భారత్‌ ఎకానమీ వృద్ధి కోత | FICCI recently released its Economic Outlook Survey for 2024-25 | Sakshi
Sakshi News home page

భారత్‌ ఎకానమీ వృద్ధి కోత

Published Fri, Jan 17 2025 8:23 AM | Last Updated on Fri, Jan 17 2025 11:47 AM

FICCI recently released its Economic Outlook Survey for 2024-25

భారత్‌ ఎకానమీ 2024–25 ఆర్థిక సంవత్సరం అంచనాలకు పారిశ్రామిక మండలి–ఫిక్కీ(FICCI) 60 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) కోత పెట్టింది. దీనితో ఈ అంచనా వృద్ధి రేటు 7 శాతం నుంచి 6.4 శాతానికి తగ్గింది. ఈ మేరకు ఫిక్కీ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ సర్వే విడుదలైంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎకానమీ వృద్ధి రేటు 6.4 శాతంగా ఉంటుందని జాతీయ గణాంకాల విభాగం ఇటీవలే అంచనాలను వెలువరించిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ పాలనా కాలంలో భారత్‌కు సంబంధించి స్వల్ప కాలిక ఇబ్బందులు తప్పవని సర్వే అభిప్రాయపడింది.

ఎగుమతులు(Exports), విదేశీ మూలధన పెట్టుబడులు, ముడి పదార్థాల వ్యయాల వంటి అంశాలను ఈ సందర్భంగా నివేదిక ప్రస్తావించింది. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు ప్రపంచ వ్యాప్తంగా సరఫరాల చైన్‌కు సమస్యలు తెచ్చే వీలుందని అవుట్‌లుక్‌ పేర్కొంది. భారత్‌ ఎకానమీలో ప్రైవేటు వినియోగం కీలక అంశమని తెలిపింది. అగ్రి ఉత్పాదకత, గ్రామీణ మౌలిక పరిస్థితులు, కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాలు పెంపుపై దృష్టి పెట్టాలని సర్వే సూచించింది. దేశంలో ద్రవ్యోల్బణం దిగిరావచ్చని, ఇది వడ్డీరేట్లు దిగిరావడానికి దోహదపడుతుందని విశ్లేషించింది.

కైలాక్‌కు భారత్‌ ఎన్‌సీఏపీ రేటింగ్‌

వాహన రంగంలో ఉన్న స్కోడా(Skoda) ఆటో ఇండియా తయారీ కైలాక్‌ ఎస్‌యూవీ తాజాగా భారత్‌ ఎన్‌సీఏపీ 5–స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌ దక్కించుకుంది. స్కోడా నుంచి ఈ రేటింగ్‌ పొందిన తొలి మోడల్‌ ఇదే. స్కోడా కుషాక్, స్లావియా ఇప్పటికే గ్లోబల్‌ ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్‌ పొందాయి. ‘స్కోడా డిజైన్‌లో భద్రత ఒక భాగం. 2008 నుండి ప్రతి స్కోడా కారు ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత్‌లో 5–స్టార్‌ సేఫ్టీ రేటింగ్‌తో క్రాష్‌–టెస్ట్‌ జరిగింది. భారత్‌లో 5–స్టార్‌ సేఫ్టీ–రేటెడ్‌ కార్ల సముదాయంతో భద్రతపై కంపెనీ ప్రచారంలో ముందుంది’ అని స్కోడా తెలిపింది.

ఇదీ చదవండి: పాత పన్ను విధానం తొలగింపు..?

భారత్‌లో జేవీసీ రీ–ఎంట్రీ

కంజ్యూమర్‌ ఎల్రక్టానిక్స్‌ తయారీలో ఉన్న జపాన్‌ బ్రాండ్‌ జేవీసీ భారత టీవీ విపణిలో రీఎంట్రీ ఇచ్చింది. ఇందుకోసం నోయిడాకు చెందిన సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌తో బ్రాండ్‌ లైసెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రీమియం స్మార్ట్‌ క్యూఎల్‌ఈడీ టీవీలను తాజాగా ప్రవేశపెట్టింది. ధర రూ.11,999 నుంచి ప్రారంభం. ఇవి అమెజాన్‌తో ప్రత్యేకంగా లభిస్తాయి. థామ్సన్, కొడాక్, బ్లావ్‌పంక్ట్, వైట్‌–వెస్టింగ్‌హౌజ్‌ (ఎలక్ట్రోలక్స్‌) బ్రాండ్ల ఉత్పత్తులను సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ ఇప్పటికే తయారు చేస్తోంది. ఫిలిప్స్‌ బ్రాండ్‌ కోసం షెంజెన్‌ స్కైవర్త్‌ డిజిటల్‌తో కంపెనీ ఒప్పందం చేసుకోనున్నట్టు తెలుస్తోంది. 2019లో వీరా గ్రూప్‌తో చేతులు కలిపిన జేవీసీ కంజ్యూమర్‌ డ్యూరబుల్స్‌ మార్కెట్లోకి ప్రవేశించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement