పరిశ్రమల విస్తరణకు అవసరమైన మౌలిక వసతులను సమకూరిస్తే పెట్టుబడులు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కలసి ప్రతిపాదించారు.
తెలంగాణ ఆర్థికమంత్రి ఈటెలను కలసిన సీఐఐ, ఫిక్కీ బృందం
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల విస్తరణకు అవసరమైన మౌలిక వసతులను సమకూరిస్తే పెట్టుబడులు పెడతామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ను సీఐఐ, ఫిక్కీ ప్రతినిధులు కలసి ప్రతిపాదించారు. సచివాలయంలోని ఆర్థికమంత్రి చాంబర్‌లో శనివారం ఆయనను కలసిన ప్రతినిధులు తమ ఇబ్బందులను, పరిష్కారాలను వివరించారు.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమి, పన్నులు, విద్యుత్తు, నీరు, మానవవనరులు వంటివాటి విషయంలో రాయితీలు, ప్రభుత్వ సహకారం ఉంటే లక్షల కోట్లు తెలంగాణకు పెట్టుబడులుగా వస్తాయని చెప్పారు. హైదరాబాద్ నుండి చుట్టూ 100 కిలోమీటర్ల పరిధిలో ఫార్మా, హార్డ్‌వేర్ వంటి భారీ పరిశ్రమలకు అవకాశముందని చెప్పారు.