Workforce
-
17,000 మంది ఉద్యోగుల తొలగింపు!
ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్ పీడియడ్లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్‌లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటామని చెప్పారు. ఇటీవల సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధంఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు. -
ఉద్యోగాలు.. ఉద్వేగాలు
సాక్షి, హైదరాబాద్: భారతీయ ఉద్యోగులు తమ పని ప్రదేశాలు, రోజువారీ జీవనాన్ని గడిపే విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగుల్లో అత్యధికులు తమ జీవితం సాగుతున్న తీరు పట్ల అంత సంతోషంగా లేరని తెలుస్తోంది. దక్షిణాసియాలోనే రెండో అతి పెద్దసంఖ్యలో ఉద్యోగులు పనిచేస్తున్న దేశంగా భారత్ గుర్తింపు పొందింది. మనదేశంలోని ఉద్యోగుల స్థితిగతులు, ఇతర అంశాల గురించి లోతుగా పరిశీలించినప్పుడు.. వారి ఉద్యోగ జీవితం మానసికంగా, భావోద్వేగాలపరంగా, సామాజిక అంశాలపరంగా అంతగా సంతోషంగా, సంతృప్తికరంగా సాగడం లేదని స్పష్టమవుతోంది. దేశంలోని 86 శాతం మంది ఉద్యోగులు ఇబ్బందులు లేదా కష్టాల్లో (స్ట్రగులింగ్ ఆర్ సఫరింగ్) సాగుతున్నట్టుగా గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్–2024 వార్షిక నివేదిక తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 14 శాతం మంది మాత్రమే తాము అన్నివిధాలుగా పురోగతి సాధిస్తూ సంతృప్తిగా, పూర్తి ఆశావహ దృక్పథంతో ముందుకు అడుగువేస్తున్నట్టుగా ఈ అధ్యయనం తెలియజేసింది. దక్షిణాసియాలోనే రెండో పెద్ద వర్క్‌ఫోర్స్‌గా ఉన్న మన దేశంలోని ఉద్యోగుల పరిస్థితులపై రూపొందించిన ఈ నివేదికలో భాగంగా.. ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల మానసికస్థితి, వారి శ్రేయస్సు, అభ్యున్నతి ఎలా ఉందనే అంశంపై ఈ సంస్థ అంచనా వేసింది. ప్రధానంగా గ్యాలప్ కేటగిరీల వారీగా జీవన మూల్యాంకన సూచీ (లైఫ్ ఎవల్యువేషన్ ఇండెక్స్)..సంతృప్తి–పురోగతి (త్రైవింగ్), కష్టాలు ఎదుర్కోవడం (స్ట్రగులింగ్), బాధ–కుంగుబాటు (సఫరింగ్) మూడు గ్రూపులుగా ఉద్యోగులను వర్గీకరించింది. పరిశీలన ఇలా... ఉద్యోగులు తాము సాగిస్తున్న జీవనం, భవిష్యత్ ఆలోచనల పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారా లేదా ? ప్రస్తుతం తామున్న పరిస్థితిపై సంతృప్తి, ఆశావహ దృక్పథం, ఇతర ధోరణులకు అనుగుణంగా పది పాయింట్లకు గాను ఏడు ఆపై స్థాయి లో పాయింట్లు సాధించే వారిని ‘త్రైవింగ్’ (సంతృప్తితో) కేటగిరీలోని వారిగా ఈ సంస్థ లెక్కించింది. ఉద్యోగులు గడుపుతున్న జీవితం పట్ల అభద్రతాభావంతో అగమ్యగోచరంగా లేదా ప్రతికూలతతో ఉన్న వారిని, రోజువారీ ఒత్తిళ్లు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారిని ‘స్ట్రగులింగ్’గా పరిగణించింది. ఇక ‘సఫరింగ్’గ్రూపులో ఉన్న వారిని...వ్యక్తులుగా వారు ప్రస్తుత జీవనం, భవిష్యత్ అనేవి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నట్టుగా భావిస్తున్న వారిగా, కనీస అవసరాలు కూడా తీర్చుకోలేక, శారీరకంగా, భావోద్వేగపరంగా బాధ అనుభవిస్తున్న వారిగా వర్గీకరించింది. ‘స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్’నివేదికలో ఇంకా ఏముందంటే..» ప్రతీరోజు భావోద్వేగపరంగా ఎదురవుతున్న అనుభవాలు, మనస్థితిని బట్టి 35 శాతం మంది భారతీయులు రోజూ కోపం, ఆగ్రహానికి లోనవుతున్నారు. ఇది దక్షిణాసియాలోనే అత్యధికం. » భారత్‌లో రోజువారీ ఒత్తిళ్లు అనేవి అత్యల్పంగా ఉన్నట్టు తేలింది. దక్షిణాసియా ప్రాంతంలో చూస్తే..శ్రీలంకలో ఇది 62 శాతంగా, అఫ్గానిస్తాన్‌లో 58 శాతంగా, భారత్‌లో 32 శాతంగా ఉంది. » దక్షిణాసియాలో..గడిచిన ముందు రోజు పట్ల ఒంటరితనం (29 శాతం), ఆగ్రహం, కోపం (34 శాతం), విచారం (42 శాతం) బారిన ఉద్యోగులు పడినట్టు స్పష్టమైంది. » దక్షిణాసియాలో 48 శాతం మంది ప్రస్తుత సమయంలో ఉద్యోగాలు పొందడానికి సరైనదనే భావనలో ఉన్నారు » అదే భారత్ విషయానికొస్తే...57 శాతం మంది అదే అభిప్రాయంతో ఉన్నారు. » ప్రాంతీయంగా చూస్తే...తాము ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగాలు విడిచిపెట్టి కొత్త వాటిని కోరుకుంటున్నవారు 58 శాతం కాగా,.. భారత్‌లో మాత్రం 52 శాతంగా ఉన్నారు .గ్యాలప్ స్టేట్ ఆఫ్ ద గ్లోబల్ వర్క్‌ఫోర్స్ అంటే... ప్రపంచవ్యాప్తంగా 80 ఏళ్లుగా వివిధ కంపెనీలు, సంస్థలు ఎదుర్కొనే ముఖ్యమైన సమస్యలపై అధ్యయనం చేసి, అవసరమైన విశ్లేషణలు అందిస్తూ ఆయా సమస్యలను అధిగమించేందుకు ‘గ్యాలప్’సంస్థ కృషి చేస్తోంది. ఉద్యోగులు, వినియోగదారులు, విద్యార్థులు, పౌరుల వైఖరులు, వారి ప్రవర్తన తీరుతెన్నులపై ఈ సంస్థ పూర్తి అవగాహన కలిగి ఉండడంతో, ఈ వర్గాల వారు ఎదుర్కొంటున్న సమస్యలను సరిగ్గా ఎత్తిచూపగలుగుతోంది. వారి మనస్థితి, సంతృప్తి, ఇబ్బందులు, విచారం వంటి వాటిని అంచనా వేయగలుగుతోంది. -
ప్రపంచం భారత్ వైపు చూసేలా.. హ్యాపీనెస్ ర్యాంకింగ్‌లో ఇండియన్ ఎంప్లాయిస్..
Global Happiness Ranking: 'ఆడుతు పాడుతు పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది' అలనాడు ఎంతోమందిని అలరించిన పాట పనిచేయడంలో భారతీయులకు సరిగ్గా సరిపోతుందని తాజాగా కొన్ని నివేదికలు వెల్లడించాయి. ఆనందంగా పనిచేయడంలో ఇండియన్స్ ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువైంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. పని ఎలాంటిదైనా.. ఇష్టంగా పనిచేస్తే కష్టం ఉండదు. ఏ దేశంలోని ఉద్యోగులు సంతోషంగా ఉన్నారనే విషయం మీద ఒక సంస్థ నివేదికను రూపొందించింది. ఇందులో భారతీయులే అగ్రస్థానంలో నిలిచింది.12 దేశాల్లోని మొత్తం 15,600 మంది ఐటీ ఉన్నతాధికారులు, బిజినెస్ లీడర్స్ మీద నిర్వహించిన ఈ సర్వేలో ఇండియా నుంచి 1,300 మంచి పాల్గొన్నారు. సుమారు 50శాతం కంటే ఎక్కువ మంది పనిచేయడంలోనే ఆనందంగా ఉన్నట్లు తెలిపారు. హెచ్‌పీ వర్క్ రిలేషన్షిప్ ఇండెక్స్ ప్రకారం.. ప్రపంచ వ్యాప్తంగా 27 శాతం మంది ఉద్యోగం చేయడంలో ఆనందాన్ని పొందుతున్నట్లు సమాచారం. మన దేశంలోని ఉద్యోగులు ఫ్లెక్సిబులిటీ, మానసిక ప్రశాంతత, సమర్థవంతమైన నాయకత్వం వంటి వాటిని కలిగి ఉండటం ద్వారా సంతృప్తి చెందుతున్నట్లు తెలుస్తోంది. దీనికి తగినట్లుగానే యాజమాన్యం కూడా చర్యలు తీసుకుంటోంది. ఇదీ చదవండి: నకిలీ వెబ్సైట్లో రూ.11 లక్షలు మోసపోయిన బెంగళూరు వాసి - ఎలా జరిగిందంటే? వేతనం కంటే సంతోషానికి ప్రాధాన్యం భారతదేశంలోని చాలామంది తక్కువ జీతం పొందే ఉద్యోగాల్లో కూడా ఆనందంగా ఉన్నారని చెబుతున్నారు. దీనికి కారణం వారి ఎక్స్పీరియన్స్ పెంచుకోవడం మాత్రమే కాకుండా.. కమ్యూనికేషన్ వంటి వాటిని పెంచుకోవడానికి కూడా అని తెలుస్తోంది. మొత్తం మీద ఈ సర్వేలో భారత్ అగ్రస్థానంలో నిలిచి ప్రపంచంలోని ఇతర ఉద్యోగులకు ఆదర్శంగా నిలిచింది. -
జీతం ఎంతైనా పర్లేదు.. అటెన్షన్.. బట్ నో టెన్షన్.. కోవిడ్ తెచ్చిన మార్పు
సాక్షి, అమరావతి: మానసిక ప్రశాంతత లేని కొలువుల్లో పనిచేసేది లేదని భారతీయ ఉద్యోగులు తేల్చి చెబుతున్నారు. ఇందుకోసం అధిక వేతనాలు వచ్చే ఉద్యోగాలను సైతం వదులుకునేందుకు సిద్ధపడుతున్నారు. కోవిడ్–19 తర్వాత ఉద్యోగులు మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించారు. అమెరికా ఆధారిత వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ సంస్థ యూకేజీ నిర్వహించిన సర్వేలో.. భారతదేశంలో 88 శాతం మంది ఉద్యోగులు మానసిక క్షేమం కోసం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు నివేదించింది. ఒత్తిడి లేని ఉద్యోగాల్లో తక్కువ జీతానికైనా పని చేసేందుకు వెనుకాడటం లేదని వెల్లడించింది. ఇదే అమెరికాలో 70 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయంతో పోలిస్తే భారత్‌లోనే ఈ అభిప్రాయం గల ఉద్యోగులు అధికంగా ఉండటం విశేషం. భారత్‌తోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాల్లోని ఉద్యోగాల్లో వర్క్‌ఫోర్స్, ప్రోత్సాహకాలు, మానసిక ఆరోగ్యం తదితర అంశాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు సేకరించింది. కుటుంబానికే తొలి ప్రాధాన్యం భారతీయ ఉద్యోగుల్లో ఇటీవల కుటుంబ సభ్యులకు ఇచ్చే ప్రాధాన్యతలో తీవ్ర మార్పు వచ్చింది. 46 శాతం మంది ఉద్యోగం కంటే కుటుంబమే తొలి ప్రాధాన్యం అని అభిప్రాయపడుతున్నట్టు సర్వేలో తేలింది. రెండో స్థానంలో 37 శాతం మంది పని (ఉద్యోగం).. ఆ తర్వాతే ఆరోగ్యం, స్వీయ సంరక్షణ, వ్యాయామం, స్నేహితులతో సంబంధాలు కోరుకుంటున్నట్టు తెలిపింది. అయితే, ఇక్కడ చాలామంది ఉద్యోగులు తమ ఆందోళనలను మేనేజర్లతో పంచుకునేందుకు వెనుకాడుతున్నట్టు చెప్పింది. భారత్‌లో 51 శాతం మంది ఉద్యోగులు మాత్రమే ప్రతి వారం తమ మేనేజర్‌తో పనిభారంపై చర్చిస్తుండగా.. 30 శాతం మంది నెలకు ఒకసారి కూడా మాట్లాడలేకపోతున్నారని నివేదించింది. ఒత్తిడి ఇంత పని చేస్తోందా! 33% భారతీయ ఉద్యోగులు ఆఫీసుల్లో ఎక్కువ గంటలు గడపటం పని సంబంధిత ఒత్తిడికి ప్రధాన కారణమని సర్వే పేర్కొంది. దీనివల్ల 34 శాతం మందిలో గతంతో పోలిస్తే పని గంటలు పెరగడంతో ఏకాగ్రత కోల్పోతున్నట్టు గుర్తించింది. 31 శాతం మందిలో సహాద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించలేని పరిస్థితి కనిపించింది. మిగిలిన వారిలో పని ఉత్పాదకత, సామర్థ్యం కొరవడుతున్నట్టు తేల్చింది. ఉద్యోగానికి ఉండే డిమాండ్, హార్డ్ వర్క్ చేయాలనే తపన కూడా ఒత్తిడికి కారణంగా పలువురు ఉద్యోగులు అభిప్రాయపడ్డారు. ‘ఉద్యోగులకు కార్యాలయాల్లో సానుకూల వాతావరణం ఉండాలి. అప్పుడు వారు మెరుగ్గా పని చేయగలుగుతారు. సాంకేతిక వనరులపై పెట్టుబడులు పెంచడం ద్వారా ఉద్యోగులపై కొంతమేర ఒత్తిడిని తగ్గించవచ్చు. ఇది ఆ సంస్థ స్థిరత్వానికి ఎంతో దోహదం చేస్తుంది’ అని యూకేజీ ఇండియా కంట్రీ మేనేజర్ సుమిత్ దోషి చెప్పారు. -
నిరుద్యోగులను ఆదుకునేవి ఇవే.. నియామకాల సన్నాహాల్లో స్టార్టప్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రారంభ దశ స్టార్టప్స్‌లో అత్యధికం ఈ ఏడాది తమ సిబ్బందిని పెంచుకోవాలని చూస్తున్నాయి. ప్రధానంగా కొత్త ప్రాజెక్ట్ ఆర్డర్లు, పెట్టుబడిదారుల నుండి సేకరించిన అదనపు నిధులు, విస్తరణ వ్యూహాలు ఇందుకు కారణమని ఫిక్కీ–రాండ్‌స్టాడ్ ఇండియా నిర్వహించిన సర్వే పేర్కొంది. నియామకాల తీరుపై చేపట్టిన ఈ సర్వేలో 300లకుపైగా స్టార్టప్స్ పాలుపంచుకున్నాయి. ‘2023లో కొత్త నియామకాలకు 80.5 శాతం కంపెనీలు సమ్మతి తెలిపాయి. (పిట్ట పోయి కుక్క వచ్చె.. ట్విటర్ లోగోను మార్చిన మస్క్!) ఈ కంపెనీలు సిరీస్–ఏ, సిరీస్–బి నిధులను అందుకున్నాయి. కావాల్సిన మూలధనాన్ని కలిగి ఉన్నాయి. కొత్త ప్రతిభను పొందేందుకు చురుకుగా ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందిని కొనసాగిస్తామని 15.78 శాతం కంపెనీలు వెల్లడించాయి. కొత్త వారిని చేర్చుకునేందుకు ఆసక్తి కనబర్చిన కంపెనీల్లో ఆరోగ్య సేవలు 13 శాతం, ఐటీ, ఐటీఈఎస్ 10, వ్యవసాయం, వ్యవసాయ సాంకేతికత 8, ఏఐ, ఎంఎల్, డీప్‌టెక్ 7, ఫిన్‌టెక్ 7, తయారీ సంస్థలు 7 శాతం ఉన్నాయి’ అని నివేదిక తెలిపింది. అట్రిషన్‌కు ఇవీ కారణాలు.. స్టార్టప్స్‌లో క్రియాశీలక పని వాతావరణం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అనువైన శిక్షణా వేదికను అందిస్తోంది. వారు తమ సొంత స్టార్టప్స్‌ను రూపొందించడానికి అడుగు వేసేందుకు ఇది దోహదం చేస్తుంది. పరిశ్రమలో పెద్ద కార్పొరేట్ కంపెనీలు అందించే మెరుగైన పే ప్యాకేజీలు, అలాగే ఈ రంగంలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు, కెరీర్ పురోగతి, విశ్వసనీయత గురించి స్పష్టత లేకపోవడం వంటి అంశాలు అధిక అట్రిషన్ రేటుకు కారణమని 54.38 శాతం స్టార్టప్‌లు తెలిపాయి. అవసరమైన నైపుణ్యాలలో లోటు, జీతం అంచనాలలో అసమతుల్యత, ముప్పు ఉండొచ్చనే ఆందోళనల కారణంగా స్టార్టప్స్‌లో చేరడానికి విముఖత చూపుతున్నారు’ అని నివేదిక వివరించింది. (షాకింగ్ న్యూస్: యాపిల్ ఉద్యోగుల గుండెల్లో గుబులు) -
మూడేళ్లలో 50 వేల నియామకాలు, భారీ ప్రణాళికల్లో డెలాయిట్
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్ సర్వీసుల్లో ఉన్న డెలాయిట్ గడిచిన మూడేళ్లలో భారత్‌లో 50వేల మందిని నియమించుకుంది. ఈ కాలంలో సిబ్బంది సంఖ్య రెండింతలైందని కంపెనీ తెలిపింది. విద్య, డిజిటల్ నైపుణ్యాల అభివృద్ధి, శిక్షణ అవకాశాలకు మద్దతుగా వినూత్న విధానాలపై దృష్టి సారించి, భారత్‌లోని వ్యక్తులు, ఉత్పాదక సామర్థ్యాలలో పెట్టుబడిని కొనసాగించాలని సంస్థ యోచిస్తోంది. రాబోయే కొన్ని సంవత్సరాలలో, కంపెనీ STEM, ఆవిష్కరణ, లీడర్ షిప్, డిజిటల్‌పై దృష్టి సారించి విస్తృత అవకాశాలను కొనసాగించాలని యోచిస్తోంది. డెలాయిట్ వరల్డ్‌క్లాస్, విద్య , నైపుణ్యాన్ని పెంపొందించడం ద్వారా 2030 నాటికి 100 మిలియన్ల మందిని ముఖ్యంగా భారతదేశంలో 50 మిలియన్ల మందిని (కోటి) చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుందని పీటీఐ నివేదించిం -
యాపిల్ గుడ్‌న్యూస్: ఇండియాలో నాలుగురెట్లు పెరగనున్న ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: ఐఫోన్ తయారీదారు యాపిల్ గుడ్ న్యూస్ చెప్పింది. దాదాపు అన్ని టెక్ దిగ్గజాలన్నీ ఉద్కోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ఇండియాలోని ఫ్యాక్టరీలో వర్క్‌ఫోర్స్‌ను నాలుగు రెట్లు పెంచాలని యోచిస్తోంది. ట్విటర్, మెటా, మైక్రోసాఫ్ట్,లాంటి దిగ్గజాలు వేలమందిని ఉద్యోగులను తొలగించాయి. తాజాగా అమెజాన్ అదే బాటలో ఉన్న నేపథ్యంలో యాపిల్ నిర్ణయం విశేషంగా నిలిచింది. ప్రత్యేక పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇదీ చదవండి: అమెజాన్‌లో పింక్ స్లిప్స్ కలకలం, వేలమందిపై వేటు! చైనాలో కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐఫోన్ ఫ్యాక్టరీ అయిన జెంగ్జౌ ప్లాంట్ వద్ద కఠిన ఆంక్షలు కొనసాగుతోంది. దీంతో అక్కడ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఫలితంగా ప్రీమియం ఐఫోన్ 14 మోడళ్ల షిప్మెంట్లను వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈ డిమాండ్‌ను నెరవేర్చే యోచనలో యాపిల్ సరఫరాదారు ఫాక్స్‌కాన్ ఇండియాలోని ఐఫోన్ ఫ్యాక్టరీలో ఉద్యోగులను పెంచుకోనుంది. రానున్న రెండేళ్లలో ఇక్కడి ఉద్యోగుల సంఖ్యను నాలుగు రెట్లు పెంచాలని భావిస్తోంది. తైవాన్‌కు చెందిన ఫాక్స్‌కాన్ ఇప్పుడు దక్షిణ భారతదేశంలోని తన ప్లాంట్‌లో వచ్చే రెండేళ్లలో మరో 53వేల మంది కార్మికులను చేర్చుకోవడం ద్వారా వర్క్‌ఫోర్స్‌ను 70వేలకి పెంచాలని యోచిస్తోందని పేరు చెప్పడానికి ఇష్టపడని వర్గాలు వెల్లడించాయి. (ప్రేమలో పడిన మిలిందా గేట్స్, కొత్త బాయ్ ఫ్రెండ్ ఎవరో తెలుసా?) 2019లో తమిళనాడులోని యాపిల్ ఐఫోన్ ఉత్పత్తి ప్లాంట్‌ను ప్రారంభించింది. క్రమంగా ఉత్పత్తిని పెంచుకుంటూ ఈ ఏడాది ఐఫోన్14 ఉత్పత్తిని షురూ చేసింది. అయితే 2 లక్షల కార్మికులున్న జెంగ్జౌ ప్లాంట్‌తో పోలిస్తే ఇది చిన్నదే అయిన్పటికీ చైనా తరువాత ఇది చాలా ప్రధానమైంది. అయతే తాజావార్తలపై ఫాక్స్‌కాన్, యాపిల్ స్పందించేందుకు నిరాకరించాయి. (క్లిక్:StockMarketClosing: బుల్ ర్యాలీ, జోష్‌కు ఐదు కారణాలు) -
కెనడాలో ఉద్యోగం కావాలా? 10 లక్షలపైగా ఖాళీలు..ఇంకా పెరగొచ్చు!
సాక్షి, న్యూఢిల్లీ: విదేశాల్లో ఉద్యోగం సంపాదించాలనుకునే వారికి గుడ్ న్యూస్. లక్షల ఉద్యోగాలు భర్తీకి కెనడా రారమ్మని ఆహ్వానిస్తోంది. కెనడాలో 10 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, భవిష్యత్తులో మరింత పెరగొచ్చని తాజా సర్వే వెల్లడించింది. దేశంలో పెద్దవాళ్లు ఎక్కువగా ఉండటం, ఎక్కువమంది రిటైర్మెంట్కు దగ్గర పడుతున్నకారణంగా భారీగా ఖాళీలు ఏర్పడ్డాయట. ఈ నేపథ్యంలో కెనడా ప్రస్తుతం 2022లో అత్యధిక సంఖ్యలో శాశ్వత నివాసితులను స్వాగతించడానికి సిద్ధమవుతోంది. సో..కెనడాకు ఎగిరిపోయి అక్కడే స్థిరపడేలా ఎక్స్‌ప్రెస్ ఎంట్రీ పొందాలనుకునేవారికి ఇదే సువర్ణావకాశం. (చదవండి: Hyderabad Student Vedant Anandwade: హైదరాబాదీకి బంపర్ ఆఫర్..సుమారు కోటిన్నర స్కాలర్షిప్) మే 2022 నాటి లేబర్ ఫోర్స్ సర్వే అనేక పరిశ్రమలలో పెరుగుతున్న కార్మికుల కొరతను హైలైట్ చేసింది. 2021, మే నుండి ఖాళీల సంఖ్య 3 లక్షలకు పైగా పెరిగిందని తెలిపింది. వృత్తిపరమైన, శాస్త్రీయ , సాంకేతిక సేవలు, రవాణా , గిడ్డంగులు, ఫైనాన్స్ , భీమా, వినోదం, రియల్ ఎస్టేట్ ఇలా ప్రతీ రంగంలోనూ రికార్డు స్థాయిలో ఖాళీగా ఉన్నాయి. వలసదారులు ఓపెన్ స్థానాలకు పర్మినెంట్ వీసాలకు డిమాండ్ పెరగనుందని వెల్లడించింది. కొన్ని రాష్ట్రాల్లో గతంలో కంటే ఇప్పుడు మరిన్ని పోస్టులు అందుబాటులో ఉన్నాయని మరో సర్వే తెలిపింది. (CSIR: టాప్ సైంటిఫిక్ బాడీకి తొలి మహిళా హెడ్‌గా కలైసెల్వి రికార్డు) అల్బెర్టా , అంటారియోలో, ఏప్రిల్‌లో ప్రతి ఓపెన్ పొజిషన్‌కు 1.1రేషియోలో నిరుద్యోగులు ఉన్నారు,ఈ నిష్పత్తి అంతకు ముందు సంవత్సరం 1.2 పోలిస్తే, ఈ మార్చికి 2.4 కు పెరిగింది. న్యూఫౌండ్‌ల్యాండ్, లాబ్రడార్లో ఖాళీగా ఉన్న ప్రతి స్థానానికి, దాదాపు నలుగురు నిరుద్యోగులు ఉన్నారు. నిర్మాణ పరిశ్రమలో ఖాళీలు కూడా ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో 89,900కి చేరుకున్నాయి, గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే దాదాపు 45 శాతం,మార్చి నుండి 5.4 శాతం పెరిగాయి. నోవా స్కోటియా, మానిటోబా రెండింటిలోనూ లాడ్జింగ్ , ఫుడ్ సర్వీసెస్ సెక్టార్లో 1,61 లక్షల ఓపెన్ పొజిషన్లు ఉన్నాయి. అలాగే వసతి, ఆహార సేవలు వరుసగా 13వ నెలలో కూడా అత్యధిక సంఖ్యలో ఖాళీలుండటం విశేషం.2022లోకెనడా రికార్డు స్థాయిలో 431,645 కొత్త శాశ్వత నివాసితులకు తలుపులు తెరవనుంది. 2022 మొదటి అర్ధభాగంలోనే, కెనడా ఇప్పటికే దాదాపు 2 లక్షలమందికి పర్మినెంట్ రెసిడెన్సీలుగా అవకాశం ఇచ్చింది. 2024 నాటికి 4.5 లక్షల టార్గెట్‌గా పెట్టుకుందని నివేదిక పేర్కొంది. తక్కువ మంది వ్యక్తులు వర్క్‌ఫోర్స్‌లోకి ప్రవేశించడంతోపాటు, 55 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సున్నవారు ముందుగానే రిటైర్ అవుతున్నారట. దీంతో కెనడా లేబర్ మార్కెట్ ఈ ఏడాది దారుణంగా పడిపోయింది. ఇటీవలి ఆర్బీసీ సర్వే ప్రకారం, కెనడియన్లలో మూడింట ఒక వంతు మంది ముందుగానే పదవీ విరమణ చేస్తున్నారు . పదవీ విరమణకు దగ్గరగా ఉన్న 10 మందిలో ముగ్గురు కరోనా మహమ్మారి కారణంగా ఆలస్యంగా రిటైర్ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే కెనడాలో 2020లో, సంతానోత్పత్తి రేటు 1.4 రేషియోలో రికార్డు స్థాయికి పడిపోయింది. ఇదీ చదవండి : మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? -
ఉద్యోగులకు ఊహించని షాక్.. మరింత దూకుడుగా ఎలన్ మస్క్!
ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. బ్లూమ్ బర్గ్ నిర్వహించిన కతర్ ఎకనమిక్ ఫోరంలో ఎలన్ మస్క్ పాల్గొన్నారు. రానున్న 3 నెలల్లో టెస్లాకు చెందిన 10శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. తద్వారా టెస్లాలో ఉద్యోగులకు చెల్లించే జీతభత్యాలు 3.5శాతం తగ్గిపోనున్నట్లు చెప్పారు. సూపర్ బ్యాడ్ ఫీలింగ్ ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న ఆర్ధిక సంక్షోభం నుంచి టెస్లాను బయట పడేందుకు మస్క్ కొత్త కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగా గత జూన్ నెలలో ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇంటర్నల్‌గా టెస్లా ఉద్యోగులకు మెయిల్ పెట్టినట్లు రాయిటర్స్ కథనం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుత ఆర్ధిక పరిస్థితి సూపర్ బ్యాడ్ ఫీలింగ్'గా ఉందని, అందుకే ఉద్యోగుల తొలగింపు, నియామకాల్ని నిలిపివేస్తున్నట్లు మస్క్ చెప్పారంటూ రాయిటర్స్ హైలెట్ చేసింది. కానీ ఉద్యోగులు తొలగింపుపై స్పష్టత ఇవ్వని మస్క్ తాజాగా ఆ కథనాలకు ఊతం ఇచ్చేలా ఉద్యోగుల కోతను అధికారికంగా వెల్లడించారు. చదవండి👉'జీతాలిచ్చే వాళ్లపై జోకులేస్తే ఇలాగే ఉంటది', ఎలన్ మస్క్‌కు భారీ ఝులక్! -
టాటా సంచలన నిర్ణయం, సర్వత్రా హర్షం
Tata Steel Hires 14 Transgender People: అనితర సాధ్యుడు..ఓటమి ఎరుగని ధీరుడు..రతన్ టాటా పరిచయం అక్కర్లేని పేరు. దేశంలో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పడమే కాదు విలువలు, దాతృత్వానికి మారు పేరు. ముఖ్యంగా సందర్భాన్ని బట్టి మానవత్వం ప్రదర్శించడంలో రతన్ టాటాను మించిన వారెవరూ ఉండరేమో. అలాంటి లివింగ్ లెజెండ్ రతన్ టాటా సంచలన నిర్ణయం తీసుకున్నారు. సమాజం నుంచి వివక్షను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్ల భవిష్యత్తును తీర్చిదిద్దేంకు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. జార్ఖండ్‌లోని రామ్‌ఘర్ జిల్లాలోని పశ్చిమ బొకారో డివిజన్లో హెవీ ఎర్త్ మూవింగ్ మెషినరీ ఆపరేటర్లుగా 14 మంది ట్రాన్స్జెండర్లను నియమించారు. ప్రస్తుతం ఈ 14మంది శిక్షణలో ఉన్నారని వచ్చే ఏడాది ప్రారంభం నుంచి మైనింగ్ కార్యకలాపాల్లో విధులు నిర్వహిస్తారని టాటా సంస్థ ప్రతినిధులు తెలిపారు. కాగా, అంతకుముందు కంపెనీ 17మంది మహిళలను హెచ్ఇఎమ్ఎమ్ ఆపరేటర్లుగా ఎంపిక చేసింది. ఈ సందర్భంగా టాటా స్టీల్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆత్రయీ సన్యాల్ మాట్లాడుతూ..ఇదే మాడ్యూల్లో పనిచేసేందుకు ఆన్‌బోర్డ్‌లో ఉన్న ట్రాన్స్జెండర్లు గనులలో పనిచేయడానికి ముందే సంవత్సరం పాటు శిక్షణ పొందుతారని తెలిపారు. అంతేకాదు ట్రాన్స్జెండర్ల వర్క్ ఫోర్స్‌ను పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు, 2025 నాటికి 25 శాతం ట్రాన్స్జెండర్లను ఉద్యోగులుగా నియమించేందుకు లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు అత్రయీ సన్యాల్ చెప్పారు. ఇదిలా ఉంటే, రతన్ టాటా నిర్ణయం పై నెటిజన్లు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ ఆపత్కాలంలో ట్రాన్స్ జెండర్లకు ఉద్యోగ అవకాశం కల్పించడం గొప్ప విషయమని ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: ఆ మహానుభావుడు ఉంటే ఎంతో సంతోషించేవాడు.. ఎమోషనలైన రతన్ టాటా -
సైయంట్ చేతికి వర్క్‌ఫోర్స్ డెల్టా
న్యూఢిల్లీ: కన్సల్టింగ్ సంస్థ వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ ఇంజినీరింగ్ సేవల సంస్థ సైయంట్ వెల్లడించింది. కంపెనీ విలువను 2.7 మిలియన్ డాలర్లుగా (రూ. 21.5 కోట్లుగా) లెక్కగట్టి ఈ డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపింది. తమ అనుబంధ సంస్థ సైయంట్ ఆస్ట్రేలియా ద్వారా వర్క్‌ఫోర్స్ డెల్టాను కొనుగోలు చేస్తున్నట్లు పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో ఈ ఒప్పందం పూర్తి కాగలదని భావిస్తున్నట్లు వివరించింది. మొబైల్ వర్క్‌ఫోర్స్ నిర్వహణకు సంబంధించి ప్రాసెస్ కన్సల్టింగ్ నుంచి సొల్యూషన్స్ అమలు దాకా సమగ్రమైన సేవలు అందించేందుకు ఈ కొనుగోలు తోడ్పడగలదని సైయంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు. 2015లో ఏర్పాటైన వర్క్‌ఫోర్స్ డెల్టాలో 11 మంది కన్సల్టెంట్లు ఉన్నారు. 2021 ఆర్థిక సంవత్సరంలో 2.9 మిలియన్ డాలర్ల ఆదాయం నమోదు చేసింది. -
యువ.. హవా! మన ఏపీలోనే ఎక్కువ!!
సాక్షి, అమరావతి: చాలా దేశాల్లో వృద్ధులు ఎక్కువై పనిచేసే యువత తక్కువగా ఉంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం యువ జనాభానే అధికం. ఇలా వర్క్‌ఫోర్స్ (పనిచేసే సైన్యం) అయిన యువత ఏపీలో అధికంగా ఉండడం శుభ పరిణామమని నిపుణులు అంటున్నారు. సీఆర్ఎస్ (సివిల్ రిజిస్ట్రేషన్ సర్వే) తాజాగా నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. జాతీయ సగటుతో పోలిస్తే ఏపీలో 20 నుంచి 44 ఏళ్లలోపు యువత అధికంగా ఉంది. దీనివల్ల సాంకేతిక, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తిపై ఎక్కువ సానుకూల ప్రభావం ఉంటుందని వారు చెబుతున్నారు. కాగా, ఉత్పాదకతపై ఎక్కువ ప్రభావం చూపే 20–44 ఏళ్లలోపు యువత మన రాష్ట్రంలో 2,12,92,205 మంది ఉన్నారు. తాజా సర్వే ప్రకారం దేశ జనాభా 133.89 కోట్లు అయితే.. ఏపీ జనాభా 5.23 కోట్లు. ఇందులో 40.7 శాతం మంది 20–44 ఏళ్ల మధ్య వారే ఉన్నారు. అదే జాతీయ సగటు 37.9 శాతం మాత్రమే. అంటే దేశంలో 50.74 కోట్ల మంది యువత ఉన్నట్లు లెక్క. అలాగే, ఆర్సీహెచ్ (రీ ప్రొడక్షన్ చైల్డ్–పునరుత్పత్తి సామర్థ్యం) అంటే పిల్లలను కనే అవకాశం ఉన్న మహిళల సంఖ్య (20 నుంచి 35 ఏళ్ల లోపు వారు) కూడా భారతదేశ సగటుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఉన్నట్లు తేలింది. మరోవైపు.. రాష్ట్రంలో పదేళ్లలోపు చిన్నారులు 83.70 లక్షల మంది ఉన్నారు. మొత్తం జనాభాలో 16 శాతం మంది అన్నమాట. ఇక రాష్ట్రంలో 60 ఏళ్లు ఆ పైన ఉన్న వారు 10.8 శాతంగా (56.50 లక్షల మంది) నమోదైంది. -
కరోనా పోరు: ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై: కరోనా వైరస్ (కోవిడ్ -19) లాక్డౌన్ నేపథ్యంలో కష్టాల్లో ఉన్న తమ ఉద్యోగులకు ప్రముఖ టెక్ సేవల సంస్థ కాగ్నిజెంట్ భారీ ఊరట కల్పించింది. భారతదేశం, ఫిలిప్పీన్స్ దేశాల్లో తన ఉద్యోగులకు సహాయం చేసేందుకు నిర్ణయించింది, అసోసియేట్ స్థాయి వరకు ఉద్యోగులకు ఏప్రిల్ నెలకు మూలవేతనంలో 25 శాతం అదనంగా చెల్లించనుంది. తాజా నిర్ణయం భారత్‌లో ఉన్న మూడింట రెండు వంతుల కాగ్నిజెంట్ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది. ఈ విధానాన్ని నెలవారీగా సమీక్షిస్తామని కంపెనీ తెలిపింది. (లాక్డౌన్: ఏంటి సర్.. మీకిది కూడా తెలియదా?) ఉద్యోగుల ఆరోగ్యం, భద్రతను నిర్ధారించేందుకు, ఖాతాదారులకు సురక్షతమైన సేవలను కొనసాగించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ వెల్లడించింది. అంతేకాదు ప్రస్తుత కరోనా సంక్షోభ సమయంలో ఇంటినుంచే పనిచేసేందుకు ఎక్కువ మందికి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఆయా ఉద్యోగులకు కొత్త ల్యాప్‌టాప్‌లను అందించడం, డెస్క్‌టాప్ ఎన్ క్రిప్టింగ్, అదనపు బ్యాండ్‌విడ్త్ కనెక్టివిటీ, ఎయిర్ కార్డులను అందించడం లాంటి కీలక చర్యల్నికూడా తీసుకుంది. అన్ని గ్లోబల్ కంపెనీల మాదిరిగానే, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రభావానికి తాము కూడా గురవుతున్నామని కంపెనీ తెలిపింది. (కరోనా కథ.. ఇల్లే సురక్షితం) ఈ క్లిష్ట సమయంలో మనమందరం ప్రతిరోజూ కొత్త సవాళ్లను ఎదుర్కొంటున్నాం..అయినా ఒకరికొకరం సాయం చేసుకుంటూ కలిసికట్టుగా, ధైర్యంతో పనిచేస్తూ సవాళ్లను అధిగమిద్దాం అని కాగ్నిజెంట్ సీఈవో బ్రియాన్ హంఫ్రీస్ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వీరోచితంగా పనిచేస్తున్న ఉద్యోగ బృందాలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి సేవల్నీ ఎప్పటికీ మర్చిపోలేమనీ, విశేష సేవలందించిన కీలక ఉద్యోగులు, ముఖ్య వ్యక్తులకు బహుమతి ఇచ్చేలా భవిష్యత్తులో నిర్దిష్ట చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. (కరోనా మూడో దశకు చేరుకుంటే?) -
ఒకే అర్హత ఉంది, కానీ వేతనం మాత్రం...
మహిళలకు పనిప్రదేశాల్లో సమప్రాధాన్యం ఇవ్వాలి. మహిళలు, పురుషులు ఒకే అర్హతతో ఉంటే, ఇద్దరికీ సమాన వేతనం ఇవ్వాలి. బోర్డు ఆఫ్ డైరెక్టర్లలో కచ్చితంగా మహిళలుండాలి. ఇవన్నీ ఎన్నో రోజులుగా పనిప్రదేశాల్లో వెల్లువెత్తుతున్న డిమాండ్లు. కానీ మగవారికి, ఏ మాత్రం తీసిపోకుండా మహిళలు చదువుకున్నా.. వారికి తగిన గౌరవమే కాదు, కనీసం తగిన వేతనం కూడా లభించడం లేదు. తాజాగా ప్రభుత్వం వెల్లడించిన సర్వేలో మగవారితో సమానంగా ఒకే విద్యార్హత ఉన్నప్పటికీ, మహిళలు 30 శాతం తక్కువ వేతనమే పొందుతున్నట్టు తెలిసింది. పట్టణ ప్రాంతంలో గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగి ఉన్న మహిళలు రోజుకు రూ.690.68 పొందుతుంటే, వారి కంటే 30 శాతం అధికంగా మగవారు రూ.902.45 ఆర్జిస్తున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. వ్యవసాయరంగంలో కూడా మగవారికి తగ్గస్థాయిలో మహిళలు పనిచేస్తున్నప్పటికీ, వారికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని సర్వే తెలిపింది. గ్రామాల్లో చదువుకోని మహిళలు రోజుకు రూ.88.2 వేతనం పొందుతుంటే, వారి కంటే 45 శాతం అధికంగా చదువుకోని మగవారు రూ. 128.52ను ఆర్జిస్తున్నట్టు వెల్లడైంది. అయితే కొన్ని రంగాల్లో మాత్రం మగవారి కంటే అధికంగా మహిళలే సంపాదిస్తున్నట్టు తెలిసింది. గ్రామీణ ప్రాంతంలో నిర్మాణ రంగంలో పనిచేసే మహిళలు రోజుకు రూ.322 ఆర్జిస్తుంటే, వారి కంటే 13 శాతం తక్కువగా మగవారు రూ.279.15 పొందుతున్నట్టు తాజా రిపోర్టు వెల్లడించింది. పట్టణ ప్రాంతంలో రవాణా, స్టోరేజ్ రంగాల్లో కూడా మహిళలే అధికంగా వేతనం పొందుతున్నారట. 15 నుంచి 59 ఏళ్ల మహిళలు, పురుషులుకు చెందిన సగటు రోజువారీ వేతనాలను తీసుకొని గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ‘మెన్ అండ్ ఉమెన్ ఇన్ 2017’ రిపోర్టును రూపొందించింది. ఈ రిపోర్టులోనే చదువుకోని వారి, చదువుకున్న వారి సంపాదనలను కూడా వెలువరించింది. చదువుకున్న మహిళలు, చదువుకోని మహిళల కంటే 5.8 సార్లు ఎక్కువగా సంపాదిస్తున్నారని రిపోర్టు పేర్కొంది. అలాగే చదువుకున్న మగవారు, చదువుకోని వారికంటే 3.6 సార్లు ఎక్కువగా ఆర్జిస్తున్నారని తెలిపింది. ఆశ్చర్యకరంగా చదువుకున్న తర్వాత కూడా మహిళలకు, పురుషులకు మధ్య వేతన చెల్లింపుల్లో చాలా వ్యత్యాసముంటుందని ఈ రిపోర్టు వెల్లడించింది. గ్రాడ్యుయేట్లు ఉన్నప్పటికీ మగవారి కంటే 24 శాతం తక్కువగా మహిళలు వేతనం పొందుతున్నారని తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు ఎక్కువ వేతనం చెల్లించే రంగం నిర్మాణ రంగమని పేర్కొంది. మైనింగ్, క్వారింగ్‌లో మగవారికి ఎక్కువ వేతనాలు ఉంటున్నాయని రిపోర్టు చేసింది. అదే పట్టణ ప్రాంతాలకు వచ్చే సరికి మైనింగ్, క్వారింగ్ రంగాల్లో మగవారు ఎక్కువగా సంపాదిస్తుంటే, ఎలక్ట్రిసిటీ, గ్యాస్, వాటర్ యుటిలిటీస్‌లో మహిళలు ఎక్కువ వేతనం పొందుతున్నారని తెలిపింది. -
మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన టాటా మోటార్స్
సాక్షి,ముంబై: దేశీయ ఆటో మొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ కానుక అందించింది. రాబోయే నాలుగైదేళ్లలో మహిళా ఉద్యోగుల నియమాకాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు ప్రకటించింది. తమ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 25శాతం మహిళలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. వచ్చే నాలుగు నుండి ఐదు సంవత్సరాలలో 25శాతం మహిళా ఉద్యోగుల లక్ష్యాన్ని భర్తీ చేస్తామనే ఆశాభావాన్ని టాటా మోటార్స్ చీఫ్ హెచ్ఆర్ అధికారి గజేంద్ర చందేల్ వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లుగా తమ ఉద్యోగుల్లో మహిళల సంఖ్యను పెంచుకుంటున కృషిలో తమ సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు. 2016 నాటికి మహిళా ఉద్యోగుల సంఖ్య 13శాతానికి, 2017 నాటికి 19 శాతానికి చేరుకుందన్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో దీన్ని 20-25శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. జెండర్ డైవర్సిటీ లక్ష్యంలో 2014లో టాటా లీడ్ ఇనీషియేటివ్‌లో భాగంగా అయిదుగురు మహిళలను నియమించుకున్నామని, ఇది ప్రోత్సాహకరమైన ఫలితాలను ఇచ్చిందన్నారు. పురుషులతోపాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించేందుకు, లింగ సమానత్వాన్ని సాధించేందుదిశగా క్రమంగా, స్థిరంగా కృషి చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా మహిళల ఎంపిక, సంస్కృతి-భావజాలంలో మార్పు, అభివృద్ధి అనే మూడు అంశాలపై దృష్టి పెట్టినట్టు చందేల్ వివరించారు. ఒకపుడు 'మహిళలు దరఖాస్తు చేయరాదు' అంటూ నిబంధన విధించి, సుధామూర్తి (ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ఛైర్పర్సన్) ఆగ్రహానికి గురై, అనంతరం ఆమెనే టాటా మోటర్స్ పూణే ప్లాంట్‌లో మొట్టమొదటి మహిళా ఇంజనీర్‌గా నియమించుకున్న ఉదంతాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. -
తొలిసారి టాప్ ఐటీ కంపెనీల్లో తగ్గిన ఉద్యోగులు
బెంగళూరు : 154 బిలియన్ డాలర్ల దేశీయ ఐటీ రంగం అప్పట్లో ఉద్యోగాలకు పుట్టినిల్లు. కానీ ప్రస్తుతం పరిస్థితి తారుమారైన సంగతి తెలిసిందే. ఉద్యోగాలను కల్పించడంలోనూ ఈ రంగం తీవ్ర గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. మొట్టమొదటిసారి టాప్-5 ఐటీ కంపెనీలోని మూడు కంపెనీల్లో ఉద్యోగులు భారీగా తగ్గిపోయారు. జూన్30తో ముగిసిన క్వార్టర్లో ఈ విషయం వెల్లడైంది. టాప్-5 ఐటీ కంపెనీల్లో జూన్ క్వార్టర్ ముగిసేసరికి 984,913 మంది ఉద్యోగులున్నారు. అంటే వారి వర్క్‌ఫోర్స్ గత క్వార్టర్ మార్చితో పోలిస్తే 1,821 మంది తగ్గిపోయింది. కాగ, 2017 మార్చితో ముగిసిన క్వార్టర్లో దేశీయ ఐటీ పరిశ్రమ 39 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు ఐటీ ఇండస్ట్రి బాడీ నాస్కామ్ వెల్లడించింది. అంతేకాక కనీసం 150,000 మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్టు నాస్కామ్ అంచనావేసింది. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే నాస్కామ్ అంచనాలు తప్పేలా కనిపిస్తున్నాయి. దేశీయ అతిపెద్ద సాఫ్ట్వేర్ సర్వీసులు సంస్థగా పేరున్న టీసీఎస్ వర్క్‌ఫోర్స్ జూన్‌తో ముగిసిన క్వార్టర్‌తో 1,414 మంది తగ్గి, 385,809గా ఉంది. అదేవిధంగా ఇన్ఫోసిస్ ఉద్యోగాలు నికరంగా 1,811 పడిపోయాయి. టెక్ మహింద్రాలో కూడా 1,713 మంది వర్క్‌ఫోర్స్ తగ్గిపోయారు. కేవలం విప్రో, హెచ్‌సీఎల్‌లు మాత్రమే తమ వర్క్‌ఫోర్స్‌లో నికర అడిక్షన్‌ను నమోదుచేశాయి. విప్రోలో ఇన్ఫోసర్వర్ కొనుగోలుతో కొత్తగా 200 మంది ఉద్యోగుల జాయిన్ అయ్యారు. అదనంగా మరో 1000 మంది ఉద్యోగులను తమ క్లయింట్ వర్క్‌ఫోర్స్ నుంచి తీసుకుంది. మిగతా ఐటీ కంపెనీలు ఎల్ అండ్ టీ ఇన్ఫోటెక్ లిమిటెడ్, మైండ్‌ట్రి లిమిటెడ్, కేపీఐటీ టెక్నాలజీస్ లిమిటెడ్, హెక్సావేర్ లిమిటెడ్, సింట్ లిమిటెడ్‌లు ఈ క్వార్టర్లో 2,026 మంది ఉద్యోగులను కంపెనీల్లోకి తీసుకున్నాయి. కంపెనీ బిజినెస్ మోడల్‌లు మారడంతో ఐటీ కంపెనీలు కొత్తగా ఉద్యోగులను నియమించుకోవడంలో తీవ్ర కఠినతరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని తెలిసింది. ఓ వైపు ట్రంప్ రక్షణాత్మక విధానాలు, మరోవైపు ఆటోమేషన్ ప్రభావంతో చాలా కంపెనీలు తమ ప్రస్తుత వర్క్‌ఫోర్స్ విషయంలో పునఃసమీక్షించుకోవడం మొదలుపెట్టాయి. ఈ ప్రభావంతో భారీగా వర్క్‌ఫోర్స్‌ను కంపెనీలు తగ్గిస్తున్నట్టు వెల్లడైంది. ఈ ఏడాది టాప్-7 ఐటీ కంపెనీలు 56వేల మంది ఇంజనీర్లను కంపెనీలు విడిచిపెట్టి వెళ్లమని ఆదేశించవచ్చని మింట్ గతంలోనే రిపోర్టు చేసింది. ఈ సంఖ్య గతేడాది నుంచి రెండింతలు పెరుగుతుందని తెలిపింది. -
భారీగా ఉద్యోగాల కోత
ముంబై: దేశీయ అతిపెద్ద ఇంజనీరింగ్ సంస్థ లార్సన్ అండ్ టుబ్రో భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. డిజిటైజేషన్ , మందగించిన వ్యాపారం నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం ఉద్యోగుల్లో 11.2 శాతం కోత పెట్టింది. దాదాపు 14 వేల మందిని తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు ఎల్అండ్ టీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్ శంకర్ రామన్ తెలిపారు. మొత్తం 1.2 లక్షలమంది ఉద్యోగులు ఉండగా ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 14 వేలమందిని తొలగించినట్టు రామన్ తెలిపారు. సంస్థ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని ఈ క్రమంలో ఉద్యోగుల తొలగింపు అనివార్యమైందని పేర్కొన్నారు. మొత్తంగా వివిధ వ్యాపారాల్లో ఈ తొలగింపును చేపట్టిన సంస్థ ఎంతమంది ఉద్యోగుల పై వేటు వేయనుందీ ప్రకటించలేదు. ఆయిల్ ధరల పతనం మధ్య-తూర్పు ప్రాంతంలో తమ వ్యాపారాన్ని దెబ్బతీసిందని , దీంతో రాబోయే నెలల్లో కూడా ఆర్థిక పరిస్థితి గడ్డుగానే ఉండనుందని ఎల్ అండ్ టీ అంచనా వేస్తోంది. దేశీయ మార్కెట్ లో పోటీ తీవ్రంగా ఉందని చెప్పింది. అయితే ఈ ఉద్యోగాల కోత దిద్దుబాటు చర్యల్లో భాగం తప్ప సీక్వెన్షియల్ తగ్గింపుగా చూడరాదని రామన్ కోరారు. తమ వ్యాపారం తిరిగి సాధారణ పరిస్థితికి పొందడానికి కొంత సమయం పడుతుందన్నారు. మరోవైపు ఇటీవలి కాలంలో ఇదే అతిపెద్ద ఉద్యోగాల తొలగింపు అని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. కాగా సుమారు రెండు లక్షల కోట్ల ఆదాయవృద్ధి అంచనాతో ఈ ఏడాది ఐదు సంవత్సరాల వ్యూహాత్మక ప్రణాళికను ప్రారంభించింది. ఆ ప్లాన్ లో కొన్ని నిరర్థక వ్యాపారాలపై దృష్టి పెట్టింది. 18-24 నెలల్లో వీటిని తిరిగి తీసుకోవాలని యోచిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎల్ అండ్ టీ ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. గతేడాది క్యూ2తో పోల్చితే నికర లాభంలో 84 శాతం వృద్ధి నమోదు చేయడంతో స్టాక్ లో భారీగా కొనుగోళ్ల ధోరణి నెలకొంది. -
భారత్‌లో పడిపోతున్న మహిళా కార్మిక శక్తి
న్యూఢిల్లీ: ఆకాశంలో సగం మాదే అని సగర్వంగా చెప్పుకుంటున్న భారత మహిళలు ఉన్నత విద్యలో ఇంతకుముందు కన్నా ఎంతో ముందుకు దూసుకుపోతున్న కార్మిక శక్తిలో మాత్రం ఇంతకుముందు కన్నా వెనకబడి పోతున్నారు. ఉన్నత విద్యలో మహిళలు 2007లో 39 శాతం ఉండగా, అది 2014 నాటికి 46 శాతానికి పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 1999లో భారత్‌లో మహిళల కార్మిక శక్తి 34 శాతం ఉండగా, 2014 నాటికి అది 27 శాతానికి పడిపోయింది. మహిళా కార్మికుల్లో ప్రపంచ సగటు 50 శాతం ఉండగా, భారత్‌లో మాత్రం 27 శాతానికి పడిపోవడం విచారకర పరిణామం. తూర్పు ఆసియా దేశాల్లో ఈ సగటు 63 శాతం ఉండడం గమనార్హం. ఉన్నత విద్యలో మహిళల శాతం ఏటేటా పెరుగుతున్నప్పటికీ కార్మిక శక్తిలో మాత్రం ఎందుకు వెనకబడి పోతున్నారు. మహిళలకు ఉద్యోగావకాశాలు లేకనా? వర్క్ ప్లేస్‌లో సరైన వసతులు లేకనా? పలు రంగాల్లో మహిళలకు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నప్పటికీ, ఆటోమొబైల్, రవాణా వ్యవస్థలతోపాటు, రక్షణ రంగంలో కూడా మహిళలకు అవకాశాలు పెరుగుతున్న నేటి పరిస్థితుల్లో ఎందుకు మహిళలు కార్మిక శక్తిలో వెనకబడుతున్నారన్నది ప్రధాన ప్రశ్న. మహిళలు పెళ్లి చేసుకొని ఇంటిపట్టునే ఉండాలనే సామాజిక ధోరణి ఇప్పటికీ కొనసాగడమే అందుకు కారణమని సామాజిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉద్యోగం పురుష లక్షణం నానుడి కనుమరగయ్యేంత వరకు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగవచ్చని వారంటున్నారు. పదవ తరగతి నుంచి డిగ్రీ స్థాయి వరకు విద్యా సంస్థల్లోకి యువతుల ప్రవేశం యువకులకన్నా ఎక్కువగా ఉంటునప్పటికీ ఉన్నత విద్యలో, ముఖ్యంగా ఎంఫిల్, పీహెచ్డీలలో మగవాళ్లతో పోలిస్తే వారు ఇంకా వెనకబడే ఉన్నారు. దానికి కారణం కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని వర్గాల ప్రజల్లో యుక్త వయస్సులోనే ఆడ పిల్లల పెళ్లిళ్లు చేయడం కారణమని తెలుస్తోంది. అయినప్పటికీ దేశంలో సగటు మహిళలను తీసుకుంటే ఉన్నత విద్యలో వారి సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఉన్నత విద్యలో 2012-13 సంవత్సరంలో మహిళలు 20.8 శాతం ఉండగా, మహిళల సంఖ్య 2014-15 సంవత్సరం నాటికి 23.6 శాతానికి పెరిగింది. అయితే ఇది గ్లోబల్ సగటు 27 శాతం కన్నా తక్కువే. ఈ సగటు చైనాలో 26 శాతం ఉండగా, బ్రెజిల్లో 36 శాతం ఉంది. దేశంలో యువకులు సరాసరి సగటున 23.5 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటోండగా, యువతులు సరాసరి సగటున 19.2 ఏళ్ల వయస్సులో పెళ్లి చేసుకుంటున్నారు. గతంతో పోలిస్తే మహిళల్లో కూడా పెళ్లి చేసుకునే వయస్సు పెరిగినప్పటికీ వారి కార్మిక శక్తి మాత్రం తగ్గుతోంది. భారత ఆర్థిక వృద్ధి రేటు పెరిగినప్పుడల్లా మహిళా కార్మిక శక్తి పడిపోతోందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ అంచనా వేసింది. మహిళల్లో విద్యా స్థాయి పెరగడంతోపాటు మహిళాకార్మిక శక్తికి విలువ పెరిగినప్పుడే భారత్‌లో మహిళా కార్మిక శక్తి పెరుగుతోందని సూత్రీకరించింది. -
‘z’ కా మత్లబ్ క్యా హై..?
తెలుసా ఈ చరితం..? వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల అక్షరాలను మీరే గమనించే ఉంటారు. ఒక సీరిస్ ప్రకారం రవాణాశాఖ ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తుంది. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం ‘జడ్’ అనే అక్షరంతోనే నమోదవుతాయి. ఎందుకో తెలుసా..?నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు’ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 1932 జూన్‌లో మొట్టమొదటిసారి సిటీ బస్సులను ప్రవేశపెట్టింది. వీటిని నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగం పేరిట నమోదు చేయించారు. అందుకే ప్రతి బస్సు నెంబర్ ఆమె పేరులోని మొదటి అక్షరం ‘జడ్’తో ప్రారంభమవుతుంది. ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. నేటికీ.. అదే నెంబర్ వన్: నిజాం కాలంలో బస్సులు హైదరాబాద్ నుం చి సికింద్రాబాద్ వరకు నడిచేవి. ఇప్పటి ట్యాంక్‌బండ్ అప్పుడు రెండు జంటనగరాల మధ్య ప్రధాన రహదారి. ముఖ్యంగా నవాబు నివాసం కింగ్ కోఠి నుంచి సికింద్రాబాద్‌కు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బస్సు నెంబ ర్ ఒకటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూ ట్ నెంబర్ ఒకటే. కింగ్‌కోఠితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు బస్సు లు నడిపేవారు. ఉదాహరణకు బార్కాస్‌కు రెండో నెంబర్ బస్సు వెళ్తుంది. బార్కాస్ మొదటి నుంచి సైనికులు, అధికారుల నివాస ప్రాంతం. అలా అప్పట్లో ప్రముఖుల అవసరాల మేరకు ప్రవేశపెట్టిన బస్సులు క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. -
విధులకు రాకున్నా టంచన్‌గా జీతం!
♦ ఆర్టీసీలో వెలుగుచూసిన బోగస్ వైద్య బిల్లుల బాగోతం ♦ సొంత పనుల్లో ఉండి.. చికిత్స చేయించుకున్నట్టు సర్టిఫికెట్లు ♦ భాగ్యనగరంలో వెలుగుచూసిన వ్యవహారం ♦ ఓ డిపో మేనేజర్ అనుమానంతో గుట్టురట్టు ♦ అన్ని డిపోల్లో దర్యాప్తునకు రంగం సిద్ధం సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీలో అతనో ఉద్యోగి. ఇంటి దగ్గర వస్త్రవ్యాపారం చేస్తున్నాడు. నెల పాటు వ్యాపారం వద్ద ఉండాల్సి రావటంతో విధులకు డుమ్మా కొట్టేశాడు. అయినా నెల తిరిగేసరికి టంచన్‌గా జీతం వచ్చి చేతిలో పడింది. ఓ డిపోలో అతను ఉద్యోగం చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా సైడ్ బిజినెస్ చేస్తున్నాడు. 20 రోజుల పాటు విధులకు దూరంగా ఉండి రియల్ ఎస్టేట్ పార్టీలతో తిరిగాడు. జీతం మాత్రం యథాప్రకారం పొందాడు. విధులకు హాజరు కాకున్నా వీరికి జీతాలెలా వస్తున్నాయో తెలుసా? తీవ్ర అనారోగ్యానికి గురయ్యామని, తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్సపొందామని ఆస్పత్రి ‘జారీ చేసిన’ పత్రాలు దాఖలు చేశారు. దీంతో ఆర్టీసీ వారికి జీతం చెల్లించేసింది. ఇందులో ప్రత్యేకత ఏముందనుకుంటున్నారా..??? అసలు ఆ పత్రాలను తార్నాక ఆర్టీసీ ఆస్పత్రి జారీ చేయనేలేదు..!!! ఆర్టీసీలో నకిలీ వైద్య బిల్లుల బాగోతానికి ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘సొంత వ్యవహారాలు’ చక్కబెట్టుకునే క్రమంలో కొందరు సిబ్బంది విధులకు ఎగనామం పెట్టి, తార్నకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నట్టుగా నకిలీ బిల్లులు దాఖలు చేసి జీతం డబ్బులు స్వాహా చేశారు. ఆ మొత్తం రూ. కోట్లలో ఉన్నట్టు సమాచారం. ఓ డిపో మేనేజర్‌కు వచ్చిన అనుమానంతో కూపీలాగగా ఈ గుట్టురట్టయింది. దీంతో మరికొందరు డిపో మేనేజర్లు విచారణ జరపగా వారివారి డిపో పరిధిలో కూడా ఈ తంతు వెలుగు చూసింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో దీనిపై విచారణకు ఆర్టీసీ యాజమాన్యం ఆదేశించింది. హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన ఈ బాగోతంలో ఇప్పటి వరకు 80 మంది సిబ్బంది పాలుపంచుకున్నట్టు తేలింది. విచారణ కొనసాగుతున్నందున ఈ సంఖ్య వందల్లో ఉండొచ్చని సమాచారం. వెలుగు చూసిందిలా.. గత నెలకు సంబంధించి నగరంలోని మియాపూర్ డిపోలో మెడికల్ బిల్లులు దాఖలయ్యాయి. వాటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో డిపో మేనేజర్‌కు అనుమానం వచ్చి.. వాటిని తార్నాకలోని ఆస్పత్రి పరిశీలనకు పంపారు. అసలు ఆ పేరుగల సిబ్బంది ఆస్పత్రికే రాలేదని, ఆ బిల్లులు తాము జారీ చేసినవి కావని అక్కడి అధికారులు తేల్చారు. దీంతో సిబ్బంది నకిలీ బిల్లులు జమ చేసినట్టు అనుమానించి తొలుత నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. మరికొన్ని బిల్లుల సంగతి తేల్చాల్చి ఉంది. ఈ విషయం తెలిసి కూకట్పల్లి, మేడ్చల్, బీహెచ్ఈఎల్ డీఎంలు కూడా తమ డిపోల్లో దాఖలైన బిల్లులను ఆస్పత్రికి పంపారు. వాటిలో సగానికిపైగా బోగ స్ అని తేలింది. నెల రోజుల బిల్లుల్లో 80 నకిలీవి అని తేలాయి, మరికొన్ని వందల బిల్లుల పరిశీలన జరుగుతోంది. ఈ తంతు చాలాకాలంగా నడుస్తోందని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా రూ. కోట్ల నిధులు ఇలా నకిలీ బిల్లులతో స్వాహా చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నందున గత ఏడాదికాలంలో దాఖలు చేసిన అన్ని బిల్లులను పరిశీలించాలనే ఆలోచనలో అధికారులున్నారు. దీన్ని విజిలెన్స్ విభాగం ద్వారా తనిఖీ చేయించనున్నట్టు సమాచారం. బిల్లులు ఎవరిస్తున్నారు.. చికిత్స పొందిన ఉద్యోగులకు ఆర్టీసీ ఆస్పత్రి ముద్రతో బిల్లు జారీ అవుతుంది. ఆస్పత్రి జారీ చేసే బిల్లు అచ్చుగుద్దినట్టుగా నకిలీ పత్రాలు ఇప్పుడు వెలుగుచూశాయి. ఆర్టీసీలో పనిచేసే కొందరు ఉద్యోగులు దీని వెనక ఉన్నట్టు తెలుస్తోంది. వారు నకిలీ స్టాంపులు రూపొందించి సిబ్బందికి గుట్టుచప్పుడు కాకుండా బిల్లులు జారీ చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నట్టు సమాచారం. వీరి వెనక ఆస్పత్రి సిబ్బంది హస్తం ఉందేమోనన్న కోణంలోనూ దర్యాప్తు చేయనున్నట్టు తెలిసింది. -
ఉద్యోగుల వలసల జోరు
ముంబై: సమాజంలో ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో చాలా మంది ఉద్యోగులు తాము చేస్తున్న పనిని వదిలేసి మంచి అవకాశాలు ఉన్న ఇతర ఉద్యోగాల వైపు వెళ్లడానికి మొగ్గుచూపుతున్నారు. వచ్చే ఏడాది కాలంలో ఇలా ఉద్యోగాలు మారే వారి సంఖ్య ఎక్కువగా ఉండనుందని మైకెల్ పేజ్ ఇండియా సర్వేలో వెల్లడైంది. కెరీర్ కోసమే... వలసల జోరుకు కెరీర్ వృద్ధి బాగా ఊతమిస్తోంది. కెరీర్ బాగుంటుందనే ప్రాథమిక కారణంతోనే ప్రస్తుతం పనిచేస్తున్న సంస్థను వదిలేసి ఇతర వాటిల్లోకి వెళ్తున్నామని 65 శాతం మంది పేర్కొన్నారు. సర్వేలో పాల్గొన్న దాదాపు 82 శాతం మంది వచ్చే ఏడాది కాలంలో తాము ఉద్యోగాలు మారుతున్నట్లు తెలిపారు. అలాగే దాదాపు 73 శాతం మంది గత ఏడాది కాలంలో చాలా ఇంటర్వ్యూలకు హాజరయ్యామని పేర్కొన్నారు. వారంలో 51 గంటలకు పైగానే పనిచేస్తున్నామని 34 శాతం మంది తెలిపారు. వారు పనిచేస్తున్న కంపెనీల డైవర్సిఫైడ్ పాలసీలపై వారికే అవగాహ న లేదని 42 శాతం మంది పేర్కొన్నారు. కొందరు ఉద్యోగులు వేతనంతో పోలిస్తే కంపెనీ పేరుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. 45 శాతం మంది ఈ అంశానికి ఓటు వేశారు. ఉద్యోగుల గమ్య స్థానం సింగపూర్ విదేశీ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భారతీయులు ముందున్నారు. ప్రపంచంలో ఎక్కడైనా పనిచేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆసియా ప్రాంత ప్రజల ఉద్యోగ గమ్య స్థానంగా సింగపూర్ ఉంది. ఏడాది కాలంలోనే ప్రమోషన్ కోరుకునే వారు దాదాపు 70 శాతం మంది ఉన్నారు.