FICCI Ladies Organisation
-
జీడీపీలో 2 శాతం
న్యూఢిల్లీ: భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం ప్రత్యక్ష ప్రభుత్వ పెట్టుబడితో 11 మిలియన్ల ఉద్యోగాలను సృష్టించవచ్చని ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఓ) తాజా నివేదిక పేర్కొంది. మొత్తం ఉపాధి సృష్టిలో దాదాపు 70 శాతం మహిళలకు ప్రయోజనం కలుగుతుందని కూడా విశ్లేíÙంచింది. భారత్ పురోగతికి తీసుకోవాల్సిన అంశాలపై ఎఫ్ఎల్ఓ ఒక రోడ్‌మ్యాప్‌ను కూడా ఆవిష్కరించింది. వీటిలో అంశాలు– లీవ్ పాలసీలు, కేర్ సరీ్వస్ సబ్సిడీలు, కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పెట్టుబడి, కేర్ వర్కర్లకు నైపుణ్య శిక్షణ, నాణ్యత హామీ కీలకమైనవని నివేదిక పేర్కొంది. -
ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్వో) హైదరాబాద్ చాప్టర్ చైర్‌పర్సన్‌గా శుభ్రా మహేశ్వరి బాధ్యతలు చేపట్టారు. ఇప్పటిదాకా ఈ స్థానంలో ఉమా చిగురుపాటి ఉన్నారు. సుమారు రెండు దశాబ్దాల పైగా చార్టర్డ్ అకౌంటెంట్‌గా అనుభవమున్న శుభ్రా .. ప్రస్తుతం బ్లూస్టోన్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టరుగా ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ మొదలైన వాటితో పాటు 300 పైచిలుకు కార్పొరేట్ సంస్థలకు ఆమె సీఏగా సేవలు అందించారు. మహిళల్లో ఆర్థిక అక్షరాస్యత, నైపుణ్యాలపై అవగాహన కల్పించడం తదితర అంశాలపై కృషి చేయనున్నట్లు ఈ సందర్భంగా శుభ్రా మహేశ్వరి తెలిపారు. 2022–23 సంవత్సరానికి గాను ఎఫ్ఎల్వో గౌరవ కార్యదర్శిగా గుంజన్ సింధీ, ట్రెజరర్‌గా నిషిత మన్నె, గౌరవ జాయింట్ సెక్రటరీగా శిల్ప రాజు, జాయింట్ ట్రెజరర్‌గా మాయా పటేల్ నియమితులయ్యారు. -
ట్వింకిల్ ఖన్నాకు ఫిక్కి అవార్డు
ముంబై : రచయిత్రిగా దూసుకుపోతున్న బాలీవుడ్ మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా ఫిక్కి మహిళా సమాఖ్య ఐకాన్ అవార్డు అందుకున్నారు. సామాజిక స్పృహ కలిగి ఉన్న ట్వింకిల్ ఖన్నా సినిమా రంగానికి చేస్తున్న కృషికి గానూ ఆమెకు అవార్డు ప్రదానం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. విఙ్ఞాన్ భవన్లో గురువారం జరిగిన ఈ అవార్డుల కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్వింకిల్‌తో పాటు వివిధ రంగాలలో కృషి చేసిన పది మంది మహిళామణులు అవార్డులు అందుకున్నారు. రుతుక్రమం గురించి మహిళల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు, పాటించాల్సిన శుభ్రత గురించి అవగాహన కల్పించేందుకు తెరకెక్కించిన ‘పాడ్‌మాన్’ సినిమాకు ట్వింకిల్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘మిసెస్ ఫన్నీ బోన్స్’, ‘ద లెజెండ్ ఆఫ్ లక్ష్మీ’ అనే పుస్తకాలు రచించారు. ఈ సందర్భంగా ట్వింకిల్ మాట్లాడుతూ.. ‘మహిళలు ముందుకు వెళ్లడానికి ప్రయత్నించడం కంటే ఎవరో ఒకరి వెనుక ఉండటానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అసలు సమస్య. ఇప్పటికైనా ఇలాంటి దృక్పథాన్ని వదిలి మన జీవితాల్ని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఉందంటూ’ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ట్వింకిల్.. ‘ఒక్కోసారి నేను సరైన మార్గంలోనే ప్రయాణిస్తున్నానా అనే అనుమానం కలుగుతుంది. ఒత్తిడి కారణంగానే ఇలాంటి ఆలోచనలు వస్తాయి. కాబట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలని’ అన్నారు. -
ఫిక్కీశక్తి
-
రాజకీయాల్లోకి రండి..
‘రాజకీయాలను, ప్రభుత్వాలను తిట్టుకుంటూ కూర్చుంటే సరిపోదు. స్వచ్ఛమైన, కల్మష రహిత నేపథ్యం ఉన్నవాళ్లు మరింత ఎక్కువగా రాజకీయాల్లోకి రావాలి’ అంటూ స్పష్టం చేశారు షాజియా ఇల్మి. దేశ రాజకీయాల్లో స్వల్పకాలంలోనే చిరపరిచితమైన నేతగా ఎదిగిన ఈ ఢిల్లీ మహిళ... సిటీకి వచ్చారు. నగరానికి చెందిన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఎల్ఒ),యంగ్ ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ (వైఎఫ్ఎల్ఒ)లకు నూతన గవర్నింగ్ బాడీస్ ఏర్పాటైన సందర్భంగా హోటల్ తాజ్‌కృష్ణాలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ‘రాజకీయాల్లో సిద్ధాంతాలు’పై మాట్లాడారు. ఆ ప్రసంగంలోని ప్రధానాంశాలు ఆమె మాటల్లోనే.. మార్పు దిశగా పయనిద్దాం... రాజకీయం అనేది నా భావాలు వ్యక్తం చేసేందుకు, నిర్ణయాత్మక శక్తిగా నన్ను నేను మలచుకునేందుకు నేను ఎంచుకున్న వేదిక. ఒకప్పుడు జర్నలిస్ట్‌గా ఉన్న నేను కేవలం రిపోర్టింగ్ చేసేసి ఆ తర్వాత సెలైంట్‌గా ఉండిపోవడానికి పరిమితమవడం కన్నా.. నిర్ణయాలు తీసుకోవడంలో భాగం కావాలనుకున్నా... రాజకీయాల్లోకి వచ్చింది అందుకే. మన సిస్టమ్ బాగోలేదనడం, ప్రభుత్వాలను తప్పుపట్టడమూ సులభమే. అయితే మనం మేల్కొని మార్పుకు కారణం కావాల్సిన సమయం ఇది. కార్యాచరణలోకి దిగాల్సిన సమయం ఇది. మార్పును స్వీకరిస్తూ దేశాన్ని మార్చే దిశగా మనం పయనించాలి. మన తలరాత రాసేది రాజకీయాలే... కులం, మతం, ప్రాంతం. తన మన భేదాలు ఇంకా అలాంటి అనేకానేక అంశాల ఆధారంగా ఓట్లేస్తున్నాం. ఇలా వేసినంత కాలం మనం రాజకీయాల్లో విలువల్ని ఆశించలేం. భారతదేశ తలరాతను రాసేవి రాజకీయాలే. మన బిడ్డల భవిష్యత్తును, మన జీవన స్థితిగతులను, పాఠశాలల్లో పద్ధతులను, మన అక్కా చెల్లెళ్ల భద్రతను, తోటి పౌరుల భద్రతను అన్నింటినీ నిర్ణయించేవి అవే. కాబట్టి దేశ విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేయాలి. మహిళలు మరింతగా రాజకీయాల్లోకి రావాల్సి ఉందని నేను నమ్ముతున్నాను. - ఎస్.సత్యబాబు -
డాటర్ బై కోర్ట్ ఆర్డర్
అమ్మాయిలను మగపిల్లలతో సమానంగా పెంచాలి. ఆడ, మగ అని తేడా లేకుండా నిష్పక్షపాతంగా ప్రేమను పంచాలి. ఇవన్నీ ప్రతిరోజూ, అందరి నోటా వినిపించే మాటలే. కానీ ఆచ రణ ఏమేరకు? అన్నది ప్రశ్నార్థకమే! దీనిపై చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు ప్రముఖ రచయిత్రి రత్న వీర. ఇటీవల ఆమె రాసిన ‘డాటర్ బై కోర్ట్ ఆర్డర్’ సంచలనం సృష్టిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం ఆమె రచనలకు అభినందలు తెలిపారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్ఓ) మహిళా సాధికారతపై నిర్వహించిన చర్చాగోష్టిలో రత్నవీర పాల్గొని ప్రసంగించారు.పలు ప్రశ్నలకూ సమాధానమిచ్చారామె. ప్రముఖ జర్నలిస్టు నళినీసింగ్ కూతురిగా చిన్నప్పటి నుంచే సమాజానికి ఏదో చేయాలనే లక్ష్యంతో పెరిగారు రత్నవీర. ఇటు పారిశ్రామిక రంగంలో దూసుకుపోతూ మరోవైపు మహిళా సాధికారతకు కృషి చేస్తున్నారు. వివక్ష వద్దు... ‘కొడుకు, కూతుళ్ల మధ్య పక్షపాతం చూపించే వారిలో మార్పు తేవాలన్నదే నా ఆశయం. నా కూతురు పదహారేళ్ల సుహాసిని నా పుస్తకం చదివి నన్నెంతో అభినందించింది. అప్పుడు కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. ఏ దేశంలో లేని వివక్ష కేవలం మన దేశంలోనే చూశాను. అదే నా ఈ పుస్తకానికి మూలం. ప్రస్తుతం హిందీలోకి అనువాదం జరుగుతోంది. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. ఒకప్పుడు 18 నెలలు ఇక్కడే ఉన్నాను. మళ్లీ ఇప్పుడు, ఇంత మంచి కార్యక్రమానికి రావడం ఆనందంగా ఉంది’ అని తన మనసులోని మాటలు పంచుకున్నారు రత్నవీర. -
మార్పుతోనే మంచి..
జీవనశైలిలో ఓ చిన్నమార్పు చాలు బరువు తగ్గించడానికి. ఒక నిమ్మచెక్క చాలు.. మనల్ని ‘చిక్కి’పోయేలా చేయడానికి. అంతెందుకు దీర్ఘంగా శ్వాస పీల్చి వదలడం ప్రాక్టీస్ చేయగలిగితే చాలు బెలూన్లాంటి శరీరం కూడా భేష్ అనిపించుకునేలా మారడానికి. ఈ సూచనలు చేస్తోంది ఇంటర్నేషనల్ న్యూట్రిషనిస్ట్ ల్యూక్ కొటిన్హో . హార్వర్డ్ యూనివర్సిటీ సహా పలు ప్రతిష్టాత్మక సంస్థలకు న్యూట్రిషన్ సలహాదారుగా వ్యవహరిస్తున్న ఆయన ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో సిటీలో జరిగిన ఒక హెల్త్క్లాస్కు హాజరై మాట్లాడారు. ఆయన చెప్పిన ఉపయోగకరమైన సూచనలు ఆయన మాటల్లోనే... కుకింగ్ కేర్ మన శరీరపు బరువులో ఒక కిలోకి 0.8 గ్రాముల నుంచి 1 గ్రాము దాకా ప్రొటీన్ అవసరం ఉంటుంది. ఉదాహరణకు వ్యక్తి 60 కిలోల బరువుంటే 48 నుంచి 60 గ్రాముల ప్రొటీన్ అవసరం. ప్రొటీన్ శాతం తగ్గితే తొందరగా అలసట వస్తుంది. వ్యాయామం చేసేటప్పుడు నీరసంగా, మరింత నిస్సత్తువ ఆవరిస్తుంది. జుట్టు రాలడం, చర్మ కాంతి తగ్గిపోవడం జరుగుతుంది. ప్రొటీన్లను మనం కోల్పోకూడదంటే.. మైక్రోవేవ్ కుకింగ్కు నో చెప్పాలి. కోక్స్, ఫ్లేవర్డ్ డ్రింక్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి పూర్తిగా దూరం పెట్టాలి. మంచినీటితో.. మంచిరోజు.. పొద్దున్నే పెద్ద గ్లాసుతో నీరు తాగడం ద్వారా రోజును ప్రారంభించాలి.హైదరాబాద్ నగర వాతావరణం ప్రకారం చూస్తే రోజుకు 3 నుంచి 4 లీటర్ల నీరు తప్పకుండా తీసుకోవాలి. వేడినీళ్లు, నిమ్మకాయ కలిపి ఉదయాన్నే సేవించడం మంచిది. రోజుకు 3 నుంచి 4 నిమ్మకాయలు ఆహారంలో ఏదో రకంగా భాగం చేయాలి. రోజులో చివరి భోజనాన్ని నిమ్మకాయ లేదా నిమ్మకాయ నీటితో ముగించాలి. ఇలాంటి చిన్న చిన్న మార్పులు అంతర్గత శరీర వాతావరణాన్ని బాగా మారుస్తాయి. రోజుకు 3 కప్పులు మించకుండా మహిళలు కాఫీ తాగవచ్చు. పురుషులు మాత్రం 2 కప్పులకే పరిమితం కావాలి. సన్సెట్కు ముందే డిన్నర్.. మహిళలకు గోధుమలు అత్యంత అవసరమైన దినుసు. నొప్పి, అధిక బరువు మరెన్నో ఆరోగ్య సమస్యలకు ఎసిడిటీతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. అయితే దీన్ని ఎదుర్కోవడం ఈజీనే. తాజా ఆహారం మాత్రమే తీసుకోవాలి. సీజనల్ పండ్లు ఆహారంలో భాగం చేయాలి. పడుకోవడానికి కనీసం రెండున్నర గంటలకు ముందు ఆహారం తీసుకోవాలి. భోజనం తర్వాత ప్రతి సారీ సోంపు వినియోగించాలి. గాఢంగా శ్వాస తీసుకుని వదలడం కూడా బరువు తగ్గడంలో ఉపకరిస్తుంది. డిన్నర్‌ని వీలున్నంత త్వరగా సూర్యాస్తమయం ముందుగా పూర్తి చేయగలిగితే మరింత మంచిది. మహిళలు 7 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. పురుషులకు 6 గంటల నిద్ర సరిపోతుంది. థర్టీ మినిట్స్.. హెల్దీస్టెప్స్.. కేవలం 30 నిమిషాల నడక లేదా వ్యాయామం సైతం అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. విపరీతమైన కసరత్తులు చేసేయాలి అని ఆశించకుండా, క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే చాలు. రాజులాగా బ్రేక్‌ఫాస్ట్, యువరాజులాగా లంచ్, నిరుపేదలా డిన్నర్ ఉండాలి. ఆహారాన్ని నెమ్మదిగా నమిలి తినాలి. మితంగానే తినాలి. భోజనానికి ముందు ఒక గ్లాసుడు నీళ్లు తాగాలి. అలాగే భోజనం తర్వాత కూల్ వాటర్ తాగవద్దు. మధ్యాహ్నం వేళలో తీసే కునికిపాట్లు 20 నిమిషాలకు మించకూడదు. రెడీమేడ్... మస్ట్రీడ్... రెడీమేడ్ ఆహార ఉత్పత్తులపై ఉండే లేబుల్స్ని క్షుణ్నంగా చదవడం మంచిది. ట్రాన్స్ ఫాట్స్, పరిమితంగా హైడ్రోజెనేటెడ్ ఫ్యాట్స్, హై కార్న్ ఫ్రక్టోజ్, హై సోడియం పరిమాణం, తక్కువ ఫైబర్, యాడెడ్ సుగర్... వంటివి ఉంటే అలాంటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ వంటి వాటిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నారనేది.. ఆరోగ్యం కోసం ఏమీ పెట్టుబడి పెట్టనప్పుడు అసలు లెక్కలోకి తీసుకునే అవసరం లేని విషయం. మార్పు ఈ రోజే ప్రారంభించాలి. ఆరోగ్యం శాశ్వతం కావాలి. బెస్టాఫ్ లక్. సన్నగా అవ్వాలంటే, బరువు తగ్గాలంటే... అందరూ ఫస్ట్ పట్టే రూటు డైటింగ్. అయితే వెయిట్ లెస్ కావడానికి, హెల్దీగా మారడానికి ఇదేనా మార్గం? అంటే నో... అనే చెప్పాలి. లైఫ్‌స్టైల్ మార్పులు అంతకన్నా ముఖ్యం. బరువు పెరిగాం అని కంగారు పడిపోయి గుడ్డిగా డైటింగ్ చేసేయడం కన్నా ఆరోగ్యకరమైన జీవనశైలి మీద అవగాహన పెంచుకోవడం అవసరం. మార్పే శాశ్వతం.. మన జీవనశైలిలో శాశ్వతంగా పాటించాల్సింది మార్పు మాత్రమే. డైట్ కన్నా జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు బాగా పనిచేస్తాయి. లెఫ్స్టైల్ మార్పులంటే.. అవి మన బిజీ షెడ్యూల్‌కి నప్పాలి. మనం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కూడా అనువుగా ఉండాలి. హెల్దీ వెయిట్‌ని మెయిన్‌టెయిన్ చేసేలా, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఈ మార్పులు ఉండాలి. వీటి ద్వారా పలు వ్యాధులు ముందుగానే రాకుండా నివారించవచ్చు. కార్డియాక్, కేన్సర్, డయాబెటిక్ సమస్యలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్న దేశం ఇండియా. మనం మనదైన సహజాహారం నుంచి మళ్లడమే దీనికి కారణం. జీవనశైలి మార్పులకు మనం వెంటనే సిద్ధపడకపోతే మన భవిష్యత్తు జీవితంలో ఎక్కువ భాగం ఆస్పత్రుల్లోనే గడపడానికి సిద్ధపడాల్సిందే.