
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ.. కోవిడ్ బారిన పడక తప్పలేదంటూ ఆయన ఇటీవల ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన హోంక్వారంటైన్‌లో ఉంటూ వైద్యుల సూచనల మేరకు మెడిసిన్ వాడుతున్నారు. కాగా, నేడు( జనవరి 29) చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టిన రోజు. ప్రతి ఏడాది తల్లి జన్మదిన వేడకను దగ్గర ఉండి ఘనంగా జరిపించే చిరంజీవి.. కరోనా కారణంగా ఈ ఏడాది ప్రత్యేక్షంగా తల్లిని కలుసుకోలేకపోయారు. దీంతో సోషల్ మీడియా ద్వారా తల్లికి బర్త్‌డే విషెస్ తెలియజేశారు.
‘అమ్మా ! జన్మదిన శుభాకాంక్షలు క్వాంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడిని కోరుకొంటూ అభినందనలతో .... శంకరబాబు' అంటూ ట్వీట్ చేస్తూ భార్య సురేఖ, తల్లి అంజనా దేవిలతో కలిసిఉన్న ఫోటోని షేర్ చేశారు చిరంజీవి. కాగా, అంజనా దేవి చిరంజీవిని ముద్దుగా శంకర్ బాబు అని పిలుస్తారు.
అమ్మా !🌻💐
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు 🌷🌸
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ 🙏
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
Comments
Please login to add a commentAdd a comment