షీ టీమ్స్ తో కేసులు తగ్గాయి: స్వాతి లక్రా | celebrating three years of SHE TEAMS | Sakshi
Sakshi News home page

షీ టీమ్స్ తో కేసులు తగ్గాయి: స్వాతి లక్రా

Published Thu, Oct 26 2017 1:49 PM | Last Updated on Thu, Oct 26 2017 1:49 PM

షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయని షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాతి లక్రా అన్నారు.

సాక్షి, హైదరాబాద్: షీ టీమ్స్ ఏర్పాటుతో చాలా వరకు కేసులు తగ్గాయని షీటీమ్స్ ఇన్‌చార్జ్ స్వాతి లక్రా అన్నారు. ఆర్టీసీ కళాభవన్‌లో షీటీమ్స్ 3వ ఆవిర్భావ వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి, సీపీ మహేందర్ రెడ్డి, స్వాతి లక్రా, టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హాజరయ్యారు.

ఈ సందర్భంగా షీటీమ్ ఈ-లర్నింగ్, షీటీమ్స్ ఫర్ మి వెబ్‌సైట్లను ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన స్వాతి...నేరాలను అదుపు చేసేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నట్లు చెప్పారు. నేర రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రజలు కూడా సహకరించాలని ఆమె పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement