జీఎస్టీ... కీలక అడుగు
బిల్లు ఆమోదంపై కంపెనీల ఆశలు..
న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) బిల్లు బుధవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనుండటంతో కార్పొరేట్ రంగం ఆసక్తి పెరిగింది. ప్రత్యక్ష పన్నుల విధానంలో ఈ బిల్లును ఓ కీలక అడుగుగా భారత పారిశ్రామిక వర్గాలు అభివర్ణించాయి. ఎవరేమన్నారంటే..
వన్ ఇండియా: సీఐఐ
‘వన్ ఇండియా గురించి ఇప్పుడు పరిశ్రమ ఆలోచిస్తోంది. అన్ని రాజకీయ పార్టీలూ ఇదే స్ఫూర్తితో ఉన్నందున బుధవారం నాడు జీఎస్‌టీ బిల్లు కీలకంగా మారనుంది. వినియోగదారుల కోణంలో పన్నుల భారం తగ్గడం పెద్ద ఉపశమనం.’ - నౌషద్ ఫోర్బ్స్, సీఐఐ ప్రెసిడెంట్
భారత ఉత్పత్తులు పోటీనిస్తాయి: ఫిక్కీ
జీఎస్‌టీ అమలుతో భారత ఉత్పత్తులు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మరింత పోటీ పడగలవని, ఇది ఆర్థిక రంగానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని అధ్యయనాలు చెబుతున్నట్టు పిక్కీ పేర్కొంది. ఎన్నో రకాల కేంద్ర, రాష్ట్రాల పన్నులను కలిపి ఒకే పన్నుగా చేయడం దేశవ్యాప్తంగా ఏకైక మార్కెట్‌కు మార్గం వేయడమేనని అభిప్రాయపడింది.