'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు' | SHE Teams complete one year, nab 281 eve-teasers in Hyderabad | Sakshi
Sakshi News home page

'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'

Published Wed, Oct 28 2015 6:50 PM | Last Updated on Sun, Sep 3 2017 11:38 AM

'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'

'వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు'

హైదరాబాద్: 'షీ' టీమ్స్ వల్ల  మహిళలపై వేధింపులు తగ్గాయని హైదరాబాద్ అదనపు కమిషనర్ స్వాతి లక్రా తెలిపారు. 'షీ' టీమ్స్ ఏర్పాటు చేసిన ఏడాది పూర్తైన సందర్భంగా బుధవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎవరు వేధించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు. ఈ-మెయిల్, వాట్సప్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చని తెలిపారు. 'షీ' టీమ్స్ పై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఇప్పటివరకు 281 మంది పోకిరీలను అరెస్ట్ చేశామని, 12 మందిపై నిర్భయ కేసులు పెట్టామని చెప్పారు. అరెస్టైన వారిలో 129 మంది మైనర్లు ఉన్నారన్నారు. ఏడాది మొత్తంలో 883 ఫిర్యాదు వచ్చాయని తెలిపారు. డయల్ 100 ద్వారా 575, ఫేస్ బుక్ ద్వారా 196 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement