న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కి సంబంధించి కేంద్రానికి కార్పొరేట్లు తమ వినతులను అందజేశారు. కస్టమ్స్‌కి సంబంధించి వన్–టైమ్ సెటిల్మెంట్ రూపంలో గత బాకీలను చెల్లించేసేందుకు ఆమ్నెస్టీ పథకాన్ని ప్రకటించాలని పరిశ్రమల సమాఖ్యలు ఫిక్కీ, అసోచాం కోరాయి.
బాకీ పరిమాణాన్ని బట్టి పాక్షికంగా సుంకాలను తగ్గించడం లేదా వడ్డీ అలాగే పెనాల్టీని పూర్తిగా మినహాయించడం రూపంలో ఊరటనివ్వొచ్చని పేర్కొన్నాయి. దీనితో పరిశ్రమపై లిటిగేషన్ల భారం తగ్గుతుందని తెలిపాయి.
మరోవైపు, వ్యక్తులు, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్‌నర్‌షిప్ సంస్థల ట్యాక్సేషన్ విషయంలో పన్ను రేట్లను తగ్గించాలని, ఫేస్‌లెస్ అప్పీళ్లను ఫాస్ట్ ట్రాక్ చేయాలని పీహెచ్‌డీసీసీఐ విజ్ఞప్తి చేసింది.
Comments
Please login to add a commentAdd a comment