కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ సెకండ్ వేవ్‌లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్‌లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో వీళ్లు భాగం కాబోతున్నారు.
బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌లు ఇందులో పాల్గొనబోతున్నారు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు.
ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్‌లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్వర్కర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్పర్సన్ సంజయ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు.
చదవండి: సత్యదేవ్‌కి జాక్‌పాట్
Comments
Please login to add a commentAdd a comment