FICCI
-
భారత్ ఎకానమీ వృద్ధి కోత
భారత్ ఎకానమీ 2024–25 ఆర్థిక సంవత్సరం అంచనాలకు పారిశ్రామిక మండలి–ఫిక్కీ(FICCI) 60 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ అంచనా వృద్ధి రేటు 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల విభాగం ఇటీవలే అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు సంబంధించి స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని సర్వే అభిప్రాయపడింది.ఎగుమతులు(Exports), విదేశీ మూలధన పెట్టుబడులు, ముడి పదార్థాల వ్యయాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరాల చైన్‌కు సమస్యలు తెచ్చే వీలుందని అవుట్‌లుక్ పేర్కొంది. భారత్ ఎకానమీలో ప్రైవేటు వినియోగం కీలక అంశమని తెలిపింది. అగ్రి ఉత్పాదకత, గ్రామీణ మౌలిక పరిస్థితులు, కోల్డ్ స్టోరేజీ సదుపాయాలు పెంపుపై దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావచ్చని, ఇది వడ్డీరేట్లు దిగిరావడానికి దోహదపడుతుందని విశ్లేషించింది.కైలాక్‌కు భారత్ ఎన్సీఏపీ రేటింగ్వాహన రంగంలో ఉన్న స్కోడా(Skoda) ఆటో ఇండియా తయారీ కైలాక్ ఎస్యూవీ తాజాగా భారత్ ఎన్సీఏపీ 5–స్టార్ సేఫ్టీ రేటింగ్ దక్కించుకుంది. స్కోడా నుంచి ఈ రేటింగ్ పొందిన తొలి మోడల్ ఇదే. స్కోడా కుషాక్, స్లావియా ఇప్పటికే గ్లోబల్ ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ పొందాయి. ‘స్కోడా డిజైన్‌లో భద్రత ఒక భాగం. 2008 నుండి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో క్రాష్–టెస్ట్ జరిగింది. భారత్‌లో 5–స్టార్ సేఫ్టీ–రేటెడ్ కార్ల సముదాయంతో భద్రతపై కంపెనీ ప్రచారంలో ముందుంది’ అని స్కోడా తెలిపింది.ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?భారత్‌లో జేవీసీ రీ–ఎంట్రీకంజ్యూమర్ ఎల్రక్టానిక్స్ తయారీలో ఉన్న జపాన్ బ్రాండ్ జేవీసీ భారత టీవీ విపణిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం నోయిడాకు చెందిన సూపర్ ప్లాస్ట్రానిక్స్తో బ్రాండ్ లైసెన్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రీమియం స్మార్ట్ క్యూఎల్ఈడీ టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. ధర రూ.11,999 నుంచి ప్రారంభం. ఇవి అమెజాన్‌తో ప్రత్యేకంగా లభిస్తాయి. థామ్సన్, కొడాక్, బ్లావ్‌పంక్ట్, వైట్–వెస్టింగ్‌హౌజ్ (ఎలక్ట్రోలక్స్) బ్రాండ్ల ఉత్పత్తులను సూపర్ ప్లాస్ట్రానిక్స్ ఇప్పటికే తయారు చేస్తోంది. ఫిలిప్స్ బ్రాండ్ కోసం షెంజెన్ స్కైవర్త్ డిజిటల్‌తో కంపెనీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరా గ్రూప్‌తో చేతులు కలిపిన జేవీసీ కంజ్యూమర్ డ్యూరబుల్స్ మార్కెట్లోకి ప్రవేశించింది. -
7 శాతం వరకూ వృద్ధి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రెండవ త్రైమాసికంలో 5.4 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును నమోదుచేయడాన్ని ‘‘తాత్కాలిక ధోరణి’’గా ఫిక్కీ ప్రెసిడెంట్, ఇమామీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ హర్ష వర్ధన్ అగర్వాల్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం 6.5 నుంచి 7 శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని పరిశ్రమ సంఘం అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ప్రైవేటు పెట్టుబడులూ పుంజుకుంటాయన్న అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఒక ఇంటర్వ్యూలో అగర్వాల్ పేర్కొన్న ముఖ్యాంశాలు... → రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యోల్బణం –ఆర్థిక వృద్ధికి మధ్య చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల విషయంలో ఆర్బీఐ పూర్తి పరిపక్వతతో వ్యవహరిస్తోంది. → వచ్చే నెలలో అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని పరిపాలన బాధ్యతలు స్వీకరించిన తర్వాత, భారతదేశానికి భారీ సవాళ్లు వస్తాయని నేను భావించడం లేదు. → భౌగోళికంగా–రాజకీయంగా ఇప్పుడు ప్రతి దేశం వాటి ప్రయోజనాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే, ట్రంప్ పాలనా కాలంలో భారత్‌కు భారీ సవాళ్లు ఉంటాయని నేను భావించడం లేదు. ముఖ్యంగా మెక్సికో, చైనా తదితర దేశాలకు టారిఫ్‌లు ఎక్కువగా ఉండవచ్చు. → ట్రంప్ పాలనా కాలంలో కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు, కానీ స్థూలంగా చూస్తే, భారత్ పరిశ్రమలకు అవకాశాలు లభించే అనేక అంశాలు ఉన్నాయి. → భారత్ ప్రైవేట్ రంగ మూలధన పెట్టుబడి వ్యయాలు మరింత పెరగాలి. సామర్థ్య వినియోగ స్థాయిలు 75 శాతానికి చేరాలి. ఇది సాధ్యమయ్యే విషయమేనని మేము విశ్వసిస్తున్నాం. → వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం తన మూలధన వ్యయాలను 15 శాతం పెంచాలని ఛాంబర్ బడ్జెట్ ముందస్తు సిఫార్సు చేసింది. → టీడీఎస్ (మూలం వద్ద పన్ను మినహాయింపు) సరళీకరణ, పర్యావరణ పరిరక్షణ వ్యవస్థ పురోగతికి బడ్జెటరీ కేటాయింపులు వంటి అంశాలనూ ఫిక్కీ సిఫారసు చేసింది. -
మూడేళ్లలో రూ.8.3 లక్షల కోట్లకు క్రీడారంగం!
ఆర్థికాభివృద్ధిలో క్రీడారంగాన్ని కూడా భాగస్వామ్యం చేసేలా ప్రభుత్వం నిర్దిష్ట మోడల్‌ను రూపొందించాలని ఓ నివేదిక సూచించింది. క్రీడల మౌలిక సదుపాయాలు, ఈవెంట్లు, సంబంధిత ఉత్పత్తులు, సర్వీసుల్లో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించేలా విధానాలను తయారు చేయాలని పేర్కొంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ, నాంగియా నెక్ట్స్ కలిసి ఈ నివేదికను రూపొందించాయి.ఈ నివేదిక ప్రకారం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద ప్రతిభావంతులైన క్రీడాకారులకు తోడ్పాటు అందించేలా, భారీ స్థాయి క్రీడా కార్యక్రమాలకు నిధులు సమకూర్చే ప్రైవేట్ సంస్థలకు ప్రభుత్వం తగు ప్రోత్సాహకాలు ఇవ్వొచ్చని నివేదిక తెలిపింది. ఇంటర్నేషనల్ కోచ్‌లు, న్యూట్రిషనిస్టులు, మానసిక, శారీర శిక్షణ నిపుణులతో సహా అత్యుత్తమ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు సీఎస్ఆర్ నిధులను వినియోగించేలా చూడొచ్చని పేర్కొంది. భారత క్రీడారంగం ప్రస్తుతం గణనీయమైన వృద్ధిని సాధించే దశలో ఉందని నివేదిక తెలిపింది. 2020లో దాదాపు 27 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ రంగం వృద్ధి 2027 నాటికి 100 బిలియన్ డాలర్ల(రూ.8.3 లక్షల కోట్లు)కు చేరుకోవచ్చనే అంచనాలు ఉన్నాయి.నివేదికలోని మరిన్ని విశేషాలు..స్పోర్ట్స్ కోచింగ్, మేనేజ్మెంట్ అంశాల్లో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం, విధానాలను రూపొందించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ద్వితీయ శ్రేణి పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల ద్వారా ఉపాధికి ఊతమిచ్చేలా క్రీడలకు సంబంధించిన అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటునివ్వాలి.క్రీడారంగం గణనీయంగా పురోగతి సాధించినప్పటికీ, అథ్లెట్లకు ఆర్థిక భద్రత, మౌలిక సదుపాయాల కొరత వంటి సవాళ్లు ఎదురవుతున్నాయి.ఆర్థిక సహాయాన్నందించే కార్యక్రమాలను విస్తరించడం, కెరియర్‌పరంగా పరివర్తనకు దోహదపడే పటిష్టమైన విధానాలను రూపొందించడం, సమ్మిళిత సంస్కృతిని పెంపొందించడం వంటి చర్యలు ఈ సవాళ్లను పరిష్కరించడంలో ఉపయోగపడగలవు.అంతర్జాతీయ కాంపిటీషన్లు, క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు, వాటిని నిర్వహించేందుకు ప్రభుత్వం క్రియాశీలకమైన చర్యలు తీసుకోవాలి. దేశీయంగా వివిధ రాష్ట్రాలకు ప్రత్యేకమైన క్రీడలను మరింతగా వెలుగులోకి తెచ్చేందుకు స్పోర్ట్స్ టూరిజంను ప్రోత్సహించవచ్చు.ఇదీ చదవండి: విశ్వసనీయ వాణిజ్య కేంద్రంగా భారత్స్పోర్ట్స్ లీగ్‌లు, సాంకేతిక పురోగతి, వైవిధ్యమైన క్రీడలు మొదలైనవి ఈ రంగం వృద్ధికి తోడ్పడుతున్నాయి.స్పోర్ట్స్ గూడ్స్, దుస్తులు, మీడియా హక్కులు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి.స్పోర్ట్స్ మీడియా మార్కెట్ 2020లో 1 బిలియన్ డాలర్లుగా ఉండగా 2027 నాటికి 13.4 బిలియన్ డాలర్లకు చేరవచ్చనే అంచనాలు ఉన్నాయి.2023 ఏషియన్ గేమ్స్, 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారులు సాధించిన విజయాలు, అంతర్జాతీయంగా పోటీపడే సత్తా పెరుగుతోందనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. -
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ అగర్వాల్
న్యూఢిల్లీ: 2024–25 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్‌గా ఇమామి లిమిటెడ్ ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు.నవంబర్ 21న ఫిక్కీ 97వ వార్షిక సమావేశం ముగిసిన తర్వాత అగర్వాల్ బాధ్యతలు చేపడతారు. ప్రస్తుతం ఫిక్కీ ప్రెసిడెంట్‌గా మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈవో అనీష్ షా ఉన్నారు.ఇదీ చదవండి: అభినవ ‘టాటా’! సంపదలో భారీ మొత్తం విరాళం -
పన్ను రేట్లు తగ్గించాలి.. వచ్చే బడ్జెట్‌పై కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కి సంబంధించి కేంద్రానికి కార్పొరేట్లు తమ వినతులను అందజేశారు. కస్టమ్స్‌కి సంబంధించి వన్–టైమ్ సెటిల్మెంట్ రూపంలో గత బాకీలను చెల్లించేసేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని ప్రకటించాలని పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం కోరాయి.బాకీ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా సుంకాలను తగ్గించడం లేదా వడ్డీ అలాగే పెనాల్టీని పూర్తిగా మినహాయించడం రూపంలో ఊరటనివ్వొచ్చని పేర్కొన్నాయి. దీనితో పరిశ్రమపై లిటిగేషన్ల భారం తగ్గుతుందని తెలిపాయి.మరోవైపు, వ్యక్తులు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ సంస్థల ట్యాక్సేషన్ విషయంలో పన్ను రేట్లను తగ్గించాలని, ఫేస్‌లెస్ అప్పీళ్లను ఫాస్ట్ ట్రాక్ చేయాలని పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది. -
ఇళ్ల కొనుగోలులో కీలకంగా వడ్డీ రేట్లు
ముంబై: గృహ రుణాలపై వడ్డీ రేట్లు 9 శాతం దాటితే తమ ఇళ్ల కొనుగోలు నిర్ణయంపై గణనీయమైన ప్రభావం పడుతుందని మెజారిటీ ప్రజలు భావిస్తున్నారు. ఫిక్కీ, అనరాక్ నిర్వహించిన సర్వేలో 90 శాతం మంది ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇరు సంస్థలూ ‘హోమ్ బయ్యర్ సెంటిమెంట్ సర్వే’ వివరాలను ముంబైలో జరుగుతున్న రియల్ ఎస్టేట్ సదస్సులో భాగంగా విడుదల చేశాయి. 7,615 మంది అభిప్రాయాల ఆధారంగా ఈ వివరాలను రూపొందించాయి. ఇళ్ల కొనుగోలుపై పెరిగిన రుణ రేట్ల ప్రభావం ఏ మేరకు ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేశాయి. సర్వేలో వ్యక్తమైన అభిప్రాయాలు.. → గృహ రుణ రేట్లు 8.5 శాతం దిగువనే కొనసాగితే తమ ఇంటి కొనుగోలు నిర్ణయంపై ఎలాంటి ప్రభావం ఉండదని 71 శాతం మంది స్పష్టం చేశారు. → 9 శాతం దాటితే తమ నిర్ణయాలు ప్రభావితం అవుతాయని 87 శాతం మంది తెలిపారు. 8.5–9 శాతం మధ్య రేట్లు కొనసాగితే తమ నిర్ణయాలపై ఓ మోస్తరు ప్రభావమే ఉంటుందని 54 శాతం మంది చెప్పారు. → 59 శాతం మందికి రియల్ ఎస్టేట్ ప్రాధాన్య పెట్టుబడి సాధనంగా ఉంది. 67 శాతం మంది సొంత నివాస అవసరాలకే కొనుగోలు చేస్తున్నారు. → రూ.45–90 లక్షల ఇళ్లకు 35 శాతం మంది మొగ్గు చూపిస్తుంటే, రూ.90 లక్షల నుంచి రూ.1.5 కోట్ల బడ్జెట్ ఇళ్లకు 28 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. → 93 శాతం మంది నిర్మాణంలో నాణ్యతకు, 72 శాతం మంది మంచి వెలుతురు ఉండే ఇళ్లకు ప్రాధాన్యం చూపిస్తున్నారు. చెప్పుకోతగ్గ మార్పు..‘‘భారత రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకోతగ్గ పరిణామక్రమాన్ని చూసింది. ప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్ల కంటే నిర్మాణంలోని ప్రాపర్టీల వైపు వినియోగదారులు మొగ్గు చూపిస్తుండడం డెవలపర్ల పట్ల, నియంత్రణ వాతావరణం పట్ల పెరిగిన విశ్వాసాన్ని తెలియజేస్తోంది’’అని ఫిక్కీ ప్రెసిడెంట్ సందీప్ సోమాని తెలిపారు. నివాస ఇళ్ల మార్కెట్ 2029 నాటికి 1.04 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఫిక్కీ అర్బన్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ చైర్మన్ రాజ్ మెండా తెలిపారు. ఏటా 25.6 శాతం వృద్ధి చెందుతుందన్నారు. ఈ కన్జ్యూమర్ సర్వేకు ఎంతో ప్రాముఖ్యత ఉందని అనరాక్ చైర్మన్ అనుజ్ పురి పేర్కొన్నారు. ప్రస్తుత మార్కెట్ వాతావరణంలో వినియోగదారుల ప్రాధాన్యతలకు ఇది అద్దం పడుతుందన్నారు. దేశ రియల్ ఎస్టేట్ మార్కెట్ ధోరణలను తెలియజేస్తుందన్నారు. రీట్లకు పెరుగుతున్న ఆదరణను టాటా రియల్టీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ, సీఈవో సంజయ్ దత్ ఈ సదస్సులో భాగంగా గుర్తు చేశారు. పాక్షిక యాజమాన్యంలో ఉన్న సానుకూలతలను ప్రస్తావించారు. తక్కువ పెట్టుబడితోనే నాణ్యమైన ఆస్తుల్లో వాటాను వీటి ద్వారా పొందొచ్చన్నారు. -
మహిళలకు ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి
న్యూఢిల్లీ: మహిళలకు మరింత ఉపాధి అవకాశాలను అందించడానికి ఫైనాన్షియల్ రంగం మరిన్ని చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ అన్నారు. మహిళలను ప్రోత్సహించే వ్యాపారాలకు అనుకూలమైన పథకాలను రూపొందించడం ద్వారా లింగ అంతరాన్ని తగ్గించడంలో సహాయపడవచ్చని ఆయన సూచించారు. సమగ్ర వృద్ధి ప్రాముఖ్యతను ఉద్ఘాటిస్తూ వాస్తవ అభివృద్ధి చెందిన భారతదేశం అంటే.. దేశంలోని ప్రతి పౌరుడు సామాజిక–ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా ఆర్థిక సేవలను పొందాల్సి ఉంటుందని అన్నారు. అవసరమైన ఆర్థిక అక్షరాస్యతను కలిగి ఉండేలా చూడాలని గవర్నర్ సూచించారు. ఫిక్కీ, ఐబీఏ సంయుక్తంగా నిర్వహించిన వార్షిక ఎఫ్‌ఐబీఏసీ– 2024 ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ, భారత్ శ్రామిక శక్తి భాగస్వామ్యం (మహిళల భాగస్వామ్యం) ప్రపంచ సగటు కంటే తక్కువగా ఉందన్నారు. బాలికల విద్యను మెరుగుపరచడం, నైపుణ్యాభివృద్ధి, పని ప్రదేశంలో భద్రత, సామాజిక అడ్డంకులను పరిష్కరించడం వంటి కార్యక్రమాల ద్వారా ఈ అంతరాన్ని తగ్గించాల్సిన తక్షణ అవసరం ఉందని అన్నారు. వినియోగం, డిమాండ్ సమిష్టిగా పెరగడంతో భారతదేశ వృద్ధి చెక్కుచెదరకుండా ఉందన్నారు. భూమి, కారి్మక, వ్యవసాయ మార్కెట్లలో సంస్కరణల ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని సూచించారు. -
ఫిక్కీకు కొత్త డైరెక్టర్ జనరల్ నియామకం
ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) డైరెక్టర్ జనరల్‌గా జ్యోతి విజ్ నియమితులయ్యారు. ఆమె ప్రస్తుతం ఫిక్కీలో అదనపు డైరెక్టర్ జనరల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.1988లో శ్రీ రామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1990లో దిల్లీ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పట్టా పొందారు. 1993లో ఫిక్కీలో చేరిన ఆమె వివిధ హోదాల్లో పనిచేశారు. జ్యోతి నియామకం సందర్భంగా ఫిక్కీ ప్రెసిడెంట్ అనీష్ షా మాట్లాడుతూ..‘జ్యోతి విజ్‌ను డైరెక్టర్ జనరల్‌గా నియమించడం సంతోషంగా ఉంది. ఆమె సమర్థంగా విధానాలను రూపొందిస్తారు. ఫిక్కీలో సుధీర్ఘకాలంపాటు సేవలందిస్తున్న జ్యోతి అనుభవం సంస్థను మరింత ముందుకు తీసుకువెళ్లేలా ఉపయోగపడుతుంది. అది ఫిక్కీకు అదనపు విలువను జోడిస్తుంది’ అని చెప్పారు.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా..? ప్రయాణబీమా తీసుకున్నారా..?ఇదిలాఉండగా, వ్యక్తిగత కారణాలతో ఫిక్కీ సెక్రటరీ జనరల్ శైలేష్ పాఠక్ రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆయన సర్వీసులో సంస్థకు సహకారం అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఫిక్కీ ప్రకటన విడుదల చేసింది. -
అంతరిక్ష పర్యాటకం సాధ్యమే!
సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో అంతరిక్ష పర్యాటకం సాధ్యమేనని.. మన దేశం పూర్తిస్థాయి దేశీయ పరిశోధనలతో ముందుకు వెళ్తోందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి, మిస్సైల్ విమెన్ ఆఫ్ ఇండియాగా పేరుపొందిన డీఆర్డీవో శాస్త్రవేత్త టెస్సీ థామస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ది పార్క్ హోటల్లో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో శుక్రవారం ‘స్టెల్లార్ జరీ్నస్’కార్యక్రమం నిర్వహించారు. ఫిక్కీ చైర్పర్సన్ ప్రియా గజ్దర్.. పలువురు శాస్త్రవేత్తలు, ఫిక్కీ ఆధ్వర్యంలోని 200 మంది మహిళలు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టెస్సీ థామస్, కల్పన కాళహస్తి తమ అనుభవాలను పంచుకున్నారు. మార్స్‌పైకి మనిషి వెళ్లడం చూడాలి.. సైన్స్‌కు లింగ భేదం లేదని.. డీఆర్డీఓ, ఇస్రో వంటి వేదికల్లో పురుషులు, మహిళలు ఉమ్మడి లక్ష్యం కోసం కలసి పనిచేస్తున్నారని టెస్సీ థామస్ పేర్కొన్నారు. తాను డీఆర్డీఓ వేదికగా పరిశోధన రంగంలోకి అడుగుపెట్టినప్పుడు మహిళలు ఒకట్రెండు శాతమే ఉండేవారని.. ఇప్పుడు 15 శాతం ఉన్నారని తెలిపారు. వినయం, నిబద్ధతను తన గురువు అబ్దుల్ కలాం వద్ద నేర్చుకున్నానని చెప్పారు. దేశ రక్షణ వ్యవస్థ కోసం అగ్ని క్షిపణులను రూపొందించడంలో కృషి తనకు జీవితకాల సంతృప్తిని ఇచి్చందన్నారు. అగి్న–4, అగ్ని–5 క్షిపణుల రూపకల్పనలో దేశీయ సాంకేతికత వాడుతున్నామని వివరించారు.మార్స్‌పైకి మనిíÙని పంపడాన్ని చూడాలనేది తన కోరిక అని చెప్పారు. ఏలియన్స్ లేవని చెప్పలేం..: సాధారణ హాలీవుడ్ సినిమా బడ్జెట్ కన్నా తక్కువ ఖర్చుతో భారత్ మూన్ ల్యాండర్‌ను ప్రయోగించడం దేశ ఆర్థిక క్రమశిక్షణకు అద్దం పడుతుందని ఇస్రో శాస్త్రవేత్త కల్పన కాళహస్తి తెలిపారు. ‘‘మూన్ ల్యాండర్ 4 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి, అధిక వేగంతో చంద్రుడి సమీపానికి చేరుకుంది. ఆ వేగాన్ని సమర్థవంతంగా నియంత్రించి.. చంద్రుడి ఉపరితలంపై సురక్షితంగా ల్యాండ్ చేయగలిగాం. శక్తివంతమైన భారత పరిశోధనలకు ఇది మంచి ఉదాహరణ. భవిష్యత్‌లో మరిన్ని అద్భుతాలు సృష్టిస్తాం. ప్రయోగాల్లో పూర్తిస్థాయిలో దేశీయ సాంకేతికతను ఉపయోగించనుండటం గర్వకారణం..’’అని చెప్పారు. అంతరిక్ష పర్యాటకం దిశగా ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు సాగుతున్నాయన్నారు. అంగారకుడిపై పరిశోధన కూడా తన కలల ప్రాజెక్టు అని చెప్పారు. ఏలియన్ల గురించి ప్రస్తావిస్తూ.. విశ్వంలో మనకు తెలియని అద్భుతాలెన్నో ఉన్నాయని, అందులో ఏలియన్స్ కూడా భాగం కావొచ్చని పేర్కొన్నారు. -
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
FICCI-IBA Bankers survey: ప్రభుత్వ బ్యాంకుల్లో తగ్గిన మొండిబాకీలు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులన్నింటిలోనూ గత ఆరు నెలలుగా మొండిబాకీలు (ఎన్పీఏ) గణనీయంగా తగ్గాయి. ప్రైవేట్ రంగంలో 67 శాతం బ్యాంకుల్లో మాత్రమే ఎన్పీఏలు తగ్గాయి. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సర్వేలో పాల్గొన్న వాటిల్లో 77 శాతం బ్యాంకులు గత ఆరు నెలలుగా మొండిబాకీలు తగ్గినట్లు వెల్లడించాయి. సగం పైగా బ్యాంకులు రాబోయే ఆరు నెలల్లో తమ స్థూల ఎన్పీఏలు 3–3.5 శాతం శ్రేణిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు తెలిపాయి. ప్రైవేట్ రంగ బ్యాంకులతో పోలిస్తే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) అసెట్ క్వాలిటీ మెరుగుపడింది. పీఎస్‌బీలు, విదేశీ బ్యాంకుల్లో గత ఆరు నెలల్లో ఎన్పీఏలేమీ పెరగలేదు. కానీ 22 శాతం ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం పెరిగాయి. 18వ ఫిక్కీ–ఐబీఏ బ్యాంకర్ల సర్వేను గతేడాది జూలై–డిసెంబర్ మధ్య కాలంలో నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్, ఫారిన్ బ్యాంకులు కలిపి మొత్తం 23 బ్యాంకులు ఇందులో పాల్గొన్నాయి. అసెట్ల పరిమాణంపరంగా బ్యాంకింగ్ రంగంలో వీటి వాటా 77 శాతంగా ఉంటుంది. మరిన్ని ముఖ్యాంశాలు.. ► ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో అధికంగా ఎన్పీఏలు ఉన్నాయి. ► వచ్చే ఆరు నెలల్లో ఆహారేతర పరిశ్రమలకు రుణాల వృద్ధి 12 శాతం పైగానే ఉండొచ్చని 41 శాతం బ్యాంకులు, 10–12 శాతం ఉండొచ్చని 18 శాతం బ్యాంకులు భావిస్తున్నాయి. 36% బ్యాంకులు ఇది 8–10 శాతం స్థాయిలో ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి. ► రాబోయే ఆరు నెలల్లో ఎన్పీఏలు 2.5–3 % స్థాయిలో ఉండొచ్చని 14% బ్యాంకులు తెలిపాయి. ► టర్మ్ డిపాజిట్లు పుంజుకోగా, మొత్తం డిపాజిట్లలో కాసా డిపాజిట్ల వాటా తగ్గిందని 70 శాతం బ్యాంకులు తెలిపాయి. దీర్ఘకాలికంగా అధిక వడ్డీ రేట్లకు డిపాజిట్లను లాకిన్ చేయాలనే ధోరణిలో కస్టమర్లకు ఉండటమనేది టర్మ్ డిపాజిట్లకు సానుకూలంగా మారింది. ► ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెటల్స్, ఐరన్ .. ఉక్కు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ కోసం డిమాండ్ నెలకొంది. -
Ridhi Khosla Jalan: మన జీవితానికి మనమే డిజైనర్లం..
సొంతంగా ఇంటి అలంకరణ లో ఎదుర్కొన్న ఇబ్బందులు పిల్లల కోసం కొత్తగా ఏదైనా సృష్టించాలనే ఆలోచన రిధి ఖోస్లా జలాన్ని ఈ రోజు ఉన్నతంగా నిలబెట్టింది. హోమ్ డెకార్‌లో డిజైన్ ఇన్ఫ్లుయెన్సర్గా పేరొందిన రిధి పిల్లల కోసం లిటిల్ నెస్ట్ పేరుతో ఏర్పాటు చేసిన డిజైన్ స్టోర్‌తో మార్కెట్లో ఆమెను వ్యాపారవేత్తగా మార్చింది. ముంబై నుంచి ఇటీవల హైదరాబాద్‌లోని ఫిక్కీ వైఎఫ్‌ఎల్‌ఓ ఏర్పాటు చేసిన సెషన్లో పాల్గొన్న ఈ యంగ్ ఎంట్రప్రెన్యూర్ తన జీవితాన్ని ఎలా డిజైన్ చేసుకుందో వివరించింది. ‘మనలో ఉన్న అభిరుచి ఏంటో తెలుసుకుని, దానిని అమలులో పెడితే విజయం మన వెన్నంటే ఉంటుంది’ అంటుందామె. స్ఫూర్తివంతమైన ఆమె మాటలు... సాధారణ గృహిణిగా ఉన్న రిధి తన జీవితాన్ని ఈ రోజు ఉన్నత స్థితికి చేరుకోవడానికి ఎలాంటి మలుపులు తిప్పిందో వివరించింది. ఇంటీరియర్ డిజైనర్ నుండి కిడ్స్ ఫర్నీచర్ స్టోర్ యజమాని వరకు రిధి పేరొందింది. ‘‘ఫైనాన్స్, మార్కెటింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశాక పెళ్లవడంతో ముంబై వెళ్లిపోయాను. మొదటి బిడ్డ పుట్టాక నాలో తన కోసం ప్రత్యేకమైన డిజైనింగ్ రూమ్ ఉంటే బాగుంటుందనే ఆలోచన వచ్చింది. అంతేకాదు పిల్లల బట్టలు, వారికి కావల్సిన వస్తువుల విషయంలోనూ ఆలోచన పెరిగింది. అప్పుడే ఇంటీరియర్ డిజైన్‌కు సంబంధించిన కోర్సు చేయాలనుకున్నా. రెండవసారి ప్రెగ్నెంట్ అయిన టైమ్‌లోనే ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో చేరాను. అలా ఆ అభిరుచే వృత్తిగా మారింది. నా లైఫ్‌లో ఇదొక స్పెషల్ జర్నీ అని చెప్పవచ్చు. పిల్లల గదులను డిజైన్ చేయడం అనే నా హాబీ నన్ను చాలామందికి చేరువ చేసింది. మొదట ఈ రంగంలో పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించాను. ఫర్నీచర్, డెకార్ వస్తువుల కోసం ఎక్కడ షాపింగ్ చేయాలనే దానిపై స్నేహితులు తరచూ సలహాలు అడుగుతుండేవారు. వ్యక్తిగతంగానూ, నా స్నేహితులు పడుతున్న కష్టాన్ని గమనించినప్పుడు నా డిజైనింగ్‌లో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుందో స్వయంగా తెలుసుకున్నాను. స్నేహితులకు సూచనలు ఇచ్చే క్రమంలో నాకూ చాలా విషయాల పట్ల అవగాహన పెరిగింది. కిడ్స్ డెకార్ బ్రాండ్‌ను ప్రారంభించడానికి ముందు మార్కెట్ పోకడలను గమనించాను. అప్పుడు ‘లిటిల్ నెస్ట్’ పేరుతో స్టోర్ ప్రారంభించాను. ఈ క్రియేటివ్ డిజైన్ నన్ను చాలా మందికి చేరువ చేసింది. ముందు కుటుంబమే నాకు అందుబాటులో ఉన్న సమాచారాన్ని, చేస్తున్న వర్క్ప్రోగ్రెస్ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంటాను. ఒక ప్రశ్న– సమాధానంతో సోషల్ మీడియా వీడియోను ప్రారంభించాను. ఏడాది లోపు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లకు చేరువయ్యాను. ప్రజలు కోరుకునే సమాచారాన్ని అందించడంపై పెట్టే దృష్టి నన్ను ఇంతమందికి చేరువ చేసింది. అయితే, ఇల్లే నా మొదటి ప్రాధాన్యత. ఇంటిని మేనేజ్ చేయగలగితే చాలు, బయట అన్ని పనులను సులువుగా చక్కబెట్టవచ్చు. ఇందుకు నా పిల్లల సాయం కూడా ఉంటుంది. నా బిజీ వర్క్, ప్లానింగ్ చూస్తూ పెరుగుతున్న నా పిల్లలు కూడా వారి పనులు వారు చేసుకుంటారు. నా వర్క్ వల్ల సోషల్‌గా అందరితోనూ అంతగా కలిసే సమయం ఉండదు. మొదట్లో అన్నీ బ్యాలెన్స్ చేయగలిగాను. కానీ, డెకార్ వర్క్, కంటెంట్ క్రియేటివ్‌కు ఎక్కువ టైమ్ పడుతుంది. ఇదొక డైనమిక్ జర్నీ అవడంతో నా ముందున్న మార్పులను కూడా ఉత్సాహంగా చేసుకుంటూ వెళుతున్నాను. గ్లోబల్ డిజైన్ మ్యాప్‌లో మన దేశం నుంచి నేను ఉండాలన్నది నా కల. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతోమందికి చేరవయ్యాను. ఆఫ్‌లైన్‌లో వ్యక్తిగతంగా చాలా మందికి రీచ్ కావాలని కోరుకుంటున్నాను. రెండు వారాలకు ఒకసారి.. ఎంత పని ఉన్నా రెండు వారాలకు ఒకరోజు పూర్తి విశ్రాంతి తీసుకుంటాను. నా కోసం నేను అన్నట్టుగా ఉంటాను. ఆ రోజులో ఎక్కువ సమయం బుక్స్ చదవడానికి సమయాన్ని కేటాయిస్తాను. రోజువారీ పనితో ఏ మాత్రం సంబంధం లేని పనులను చేస్తాను. దీంతో మరింత ఉత్సాహంగా మారిపోతాను’’ అని తన విజయానికి వేసుకున్న బాటలను ఇలా మన ముందు ఉంచారు రిధి. అప్డేట్గా ఉంటాను.. ఇంటీరియర్ డిజైన్ స్టూడియో మెయింటెయిన్ చేయాలంటే ఎప్పుడూ అప్డేట్గా ఉండాలి. ప్రతిరోజూ నాలుగు పేజీల షెడ్యూల్‌ని వేసుకుంటాను. ఇల్లు, వర్క్‌స్పేస్, అప్డేట్స్, నా వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేవి ప్రోత్సాహాన్ని కలిగించే కోట్స్ నోట్ చేసుకుంటాను. దీని వల్ల ప్రతిదీ ఏ రోజు కా రోజు ప్లానింగ్‌గా జరిగిపోతుంటుంది. భవిష్యత్తు గురించి అంటే మరో ఐదేళ్లలో నా ప్రాజెక్ట్స్ గ్లోబల్ లెవల్‌కి వెళ్లాలి. ప్రపంచంలోని అత్యుత్తమ డిజైన్ ఇన్ ఫ్లుయెన్సర్లలో ఒకరిగా ఉండాలన్నదే నా లక్ష్యం. – నిర్మలారెడ్డి -
ఫిక్కీ మీడియా కమిటీ చైర్మన్‌గా కెవిన్
న్యూఢిల్లీ: పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్‌గా కెవిన్ వాజ్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వయాకామ్18లో బ్రాడ్కాస్ట్ ఎంటర్టైన్మెంట్ విభాగం సీఈవోగా ఉన్నారు. వాజ్‌కు మీడియా, వినోద రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది. ఈ కమిటీలో టీవీ, రేడియో, ప్రింట్, ఫిలిం ప్రొడక్షన్ తదితర విభాగాలకు సంబంధించిన ప్రమోటర్లు, సీఈవోలు.. సభ్యులుగా ఉన్నారు. -
8 శాతం వరకూ ఎకానమీ వృద్ధి
న్యూఢిల్లీ: వృద్ధి ఊపందుకోవడం, సానుకూల సెంటిమెంట్లు, పెరుగుతున్న ప్రైవేట్ పెట్టుబడుల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) భారత్ ఎకానమీ 7.5 నుండి 8 శాతం పురోగమిస్తుందని భావిస్తున్నట్లు భారత్ వాణిజ్య పరిశ్రమల మండళ్ల సమాఖ్యకు కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్ అనిష్ షా విశ్లేషించారు. 2025 ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే 2024–25 ఆర్థిక సంవత్సరంలో కూడా భారత్ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 8 శాతంగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే భారత్ వృద్ధి అవకాశాలపై భౌగోళిక రాజకీయ ఒత్తిడి ప్రభావం ఉంటుందని ఆయన అన్నారు. మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న షా ఈ మేరకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ముఖ్యాంశాలు.. ► మనం ఇప్పటివరకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి, రెండు త్రైమాసికాల్లో వరుసగా 7.8 శాతం, 7.6 శాతం వద్ద మంచి వృద్ధి రేటులను చూశాము. వెరసి ఏప్రిల్–సెపె్టంబర్ వరకూ 7.7 శాతం పురోగతి నమోదయ్యింది. వృద్ధి ఊపందుకుంటోంది కాబట్టి... ఇదే చక్కటి ఎకానమీ ఫలితాలు కొనసాగుతాయని నేను భావిస్తున్నాను. ► మన ఎకానమీకి ప్రస్తుత సవాలు అంతర్జాతీయ పరిణామాలే. మన ఎకానమీ ఇజ్రాయెల్–గాజాకు సంబంధించిన ప్రభావాలను చూస్తోంది. ఉక్రెయిన్‌లో ఏమి జరుగుతుందో మనకు తెలిసిందే. ఆయా ఉద్రిక్తతలు విస్తరించకూడదని మన కోరిక. ప్రతి ఒక్కరి పురోగతి కోసం శాంతి అవసరం. ► ఇక రెండవ సమస్య విషయానికి వస్తే... పాశ్చాత్య దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు. అక్కడ సమస్యలు తగ్గాయని మేము అనుకోవడం లేదు. భారతదేశంలో మనం చూసిన దానికంటే చాలా ఎక్కువ స్థాయిలో ఆయా దేశాల్లో వడ్డీ రేటు ఉంది. పాశ్చాత్య ప్రపంచంలో ఎక్కువ ఆర్థిక సంక్షోభ ప్రభావాలు ఉంటే, అవి తప్పనిసరిగా భారతదేశంపై కూడా ప్రభావాన్ని ఊపుతాయి. ► విదేశాల నుంచి ఎదురవుతున్న సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం వృద్ధి జోరును కొనసాగించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా, అనేక భారతీయ కంపెనీలు ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే రీతిలో తమ బ్యాలెన్స్ సీట్లను పటిష్టం చేసుకోవాలి. ► భారతీయ కంపెనీలకు సంబంధించి ప్రస్తుత పరిస్థితి చూస్తే, సెంటిమెంట్ సానుకూలంగా ఉంది. పెట్టుబడులు పుంజుకుంటున్నాయి. సామర్థ్యాల మెరుగుదల కొనసాగుతోంది. డిమాండ్ పరిస్థితులు కూడా బాగున్నాయి. ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కొనసాగుతోంది కాబట్టి పెట్టుబడుల వేగం మరింత పెరుగుతోంది. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి తర్వాత వరుసగా ఐదవసారికూడా బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 6.5 శాతం)ను యథాతథంగా కొనసాగించడం సరైనదే. ఈ విషయంలో ఆర్బీఐ ప్రో–యాక్టివ్‌గా ఉండడం హర్షణీయం. ఎందుకంటే ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్బీఐ ముందస్తు చర్యలు తీసుకుంది. ఇది కీలకమైన అంశం. రేట్లు తగ్గించడం కంటే ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉండడమే ముఖ్యమైన అంశం. ఇది ఇప్పటివరకు పనిచేసింది. ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు ఆర్బీఐ చక్కటి చర్యలు తీసుకుందన్న నిపుణుల విశ్లేషణను నేను సమరి్థస్తాను. అయితే దీర్ఘకాలిక దృక్పథంతో ఆర్థిక వ్యవస్థను మంచి మార్గంలో ఉంచిన తర్వాత రేటు తగ్గింపుకు అవకాశం ఉండి, ఆర్బీఐ ఈ మేరకు చర్యలు తీసుకుంటే పరిశ్రమ దానిని స్వాగతిస్తుంది. ► 2047 నాటికి దేశాన్ని ‘వికసిత భారత్’ లక్ష్యం వైపు నడిపించేందుకు ఫిక్కీ తన వంతు సహాయ సహకారాలను అందిస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ, మహిళల నేతృత్వంలోని అభివృద్ధి, వ్యవసాయ రంగం పురోగతి, సుస్థిరతలకు సంబంధించి వృద్ధి లక్ష్యాల సాధనకు ఫిక్కీ తగిన కార్యకలాపాలపై దృష్టి పెడుతుంది. 2024–25లో వృద్ధి 6.5 శాతమే: యాక్సిస్ బ్యాంక్ అమెరికాలో మాంద్యం ఖాయమని సూచన 2024–25 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 6.5 శాతానికి పరిమితమవుతుందని యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనమిస్ట్ యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంత్ మిశ్రా పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిణామాలు దీనికి కారణమని ఆయన విశ్లేషించారు. దేశీయంగా ఎకానమీ క్రియాశీలత బాగున్నప్పటికీ, అంతర్జాతీయ అంశాలే ప్రతికూలతలని మిశ్రా పేర్కొన్నారు. అమెరికా ఎకానమీ ఇంకా సమస్యలోంచి బయటపడలేదని, దీర్ఘకాలంగా భయపడుతున్న మాంద్యపు భయాల అంచనా వాస్తవమని పేర్కొన్నారు. అమెరికాకు ద్రవ్యలోటు ప్రధాన సమస్యని పేర్కొన్న ఆయన, ‘‘అమెరికాలో మాంద్యం ఆలస్యం అయింది. వాయిదా పడలేదు’’ అని వ్యాఖ్యానించారు. అమెరికా ఆర్థిక సవాళ్లను అన్ని వర్గాలు తక్కువగా అంచనా వేస్తున్నట్లు పేర్కొంటూ, ఈ క్లిష్టమైన అంశంపై చర్చ లేకపోవడంపై తాను ఆందోళన చెందుతున్నానని ఆర్థికవేత్త పేర్కొన్నారు. భారతదేశం వంటి దేశాలు అనుసరించే వివేకవంతమైన ఆర్థిక చర్యలకు బదులుగా, అమెరికా సాంప్రదాయక ‘ప్రో సైక్లికల్ పాలసీ’ని అనుసరించినట్లు ఆయన విశ్లేషించారు. భారతదేశంలో జరిగే సార్వత్రిక ఎన్నికలు విధాన నిర్ణయాల దిశలో పెద్దగా మార్పుకు దారితీయబోవని పేర్కొన్నారు. తాను కార్పొరేట్ అయినట్లయితే, తక్షణ డిమాండ్ కారణంగా త్వరగా పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకుని ఉండే వాడినని మిశ్రా అన్నారు. విద్యుత్‌కు సంబంధించి బొగ్గు ఆధారిత, పునరుత్పాదక ఇంధన ఆధారిత రంగాల్లో పెట్టుబడులు చక్కటి ఫలితాలను ఇస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయా విభాగాల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయనీ వివరించారు. అస్థిర ఆహార ద్రవ్యోల్బణ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ తన రెపో రేటును 2024లో తగ్గించే అవకాశం లేదని పేర్కొన్నారు. అయితే 2024లో ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గే అవకాశం ఉందన్నారు. ద్రవ్యలోటు సవాళ్లు తగ్గినప్పటికీ విదేశీ రేటింగ్ ఏజెన్సీలు భారత్ రేటింగ్‌ను అప్‌గ్రేడ్ చేసే అవకాశం లేదని పేర్కొన్న ఆయన, ఇందుకు తొలుత భారత్ అధిక రుణ–జీడీపీ నిష్పత్తిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. -
Make in India: ‘టెస్లా వస్తే రానీ.. కానీ దాన్ని మాత్రం మార్చొద్దు’
దేశీయంగా తయారీని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మేకిన్ ఇండియా పాలసీ నిలకడగా ఉండాలని, ఏ ఒక్క సంస్థ కోసమో దాన్ని మార్చేయరాదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ ఈవీ కమిటీ చైర్పర్సన్ సులజ్జా ఫిరోదియా మోత్వానీ వ్యాఖ్యానించారు. భారత్‌లో విద్యుత్ కార్ల తయారీ ఇన్వెస్ట్ చేయాలంటే కొన్నాళ్ల పాటు తమ వాహనాల దిగుమతి సుంకాలను తగ్గించాలంటూ అమెరికన్ సంస్థ టెస్లా.. కేంద్రానికి ప్రతిపాదించిన నేపథ్యంలో మోత్వానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ఎవరో దేశీయంగా తయారీపై ఇన్వెస్ట్ చేస్తామన్నంత మాత్రాన .. ప్రభుత్వం అమలు చేస్తున్న మేకిన్ ఇండియా విధానాలను మార్చడం సరికాదు. ఒక విధానం ఉందని, దాన్ని పాటించాల్సిందేనని అందరూ గుర్తెరగాలి. టెస్లా సమర్పించిన ప్రతిపాదన గురించి నాకు పూర్తిగా తెలియదు. కానీ పాలసీ విషయంలో గందరగోళం ఉండకూడదని, నిలకడగా ఉండాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం‘ అని ఆమె వివరించారు. భారత్ కచ్చితంగా మేకిన్ ఇండియాపై దృష్టి పెట్టినప్పుడే దీర్ఘకాలికంగా పోటీతత్వం పెరగగలదని పేర్కొన్నారు. అలా జరగకపోతే ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కోసం విడిభాగాలన్నింటినీ దిగుమతే చేసుకోవాల్సి వస్తుందన్నారు. మరోవైపు, వ్యక్తిగత అవసరాలకు కొనుగోలు చేసే చిన్న ఎలక్ట్రిక్ కార్లకు కూడా ఫేమ్ స్కీమును (విద్యుత్ వాహనాల కొనుగోళ్లను ప్రోత్సహించేందుకు సబ్సిడీలిచ్చే పథకం) వర్తింపచేయాలని కేంద్రాన్ని కోరినట్లు మోత్వానీ తెలిపారు. ఇదీ చదవండి: ఆ దేశంలోనే అధిక ద్రవ్యోల్బణం ..! రూ. 20 లక్షల వరకు ఖరీదు చేసే కార్లకు దీన్ని వర్తింపచేసే అంశాన్ని పరిశీలించాలని ఫేమ్ మూడో విడతపై ఫిక్కీ సమరి్పంచిన సిఫార్సుల్లో పేర్కొన్నట్లు ఆమె వివరించారు. ప్రస్తుతం వ్యక్తిగత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ప్రభుత్వ.. వాణిజ్య రవాణా అవసరాలకు ఉపయోగించే త్రిచక్ర వాహనాలు, ఫోర్ వీలర్లు, ఎలక్ట్రిక బస్సులకు ఫేమ్ స్కీము వర్తిస్తోంది. -
ఫిక్కీ అధ్యక్షుడిగా అనిష్ షా
ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) అధ్యక్షుడిగా మహీంద్రా గ్రూప్ సీఈవో, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అనిష్ షా బాధ్యతలు స్వీకరించారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఫిక్కీ 96వ వార్షికోత్సవంలో ప్రస్తుత అధ్యక్షుడు సుభ్రకాంత్ పాండా నుంచి 2023-2024 సంవత్సరానికి గానూ అనిష్ షా బాధ్యతలు చేపట్టారు. ఫిక్కీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆఫీస్ బేరర్‌గా ఉన్న అనిష్ షా యూకే ఇన్వెస్ట్మెంట్ కౌన్సిల్ సభ్యుడిగానూ ఉన్నారు. దీంతోపాటు ఆటోమోటివ్ గవర్నర్స్ కౌన్సిల్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్) అధ్యక్షుడిగా, ఇండియా అలయన్స్ ఆఫ్ సీఈవోస్ ఫర్ క్లైమేట్ చేంజ్ (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్), ఇండియా-ఆస్ట్రేలియా సీఈవో కౌన్సిల్లకు అనిష్ షా సహ అధ్యక్షుడిగా ఉన్నట్లు ఫిక్కీ ప్రకటనలో పేర్కొంది. మహీంద్రా గ్రూప్ కంటే ముందు అనిష్ షా 2009-14 వరకు జీఈ క్యాపిటల్ ఇండియాకు ప్రెసిడెంట్, సీఈవోగా పనిచేశారు. ఇక్కడ 14 సంవత్సరాలు పనిచేసిన ఆయన జీఈ క్యాపిటల్ యూఎస్, గ్లోబల్ యూనిట్లలో అనేక నాయకత్వ స్థానాలను నిర్వహించారు. అలాగే బ్యాంక్ ఆఫ్ అమెరికా యూఎస్ డెబిట్ ఉత్పత్తుల వ్యాపారానికి నాయకత్వం వహించారు. ఇక బోస్టన్, ముంబైలోని సిటీ బ్యాంక్‌లో బైన్ అండ్ కంపెనీతో కలిసి పనిచేశారు. అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి పోస్ట్-గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసిన అనిష్ షా.. కార్నెగీ మెల్లన్స్ టెప్పర్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. -
అభివృద్ధి చెందిన భారత్ హోదానే లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ 2047 నాటికి (స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు) 30 ట్రిలియన్ డాలర్ల అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు విజన్ డాక్యుమెంట్‌ను సిద్ధం చేస్తున్నట్లు నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ విజన్ డాక్యుమెంట్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. విజన్ డాక్యుమెంట్– 2047 భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి అవసరమైన సంస్థాగత, నిర్మాణాత్మక మార్పులను సంస్కరణలను నిర్దేశిస్తుందని ఆయన అన్నారు. దిగువ మధ్య ఆదాయ స్థితి నుంచి దేశ పురోగతి విజన్ 2047 ప్రధానంగా నిర్దేశించనున్నట్లు పేర్కొన్నారు. ఇదే బాటలో రాష్ట్రాలు.. రాష్ట్రాలు కూడా తమ విజన్ డాక్యుమెంట్లను అభివృద్ధి చేస్తున్నాయని నీతి ఆయోగ్ సీఈవో ఈ సందర్భంగా తెలిపారు. ఈ ఏడాది మే 2023లో నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, 2047 నాటికి దేశాన్ని వికసించిన భారత్‌గా (అభివృద్ధి చెందిన దేశంగా) మార్చేందుకు కృషి చేయాలని పిలుపునిచి్చన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియను డిసెంబర్ 2021లో క్యాబినెట్ సెక్రటరీ ప్రారంభించారు. థీమాటిక్, సెక్టోరల్ విజన్లను (రంగాల వారీగా) సిద్ధం చేసే బాధ్యతలను 10 సెక్టోరల్ గ్రూప్స్ ఆఫ్ సెక్రటరీలకు అప్పగించడం జరిగింది. పరిశ్రమ ఛాంబర్లు, ఎగుమతి ప్రోత్సాహక మండలి, విశ్లేషణా నిపుణులు, పరిశోధనా సంస్థలతో పలు దఫాల్లో మేధోమథనం, సంబంధిత సంప్రదింపులు జరిగాయి. అభివృద్ధి చెందిన భారత్ ః2047 కోసం 10 రంగాల దార్శినికత విభాగాలను ఏకీకృతం చేసేందుకు 2023లో నీతి ఆయోగ్ బాధ్యతలు చేపట్టింది. విద్యకు ప్రాధాన్యత... కేంద్రం దేశంలో విద్యా ప్రమాణాల పెరుగుదలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సీఈఓ సుబ్రమణ్యం పేర్కొన్నారు. దేశంలో కాలేజీల నమోదు రేటును 27 శాతం నుంచి 50–60 శాతానికి పెంచాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. ఉన్నత విద్య కోసం ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు వెచ్చిస్తోందని పేర్కొన్న ఆయన, ఇప్పుడు భారత విద్యా రంగాన్ని కూడా పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. కాలేజీకి వెళ్లే జనాభా 4 కోట్ల నుండి 8–9 కోట్లకు పెరుగుతుందని ఆయన పేర్కొంటూ, కాబట్టి మనకు ఈ రోజు ఉన్న వెయ్యి విశ్వవిద్యాలయాలతో పాటు మరో వెయ్యి విశ్వవిద్యాలయాలు అవసరమని విశ్లేషించారు. రాష్ట్రాలు ఆర్థికంగా ఒత్తిడికి లోనవుతున్నందున, కొత్త విశ్వవిద్యాలయాలను ప్రారంభించడానికి ప్రైవేట్ రంగం నుండి నిధులు మరింత రావాల్సి ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. పరిశోధన–అభివృద్ధి– ఆవిష్కరణలే లక్ష్యంగా పనిచేసే బోస్టన్– శాన్ ఫ్రాన్సిస్కో వంటి విద్యా నగరాలను దేశంలో సృష్టించాల్సిన అవసరం ఉందని అన్నారు. భారతదేశ జనాభాలో సగం మంది సగటు వయస్సు 29 ఏళ్లలోపేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం జనాభా సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడానికి మనకు 25 సంవత్సరాల సుదీర్ఘ అద్భుత సమయం ఉంది’’ అని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద శ్రామికశక్తిని అందించే దేశంగా భారత్ అవతరించబోతోందని పేర్కొన్న సుబ్రహ్మణ్యం, ప్రతి సంవత్సరం 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు తమ ఉన్నత విద్యను పూర్తి చేయడానికి భారతదేశం నుండి బయటకు వెళ్తున్నారని చెప్పారు. అయితే ఎక్కువ మంది విద్యార్థులను భారత్‌కు ఆకర్షించేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. తలసరి ఆదాయం 18,000 డాలర్లు లక్ష్యం... ప్రస్తుతం అనుసరిస్తున్న ఆర్థిక సూత్రాల ప్రకారం... తలసరి ఆదాయం 1,036 డాలర్ల నుంచి 4,045 డాలర్ల మధ్య ఉన్న దేశాన్ని దిగువ మధ్య తరగతి ఆదాయ దేశంగా పరిగణిస్తారు. 4046 డాలర్ల నుంచి 12,535 డాలర్ల మధ్య ఆదాయ దేశాలను ఎగువ మధ్య తరగతి ఆదాయ దేశాలుగా పేర్కొంటారు. 12,000 డాలర్ల తలసరి ఆదాయం దాటితే అది అభివృద్ధి చెందిన దేశంగా మారుతుంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ ఐతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా (3.75 ట్రిలియన్ డాలర్లు) కొనసాగుతున్న భారత్ తలసరి ఆదాయం దాదాపు 1,183 డాలర్లుగా (రూ.98,374) అంచనా. 2047 నాటికి ఈ పరిమాణం 18,000 డాలర్లకు పెరగాలన్నది లక్ష్యం. 25.5 ట్రిలియన్ డాలర్లతో అమెరికా ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఎకనామగా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం జీడీపీలో పావుశాతం వాటాను కలిగి ఉంది. ఇక 17.9 శాతం ప్రపంచ జీడీపీ వాటాతో 18 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా చైనా రెండవ స్థానంలో ఉంది. తరువాతి స్థానాల్లో జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)లు ఉన్నాయి. కాగా, 2022 నాటికి భారత్ ఎకానమీ బ్రిటన్, ఫ్రాన్స్‌లను అధిగమించగా, 2023 నాటికి జర్మనీని అధిగమించే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. నేడు రెండో త్రైమాసిక జీడీపీ ఫలితాలు భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై–సెపె్టంబర్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు గురువారం వెలువడనున్నాయి. మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) వృద్ధి 7.8 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 7.2 శాతం. కాగా, రెండవ త్రైమాసికంలో మంచి ఫలితాలే నమోదవుతాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్ వ్యక్తం చేశారు. అంతక్రితం ఆయన ‘పట్టణ మౌలిక రంగం అభివృద్ధి కోసం ప్రైవేట్ పెట్టుబడుల వినియోగం– జీ20 ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్కింగ్ గ్రూప్ నుండి అనుభవ పాఠాలు’ అనే అంశంపై జరిగిన ఒక జాతీయ వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆహార రాయితీకి అదనపు నిధుల కేటాయించాల్సిన అవసరం ఏర్పడుతున్నప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 5.9 శాతం ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం. ఇది జీడీపీ నిష్పత్తిలో చూస్తారు) లక్ష్య సాధన సాధ్యమేనని ఆయన అన్నారు. గత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 6.4 శాతంగా ఉన్న సంగతి తెలిసిందే. 2025–26 నాటికి భారత్ ద్రవ్యలోటు లక్ష్యాన్ని 4.5 శాతంగా కేంద్రం నిర్దేశించుకుంది. -
ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడుల దన్ను!
న్యూఢిల్లీ: పటిష్ట ఫైనాన్షియల్ రంగం, ప్రైవేట్ పెట్టుబడులు పెరగడం వంటి కారణాలతో ఏప్రిల్‌తో ప్రారంభమైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధి 6.3 శాతంగా ఉంటుందని పరిశ్రమల సంస్థ ఫిక్కీ సోమవారం వెల్లడించింది. కొన్ని సవాళ్లతో కూడిన అంశాలు నెలకొన్నప్పటికీ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.3 శాతంగా ఉంటుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. సర్వేలో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► ఫలితాలు అనుకున్నదానికంటే మెరుగ్గా ఉంటే వృద్ధి రేటు 6.6 శాతంగా నమోదవుతుంది. ఏదైనా ప్రతికూలతలు ఎదురయితే 6 శాతానికి తగ్గవచ్చు. భౌగోళిక రాజకీయ ఒత్తిడి కారణంగా అనిశ్చితి కొనసాగడం, చైనాలో వృద్ధి మందగించడం, కఠిన ద్రవ్య విధానం, సాధారణ రుతుపవనాల కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు వృద్ధికి ప్రతికూలతలు. ► మొత్తం స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 15 శా తం వాటా ఉన్న వ్యవసాయ రంగం, అనుబంధ కార్యకలాపాల విషయంలో వృద్ధి రేటు 2.7 శా తంగా ఉంటుంది. అయితే 2022–23తో పోలి్చ తే (4 శాతం) ఈ వృద్ధి రేటు తగ్గుతుందని సర్వే వెల్లడిస్తోంది. ఎల్ నినో ప్రభావం దీనికి కారణం. ► జీడీపీలో మరో 15 శాతం వాటా ఉన్న పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. ► ఎకానమీలో మెజారిటీ వాటా కలిగిన సేవల రంగం వృద్ధి రేటు 7.3 శాతంగా ఉండే వీలుంది. ► 2023 సెపె్టంబర్లో సర్వే జరిగింది. పరిశ్రమ, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖ ఆర్థికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకోవడం జరిగింది. ► మొదటి త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకాగా, రెండవ–మూడవ త్రైమాసికాల్లో ఈ రేట్లు వరుసగా 6.1 శాతం, 6 శాతాలకు తగ్గవచ్చు. ► రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023–24లో సగటున 5.5 శాతంగా నమోదయ్యే వీలుంది. కనిష్టంగా 5.3 శాతం, గరిష్టంగా 5.7 శాతంగా ఉండవచ్చు. ద్రవ్యోల్బణం గమనం అనిశ్చితంగానే ఉందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. ప్లస్ 2, మైనస్ 2తో 4 శాతం వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2 శాతం, క్యూ3లో 5.7 శాతం, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతంగా ఉంటుందని ఆర్బీఐ పాలసీ అంచనావేస్తోంది. ► తీవ్ర అనిశ్చితి పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనే కొనసాగవచ్చు. 2024 వరకూ ఇదే ధోరణి నెలకొనే అవకాశం ఉంది. అయితే భారత్ ఎకానమీ ఈ సవాళ్లను తట్టుకుని నిలబడగలుగుతుంది. భారత్ ఎగుమతులపై మాత్రం ప్రతికూల ప్రభావం తప్పదు. 2024–25 ప్రారంభంలో పావుశాతం రేటు కోత 2024 మార్చి వరకూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో యథాతథంగా 6.5 శాతంగా కొనసాగే వీలుందని ఫిక్కీ సర్వే తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2024–25)మొదటి లేదా రెండవ త్రైమాసికాల్లో రెపో రేటును ఆర్బీఐ పావుశాతం తగ్గించే అవకాశం ఉందని విశ్లేíÙంచింది. ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల మొదట్లో జరిగిన సమీక్షసహా గడచిన మూడు ద్రవ్య పరపతి విధాన సమక్షా సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. జూలైలో నమోదయిన 15 నెలల గరిష్ట స్థాయి (7.44 శాతం) రిటైల్ ద్రవ్యోల్బణం సెప్టెంబర్ నాటికి పెద్ద మరింత ఊరటనిస్తూ, మూడు నెలల కనిష్ట స్థాయి 5.02 శాతానికి దిగివచి్చంది. అయితే ద్రవ్యోల్బణం పట్ల ఆర్బీఐ అత్యంత అప్రమత్తంగా ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ పలు సందర్భాల్లో స్పష్టం చేస్తున్నారు. ద్రవ్యోల్బణం 2–4 ఆర్బీఐ లక్ష్యం అని కూడా ఆయన ఇటీవలి పాలసీ సమీక్షలో ఉద్ఘాటించారు. -
‘కాసా’ నుంచి ‘టర్మ్’కు డిపాజిటర్ల చూపు! బ్యాంకుల లాభాలపై ప్రభావం
న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కరెంట్ అకౌంట్ సేవింగ్స్ అకౌంట్ (సీఏఎస్ఏ– కాసా) డిపాజిట్లు గణనీయంగా తగ్గిపోతున్నాయి. బ్యాంకు వినియోగదారులు వేగంగా టర్మ్ డిపాజిట్ల వైపునకు మారిపోతున్నారు. కాసాలో అతి తక్కువ వడ్డీరేటు, టర్మ్ డిపాజిట్లలో కొంత మెరుగైన వడ్డీరేటు ఈ పరిస్థితికి కారణమని పారిశ్రామిక ప్రాతినిధ్య సంస్థ– ఫిక్కీ, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) విడుదల చేసిన సర్వే (17వ రౌండ్) ఒకటి పేర్కొంది. ఈ పరిస్థితి బ్యాంకుల లాభాలపై కొంతమేర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా నిపుణుల అభిప్రాయం. కాసా అంటే బ్యాంకులు సమీకరించే తక్కువ వడ్డీరేటు డిపాజిట్లు. అధిక మొత్తంలో తక్కువ వడ్డీ వ్యయాల డిపాజిట్లు ఒక బ్యాంకుకు ఉన్నాయంటే ఆ బ్యాంకుకు మెరుగైన మార్జిన్లు ఉంటాయని అర్థం. సర్వేలోని మరికొన్ని ముఖ్యాంశాలు.. మౌలిక సదుపాయాలు, టెక్స్టైల్స్ రసాయనాలు వంటి రంగాలు నిరంతర వృద్ధిని సాధిస్తున్నందున, ఆయా రంగాల్లో దీర్ఘకాలిక క్రెడిట్ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్, మెటల్స్, ఐరన్, స్టీల్ రంగాల్లో కూడా గత ఆరు నెలల్లో వేగవంతమైన దీర్ఘకాలిక రుణాల పంపిణీ జరిగింది. మౌలిక రంగాన్ని పరిశీలిస్తే, 16వ రౌండ్ సర్వేలో 57 శాతం మంది ఈ రంగంలో రుణ వృద్ధి ఉందని పేర్కొంటే, ప్రస్తుత 17వ రౌండ్లో ఈ సంఖ్య 67కు పెరిగింది. వచ్చే ఆరు నెలల్లో నాన్–ఫుడ్ ఇండస్ట్రీలో భారీ రుణ వృద్ధి నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గడచిన ఆరు నెలల్లో తమ మొండిబకాయిలు తగ్గాయని సర్వేలో పాల్గొన్న బ్యాంకర్లలో 75 శాతం మంది తెలిపారు. వచ్చే ఆరు నెలల్లో మొండిబకాయిలు 3 నుంచి 4 శాతం వరకే ఉంటాయని బ్యాంకర్లలో మెజారిటీ విశ్వసిస్తున్నారు. సుస్థిర దేశీయ ఆర్థిక వ్యవస్థ, ప్రభుత్వ మూలధన వ్యయంతో కూడిన రుణ వృద్ధి, పటిష్ట ఆర్థిక పునరుద్ధరణ యంత్రాంగం, మొండిబకాయిలకు అధిక నిధులు కేటాయింపు (పొవిజనింగ్), భారీ రైట్–ఆఫ్ (పుస్తకాల నుంచి మొండి పద్దుల రద్దు) వంటి అంశాలు రానున్న ఆరు నెలల్లో బ్యాంకింగ్ రుణ నాణ్యత మెరుగుదలకు కారణం. సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి -
Health tip : కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయొద్దు
తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం వల్ల అది మన మనస్తత్వ శాస్త్రాన్ని ప్రభావితం చేస్తుందని, జీర్ణక్రియను కూడా ప్రభావితం చేస్తుందని వెల్నెస్ కోచ్, ఆయుర్వేద ఔత్సాహికురాలు అమృత కౌర్ రాణా తెలిపారు. FICCI లేడీస్ ఆర్గనైజేషన్ (FLO) హైదరాబాద్ చాప్టర్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు అమృత. ఆమె చెప్పిన హెల్త్ టిప్స్ ఇవి. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి (షవర్ తీసుకోకండి), ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది ఆయుర్వేదం 'జీవిత శాస్త్రం'. ఇది ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగించడంలో సహాయపడుతోంది శరీరాన్ని మంచి ఆరోగ్యంతో ఉంచుకోవడం మన కర్తవ్యం, లేకుంటే మన మనస్సును బలంగా మరియు స్పష్టంగా ఉంచుకోలేము ప్రతిరోజూ, మన ఆరోగ్యాన్ని నిర్దేశించే ఎంపికలను చాలా తరచుగా, మనకు తెలియకుండానే మార్చుకుంటాం. వేగవంతమైన జీవితాలు మరియు అనేక బాహ్య కారకాలచే ప్రభావితమవుతున్నాయి. వేదాలు ప్రకృతిలోని ఐదు అంశాలను - గాలి, నీరు, అంతరిక్షం, అగ్ని మరియు భూమి - పంచమహాభూతంగా సూచిస్తాయి. మానవ శరీరంలో ఈ మూలకాల ఉనికి లేదా లేకపోవడం దాని జీవ స్వభావం లేదా దోషాన్ని నిర్ణయిస్తుంది. ఆధునిక జీవనం కోసం ఆరోగ్యకరమైన శరీరం & మనస్సు కోసం ఆయుర్వేద సూత్రాల ఆధారంగా రోజువారీ అభ్యాసాలు చాలా ముఖ్యమైనవి శక్తితో కూడిన శరీరం కోసం మనస్సు తేలికగా ఉండాలి ఎప్పుడు మానసిక ఒత్తిడితో జీవితం గడిపితే అది కచ్చితంగా శరీరంపై, తద్వారా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది ఆయుర్వేద పోషకాహారం ప్రకారం రోజువారీ మంచి ఆహారపు అలవాట్లు పెంచుకోవాలి మంచి జీర్ణ శక్తి, సరైన రుతుస్రావం మెరుగైన హార్మోన్లకు దోహదపడతాయి ఒత్తిడి లేని జీవితం గడిపేలా స్వీయ-సంరక్షణ పద్ధతులను పాటించాలి కంటి నిండా నిద్ర, మానసిక ఆరోగ్యం వల్ల చర్మం, జుట్టు సంరక్షింపబడతాయి మైండ్‌ఫుల్‌గా తినడం అంటే ఎక్కువ తినమని కాదు అర్థం. దీనికి కేలరీలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు లేదా ప్రోటీన్‌తో సంబంధం లేదు. కానీ ఏం తింటున్నామో.. మనసుకు తెలియజేయాలి. మనం నోట్లో పెట్టుకున్నప్పుడు మనసు దాన్ని జీర్ణింపజేయడానికి కొన్ని రసాయనాలు ఉత్పత్తి చేస్తుంది. ఇంద్రియ జ్ఞానం వల్ల తినే తిండి సత్పలితాలను ఇస్తుంది. తినే సమయంలో ఆహారంపై మనసు కేంద్రీకరించడం మన శరీరధర్మాన్ని ప్రభావితం చేస్తుంది. ఆహారం తిన్న కొద్దిసేపటి వరకు నీళ్లు తాగకుండా చూసుకోండి. భోజనం చేసిన వెంటనే కనీసం 100 అడుగులు నడవడం మంచిది. ఇలా చేస్తే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు. మీరు అతిగా తింటే, మీ తదుపరి భోజనాన్ని తగ్గించండి లేదా దానిని దాటవేయండి. సూర్యాస్తమయం తర్వాత పెరుగు తినకూడదు. కడుపు నిండా తిన్న తర్వాత స్నానం చేయకండి. ఇది రక్తపోటు క్రమరాహిత్యానికి కారణమవుతుంది. స్నానం మీ హృదయ స్పందన రేటును కూడా పెంచుతుంది ఇది కడుపు నిండినప్పుడు అసౌకర్యంగా అనిపిస్తుంది అని ఆమె తెలిపారు (అమృత ఫుడ్ బ్లాగర్ మరియు సర్టిఫైడ్ ఆయుర్వేద పోషకాహార సలహాదారు, జర్నలిస్ట్, రేడియో జాకీ, కంటెంట్ సృష్టికర్త మరియు ఉపాధ్యాయురాలు) -
వీసా ప్రక్రియను సరళతరం చేయండి.. ప్రభుత్వానికి ఫిక్కీ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: దేశీయంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చే దిశగా వీసా ప్రక్రియను సరళతరం చేయడంపై ప్రభుత్వం కసరత్తు చేయాలని, యూజర్లకు సులభతరంగా ఉండేలా చూడాలని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ పేర్కొంది. అలాగే భారత్ వచ్చే టూరిస్టుల్లో భద్రతపరమైన ఆందోళనలను తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. కన్సల్టెన్సీ సంస్థ నాంగియా ఆండర్సన్‌తో కలిసి రూపొందించిన నివేదికలో ఫిక్కీ ఈ మేరకు ప్రతిపాదనలు చేసింది. ఈ రిపోర్టు ప్రకారం 2022 – 2027 మధ్య కాలంలో భారత్‌కు వచ్చే పర్యాటకుల సంఖ్య ఏటా 12 శాతం పెరగనుంది. ఇతరత్రా అవసరాలపై వెచ్చించగలిగే స్థాయిలో ఆదాయాలు పెరుగుతుండటం, మధ్య తరగతి జనాభా వృద్ధి చెందుతుండటం, పర్యాటకానికి గమ్యస్థానంగా భారత్ గుర్తింపు పొందుతుండటం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నాయి. మహమ్మారిపరమైన సవాళ్లు తలెత్తినప్పటికీ 2022లో భారత్‌కు 62 లక్షల మంది విదేశీ టూరిస్టులు వచ్చారు. ఇది 2021లో వచ్చిన 15.2 లక్షల మందితో పోలిస్తే దాదాపు 307 శాతం అధికం. 2022లో భారత స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) ట్రావెల్, టూరిజం రంగం వాటా 9.2 శాతంగా నిల్చింది. 4.46 కోట్ల ఉద్యోగాలు కల్పించింది. పర్యాటకుల దృష్టికోణంలో భారత్‌ను ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు అమలు చేయతగిన విధానాలను రూపొందించడానికి ఈ రిపోర్ట్ ఉపయోగపడగలదని నాంగియా ఆండర్సన్ మేనేజింగ్ పార్ట్నర్ సూరజ్ నాంగియా చెప్పారు. నివేదికలోని మరిన్ని అంశాలు .. ►వీసా ప్రక్రియలను క్రమబద్ధీకరించాలి. మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలి. పర్యాటకం వృద్ధికి ఊతమిచ్చేందుకు ప్రైవేట్ రంగంతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలి. టెక్నాలజీని వినియోగించుకోవాలి. ►టూరిస్ట్ పోలీసుల సంఖ్యను పెంచడం ద్వారా పర్యాటకులకు భద్రతపరమైన భరోసా కల్పించాలి. టూరిస్టుల వేధింపులు, వారిపై నేరాలను కట్టడి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలి. ► భారత్‌లో ఆకర్షణీయమైన, విశిష్టమైన సాంస్కృతిక, సహజ సిద్ధ పర్యాటక స్థలాలు ఉన్నాయి. హెరిటేజ్ టూరిజం, అడ్వెంచర్ టూరిజం, వెల్నె స్ టూరిజం వంటివి ఆఫర్ చేయడం ద్వారా వాటిని అభివృద్ధి చేయవచ్చు. ఇందుకోసం మార్కెటింగ్పరమైన ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం, ప్రైవేట్ రంగంతో కలిసి పనిచేయడం వంటి అంశాలు పరిశీలించవచ్చు. -
రాణివాసం కన్నా... సమాజమే మిన్న...
భంజ్ యువరాణులు మృణాళిక, అక్షితలు రాజవంశంలో పుట్టినా సాధారణ యువతుల్లాగే భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వీరిద్దరూ ఫిక్కీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు పంచుకున్న విశేషాలు వారి మాటల్లోనే... మా ప్యాలెస్...టూరిస్ట్ ప్లేస్‌గా... మా జిల్లా గురించి గొప్పగా చెప్పుకోలేని పరిస్థితే మా ప్రాంతాన్ని తీర్చిదిద్దే వైపు మమ్మల్ని పురికొల్పింది. అందులో భాగంగా స్థానికుల్ని స్వయం ఉపాధి దిశగా నడిపించడం, స్థానిక హస్తకళలకు చేయూత అందించడం.. వంటివి చేశాం. మా హస్తకళల బ్రాండ్ హసా అటెలియర్ సబాయి గడ్డితో చేసిన సంచుల విక్రయాలకు పేరు. వీటిని తరచు డోక్రాతో (ఒడిశాలోని గిరిజనులు చేసే ఓ రకమైన మెటల్‌వర్క్) జత చేసి విక్రయిస్తాం. ఇలా స్థానికులకు ఉపాధితో పాటు స్థానిక కళలకు కూడా ఖ్యాతి దక్కుతోంది. అదే క్రమంలో 20 ఎకరాల్లో ఉన్న మా ప్యాలెస్‌ను 11 గదుల బోటిక్ హోటల్‌గా మార్చాలని నిర్ణయించుకున్నాం. మా ఇంటిని టూరిస్ట్ ప్లేస్ గా తీర్చిదిద్దే క్రమంలో మా తండ్రిగారిని ఒప్పించి ఆయన సూచనలు, సహకారంతో ఒక్క ఇటుక కూడా కొత్తగా జోడించకుండా, చారిత్రక ఆనవాళ్లేమీ చెరిగిపోకుండానే ప్యాలెస్‌ను ఆ«ధునికంగా తీర్చిదిద్దాం. మేం దీనిని ప్రారంభించిన కొద్దికాలానికే కోవిడ్ వచ్చింది. అయితే కోవిడ్ అనంతరం ప్రారంభమైన రివెంజ్ ట్రావెల్... మాకు అనూహ్యమైన ప్రోత్సాహాన్నిచ్చింది. మా జిల్లాకు ఒక మారుమూల అటవీ ప్రాంతంగా కాకుండా ఓ మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు వచ్చింది. అయితే ఈ పయనం మాకెన్నో మెలకువలు, పాఠాలూ నేర్పింది. హైదరాబాద్‌లో ఫలక్‌నుమా ప్యాలెస్ ఉంది, రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్ ప్యాలెస్ ఉంది... మరి మయూర్భంజ్లోని మా ప్యాలెస్‌కే ఎందుకు రావాలి.. అనే ప్రశ్నకు సమాధాన గా మేం మా చరిత్రను కథగా మలచి అతిథులకు పంచుతున్నాం. ప్రత్యేకంగా వికలాంగులకు అనుకూలమైన మరో రెండు గదులను ఇటీవలే జోడించాం. ప్రతి అడుగూ చరిత్రకు అద్దం పట్టేలా తీర్చిదిద్దాం’’ అంటూ తమ విజయగాథను పంచుకున్నారు.. ఇదేకాదు.. ఒకరు యోగా టీచర్‌గా రాణిస్తుంటే మరొకరు రచయిత్రిగా... ఇలా భిన్న రంగాల్లో తమను తాము నిరూపించుకుంటున్నారు ఈ యువరాణులు. మా ప్రాంతానికి ‘కళ’తేవాలని... మా కుటుంబానికి దాదాపు 1000 సంవత్సరాలు పైబడిన చరిత్ర ఉంది. అయితే ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో ఉన్న 200 ఏళ్ల నాటి పూర్వీకుల ఇల్లు బెల్గాడియా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం దగ్గర నుంచి చేసిన ప్రతి పనీ మేం రాజకుటుంబ వారసత్వం అనే పరదాల నుంచి బయటకు వచ్చి చేసినవే. అంతర్జాతీయ కళాకారులను ఆహ్వానిస్తూ మయూర్భంజ్ ఆర్ట్స్ – కల్చర్ ఫెస్టివల్‌ని నిర్వహిస్తున్నాం. మా ప్యాలెస్‌ని ఆర్టిస్ట్ రెసిడెన్సీగా మార్చాం. –మృణాళిక, అక్షిత – సాక్షి హైదరాబాద్ సిటీ బ్యూరో ఫొటో: మోహనాచారి -
పరిశీలనలో మరో 20 బీమా కంపెనీల దరఖాస్తులు
ముంబై: ఇటీవలే కొన్ని బీమా సంస్థలకు లైసెన్సులు ఇచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ మరో 20 దరఖాస్తులను పరిశీలిస్తోంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఐఆర్డీఏఐ చైర్మన్ దేబాశీష్ పాండా ఈ విషయాలు చెప్పారు. కొన్నాళ్ల క్రితం జీవిత బీమా విభాగంలో క్రెడిట్ యాక్సెస్ లైఫ్, ఎకో లైఫ్‌కు లైసెన్సులు ఇవ్వగా కొత్తగా సాధారణ బీమాలో క్షేమా జనరల్ ఇన్సూరెన్స్‌కు అనుమతులు మంజూరు చేసినట్లు ఆయన వివరించారు. 2017 తర్వాత జనరల్ ఇన్సూరెన్స్ విభాగంలో ఒక సంస్థకు అనుమతులు ఇవ్వడం ఇదే ప్రథమం. 2047 నాటికి అందరికీ బీమా కల్పించాలన్న లక్ష్యాన్ని కేవలం నినాదంగా చూడొద్దని, దాన్ని సాకారం చేసే దిశగా తగు చర్యలు తీసుకుంటే డెడ్‌లైన్ కన్నా ముందే సాధించగలమని పాండా తెలిపారు. ఇందుకోసం పరిశ్రమ టెక్నాలజీని మరింతగా అందిపుచ్చుకోవాలని, వినూత్నంగా ఆలోచించాలని ఆయన చెప్పారు. టెక్నాలజీ ఆధారిత నవకల్పనలతో ఉత్పత్తుల వ్యయాలు తగ్గుతాయని పాండా తెలిపారు. ఈ విషయంలో అందరికీ ఆర్థిక సేవలను అందించే దిశగా బ్యాంకులు చేస్తున్న ప్రయత్నాలను పరిశీలించవచ్చని సూచించారు. ఆఖరు వ్యక్తి వరకూ చేరేందుకు ఆశా, అంగన్వాడీ వర్కర్లు, స్వయం సహాయక బృందాల తోడ్పాటు తీసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశీయంగా 23 జీవిత బీమా సంస్థలు, 33 సాధారణ బీమా సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఫిబ్రవరి నాటికి వాటి నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ రూ. 59 లక్షల కోట్లుగా నమోదైంది. -
నిరుద్యోగులను ఆదుకునేవి ఇవే.. నియామకాల సన్నాహాల్లో స్టార్టప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ దశ స్టార్టప్స్‌లో అత్యధికం ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్లు, పెట్టుబడిదారుల నుండి సేకరించిన అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలు ఇందుకు కారణమని ఫిక్కీ–రాండ్‌స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వే పేర్కొంది. నియామకాల తీరుపై చేపట్టిన ఈ సర్వేలో 300లకుపైగా స్టార్టప్స్ పాలుపంచుకున్నాయి. ‘2023లో కొత్త నియామకాలకు 80.5 శాతం కంపెనీలు సమ్మతి తెలిపాయి. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) ఈ కంపెనీలు సిరీస్–ఏ, సిరీస్–బి నిధులను అందుకున్నాయి. కావాల్సిన మూలధనాన్ని కలిగి ఉన్నాయి. కొత్త ప్రతిభను పొందేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొనసాగిస్తామని 15.78 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొత్త వారిని చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన కంపెనీల్లో ఆరోగ్య సేవలు 13 శాతం, ఐటీ, ఐటీఈఎస్ 10, వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత 8, ఏఐ, ఎంఎల్, డీప్‌టెక్ 7, ఫిన్‌టెక్ 7, తయారీ సంస్థలు 7 శాతం ఉన్నాయి’ అని నివేదిక తెలిపింది. అట్రిషన్‌కు ఇవీ కారణాలు.. స్టార్టప్స్‌లో క్రియాశీలక పని వాతావరణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన శిక్షణా వేదికను అందిస్తోంది. వారు తమ సొంత స్టార్టప్స్‌ను రూపొందించడానికి అడుగు వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పరిశ్రమలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించే మెరుగైన పే ప్యాకేజీలు, అలాగే ఈ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, కెరీర్ పురోగతి, విశ్వసనీయత గురించి స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అధిక అట్రిషన్ రేటుకు కారణమని 54.38 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. అవసరమైన నైపుణ్యాలలో లోటు, జీతం అంచనాలలో అసమతుల్యత, ముప్పు ఉండొచ్చనే ఆందోళనల కారణంగా స్టార్టప్స్‌లో చేరడానికి విముఖత చూపుతున్నారు’ అని నివేదిక వివరించింది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
గ్రామీణ ఎఫ్ఎంసీజీ వినియోగం పుంజుకుంటుంది
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో ఎఫ్ఎంసీజీ అమ్మకాలు రానున్న త్రైమాసికాలలో పుంజుకుంటాయని ఇమామీ వైస్ చైర్మన్, ఎండీ హర్ష వీ అగర్వాల్ అంచనా వేశారు. ద్రవ్యోల్బణం తగ్గడంతో కొన్ని ఉత్పత్తుల ధరలు దిగొచ్చినట్టు చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణ ప్రాంతాల్లో పెట్టుబడుల వ్యయాలతో ఉపాధి కల్పన, అభివృద్ధికి మద్దతునిస్తాయని, అంతిమంగా అది ఎఫ్ఎంసీజీ పరిశ్రమ వృద్ధికి దోహదపడుతుందని వివరించారు. ఫిక్కీ నిర్వహించిన ఓ కార్యక్రమంలో భాగంగా మాట్లాడారు. గత ఐదు త్రైమాసికాల్లో గ్రామీణంగా ఎఫ్ఎంసీజీ పరిశ్రమ మందగమనాన్ని చూస్తోంది. ‘‘మేము ఎంతో ఆశాభావంతో ఉన్నాం. ఇన్ఫ్రా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు డిమాండ్‌ను పెంచుతుంది’’అని అగర్వాల్ పేర్కొన్నారు. డీ2సీ బ్రాండ్లపై పెట్టుబడులు కొనసాగిస్తామని తెలిపారు. -
దేశీ రిటైల్ రంగం @ 2 లక్షల కోట్ల డాలర్లు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రిటైల్ మార్కెట్లలో ఒకటైన భారత్ 2032 నాటికల్లా 2 ట్రిలియన్ (లక్షల కోట్ల) డాలర్ల స్థాయికి చేరుతుందని అంచనాలు నెలకొన్నాయి. గతేడాది ఇది 844 బిలియన్ డాలర్లుగా ఉంది. ఇందులో అసంఘటిత రిటైల్ మార్కెట్ వాటా 87%గా ఉంది. రిలయన్స్ రిటైల్ డైరెక్టర్ సుబ్రమణియం వి. ఈ విషయాలు తెలిపారు. ‘రిటైల్ రంగం ఏటా 10 శాతం వృద్ధితో 2032 నాటికి ఏకంగా 2 ట్రిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. తద్వారా ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా నిలవనుంది‘ అని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వ హించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. అమ్మకాల పరిమాణం తక్కువ స్థాయిలో ఉండటం, ఆర్థిక వనరుల కొరత వంటి సమస్యల కారణంగా అసంఘటిత రిటైల్ రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ వినియోగం ఉండటం లేదని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ సమ్మిళిత, సుస్థిర వృద్ధికి తోడ్పడేలా వ్యాపార నిర్వహణకు అనువైన వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సుబ్రమణియం చెప్పారు. అసంఘటిత రంగంలోని చిన్న వ్యాపారా ల సమ్మిళిత వృద్ధికి సహకరించేలా ప్రభుత్వ పాలసీ లు, బడా కంపెనీల వ్యాపార విధానాలు ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. చిన్న స్థాయి తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ఆధునీకరించుకుని, నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేసేందుకు దోహదపడే విధమైన కొనుగోళ్ల వ్యవస్థను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లైసెన్సింగ్ విధానం మెరుగుపడాలి .. రిటైల్ రంగానికి లైసెన్సింగ్ వంటి అంశాలపరంగా సమస్యలు ఉంటున్నాయని సుబ్రమణియన్ చెప్పారు. ప్రస్తుతం ఒక రిటైల్ స్టోర్ ప్రారంభించాలంటే 10 నుంచి 70 వరకు లైసెన్సులు తీసుకోవాల్సి వస్తోందని ఆయన చెప్పారు. ఇలా వివిధ లైసెన్సుల అవసరం లేకుండా వ్యాపార సంస్థకు ఒకే లైసెన్సు సరిపోయేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవచ్చని తెలిపారు. మరోవైపు దేశీయంగా సరఫరా వ్యవస్థపరమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడానికి మరిన్ని పెట్టుబడులు అవసరమని సుబ్రమణియన్ తెలిపారు. ప్రధానమైన సోర్సింగ్ ప్రాంతాలను అవసరానికి తగినట్లు విస్తరించుకోగలిగేలా గిడ్డంగులు, లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానించాలని ఆయన చెప్పారు. తద్వారా సోర్సింగ్‌కు పట్టే సమయం తగ్గుతుందని, ఉత్పత్తుల రవాణా కూడా వేగవంతం కాగలదని పేర్కొన్నారు. ఇటు స్టోర్స్‌లోనూ, అటు ఈ–కామర్స్లోను కృత్రిమ మేథ, మెషిన్ లెర్నింగ్స్ వంటి అధునాతన సాంకేతికతల వినియోగం రిటైల్ రంగంలో క్రమంగా పెరుగుతోందని సుబ్రమణియన్ వివరించారు. 5జీ రాకతో ఇది మరింతగా పుంజుకోగలదని పేర్కొన్నారు. రిటైల్, ఈ–కామర్స్ పాలసీలపై కేంద్రం కసరత్తు డీపీఐఐటీ సంయుక్త కార్యదర్శి సంజీవ్ దేశీయంగా రిటైల్ రంగం వృద్ధికి ఊతమిచ్చే దిశగా జాతీయ స్థాయిలో రిటైల్ వాణిజ్యం, ఈ–కామర్స్ విధానాలను రూపొందించడంపై కేంద్రం కసరత్తు చేస్తోంది. వ్యాపారాల నిర్వహణకు అనువైన పరిస్థితులు, ఆధునిక మౌలిక సదుపాయాలు, మెరుగైన రుణ లభ్యత మొదలైన వాటి రూపంలో భౌతిక స్టోర్స్‌ను నిర్వహించే వ్యాపార వర్గాలకు ఇది తోడ్పాటునిచ్చే విధంగా ఉంటుందని పారిశ్రామిక, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) సంయుక్త కార్యదర్శి సంజీవ్ తెలిపారు. అటు ఆన్లైన్ రిటైలర్ల కోసం కూడా ఈ–కామర్స్ పాలసీని రూపొందిస్తున్నట్లు ఆయన వివరించారు. రిటైల్ ట్రేడర్ల కోసం ప్రమాద బీమా పథకంపైనా కసరత్తు జరుగుతోందని, ప్రధానంగా చిన్న ట్రేడర్లకు ఇది సహాయకరంగా ఉండగలదని ఎఫ్ఎంసీజీ, ఈ–కామర్స్‌పై సదస్సులో పాల్గొన్న సందర్భంగా సంజీవ్ చెప్పారు. భౌతిక, ఆన్లైన్ రిటైల్ వాణిజ్యం రెండింటి మధ్య వైరుధ్యమేమీ లేదని, ఒకటి లేకుండా రెండోది మనలేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ (ఓఎన్డీసీ)తో ఈ–కామర్స్ వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయని, కొన్ని ఈ–కామర్స్ దిగ్గజాల గుత్తాధిపత్యానికి బ్రేక్ పడుతుందని సంజీవ్ వివరించారు. నాణ్యతలేని ఉత్పత్తుల దిగుమతులను తగ్గించుకునే లక్ష్యంతో వివిధ ఉత్పత్తులకు నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించడంపై కేంద్రం దృష్టి సారిస్తోందని ఆయన చెప్పారు. -
విండ్‌ఫాల్ ట్యాక్స్ రద్దు చేయండి
న్యూఢిల్లీ: దేశీయంగా ఉత్పత్తి అయిన ముడి చమురుపై విండ్‌ఫాల్ ప్రాఫిట్ టాక్స్‌ను 2023–24 వార్షిక బడ్జెట్లో రద్దు చేయాలని కేంద్రానికి పరిశ్రమల వేదిక– ఫిక్కీ తన ప్రీ–బడ్జెట్ కోర్కెల మెమోరాండంలో విజ్ఞప్తి చేసింది. ఈ పన్ను విధింపు చమురు, గ్యాస్ అన్వేషణకు సంబంధించిన పెట్టుబడులకు ప్రతికూలమని తన సిఫారసుల్లో పేర్కొంది. భారతదేశం 2022 జూలై 1వ తేదీన విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధానాన్ని ప్రవేశపెట్టింది. తద్వారా అంతర్జాతీయంగా ధరల పెరుగుదల వల్ల ఇంధన కంపెనీలకు అనూహ్యంగా వచ్చే భారీ లాభాలపై పన్ను విధిస్తున్న పలు దేశాల సరసన చేరింది. తొలుత దేశీయ ముడిచమురు ఉత్పత్తిపై టన్నుకు రూ.23,250 (బ్యారెల్‌కు 40 డాలర్లు) విండ్‌ఫాల్ ప్రాఫిట్ ట్యాక్స్ విధింపు జరిగింది. పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ ఎగుమతులపై కూడా కొత్త పన్ను అమలు జరుగుతోంది. అంతర్జాతీయ చమురు ధరలకు అనుగుణంగా ప్రతి పదిహేను రోజులకు ఈ పన్ను మదింపు, నిర్ణయం జరుగుతోంది. అటువంటి లెవీ ప్రస్తుతం ఉన్న అన్ని ఇతర పన్నులకు అదనం. ఇంధన రంగానికి సంబంధించి ఫిక్కీ తాజా నివేదికలో ముఖ్యాంశాలు.. ► పెట్రోలియం క్రూడ్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ (ఎస్ఏఈడీ)ని కూడా రద్దు చేయాలి. లేదా అసాధారణ చర్యగా కొంత కాలం లెవీని కొనసాగించాల్సిన అవసరం ఉన్నట్లయితే, ఆ రేటును యాడ్–వాల్రెమ్ లెవీగా మార్చాలి. ఇది 100 డాలర్లపైన పెరిగే క్రూడ్ ధరలో 20 శాతంగా ఉండాలి. ► రాయల్టీ (ఆన్‌షోర్ ఫీల్డ్‌లకు చమురు ధరలో 20%, ఆఫ్‌షోర్ ప్రాంతాలకు 10%) అలాగే చమురు పరిశ్రమ అభివృద్ధి (ఓఐడీ) సెస్ (చమురు ధరలో 20%) ఇప్పటికే భారం అనుకుంటే, విండ్‌ఫాల్ పన్ను ఈ భారాన్ని మరింత పెంచుతోంది. ► విండ్‌ఫాల్ టాక్స్ వాస్తవ ధరపై కాకుండా, టన్ను ఉత్పత్తిపై మదింపు జరుగుతోంది. దీనివల్ల ధరలు తగ్గినప్పుడు ఉత్పత్తిదారులను దెబ్బతీస్తోంది. ప్రపంచ ప్రమాణాలు పాటించాలి.. ప్రస్తుతం దేశీయ ముడి చమురు ఉత్పత్తిదారులపై దాదాపు 70% పన్ను విధిస్తున్నారు. ప్రపంచ ప్రమాణాల ప్రకారం, 35–40% పన్ను మాత్రమే విధించాలి. ఈ రంగంలో కీలక పెట్టుబడులకు ఇది పన్ను దోహదపడుతుంది. ఇంధన రంగానికి మద్దతు ఇవ్వడానికి, అస్థిర ప్రపంచ ముడి మార్కెట్ల నుండి దేశాన్ని రక్షించడానికి కీలకమైన విధాన సంస్కరణలు తెచ్చేందుకు ఈ బడ్జెట్ మంచి అవకాశం. – సునీల్ దుగ్గల్, వేదాంత గ్రూప్ సీఈఓ -
మన సైనికులకు సెల్యూట్: రాజ్‌నాథ్
న్యూఢిల్లీ: జగడాల చైనాతో సరిహద్దు వెంట ఆ దేశ సైనికుల చొరబాటు యత్నాలను విజయవంతంగా అడ్డుకుంటూ భారత సైనికులు చూపించిన ధైర్యసాహసాలకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ ఘన కీర్తులందించారు. పరిశ్రమల సమాఖ్య(ఫిక్కీ) ఆధ్వర్యంలో జరిగిన ‘‘ఇండియా @ 100 : అమృతకాలం: సస్టెయినబుల్, ఇన్‌క్లూజివ్’’ అనే కార్యక్రమంలో రాజ్‌నాథ్ ప్రసంగించారు. ‘ ప్రపంచం మరింత పురోగమించాలంటే భారత్ బలీయశక్తి(సూపర్ పవర్)గా ఎదగాలి. సూపర్‌పవర్‌గా ఎదగడమంటే ప్రపంచదేశాలపై ఏకఛత్రాధిపత్యం కాదు. వేరే దేశాల ఒక్క అంగుళం భూభాగాన్ని కూడా భారత్ ఆక్రమించుకోబోదు. ప్రపంచ శ్రేయస్సే పరమావధిగా పనిచేస్తాం. ప్రపంచం మా కుటుంబమే. అంతేగాని సూపర్ పవర్ అంటే సామ్రాజ్య విస్తరణ కాదు’ అని చైనాను పరోక్షంగా విమర్శించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సేలో చైనా సైనికుల చొరబాటు యత్నాన్ని భారత సైనికులు భగ్నంచేసిన అంశాన్ని రాజ్‌నాథ్ ప్రస్తావించారు. ‘ గాల్వాన్, తవాంగ్లలో మన సైనికుల తెగువ, దేశభక్తి, ధైర్యసాహసాలను ఎంత గొప్పగా పొగిడినా తక్కువే అవుతుంది. ఇక సరిహద్దు వెంట చైనాతో యుద్దముప్పు పొంచి ఉన్నా, మోదీ సర్కార్ మొద్దు నిద్ర పోతోందంటూ విపక్ష నేతలు చేస్తున్న ప్రకటనలు పూర్తిగా నిరాధార ఆరోపణలు. జీఎస్టీ, ఉత్పత్తి ఆధారిత రాయితీ పథకం, సాగు సంస్కరణలు ఇలా ప్రతీ ప్రభుత్వ విధాననిర్ణయాలను విపక్షాలు తప్పుబట్టే ధోరణి ఆరోగ్యవంత ప్రజాస్వామ్యానికి శుభసూచకం కాదు’ అని రాజ్‌నాథ్ విమర్శించారు. ‘ 1980ల వరకు ఆర్థికాభివృద్ధి విషయంలో చైనా, భారత్ ఒకే వేగంతో ముందుకెళ్లాయి. 1991లో భారత్‌లో ఆర్థిక సంస్కరణలు ఊపందుకున్నాయి. కానీ చైనా దాదాపు అన్ని దేశాలను వెనక్కి నెట్టి లాంగ్ జంప్ చేసి అభివృద్ధిలో ముందుకు దూసుకుపోయింది. మళ్లీ 21వ శతాబ్దంలో జరగాల్సిన స్థాయిలో భారత్‌లో అభివృద్ధి వేగంగా జరగలేదు. 2014లో మోదీ ప్రభుత్వం కొలువుతీరాకే మళ్లీ అభివృద్ధి శకం ఆరంభమైంది. గతంలో ఆర్థికవ్యవస్థ పరంగా పెళుసు దేశాలుగా అపకీర్తి మూటగట్టుకున్న ‘టర్కీ, బ్రెజిల్, దక్షిణాఫ్రికా, ఇండోనేసియాల’ జాబితాలో ఉన్న మన దేశం ఇప్పుడు ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగిందన్నారు. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న సరకు రవాణా గొలుసు అతుక్కునేలోపే ఉక్రెయిన్ యుద్ధం దానిని దారుణంగా దెబ్బకొట్టిందని అందుకే ద్రవ్యోల్బణ సమస్య దాపురించిందన్నారు. -
పరిశ్రమకు భరోసా: ఎంఎస్ఎంఈ ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత ముఖ్యమైన మూల స్తంభాలని ఆ శాఖ సహాయమంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ సోమవారం పేర్కొన్నారు. ఈ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి, మరింత అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడ్డానికి కేంద్రం తగిన చర్యలు అన్నింటినీ తీసుకుంటుందని అన్నారు. ఎంఎస్ఎంఈ రంగంపై ఫిక్కీ నిర్వహించన వార్షిక సదస్సులో ఆయన ఈ మేరకు చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు.. ⇒ భారతదేశాన్ని స్వావలంబన సాధనకు, అలాగే 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎకానమీని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వంతో పరిశ్రమ, సంబంధిత వర్గాలు కలిసి పని చేయాలి. ⇒ దేశంలో 6.3 కోట్ల సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఉన్నాయి. వాటి ద్వారా 11 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నాం. ⇒ ఎంఎస్ఎంఈలు మన భారత్ జీడీపీ విలువలో దాదాపు 30 శాతం వాటాను అందిస్తున్నాయి. మొత్తం ఎగుమతుల ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ⇒ దేశంలో ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం నిరంతర చర్యలు తీసుకుంటుంది. గత ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించిన పీఎంఈజీపీ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం) ఈ దిశలో ఒక ముందడుగు. ఈ పథకం కింద 2021–22 ఆర్థిక సంవత్సరంలో తయారీ, సేవల రంగంలో మొత్తం 1.03 లక్షల కొత్త యూనిట్లు ఏర్పాటయ్యాయి. ⇒ ఎంఎస్ఎంఈల పూర్తి సామర్థ్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థకు ఈ రంగం సహకారం రెట్టింపయ్యేలా ప్రభుత్వం కృషి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో ఈ రంగానికి ఎదరవుతున్న సవాళ్లను తగ్గించడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది. ⇒ యువత పారిశ్రామికవేత్తలుగా మారే సంస్కృతిని పెంపొందించడానికి, ఎంఎస్ఎంఈలకు రుణాలు అందించడానికి, వారి నాణ్యతను మెరుగుపరచడానికి, వారి సామర్థ్యాన్ని పెంచడానికి, వారి పోటీతత్వాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రభుత్వం తగిన కృషి చేస్తోంది. ⇒ ఇప్పటికే ఉన్న అలాగే కొత్త ఎంఎస్ఎంఈలకు మద్దతు ఇవ్వడానికి వాటిని బలోపేతం చేయడానికి మా మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ సాంకేతిక కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ⇒ దీనితోపాటు ‘జెడ్ఈడీ’ సర్టిఫికేషన్ పథకం (టెక్నాలజీ అప్‌గ్రేడేషన్– క్వాలిటీ సర్టిఫికేషన్ అందించడానికి ఉద్దేశించిన), నాణ్యత ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి ‘ఏఎస్పీఐఆర్ఈ’ డిజైన్ క్లినిక్ మొదలైన వాటి కింద ఎంఎస్ఎంఈలకు సహాయం చేయడానికి ప్రభుత్వం ఇతర సంస్థలతో కలిసి పని చేస్తోంది. ⇒ ప్రభుత్వం చాంపియన్ పోర్టల్‌ను కూడా ప్రారంభించింది, ఇది ఒకే చోట అన్ని పరిష్కారాలను అందిస్తుంది. ఎంఎస్ఎంఈలను మరింత పోటీగా మార్చడానికిసైతం పోర్టల్‌ను దోహదపడేలా చర్యలు తీసుకుంటున్నాం. ఈ పథకాల ద్వారా ఎంఎస్ఎంఈలు మరింత స్థిరంగా ఉంటాయని మేము ఆశిస్తున్నాము. ఈ రంగం పురోగతి అవశ్యం:స్వైన్ కార్యక్రమంలో ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి బీబీ స్వైన్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రంగం స్థిరమైన అభివృద్ధికి ఆర్థిక, సాంకేతిక పరమైన చేయూత అవసరమని అన్నారు. ‘రైసింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పనితీరు’ (ఆర్‌ఏఎంపీ) కింద ఈ రంగం ఎదుర్కొంటున్న సమస్యలకు సమన్వయంగా సహకారాన్ని అందించడానికి, ఇందుకు తగిన ప్రణాళిక రూపకల్పనకు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తోందని వివరించారు. ఈ రంగం పురోగతి దిశలో 2020లో ప్రారంభించబడిన సెల్ఫ్ రిలయన్ట్ ఇండియా ఫండ్ ఇప్పటి వరకు 125 సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రూ.2,335 కోట్ల విలువైన వృద్ధి సంబంధ మూలధనాన్ని అందించిందని తెలియజేశారు. ఈ రంగం కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌ను పునరుద్ధరించడం, ఉద్యామ్, ఇ-శ్రామ్, నేషనల్ కెరీర్ సర్వీస్, ఏఎస్ఈఈఎం పోర్టల్‌ల పూర్తి స్థాయి ఏకీకరణ వంటి కార్యక్రమాల కోసం ప్రణాళిక రూపకల్పన జరుగుతోందన్నారు. సాంకేతిక కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ సమాచార వ్యవస్థ, జాతీయ ఎంఎస్ఎంఈ పాలసీని రూపొందించడం, జెడ్ఈడీ ధృవీకరణ ద్వారా సమస్యలను పరిష్కరించడం, ఎంఎస్ఎంఈ చెల్లింపు సమస్యలను తొలగించడం వంటి చర్యలకూ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. ఎంస్ఎంఈలకు మద్దతుగా ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరిస్తూ, వర్గీకరణలో అప్‌గ్రేడేషన్ విషయంలో ప్రభుత్వం పన్నుయేతర ప్రయోజనాలను 3 సంవత్సరాల పాటు పొడిగించిందని స్వైన్ పేర్కొన్నారు. ఎకానమీలో కీలక పాత్ర ఎంఎస్ఎంఈ రంగం సామర్థ్యం చాలా విస్తృతమైనది. భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఈ రంగం మరింత కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నాం. ఎకానమీ విలువలో ఈ రంగం వాటా 40-45 శాతంగా ఉండాలని మేము ఆశిస్తున్నాం- ఆర్ నారాయణ్, ఎఫ్ఐసీసీఐ(సీఎంఎస్ఎంఈ ప్రెసిడెంట్) -
Ficci survey: తయారీ రంగానికి వచ్చే 9 నెలలూ ఢోకా లేదు
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం వచ్చే ఆరు నెలల కాలంలో కూడా పటిష్ట వృద్ధి బాటన పయనిస్తుందని పారిశ్రామిక వేదిక ఫిక్కీ త్రైమాసిక సర్వే పేర్కొంది. ఈ విభాగం ప్రస్తుత సగటు సామర్థ్య వినియోగం 70 శాతం అని పేర్కొన్న సర్వే, ఇది ఈ రంగం సుస్థిర క్రియాశీలతను సూచిస్తోందని తెలిపింది. భవిష్యత్ పెట్టుబడుల అవుట్‌లుక్ కూడా మెరుగుపడిందని పేర్కొంటూ, సర్వేలో పాల్గొన్న దాదపు 40 శాతం మంది వచ్చే ఆరు నెలల్లో సంస్థల సామర్థ్య విస్తరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించింది. సవాళ్లూ ఉన్నాయ్... అయితే విస్తరణ ప్రణాళికలకు అధిక ముడిసరుకు ధరలు, పెరిగిన రుణ వ్యయాలు, తగిన విధంగా లేని నిబంధనలు, అనుమతుల విధానాలు, వర్కింగ్ క్యాపిటల్ కొరత, పెరుగుతున్న ఇంధన ధరలు, షిప్పింగ్ లేన్ల నిరోధం కారణంగా అధిక లాజిస్టిక్స్ ఖర్చు, తక్కువ దేశీయ– గ్లోబల్ డిమాండ్, భారతదేశంలోకి చౌక దిగుమతులు అధికం కావడం, అస్థిర మార్కెట్, ఇతర సప్లై చైన్ అంతరాయాలు అడ్డంకుగా ఉన్నాయని సర్వేలో ప్రతినిధులు పేర్కొన్నారు. 10 ప్రధాన రంగాలు ప్రాతిపదిక 10 ప్రధాన రంగాలకు చెందిన 300 భారీ, మధ్య, చిన్న తరహా పతయారీ యూనిట్ల ప్రతినిధుల (ఆటోమోటివ్– ఆటో కాంపోనెంట్స్, క్యాపిటల్ గూడ్స్, సిమెంట్, కెమికల్స్ ఫెర్టిలైజర్స్, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్, మెషిన్ టూల్స్, మెటల్–మెటల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్రొడక్ట్స్, టెక్స్టైల్స్– టెక్స్టైల్ మిషనరీ) అభిప్రాయాల ప్రాతిపదికన ఈ సర్వే జరిగింది. సర్వేలో పాల్గొన్న సంస్థల వార్షిక టర్నోవర్ రూ.2.8 లక్షల కోట్లు. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ప్రకారం తయారీ రంగం పటిష్టంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన సూచీ అక్టోబర్ వరకూ గడచిన 16 నెలల కాలంలో వృద్ధి బాటలోనే నడుస్తోంది. భారత్ స్థూల దేశీయోత్పత్తిలో పారిశ్రామిక రంగం వాటా దాదాపు 15 శాతం ఉంది.ఈ రంగంలో ఒక్క తయారీ రంగం వాటా 70 శాతం. తయారీ రంగ కంపెనీలు అదనంగా ఉద్యోగులను తీసుకోవడం పట్ల సానుకూల అంచనాలతో ఉన్నాయని ఇటీవల విడుదలైన టీమ్‌లీజ్ సర్వీసెస్ ‘ఎంప్లాయిమెంట్ అవుట్‌లుక్ రిపోర్ట్ కూడా వెల్లడించింది. 57 శాతం కంపెనీలు అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో ఉద్యోగులను నియమిచుకోనున్నట్టు పేర్కొన్నట్లు నివేదిక వెల్లడించింది. -
నైపుణ్యాల శిక్షణపై పెట్టుబడులు పెట్టండి
న్యూఢిల్లీ: కార్మికుల్లో శిక్షణ, నైపుణ్యాభివృద్ధికి పెట్టుబడులు పెట్టాలని పరిశ్రమలను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కోరారు. నైపుణ్యాలు, విద్యను ప్రోత్సహించడానికి విధాన కర్తలు, విద్యా వంతులు, పరిశ్రమ కలసికట్టుగా పనిచేయాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. ఫిక్కీ నిర్వహించిన అంతర్జాతీయ నైపుణ్య సదస్సును ఉద్దేశించి మంత్రి ప్రధాన్ మాట్లాడారు. రెండు చేతులతోనే చప్పట్లు సాధ్యపడుతుందని చెబుతూ.. నైపుణ్యాభివృద్ధికి అందరు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. పనివారిలో నైపుణ్యాల పెంపునకు పరిశ్రమ భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ‘‘శిక్షణ ఇచ్చేవారు, లబ్ధిదారులే కనిపిస్తున్నారు. కానీ, పరిశ్రమల భాగస్వామ్యం ఎక్కడికి పోయింది? అని ప్రశ్నించారు. భారత్‌ను ప్రపంచానికి తయారీ కేంద్రంగా చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని గుర్తు చేస్తూ.. నిపుణులైన మానవవనరులు ఉన్నప్పుడే ఈ లక్ష్యం సాకరమవుతుందన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం పరిశ్రమలకు ఎన్నో ప్రోత్సాహకాలు ఇస్తోందని చెప్పారు. నైపుణ్యాల శిక్షణకు కూడా నిధులు ఖర్చు చేస్తోందని చెబుతూ.. పరిశ్రమలు కూడా ముందుకు రావాలని కోరారు. -
తెలంగాణ పోలీస్‌కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్ శాఖకు 2021–స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు. -
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉమా చిగురుపాటి ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా అనుభవమున్న శుభ్రా .. ప్రస్తుతం బ్లూస్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టరుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మొదలైన వాటితో పాటు 300 పైచిలుకు కార్పొరేట్ సంస్థలకు ఆమె సీఏగా సేవలు అందించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా శుభ్రా మహేశ్వరి తెలిపారు. 2022–23 సంవత్సరానికి గాను ఎఫ్ఎల్వో గౌరవ కార్యదర్శిగా గుంజన్ సింధీ, ట్రెజరర్‌గా నిషిత మన్నె, గౌరవ జాయింట్ సెక్రటరీగా శిల్ప రాజు, జాయింట్ ట్రెజరర్‌గా మాయా పటేల్ నియమితులయ్యారు. -
లక్ష కోట్లు దాటుతోంది.. ఇంకా లైట్ తీసుకుంటే ఎలా ?
న్యూఢిల్లీ: టీవీ, న్యూస్‌పేపర్, వెబ్సైట్, వీడియో కంటెంట్ సైట్ ఏదైనా సరే అడ్వెర్టైజ్మెంట్ కనిపించిందంటే చాలు వెంటనే ఛానల్ మార్చడంతో, పేపర్ తిప్పడంలో స్కిప్ బటన్ నొక్కడమో చేస్తాం. జనాలు పెద్దగా యాడ్స్‌పై దృష్టి పెట్టకున్నా ప్రకటనల విభాగం మాత్రం ఊహించని స్థాయి వృద్ధి కనబరుస్తోంది. మరో రెండేళ్లలో లక్ష కోట్ల మార్క్‌ను దాటేయనుంది. లక్ష కోట్లు ప్రకటనల రంగం దేశంలో 2024 నాటికి రూ.1 లక్ష కోట్లకు చేరుతుందని ఈవై–ఫిక్కీ నివేదిక వెల్లడించింది. వార్షిక వృద్ధి 12 శాతం నమోదవుతుందని తెలిపింది. ‘ప్రకటనల రంగ ఆదాయం 2019లో రూ.79,500 కోట్లు. పరిశ్రమ 2020లో 29 శాతం తిరోగమనం చెందింది. కోవిడ్–19 ఆటంకాలు ఉన్నప్పటికీ ఈ రంగం తిరిగి పుంజుకుని 2021లో ఆదాయం 25 శాతం అధికమై రూ.74,600 కోట్లను దక్కించుకుంది. ఈ ఏడాది 16 శాతం వృద్ధితో రూ.86,500 కోట్లకు చేరనుంది. ఆ రెండు కలిపితే భారత మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం గతేడాది 16.4 శాతం పెరిగి రూ.1.61 లక్షల కోట్లు నమోదు చేసింది. ఈ ఏడాది 17 శాతం వృద్ధితో రూ.1.89 లక్షల కోట్లను తాకి మహమ్మారి ముందు స్థాయికి చేరుకుంటుంది. 2024 నాటికి ఏటా 11 శాతం పెరిగి రూ.2.32 లక్షల కోట్లు నమోదు చేస్తుంది. నంబర్ వన్ టీవీనే టెలివిజన్ అతిపెద్ద సెగ్మెంట్‌గా మిగిలిపోయినప్పటికీ డిజిటల్ మీడియా బలమైన నంబర్–2గా దాని స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ముద్రణ విభాగం పుంజుకుని మూడవ స్థానంలో నిలిచింది. డిజిటల్ మీడియా వాటా 2019లో 16 శాతం కాగా, గతేడాది 19 శాతానికి ఎగబాకింది. మీడియా, వినోద రంగంలో టీవీ, ప్రింట్, చిత్రీకరించిన వినోదం, ఔట్‌డోర్ ప్రకటనలు, సంగీతం, రేడియో వాటా 68 శాతముంది. 2019లో ఇది 75 శాతం నమోదైంది. సినిమా థియేటర్లలో ప్రకటనలు, టీవీ చందాలు మినహా మీడియా, వినోద పరిశ్రమలో 2021లో అన్ని విభాగాల ఆదాయాలు పెరిగాయి. -
ఇంధన పొదుపునకు ‘ఫిక్కీ’ సాయం
సాక్షి, అమరావతి: ఏపీ అమలు చేస్తున్న ఇంధన పొదుపు చర్యలను గుర్తించిన కేంద్రం.. వాటికి మరింత ఊతమిచ్చేందుకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ)ని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. పెర్ఫార్మ్ అచీవ్ అండ్ ట్రేడ్ (పాట్) పథకం కింద పారిశ్రామిక రంగంలో ఇంధన సామర్థ్య చర్యలను అమలు చేయడంలో ఏపీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. దీనిని గుర్తించిన బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) రాష్ట్రంలో ఇంధన పొదుపు చర్యలకు మరింత ఊతమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నిర్దేశించుకున్న ఇంధన సామర్థ్య లక్ష్యాలను సాధించేందుకు, పాట్ కార్యకలాపాల పర్యవేక్షణకు ఫిక్కీ సహకారం అందించనుంది. రాష్ట్రంపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఇంధన సామర్థ్యాన్ని పెంపొందించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశంగా బీఈఈ చెబుతోంది. లక్ష్యాన్ని చేరుకునేలా.. దేశవ్యాప్తంగా 2070 నాటికి కర్బన ఉద్గారాలను లేకుండా చేయాలనే లక్ష్యంలో భాగంగా 2030 నాటికి ఒక బిలియన్ టన్నుల ఉద్గారాలను తగ్గించాలని, అందులో మన రాష్ట్రం 2030 నాటికి 6.68 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ ఇంధనాన్ని ఆదా చేయాలని బీఈఈ నిర్దేశించింది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కోసం రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న రంగాలతోపాటు కొత్త రంగాల్లోని వినియోగదారులను గుర్తించడంలో ఫిక్కీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ (ఏపీఎస్ ఈసీఎం) తోడుగా నిలుస్తుంది. ఫిక్కీ ఇతర రాష్ట్రాలు, దేశాలు అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులు, కొత్త సాంకేతికతలను అధ్యయనం చేసి ఏపీకి అన్వయిస్తుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ సహకారంతో పాట్ పథకం సైకిల్–1లో దాదాపు రూ.1,600 కోట్ల విలువైన 2,386 మిలియన్ యూనిట్ల ఇంధనానికి సమానమైన దాదాపు 0.20 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ మేర ఇంధనాన్ని పొదుపు చేయగలిగింది. సైకిల్–2లో దాదాపు రూ.2,356.41 కోట్ల విలువైన 3,430 మిలియన్ యూనిట్లకు సమానమైన 0.295 మిలియన్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ను ఆదా చేసింది. పాట్ పథకం ప్రస్తుతం 13 రంగాల్లో 1,073 డీసీల (భారీ ఇంధనం ఉపయోగించే పరిశ్రమల)ను కవర్ చేస్తుంది. ఇవి పారిశ్రామిక ఇంధన వినియోగంలో సగం మాత్రమే. కనీసం 80 శాతాన్ని కవర్ చేయడానికి ఈ పథకంలో రవాణా, విమాన యానం, ఆస్పత్రులు, విశ్వవిద్యాలయాలు, షిప్పింగ్ వంటి అదనపు రంగాలను బీఈఈ చేర్చింది. వేగంగా ‘పాట్’ అమలు దేశంలోని మొత్తం ఇంధనంలో 40 శాతం పారిశ్రామిక రంగం మాత్రమే వినియోగిస్తోంది. భవిష్యత్‌లో ఈ రంగంలో ఇంధన వినియోగం భారీగా పెరగనుంది. ఈ నేపథ్యంలో ఏపీ వంటి రాష్ట్రాల్లో వేగంగా పాట్ పథకాన్ని అమలు చేయడంలో సహకారం అందించేందుకు ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా నియమించింది. – అభయ్ భాక్రే, డైరెక్టర్ జనరల్, బీఈఈ ఫిక్కీ సహకారం శుభపరిణామం పారిశ్రామిక రంగానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. పరిశ్రమల్లో ఇంధన పొదుపు కార్యక్రమాల అమలులో ఏపీకి మద్దతిస్తూ.. ఫిక్కీని ఎక్స్పర్ట్ ఏజెన్సీగా బీఈఈ నియమించడం శుభపరిణామం. – బి. శ్రీధర్, కార్యదర్శి, ఇంధన శాఖ -
కేసులు పెరిగితే ఆంక్షలు విధించకండి.. కేంద్రానికి ఫిక్కీ విజ్ఞప్తి!
న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్-19 థర్డ్ వేవ్ విజృంభన, కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం, ప్రభుత్వాల ఆంక్షలు మొదలుకావడం వంటి అంశాల నేపథ్యంలో పారిశ్రామిక మండలి-ఫిక్కీ కేంద్రానికి కీలక విజ్ఞప్తి చేసింది. ఆంక్షలు విధించడానికి మొత్తం కేసుల సంఖ్య పెరుగుదలను, పాజిటివ్ రేటును కాకుండా, ఆసుపత్రుల్లో చేరికల సంఖ్యేనే ప్రాతిపదికగా తీసుకోవాలని కోరింది. ప్రత్యేకించి క్రిటికల్ కేర్ బెడ్స్, ఆక్సిజన్ లభ్యత వంటి అంశాలను ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాని కోరింది. ఫిక్కీ ప్రెసిడెంట్, ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ హెడ్ సంజయ్ మెహతా ఈ మేరకు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియాకు ఒక లేఖ రాశారు. లేఖలో కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ప్రైవేట్ కార్యాలయాల ఉద్యోగులను ఇంటి నుండి పని చేయమని చెప్పడం నుంచి సినిమా హాళ్లను మూసివేయడం-రెస్టారెంట్లలో భోజనం చేయడం వరకు పలు ఆంక్షలను స్థానికంగా అధికారులు విధిస్తున్నారు. దీని ప్రభావంపై భారత్ కార్పొరేట్ రంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది. అసలే బలహీనంగా ఉన్న ఆర్థిక రికవరీపై ఈ ఆంక్షలు తదుపరి మరింత ప్రభావాన్ని చూపుతాయి. ప్రస్తుతం దాదాపు 14 రోజుల వరకూ ఉన్న హోమ్ క్వారంటైన్ కాల పరిమితిని 5 రోజులకు తగ్గించండి. మొత్తం జనాభాకు బూస్టర్ డోస్ తప్పనిసరి చేయండి. 12 సంవత్సరాల పిల్లలనూ వ్యాక్సినేషన్ పరిధిలోనికి తీసుకుని రావాలి. అందుతున్న డేటా ప్రకారం చాలా మంది రోగులు 3-5 రోజులలోపు కోలుకునే పరిస్థితి ఉంది. అందువల్ల వ్యక్తిగత క్వారంటైన్ కాలపరిమితిని ఐదు రోజులకు పరిమితం చేయాలి. ఆరోగ్య సంరక్షణ కార్మికుల విషయంలో ఈ నిర్ణయం ఎంతో కీలకం. ఎందుకంటే ఎక్కువ కాలం క్వారంటైన్లో ఉండే పరిస్థితి ఉంటే, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొనే కార్మికుల కొరత వంటి క్లిష్ట సమస్యలు ఎదురుకావచ్చు. అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు తక్కువ క్వారంటైన్ సమయం పాటిస్తుండడం గమనార్హం. సవాళ్లను ఎదుర్కొనగలిగే స్థాయిలో ఆరోగ్య రంగానికి సంబంధించి మౌలిక వ్యవస్థ పెంచాలి. హాస్పిటలైజేషన్, క్రిటకల్ కేర్ బెడ్స్, ఆక్సిజన్ లభ్యత ప్రాతిపదికన ఆంక్షలు దాదాపు స్థానికంగా పరిమితమయ్యేలా చర్యలు తీసుకోవాలి. జీవితాలు-జీవనోపాధిని సమతుల్యం చేసే ప్రధాన ధ్యేయంతో జాతీయ స్థాయిలో తగిన సమన్వయ వ్యూహం ఉండాలి. రాష్ట్రం, నగరం, మునిసిపాలిటీ.. అన్నిచోట్లా ఒకేవిధమైన ఆంక్షలు మహమ్మారిని వ్యాప్తిని అరికట్టడానికి దోహదపడవు. పైగా ఆర్థిక రికవరీకి ఇబ్బందిగా మారతాయి. మహమ్మారి తీవ్రంగా ఉన్న ప్రాంతాల్లోనే ప్రత్యేక దృష్టి అవసరం. ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి కారణంగా ఇటీవలి కేసుల పెరుగుదల ఆందోళన కలిగిస్తోంది. అయితే శాస్త్రీయ హేతుబద్ధత, తగిన డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం, వ్యాక్సినేషన్ విస్తృతి వంటి చర్యలతో భారతదేశం కోవిడ్–19కి వ్యతిరేక పోరాటంలో మరోసారి విజయం సాధించగలదని పరిశ్రమ విశ్వసిస్తోంది. అంతా ఒకే గాటన కట్టవద్దు: సీఐఐ మహమ్మారిని అరికట్టడానికి అన్ని ప్రాంతాలనూ ఒకే గాటన కట్టరాదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఒక ప్రత్యేక ప్రకటనలో రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసింది. అంటువ్యాధిని అరికట్టడానికి ‘మైక్రో-కంటైన్మెంట్ వ్యూహాన్ని’ అవలంభించాలని, మిగిలిన ప్రాంతాన్ని సాధారణ ఆర్థిక కార్యకలాపాలకు అనుమతించాలని విజ్ఞప్తి చేసింది. (చదవండి: రుణాలు తీర్చాల్సిన బాధ్యత టెల్కోలదే: కేంద్ర మంత్రి వైష్ణవ్) -
భౌతిక–డిజిటల్ విధానాల కలయిక తప్పనిసరి
న్యూఢిల్లీ: ఫైనాన్షియల్ సేవలకు సంబంధించి భారత్‌లో భౌతిక (ఫిజికల్), డిజిటల్ విధానాల మేలు కలయిక తప్పనిసరని బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్మన్ దినేష్ ఖారా స్పష్టం చేశారు. విస్తృత భౌగోళిక అంశాలు దీనికి కారణంగా ఉంటాయని ఆయన అన్నారు. ‘ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా భారత్ ఆర్థిక వ్యవస్థ పయనం దిశలో సవాళ్లు– పరిష్కారాలు’ అన్న అంశంపై ఫిక్కీ, ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ (ఐబీఏ) సంయుక్తంగా నిర్వహించిన ఎఫ్‌ఐబీఏసీ 2021 వర్చువల్ సమావేశాల్లో చైర్మన్ చేసిన ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు.. ► భారతదేశంలో బ్యాంకింగ్ పలు రకాల వినియోగదారులకు సేవలను అందిస్తోంది. మేము డిజిటల్ అవగాహన ఉన్నవారికి అలాగే ఫోన్ క్లిక్‌ల ద్వారా భౌతికంగా ఏమీ పొందాలనుకోని వారికి కూడా సేవ చేస్తాము. ఆర్థిక–డిజిటల్ అక్షరాస్యత లేని వినియోగదారులు భారత్‌లో ఉన్న విషయాన్ని గమనించాలి. ► కనుక భారతదేశం వంటి దేశంలో వినియోగదారులకు భౌతిక, డిజిటల్ ఆర్థిక సేవలు రెండూ అవసరమని, ఈ విషయంలో సహజీవనం చేయక తప్పదని నేను భావిస్తున్నాను. ► భారత్‌లో కో–లెండింగ్ నమూనా ఆవిర్భావం విషయానికి వస్తే, దేశంలో మారుమూల ఉన్న వారికిసైతం ఆర్థిక సేవలు అందాలన్న ప్రధాన ధ్యేయంతో ఏర్పడిన యంత్రాంగం ఇది. ప్రస్తుతం సెమీ–అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో ఎస్బీఐకి 65% శాఖలు ఉన్నాయని, ఇలాంటప్పుడు కూడా కో–లెండింగ్ భాగస్వామి అవసరమా? అని అందరూ మాట్లాడుకుంటున్నారు. మారుమూల ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు ఇంకా చొచ్చుకువెళ్లాల్సి ఉందని అనుకుంటున్నాను. రుణగ్రహీతల అవసరాల గురించిన తగిన సమాచారాన్ని çకో–లెండింగ్ భాగస్వామి వ్యవస్థ తగిన విధంగా అందించగలుగుతుందని భావిస్తున్నాను. ► ఎస్బీఐ అటువంటి రెండు భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. మరికొందరితో భాగస్వామ్యానికి ప్రయత్నిస్తోంది. ► నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు (ఎన్బీఎఫ్సీ), సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) మారుమూల ప్రాంత ప్రజలకు సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. తగిన నిర్ణయాలు తీసుకోడానికి వారి వద్దనున్న సమాచారం దోహదపడుతుంది. టెక్నాలజీతో ఆర్థిక సేవల్లో పెను మార్పులు: కేవీ కామత్ కొంగొత్త టెక్నాలజీల రాకతో ఆర్థిక సేవల రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని ప్రముఖ బ్యాంకరు, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రా అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్) చైర్మన్ కేవీ కామత్ తెలిపారు. టెక్ ఆధారిత కొత్త తరం సంస్థలను కూడా నియంత్రణ నిబంధనల పరిధిలోకి తెచ్చేలా నియంత్రణ సంస్థ దృష్టికి తీసుకెళ్లాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. తద్వారా సదరు రంగంలోని సంస్థలన్నింటికీ సమాన హోదా, నిబంధనలు వర్తించేలా కృషి చేయాలని ఫిక్కీ–ఎఫ్‌ఐబీఏసీ 2021 సదస్సు ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొన్న సందర్భంగా కామత్ తెలిపారు. డిజిటల్‌తో తగ్గిన బ్యాంకింగ్ భారం: గోయెల్ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చైర్మన్, యుకో బ్యాంక్ సీఈఓ ఏకే గోయెల్ సమావేశంలో ప్రసంగిస్తూ, బ్యాంకింగ్ సేవల డిజిటలైజేషన్ వల్ల బ్రాంచీలపై భారం తగ్గిందని అన్నారు. అయితే ఇప్పటికీ 30 శాతం మంది ఫీచర్ ఫోన్లనే వినియోగిస్తున్న విషయం ఒక సమస్యగా ఉందని అన్నారు. సహ రుణ (కో–లెండింగ్) విధానం ద్వారా లేదా ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యంతో డిజిటల్ రుణాలను మెరుగుపరచవచ్చని, ఇది బ్యాంకు శాఖల భారాన్ని మరింత తగ్గించడానికి దోహదపడుతుందని అన్నారు. -
కరోనా మహమ్మారిలోనూ బలంగా నిలబడ్డ పరిశ్రమలివే
న్యూఢిల్లీ: ఎఫ్ఎంసీజీ, రిటైల్ పరిశ్రమలు కరోనా మహమ్మారి కాలంలోనూ తమ బలాన్ని చాటుతున్నాయని..భవిష్యత్తులో ఇవి మరింత విలువను సృష్టించే విధంగా అభివృద్ధి చెందగలవని డెలాయిట్–ఫిక్కీ నివేదిక అభిప్రాయపడింది. ఎఫ్ఎంసీజీ కంపెనీలు డిజిటల్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసుకోవడం ద్వారా వినియోగదారులకు చేరువ కావాలని సూచించింది. వనరులను సమకూర్చుకోవడం, ఉత్పత్తి, ప్యాకేజింగ్ విషయంలో స్థిరత్వం ఉండేలా చర్యలు అవసరమని పేర్కొంది. ఈ నివేదిక గురువారం విడుదలైంది. ‘‘వినియోగ డిమాండ్‌ను కరోనా పూర్తిగా మార్చేసింది.సరఫరా వ్యవస్థలకు సవాళ్లు విసిరింది. కొన్నింటిని సమూలంగా మార్చేసింది. వ్యాపారాలకు ఇక నూతన సాధారణ అంశాలుగా మార్చేసింది’’అని వివరించింది. డిజిటైజేషన్‌తో కిరాణాల సామర్థ్యం పెరగనుందని.. ఎఫ్ఎంసీజీ రంగానికి వృద్ధి అవకాశాలు తీసుకొస్తుందని అంచనా వేసింది. నేరుగా వినియోగదారుణ్ణి చేరుకునే మార్గాలపై కంపెనీలు దృష్టి పెట్టాలని సూచించింది. కాస్మొటిక్స్, బేబీ కేర్, వెల్నెస్ విభాగాల్లో ఈ కామర్స్ ఇకమీదట మరింత వేగంగా విస్తరిస్తుందని పేర్కొంది. చదవండి: ఉద్యోగుల ధోరణి మారింది, ఈ వస్తువులపై పెట్టే ఖర్చు భారీగా పెరిగింది -
గగన్‌యాన్ మిషన్ లాంచ్‌పై స్పష్టత..!
భారత్ మానవసహిత అంతరిక్ష యాత్ర కోసం గగన్‌యాన్ మిషన్‌ను ఇస్రో పట్టాలెక్కించిన విషయం తెలిసిందే. మిషన్‌లో భాగంగా వ్యోమగాములుగా ఎంపికైన నలుగురు భారతీయులు రష్యాలోని మాస్కో సమీపంలో ఉన్న జైయోజ్డ్నీ గోరోడోక్ నగరంలో ఏడాది శిక్షణా కోర్సు కూడా పూర్తి చేసుకున్నారు. కాగా తాజాగా గగన్‌యాన్ మిషన్‌పై కేంద్ర మంత్రి జీతేంద్ర సింగ్ స్పందించారు. 2022 చివరినాటికి లేదా 2023 ప్రారంభంలో గగన్‌యాన్ మిషన్‌ను ప్రయోగిస్తామని జీతేంద్ర సింగ్ బుధవారం రోజున వెల్లడించారు. చదవండి: ఐపీఎల్ ప్రియులకు ఎయిర్టెల్ శుభవార్త! తొలుత గగన్‌యాన్ మిషన్‌ను 2022లో లాంచ్ చేయాలని ఇస్రో భావించగా కరోనా రాకతో మిషన్ ముందడుగు వేయలేదన్నారు. ఫిక్కి నిర్వహించిన ఫ్యూచర్ ఆఫ్ ఇండియా స్పేస్ టెక్నాలజీ పార్టనర్‌షిప్‌పై జరిగిన వెబినార్‌లో కేంద్రమంత్రి జీతేంద్ర సింగ్ తెలిపారు. అంతేకాకుండా అంతరిక్ష రంగంలో స్టార్టప్ ప్రాముఖ్యత ఎంతగానో ఉందన్నారు. గగన్మిషన్ ద్వారా భారత వ్యోమగాములను లో ఎర్త్ ఆర్బిట్ చేర్చనుంది. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా ఇస్రో మానవ సహిత అంతరిక్షయాత్ర కోసం వాడే లిక్విడ్ ప్రోపెలెంట్ వికాస్ ఇంజన్ టెస్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. చదవండి: SpaceX Inspiration4: బ్రాన్సన్, బెజోస్‌లది ఉత్తుత్తి ఫీట్.. స్పేస్ ఎక్స్ పెనుసంచలనం, ఇదీ అసలైన ఛాలెంజ్! -
ఏపీలో తక్కువ వ్యయంతో సరుకు రవాణా
సాక్షి, అమరావతి: తూర్పు తీరానికి ముఖద్వారంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత తక్కువ వ్యయంతో సరుకు రవాణా చేసుకునేలా రాష్ట్రంలో ఓడరేవులు, లాజిస్టిక్ పార్కులను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ మారిటైమ్ బోర్డు తెలిపింది. శుక్రవారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ‘భవిష్యత్తు అవసరాల కోసం పోర్టుల అభివృద్ధి–న్యూ ఇండియా 75’ అనే అంశంపై ఆన్లైన్లో జాతీయ సదస్సును నిర్వహించింది. ఇందులో ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. తీర ప్రాంత అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు.చదవండి: Andhra Pradesh: అవసరం ఏదైనా.. ఒక్క బటన్ నొక్కితే చాలు : ముఖ్యంగా సరుకు రవాణా వ్యయం తగ్గించడానికి పోర్టుల సమీపంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో రాష్ట్రంలో కొత్తగా నాలుగు పోర్టులు, 8 ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నామన్నారు. దీంతో దేశంలోనే అత్యధిక కార్గో హ్యాండ్లింగ్ సామర్థ్యం కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలవనుందని చెప్పారు. పోర్టు ఆధారిత పరిశ్రమలను పెద్ద ఎత్తున ప్రోత్సహించడానికి పోర్టులకు సమీపంలో భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని పెట్టుబడిదారులు వినియోగించుకోవాలని కోరారు.చదవండి: ఫలించిన ముందుచూపు: చేతినిండా.. పని..మనీ! రాష్ట్రంలో 974 కి.మీ. సుదీర్ఘమైన తీర ప్రాంతం కలిగి ఉండటంతో సముద్ర ఆధారిత వాణిజ్యానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతను ఇస్తోందన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కొనియాడారు. అంతకుముందు సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, నౌకాయాన శాఖ మంత్రి సర్భానంద సోనోవాల్ మాట్లాడుతూ.. దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి, పారిశ్రామికీకరణలో పోర్టులు కీలకపాత్ర పోషిస్తున్నాయన్నారు. -
రియల్టీ భవిష్యత్తు ఏంటో?
న్యూఢిల్లీ: దేశీయ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికం నిరాశపరిచింది. కరోనా రెండో దశ వ్యాప్తి చెందడంతో రియల్టీ మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నదని నైట్‌ఫ్రాంక్–ఫిక్కీ–నరెడ్కో సర్వే వెల్లడించింది. వచ్చే ఆరు నెలలలో ఆశాజనక రియల్టీ మార్కెట్‌పై డెవలపర్లు గంపెడాశలతో ఉన్నారని 29వ ఎడిషన్ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్ క్యూ2–2021 తెలిపింది. ఈ ఏడాది తొలి త్రైమాసికం (క్యూ1)లో 57గా ఉన్న సెంటిమెంట్ స్కోర్ క్యూ2 నాటికి 35కి పడిపోయిందని పేర్కొంది. అయితే గతేడాది క్యూ2లో ఆల్‌టైమ్ కనిష్ట స్థాయికి చేరిన 22 స్కోర్‌తో పోలిస్తే ప్రస్తుత క్షీణత తీవ్రత తక్కువేనని తెలిపింది. ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్‌ను పరిశీలిస్తే.. ఈ ఏడాది క్యూ1లో 57గా ఉండగా.. క్యూ2 నాటికి స్వల్పంగా తగ్గి 56 స్కోర్‌కు చేరిందని.. అయినా ఇది ఆశావాద జోన్లోనే కొనసాగుతుందని పేర్కొంది. రియల్టీ మార్కెట్లో సెంటిమెంట్ స్కోర్ 50ని దాటితే ఆశావాదం జోన్‌గా, 50గా ఉంటే తటస్థం, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద జోన్‌గా పరిగణిస్తుంటారు. ఈ సర్వేను డెవలపర్లు, బ్యాంక్‌లు, ఆర్ధిక సంస్థల సరఫరా మీద ఆధారపడి జరుగుతుంటుంది. కోవిడ్ వ్యాక్సినేషన్ వేగవంతం, నిరంతర ఆర్ధిక కార్యకలాపాల మీద ఆధారపడి భవిష్యత్తు రియల్టీ సెంటిమెంట్ స్కోర్ ఆశాజనకంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా సీఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. కరోనాతో రియల్టీ మార్కెట్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. నివాస, కార్యాలయ విభాగాలకు అంతర్లీన డిమాండ్ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. -
చిరు-అక్కీ-ఫిక్కీ.. ఓ మంచిపని
కరోనా టైంలో సినీ సెలబ్రిటీల సాయంపై కొందరు విమర్శలు గుప్పిస్తున్నా.. వాళ్లు మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు. టాలీవుడ్లో మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్లో అక్షయ్‌కుమార్ సెకండ్ వేవ్‌లో భారీగా సాయం అందిస్తున్న లిస్ట్‌లో ఉన్నారు కూడా. అయితే ఈ అగ్ర హీరోలు ఇప్పుడు మరో మంచి పనిలో భాగం కాబోతున్నారు. ‘ద ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ (ఫిక్కీ) మీడియా నిర్వహించే ఓ అవేర్నెస్ క్యాంపెయిన్‌లో వీళ్లు భాగం కాబోతున్నారు. బాలీవుడ్ సీనియర్ హీరో అక్షయ్ కుమార్ ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించబోతున్నాడు. ఈ క్యాంపెయిన్ పేరు ‘కరోనా కో హరానా హై’(కరోనాను ఓడిద్దాం). ఇక మిగతా భాషల నుంచి కూడా అగ్రహీరోలను ఇందుకోసం ఎంపిక చేశారు. టాలీవుడ్ నుంచి మెగాస్టార్ చిరంజీవి రిప్రజెంట్ చేస్తుండగా, కోలీవుడ్ నుంచి ఆర్య, కన్నడ నుంచి పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్‌లు ఇందులో పాల్గొనబోతున్నారు. ‘హర్ ఘర్ నే థానా హై, కరోనా కో హరానా హై’ను తమ తమ భాషల్లో చెప్పబోతున్నారు ఈ అగ్రహీరోలు. ఈ మహమ్మారి టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి లాంటి నిపుణుల సలహాలను వీళ్లు ప్రచారం చేయనున్నారు. మరాఠీ, పంజాబీ, భాషల్లోనూ ఆయా స్టార్లతో ప్రచారం చేయించబోతున్నారు. జూన్ 5 నుంచీ టీవీ, పేపర్, ఇంటర్నెట్ లాంటి మాస్ మీడియా ప్లాట్ ఫామ్స్ పైన వీళ్లు క్యాంపెయిన్‌లో పాల్గొనే స్పెషల్ కరోనా అవేర్ నెస్ యాడ్స్ ప్రసారం అవుతాయి. ఈ కరోనా టైంలో అందరం హెల్త్వర్కర్స్కి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అలాగే కరోనాపై పోరాటం కొనసాగించాలి. అగ్రహీరోల ద్వారా నడిపించే ఈ క్యాంపెయిన్.. మరింత ప్రభావితంగా ఉంటుందని భావిస్తున్నాం అని ఫిక్కీ చైర్పర్సన్ సంజయ్ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. చదవండి: సత్యదేవ్‌కి జాక్‌పాట్ -
రికవరీ బాటలో మీడియా, వినోదం
సాక్షి, హైదరాబాద్ ,బిజినెస్ బ్యూరో: మీడియా, వినోద రంగం దేశంలో ఈ ఏడాది వృద్ధిని నమోదు చేస్తుందని ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్త నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం.. 2019తో పోలిస్తే పరిశ్రమ గతేడాది మహమ్మారి కారణంగా 24 శాతం తగ్గి రూ.1.38 లక్షల కోట్లు నమోదు చేసింది. 2017 స్థాయికి చేరింది. 2020 చివరి త్రైమాసికంలో చాలా విభాగాల్లో ఆదాయాల్లో రికవరీ నమోదైంది. 2021లో మీడియా, వినోద రంగం 25 శాతం వృద్ధి చెంది రూ.1.73 లక్షల కోట్లను తాకుతుంది. ఏటా సగటున 13.7 శాతం అధికమై 2023 నాటికి రూ.2.23 లక్షల కోట్లకు చేరుతుంది. 2025 నాటికి మీడియా, వినోద రంగం ఆదాయం రూ.2.68 లక్షల కోట్లకు చేరనుంది. జోరుగా ఓటీటీ.. పరిశ్రమలో టెలివిజన్ విభాగం అగ్రస్థానంలో కొనసాగుతోంది. గతేడాది 2.8 కోట్ల మంది కస్టమర్లు 5.3 కోట్ల ఓటీటీ చందాలను కట్టారు. దీంతో డిజిటల్ సబ్స్క్రిప్షన్ ఆదాయాలు 49 శాతం పెరిగాయి. 2019లో 1.05 కోట్ల కస్టమర్లు ఓటీటీ సబ్స్క్రిప్షన్లు చేశారు. ప్రధానంగా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ మూలంగా గతేడాది వృద్ధికి తోడైంది. ఐపీఎల్ ప్రసార హక్కులు స్టార్ గ్రూప్‌నకు ఉన్న సంగతి తెలిసిందే. ఇక కంటెంట్ కోసం నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో పెట్టుబడులు పెద్ద ఎత్తున చేశాయి. ప్రాంతీయ భాషల్లో ఉత్పత్తులను తీసుకొచ్చాయి. డేటా ప్లాన్స్‌తో బండిల్‌గా రావడంతో 28.4 కోట్ల మంది కస్టమర్లు కంటెంట్‌ను ఆస్వాదించారు. ఆన్లైన్ గేమింగ్ ఇలా.. 2019లో మీడియా, వినోద రంగంలో 16 శాతం వాటా ఉన్న డిజిటల్, ఆన్లైన్ గేమింగ్ 2020లో 23 శాతానికి ఎగసింది. నాలుగేళ్లుగా ఆన్లైన్ గేమింగ్ విభాగం వేగంగా వృద్ధి సాధిస్తోంది. 2020లో ఈ విభాగం రూ.7,600 కోట్ల ఆదాయం నమోదు చేసింది. అంత క్రితం ఏడాది ఇది రూ.6,500 కోట్లుగా ఉంది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయడం, ఆన్లైన్ తరగతులతో ఆన్లైన్ గేమింగ్ 18 శాతం వృద్ది సాధించింది. ఆన్లైన్ గేమర్స్ 20 శాతం అధికమై 36 కోట్లకు చేరారు. పలు రాష్ట్రాల్లో నియంత్రణలు ఉన్నప్పటికీ లావాదేవీల ఆధారిత గేమ్స్ ఆదాయం 21 శాతం అధికమైంది. సాధారణ గేమ్స్ ఆదాయం 7 శాతం పెరిగింది. థియేటర్ల ద్వారా ఆదాయం.. సినిమా, వీడియో ఆన్ డిమాండ్ 2019లో రూ.11,900 కోట్లు నమోదైంది. గతేడాది ఇది భారీగా తగ్గి రూ.7,200 కోట్లకు పరిమితమైంది. 2020లో థియేటర్ల ద్వారా ఆదాయం 2019తో పోలిస్తే పావు వంతులోపుకు పడిపోయింది. అయితే డిజిటల్ రైట్స్ ద్వారా వచ్చే ఆదాయం పెరగడం కాస్త ఊరటనిచ్చింది. డిజిటల్ రైట్స్ ఆదాయం దాదాపు రెండింతలై రూ.3,500 కోట్లు నమోదైంది. సినిమా నిర్మాణాలు ఆరు నెలలకుపైగా నిలిచిపోవడం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. టీవీ, సినిమా, సంగీతం రికవరీకి ఒకట్రెండేళ్లు పడుతుంది. చదవండి: ఆస్తి పన్ను వసూళ్లకు ప్రత్యేక వ్యూహం -
భేషుగ్గా పెట్టుబడుల ఉపసంహరణ
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రకటించినట్టుగా ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ కేలండర్ సజావుగా కొనసాగుతుందన్న నమ్మకాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కనబరిచారు. ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ.. మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పెద్ద ఎత్తున నిధులను వెచ్చించడం జరుగుతుందని చెప్పారు. ఈ విషయాన్ని ఫిక్కీ ట్వీట్ చేయగా, ఆర్థిక మంత్రి రీట్వీట్ చేశారు. 2021–22లో పెట్టుబడుల ఉపసంహరణ రూపంలో రూ.1.75 లక్షల కోట్లను సమకూర్చుకుంటామని బడ్జెట్లో భాగంగా మంత్రి చెప్పడం గమనార్హం. బీపీసీఎల్, ఎయిర్ ఇండియా, షిప్పింగ్ కార్పొరేషన్, కంటెయినర్ కార్పొరేషన్, ఐడీబీఐ, బీఈఎమ్ఎల్, పవన్‌హన్స్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్‌తోపాటు.. రెండు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఒక సాధారణ బీమా సంస్థలో వ్యూహాత్మక పెట్టుబడులను 2021–22 సంవత్సరంలో ఉపసంహరించుకోవాలన్న ప్రతిపాదనలను మంత్రి బడ్జెట్లో ప్రకటించారు. దీనికి తోడు ఎల్ఐసీ నుంచి అతిపెద్ద ఐపీవో రూపంలోనూ భారీగా నిధులు సమకూర్చుకోవాలనుకుంటోంది. ఏ వర్గంపైనా భారం వేయకుండానే.. భారత్‌లోని ఏ వర్గంపైనా భారం మోపలేదన్న విషయాన్ని మంత్రి సీతారామన్ గుర్తు చేశారు. ఆదాయం ఈ ఏడాది నుంచి మెరుగుపడుతుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ.. పెట్టుబడుల ఉపసంహరణ మార్గంలోనే కాకుండా, పన్నేతర ఆదాయాన్ని సమకూర్చుకుంటూ అందుకు ఆస్తుల విక్రయాన్ని ప్రస్తావించారు. భారీగా నిధులను వ్యయం వెచ్చించాల్సి ఉండడంతో పన్నేతర ఆదాయ మార్గాలపై బడ్జెట్లో దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రభుత్వం ఒక్కటే పెద్ద ఎత్తున పెట్టుబడులతో ముందుకు వచ్చినా కానీ పెరుగుతున్న దేశ ఆకాంక్షలను తీర్చలేదంటూ ప్రైవేటు రంగం కూడా ముఖ్య భూమిక పోషించాల్సిన అవసరాన్ని గుర్తు చేశారు. ‘‘పన్నులు పెంచకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రదర్శించిన భిన్నమైన బడ్జెట్ ఇది. ఔత్సాహిక వ్యాపార స్ఫూర్తిని ఇది పెంచుతుంది. పెట్టుబడులు పెట్టడానికి పరిశ్రమలు ముందుకు రావాలి. బడ్జెట్లో ప్రదర్శించిన స్ఫూర్తిని పరిశ్రమ అర్థం చేసుకుంటుందని భావిస్తున్నాను. పరిశ్రమ రుణ భారాన్ని దించుకుంది. కనుక ఇప్పుడిక విస్తరణపై మరిన్ని పెట్టుబడులు పెట్టడం ద్వారా వృద్ధి దిశగా ప్రయాణించేందుకు సిద్ధం కావాలి’’ అని మంత్రి పిలుపునిచ్చారు. 2021–22లో రూ.34.83 లక్షల కోట్లను ప్రభుత్వం వ్యయాల కోసం కేటాయించడం గమనార్హం. త్వరలో మలి జాబితా.. ► నీతి ఆయోగ్ వైస్‌చైర్మన్ రాజీవ్ కుమార్ న్యూఢిల్లీ: పెట్టుబడుల ఉపసంహరణకు అనుకూలమైన ప్రభుత్వరంగ సంస్థల మలి జాబితాను వచ్చే కొన్ని వారాల్లో సిద్ధం చేయనున్నట్టు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్‌కుమార్ తెలిపారు. ప్రతిపాదిత అస్సెట్ రీకన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ కంపెనీల ఏర్పాటు బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏల) సమస్యను పరిష్కరించగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఒకప్పుడు యూటీఐ మాదిరే ఇవి కూడా తమ బాధ్యతలను చక్కగా నిర్వహిస్తాయని అభిప్రాయపడ్డారు. ఒక అస్సెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ, ఒక అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీని ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజా బడ్జెట్లో ప్రకటించిన విషయం తెలిసిందే. పెట్టుబడుల ఉపసంహరణపైనా ఆమె ప్రకటన చేశారు. వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణకు వీలుగా తదుపరి జాబితాను నీతి ఆయోగ్ రూపొందిస్తుందని సీతారామన్ పేర్కొనడం గమనార్హం. ఈ ప్రక్రియ మొదలైందని, కొన్ని వారాల్లోనే జాబితాను సిద్ధం చేస్తామని మోదీ చెప్పారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి పట్ల మోదీ సర్కారు ఎప్పటికప్పుడు తన అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు స్పందిస్తూ.. అన్ని పార్టీల ఎన్నికల మేనిఫెస్టోల్లో ఈ సంస్కరణలు అజెండాగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. -
సానుకూలంగా రియల్టీ సెంటిమెంట్
న్యూఢిల్లీ: గతేడాది అక్టోబర్–డిసెంబర్ నాల్గో త్రైమాసికం (క్యూ4)లో దేశీయ రియల్ ఎస్టేట్ రంగంలో సెంటిమెంట్ సానుకూలంగా మారింది. దీంతో వచ్చే ఆరు నెలల కాలంలో నివాస, కార్యాలయాల విభాగంలో డిమాండ్ పుంజుకుంటుందని నైట్‌ఫ్రాంక్ ఇండియా–ఫిక్కీ–నరెడ్కో సంయుక్తంగా నిర్వహించిన ‘27వ రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఇండెక్స్–క్యూ4, 2020’ సర్వే వెల్లడించింది. తొలిసారిగా 2020 క్యూ4లో కరెంట్ సెంటిమెంట్ స్కోర్ 54 పాయింట్స్‌తో ఆశావాద జోన్ (ఆప్టిమిస్టిక్)లోకి చేరిందని సర్వే తెలిపింది. క్యూ3తో పోలిస్తే 14 పాయింట్లు పెరిగింది. ఇక క్యూ4లో ఫ్యూచర్ సెంటిమెంట్ స్కోర్ 65 పాయింట్లకు ఎగబాకింది. క్యూ3లో ఇది 52 పాయింట్లుగా ఉంది. స్కోర్ 50 పాయింట్ల కంటే ఎక్కువ ఉంటే ఆశావాద జోన్, 50 పాయింట్లుగా ఉంటే న్యూట్రల్, 50 కంటే తక్కువగా ఉంటే నిరాశావాద (పెసిమిజం) జోన్‌గా పరిగణిస్తుంటారు. సానుకూల దృక్పథంతో మొదలైన కొత్త ఏడాదితో రాబోయే ఆరు నెలల్లో గృహాల అమ్మకాలు 77 శాతం మేర పెరుగుతాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ శిశీర్ బైజాల్ తెలిపారు. క్యూ3లో ఇది 66 శాతంగా ఉంది. క్యూ3లో 47 శాతంగా ఉన్న ఆఫీస్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు క్యూ4 నాటికి 60 శాతానికి పెరిగాయి. చదవండి: రియల్ ఎస్టేట్ మళ్లీ జోరందుకుంది పెరిగిన హౌసింగ్ సేల్స్.. కారణాలు ఇవే! -
జీడీపీకి సాగు దన్ను
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8 శాతం క్షీణిస్తుందని ఫిక్కీ ఎకనమిక్ అవుట్‌లుక్ సర్వే పేర్కొంది. మూడవ త్రైమాసికంలో ఎకానమీ మైనస్‌లోనే ఉంటుందని, నాల్గవ త్రైమాసికంలోనే వృద్ధి బాటకు వస్తుందని విశ్లేషించింది. మూడవ త్రైమాసికంలో 1.3 శాతం క్షీణ రేటును అంచనా వేసిన ఫిక్కీ, నాల్గవ త్రైమాసికంలో 0.5 శాతం వృద్ధి బాటకు మళ్లుతుందని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం దేశం 9.6 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందని వివరించింది. 7.5 శాతం–12.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణిలో ఉండే వీలుందనీ సర్వే అంచనా వేసింది. అదే విధంగా.. దేశ వ్యవసాయ రంగం కరోనా ప్రేరిత సవాళ్లను విజయవంతంగా అధిగమించగలిగినట్లు ఫిక్కీ సర్వే పేర్కొంది. కరోనా సవాళ్ల నేపథ్యంలో 2020–21 ఏప్రిల్–జూన్ మధ్య 23.9 శాతం క్షీణించిన ఆర్థిక వ్యవస్థ జారుడు రెండవ త్రైమాసికంలో 7.5 శాతానికి పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జనవరిలో పరిశ్రమ, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సేవల రంగాల ప్రముఖులు వ్యక్తం చేసిన అభిప్రాయాల ప్రాతిపదికన రూపొందించిన అవుట్‌లుక్ సర్వేలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ♦ 2020–21లో వ్యవసాయ, అనుబంధ విభాగాల వృద్ధి రేటు 3.5 శాతంగా ఉంటుంది. ♦ కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ రంగం మంచి పనితీరును కనబరచింది. రబీ పంట విస్తీర్ణం, తగిన వర్షపాతం, భారీ రిజర్వాయర్ స్థాయిలు, ట్రాక్టర్ అమ్మకాల్లో పటిష్ట వృద్ధి తత్సంబంధ అంశాలు ఈ రంగంలో గణనీయమైన పురోగతికి సూచికగా ఉన్నాయి. అయితే వ్యవసాయ రంగం పురోగతికి పెట్టుబడులు మరింతగా పెరగాలి. ప్రత్యేకించి గిడ్డంగి సౌలభ్యతలు మెరుగుపడాలి. ♦ కరోనా వల్ల పరిశ్రమ, సేవల రంగాలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ 2 రంగాలూ 2020–21లో వరుసగా 10%, 9.2% నష్టపోతాయి. ♦ పారిశ్రామిక రంగంలో రికవరీ ఉన్నా, ఇంకా విస్తృత ప్రాతిపదికన ఇది కనిపించడంలేదు. పండుగల సీజన్లో పెరిగిన డిమాండ్ రికవరీకి దారితీసినా, దీర్ఘకాలంలో సానుకూలతలు ఇంకా మెరుగుపడాల్సి ఉంది. ♦ పర్యాటకం, ఆతిథ్యం, వినోదం, విద్యా, ఆరోగ్య రంగాల్లో ఇంకా సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఆయా విభాగాల పురోగతికి ప్రభుత్వం నుంచి సహాయ ప్యాకేజీలు ఉండాలి. ♦ 2020–21లో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ 10.7% క్షీణతలో ఉంటుంది. కనిష్ట–గరిష్ట స్థాయిల శ్రేణి మైనస్ 9.5%– మైనస్ 12.5 శాతంగా ఉంటుంది. ♦ 2020–21లో 6.5 శాతంగా రిటైల్ ద్రవ్యోల్బణం ఉండవచ్చు. కనిష్ట–గరిష్ట స్థాయిలు 5.8 శాతం – 6.6 శాతం శ్రేణిలో ఉంటాయని అంచనా. ♦ ఇక ప్రభుత్వ ఆదాయాల మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2020–21లో 7.4%గా (జీడీపీలో) ఉండవచ్చు. 7–8.5% శ్రేణిలో ఉండే వీలుంది. -
బడ్జెట్.. డిమాండ్‌ను పెంచాలి
న్యూఢిల్లీ: డిమాండ్‌ను పెంచడంపై రానున్న బడ్జెట్లో ప్రధానంగా దృష్టి సారించాలని దేశీయ పరిశ్రమల అభిప్రాయంగా ఉంది. అంతేకాదు మౌలిక సదుపాయాలు, సామాజిక రంగంపైనా వ్యయాలను ప్రోత్సహించాలని ఆశిస్తోంది. ఫిక్కీ, ధ్రువ అడ్వైజర్స్ సంయుక్తంగా ఒక సర్వే నిర్వహించి.. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలతో కూడిన నివేదికను బుధవారం విడుదల చేసింది. దేశంలో తయారీ వ్యవస్థ బలోపేతంపై ప్రభుత్వం విధానపరమైన దృష్టి సారించాలని కోరింది. పరిశోధన, అభివృద్ధికి మద్దతుగా నిలవాలని.. భవిష్యత్తు టెక్నాలజీలకు ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నట్టు సర్వే నివేదిక తెలిపింది. ప్రపంచంలోనే అతిపెద్ద టీకాల కార్యక్రమం దేశీయంగా కొనసాగుతున్న తరుణంలో ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవాన్ని అందించే చర్యలను వేగవంతం చేయాలని కోరింది. వృద్ధి క్రమం సానుకూలంగా మారినందున.. ప్రభుత్వం నుంచి నిరంతర మద్దతు అవసరమని.. కొన్ని రంగాల్లో డిమాండ్ మెరుగుపడగా, ఇది స్థిరంగా కొనసాగుతుందా అన్నది చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. డిమాండ్‌ను పెంచేందుకు పన్నుల విధానాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది. పన్నుల ఉపశమనం అవసరం.. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌కు బడ్జెట్‌ను సమర్పించనున్న విషయం తెలిసిందే. ఈ విడత బడ్జెట్లో వ్యక్తిగత పన్ను ఉపశమనానికి తప్పకుండా చోటు ఉండాలని సర్వేలో 40 శాతం మంది పారిశ్రామిక వేత్తలు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష పన్నుల విధానంలో పన్ను శ్లాబులను మరింత విస్తృతం చేయాలని 47 శాతం మంది కోరారు. ఉపాధి అవకాశాల కల్పనకు ప్రభుత్వం పన్ను రాయితీలు, ఉపసంహరణలు కల్పించాలని 75 శాతం మంది కోరడం గమనార్హం. ముఖ్యంగా ఆవిష్కరణలు, ఎగుమతులకు పన్ను రాయితీలు ఇవ్వాలని ఎక్కువ మంది కోరినట్టు ఈ సర్వే నివేదిక తెలియజేసింది. -
ఫిక్కీ నూతన కార్యవర్గం
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన కార్యవర్గం ఎంపికైంది. 2020–21 సంవత్సరానికి ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతా రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం ఉదయ్ శంకర్ ది వాల్ట్ డిస్నీ కంపెనీ, స్టార్ అండ్ డిస్నీ ఇండియాలకు ఏపీఏసీ అండ్ చైర్మన్‌గా ఉన్నారు. ఈయనతో పాటు ఫిక్కీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా హిందుస్తాన్ యూనీలివర్ (హెచ్‌యూఎల్) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా, వైస్ ప్రెసిడెంట్‌గా ఇండియన్ మెటల్స్ అండ్ ఫెర్రో అల్లోస్ ఎండీ సుభ్రకాంత్ పాండా నియమితులయ్యారు. -
రైతుల ఆదాయం పెంచడానికే
న్యూఢిల్లీ: దేశంలో రైతన్నల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. వారి ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా ప్రత్యామ్నాయ మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడానికి నూతన వ్యవసాయ చట్టాలకు రూపకల్పన చేశామని తెలిపారు. అడ్డంకులను తొలగించడంతోపాటు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పెట్టుబడులను పెంచడానికి సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. ఆ దిశగానే మూడు కొత్త వ్యవసాయ చట్టాలను తెచ్చామని పేర్కొన్నారు. తన విధానాలు, చర్యల ద్వారా అన్నదాతల ప్రయోజనాలను కాపాడడానికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ శనివారం ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ(ఫిక్కీ) 93వ వార్షిక సదస్సులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. కొత్త సాగు చట్టాలపై రైతుల భయాందోళనలను దూరం చేసే ప్రయత్నం చేశారు. రైతాంగం సందేహాలను నివృత్తి చేస్తూ ఆయన ఇంకా ఏమన్నారంటే.. రైతులకు డిజిటల్ వేదికలు వ్యవసాయ రంగంలో మరిన్ని పెట్టుబడులు రావడానికి, రైతులకు లబ్ధి చేకూరడానికి సంస్కరణలు దోహదపడతాయి. అన్నదాతలను సంపన్నులను చేయడమే ప్రభుత్వ సంస్కరణల ప్రధాన లక్ష్యం. ఈ చట్టాలతో రైతులకు ఎన్నో లాభాలు ఉంటాయి. వారు తమ వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికి లేదా కొనుగోలు చేయడానికి నిర్దేశిత మార్కెట్లలోనే కాకుండా వెలుపల కూడా అదనపు వెసులుబాటు లభిస్తుంది. రైతులు ప్రస్తుతం మార్కెట్లలో లేదా దళారులకు పంటలను విక్రయించుకోవాల్సి వస్తోంది. కొత్త చట్టాలతో మార్కెట్లను ఆధునీకరిస్తారు. రైతులకు డిజిటల్ వేదికలు అందుబాటులోకి వస్తాయి. విక్రయం, కొనుగోలు మరింత సులభ తరం అవుతుంది. ఇవన్నీ రైతుల ఆదాయం పెంచడం కోసమే. ఆదాయం పెరిగితే రైతులు ధనవంతులవుతారు. తద్వారా ఇండియా ధనిక దేశంగా మారుతుంది. కొత్త మార్కెట్లు... కొత్త అవకాశాలు నూతన సంస్కరణల అమలుతో రైతాంగానికి కొత్త మార్కెట్లు, కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారు. కోల్డ్ స్టోరేజీల్లో సదుపాయాలు మెరుగవుతాయి. వీటన్నింటితో వ్యవసాయ రంగంలో పెట్టుబడులు భారీగా పెరుగుతాయి. ఈ సంస్కరణలో చిన్న, సన్నకారు రైతులు గరిష్ట ప్రయోజనాలు పొందుతారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. గతంతో పోలిస్తే ఇప్పుడు ఈ రంగం వెలుగులీనుతోంది. రైతులకు మేలు చేకూర్చే చర్యలు ప్రారంభించాం. చెరకు నుంచి ఇథనాల్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాం. ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలుపుతున్నారు. దీంతో విదేశాల నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోగలుగుతున్నాం. చెరకు పండించే రైతులకు మంచి ధర లభిస్తోంది. అడ్డుగోడలను కూల్చేస్తున్నాం... వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ వంటివి వేర్వేరుగా పని చేస్తున్నాయి. ఈ విధానం సరైంది కాదు. ఇవన్నీ ఒకదానికొకటి అనుసంధానం కావాలి. వివిధ రంగాల మధ్య వారధులు ఉండాలి తప్ప అడ్డుగోడలు కాదు. ఈ అడ్డుగోడలను కూల్చడానికి కొన్నేళ్లుగా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మారుమూల పల్లెల్లోనూ ప్రజలకు బ్యాంకు ఖాతా, విశిష్ట గుర్తింపు సంఖ్య, తక్కువ ధరకే మొబైల్ డేటా అందుతున్నాయి. వీటితో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రత్యక్ష ప్రయోజన బదిలీ వ్యవస్థ మన దేశంలో అవతరించింది. వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు ప్రోత్సాహం వ్యవసాయ రంగంలో పారిశ్రామికవేత్తల పాత్ర పరిమితంగానే ఉంది. వారు మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి. కోల్డ్ స్టోరేజీలు, ఎరువుల తయారీలో ప్రైవేట్ రంగం పాత్ర ఆశించిన స్థాయిలో లేదు. పట్టణాల కంటే గ్రామీణ ప్రాంతాలు వేగంగా ముందుకు వెళ్తున్నాయి. పెట్టుబడిదారులకు గ్రామీణ ప్రాంతాలు మంచి ఎంపిక. ఇంటర్నెట్ వినియోగం నగరాల కంటే గ్రామాల్లో అధికంగా ఉంది. 98 శాతం గ్రామాలు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజనతో అనుసంధానం అయ్యాయి. వారు సామాజిక, ఆర్థిక చైతన్యం కోరుకుంటున్నారు. పల్లె ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోంది. ప్రజలకు వైఫై సేవలు అందించేందుకు ఇటీవల ‘ప్రధానమంత్రి వాణి’ ప్రాజెక్టును ప్రారంభించాం. గ్రామీణ ప్రాంతాల్లో కనెక్టివిటీ పెంచడానికి ఉద్దేశించిన ఈ వేదికను పారిశ్రామిక రంగం ఉపయోగించుకోవాలి. 21వ శతాబ్దపు పురోగతికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలు అందించే సహకారమే కీలకం. అందుకే ఆయా ప్రాంతాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టాలి. ఈ అవకాశం వదులుకోవద్దు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనకు గ్రామాల్లో ఎన్నో అవకాశాలు ఉన్నాయి. గ్రామీణ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించడమే ధ్యేయంగా ప్రభుత్వ విధానాలను రూపొందించాం. కనిష్ట స్థాయికి సర్కారు నియంత్రణలు కరోనా మహమ్మారి అనంతరం దేశ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటోందనే సంకేతాలను ఆర్థిక సూచికలు ఇస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వ నియంత్రణలను కనిష్ట స్థాయికి తగ్గించి, ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నాం. కరోనా మహమ్మారి మొదలైన ఫిబ్రవరితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు ఎంతో మెరుగయ్యాయి. అంతర్జాతీయ పెట్టుబడిదారుల్లో విశ్వాసం కల్పించడానికి గత ఆరేళ్లుగా పలు కార్యక్రమాలు చేపట్టాం. వీటి ఫలితంగా కరోనా సమయంలోనూ రికార్డు స్థాయిలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఇతర పెట్టుబడులు వచ్చాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, తయారీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగాల్లో ఎన్నో కీలక మార్పులు వచ్చాయి. పన్నుల్లోనూ సంస్కరణలు తెచ్చాం. దీంతో ట్యాక్స్ టెర్రరిజం, ఇన్స్పెక్టర్రాజ్ అంతమయ్యాయి. 20–20 క్రికెట్ మ్యాచ్‌లో పరిణామాలు శరవేగంగా మారుతుండడం మన చూస్తుంటాం. అదే తరహాలో 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి. -
ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్) మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం. ‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్ బజాజ్ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్ బజాజ్.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు. -
ఫిక్కీ ప్రెసిడెంట్‌గా ఉదయ్ శంకర్
న్యూఢిల్లీ: ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) నూతన అధ్యక్షుడిగా ఉదయ్ శంకర్ నియమితులయ్యారు. ఏడాది పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఫిక్కీ తెలిపింది. ప్రస్తుతం ఈ పదవిలో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ ఎండీ సంగీతా రెడ్డి ఉన్నారు. ఈ నెల 11–14 తేదీల్లో జరగనున్న ఫిక్కీ 93వ వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎం)లో శంకర్ బాధ్యతలు చేపడతారని ఫెడరేషన్ తెలిపింది. ది వాల్ట్ డిస్నీ కంపెనీకి ఏషియా పసిఫిక్ ప్రెసిడెంట్‌గా, స్టార్ అండ్ డిస్నీ ఇండియాకు చైర్మన్‌గా ఉదయ్ శంకర్ ఉన్నారు. మీడియా, ఎంటర్టైన్మెంట్ విభాగానికి చెందిన వ్యక్తి ప్రెసిడెంట్ కావటం ఫిక్కీ చరిత్రలోనే తొలిసారి. -
కరోనా టీకా: మొదట వారికే ఇస్తాం
న్యూఢిల్లీ: మరో మూడు నాలుగు నెలల్లో కరోనా వ్యాక్సిన్ సిద్ధమవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రాధాన్యతల వారీగా వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ప్రణాళిక రూపొందించామని తెలిపారు. తొలుత ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు కరోనా టీకా అందజేస్తామన్నారు. కరోనా నేపథ్యంలో ఆరోగ్య రంగంలో వచ్చిన మార్పులపై ‘ఫిక్కి’ గురువారం నిర్వహించిన నేషనల్ వెబినార్‌లో ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడారు. వచ్చే ఏడాది జూలై–ఆగస్టు నాటికి 40 కోట్ల నుంచి 50 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వీటిని 25 కోట్ల నుంచి 30 కోట్ల మందికి అందించవచ్చని చెప్పారు. మరో మూడు నాలుగు నెలల్లోనే వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు. ప్రాధాన్యతల వారీగానే వ్యాక్సిన్ సరఫరా చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. దీని ప్రకారం.. ముందుగా ఆరోగ్య కార్యకర్తలకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు, అనంతరం 50–65 ఏళ్ల వయసున్న వారికి ఇస్తామని ఉద్ఘాటించారు. ఆ తర్వాత 50 ఏళ్ల లోపు వయసున్న వారికి వ్యాక్సిన్ అందుతుందన్నారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ అనేది పూర్తిగా శాస్త్రీయ కోణంలో నిపుణుల సూచనల మేరకే జరుగుతుందని మంత్రి హర్షవర్దన్ వివరించారు. ప్రస్తుతం 20 వ్యాక్సిన్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని హర్షవర్ధన్ తెలిపారు. ముఖ్యమైన వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్‌కు ఏర్పాట్లు చేశామన్నారు. ఆక్స్ఫర్డ్–సీరం ఇన్స్టిట్యూట్ వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ దాదాపు పూర్తి కావొచ్చిందన్నారు. భారత్ బయోటెక్–ఐసీఎంఆర్ దేశీయంగానే అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ ఫేజ్–3 క్లినికల్ ట్రయల్ ఇప్పటికే ప్రారంభమైంది. రష్యాకు చెందిన స్పుత్నిక్–5 వ్యాక్సిన్ ఫేజ్–2/ఫేజ్–3 ప్రయోగాలను రెడ్డీస్ ల్యాబ్ సంస్థ ఇండియాలో త్వరలోనే ప్రారంభించనుంది. ఎవరికి వారు స్వీయ జాగ్రత్తలు పాటించడం, మరొకరిని చైతన్యపర్చడం ద్వారా కోవిడ్–19ను 90–99 శాతం అరికట్టవచ్చని మంత్రి హర్షవర్ధన్ సూచించారు. (చదవండి: పడవ మీద తిరిగే ప్రాణదాత) క్రిస్మస్కు ముందే వ్యాక్సిన్! ఫైజర్, బయో ఎన్‌టెక్ వ్యాక్సిన్ క్రిస్మస్లోపే మార్కెట్లోకి విడుదల కావచ్చునని బయో ఎన్‌టెక్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఉగుర్ సాహిన్ వెల్లడించారు. తీవ్రమైన దుష్ప్రభావాలు లేవని తేలిన తరువాత వచ్చే నెలలో అమెరికా, యూరప్‌లో వ్యాక్సిన్‌కి అనుమతులు పొందనున్నట్లు ఫైజర్, బయో ఎన్‌టెక్ తెలిపాయి. వ్యాక్సిన్ పనితీరు వివిధ వయస్సులు, గ్రూపులపై ఒకేరకమైన పనీతీరు కనపర్చినట్లు ఆ కంపెనీలు వెల్లడించాయి. డిసెంబర్ మధ్యనాటికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వ్యాక్సిన్ అత్యవసర వాడకానికి అనుమతి రావచ్చని, ఈయూ నుంచి అనుమతులు లభించవచ్చునని ఉగుర్ తెలిపారు. క్రిస్మస్కి ముందే వ్యాక్సిన్ సరఫరా ప్రారంభించనున్నట్టు ఆయన చెప్పారు. తమ వద్ద రెండు అధిక సామర్థ్యం కలిగిన సురక్షితమైన వ్యాక్సిన్లు ఉన్నాయని కొద్ది వారాల్లోనే పంపిణీకి సిద్ధం అవుతాయని యుఎస్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ సెక్రటరీ అలెక్స్ హజార్ తెలిపారు. వృద్ధుల్లో ఆక్స్ఫర్డ్ టీకా సత్ఫలితాలు లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న కరోనా వ్యాక్సిన్ వయసు పైబడినవాళ్లలో మంచి వ్యాధినిరోధకత అభివృద్ధి చెందేలా దోహదం చేస్తోంది. ఈ మేరకు లాన్సెట్‌లో ప్రచురించిన వివరాలు టీకాపై ఆశలను పెంచుతున్నాయి. సుమారు 560 మంది వయసు పైబడిన వాలంటీర్లపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించి చూడగా మంచి ఫలితాలు వచ్చాయని, 70 ఏళ్లు పైబడిన వాళ్లలో కూడా వ్యాధినిరోధకత పెరిగిందని రిసెర్చ్ నివేదిక తెలిపింది. కరోనా ఎక్కువగా పెద్దవారిపై నెగెటివ్ ప్రభావం చూపుతున్న తరుణంలో ఈ ఫలితాలు ఆశావహంగా ఉన్నాయని తెలిపింది. పెద్దల్లో టీకా నెగెటివ్ ప్రభావాలు చూపకపోవడమే కాకుండా, వారిలో ఇమ్యూనిటీని పెంచడం ముదావహమని ఆక్స్ఫర్డ్ వాక్సిన్ గ్రూప్‌నకు చెందిన డాక్టర్ మహేషి రామసామి చెప్పారు. -
వినియోగ విశ్వాసం బలోపేతంతోనే వృద్ధి
ముంబై: ఆర్థికాభివృద్ధి అంశంలో వినియోగదారుని విశ్వాసం, మనోభావాలే కీలక పాత్ర పోషిస్తాయని ఫిక్కీ ప్రెసిడెంట్, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీతారెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ అంశాల్లో బలహీనత నెలకొందని ఆమె అన్నారు. వినియోగ విశ్వాసం పటిష్టతే ఆర్థికాభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. ఈ దిశలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడ జరిగిన ఒక గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ సందర్భంగా జరిగిన చర్చ గోష్టిలో ఆర్థిక అనిశ్చిత పరిస్థితిపై ఆమె మాట్లాడారు. ఆమె ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలతో దాదాపు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. పూర్తి అనిశ్చితి, భయాందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పురోగతికి ప్రభుత్వం నుంచి మరింత వ్యయాలు అవసరం. ► కరోనా ముందటి పరిస్థితితో పోల్చితే ఉత్పత్తి ప్రస్తుతం 60 నుంచి 70 శాతం స్థాయికి చేరిందని కర్మాగారాల నుంచి వార్తలు వస్తున్నాయి. రుణ లభ్యత బాగుంది. ఎగుమతులు దారిలోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డిమాండ్ పెంపు పరిస్థితులపై ఆలోచించాలి. ఎందుకంటే వినియోగదారు విశ్వాసం ఇంకా బలహీనంగానే ఉంది. వారి మనోభావాలు మెరుగుపడకుండా వృద్ధిని మళ్లీ పట్టాలపైకి ఎక్కించడం అసాధ్యం. ఇందుకుగాను ప్రభుత్వం నుంచి ప్రత్యక్ష నగదు బదలాయింపులు మరింత జరగాలి. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిలో ప్రత్యక్ష నగదు బదలాయింపు ఎంతో కీలకమవుతుంది. ► ఫిక్కీ ఇప్పటికే ప్రభుత్వానికి కన్జూమర్ వోచర్ విధానాన్ని సిఫారసు చేసింది. ప్రభుత్వం వ్యయాల కింద 30 నుంచి 50 శాతం డిస్కౌంట్‌తో కన్జూమర్ వోచర్ విధానాన్ని అమలు చేయడం వల్ల వ్యవస్థలో డిమాండ్ మెరుగుపడే అవకాశం ఉంటుంది. ► విధానాన్ని ఇకమీదట ఏ మాత్రం అనుసరించకూడదు. పూర్తి సాధారణ పరిస్థితులు నెలకొనాలి. ఏ విభాగంలోనూ ఇకపై లాక్డౌన్ నిబంధనలను ఏ మాత్రం అమలు చేయకూడదు. ► వేదాంతా గ్రూప్ సీఈఓ సునీల్ దుగ్గల్, టాటా మోటార్స్ సీఈఓ బషెక్, యాక్సెంచర్ సీఈఓ పీయూష్ సింగ్ తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. వారి అభిప్రాయాలను చూస్తే... ద్రవ్యోల్బణంపై ఆందోళన అక్కర్లేదు వృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కించే విషయానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వం ద్రవ్యోల్బణంపై ఆందోళన చెందనక్కర్లేదు. ఎకానమీలోకి మరింత నగదు లభ్యత జరిగేలా చూడ్డం ఇప్పడు ముఖ్యం. ముఖ్యంగా మౌలిక రంగంలో వ్యయాలు మంచి ఫలితాలను ఇస్తాయి. ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దీనితోపాటు కార్మిక సంస్కరణల విషయంలో కూడా ప్రభుత్వం ముందడుగు వేయాలి. పరిశ్రమ ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. – సునీల్ దుగ్గల్, సీఈఓ, వేదాంతా గ్రూప్ డిమాండ్ పటిష్టతకు మరో 9 నెలలు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ విభాగంలో డిమాండ్ ఊరటకలిగించే స్థాయిలో మెరుగుపడింది. అయితే అన్ని విభా గాల్లో డిమాండ్ పూర్తి పునరుత్తేజానికి ఆరు నుంచి తొమ్మిది నెలల సమయం పడుతుంది. – పీయూష్ సింగ్, సీనియన్ ఎండీ, యాక్సెంచర్ ఆటో... పన్ను రాయితీలు కావాలి కరోనా ప్రేరిత అంశాలతో ఆటో పరిశ్రమ దారుణంగా దెబ్బతింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రంగం 2010–11 స్థాయికి క్షీణిస్తుందన్నది అంచనా. పన్ను రాయితీలు ఈ రంగానికి తక్షణ అవసరం. – బషెక్, ఎండీ, సీఈఓ, టాటా మోటార్స్ -
రియల్టీలో పీఈ పెట్టుబడుల భారీ క్షీణత
న్యూఢిల్లీ: భారత రియల్ ఎస్టేట్‌లో 2020 జనవరి–ఆగస్టు మధ్య ప్రైవేటు ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు భారీగా పడిపోయాయి. 2019 ఇదే కాలంతో పోల్చిచూస్తే ఈ విభాగంలో ఇన్వెస్ట్మెంట్ 85 శాతం పడిపోయి 866 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.6,500 కోట్లు)గా నమోదయ్యింది. 2019 ఇదే కాలంలో ఈ పెట్టుబడుల విలువ 5,795 మిలియన్ డాలర్లు. అసలే మందగమనంలో ఉన్న రియల్టీ రంగాన్ని కరోనా మహమ్మారి ప్రేరిత అంశాలు మరింత దెబ్బతీశాయి. కోలియర్స్ ఇంటర్నేషనల్, ఫిక్కీ నివేదిక ఒకటి ఈ విషయాన్ని తెలిపింది. ‘భవిష్యత్ భారత్: ప్రైవేటు ఈక్విటీ పెట్టుబడులు, వ్యూహాత్మక చర్యలు’ అన్న పేరుతో రూపొందిన ఈ నివేదికలోని ముఖ్యాంశాలను చూస్తే... ► మొత్తం పెట్టుబడుల్లో గరిష్టంగా 46 శాతాన్ని డేటా సెంటర్స్ విభాగం ఆకర్షించింది. ► ఆఫీస్ సెగ్మెంట్ విషయంలో ఇది 24 శాతంగా ఉంది. విలువలో దాదాపు రూ.1,500 కోట్లు. ► ఇండస్ట్రియల్ విభాగం వాటా 12 శాతం. ► ఆతిధ్య రంగం వాటా 9 శాతం. ► హౌసింగ్, రెంటల్ హౌసింగ్ విభాగానిది 8 శాతం అయితే, కో–లివింగ్ వాటా ఒకశాతం. ► కోవిడ్–19 నేపథ్యంలో ఇటు దేశీయ, అటు విదేశీ ఇన్వెస్టర్లు భారత్ రియల్టీలో పెట్టుబడుల పట్ల అత్యంత జాగరూకతను ప్రదర్శిస్తున్నారు. ► పారిశ్రామిక, రవాణా విభాగాలకు సంబంధించి రియల్టీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలు ఉన్నాయి. దేశంలో ఉన్న వినియోగ డిమాండ్ ఆయా విభాగాల్లో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ► క్లౌడ్ కంప్యూటింగ్‌కు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో పెట్టుబడులకు డేటా సెంటర్లపై దృష్టి సారిస్తే, ప్రతిఫలాలు ఉంటాయి. ► చౌక ధరలు, ఒక మోస్తరు ఖర్చుతో నిర్మిస్తున్న నివాసాలకు సంబంధించిన ప్రాజెక్టులపై పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి. ► ఆతిధ్య రంగం, రిటైల్ రియల్ ఎస్టేట్ విభాగాల్లో అవకాశాలను ఇన్వెస్టర్లు పరిశీలించవచ్చు. ► రియల్టీలో మందగమనం ఉన్నప్పటికీ, మున్ముందు పుంజుకునే అవకాశం ఉంది. -
మరిన్ని చర్యలకు సిద్ధం
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ రికవరీ అంత ఆశాజనకంగా ఏమీ లేదన్నారు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్. కనుక వృద్ధికి మద్దతుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకునేందుకు ఆర్బీఐ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఫిక్కీ నిర్వహించిన వర్చువల్ సమావేశాన్ని ఉద్దేశించి దాస్ మాట్లాడారు. కరోనా ప్రభావం ఏ స్థాయిలో ఉందో ప్రభుత్వం విడుదల చేసిన జీడీపీ గణాంకాల ఆధారంగా తెలుస్తోందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–జూన్ కాలంలో దేశ జీడీపీ మైనస్ 23.9%కి పడిపోయిన విషయం తెలిసిందే. ‘‘వ్యవసాయానికి సంబంధించిన సంకేతాలు ఎంతో ఆశాజనకంగానే ఉన్నప్పటికీ.. తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ), ఉపాధిలేమి పరిస్థితులు రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్) స్థిరపడతాయని కొన్ని అంచనాల ఆధారంగా తెలుస్తోంది. అదే సమయంలో కొన్ని ఇతర రంగాల్లోనూ పరిస్థితులు తేలికపడతాయి’’ అని దాస్ చెప్పారు. ఆర్థిక రికవరీ ఇంకా పూర్తి స్థాయిలో గాడిన పడలేదని.. ఇది క్రమంగా సాధ్యపడుతుందని పేర్కొన్నారు. లిక్విడిటీ, వృద్ధి, ధరల నియంత్రణకు అన్ని చర్యలను ఆర్బీఐ తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ‘ఎన్బీఎఫ్సీ’లు బలహీనంగా.. ఆర్ధిక వ్యవస్థను గాడిలో పెట్టడంతోపాటు.. మధ్య కాలానికి మన్నికైన, స్థిరమైన వృద్ధిని సాధించడమే విధానపరమైన చర్యల ఉదేశమని శక్తికాంతదాస్ వివరించారు. ‘‘మార్కెట్లను చాలా జాగ్రత్తగా పర్యవేక్షిస్తూనే ఉంటాము. ఆర్బీఐ పోరాటానికి సిద్ధంగా ఉందని నేను గతంలోనే చెప్పారు. అంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు తదుపరి చర్యలు ఉంటాయి’’ అని దాస్ తెలిపారు. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం (ఎన్బీఎఫ్సీ) బలహీనంగా ఉండడం ఆందోళనకరమన్నారు. అగ్రస్థాయి 100 ఎన్బీఎఫ్సీలను ఆర్బీఐ క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తోందని.. ఏ ఒక్క పెద్ద సంస్థ కూడా వైఫల్యం చెందకూడదన్నదే తమ ఉద్దేశ్యమని తెలిపారు. డిపాజిటర్ల ప్రయోజనాలు ముఖ్యం.. డిపాజిటర్ల ప్రయోజనాలు, ఆర్థిక స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రుణ పునర్వ్యవస్థీకరణ పథకాన్ని రూపొందించామని దాస్ చెప్పారు. ఏ బ్యాంకింగ్ వ్యవస్థకు అయినా డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడడమే పరమావధిగా స్పష్టం చేశారు. -
భారత్‌కు తగ్గనున్న చెల్లింపుల ఖాతా భారం
న్యూఢిల్లీ: చెల్లింపుల సమతౌల్యత (బీఓపీ) ఈ ఏడాది భారత్‌కు అనుకూలంగా పటిష్టంగా ఉండే అవకాశం ఉందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం తెలిపారు. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో వాణిజ్య లావాదేవీలకు ఒక దేశం... ఇతర దేశాలకు చెల్లించాల్సి వచ్చే మొత్తం వ్యవహారాలకు ఉద్దేశించిన అంశాన్నే చెల్లింపుల సమతౌల్యతగా పేర్కొంటారు. ఒకవైపు ఎగుమతులు మెరుగుపడుతుండడం, మరోవైపు తగ్గుతున్న దిగుమతులు భారత్‌కు చెల్లింపుల సమతౌల్యత సానుకూల పరిస్థితిని సృష్టిస్తున్నాయని అన్నారు. ఫిక్కీ వెబ్‌నార్‌ను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగంలో ముఖ్యాంశాలు చూస్తే... ► ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల విషయానికి వస్తే, చక్కటి రికవరీ జాడలు ఉన్నాయి. ► ఎగుమతులు క్షీణతలోనే ఉన్నా... ఆ క్షీణ రేటు తగ్గుతూ వస్తుండడం కొంత ఆశాజనకమైన అంశం. ఏప్రిల్‌లో ఎగుమతులు భారీగా మైనస్ 60.28 శాతం క్షీణిస్తే, మేలో ఈ రేటు మైనస్ 36.47 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల జూన్‌లో ఈ క్షీణ రేటు మరింతగా మైనస్ 12.41 శాతానికి తగ్గడం గమనార్హం. ► 2019 ఎగుమతుల గణాంకాల పరిమాణంలో 91 శాతానికి 2020 జూలై ఎగుమతుల గణాంకాలు చేరాయి. దిగుమతుల విషయంలో ఈ మొత్తం దాదాపు 70 నుంచి 71 శాతంగా ఉంది. వెరసి ఈ ఏడాది భారత్ చెల్లింపుల సమతౌల్యం భారత్‌కు అనుకూలంగా ఉండనుంది. ► భారత్ పారిశ్రామిక రంగానికి చక్కటి వృద్ధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయని భావిస్తున్నా. దేశీయ తయారీ, పారిశ్రామిక రంగానికి మద్దతు నివ్వడానికి ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. -
ఫలితాలు కనిపిస్తున్నాయి
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌పరమైన పరిణామాల నుంచి ఎకానమీని గట్టెక్కించేందుకు కేంద్రం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, క్రమంగా లాక్డౌన్ ఎత్తివేయడం వంటి చర్యల ఫలితాలు కనిపించడం మొదలైందని ఒక సర్వేలో వెల్లడైంది. వ్యాపారాల పనితీరు మెరుగుపడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ – ధృవ అడ్వైజర్స్ నిర్వహించిన సర్వేలో తేలింది. ఈ ఏడాది జూన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో వివిధ రంగాల సంస్థలకు చెందిన 100 పైగా టాప్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు (సీఎక్స్‌వో) పాల్గొన్నారు. రికవరీ దాఖలాలు కనిపిస్తున్నప్పటికీ, ఇది స్థిరంగా నిలబడి ఉండేలా ప్రభుత్వం నుంచి నిరంతరంగా తోడ్పాటు అవసరమవుతుందని సర్వే తెలిపింది. మార్కెట్ డిమాండ్‌ను మెరుగుపర్చడానికి గట్టి చర్యలు అవసరమని లేకపోతే ప్రాథమిక స్థాయిలో ఉన్న ఈ రికవరీ మళ్లీ కుంటుపడిపోతుందని పేర్కొంది. సర్వే ప్రకారం ప్రస్తుతం 30 శాతం సంస్థలు 70 శాతం పైగా వ్యాపార సామర్థ్యాన్ని వినియోగించుకుంటున్నాయి. 45 శాతం సంస్థలు సమీప భవిష్యత్తులో ఈ స్థాయి సామర్థ్యాన్ని వినియోగించుకోనున్నాయి. ఇక సవాళ్ల విషయానికొస్తే, దశలవారీగా అన్లాకింగ్, ఖర్చుల నియంత్రణ, బలహీన డిమాండ్, నిధుల లభ్యత మొదలైన వాటిని సీఎక్స్‌వోలు ప్రస్తావించారు. కరోనా వైరస్ మహమ్మారి రెండో విడతలో మరింతగా విజృంభించిన పక్షంలో వ్యాపారాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడొచ్చని కొందరు సీఎక్స్‌వోలు అభిప్రాయపడ్డారు. ఇక చైనా నుంచి అకస్మాత్తుగా దిగుమతులు ఆగిపోవడం వంటి అంశాలు సైతం ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత..: తమ తమ కంపెనీల్లో దాదాపు 10 శాతం మేర ఉద్యోగాల్లో కోత పడొచ్చని సర్వేలో పాల్గొన్న వారిలో 32 శాతం మంది సీఎక్స్‌వోలు పేర్కొన్నారు. ఏప్రిల్‌లో నిర్వహించిన సర్వే ప్రకారం వీరి సంఖ్య 40 శాతం. ఎకానమీ అన్‌లాకింగ్‌తో క్రమంగా ఎగుమతులు, నిధుల ప్రవాహం, ఆర్డర్లు, సరఫరా వ్యవస్థలు మెరుగుపడటం మొదలైందని సర్వే పేర్కొంది. ఇటీవలి కాలంలో ఎగుమతులు మెరుగుపడ్డాయని 22 శాతం మంది సీఎక్స్‌వోలు తెలిపారు. ఇక 25 శాతం మంది ఆర్డర్ బుక్ మెరుగుపడిందని, 21 శాతం మంది నిధుల లభ్యత బాగుపడిందని పేర్కొన్నారు. కొనుగోళ్లకు మరింత సమయం.. మరోవైపు, ఆర్థిక ప్యాకేజీకి విషయానికొస్తే.. అయిదింట ఒక కంపెనీ మాత్రమే ప్రభుత్వం ప్రకటించిన అత్యవసర రుణ హామీ పథకం ఫలితాలిస్తోందన్నాయి. రుణాలపై వడ్డీ రేట్ల తగ్గింపు ప్రయోజనాలు కేవలం పావు శాతం సంస్థలకు లభించింది. అది కూడా స్వల్పంగా 25–50 బేసిస్ పాయింట్ల స్థాయిలో మాత్రమే దక్కింది. -
15% కార్పొరేట్ పన్ను గడువు పొడిగింపు!
న్యూఢిల్లీ: తయారీ రంగంలో కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు 15 శాతం కార్పొరేట్ పన్ను అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించగా.. ఇందుకు సంబంధించిన గడువు పొడిగింపును పరిశీలించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశ ఆర్థిక వృద్ధి కనిష్టాలకు పడిపోవడంతో పెట్టుబడులకు ఊతం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ పన్నును భారీగా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి.. అదే విధంగా 2019 అక్టోబర్ 1 నుంచి 2023 మార్చి 31 మధ్య తయారీ రంగంలో ఏర్పాటయ్యే కంపెనీలకు కార్పొరేట్ పన్నును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గిస్తూ కేంద్ర సర్కారు నిర్ణయాలు తీసుకుంది. ‘‘మేము ఏం చేయగలమన్నది చూస్తాం. నూతన పెట్టుబడులపై 15 శాతం కార్పొరేట్ పన్ను నుంచి పరిశ్రమ ప్రయోజనం పొందాలని కోరుకుంటున్నాను. దీంతో 2023 మార్చి 31 వరకు ఇచ్చిన గడువును పొడిగించడాన్ని పరిగణనలోకి తీసుకుంటాము’’ అని సీతారామన్ ఫిక్కీ సభ్యులను ఉద్దేశించి చెప్పారు. దేశీయ పరిశ్రమలకు, ఆర్థిక రంగ ఉద్దీపనానికి ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కోవిడ్–19 అత్యవసర రుణ సదుపాయం కేవలం ఎంఎస్ఎంఈలకే కాకుండా అన్ని కంపెనీలకు అందుబాటులో ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. లిక్విడిటీ సమస్య లేదు: వ్యవస్థలో లిక్విడిటీ తగినంత అందుబాటులో ఉందని, ఇందుకు సం బంధించి ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామని సీతారామన్ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాలకూ బకాయిలు తీర్చేయాలని చెప్పినట్టు పేర్కొన్నారు. జీఎస్టీ తగ్గింపుపై నిర్ణయం జీఎస్టీ కౌన్సిల్‌దేనని స్పష్టం చేశారు. -
ఇంకా చాలా సాధించాలి: ఉపాసన
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రంగాల్లో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నప్పటికీ.. తన లక్ష్యాల జాబితా చాలా పెద్దదని చెప్పారు అపోలో లైఫ్ వైస్ చైర్పర్సన్, సినీనటుడు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన కామినేని. నగరానికి చెందిన ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో గురువారం ‘ఫ్రీడమ్ టు బీ మి’ అనే అంశంపై వర్చువల్ సదస్సును ఆన్లైన్ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫిక్కి మహిళా సభ్యులకు, అతిథిగా హాజరైన ఉపాసనకు మధ్య టీవీ యాంకర్ స్వప్న అనుసంధాన కర్తగా వ్యవహరించారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంత్రపిస్ట్ పురస్కారం కూడా అందుకున్న ఉపాసన తాను మరిన్ని లక్ష్యాల సాధనకు ఇంకా ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఫిక్కి సభ్యుల ముచ్చట్లు ఆసక్తి కరంగా సాగాయి. కార్యక్రమంలో ఫిక్కి ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ ఉషశ్రీ మన్నె పాల్గొని మాట్లాడారు.(శభాష్ ఉపాసనా..) -
డిజిన్వెస్ట్‌మెంట్ నిధులు.. ఇన్ఫ్రాకే
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం (డిజిన్వెస్ట్‌మెంట్) ద్వారా సమీకరించిన నిధులను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసమే వినియోగిస్తామని.. ద్రవ్య లోటును భర్తీ చేసుకునేందుకు కాదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఆర్థిక వ్యవస్థపై ఇది అనేక రకాలుగా సానుకూల ప్రభావం చూపగలదని పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. ‘సమీకరించిన నిధులను ఏం చేయబోతున్నామన్నది స్పష్టంగా చెబుతున్నాం. మీ పెట్టుబడులు, విస్తరణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవడానికి దీనితో వెసులుబాటు లభిస్తుంది. ప్రైవేట్ రంగం ప్రభుత్వానికి తోడ్పడాలి. దానికి సమానంగా ప్రభుత్వం కూడా ప్రైవేట్ రంగానికి తోడ్పాటు అందిస్తుంది’ అని ఆమె చెప్పారు. ఉదాహరణకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వైద్య పరికరాలపై విధించే సుంకాల ద్వారా వచ్చే నిధులను.. మైరుగైన వైద్య సదుపాయాల కల్పనకు వినియోగించనున్నట్లు మంత్రి వివరించారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎకానమీకి ఊతమిచ్చేందుకు నిధులను విచ్చలవిడిగా ఖర్చు చేయరాదని ప్రభుత్వం నిర్ణయించుకుందన్నారు. రూ. 1.13 లక్షల కోట్ల మోసాలు.. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో బ్యాం కులు, ఆర్థిక సంస్థల్లో ఏకంగా రూ. 1,13,374 కోట్ల మోసాలు చోటు చేసుకున్నా యని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభకు రాతపూర్వక సమాధానంలో చెప్పారు. ప్రభుత్వ బ్యాంకుల్లో భారీ మోసాలను సత్వరం గుర్తించేందుకు, నివారించేందుకు 2015లో ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టినట్లు ఆమె పేర్కొన్నారు. మరోవైపు, సమస్యల గుర్తింపు, పరిష్కారం, అదనపు మూలధనం అందించడం, సంస్కరణలు వంటి చర్యలతో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో స్థూల మొండిబాకీలు గతేడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.1.68 లక్షల కోట్ల మేర తగ్గి రూ.7.27 లక్షల కోట్లకు చేరాయని మంత్రి వివరించారు. ఎల్ఐసీ పాలసీదారుల ప్రయోజనాలు కాపాడతాం ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీలో వాటాల విక్రయ అంశంలో పాలసీదారుల ప్రయోజనాలను కచ్చితంగా పరిరక్షిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. లిస్టింగ్ వల్ల ఎల్ఐసీలో పారదర్శకత మరింత పెరుగుతుందని ఆయన చెప్పారు. వాటాలు ఎంత మేర విక్రయించవచ్చన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఎల్ఐసీ చట్టాన్ని సవరించిన తర్వాత అన్ని వివరాలు వెల్లడవుతాయని చెప్పారు. ఎల్ఐసీలో కేంద్రానికి 100% వాటా ఉంది. -
అవరోధాలు సృష్టించే దేశాలపై చర్యలు
న్యూఢిల్లీ: టారిఫ్యేతర ఆంక్షలు విధిస్తూ, భారత్ నుంచి ఎగుమతులకు అవరోధాలు సృష్టిస్తున్న దేశాల పేర్లు చెప్పాలని వ్యాపారవేత్తలకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ సూచించారు. అలాంటి దేశాలపై కచ్చితంగా ప్రతీకార చర్యలు ఉంటాయని ఆయన హామీ ఇచ్చారు. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ 92వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా గోయల్ ఈ విషయాలు తెలిపారు. ఏ ఒక్కరి విషయంలోనో కాకుండా అందరికీ ప్రయోజనాలు కలిగేలా సమస్య మూలాల్లోకి వెళ్లి పరిష్కరించాలన్నది తమ ప్రభుత్వ విధానమని ఆయన చెప్పారు. ‘ఏ దేశమైనా మీ ఎగుమతులపై టారిఫ్యేతర ఆంక్షలు విధించడం గానీ.. ఇతరత్రా అవరోధాలు గానీ సృష్టించడం గానీ చేస్తుంటే ప్రభుత్వానికి చెప్పండి. ప్రభుత్వం మీ వెన్నంటే ఉంటుంది. ఆయా దేశాలపై అదే తరహా వాణిజ్యపరమైన ఆంక్షలతో తగు చర్యలు తీసుకుంటుంది‘ అని గోయల్ తెలిపారు. వాస్తవ పరిస్థితులు మీరే చెప్పండి .. ‘మా అధికారులు నాకు చెప్పేవన్నీ.. అంతా బాగానే ఉందనే అభిప్రాయం కలిగేలా ఉంటాయి. కానీ మిమ్మల్ని చూస్తుంటే కచ్చితంగా అలా ఉన్నట్లు అనిపించడం లేదు. కాబట్టి వ్యవస్థ సరిగ్గా పనిచేస్తోందా లేదా.. సమస్యలేమైనా ఉన్నాయా.. వాస్తవ పరిస్థితులను మీరే ప్రభుత్వానికి తెలియ జేయండి. నేను, మా అధికారులు మీకు ఇరవై నాలుగ్గంటలూ అందుబాటులో ఉంటాం‘ అని చెప్పారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం, పరిశ్రమ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ద్రవ్యలోటును కట్టడి చేయాలి: ఐఎంఎఫ్ ఇదిలావుండగా, భారత్ ద్రవ్యలోటును కట్టడి చేయాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్ పేర్కొన్నారు. వ్యయాల హేతుబద్ధీకరణ, ఆదాయం పెంపు మార్గాల ద్వారా ఇది సాధ్యమని ఆమె పేర్కొన్నారు. ఫిక్కీ న్యూఢిల్లీలో నిర్వహించిన 92వ వార్షిక సదస్సులో ఆమె మాట్లాడారు. గడచిన కొద్ది త్రైమాసికాలుగా చూస్తే, ప్రైవేటు రంగం డిమాండ్ మందగమనంలో ఉందని ఆమె పేర్కొన్నారు. అలాగే పెట్టుబడుల్లో బలహీనత కొనసాగితే, దీర్ఘకాలంలో అది వృద్ధితీరుపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. బజాజ్ వ్యాఖ్యలకు కౌంటర్! ప్రభుత్వ విధానాలను విమర్శించే దమ్మెవరికీ లేకుండా పోయిందని, భయాందోళనలకు గురి చేసే వాతావరణం నెలకొందని పారిశ్రామిక దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన వ్యాఖ్యలపై గోయల్ స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే, తమ ప్రభుత్వం ప్రతీ ఒక్కరినీ గౌరవిస్తుందని, అందరి అభిప్రాయాలనూ వింటుందని చెప్పారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో.. ప్రజలు, పరిశ్రమవర్గాల నుంచి మరింతగా తెలుసుకోవాలనుకుంటోందని అసోచాం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా తెలిపారు. -
అబ్బాయిలను అలా పెంచాలి..
మగపిల్లల పెంపకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, వారికి జీవితంలో ఎత్తుపల్లాలు చూపించాలని బాలీవుడ్ నటి ట్వింకిల్ ఖన్నా అన్నారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలని, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్ బలంగా ఉంటుందన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆదర్శవంతంగా ఉంటే వారు బాధ్యతగా ఉంటారన్నారు. గురువారం ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మరెన్నోవిషయాలను పంచుకున్నారు. ‘‘మహిళా సాధికారతను ప్రోత్సహిస్తూ, సామర్థ్యాన్ని పెంచేందుకు వర్క్‌షాప్‌లు, వివిధ కార్యక్రమాలను ఎఫ్ఎల్ఓ సభ్యుల కోసం నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే అనేక రంగాల్లో ప్రతిభ గల ట్వింకిల్ ఖన్నాను ఆహ్వానించామని ఎఫ్ఎల్ఓ హైదరాబాద్ చైర్పర్సన్ సోనా చత్వాని తెలిపారు.’’ సాక్షి, హైదరాబాద్: మహిళలు పురుషులతో పోటీ పడగలరా? అని ఎవరన్నా అంటే.. ఆమెను చూపించి ‘మగవారికంటే ఇంకా ఎక్కువే చేయగలరు’ అని తల ఎగరేసి చెప్పొచ్చు. ఒకటీ.. రెండూ కాదు.. దాదాపు తొమ్మిది రంగాల్లో ఆమె ‘స్టార్’గా వెలుగొందుతున్నారు. ఓ పక్క ఇల్లాలిగా ఇంటిని చక్కదిద్దుకుంటూనే తనకు నచ్చిన రంగాల్లో దూసుకెళుతున్నారు. ఆమే ‘ట్వింకిల్ ఖన్నా’. ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి అలనాటి బాలీవుడ్ తారలు డింపుల్ కపాడియా, రాజేష్ ఖన్నాల కుమార్తె. హిందీ చిత్ర హీరో అక్షయ్ కుమార్ భార్య. ముక్కు సూటిగా మాట్లాడ్డం ఆమె స్వభావం, అందులో చమత్కారం జోడించటం ఆమె శైలి. నటి, ఇంటీరియర్ డిజైనర్, కాలమిస్ట్, పుస్తకాలు, కథల రచయిత, చిత్ర నిర్మాత.. ఇలా ఆమె జాబితాలో ఎన్నో విజయవంతమైన కెరీర్లు ఉన్నాయి. గురువారం సోమాజిగూడలోని పార్క్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్వింకిల్ ఖన్నా ‘ది ఫన్నీ సైడ్ ఆఫ్ లైఫ్’ అంశంపై ప్రత్యేకంగా మాట్లాడారు. తన జీవిత కథను ఫిక్కీ లేడిస్‌తో పంచుకున్నారు. వారు అడిగిన అనేక ప్రశ్నలకు బదులిచ్చారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే.. ‘నేను నా అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేస్తాను. నేను లౌకికవాదిని అని చెప్పడమే కాదు, అదే తీరులో మాట్లాడతాను. చెట్ల చుట్టూ పరుగెత్తడం విసుగొచ్చి చిత్రాల్లో నటించటం మానేశాను. మొదట అమ్మమ్మ ఇంటి దగ్గర చేపలు, రొయ్యలు అమ్మాను. కానీ అది రెండు వారాలు మాత్రమే. తర్వాత నేను ఇంటీరియర్ డిజైనర్‌గా మారి నటినయ్యాను. నేను తొమ్మిది రకాల కెరీర్లు మారాను. అసలైతే సీఏ కావలనుకున్నాను. కానీ అది జరగలేదు. నేను రచయితను అవుతానని చిన్నప్పుడే నాన్న అనేవారు. నాన్న ఇంటి నుంచి బయటికి వచ్చేశాక నేను, నా సోదరి కటిక నేలపై పడుకోవాల్సిన పరిస్థితి. మా నాన్న చిన్నప్పుడు పడి లేచిన అనుభవాలను మాతో పంచుకునేవారు. పిల్లలకు అలా చెప్పడమే సరైంది. మహిళలు కూడా ఎక్కువ పుస్తకాలు చదవాలి. వీలైనంత వైవిధ్యంగా చదవండి. తద్వారా వారు జీవితంలో అనేక విషయాలను, అవకాశాలను అందిపుచ్చుకోగలరు. అబ్బాయిలను అలా పెంచాలి.. తల్లిదండ్రులు తమ కుమారులకు స్ఫూర్తివంతంగా నిలవాలి. పిల్లలు అన్ని పుస్తకాలను చదివేలా చేయాలి. వారి అవగాహన మరింత విçస్తృతం చేయడానికి విభిన్నమైన పుస్తకాలను ఇవ్వాలి. తల్లిదండ్రులు తమ కొడుకులతో ఇబ్బందికరమైన విషయాలతో సహా అన్ని విషయాలపై స్నేహపూర్వకంగా మాట్లాడాలి. తరువాతి తరంలో మగపిల్లలు ప్రాధమిక సంరక్షణ ఇచ్చేవారు అవుతారు. పిల్లల జీవితాన్ని కఠినతరం చేయాలి. ఎత్తుపల్లాలు చూశాక, పడిలేచిన తర్వాత వారి భవిష్యత్ బలంగా ఉంటుంది. వారు పడకపోతే, వారిని తన్నడం తప్పు కాదు. పడి లేచినప్పుడే వారు ధృడంగా మారతారు’ అంటూ పేర్కొన్నారు. -
జీడీపీపై ఫిక్కీ తీవ్ర ఆందోళన
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశ ఆర్థిక వృద్ధి (ఏప్రిల్-జూన్ 2019) ఆరేళ్ల కనిష్టానికి పడిపోవడంపై పరిశ్రమ సంస్థ ఫిక్కీ ఆందోళన వ్యక్తం చేసింది. పెట్టుబడులు, వినియోగదారులు డిమాండ్‌లో గణనీయమైన క్షీణతను ఇది సూచిస్తుందని వ్యాఖ్యానించింది. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొంనేందుకు ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్నచర్యలు తరువాతి త్రైమాసికంలో ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చడానికి సహాయపడతాయని ఫిక్కీ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో అభిప్రాయపడింది. ఆర్థికవృద్ధి వేగం మందగించడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఫిక్కీ అధ్యక్షుడు సందీప్ సోమనీ తాజా జీడీపీ గణాంకాలు అంచనాలకు మించి బలహీనంగా వున్నాయన్నారు. అయితే విస్తృత చర్యలు, ఆయా రంగాల్లో నిర్దిష్ట జోక్యాల మేళవింపుతో భారత ఆర్థిక వ్యవస్థ ఈ సంక్షోభం నుంచి త్వరలో బయటకు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల ప్రభుత్వం మరియు ఆర్బిఐ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో జీడీపీ వృద్ధి రేటును పునరుజ్జీవింపజేస్తాయని చెప్పారు. మెగా బ్యాంకుల విలీనం, ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ, బ్యాంకులకు ఉద్దీపన ప్యాకేజీ లాంటివి కీలకమన్నారు. సీహెచ్డీసీసీఐ అధ్యక్షుడు రాజీవ్ తల్వార్ మాట్లాడుతూ. "ప్రభుత్వ రంగ బ్యాంకుల రీకాపిటలైజేషన్, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులపై మెరుగైన సర్చార్జిని రోల్‌బ్యాక్ చేయడం, పెండింగ్‌లో ఉన్న అన్ని జీఎస్టీ రిఫండ్స్‌ను ఎంఎస్ఎంఇలకు చెల్లించడం లాంటివి వృద్ధిని స్థిరపరుస్తాయన్నారు. అలాగే స్థిరకాల ఉపాధి, నియామకాలలో వెసులుబాట్లులాంటి కార్మిక చట్టాల సంస్కరణలతో పాటు, చిన్న,మధ్య తరహా వ్యాపారాలలో సంస్కరణలు కీలకమని తద్వారా ఉత్పాదక రంగాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. కాగా భారత ఆర్థిక వృద్ధి వరుసగా ఐదవ త్రైమాసికంలో క్షీణించి, జూన్ నెలతో ముగిసినమొదటి త్రైమాసికంలో ఆరేళ్ల కనిష్టం వద్ద 5 శాతానికి పడిపోయింది. ప్రపంచ ప్రతికూల సంకేతాలకు తోడు ప్రైవేటు పెట్టుబడులు, వినియోగదారుల డిమాండ్ మందగించడం ఈ పరిణామానికి దారితీసింది. కాగా ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌ను ఈ ఏడాది ప్రారంభంలోనే కోల్పోయిన భారత జీడీపీ వృద్ధి ఏప్రిల్-జూన్‌లో చైనా 6.2 శాతంతో పోలిస్తే బాగా వెనుకబడి ఉంది. గత 27 సంవత్సరాలలో ఇదే బలహీనం. -
ప్రింట్‌ను దాటనున్న ‘డిజిటల్’
ముంబై: ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా డిజిటల్ మీడియా ఇతరత్రా ప్రింట్, సినిమా మాధ్యమాలను అధిగమించనుంది. 2019లో సినిమా పరిశ్రమను, 2021 నాటికి ప్రింట్ మీడియాను దాటేయనుంది. 2021 నాటికి 5.1 బిలియన్ డాలర్ల స్థాయికి చేరనుంది. పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ–కన్సల్టెన్సీ సంస్థ ఈవై రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. 2019లో డిజిటల్ మీడియా 3.2 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉంటుందని ఇందులో అంచనా వేశారు. ఇక 2018లో 2.5 బిలియన్ డాలర్లుగా ఉన్న సినిమా సెగ్మెట్ ఈ ఏడాది 2.8 బిలియన్ డాలర్లకు చేరుతుందని, గతేడాది 4.4 బిలియన్ డాలర్లుగా ఉన్న ప్రింట్ మీడియా 2021 నాటికి 4.8 బిలియన్ డాలర్లకు చేరగలదని ఫీక్కీ–ఈవై నివేదిక అంచనా వేసింది. డిజిటల్ మీడియా గతేడాది 42 శాతం వృద్ధి చెంది 2.4 బిలియన్ డాలర్లకు చేరింది. భారతీయులు ఫోన్‌పై సగటున 30 శాతం సమయాన్ని వినోదానికి వెచ్చిస్తున్నారని నివేదికలో వెల్లడైంది. 57 కోట్ల మంది నెట్ వినియోగదారులు.. చైనా తర్వాత ప్రస్తుతం భారత్‌లోనే అత్యధికంగా ఇంటర్నెట్ యూజర్లు దాదాపు 57 కోట్ల మంది ఉన్నారు. ఏటా ఈ సంఖ్య 13 శాతం పెరుగుతోంది. ఆన్లైన్ వీడియోలు వీక్షించే వారి సంఖ్య 32.5 కోట్లు, ఆడియో స్ట్రీమింగ్ యూజర్స్ సంఖ్య 15 కోట్ల స్థాయిలో ఉంది. 2021 నాటికి ఓవర్ ది టాప్ వీడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 3–3.5 కోట్ల దాకా, ఆడియో సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 60–70 లక్షల దాకా పెరుగుతుందని ఫిక్కీ–ఈవై అంచనా వేసింది. టెలికం ఆపరేటర్లు కొత్తగా మల్టీ–సిస్టమ్ ఆపరేటర్ల అవతారమెత్తుతారని పేర్కొంది. ‘ప్రస్తుతం మొత్తం వినియోగంలో 60 శాతం వాటా టెలికం సంస్థల ద్వారా ఉంటోంది. ఇది 2021 నాటికి 75 శాతానికి .. 37.5 కోట్ల మంది సబ్‌స్క్రయిబర్స్ స్థాయికి చేరుతుంది‘ అని ఫిక్కీ–ఈవై తెలిపింది. మరోవైపు, టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ టారిఫ్ ఆర్డరుతో ఓటీటీ, టీవీ ప్రసారాల సంస్థల మధ్య వ్యత్యాసం గణనీయంగా తగ్గి.. ఓటీటీ సంస్థలకు లబ్ధి చేకూరవచ్చని వివరించింది. నివేదికలో మరిన్ని వివరాలు ♦ గతేడాది దేశీయంగా మొత్తం మీడియా, వినోద రంగం పరిమాణం 23.9 బిలియన్ డాలర్లకు చేరింది. 2017తో పోలిస్తే 13.4% వృద్ధి. 2021 నాటికి 33.6 బిలియన్ డాలర్లకు చేరవచ్చని అంచనా. ♦ 2018–21 మధ్య కాలంలో ఈ వృద్ధికి ఆన్లైన్ గేమింగ్, డిజిటల్ మీడియా ఊతంగా ఉండనున్నాయి. విభాగాలవారీ ఆదాయాలపరంగా టీవీ అగ్రస్థానంలో కొనసాగుతుంది. ♦ 2017లో 18.3 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ సబ్‌స్క్రయిబర్స్ సంఖ్య 2018లో 27.8 కోట్లకు ఎగబాకింది. ♦ టీవీ రంగం 2018లో 12 శాతం వృద్ధితో 10.6 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. 2021 నాటికి ఇది 13.7 బిలియన్ డాలర్లకు చేరనుంది. -
ఆర్థిక సాయం అత్యవసరం
భారత ఆర్థిక పరిస్థితిపై పలు ఆర్థిక విశ్లేషణా సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తక్షణం చర్యలకు సూచిస్తున్నాయి. మే 31 వ తేదీన 2018–19 (ఏప్రిల్–మార్చి) ఆర్థిక సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు విడుదల కానుండడం దీనికి నేపథ్యం. వచ్చే ఒకటి, రెండు నెలల్లో కేంద్రం 2019–2020 పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండడమూ ఇక్కడ ప్రస్తావనార్హం. 16వ లోక్‌సభ ఎన్నికలను పురస్కరించుకుని, ఫిబ్రవరిలో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయా అంశాల నేపథ్యంలో వెలువడిన వివిధ సంస్థల నివేదికలను చూస్తే.... తగ్గిన కంపెనీ ఆదాయాలు: ఇక్రా కంపెనీల ఆదాయాలు జనవరి–మార్చి (2018–19 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం)లో భారీగా పడిపోయాయి. ఈ కాలంలో కార్పొరేట్ ఆదాయాల్లో వృద్ధి కేవలం 10.7 శాతంగా నమోదయ్యింది. అంతక్రితం ఆరు త్రైమాసికాల్లో (18 నెలలు) ఇంత తక్కువ స్థాయి కార్పొరేట్ ఆదాయాల వృద్ధి రేటు నమోదుకావడం ఇదే తొలిసారి. రేటింగ్ ఏజెన్సీ ఇక్రా విడుదల చేసిన నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... కార్పొరేట్ నిర్వహణా పరమైన లాభాలు స్వల్పంగా 0.78 శాతం పడిపోయి, 16.8 శాతానికి చేరాయి. 304 లిస్టెడ్ సంస్థల ఫలితాల ప్రాతిపదికన ఇక్రా తాజా విశ్లేషణ చేసింది. ఒక్క వినియోగ సంబంధ కంపెనీలను చూస్తే, వృద్ధి లేకపోగా –2.3 శాతం క్షీణత నమోదయ్యింది. పాసింజర్ వాహనాలు, ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు అంత ఆశాజనకంగా లేవు. భారత పారిశ్రామిక రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. 2019 మార్చిలో (2018 మార్చితో పోల్చి) పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో అసలు వృద్ధి నమోదుకాలేదు. (మైనస్) 0.1 శాతం క్షీణత నమోదయ్యింది. పారిశ్రామిక రంగంలో ఈ తరహా క్షీణత పరిస్థితి తలెత్తడం 21 నెలల్లో ఇది తొలిసారి. మొత్తం సూచీలో దాదాపు 78 శాతం కలిగిన తయారీ రంగం పేలవ పనితీరు మొత్తం సూచీపై ప్రతికూల ప్రభావం చూపింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే, 2018 ఏప్రిల్ నుంచి 2019 మార్చి వరకూ పారిశ్రామిక వృద్ధి రేటు కేవలం 3.6 శాతంగా నమోదయ్యింది. ఈ రేటు మూడేళ్ల కనిష్టస్థాయి. 2017–18లో వృద్ధి రేటు 4.4 శాతం. 2016–17లో 4.6 శాతం, 2015–16లో 3.3 శాతం వృద్ధి రేట్లు నమోదయ్యాయి. వృద్ధి 6.9 శాతమే: ఇండ్–రా అంచనా కాగా 2018–19లో భారత్ ఆర్థిక వృద్ధి కేవలం 6.9 శాతంగానే ఉంటుందని రేటింగ్ ఏజెన్సీ ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ (ఇండ్–రా) అంచనావేసింది. ఇది కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనా 7 శాతంకన్నా తక్కువ కావడం గమనార్హం. ఆర్థిక మందగమన పరిస్థితులను అధిగమించడానికి మధ్య కాలిక తక్షణ చర్యలు అవసరమని సూచించింది. 2017–18లో భారత్ వృద్ధి రేటు 7.2 శాతం. ఇక ప్రత్యేకించి నాల్గవ త్రైమాసికం జనవరి–మార్చి కాలాన్ని చేస్తే, జీడీపీ వృద్ధి రేటు 6.3 శాతం నుంచి 6.6 శాతానికి తగ్గుతుందని అంచనాలను ఇండియా రేటింగ్స్ అండ్ రెసెర్చ్ వెలువరించింది. ఆర్థిక మందగమన పరిస్థితులను అధిగమించడం కేంద్రం ముందున్న తక్షణ సవాలని సంస్థ పేర్కొంది. అంతర్జాతీయంగా వాణిజ్య పరిస్థితులు తగిన విధంగా లేనప్పటికీ, విధాన, ద్రవ్య పరమైన దేశీయ చర్యల ద్వారా పరిస్థితులను కొంత అధిగమించవచ్చని నివేదిక పేర్కొంది. వ్యవసాయానికి ప్రాధాన్యత: ఐసీఐసీఐ బ్యాంక్ కేంద్రం తక్షణం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం– ఐసీఐసీఐ బ్యాంక్ తన తాజా పరిశోధనా నివేదికలో పేర్కొంది. వ్యవసాయ ఉత్పత్తుల వాణిజ్యం, బ్యాంకింగ్ నుంచే కాకుండా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి కూడా వ్యవసాయ రంగానికి సకాలంలో రుణ సదుపాయం అందేలా చూడ్డం వంటి చర్యలు అవసరమని సూచించింది. ప్యాకేజీ ప్రకటించాలి : ఫిక్కీ అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు, బలహీనపడుతున్న దేశీయ డిమాండ్ నేపథ్యంతో మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థకు పునరుత్తేజం కల్పించాల్సిన అవసరం ఉందని బడ్జెట్ ముందస్తు బడ్జెట్ మెమోరాండంలో ఫిక్కీ పేర్కొంది. ముఖ్యంగా ద్రవ్యపరమైన ఉద్దీపన చర్యల ప్యాకేజ్ని ప్రకటించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. 2018–19 అక్టోబర్–డిసెంబర్ త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి రేటు కేవలం 6.6 శాతంగా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఇండస్ట్రీ చాంబర్ ఫిక్కీ తన మెమోరాండంను విడుదల చూస్తూ, ‘‘భారత్ ఆర్థిక వ్యవస్థకు సానుకూలతలతో పాటు ప్రతికూలతలూ ఉన్నాయి. ఆయా అంశాలు ఆందోళన కూడా కల్గిస్తున్నాయి. ఇక్కడ ముఖ్యంగా చూస్తే, పెట్టుబడుల్లో వృద్ధి జోరు తగ్గింది. ఎగుమతులూ ఆశాజనకంగా లేవు. వినియోగ డిమాండ్‌లోనూ బలహీనతే కనిపిస్తోంది’’ అని ఫిక్కీ పేర్కొంది. ఆయా సవాళ్ల పరిష్కారంపై కేంద్రం తక్షణం దృష్టి సారించాల్సిన అవసరం ఉందని కూడా స్పష్టం చేసింది. తగిన ద్రవ్య, విధానపరమైన చర్యల ద్వారా వినియోగం, పెట్టుబడుల వృద్ధికి ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని, 2019–2020 బడ్జెట్ ఇందుకు ప్రభుత్వానికి ఒక అవకాశం కల్పిస్తుందని ఫిక్కీ పేర్కొంది. వృద్ధికి ఊపును అందించడంలో భాగంగా తొలుత కార్పొరేట్ పన్నులను 25 శాతానికి తగ్గించాలని, మినిమం ఆల్టర్నేటివ్ ట్యాక్స్ (మ్యాట్)ను రద్దు చేయాలని కోరింది. చిన్న పరిశ్రమల పురోగతికి ప్రత్యేక దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేసింది. ఇండస్ట్రీ చాంబర్ ప్రతినిధి బృందం ఒకటి రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండేతో సమావేశమై తన బడ్జెట్ ముందస్తు మెమోరాండంను సమర్పించింది. -
ఎఫ్ఎల్వో కొత్త కార్యవర్గం బాధ్యతలు
హైదరాబాద్, సాక్షి: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో), యంగ్ ఫిక్కీలేడీస్ ఆర్గనైజేషన్ ( వైఎఫ్‌ఎల్‌వో) సంస్థల కొత్త కార్యవర్గం మంగళవారమిక్కడ ప్రమాణ స్వీకారం చేసింది. ఎఫ్ఎల్వో ప్రెసిడెంట్‌గా ప్రియాంకా గనేరివాల్ , వైఎఫ్‌ఎల్‌వో ప్రెసిడెంట్‌గా వినితా సురానా సహా కొత్త కార్యవర్గ సభ్యులంతా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్‌రంజన్ మాట్లాడుతూ వీ–హబ్’ ఇన్నోవేషన్ సెంటర్‌కు అద్బుతమైన ఆదరణ వస్తోందని, స్టార్టప్స్ నుంచి దరఖాస్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెప్పారు. వీ హబ్‌లో చోటు దక్కిన ఔత్సాహిక మహిళలకు ఎఫ్ఎల్వో ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ, బూట్‌క్యాంప్‌లు ఏర్పాటు చేసే విషయం పరిశీలించాలని కోరారు. ఈ సందర్బంగా వివిధ విభాగాల్లో ప్రతిభ చూపిన మహిళలు స్వాతిలక్రా, రాషి అగర్వాల్ , వైశాలి నియోతియా, మీరా షెనాయ్, రూబీనా మజార్, డాక్టర్ కవితా దరియానిరావు, హిలా హెప్తుల్లా, జాహ్నవి, డాక్టర్ ఎవిటా ఫెర్నాండెజ్ తదితరులకు ఉమెన్ అచీవర్స్ అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో ఎఫ్ఎల్వో జాతీయ ప్రెసిడెంట్ పింకీరెడ్డి, కామిని షరాఫ్, సంధ్యారాజు సహా పలువురు సభ్యులు పాల్గొన్నారు. -
ఆ రంగాల్లో 2.5 కోట్ల ఉద్యోగాలు
బెంగళూరు : దేశంలో ట్రావెల్, టూరిజం రంగాలు భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించాయని తెలిసింది. 2017లో ఈ రంగాలు కలిసి 2.59 కోట్ల ఉద్యోగాలు సృష్టించాయని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించాయని ఇండియన్ ఇండస్ట్రి బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు వెల్లడించాయి. దేశంలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలుగా ట్రావెల్, టూరిజం రంగాలు ఉన్నాయని, ప్రత్యక్షంగానే ఈ రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలు అందించాయని ఈ రిపోర్టులు తెలిపాయి. దేశీయ ఎకానమీలో ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కీలక రంగాలుగా ఉన్నాయని, ఫారిన్ టూరిస్ట్ అరైవల్స్‌లో ఏడాది ఏడాదికి 15.6 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పాయి. ట్రావెల్ ఇండస్ట్రి భవిష్యత్తును మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వర్చ్యువల్/ అగ్మెంటెడ్ రియాల్టీ నిర్థారించనున్నాయని ఈ రిపోర్టులు తెలిపాయి. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ 2017 నుంచి 2021 నాటికి 14.8 శాతం పెరగనుందని రిపోర్టులు అంచనావేశాయి. 2019 నాటికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బిజినెస్ ట్రావెల్ మార్గెట్గా భారత్ నిలువనుందని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకం పెరుగడంతో, భారత్ డిజిటల్ ఎనాబుల్ టూరిస్ట్ గమ్యంగా మారనుందని చెప్పాయి. -
వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలి
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ) స్కామ్ ఆర్థిక వ్యవస్థలో భయాందోళనకు, అచేతనానికి దారితీయరాదని ఫిక్కీ సూచించింది. ఈ విధమైన పరిస్థితి ఏర్పడకుండా చూడాలని ఆర్బీఐ, ప్రభుత్వాలకు లేఖ రాసినట్టు ఫిక్కీ ప్రెసిడెంట్ రషేష్ షా తెలిపారు. షా ఎడెల్వీజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. పీఎన్బీ స్కామ్ యూపీఏ–2 హయాంలోని చివరి రోజులను గుర్తు చేస్తోందని, నాడు సీబీఐ, సీవీసీ, కాగ్ అంటే భయం ఉండేదని షా పేర్కొన్నారు. ఈ తరహా స్కామ్‌ల తో బ్యాంకింగ్ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్న ఆయన, 1992లో హర్షద్ మెహతా స్కామ్, 2001లో కేతన్ పరేఖ్ స్కామ్‌ల తర్వాత పరిస్థితిని గుర్తు చేశారు. పీఎన్బీ స్కామ్‌ను వ్యవస్థల బలోపేతా నికి అవకాశంగా సూచించారు. రుణాలపై ప్రభావం పడరాదు పీఎన్బీ స్కామ్‌తో దర్యాప్తు సంస్థలు, బ్యాంకులు అతిగా స్పందించడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు రుణాల జారీపై ప్రభావం పడుతుందని అసోచామ్ హెచ్చరించింది. బ్యాంకులు, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వ చర్యలు నష్టాన్ని పరిమితం చేసే విధంగా ఉండాలని సూచించింది. ‘‘కుంభకోణాలు బయటకు వచ్చాక, మీడియాలో ప్రముఖంగా వార్తలు రావడంతో ఈ స్థాయి హడావిడి సాధారణమే. కానీ, ఇది బ్యాంకుల విశ్వాసానికి విఘాతం కలిగిస్తుంది. కనుక ఎంతో నిగ్రహంతో ఈ సందర్భాన్ని ఓ అవకాశంగా భావించి వ్యవస్థాపరమైన సమస్యల పరిష్కారానికి వినియోగించుకోవాలి’’ అని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ సూచించారు. -
బ్యాంకుల దుస్థితి యూపీఏ నిర్వాకమే
సాక్షి, న్యూఢిల్లీ: బ్యాంకుల్లో కోట్లాది రూపాయల రాని బాకీలు పేరుకుపోవడానికి యూపీఏ సర్కారే కారణమని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. 2జీ, బొగ్గు, కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణాల కంటే మించి ఎన్పీఏ స్కామ్‌కు యూపీఏ తెగబడిందని ఆరోపించారు. పారిశ్రామికవేత్తలకు వేల కోట్ల రుణాలు ఇచ్చేలా యూపీఏ ప్రభుత్వం బ్యాంకులపై ఒత్తిడి తెచ్చిందన్నారు. పరిశ్రమ సంస్థ ఫిక్కీ సమావేశంలో ప్రధాని మాట్లాడుతూ గత యూపీఏ హయాంలో ‘ఆర్థికవేత్తలు’ మనకు ఎన్పీఏల సమస్యను అప్పగించారని పరోక్షంగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంలను ఉదహరించారు. తమ ప్రభుత్వం మహిళలకు ఉచిత వంటగ్యాస్, ప్రతి కుటుంబానికి బ్యాంక్ ఖాతాలు, యువతకు రుణాలు, అందుబాటు గృహాల వంటి ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని వివరించారు. పరిశ్రమ సంస్థలు ఎప్పటినుంచో కోరుతున్న జీఎస్టీని తమ ప్రభుత్వం అమలు చేస్తోందని, వీటి లాభాలను ప్రజలకు మళ్లించేలా యాంటీ-ప్రాఫిటీరింగ్ వంటి చర్యలు చేపట్టిందని చెప్పారు. రక్షణ, ఆర్థిక సేవలు, ఫుడ్ ప్రాసెసింగ్ సహా కీలక రంగాల్లో సమూల సంస్కరణలను ప్రవేశపెట్టామన్నారు. ప్రజల ఆకాంక్షలు,అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం తన విధానాలను రూపొందిస్తున్నదన్నారు. -
2022 నాటికి 21శాతం ఉద్యోగ ముప్పు
సాక్షి, ముంబై: 2022 సంవత్సరానికి నైపుణ్యతల కొరత కారణంగా కనీసం 21 శాతంమందికి ఉద్యోగ ముప్పు తప్పదని ఫిక్కి తాజా నివేదికలో పేర్కొంది. దేశంలో భవిష్య ఉద్యోగాల భద్రత అంశంపై నిర్వహించిన అధ్యయనంలో ఈ షాకింగ్ విషయాలను వెల్లడించింది. 132 పేజీల రిపోర్టును శుక్రవారం వెల్లడించింది. దేశంలో జనాభాపరమైన మార్పులు, ప్రపంచీకరణ, భారతీయ పరిశ్రమల ఆధునిక సాంకేతికీకరణ లాంటి వివిధ అంశాలపై ఇదిఆధారపడి ఉంటుందని రిపోర్ట్ చేసింది. నైపుణ్య ఆధారితవిద్య అవసరాన్నినొక్కి చెప్పడంతో పాటు ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు ఇతర పరిశ్రమలు ప్రారంభ దశలోనే ఈ మస్య పరిష్కారానికి మార్గాలు అన్వేషించాలని ఫిక్కి సూచించింది. నివేదిక ప్రకారం 2022 నాటికి ముఖ్యంగా ఐటీ రంగంలో నిపుణులు అత్యధిక ముప్పు ఎదుర్కొంటారని నివేదించింది. ఈనేపథ్యంలో ఇక్కడ నైపుణ్యాల ఆవశ్యకత చాలా ఉందని పేర్కొంది. 2022 నాటికి 20-30శాతం ఐటీ రంగ నిపుణులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదంలో పడనున్నారని అంచనా వేసింది. అలాగే వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్, వైర్లెస్ నెట్వర్క్, నిపుణులు, డేటా ఎనలిస్టులు, యాండ్రాయిడ్ డెవలపర్ తదితర కేటగిరీల్లో భవిష్యత్తు ఉద్యోగాలుంటాయని తెలిపింది. అలాగే వస్త్ర, ఆటోమొబైల్ , రిటైల్ వంటి ఇతర రంగాలు కూడా వేగంగా మారతాయని తెలిపింది. ప్రపంచంలో ఆన్లైన్ ఉద్యోగాల్లో 24శాతంతో భారీ స్థానాన్ని ఆక్రమించిన భారత్‌లో ఉద్యోగాల కల్పనలో రాబోయే ఏళ్లలో ఆన్లైన్, ఎక్స్‌పోనెన్షియల్ టెక్నాలజీ రంంలో అగ్రభాగంలోనూ, టెక్నాలజీ ఎగ్రిగేటర్ మోడల్ ఉబెర్ లాంటివి రెండవ కీలక రంగంగా ఉంటుందని తెలిపింది. అంతేకాదు ప్రభుత్వం, విధాన రూపకర్తలు రెండు-మూడు సంవత్సరాల కాలాన్ని ఉపయోగించుకోవాలని ఈ నివేదిక సిఫార్సు చేసింది. జనరల్, టెక్నికల్, వృత్తిపరమైన విద్యా వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు తీసుకురావాలని, ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని. పరిశ్రమలు వివిధ స్థాయిలలో ఉద్యోగుల శిక్షణ కార్యక్రమాలతోపాటు డిజిటల్ ఎకానమీ పద్ధతులను అలవర్చుకోవాలని కోరింది. -
అలరిస్తున్న మీడియా, వినోదం
⇒ 2021 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు వ్యాపార విలువ ⇒ వెల్లడించిన ఫిక్కీ, కేపీఎంజీ అధ్యయనం ముంబై: దేశీయ మీడియా, వినోద రంగం మంచి జోరుమీద ఉంది. 2021 నాటికి ఈ రంగం వ్యాపార విలువ రూ.2.41 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ఫిక్కీ, కేపీఎంజీ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ముంబైలో మంగళవారం జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సులో దీన్ని విడుదల చేశారు. వచ్చే నాలుగేళ్ల పాటు వార్షికంగా 13.9 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. దేశీయ మీడియా, వినోద పరిశ్రమ 2016లో మిశ్రమ ఫలితాలను ఎదుర్కొందని, బాక్సాఫీసు వద్ద సినిమాల ప్రదర్శర నిరాశపరిచిందని కేపీఎంజీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగం డైరెక్టర్ గిరీష్ మీనన్ పేర్కొన్నారు. కేవలం ఓ అదనపు మాధ్యమంగానే ఉన్న డిజిటల్ మీడియా వేగంగా కేంద్ర స్థానంగా మారిందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే మీడియా, వినోద రంగ సంస్థలు తమ విధానాలను డిజిటల్, మార్పులకు అనుగుణంగా మలచుకోవాలని, వ్యాపారం నిలదొక్కుకునేందుకు చురుకుదనం, మార్పు కీలమకని నివేదిక పేర్కొంది. ఆర్థికంగా మెరుగైన పరస్థితులు, దేశీయ వినియోగంలో పురోగతి, రూరల్ మార్కెట్ల తోడ్పాటుతో మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 2016లో ఆరోగ్యకరమైన వృద్ధిని నిలబెట్టుకున్నట్టు తెలిపింది. ఈ సానుకూలతలకు తోడు... డీమోనిటైజేషన్ నిర్ణయం వల్ల 2.5 శాతం వరకు వృద్ధికి విఘాతం కలిగినప్పటికీ ప్రకటనల్లో 11.2 శాతం వృద్ధి వల్ల మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 9.1 శాతం వృద్ధిని సాధించిందని వివరించింది. డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి తిరిగి గాడిన పడి స్థిరమైన వృద్ధిని కొనసాగించాల్సి ఉందని పేర్కొంది. మెరుగైన సదుపాయాల కల్పన, ప్రభుత్వ సహకారంతో ఈ పరిశ్రమ అద్భుతమైన స్థాయికి చేరుతుందని, ఉద్యోగ అవకాశాల కొనసాగింపు ద్వారా దేశానికి సామాజికంగా, ఆర్థికంగా విలువను తీసుకొస్తుందని ఫిక్కీ మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. ఏ విభాగంలో ఎంత వృద్ధి? ⇔ టెలివిజన్ పరిశ్రమ 2016లో 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. చందాదారుల ఆదాయంలో 7 శాతమే పెరుగుదల ఉండడం, ప్రకటనల ఆదాయం అంచనా వేసిన 11 శాతానికంటే తక్కువ ఉండడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. ⇔ ప్రింట్ మీడియా ఆదాయ వృద్ధి 7 శాతంగా ఉంది. ⇔ సినిమాల ఆదాయంలో వృద్ధి 3 శాతమే. ⇔ రేడియో, డిజిటల్ ప్రకటనలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్టస్ విభాగాలూ వృద్ధి చెందాయి. ⇔ డిజిటల్ ప్రకటనల్లో వృద్ధి 28 శాతంగా ఉంది. మొత్తం ప్రకటనల ఆదాయంలో 15% ఈ విభాగం సొంతం చేసుకుంది. ⇔ యానిమేషన్ విభాగం 16.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
ట్రంప్‌తో భయమేమీ లేదు: పరిశ్రమలు
న్యూఢిల్లీ: డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికలో విజయం సాధించడంపై దేశీయ పరిశ్రమ అభినందనలు తెలిపింది. అరుుతే అమెరికా మార్కెట్లో భారత ఫార్మా ఉత్పత్తుల్ని మరింత అనుసంధానించటం, నైపుణ్య ఉద్యోగుల సాఫీ రవాణాకు వీలు కల్పించటం చేస్తారనే ఆకాంక్ష వ్యక్తం చేసింది. ట్రంప్ విషయంలో నెలకొన్న భయాందోళలన్నీ తప్పని తేలినట్టు పేర్కొంటూ... ఆయన పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ట్రంప్ పాలనలో భారత్- అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు, ఆర్థిక సహకారం నూతన శిఖరాలకు చేరుతాయనే నమ్మకాన్ని ఫిక్కీ వ్యక్తం చేసింది. పరిష్కారమవుతాయని భావిస్తున్నాం.. నైపుణ్య కార్మికుల వలసలు, దేశీయ ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మార్కెట్ ప్రవేశం, ఆర్థిక సేవలు, ఎస్ఎంఈలకు సంబంధించిన సవాళ్లు పరిష్కారమవుతాయనే ఆశాభావంతో ఉన్నాం. అమెరికాకు సంబంధించి రక్షణ సహకారం, నైపుణ్య కార్మికుల రవాణా వంటివి ప్రధానంగా దృష్టి సారించే అంశాలు. వీటిపై ఇరుదేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ట్రంప్ సర్కారుతో పనిచేసేందుకు చూస్తున్నాం. - నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ ప్రెసిడెంట్ ట్రంప్ పట్ల నమ్మకం ఉంది.. ప్రపంచ దేశాలతో పారదర్శక ఒప్పందాలకు ట్రంప్ హామీ ఇచ్చారు. ట్రంప్ మాటలు నమ్మశక్యంగా ఉన్నారుు. ఫైనాన్షియల్ మార్కెట్లు తొలుత తీవ్ర భయాందోళన చెందినప్పటికీ తర్వాత కోలుకోవడం అమెరికాను మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ట్రంప్ దగ్గర గొప్ప కార్యచరణ ఉందన్న నమ్మకం కలగడం వల్లే. - సునీల్ కనోరియా, అసోచామ్ ప్రెసిడెంట్ ఇంజినీరింగ్ ఎగుమతులకు జోష్.. మౌలిక సదుపాయాలైన హైవేలు, విమానాశ్రయాలు వంటి వాటిపై పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తానని ట్రంప్ ప్రకటించారు. దాని వల్ల స్టీల్, మెషినరీ, ఉన్నత సాంకేతికత అరుున ఇంజనీరింగ్ ఎగుమతులకు భారీ డిమాండ్ ఉంటుంది. - టీఎస్ భాసిన్, ఇంజనీరింగ్ ఎగుమతుల మండలి (ఈఈపీసీ) చైర్మన్ వాణిజ్యం బలోపేతమవుతుంది గత దశాబ్దకాలంలో ద్వైపాక్షిక, ఆర్థిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాల విషయంలో ఇరు దేశాల మధ్య మెరుగుపడ్డ సంబంధాలను ట్రంప్ మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇరు దేశాల నాయకులు ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం సాకారానికి, వాణిజ్యం, పెట్టుబడులకు సంబంధించి సరికొత్త అవకాశాల అన్వేషణపై తాజా చర్యలు చేపట్టాల్సి ఉంది. - రాణా కపూర్, యస్ బ్యాంకు ఎండీ మన ఐటీకి ఇబ్బంది ఉండదు అమెరికా అధ్యక్ష ఎన్నిక ఫలితం.. స్వల్పకాలంలో భారత ఐటీ పరిశ్రమ నియామకాలపై ఎలాంటి ప్రభావం చూపదు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ చేసిన వాగ్దానాలు ఎప్పుడు ఆచరణలోకి వస్తాయో తెలియదు. అత్యుత్తమ డొమైన్ పరిజ్ఞానం, ప్రతిభ, వ్యయ నియంత్రణ అనేవి మన ఐటీ కంపెనీల బలం. వీటిని బట్టి చూస్తే మన ఐటీ పరిశ్రమ అమెరికాకు చాలానే ఇచ్చింది. దీన్ని వారు మరువరు. - అజయ్ కొల్లా, సీఈఓ- విస్డమ్జాబ్స్.కామ్ -
ఆర్థిక రంగం పనితీరు బాగు
♦ పరిశ్రమ వర్గాల అభిప్రాయం ♦ సమీప కాలంలో డిమాండ్ ♦ ఊపందుకుంటుందనే ఆశాభావం న్యూఢిల్లీ: దేశ ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు అంతకుముందు ఆరు నెలల కాలంతో పోల్చి చూసినప్పుడు మెరుగ్గా ఉన్నాయని భారత పరిశ్రమ (ఇండియా ఇంక్) వర్గాలు భావిస్తున్నారుు. అరుుతే, రుణాలపై వ్యయాలు, రుణాల అందుబాటు విషయంలో ఇంకా ఆందోళనకర పరిస్థితే ఉన్నట్టు ఫిక్కీ నిర్వహించిన వ్యాపార విశ్వాస సూచీ (ఓబీసీఐ) సర్వేలో అభిప్రాయాలు వ్యక్తమయ్యారుు. వ్యాపార విశ్వాసం ఆరు త్రైమాసికాల గరిష్ట స్థారుుకి చేరింది. సూచీ విలువ గత సర్వేలో 62.8గా ఉండగా తాజా సర్వేలో అది 67.3 శాతానికి పెరిగింది. సర్వే ప్రధానాంశాలు ♦ మోస్తరు నుంచి గరిష్ట స్థారుులో ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని 63 శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి వర్షాలు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అమలు డిమాండ్‌ను మరింత పెంచుతుందనే విశ్వాసం వ్యక్తమైంది. ♦ సర్వేలో పాల్గొన్న కంపెనీల ప్రతినిధుల్లో 31 శాతం మంది రానున్న ఆరు నెలల్లో మరింత మంది ఉద్యోగులను భర్తీ చేసుకునే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అయితే 56 శాతం మంది మాత్రం తాము సమీప భవిష్యత్తులో కొత్తగా ఉద్యోగ నియామకాలు చేపట్టకపోవచ్చని పేర్కొన్నారు. ♦ 75 శాతం మంది సమీప భవిష్యత్తులో ఆర్థిక రంగం మంచి పనితీరు కనబరుస్తుందని చెప్పారు. పరిశ్రమ స్థారుులో పనితీరు మెరుగుపడుతుందని 63 శాతం మంది అంచనా వేయగా, సంస్థల స్థారుులో మెరుగైన పనితీరు ఉంటుందని 70 శాతం మంది అభిప్రాయం తెలిపారు. ♦ దేశ ఆర్థిక రంగం తిరిగి కోలుకునే క్రమంలో ఉందని, ఆర్థిక రంగం పనితీరు మెరుగుపడుతుందనే సంకేతాలు ఉన్నట్టు చెప్పారు. సంస్కరణల విషయంలో ప్రభుత్వ చర్యలను మెచ్చుకుంటూ ఇకపైనా ఇదే కొనసాగుతుందనే ఆశావహ దక్పథం వ్యక్తమైంది. జీఎస్టీని దేశ ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేదిగా కంపెనీలు అభివర్ణించారుు. ♦ రుణాల వ్యయం విషయంలో సర్వేలో పాల్గొన్న వారిలో 54 శాతం మంది ఆందోళన వ్యక్తం చేశారు. అంతకుముందు సర్వేలో 46 శాతం మందే ఇలా చెప్పారు. రుణాల అందుబాటు విషయంలో 29 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. -
ఫిక్కీ మహిళల తొలి పారిశ్రామిక పార్కు!
పటాన్చెరు వద్ద 50 ఎకరాల్లో ఏర్పాటు: టీఎస్ఐఐసీ సహకారం... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ దేశంలో తొలిసారిగా హైదరాబాద్ వద్ద ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేస్తోంది. పటాన్చెరు సమీపంలోని సుల్తాన్పూర్ వద్ద 50 ఎకరాల్లో దీనిని నెలకొల్పుతున్నారు. ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ) సంయుక్తంగా ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తున్నాయి. ఒక్కో ఎకరాకు టీఎస్ఐఐసీ రూ.45 లక్షలు వసూలు చేస్తుంది. పార్కును ఏర్పాటు చేయాలని గత మూడేళ్ల నుంచి ఎఫ్ఎల్వో తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పార్కులో 3-5 ఏళ్లలో రూ.200 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చాప్టర్ చైర్పర్సన్ పద్మా రాజగోపాల్ తెలిపారు. 3-4 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఎఫ్ఎల్వో ప్రతినిధులు అపర్ణా రెడ్డి, కవితా దత్ చిట్టూరి, జ్యోత్స్న అంగారా, ఫిక్కీ తెలంగాణ చైర్మన్ దేవేంద్ర సురానా, టీఎస్ఐఐసీ జనరల్ మేనేజరు శ్రీకాంత్‌రెడ్డితో కలిసి బుధవారమిక్కడ మీడియాతో ఆమె మాట్లాడారు. సభ్యులకు మాత్రమే.. బెంగళూరు, లుథియానా, ఇండోర్ చాప్టర్లు సైతం ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలకు దరఖాస్తు చేసుకున్నాయని పద్మ రాజగోపాల్ సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. అన్నిటికంటే ముందుగా హైదరాబాద్ చాప్టర్ పార్కును నెలకొల్పుతోందని గుర్తు చేశారు. ఇక హైదరాబాద్‌లోని ఎఫ్ఎల్వో ఉమెన్ ఎంట్రప్రెన్యూర్స్ ఇండస్ట్రియల్ పార్కులో కేవలం సభ్యులకు మాత్రమే అవకాశం కల్పిస్తామన్నారు. ‘‘ఇక్కడ పర్యావరణానికి హాని కలిగించని కంపెనీలు మాత్రమే ఏర్పాటవుతాయి. యూనిట్ల స్థాపనకు ఇప్పటికే 36 దరఖాస్తులొచ్చాయి. ఇవన్నీ కూడా హైదరాబాద్ చాప్టర్ సభ్యుల నుంచే వచ్చాయి’’ అన్నారామె. దేశవ్యాప్తంగా ఉన్న ఎఫ్ఎల్వో చాప్టర్ల సభ్యులకు కూడా ఈ పార్కులో అవకాశం కల్పిస్తారు. పార్కులో మౌలిక సదుపాయాలను టీఎస్ఐఐసీ కల్పిస్తోంది. మహిళా పారిశ్రామికవేత్తలకు వర్తించే రాయితీలు ఉంటాయి. అనుమతి పొందిన రెండేళ్లలో యూనిట్‌ను ప్రారంభించాలన్న నిబంధన ఉంది. -
అమ్మో! అప్పుడేనా!!
• జీఎస్టీ అమలుకు సిద్ధంగా లేని కంపెనీలు • దాదాపు 20 శాతమే రెడీ అంటున్న నిపుణులు • పన్నుల అమలుకు భారీ ఐటీ వ్యవస్థ కావాలి • చిన్న కంపెనీల్లో ఆందోళనలు కూడా తొలగాలి • వచ్చే ఏప్రిల్ నుంచి అమలు కష్టమనే వ్యాఖ్యలు • 2017 జూలై లేదా అక్టోబర్ నుంచి అమలు!! • పూర్తి అమలుకు మరో రెండేళ్లు పట్టే అవకాశం రెండు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ దాదాపు 130 కోట్ల మంది జనాభా 29 రాష్ట్రాలు... 7 కేంద్రపాలిత ప్రాంతాలు అధికారికంగా గుర్తించిన 22 భాషలు... తొలిసారిగా దీన్నంతటినీ కలిపే ఏకైక మార్కెట్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఏ ప్రాంతమైనా, ఏ రాష్ట్రమైనా అన్నిచోట్లా ఒక వస్తువుకు ఒకే పన్నును ప్రతిపాదిస్తున్న ‘గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్’ బిల్లును సుదీర్ఘ రాజకీయ వ్యూహాల అనంతరం బుధవారం రాత్రి రాజ్యసభ కొన్ని సవరణలతో ఆమోదించింది. ఇంకా సమయం పడుతుందిలే... అని కాస్త పట్టనట్లుగా ఉన్న కంపెనీలు దీన్ని అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయా? ‘‘అసలు పని ఇప్పుడే మొదలైంది’’ అన్న రెవెన్యూ కార్యదర్శి శక్తికాంతదాస్ మాటల్ని చూస్తే కంపెనీలు సిద్ధంగా లేవనే అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రం, రాష్ట్రం వేరువేరుగా విధించే సెంట్రల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీలను ఒకేసారి ఉత్పత్తులపై విధించడానికి, ప్రభుత్వం చెబుతున్నట్లు అన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి భారీ ఐటీ వ్యవస్థ కావాలి. పన్ను వసూలుదార్లకు శిక్షణా ఇవ్వాలి. మొదట చిన్న కంపెనీలకు దీనిపై ఉన్న ఆందోళనలు పోవాలి. వస్తువును బట్టి పన్ను రేట్లు ఉంటాయి కనక తాము పెద్ద కంపెనీలతో పోటీ పడలేమన్న వాటి భయాలకు తగిన భరోసా కావాలి. నిజానికి జీఎస్టీని అమలు చేసిన పలు దేశాలు... దాని ఫలితాలు అందుకునే ముందు ఆర్థిక మందగమనాన్ని అనుభవించినవే. ‘‘భారత వృద్ధి రేటు మార్చి త్రైమాసికంలో 7.9 శాతంగా ఉంది. జీఎస్టీ అమలుతో వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో 0.8 శాతం పెరిగే అవకాశం ఉంది’’ అని హెచ్ఎస్బీసీ ఆర్థికవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. 20 శాతం కంపెనీలే సిద్ధం? పన్ను నిపుణుల అంచనాల ప్రకారం ప్రస్తుతం 20 శాతం కంపెనీలే జీఎస్టీ అమలుకు సిద్ధంగా ఉన్నాయి. తరచూ మారే పన్నులకు అలవాటు పడిన మిగతా కంపెనీలు ఇంకా దీనిగురించి ఆలోచించటంలేదు. మెజారిటీ రాష్ట్రాలు దీన్ని ఆమోదించిన తరవాత జీఎస్టీ మండలి అమల్లోకి వస్తుంది కనక... ఎప్పటి నుంచి దీన్ని అమలు చేయాలన్నది అదే నిర్ణయిస్తుంది కనక తమకింకా కొంత సమయం ఉందన్నది వాటి ఉద్దేశం. అయితే ఇదంతా జరగటానికి నవంబర్ వరకూ సమయం పట్టొచ్చు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో... వాస్తవంగా అమలుకాబోయే జీఎస్టీ బిల్లు రావచ్చు. ‘‘వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి దీన్ని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. అది కాస్త కష్టమే కావచ్చు. బహుశా!! వచ్చే ఏడాది జూలై లేదా అక్టోబర్ నుంచి అమలయ్యే అవకాశాలైతే ఉన్నాయి’’ అనేది నిపుణుల మాట. అయితే దీన్ని ఎప్పటి నుంచి అమలు చేసినా... పూర్తి స్థాయిలో దేశం మొత్తం దీన్ని అర్థం చేసుకుని అమల్లోకి తేవటానికి, దాని ఫలితాలు అందటానికి రెండేళ్లు పడు తుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనలో ఐటీ పరిశ్రమ..: నాస్కాం జీఎస్టీ బిల్లును ఆహ్వానిస్తున్నట్టు నాస్కాం తెలిపింది. అయితే సర్వీసు, ఐటీ రంగం ఆందోళన చెందుతోదని, ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలిపామని నాస్కాం ప్రెసిడెంట్ ఆర్. చంద్రశేఖర్ అన్నారు. ‘ప్రస్తుతం ఐటీ రంగానికి ఉన్న పన్నుల విధానం సులభంగా ఉంది. సెంట్రల్ సర్వీస్ ట్యాక్స్, సింగిల్ పాయింట్ రిజిస్ట్రేషన్, ఒకే ఇన్వాయిస్. అలాగే రిఫండ్‌కు ఒకేచోటకు వెళితే చాలు. అదే జీఎస్టీ విధానంలో సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వంటివి ఉంటాయి. ఈ పరిణామం పరిశ్రమకు సవాల్‌గా నిలుస్తుంది. ఐటీ సేవల రంగానికి జీఎస్టీ కాలరాత్రిగా ఉండరాదు’ అని అన్నారు. సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీని ఒకే పన్ను కిందకు తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరినట్టు చెప్పారు. కీలకమైన చట్టానికి ప్రతిపక్షం అందించిన సహకారంతో దేశంలో సంస్కరణల ప్రగతిపై పరిశ్రమ రంగానికి ఎన్నో ఆశలు చిగురించాయి. - హర్షవర్దన్ నియోతియా, ఫిక్కి ప్రెసిడెంట్ వేగంగా అమలుపైనే విజయం.. ఆటోమొబైల్ పరిశ్రమ హృదయపూర్వకంగా స్వాగతిస్తోంది. పన్నుల వ్యవస్థను విస్తృతం చేస్తుంది. వ్యవస్థ అంతటా సమర్థతను పెంచుతుంది. మార్కెట్‌ను ఏకం చేస్తుంది. విజయం సాధించడంలో వేగంగా అమలు అన్నది కీలకం అవుతుంది. - కెనిచి అయుకువ, ఎండీ, మారుతి సుజుకి ఇండియా పెట్టుబడులు వస్తాయి..: సెల్కాన్ ‘‘టెలికం ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా 5 శాతం మాత్రమే పన్ను ఉంచాలని ఇండియన్ సెల్యులార్ అసోసియేషన్ తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరాం. ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులకు దీనిని వర్తింపజేయాలి. మేక్ ఇన్ ఇండియా కాని పక్షంలో ఎక్కువ పన్ను వసూలు చేయాలి. ఇక జీఎస్టీ అమలైతే రవాణాతో ముడి పడిన వ్యయాలు తగ్గుతాయి. పన్ను సమస్యలుండవు. ఈ రంగంలోకి విదేశీ పెట్టుబడులు పెరిగేందుకు అవకాశం ఏర్పడుతుంది’’ - సెల్కాన్ మొబైల్స్ సీఎండీ వై.గురు వినియోగదారులకే లాభం • ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి • ‘సాక్షి’తో ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ జీఎస్టీ అమలు కోసం కంపెనీలు, వర్తకులు ఎన్నాళ్ల నుంచో ఎదురు చూస్తున్నారని ఫ్యాప్సీ తెలిపింది. పన్నుల విషయంలో స్వాతంత్రం అనంతరం జరిగిన అతిపెద్ద సంస్కరణగా జీఎస్టీని అభివర్ణించింది. ప్రస్తుతం పన్నులు సగటున 25-30 శాతం ఉన్నాయని, జీఎస్టీతో ఇది 17-18 శాతానికి దిగొస్తుందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ రవీంద్ర మోడీ చెప్పారు. ఆయనింకా ఏమన్నారంటే.. ‘‘పన్ను సంస్కరణలు చేపట్టింది కస్టమర్ల కోసమే. జీఎస్టీ అమలైతే అంతిమంగా లాభపడేదీ వారే. దేశవ్యాప్తంగా ఒకే ధర ఉంటుంది కనక వ్యాపారులు తమ విస్తృతి పెంచుతారు. ఎక్కువ వెరైటీలు అందుబాటులోకి వస్తాయి. ఎంచుకోవడానికి కస్టమర్లకు ఆస్కారం ఉంటుంది. ఉత్పత్తులు, సేవల ధరలు తగ్గుతాయి. అయితే సెంట్రల్ జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ కోసం వర్తకులు వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలి. చిన్న, మధ్యతరహా కంపెనీలు, చిన్న వర్తకులు ఈ విషయంలో ఆందోళనగా ఉన్నమాట వాస్తవమే. వేర్వేరు రిటర్నులు దాఖలు చేయాలంటే చాలా ఇబ్బందే. ఏమాత్రం తప్పు దొర్లినా కఠిన శిక్షలున్నాయి. రిటర్నులు ఎలక్ట్రానిక్ రూపంలో దాఖలు చేయాలి. అత్యధికులకు దీనిపై అవగాహన లేదు. కాబట్టి సీఏల సేవలు వినియోగించుకోవాలి. ఇదంతా వ్యయప్రయాసలతో కూడినదని వర్తకులు అంటున్నారు. నిజానికి జీఎస్టీతో ప్రభుత్వానికి పన్ను ఆదాయం గణనీయంగా పెరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. జీడీపీ 1.5-2 శాతం అధికమవుతుందన్న అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఎలక్ట్రానిక్ రూపంలో పన్నులు చెల్లించాలి కాబట్టి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను నిర్వహించాలి. సర్వీస్ కేంద్రాల వంటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి. పొరపాటున ఏవైనా తప్పులు దొర్లినా కఠిన శిక్షలు వేయకూడదు’’. -
జీఎస్టీ... కీలక అడుగు
బిల్లు ఆమోదంపై కంపెనీల ఆశలు.. న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుండటంతో కార్పొరేట్ రంగం ఆసక్తి పెరిగింది. ప్రత్యక్ష పన్నుల విధానంలో ఈ బిల్లును ఓ కీలక అడుగుగా భారత పారిశ్రామిక వర్గాలు అభివర్ణించాయి. ఎవరేమన్నారంటే.. వన్ ఇండియా: సీఐఐ ‘వన్ ఇండియా గురించి ఇప్పుడు పరిశ్రమ ఆలోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలూ ఇదే స్ఫూర్తితో ఉన్నందున బుధవారం నాడు జీఎస్టీ బిల్లు కీలకంగా మారనుంది. వినియోగదారుల కోణంలో పన్నుల భారం తగ్గడం పెద్ద ఉపశమనం.’ - నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ ప్రెసిడెంట్ భారత ఉత్పత్తులు పోటీనిస్తాయి: ఫిక్కీ జీఎస్టీ అమలుతో భారత ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పోటీ పడగలవని, ఇది ఆర్థిక రంగానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నట్టు పిక్కీ పేర్కొంది. ఎన్నో రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడం దేశవ్యాప్తంగా ఏకైక మార్కెట్‌కు మార్గం వేయడమేనని అభిప్రాయపడింది. -
భారత్ వృద్ధి 7.7 శాతం
2016-17పై ఫిక్కీ సర్వే అంచనా న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) 7.7 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని పారిశ్రామిక మండలి ఫిక్కీ నిర్వహించిన ఒక సర్వే తెలిపింది. తగిన వర్షపాతం అంచనాలు నిజమైతే అటు వ్యవసాయ రంగం, ఇటు పారిశ్రామిక రంగం రెండూ మెరుగుపడతాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెట్టుబడుల క్రమం కూడా పుంజుకునే వీలుందని వివరించింది. సర్వే ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వ్యవసాయ రంగం వృద్ధి రేటు 2.8 శాతం నమోదయ్యే వీలుంది. 1.6 శాతం- 3.5 శాతం కనిష్ట, గరిష్ట శ్రేణులను సైతం సర్వే పేర్కొనడం గమనార్హం. ఇక పారిశ్రామిక వృద్ధి 7.1 శాతంగా అంచనా వేసిన సర్వే, జీడీపీలో మెజారిటీ వాటా ఉన్న సేవల రంగం వృద్ధి రేటును 9.6 శాతంగా అంచనావేసింది. -
ఫిక్కీ అవార్డుకు మెదక్ ఎస్పీ ఎంపిక
సంగారెడ్డి మున్సిపాలిటీ: మెదక్ జిల్లా ఎస్పీ సుమతి ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) అవార్డుకు ఎంపికయ్యారు. జిల్లాలో ఆమె బాధ్యతలు చేపట్టాక ఫిర్యాదుల విభాగాన్ని బలోపేతం చేయడంతో పాటు ప్రజల సమస్యల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లాలోని 15 పోలీస్ సర్కిళ్లల్లో ‘చేతన’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పలు కేసుల పరిష్కారానికి అవకాశం కల్పించారు. మే 5న ఎస్పీకి ఢిల్లీలో అవార్డును అందజేయనున్నారు. -
తక్కువ వడ్డీరేట్లతోనే వృద్ధికి ఊతం
ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా న్యూఢిల్లీ: తక్కువ వడ్డీరేట్ల వ్యవస్థతోనే ఆర్థికాభివృద్ధి పుంజుకుంటుందని ఫిక్కీ కొత్త ప్రెసిడెంట్ హర్షవర్ధన్ నోతియా పేర్కొన్నారు. రిజర్వ్ బ్యాంక్ గడచిన ఏడాదిలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.25 శాతం తగ్గిస్తే...(6.75 శాతానికి) బ్యాంకులు కేవలం సగం కన్నా తక్కువగా ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించడం విచారకరమని పేర్కొన్నారు. తక్షణం బ్యాంకులు ఈ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదలాయించాలని అభ్యర్థించారు. ప్రైవేటు పెట్టుబడులు పెరగడానికి ఇది కీలకమని తెలియజేశారు. పెట్టుబడులను ఆకర్షించడానికి తగిన స్థాయికి వడ్డీరేట్లు తగ్గుతాయన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. కంపెనీలకు ప్రస్తుతం నిధుల సమీకరణ వ్యయం భారంగా మారినట్లు తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.2 శాతం నుంచి 7.4 శాతం శ్రేణిలో నమోదవుతుందన్నది తన అభిప్రాయమని అన్నారు. అయితే వచ్చే ఏడాది 8 శాతానికి, అటు తర్వాత రెండేళ్లలో 9 శాతానికి చేరుతుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. సమగ్ర జీఎస్టీ అవసరం ఎటువంటి లొసుగులూ లేని సమగ్ర వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) వ్యవస్థ అవసరమని నోతియా పేర్కొన్నారు. దేశాభివృద్ధికి జీఎస్టీపై రాజకీయాలకు అతీతమైన విధానాన్ని అనుసరించాలని కోరారు. ఈ దిశలో త్వరలో ముందడుగు పడుతుందని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. 30% నుంచి 25%కి కార్పొరేట్ పన్ను తగ్గింపు దిశలో... ప్రస్తుత రాయితీలు తొలగించడానికి సంబంధించి జాగరూకతతో కూడిన నిర్ణయాలను తీసుకోవాలని కోరారు. ఈ దిశలో పరిశ్రమ ప్రయోజనానికి పెద్ద పీట వేయాలని విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుతో ఫిక్కీ ప్రతినిధుల భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఫిక్కీ ప్రతినిధులతో భేటీ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లో డైరెక్ట్ సెల్లింగ్ పై ఫిక్కీ ప్రతినిధులు చంద్రబాబుకు నివేదిక అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వృద్ధిరేటు పడిపోతోందని.. ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుని వృద్ధి శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా ఫిక్కీ బృందం ముఖ్యమంత్రికి సూచించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి తో పాటు.. ఫిక్కీ చైర్మన్ అన్షూ భద్రాజ , ఐడీఎస్ఏ ఛైర్మన్ రజత్ బెనర్జీ లు పాల్గొన్నారు. అంతకు ముందు ఉదయం చంద్రబాబు నాయుడు బయోటెక్నాలజీ కార్యదర్శి విజయ రాఘవన్ తో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో సైన్స్ అండ్ టెక్నా పరిశోధనా సెంటర్ల ఏర్పాటు పై ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో బయోటెక్నాలజీ అభివృద్ది అవకాశాలపై ఆయన తో చర్చించినట్లు తెలుస్తోంది.