హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ దశ స్టార్టప్స్‌లో అత్యధికం ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్‌లు, పెట్టుబడిదారుల నుండి సేకరించిన అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలు ఇందుకు కారణమని ఫిక్కీ–రాండ్‌స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వే పేర్కొంది. నియామకాల తీరుపై చేపట్టిన ఈ సర్వేలో 300లకుపైగా స్టార్టప్స్ పాలుపంచుకున్నాయి. ‘2023లో కొత్త నియామకాలకు 80.5 శాతం కంపెనీలు సమ్మతి తెలిపాయి.
(పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!)
ఈ కంపెనీలు సిరీస్–ఏ, సిరీస్–బి నిధులను అందుకున్నాయి. కావాల్సిన మూలధనాన్ని కలిగి ఉన్నాయి. కొత్త ప్రతిభను పొందేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొనసాగిస్తామని 15.78 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొత్త వారిని చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన కంపెనీల్లో ఆరోగ్య సేవలు 13 శాతం, ఐటీ, ఐటీఈఎస్ 10, వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత 8, ఏఐ, ఎంఎల్, డీప్‌టెక్ 7, ఫిన్‌టెక్ 7, తయారీ సంస్థలు 7 శాతం ఉన్నాయి’ అని నివేదిక తెలిపింది.
అట్రిషన్‌కు ఇవీ కారణాలు..
స్టార్టప్స్‌లో క్రియాశీలక పని వాతావరణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన శిక్షణా వేదికను అందిస్తోంది. వారు తమ సొంత స్టార్టప్స్‌ను రూపొందించడానికి అడుగు వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పరిశ్రమలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించే మెరుగైన పే ప్యాకేజీలు, అలాగే ఈ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, కెరీర్ పురోగతి, విశ్వసనీయత గురించి స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అధిక అట్రిషన్ రేటుకు కారణమని 54.38 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. అవసరమైన నైపుణ్యాలలో లోటు, జీతం అంచనాలలో అసమతుల్యత, ముప్పు ఉండొచ్చనే ఆందోళనల కారణంగా స్టార్టప్స్‌లో చేరడానికి విముఖత చూపుతున్నారు’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment