
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉమా చిగురుపాటి ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా అనుభవమున్న శుభ్రా .. ప్రస్తుతం బ్లూస్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టరుగా ఉన్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మొదలైన వాటితో పాటు 300 పైచిలుకు కార్పొరేట్ సంస్థలకు ఆమె సీఏగా సేవలు అందించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా శుభ్రా మహేశ్వరి తెలిపారు.
2022–23 సంవత్సరానికి గాను ఎఫ్‌ఎల్‌వో గౌరవ కార్యదర్శిగా గుంజన్ సింధీ, ట్రెజరర్‌గా నిషిత మన్నె, గౌరవ జాయింట్ సెక్రటరీగా శిల్ప రాజు, జాయింట్ ట్రెజరర్‌గా మాయా పటేల్ నియమితులయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment