
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్ శాఖకు 2021–స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రకటించింది.
తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment