBQQ2ge3v
A hero, an inspiration, a legend. His legacy will live on for generations to come. Rest in Peace, Milkha Singh sir.
— Jasprit Bumrah (@Jaspritbumrah93) June 18, 2021
ఇంకా ప్రముఖ వ్యాపార వేత్త మహీంద్రా గ్రూప్ డైరెక్టర్ ఆనంద్ మహీంద్ర కూడా ట్విటర్ ద్వారా మిల్కాసింగ్ మరణంపై విచారం వ్యక్తం చేశారు. ‘మిల్కా సింగ్ గొప్పదనాన్ని మా తరం ఎలా వివరించగలదు? ఆయన అథ్లెట్ మాత్రమే కాదు. వలసవాదం నుండి బయటపడిన తరువాత కూడా అసురక్షితంగా ఉన్న సమాజానికి ప్రతీక…మనం ప్రపంచంలోనే అత్యుత్తముడు ఆయన. తమకెంతో విశ్వాసాన్నిచ్చిన ఆయనకు ధన్యవాదాలు. ఓం శాంతి’ అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. (దిగ్గజ అథ్లెట్ మిల్కాసింగ్ కన్నుమూత)
How can my generation explain what Milkha Singh meant to us?
— anand mahindra (@anandmahindra) June 18, 2021
He wasn’t just an athlete. To a society still suffering the insecurities of post-colonialism he was a sign that we could be the best in the world. Thank you, Milkha Singhji, for giving us that confidence. Om Shanti 🙏🏽
స్ప్రింటర్ మిల్కా సింగ్ మరణంపై బాలీవుడ్, టాలీవుడ్, ఇతర సినీరం ప్రముఖులు కూడా నివాళులు అర్పించారుబాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ ఆయన మరణం తీవ్రవిచారం వ్యక్తం చేశారు. నటి ప్రియాంక చోప్రా దేశానికి ఆయన చేసిన సేవలను మరవలేనివంటూ సింగ్‌తో తనతొలి సమావేశాన్ని గుర్తు చేసుకున్నారు. ప్లయింగ్ సిక్ భౌతికంగా దూరమైనా ఆయన ఉనికి సజీవమే. తనతోపాటు లక్షలాది మంది ప్రేరణ రెస్ట్ ఇన్ పీస్ మిల్కా సింగ్ సార్ అని పేర్కొన్నారు. తాప్సీ ‘ఫ్లయింగ్ సిఖ్ మనకు దూరమై పోయారంటూ ట్వీట్ చేశారు.
Incredibly sad to hear about the demise of #MilkhaSingh ji. The one character I forever regret not playing on-screen!
— Akshay Kumar (@akshaykumar) June 19, 2021
May you have a golden run in heaven, Flying Sikh. Om shanti, Sir 🙏🏻
Warm and welcoming, you made our first meeting so so special. I have been inspired by your excellence, touched by your humility, influenced by your contribution to our country. Om Shanti #Milkha ji. Sending love and prayers to the family. #MilkhaSingh
— PRIYANKA (@priyankachopra) June 18, 2021
Deeply saddened by the passing away of sports legend #MilkhaSingh. A monumental loss for our nation.. His incredible legacy will continue to inspire athletes all the over the world. Rest in peace sir. 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) June 19, 2021
కాగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపింది. అనేక కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. మిల్కా సింగ్ భార్య, ఇండియన్ ఉమెన్ నేషనల్ వాలీబాల్ జట్టు మాజీ కెప్టెన్ నిర్మల్ మిల్కా సింగ్ (85) ఈ నెల13న కోవిడ్ కారణంగానే కన్నుమూయడం విషాదం. మిల్కా సింగ్‌కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. అతని కుమారుడు జీవ్ మిల్కా సింగ్ కూడా ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు.
Comments
Please login to add a commentAdd a comment