swati lakra
-
ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ షీటీమ్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మహిళలు, యువతుల రక్షణ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షీటీమ్స్ దేశవ్యాప్తంగా ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలిచిందని అడిషనల్ డీజీ స్వాతి లక్రా పేర్కొన్నారు. ఢిల్లీలో ఈనెల 5 నుంచి 7 వరకు నిర్వహించిన సీఎస్ల కాన్ఫరెన్స్‌లో ఇదే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిపారు. ఈ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్రమోదీతో కలిసి తీసుకున్న గ్రూప్ ఫొటోను ట్విట్టర్లో స్వాతి లక్రా షేర్ చేశారు. తెలంగాణ షీటీమ్స్ దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు బెస్ట్ ప్రాక్టీస్‌గా నిలిచిందని, ఇతర రాష్ట్రాల్లోనూ షీటీమ్స్ ఏర్పాటు చేయాలన్న అభిప్రాయం వెల్లడైనట్లు ఆమె వెల్లడించారు. -
తెలంగాణ పోలీస్‌కు ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు
సాక్షి, హైదరాబాద్: స్మార్ట్ పోలీసింగ్‌లో ఉత్తమ విధానాలను అమలు చేస్తున్నందుకుగాను ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) తెలంగాణ పోలీస్ శాఖకు 2021–స్మార్ట్ పోలీసింగ్ అవార్డును ప్రకటించింది. తెలంగాణ పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగంలో షీ–భరోసా, సైబర్ ల్యాబ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి బాలల రక్షణలో సాధించిన ఉత్తమ ఫలితాలకుగాను న్యూఢిల్లీలోని ఫిక్కీ ఈ అవార్డును ప్రకటించింది. ఈ ఫిక్కీ స్మార్ట్ పోలీసింగ్ అవార్డు–2021ను ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ పోలీస్ మహిళా భద్రతా విభాగం అదనపు డీజీపీ స్వాతి లక్రా స్వీకరించారు. -
‘బాల భటులు’ సిద్ధం.. దేశ పోలీసు చరిత్రలో తొలిసారి
సాక్షి, హైదరాబాద్: ‘నేను పొందిన అవగాహన తో నన్ను నేను రక్షించుకోవడంతో పాటు సమాజాన్ని సంరక్షిస్తానని, నా పాఠశాలలో ఉన్న పిల్లలు, పెద్దలు ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే వారికి సహాయం చేస్తానని, సలహాలు సూచనలు ఇస్తానని, సైబర్ పోలీసులకు, షీ–టీమ్స్‌కు సమాజానికి మధ్య వారధిగా ఉంటానని ప్రమాణం చేస్తున్నా’ మంగళవారం తెలంగాణలోని 1650 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన ‘బాల భటులు’ చేసిన ప్రమాణమిది. దేశ పోలీసు చరిత్రలోనే తొలిసారిగా తెలంగాణ పోలీసులు ఈ ప్రయోగం చేశారు. సైబర్ నేరాలను నిరోధించడానికి రాష్ట్ర మహిళ భద్రత విభాగం అమల్లోకి తెచ్చిందే ‘సైబర్ కాంగ్రెస్’. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు సైబర్ అంబాసిడర్లుగా తీర్చిదిద్దారు. విద్యాశాఖ అధికారులతో కలసి వర్చువల్‌గా 3 నెలల పాటు శిక్షణ ఇచ్చారు. ఈ బాల భటులు మంగళవారం నుంచి అధికారికంగా రంగంలోకి దిగారు. మొత్తం 33 జిల్లాల్లోని జిల్లా పరిషత్ స్కూళ్లలో జరిగిన కార్యక్రమాల్లో బాల భటులకు బ్యాడ్జీలు అందించారు. నగరంలోని మహబూబియా స్కూల్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి పాల్గొన్నారు. వీరి పర్యవేక్షణలో సైబర్ నేరాలపై చైతన్యం, అవగాహన కల్పించేందుకు సైబ్–హర్ క్యాంపెయినింగ్ జరిగింది. దీనికి కొనసాగింపుగా సైబర్ కాంగ్రెస్ చేపట్టారు. ఒక్కో పాఠశాల నుంచి ఇద్దరు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఉన్న పాఠశాలలను 16 యూనిట్లుగా చేశారు. విద్యా శాఖ, పోలీసు విభాగంతో పాటు స్వచ్ఛంద సంస్థ యంగిస్తాన్ ఫౌండేషన్‌తో కలసి మహిళా భద్రత విభాగం పని చేసింది. ఒక్కో ప్రభుత్వ పాఠశాల నుంచి 8, 9 తరగతులు చదువుతున్న ఇద్దరిని ఎంపిక చేశారు. వీరికి సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. ఇతరుల్లో అవగాహన పెంచడంతో పాటు బాధితులకు సహకరించే విధానాలు నేర్పారు. స్థానిక పోలీసుస్టేషన్లకు చెందిన ఇన్స్పెక్టర్లు అనుసంధానకర్తలుగా పని చేస్తారు. మహిళలు, బాలికలపై జరుగుతున్న నేరాలపై దృష్టి పెట్టారు. సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా చైతన్యం కలిగించడంతో పాటు బాలికల భద్రతకు భంగం వాటిల్లకూడదనే లక్ష్యంతో ముందుకెళ్లారు. ఈ విద్యార్థులకు సైబర్ నేరాలపై ప్రతి వారం ఆన్లైన్లో తరగతులు నిర్వహించారు. ఎదురయ్యే సమస్యలను తెలియజేయడంతో పాటు వాటికి పరిష్కార మార్గాలను నేర్పారు. ఇంటర్నెట్ను ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరిస్తూ విద్యార్థుల నుంచి సమాచారం సేకరించారు. ఆన్లైన్ నేపథ్యంలో... కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు తప్పనిసరయ్యాయి. చేతికి స్మార్ట్ఫోన్లు రావ డంతో క్లాసులతో పాటు యాప్‌ల వినియోగం, ఆన్ లైన్ గేమ్స్‌కు అలవాటు పడ్డారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాష్ చేసుకోవడంతో అనేకమంది విద్యా ర్థులు సైబర్ నేరగాళ్ల వల్లో చిక్కుతున్నారు. పర్యవేక్షణ లేని కొందరు పెడదారి పడుతున్నారు. వీటన్నింటికీ పరిష్కారంగా ఈ సైబర్ అంబాసిడర్లను రంగంలోకి దింపారు. సుశిక్షితులైన ఈ 3,300 మంది తమను తాము కాపాడుకోవడంతో పాటు సహ విద్యార్థులు, తల్లిదండ్రులు, స్నేహితులు, పరిచయస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పి స్తారు. బాధితులుగా మారిన వారికి పోలీసులు, షీ–టీమ్స్ ద్వారా సహాయసహకారాలు అందేలా కృషి చేస్తారు. తొలి విడతలో సైబర్ అంబాసిడర్లుగా మారిన 3,300 మందిలో 1,500 మంది బాలురు కాగా, 1,800 మంది బాలికలు ఉన్నారు. -
గో ఫర్ గోల్డ్
-
ప్రత్యేక టీం: మహిళలను వేధిస్తే ఇక తాట తీసుడే..
హైదరాబాద్: మహిళలపై వేధింపులు, ఎన్నారైల సమస్యలపై కృషి చేస్తున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసింది. గృహహింస, వరకట్న వేధింపుల్లో చిక్కుకున్న మహిళల కోసం విమెన్ విక్టిమ్స్ కాల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనుంది. లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో డొమెస్టిక్ వయొలెన్స్(డీవీసీ) కాల్ సెంటర్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో డీఐజీ సుమతి కాల్‌సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 200 మంది సిబ్బందితో జూలై మొదటి వారంలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడుభాషల్లో టెలీకాలర్స్: లాక్డౌన్ కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఏప్రిల్, మే నెలలో 14 వేలకుపైగా గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెల 1,800–2,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి విమెన్ విక్టిమ్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు. కేసు పురోగతి ఎలా ఉంది? దర్యాప్తు అధికారి (ఐవో) ఎలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలు కాల్ చేసి తెలుసుకుంటారు. తెలంగాణలో అనేక భాషల వారు నివసిస్తున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో టెలీకాలర్స్‌ను నియమించనున్నారు. ఐవో, బాధితులతో మాట్లాడి, డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్)ను ఏరోజుకారోజు నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్, కౌన్సెలింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తిస్తారు. -
వాట్సప్ చేస్తే ఉచిత భోజనం: తెలంగాణ పోలీసుల శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా మరో ముందడుగు వేసి కరోనా బాధితులకు అండగా నిలబడేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఆహారం కావాల్సిన కరోనా బాధితులు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. ఆ వివరాలు చదవండి. సత్యసాయి సేవా సంస్థ, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి తెలంగాణ పోలీసులు ‘సేవా భోజనం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన కరోనా బాధితులు ఉదయం 7 గంటలలోపు 77996 16163 నంబర్‌కు వాట్సప్‌లో వివరాలు పంపించాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. వీరిలో చిన్నారులు, వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని డీఐజీ స్వాతిలక్రా ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కరోనా బాధితులకు సద్దుదేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నియితే దుర్వినియోగం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చదవండి: జొమాటో సంచలనం: నోయిడాలో అమల్లోకి.. చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్ Telangana State Police by taking support from @ssssoindia, @leadlife_india, @SwiggyCares, @bigbasket_com & Hope Organization has launched a “Free Food” (lunch) for COVID patients who are in isolation at their doorstep. pic.twitter.com/DemeRRhLR8 — Telangana State Police (@TelanganaCOPs) May 6, 2021 -
సైబర్ బురిడీ: స్వాతి లక్రా పేరుతో కూడా..
సాక్షి, హైదరాబాద్: పోలీస్ అధికారుల ఫొటోలు, పేర్లు వినియోగించి ఫేస్బుక్లో నకిలీ ఖాతాలు తెరుస్తున్న సైబర్ నేరగాళ్లు.. అమాయకుల్ని బురిడీ కొట్తిస్తున్నారు. వీటి ద్వారా ఫ్రెండ్ రిక్వెస్టులు పంపి, చాటింగ్ చేసి, డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నగరంలోని మూడు కమిషనరేట్లలో ఉన్న అధికారులతో పాటు డీజీపీ కార్యాలయంలో పని చేసే వారి పేర్లతోనూ ఈ నకిలీ ఖాతాలు తెరుచుకున్నాయి. తాజాగా ఉమెన్ సేఫ్టీ అడిషనల్ డిజి స్వాతీ లక్రా పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలున్నట్టు వెల్లడైంది. తన పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ ఫేస్బుక్ అకౌంట్లు తెరిచి ఫ్రెండ్ రెక్వెస్టులు చేస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఆమె తెలిపారు. ఈ మేరకు ఆమె తన ఫేస్బుక్ ఖాతాలో స్పందించారు. ఎవరైనా పొరపాటుగా నకిలీ ఖాతాల నుంచి వచ్చిన ఫ్రెండ్ రెక్వెస్టులు యాక్సెప్ట్ చేస్తే.. వాటిని వెంటనే అన్‌ఫ్రెండ్ చేయాలని కోరారు. (చదవండి: గిఫ్ట్ పేరుతో రూ. 6.3 లక్షలు స్వాహా) నకిలీ ఖాతాలు సృష్టించినవారిపై చర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు. కాగా, పోలీస్ అధికారుల పేర్లతో నకిలీ ఖాతాలు సృష్టిస్తున్న నేరగాళ్లు.. ఫ్రెండ్ రెక్వెస్టులు చేసి.. చాట్ చేస్తున్నారు. కాస్త నమ్మకం కలిగాక ఏవేవో కారణాలు చెప్పి డబ్బు వసూలు చేస్తున్నారు. ఒడిశా, గుజరాత్ల నుంచి సైబర్ నేరగాళ్ల ఆపరేషన్ జరుగున్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 50 మంది పోలీసుల పేరుతో మోసాలు జరిగినట్టు వెలుగులోకి వచ్చింది. ఎస్సై నుంచి డిజి హోదా వరకు అందరి పేర్లతో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడ్డారు. నకిలీ ఖాతాల వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని బాధిత అధికారులు యోచిస్తున్నారు. మరోవైపు ఇలాంటి నేరగాళ్ల బారినపడకుండా ఉండటానికి కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందని సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే తరహా మోసాలు బయటికొచ్చాయి. విజయవాడ, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలువురు పోలీస్ అధికారుల పేర్లతో సైబర్ కేటుగాళ్లు ఫేస్బుక్ ఖాతాలు తెరిచి అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేశారు. (చదవండి: అధికారుల వివరాలతో నకిలీ ఫేస్బుక్ ఖాతాలు) -
అమీన్పూర్ కేసు స్వాతి లక్రాకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: అమీన్పూర్ కేసును ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ స్వాతి లక్రాకు అప్పగించారు. కేసుకు సంబంధించి ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశించారు. కేసు,నమోదు, అరెస్ట్ వివరాలను స్వాతి లక్రా తెప్పించుకున్నారు.డీజీపీ ఆదేశాల మేరకు ఉమెన్స్ సెక్యూరిటీ వింగ్ నుంచి ప్రత్యేక అధికారిని నియమించారు. నిందితుల అరెస్ట్, ట్రయల్స్, కేసు విచారణపై స్వాతి లక్రా దృష్టి పెట్టనున్నారు. (చిన్నారులను అందంగా అలంకరించి..) అమీన్‌పూర్‌లోని మియాపూర్ శివారులో మారుతి అనాథాశ్రమం ఉంది. అందులోని బాలిక ఏడాదిపాటు అత్యాచారానికి గురైంది. ఈనెల 12న నిలోఫర్ ఆసుపత్రిలో మృతి చెందింది. నిందితుడు వేణుగోపాల్ బాలికపై అత్యాచారం చేశాడని, అందుకు సహకరించిన అనాథాశ్రమ నిర్వాహకురాలు విజయ, ఆమె సోదరుడు జైపాల్‌పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అనాథాశ్రమం రంగారెడ్డి జిల్లా పరిధిలో రిజిస్ట్రేషన్ అయ్యింది. అనాథశ్రమ చిరునామాలను తరుచూ మారుస్తూ విజయ ఆ ఆశ్రమాన్ని నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆశ్రమంపై ఆరోపణలు ఒక్కొక్కటికి వెలుగులోకి వస్తున్నాయి. (అమీన్పూర్లో మరో ‘ముజఫ్ఫర్‌పూర్’) -
కేసుల్లో సత్వర విచారణ
సాక్షి, హైదరాబాద్: ఎన్ఆర్ఐ భర్తల వేధింపుల కేసులను వేగంగా విచారించి నిందితులకు తగిన శిక్ష పడేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని విమెన్‌సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా వెల్లడించారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో సమస్యలు, మోసాల పరిష్కారానికి వివిధ శాఖల మధ్య సహకారం, సమన్వయానికి మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో గురువారం కన్వర్జెన్స్ వర్క్ షాప్ జరిగింది. ఈ సందర్భంగా స్వాతి లక్రా మాట్లాడుతూ.. నగరంలోని ఎన్ఆర్ఐ సెల్‌తో పాటు రాష్ట్రంలోని పలు మహిళా పోలీస్ స్టేషన్లలో 586 ఎన్ఆర్ఐ వైవాహిక సంబంధిత ఫిర్యాదులు అందాయని వెల్లడించారు. 2019 జూలై 17న హైదరాబాద్‌లో ప్రారంభించిన ప్రత్యేక ఎన్ఆర్ఐ సెల్లోనే 73 ఫిర్యాదులు అందగా వీటిలో 70పై కేసులు నమోదు చేశామని, వీటిలో 41 విచారణలోనూ ఉండగా, 46 లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయని తెలిపారు. మరో 32 కేసులు నాన్ బెయిలబుల్‌గా నమోదయ్యాయని చెప్పారు. ఈ కేసులను సమర్థంగా విచారించేందుకు దర్యాప్తు అధికారులకు వెసులుబాటు ఉండేలా ఎస్.ఓ.పీలను రూపొందించామని వివరించారు. వీటి విషయంలో కేంద్ర ప్రభుత్వ విదేశీ మంత్రిత్వ శాఖ, జాతీయ మహిళా కమిషన్, విదేశీ ఎంబసీలతో సమన్వయం చేసేందుకు తగు చర్యలు చేపట్టామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ అనంతరం నమోదైన మొత్తం 586 ఎన్.ఆర్.ఐ కేసులలో అత్యధికంగా 248 కేసులు హైదరాబాద్ కమిషనరేట్‌లో, 99 కేసులు రాచకొండ పరిధిలో,99 సైబరాబాద్ పరిధిలో, వరంగల్‌లో 42, కరీంనగర్ లో 21, నిజామాబాద్‌లో 8 , నల్లగొండ, సిద్దిపేట, ఖమ్మం జిల్లాల్లో ఏడు కేసుల చొప్పున, మహబూబ్‌నగర్‌లో ఆరు, రామ గుండం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, జగిత్యాల జిల్లాల్లో ఐదు కేసుల వంతున నమోదయ్యాయని వివరించారు. ప్రాసిక్యూషన్స్ డైరెక్టర్ వైజయంతి మాట్లాడుతూ, తెలంగాణ పోలీస్‌శాఖ అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ వల్ల సామాన్యుల్లో పోలీసులపై ఎలా నమ్మకం ఏర్పడిందో, ఎన్ఆర్ఐ సెల్ ఏర్పాటు అనంతరం ప్రవాస భారతీయులు చేసే వివాహాల సంబంధిత మోసాల్లో బాధితుల్లో అంతే భరోసా ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. డీఐజీ సుమతి మాట్లాడుతూ.. విదేశీ భర్తల కేసుల విషయంలో ఎన్ఆర్ఐ సెల్ బాధితులు, విచారణసంస్థల మధ్య వారధిలా పనిచేస్తోందన్నారు. అనంతరం ఎన్నారై వివాహాల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చైతన్య పరిచే ఆడియో, కరపత్రాన్ని విడుదల చేశారు. పలు ఎన్నారై వివాహ కేసుల్లో రాజీ కుదిరి ఒక్కటైన జంటలను ఈ సందర్భంగా వేదికపై సత్కరించారు. -
ఆ చిన్నారుల మోములో చిరునవ్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులు, యాచకులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఆరవ విడత ‘ఆపరేషన్ స్మైల్’పూర్తయింది. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలిన వారిని రెస్క్యూ హోంలలో ఉంచారు. రక్షించిన వారిలో 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఈసారి నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో మొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలు గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ యాప్, దర్పణ్లను ఉపయోగించడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆరవ ఆపరేషన్ స్మైల్‌ను మహిళా రక్షణ విభాగం నిర్వహించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డేటాను డిజిటలైజ్ చేయడంతో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫొటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు. -
మగవాళ్లూ తెలుసుకోవాలి
మన రాజ్యాంగానికి స్ఫూర్తి ప్రకృతే! అందుకే స్త్రీ, పురుష వ్యత్యాసం లేకుండా ఇద్దరికీ సమన్యాయం పంచింది. అది అర్థం చేసుకోలేక.. అమలులో తేడాలు కనిపిస్తున్నాయి. అవగాహన పెంచుకునే చైతన్యం కరువై నేరాలు జరుగుతున్నాయి. హక్కులు ఎరుగక దాష్టీకానికి బలవుతున్నారు ఆడవాళ్లు, పిల్లలు! నిర్భయ చట్టం వచ్చినా దిశ ఘటన జరిగింది. ఇలాంటి దుర్ఘటనలు ఇక జరగకుండా.. మహిళలు తమ హక్కులు, వాటిని పరిరక్షించే చట్టాల గురించి దిశానిర్దేశం చేసేందుకే నేడు సాక్షి ‘ఫన్డే’ను ‘దిశ ప్రత్యేక సంచిక’గా వెలువరించింది. మహిళల భద్రత ప్రభుత్వాల బాధ్యతేకాదు.. వ్యక్తిగత బాధ్యతగానూ భావించి.. ఈ సంచికను లీగల్ గైడ్‌గా.. హ్యాండ్‌బుక్‌గా భద్రపర్చుకోవచ్చు అంటూ ఇంకో రెండు మంచి మాటలూ చెప్పారు తెలంగాణ పోలీస్ విభాగంలోని ‘విమెన్ సేఫ్టీ వింగ్’ఐజీ స్వాతి లక్రా..‘‘ఈ పుస్తకంలో ఉన్నవి మహిళలే కాదు మగవాళ్లూ తెలుసుకోవాలి. మహిళలకు సంబంధించిన హక్కులు, వాళ్ల భద్రత, రక్షణ కోసం ఉన్న చట్టాలను మగవాళ్లూ అర్థం చేసుకోవాలి. ఆ మాటకొస్తే ఒక కుటుంబంలోని వాళ్లంతా తెలుసుకోవాలి. అమ్మాయిల మీద ఆంక్షలు పెట్టడం కాదు అబ్బాయిల మీద బాధ్యత పెట్టాలి. ఆడపిల్లలను గౌరవించాలనే బాధ్యత పెట్టాలి. వాళ్లూ తన తోటి.. తనతో సమానమైన పౌరులే అనే స్పృహను కల్పించాలి. ఇది తల్లిదండ్రులు చేయాల్సిన ముఖ్యమైన పని. పేరెంట్స్ మగపిల్లలకు నేర్పించాల్సిన ముఖ్య విషయం. ఇది ప్రతి ఇంటినుంచి మొదలైనప్పుడే ఆడవాళ్ల మీద జరుగుతున్న నేరాలకు చెక్‌పడుతుంది. ఇంకో విషయం.. అమ్మాయికేదైనా జరిగితే అది అమ్మాయిదే తప్పు అనే భావనలోంచి బయటకు రావాలి సమాజం. ఆమె వస్త్రధారణనో ఇంకోటో కారణంగా చూపడం మానేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మాయిలో తప్పు వెదకడం మానేసి నేరం చేసిన వారి ప్రవర్తన మార్చే ప్రయత్నం జరగాలి. అలాగే అమ్మాయిలూ తప్పు తమదేనేమో అనే ఆత్మన్యూనతలోకి పోవద్దు. మహిళల మీద నేరాలకు సమాజం బాధ్యత వహించాలి. మహిళలకు అండగా ఉండాలి. ఒక ఇంట్లో అమ్మాయికేదైనా జరిగింది అంటే అది అమ్మాయికి మాత్రమే కాదు మొత్తం కుటుంబ సభ్యులందరికీ బాధే. ఆ సమయంలో ఆ అమ్మాయి, ఆ కుటుంబం కుంగిపోకుండా సమాజం అండగా ఉండాలి. అంతేకాదు.. అన్యాయాన్ని, ఇబ్బందిని, హింసను, నేరాన్ని మౌనంగా భరించకుండా బయటకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలి. దానివల్ల బాధితులకు న్యాయం జరగడమే కాదు.. తప్పు చేసిన వాళ్లకు శిక్షపడి.. భవిష్యత్‌లో ఇంకో అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ఉంటారు. మహిళల మీద జరుగుతున్న దాష్టీకాలను మహిళల సమస్యలుగా చూడొద్దు. ఇవి అందరికీ సమస్యలే. మొత్తం సమాజానికే సమస్యలు. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు భయవిహ్వలం కావాల్సిన అవసరంలేదు. హండ్రెడ్‌కు డయల్ చేయండి. పరిస్థితిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనండి. పోలీస్‌ల అండ మీకెప్పటికీ ఉంటుంది’’. -
మహిళా హాస్టళ్లకు మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, ఫుడ్ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసులైనప్పుడు ఇబ్బందులు.. లేడీస్ హాస్టళ్లలో వర్కింగ్ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్‌ను రూపొందించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్ రూపొందిస్తారు. అందులో హాస్టల్ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు. ముందుగా భాగ్యనగరంలోనే.. ఈ రిజిస్టర్ అమలు తొలుత హైదరాబాద్ కమిషనరేట్‌లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చాలామంది హాస్టల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హాస్టల్లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్‌ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. -
ఘరోసా
కడుపున మోస్తున్నప్పుడే కాదు, కన్న తర్వాత కూడా బిడ్డను కడుపులో పెట్టుకునే పెంచుతుంది తల్లి! నవమాసాలూ ఎంత భద్రంగా పొదవి పట్టుకుంటుందో.. కౌమారంలో అంతకు మించిన జాగ్రత్తతో కనురెప్పల మధ్య పెట్టుకుంటుంది. అయినప్పటికీ జరగరానిది జరిగితే? బిడ్డకెంత బాధో తల్లికీ అంతే వేదన. ఆ గాయం నుంచి ఊరటను కలిగించి న్యాయం జరిగేలా సాయం అందించే ఇల్లే.. ‘భరోసా’. ఆత్మ స్థైర్యాన్ని పెంచే ఘరోసా. ‘‘రెండేళ్ల కిందట.. ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకు అనుకుంటా..‘అమ్మా.. ఓనర్ తాత పిలుస్తున్నాడు..’’ అంటూ పైన అంతస్తులో ఉండే మా ఇంటి ఓనర్ వాళ్లింటికి వెళ్లింది పాప. పదిహేను నిమిషాలైనా కిందకి రాలేదు. ఎక్కడినుంచో ఏడుపు వినిపించింది. తర్వాత గమనిస్తే మా పాప ఏడుపే అని అర్థమై.. గబగబా పైకి వెళ్లాను. వీధి గుమ్మం గడియ వేసి ఉంది. ఆ గుమ్మం పక్కనే ఉన్న కిటికీ అద్దమొకటి పగిలిపోయి ఉంది. పాపను పిలుస్తూ అందులోంచి చూశా. లోపలి బెడ్రూమ్ కనపడుతోంది. నా గొంతు వినేసరికి మా పాప ఏడుస్తూనే అరిచేసింది ‘‘మమ్మీ ..’’ అంటూ! నేనూ గట్టిగా అరుస్తూ మళ్లీ తలుపు దబాదబా బాదా. పాప పరిగెత్తుకుంటూ లోపల్నించి వచ్చి తలుపు తీసింది. 57 ఏళ్ల మా ఓనర్ దాదాపు న్యూడ్‌గా ఉన్నాడు.. ఏడేళ్ల మా పాపను..’’ చెప్పలేక రెండు చేతుల్లో తల దాచుకొని ఏడ్చేసింది ఆ అమ్మ.ఆ వార్డ్ కౌన్సిలర్ అయిన ఆ ఇంటి ఓనర్ భార్య తన పలుకుబడితో తన భర్త నిర్దోషని, ఆ పాప తల్లే తన ఇంట్లో వెండి సామాను, డబ్బులు దొంగిలించిందని తప్పుడు కేసులు పెట్టింది. బ్లాక్మెయిల్, వేధింపులకూ గురిచేసింది. అయినా అవన్నీ వీగిపోయి.. ఆ ఓనర్ చేసిన తప్పు రుజువై పదేళ్ల జైలు శిక్ష పడింది.ఓ జంటకు పాప పుట్టింది. ఆ చంటిపిల్లకు మూడోనెల రాగానే ‘‘పాపకు నేనే స్నానం చేయిస్తాను’’ అంటూ భర్తే స్నానం చేయించడం మొదలుపెట్టాడు. అలా బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చేదాకా అతనే స్నానం చేయించాడు. ఒకరోజు తల్లి స్నానం చేయిస్తుంటే.. ‘‘అమ్మా.. స్నానం చేయించేటప్పుడు నాన్న ఇలా చేస్తాడు.. నువ్వు చేయట్లేదు’’ అని వచ్చీరాని మాటల్తో పాప చెబుతుంటే హతాశురాలైంది తల్లి. ‘‘బాధ్యతల్లో పాలుపంచుకుంటున్న అతణ్ణి ఇన్నిరోజులు మంచి భర్తగా భావించా కానీ అతని మనసులో ఉన్న రోతను గమనించలేకపోయానే’’ అని గుండె పగిలేలా ఏడ్చింది. భర్త మీద కేసు పెట్టింది. అతని నేరం రుజువు చేయడానికి నానాకష్టాలు పడ్డది. అలాంటి తండ్రికి బిడ్డ పట్ల విజిటింగ్ హక్కు ఇవ్వకూడదని కోర్ట్‌లో ఒక పోరాటమే చేసింది. ‘‘ఈపాటికల్లా పాల ప్యాకెట్లు వేసేసి పిల్లాడు ఇంటికి రావాల్నే.. ఇంకా రాలేదేంటి?’’ అనుకుంటూ పదకొండేళ్ల కొడుకును వెదుక్కుంటూ వెళ్లాడు తండ్రి. దార్లోనే కనిపించాడు కొడుకు పైజామా అంతా రక్తసిక్తమై. అది చూసిన ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ‘‘ఏమైంది బేటా..’’ అని తండ్రి అడిగేలోపే.. వణుక్కుంటూ ‘‘ఫలానా వీధిలో ఉండే అంకుల్ లోపలికి పిలిచి..’’ అంటూ జరిగిన దారుణం చెప్పాడు.దేవుడా..! అయినా ఇప్పుడెందుకు ఇవన్నీ ఏకరువు పెట్టారు? మన చుట్టూ జరుగుతున్న దారుణాల గురించి చెప్పడానికి వారం, వర్జ్యం, సందర్భం కావాలా? ఈ నేరాలు తెలిస్తేనే కదా.. మన పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎవరిని ఎంతలా గమనించాలి అన్న సత్యాలు బోధపడేవి! కరెక్ట్ ..ఇలాంటి అవగాహన, చైతన్యం కల్పించే కార్యక్రమాన్నే నిన్న హైదరాబాద్‌లో చేపట్టింది ‘‘భరోసా సెంటర్’’. ఈ కార్యక్రమంలో బాధితులు పంచుకున్న వెతలే అవి. తెలంగాణ పోలీస్ సహకారం, ఆడపిల్లల రక్షణకోసం పనిచేస్తున్న ‘తరుణి’ స్వచ్ఛంద సంస్థ టెక్నికల్ సపోర్ట్‌తో నడుస్తున్నదే ‘భరోసా’. బాలల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి, దానికోసం ఉన్న చట్టాల గురించి తెలియజేయడానికి, జరిగిన నేరానికి సంబంధించి హెల్ప్‌లైన్, కేసు నమోదు చేయడం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకేచోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు.. మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది.పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్ట్ హాలు, తికమక పెట్టే డిఫెన్స్ వాదన, నిందితుడి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో అమరుస్తోంది భరోసా. ఇందులో పిల్లలకు సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది ఆ ట్రామా నుంచి బయటపడేందుకు. న్యాయవిచారణలో సహకరించేందుకు. కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పుడు నిందితుడు పిల్లలకు కనిపించకుండా ఉండే ఏర్పాటూ ఉంటుంది. అవసరమైన పిల్లలకు పునరావాసమూ ఉంటుంది. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్‌కు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. మరో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే ఎక్కడా పిల్లలు నిందితుల కంటపడరన్నమాట. ‘‘భరోసా సెంటర్లు తెలంగాణలో ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో పెట్టాం. త్వరలోనే నల్గొండ, సూర్యాపేట్, వరంగల్, రాచకొండ కమిషనరేట్లలోనూ ఏర్పాటు చేస్తాం’’ అని చెప్పారు తెలంగాణ రాష్ట్ర విమెన్ సేఫ్టీ వింగ్ ఐజీ స్వాతి లక్రా. భరోసాకు ప్రేరణ.. అమెరికా, కాలిఫోర్నియాలోని శాండియాగోలో ఉన్నది రిహాబిలిటేషన్ సెంటర్. అక్కడ లైంగిక దాడి, అబ్యూస్‌కు గురైన పిల్లలను నేరుగా ఈ సెంటర్‌కే తీసుకొస్తారు. వాళ్లు శారీరకంగా, మానసికంగా పూర్తి ఆరోగ్యవంతులైన తర్వాతే ఇంటికి పంపిస్తారు. ఇక్కడైతే కోర్ట్ ప్రొసీడింగ్స్ కూడా పిల్లలకు తెలియకుండానే జరిగిపోతుంటాయి. ఒక గ్లాస్ విండో ఉన్న హాలులో పిల్లలతో కౌన్సెలర్ ఆడుకుంటూ జరిగిన విషయాలు నెమ్మదిగా చెప్పిస్తూ ఉంటాడు. ఈ విండోకి ఆవల కోర్ట్ హాల్ ఉంటుంది. అది పిల్లలకు కనిపించదు, వినిపించదు. కాని ఆ కోర్ట్‌కు మాత్రం పిల్లలు, కౌన్సెలర్ సంభాషణ వినపడ్తూంటుంది. అలా ప్రొసీడింగ్స్ సాగి తీర్పు వెలువడుతుంది. – సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇంటి నుంచే... ‘‘పిల్లల మీద జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టడానికి కొత్త చట్టాలు వచ్చాయి. దురదృష్టమేమంటే అందులో పేర్కొన్న విధానాల్లో కూడా పిల్లల మీద అఘాయిత్యాలు జరగడం. అయినా పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్) దాదాపు అలాంటివన్నిటినీ కవర్ చేస్తోంది. చట్టాలు రావడం, అమలు చేయడం ఒకెత్తయితే.. పిల్లలను జాగ్రత్తగా పెంచడం మరో ఎత్తు. ఇది తల్లిదండ్రుల బాధ్యత. ముఖ్యంగా మగపిల్లల పెంపకంలో ఇంటినుంచే జాగ్రత్త మొదలైతే సమాజం, దేశం సురక్షితంగా ఉంటుంది. అలాగే ఈ చట్టం గురించి తల్లిదండ్రులతో పాటు ప్రతి స్కూల్లో, ప్రతి విద్యార్థికి, టీచర్‌కు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నాం. భరోసాతోపాటు, తరుణి సంస్థ ద్వారా కూడా’’ – మమతా రఘువీర్, న్యాయవాది, తరుణి స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు. ►కొన్ని రాష్ట్రాల్లో ని పేద తల్లిదండ్రులు తమకు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు టూల్స్‌గా మారుస్తున్నారట. గుడిసెల్లో కెమెరాలుంటాయిట. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారుట ఆ పిల్లలు. ►పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా రికార్డుల్లో నమోదు చేయకూడదు. మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత తీసేయాలి. ►ఎస్సీ, ఎస్టీ బాలికలకు లేదా దారుణమైన స్థితిలో ఉన్న బాలికలకు ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 లక్షల నుంచి 8 లక్షల రూపాయల దాకా ఉండొచ్చు. ►బాధిత బాలికలకు నష్టపరిహారం ఉంటుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు .. ఇలా మొత్తం లక్ష రూపాయలదాకా ఆ నష్టపరిహారం ఉంటుంది. -
ఈ చీమలను చూసి నేర్చుకోండి!
-
ఈ చీమలను చూసి నేర్చుకోండి!
చిన్నపాటి ఆటంకాలు ఎదురైతే చాలు..చేస్తున్న, చేసే పని మధ్యలో ఎగ్గొట్టడానికి ప్రయత్నించేవారు చాలామందే ఉంటారు. కానీ ఈ చీమలు అలా చేయలేదు. ఐకమత్యంతో అనుకున్నది సాధించి మనుషులకు గుణపాఠాన్ని నేర్పించాయి. పిట్టగోడపై వెళుతున్న చీమలదండుకు మధ్యలో ఖాళీ ప్రదేశం కనిపించింది. దాన్ని దాటి అటువైపుకు ఎలా వెళ్లాలో వాటికి అర్థం కాలేదు. అలా అని వెనక్కు తిరిగి వెళ్లనూలేవు. ఏదేమైనా అవతలి గట్టుకు చేరుకోవాలనుకున్నాయి. అనుకున్నదే తడవుగా చేయి చేయి కలిపాయి. ఒక్కొక్కటిగా కలిసి గాలిలోనే వంతెనలా ఏర్పడ్డాయి. పట్టు వదలని విక్రమార్కునిలా చీమలు అనుకున్న పని సాధించి, ఐకమత్యమే మహా బలం అన్న మాటకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాయి. కలిసికట్టుగా ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించిన చీమలదండు వీడియోను ఐపీఎస్ అధికారి స్వాతి లక్రా ట్విటర్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు వాటి ఐకమత్యానికి అబ్బురపడుతున్నారు. చీమలను చూసైనా మనుషులు కాస్త నేర్చుకుంటే బాగుంటుంది అని ఓ నెటిజన్ అభిప్రాయపడ్డాడు. కలసికట్టుగా పనిచేస్తే ఏదైనా సాధించవచ్చని చీమలు మరోసారి నిరూపించాయని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. కాగా పలుసార్లు జంతువుల మనుషులకు పాఠాలు నేర్పే వీడియోలు వైరల్‌గా మారాయి. ఓ కోతి తన దాహాన్ని తీర్చుకున్న తర్వాత కుళాయిని కట్టేసిన వీడియో అందర్నీ ఆలోచింపజేసేలా చేసింది. ఇక ఓ ఏనుగు రోడ్డుపై పడి ఉన్న వ్యర్థ పదార్థాలను చెత్తడబ్బాలోకి విసిరేసి శభాష్ అనిపించుకున్న సంగతి తెలిసిందే! -
మంత్రముగ్ధుల్ని చేసిన నారీ నృత్యరూపకం
-
నాలుగేళ్ల తర్వాత టెక్నాలజీతో ఆచూకీ..
సాక్షి, హైదరాబాద్: ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పాటు, అధునాతన టెక్నాలజీతో పలు కీలక కేసులను చాకచాక్యంగా పరిష్కరిస్తూ తెలంగాణ పోలీసులు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా.. ఇటీవలే ఫెషియల్ రికగ్నైజేషన్ టూల్ సహాయంతో తప్పిపోయిన వారిని సొంతవారి చెంతకు చేరుస్తున్న తెలంగాణ పోలీసులు మరో కేసును విజయవంతంగా చేధించారు. తాజాగా మతిస్థిమితం లేని ఓ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. 2014లో మతిస్థిమితం లేని ఓ బాలిక ఇంట్లో నుంచి తప్పిపోయింది. ఆ తర్వాత గార్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి.. అప్పటి నుంచి ఆమెను ఘట్కేసర్లోని చైల్డ్ హోమ్‌లో ఉంచారు. తాజాగా ఫెషియల్ రికగ్నైజేషన్ సాంకేతికతో ఆ బాలిక వివరాలు సేకరించే ప్రయత్నం చేసిన పోలీసులు అందులో విజయం సాధించారు. ఆ బాలికను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని మహిళా భద్రత విభాగం చీఫ్ స్వాతి లక్రా ట్విటర్ ద్వారా వెల్లడించారు. #FacialRecognition Another successful detection by our Telangana Police Facial Recognition tool. She is of unsound mind, left home in 2014 and since missing. A case was registered at Garla P.S and kept at a Child Home in Ghatkesar in the year 2014. Restored to parents now. pic.twitter.com/AcWGkNifFM — Swati Lakra IPS (@IGWomenSafety) October 24, 2018 -
ఊరూరా..‘షీ’ వలంటీర్స్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో మహిళా భద్రతకు పెద్దపీట వేస్తూ పోలీసు శాఖ కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందులో భాగంగా మహిళా భద్రత విభాగం చీఫ్‌గా ఇటీవల నియమితులైన ఐజీ స్వాతి లక్రా నేతృత్వంలో గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు మహిళా భద్రత కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో షీ టీమ్స్ ఏర్పాటు, భరోసా కేంద్రం, చైల్డ్ కోర్టు.. ఇలా అనేక విప్లవాత్మక కార్యక్రమాలు నిర్వహించి పోలీస్ శాఖ విజయవంతమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యవస్థలనే జిల్లాల్లోనూ ఏర్పాటు చేసి మహిళా భద్రతను కట్టుదిట్టం చేసేందుకు పోలీస్ శాఖ సన్నాహాలు చేస్తోంది. ప్రత్యేక విభాగం.. రాష్ట్ర పోలీస్ శాఖలో ఇప్పటివరకు ప్రత్యేకంగా మహిళా భద్రత విభాగం అంటూ ఏదీ లేదు. సీఐడీలోని ఉమెన్ ప్రొటెక్షన్ సెల్, జిల్లాల్లోని మహిళా పోలీస్ స్టేషన్లు మాత్రమే ఉన్నాయి. విప్లవాత్మకంగా తీసుకువచ్చిన షీ టీమ్స్, భరోసా, చైల్డ్ కోర్టు తదితరాలను ఒకే యూనిట్ కిందికి తీసుకొచ్చేందుకు పోలీస్ శాఖ ప్రత్యేకంగా ఉమెన్ సేఫ్టీ వింగ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి స్వాతి లక్రా నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఈ విభాగం కింద ప్రతి గ్రామంలో మహిళా భద్రతతోపాటు చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల నియంత్రణకు వలంటీర్ల వ్యవస్థను తీసుకురానున్నారు. ఇందుకోసం ప్రతి జిల్లాలో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. మహిళల కేసుల్లో న్యాయ సహాయం, ఇతర సేవలందించేందుకు ప్రతి జిల్లా పోలీసు శాఖల ఆధ్వర్యంలో కౌన్సెలర్లను నియమించాలని పోలీస్ శాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరంతా గ్రామాల్లో పర్యటించి అంగన్వాడీ టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను వలంటీర్లుగా నియమించుకోవాలని భావిస్తున్నారు. మహిళలపై దాడులకు పాల్పడితే జరిగే పరిణామాలను వివరించడం, పాఠశాలల్లో విద్యార్థులకు మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై అవగాహన తరగతులు నిర్వహించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల నుంచే మహిళ భద్రతను పటిష్టం చేయవచ్చని, విద్యార్థి దశ నుంచే లింగ బేధ సమస్యలు, లైంగిక వేధింపులు– నియంత్రణపై అవగాహన ఏర్పాడుతుందని, భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉంటుందని పోలీస్ శాఖ భావిస్తోంది. జిల్లా కేంద్రాల్లో ‘భరోసా’ కేంద్రాలు ప్రతి జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. వరకట్న వేధింపులు, లైంగిక వేధింపులు, మహిళల సంబంధిత కేసుల్లో బాధితులకు న్యాయ సహాయం, పునరావాసం కల్పించేందుకు ఈ ఏర్పాటు చేయనున్నారు. అర్బన్ ప్రాంతాల్లో షీ టీమ్స్‌ను ఏర్పాటు చేయడంతోపాటు పోలీస్ స్టేషన్లలో ఉమెన్ హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి నెల మహిళా భద్రత, లైంగిక వేధింపుల నియంత్రణపై వలంటీర్లతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామ సర్పంచ్‌తోపాటు ఉపాధ్యాయులు, తదితరులను వలంటరీల కమిటీల్లో ఉండేలా ఏర్పాటు చేయనున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లో ఈ వలంటీర్ల వ్యవస్థను రూపొందించి మహిళా రక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు. -
రాశీఖన్నాకు రోబో షేక్‌హ్యాండ్
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ పోలీస్ శాఖ, షీ టీమ్స్ సంయుక్తంగా పోలీస్ ఎక్స్పోను ప్రారంభించారు. నగరంలోని పీపుల్స్‌ప్లాజాలో నిర్వహించిన ఈ ప్రదర్శనను రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరుగనున్న ఈ ఎక్స్‌పోలో పలు విషయాలపై అవగాహన కల్సించనున్నారు. ఈ కార్యక్రమానికి నటి రాశీఖన్నాతో పాటు, తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి, షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా తదితరులు పాల్గొన్నారు. ఎక్స్ పో ప్రారంభం అనంతరం నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ పోలీస్ ఎక్స్పో ఏర్పాటు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. మహిళల భద్రతను తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని తెలిపారు. స్వాతిలక్రా నేతృత్వంలో షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని.. షీ టీమ్స్ దేశానికే ఆదర్శమని కొనియాడారు. రోబో మిత్రా సందడి గతేడాది జరిగిన గ్లోబల్ ఎంటర్‌పెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో(జీఈఎస్) ప్రారంభ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన మర మనిషి ' మిత్ర' ఈ ఎక్స్‌పోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎక్స్‌పోకు వచ్చిన అతిథులకు స్వాగతం పలకడంతో పాటు స్వాగతోపన్యాసం కూడా చేసింది. కార్యక్రమంలో పాల్గొన్న రాశీఖన్నాకు రోబో షేక్‌హ్యాండ్ ఇచ్చి సందడి చేసింది. రెండు రోజుల పాటు స్టాల్స్ వద్దే ఉండి సందర్శకులతో మమేకం కానుంది. గంటకు 30 కిమీ వేగంతో పరుగెట్టే సామర్థ్యం కలిగిన మిత్ర ఆదివారం జరుగనున్న షీ టీమ్స్ రన్‌లోనూ పాల్గొననుంది. -
షీ టీమ్స్ తో కేసులు తగ్గాయి: స్వాతి లక్రా
సాక్షి, హైదరాబాద్: షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయని షీటీమ్స్ ఇన్చార్జ్ స్వాతి లక్రా అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్ 3వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, స్వాతి లక్రా, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు. ఈ సందర్భంగా షీటీమ్ ఈ-లర్నింగ్, షీటీమ్స్ ఫర్ మి వెబ్సైట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన స్వాతి...నేరాలను అదుపు చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేర రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు. -
స్టేట్‌బ్యాంక్ పేరుతో ఫేక్ మెయిల్స్.. జాగ్రత్త!
మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులా? మీకు ఆన్లైన్ అకౌంటు కూడా ఉందా? అయితే కాస్తంత జాగ్రత్తగా ఉండండి. ఆన్లైన్ ఎస్బీఐ అనేది అందరికీ బాగా తెలిసిన సైటే. అయితే, అచ్చం ఇదే పేరు పోలి ఉండేలా ఒక ఫేక్ మెయిల్ ప్రస్తుతం చాలా మంది కస్టమర్లకు వెళ్తున్నట్లు తెలిసింది. ఇలాంటి ఫేక్ మెయిల్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వీళ్ల వలలో పడొద్దని హైదరాబాద్ అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్) స్వాతి లక్రా ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీనికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్‌ను కూడా ఆమె షేర్ చేశారు. అందులో అచ్చం స్టేట్‌బ్యాంకు నుంచే వచ్చినట్లుగా ఉన్న మెయిల్ కనిపిస్తుంది. స్టేట్‌బ్యాంక్ లోగో కూడా ఉంటుంది. తమ బ్యాంకు ఐటీ వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తున్నామని చెబుతూ, మీ రికార్డులను కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందని, అందుకోసం ఈ లింకును క్లిక్ చేయాలని సూచిస్తూ ఒక లింకు పెడుతున్నారు. అందులో onlinesbi.me అనేది కనిపిస్తోంది. అలాగే, customercare@onlinesbi.me అనే మెయిల్ ఐడీని కూడా వైట్ లిస్ట్ / సేఫ్ సెండర్స్ లిస్టులో యాడ్ చేసుకోవాలని ఆ మెయిల్లో ఉంటోంది. అంటే, ఫేక్ మెయిల్ నుంచి వచ్చినవి స్పాంలోకి వెళ్లిపోకుండా నేరుగా ఇన్‌బాక్సులోకి వచ్చేలా మనంతట మనమే చేసుకునేలా ఈ సైబర్ నేరగాళ్లు మనల్ని వాళ్ల వలలోకి లాక్కుంటారన్న మాట. అలా చేయకపోతే ఇక మీదట ఎలాంటి అప్డేట్స్ రాకుండా మెయిల్ బాక్స్ ఫిల్టర్ లేదా ఐఎస్పీ ఫిల్టర్ ఆపేస్తాయని కూడా హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మోసగాళ్ల బారిన పడి, పొరపాటున వాళ్లు పంపిన లింకును క్లిక్ చేసినా, లేదా ఆ మెయిల్‌ను నాట్ స్పాం అని పెట్టినా ఇక మన పని అయిపోయినట్లే. కాబట్టి తస్మాత్ జాగ్రత్త! Please do not believe such mails. They are fake! pic.twitter.com/UJuFHR5TpH — Swati Lakra, IPS (@AddlCPCrimesHyd) 6 April 2017 -
బాలికపై ఇంటి యజమాని దారుణం
హైదరాబాద్ : నగరంలోని బోరబండలో దారుణం చోటుచేసుకుంది. బాలికను నిర్బంధించి ఇంటి యజమాని రెండు నెలలుగా అత్యాచారానికి పాల్పడుతున్న సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అంతేకాకుండా ఈ విషయం ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు ఈ విషయాన్ని బాలిక తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో బాధిత బాలిక, ఆమె తల్లిదండ్రులు మంగళవారం ఉదయం సాక్షి టీవీని ఆశ్రయించారు. సాక్షి టీవీ చొరవతో వాళ్లు షీ టీమ్ చీఫ్ స్వాతిలక్రాను కలిశారు. స్వాతి లక్రా ఆదేశం మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి నిందితుని కోసం గాలిస్తున్నారు. నిందితునిపై కఠినచర్యలు తీసుకుంటామని స్వాతి లక్రా తెలిపారు. -
పోకిరీలకు షీ టీమ్ షాక్ !
హైదరాబాద్: నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలు/యువతులు/బాలికల్ని వేధిస్తున్న 23 మంది పోకిరీలను షీ-టీమ్స్ అరెస్టు చేశాయి. పట్టుబడిన వారిలో ఓ స్కూల్ టీచర్‌తో పాటు 14 మంది మైనర్లు ఉన్నారని అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా గురువారం వెల్లడించారు. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన ఎన్.రెడ్డి కిరణ్, కె.రమేష్ వివిధ సర్వీసు ప్రొవైడర్లకు చెందిన సిమ్‌కార్డులు విక్రయించే వ్యాపారం చేస్తున్నారు. ఇలా తమ చేతిలో ఉన్న సిమ్‌కార్డుల్ని దుర్వినియోగం చేస్తున్న వీరిద్దరూ వాటిని వినియోగించి యువతులు/మహిళలకు ఫోన్లు చేస్తూ, అభ్యంతరకర సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నారు. ఇద్దరు బాధితులు నుంచి ఫిర్యాదు స్వీకరించిన షీ-టీమ్స్ నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించాయి. నగరంలోని యాకత్‌పురాకు చెందిన మహ్మద్ సలీముద్దీన్ వృత్తిరీత్యా టైలర్. స్థానికంగా ఉండే మహిళ ఫోన్ నెంబర్ సేకరించిన ఇతడు ఫోన్లు, వాట్సాప్ సందేశాలతో వేధిస్తున్నాడు. ఆమె కుమారుడు, భర్త మందలించినప్పటికీ లెక్క చేయకుండా తన పంథా కొనసాగించాడు. దీనిపై ఫిర్యాదు రావడంతో కేసు నమోదు చేసుకున్న షీ-టీమ్స్ నిందితుడిని అరెస్టు చేశాయి. నగరానికి చెందిన విద్యార్థులైన ఎ.రవీందర్ యాదవ్, జి.పరమేష్ కొన్ని రోజులుగా దిల్సుఖ్నగర్ ప్రాంతంలో కాలేజీ విద్యార్థిని వెంటపడుతున్నారు. పేరు, చిరునామా తదిరాలు చెప్పాల్సిందిగా వేధిస్తున్నారు. ఆ ప్రాంతంలో కాపుకాసిన షీ-టీమ్స్ వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశాయి. కటకటాల్లోకి చేరిన ‘టీచకుడు’... చాంద్రాయణగుట్టలోకి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్న సంతోష్‌నగర్ వాసి ఎన్.విజయ్‌కుమార్ ‘టీచకుడి’గా మారి షీ-టీమ్స్‌కు చిక్కాడు. చాంద్రాయణగుట్ట ప్రాంతానికి చెందిన ఎనిమిదో తరగతి బాలిక తన తల్లి సెల్‌ఫోన్ నుంచి రహస్యంగా ఎవరికో సందేశాలు పంపడాన్ని ఆమె సోదరి గుర్తించింది. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో అంతా కలిసి బాలికను ఆరా తీశారు. సెల్‌ఫోన్‌ను పరిశీలించగా ఆమె చదువుతున్న పాఠశాలలో లెక్కలు బోధిస్తున్న టీచర్‌కు పంపినట్లు తేలింది. అతడు ఇంటికి వెళ్లిన తర్వాత ఎస్సెమ్మెస్‌లు పంపమని వేధిస్తాడని బాలిక కుటుంబీకులకు చెప్పింది. సదరు టీచర్ నుంచి వచ్చిన ఎస్సెమ్మెస్‌ల్లో కొన్ని అభ్యంతరకరంగా ఉండటంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న అధికారులు ‘టీచకుడి’ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇతగాడి వ్యవహారాలను స్కూలు యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. విద్యార్థినులకూ చేదు అనుభవాలు... ఖైరతాబాద్‌లోని ఫిష్ మార్కెట్ సమీపంలో నిమ్మకాయ సోడాల విక్రేత జె.సంగప్ప ఓ ఎనిమిదో తరగతి విద్యార్థిని వెంటపడి వేధిస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో నాతో ఎందుకు మాట్లాడట్లేదు? నీ పేరు ఏంటి? అంటూ లేఖలు రాసి ఆమెపైకి విసిరాడు. సదరు బాలిక తన వెంటపడి వేధించవద్దంటూ లేఖ రాసి తన స్నేహితురాలి ద్వారా పంపింది. అయినప్పటికీ పంథా మార్చుకోని సంగప్ప వేధింపులు కొనసాగించాడు. దీంతో భయాందోళనలకు గురైన బాలిక స్కూలుకు వెళ్లడం మానేసి ఇంట్లోనే ఉండిపోసాగింది. దీంతో ఆరా తీసిన తల్లిదండ్రులకు అసలు విషయం చెప్పింది. బాలిక తండ్రి షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని సంగప్పను అరెస్టు చేశారు. కాచిగూడలోని సెయింట్ ఫ్రాన్సెస్ కాలేజ్ వద్ద ప్రత్యేక డ్రైవ్ చేపట్టిన షీ-టీమ్స్ వీడియో రికార్డింగ్‌తో నిఘా ఉంచాయి. ఆ ప్రాంతంలో ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న వివేక్ సింగ్, గౌరవ్ సింగ్‌లతో పాటు మరో 11 మంది మైనర్లను పట్టుకున్నాయి. వీరిలో మేజర్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచాయి. మైనర్లకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ చేశాయి. జూపార్క్ వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న చాంద్రాయణగుట్టకు చెందిన ముగ్గురు మైనర్లను షీ-టీమ్స్ పట్టుకున్నాయి. ధైర్యంగా ఫిర్యాదు చేయండి ‘నగరంలో వేధింపులు ఎదుర్కొనే వారు ధైర్యంగా తమకు ఫిర్యాదు చేయాలి. బాధితుల వివరాలు పూర్తి గోప్యంగా ఉంచుతాం. అత్యవసర సమయాల్లో ‘100’కు ఫోన్ చేసి తక్షణ సాయం పొందవచ్చు. షీ-టీమ్స్ వాట్సాప్ నెంబర్ 9490616555, ఈ-మెయిల్ ఐడీ (hydsheteam@gmail.com), ఫేస్బుక్ పేజ్, ట్విట్టర్ ద్వారా ఫిర్యాదులు ఇవ్వడం, సహాయం పొందడానికి అవకాశాలు కల్పిస్తున్నాం. పబ్లిక్‌గార్డెన్ సమీపంలోని హాకా భవన్లో ఉన్న భరోసా కార్యాలయానికీ నేరుగా రావచ్చు.’- స్వాతి లక్రా,అదనపు సీపీ -
ఆకతాయిలకు ‘షీ-టీమ్స్’ కౌన్సెలింగ్
నగరంలో యువతులు, మహిళల్ని వేధిస్తూ ‘షీ-టీమ్స్’కు చిక్కిన 20 మంది మైనర్లకు అధికారులు బుధవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా నేతృత్వంలో దాదాపు ఐదుగురు నిపుణులు మైనర్లకు వారి తల్లిదండ్రులు సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. కౌన్సిలింగ్ ఇస్తున్న సమయంలో ఆ మైనర్లతో అధికారులు ‘షీ మాస్క్’లు ధరించజేశారు. -
అక్కడ కార్లు చోరీ.. ఇక్కడ రూపుమార్చి విక్రయం
- హై ఎండ్ వాహనాలే టార్గెట్ - ఆరు రాష్ట్రాల్లో వాహన చోరీలు - నంబర్లు మార్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం - భారీ స్కాం బయటపెట్టిన సీసీఎస్ పోలీసులు హైదరాబాద్ బీమా కంపెనీల డేటాబేస్ నుంచి యాక్సిడెంట్ వెహికిల్స్ వివరాలు సేకరించడం... ఆయా సంస్థల్ని సంప్రదించి స్క్రాప్ ముసుగులో వాటిని ఖరీదు చేయడం... పత్రాలతో పాటు 'విడిభాగాలు' సేకరించడం... ఉత్తరాదిలో చోరీ చేయించిన వాహనాలకు వీటిని వినియోగించడం... అయితే అమ్మేయడం, లేదంటే ఫైనాన్స్ చేయించుకోవడం... ఈ పంథాలో గడిచిన 11 నెలల్లో 35 ఆధునిక వాహనాలను చోరీ చేసిన అంతరాష్ట్ర ముఠాను సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 13 వెహికిల్స్‌తో పాటు మార్పిడి పరికరాలు, బోగస్ పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు అదనపు సీపీ (నేరాలు) స్వాతి లక్రా తెలిపారు. సంయుక్త పోలీసు కమిషనర్ డాక్టర్ టి.ప్రభాకర్‌రెడ్డితో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. నకిలీ రిజిస్ట్రేషన్లతో దందా ప్రారంభం... విశాఖకు చెందిన సంగపు చక్రధర్ అలియాస్ వంశీ 2009 నుంచి నేరబాట పట్టాడు. మొదట్లో ఇతర రాష్ట్రాల్లో చోరీ అయిన వాహనాలకు దొంగ రిజిస్ట్రేషన్లు చేయించి.. రుణాలు తీసుకుంటూ ద్వారా ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులకు టోకరా వేస్తూ హైదరాబాద్ పోలీసులకు చిక్కాడు. ఇదే తరహాలో ఢిల్లీ, నోయిడా, ముంబై తదితర చోట్ల అరెస్టు అయ్యాడు. ఆ తరవాత ట్రాక్ మార్చిన చక్రధర్.. ఇన్సూరెన్స్ కంపెనీల ఆన్ లైన్ డేటాబేస్ మీద కన్నేశాడు. ప్రమాదాలకు లోనైన వాహనాలకు బీమా సొమ్ము చెల్లించే ఆయా సంస్థలు వాహనాలను స్వాధీనం చేసుకుంటాయి. స్క్రాప్‌లా అమ్మేందుకు ఆన్లైన్లో పొందుపరుస్తాయి. ఈ వివరాలను తెలుసుకునే చక్రధర్ ఆయా సంస్థల్ని సంప్రదించి వాహనంతో పాటు దాని పత్రాలను ఖరీదు చేసేవాడు. పత్రాలతో పాటు వాహనం ఇంజన్, ఛాసిస్ నెంబర్లు ఉండే భాగాలను భద్రపరిచి మిగిలింది స్క్రాప్‌గా అమ్మేసేవాడు. తన వద్ద ఉన్న పత్రాల్లో ఉన్న కంపెనీ, మోడల్, రంగుతో కూడిన కార్లను ఉత్తరాదిలో చోరీ చేయిస్తాడు. దీనికోసం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానా తదితర రాష్ట్రాల్లో 20 మంది అనుచరుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే చోరీ చేసిన వాహనానికి నకిలీ నంబర్ ప్లేట్, పత్రాల సాయంతో వాహనాలను దర్జాగా హైదరాబాద్ కు తీసుకువస్తారు. రాగన్నగూడలో 'మినీ వర్క్‌షాప్' ఇలా నగరానికి చేరుకున్న వాహనాలను చక్రధర్ రాగన్నగూడలో ఏర్పాటు చేసుకున్న డెన్‌కు తీసుకొస్తారు. అక్కడ పి.శివ, జి.రత్న కిషోర్, కె.శ్రీనివాసరావుల సాయంతో చోరీ వాహనానికి సంబంధించిన ఇంజన్, ఛాసిస్ నంబర్లు ఉండే ప్రాంతాలను కత్తిరించి 'స్క్రాప్' నుంచి సేకరించిన వాటిని అతికిస్తారు. అప్పటికే బీమా కంపెనీ నుంచి సేకరించిన 'స్క్రాప్ వాహనాల' పత్రాలు వీరి వద్ద ఉండటంతో ఆ రిజిస్ట్రేషన్ నంబర్‌నే చోరీ వాహనానికి వేస్తున్నారు. కోయంబత్తూరు కేంద్రంగా పని చేసే ప్రముఖ వాహనాల ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైనింగ్ సంస్థ దిలీప్ ఛాబ్రియా (డీసీ డిజైన్స్) ఔట్‌లెట్స్‌లో దాని రూపురేఖలు మార్చేస్తారు. దీంతో ఆర్టీఏ అధికారులు, ఆ వాహనం పొగొట్టుకున్న వారు సహా ఎవ్వరూ చోరీ చేసిన వాహనాన్ని గుర్తించడం సాధ్యం కాదు. ఇలా దొంగ వాహనాన్ని ముస్తాబు చేసి తెలుగు రాష్ట్రాల్లో అమ్మేస్తున్నారు. 'పుణె' నేర్పిన పాఠంతో.. చక్రధర్ గ్యాంగ్ ఈ ఏడాది మేలో పుణెలోని ఖత్రుడ్ ప్రాంతంలో ఓ ట్రావెల్స్‌కు చెందిన వాహనాన్ని చోరీ చేయించింది. దాన్ని హైదరాబాద్‌కు తీసుకువచ్చి, రూపురేఖలు మార్చిన చక్రధర్ సొంతానికి వాడుతున్నాడు. ఈలోపు ఓరోజు వనస్థలిపురం ప్రాంతంలో ఉండగా... నేరుగా వచ్చిన ఖత్రుడ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆగస్టు వరకు అక్కడి ఎరవాడ జైల్లో శిక్షఅనుభవించిన చక్రధర్.. తాను చేసిన తప్పేంటో తోటి దొంగల ద్వారా చర్చించాడు. హైఎండ్ వాహనాల్లో కంపెనీలు ఇంజన్ కంట్రోల్ మాడ్యూల్ (ఈసీఎం) అనే పరికరాన్ని ఏర్పాటు చేస్తాయని, ఇగ్నిషన్ తాళంతో అనుసంధానమై ఉండే ఈ పరికరం కారు స్టార్ట్ చేయగానే జీపీఎస్ కు అనుసంధానమై యజమానికి ఆ వాహనం ఉన్న ప్రాంతాన్ని చూపిస్తుందని అర్థం అయ్యింది. తాను చిక్కడానికి పుణెలో చోరీ చేసిన కారులో ఉన్న ఈసీఎం కారణమని తెలియడంతో ఆ తరవాతి నుంచి మరింత జాగ్రత్తగా ఈ పరికరాన్ని రీప్లేస్ చేసే ఏర్పాటు చేశాడు. ఫలితంగా వాహనాల్లో జీపీఎస్ కట్ అయిపోతోంది. ఎట్టకేలకు చిక్కిన ముఠా... దొంగతనం చేసిన వాహనాలు అమ్ముడుకాకపోతే.. వాటిపై ఫైనాన్స్ తీసుకునేవాడు. రుణం కట్టడం మానేసే వాడు. యూపీలోని ఓ సంస్థ నుంచి రూ.45 లక్షలు, విశాఖలో మరో 9 వాహనాలపై భారీ మొత్తం రుణం తీసుకున్నాడు. ఈ రుణం తీసుకోవడంలో ఫైనాన్స్ సంస్థలో పనిచేసే శ్రీనివాసరెడ్డి లంచం తీసుకుని సహకరించాడు. ఈ గ్యాంగ్ వ్యవహారాలపై సమాచారం అందుకున్న ఇన్స్పెక్టర్లు వి.శ్యాంబాబు, డి.సుధీర్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి వలపన్ని చక్రధర్, శివ, కిషోర్, శ్రీనివాసరావు, విజయ్, తన్వీర్లను అరెస్టు చేసి 13 వాహనాలు రికవరీ చేశారు. పరారీలో ఉన్న వారిని పట్టుకోవడంతో పాటు విశాఖలో ఉన్న తొమ్మిదింటితో పాటు వాహనాలను రికవరీ చేయాల్సి ఉందని స్వాతిలక్రా తెలిపారు. వీరు చోరీ చేసిన వాటిలో ఇన్నోవా, స్కార్పియో, డస్టర్, టవేరా, వెర్నా, స్విఫ్ట్ తదితరాలు ఉన్నాయి. రూపురేఖలు మారిపోయిన వాహనాల యజమానుల గుర్తింపూ కష్టంగా ఉందని, ఇప్పటికి ఇద్దరిని మాత్రమే గుర్తించామని అన్నారు. నిందితులపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని ఆమె చెప్పారు.