ప్రముఖ విమాన తయారీ సంస్థ బోయింగ్ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి రంగం సిద్ధమైంది. ఈ ఏరోస్పేస్ దిగ్గజం 17,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఇప్పటికే చాలా మందికి పింక్ స్లిప్పులు పంపిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఇవి పొందిన వారు రెండు నెలలపాటు అంటే జనవరి వరకు నోటీస్ పీడియడ్‌లో ఉండబోతున్నట్లు స్పష్టం చేసింది.
కంపెనీ తీవ్ర నష్టాల్లో ఉండడమే ఈ లేఆఫ్‌లకు కారణమని అధికారులు తెలిపారు. రాబోయే రోజుల్లో కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు 10 శాతం వర్క్‌ఫోర్స్‌ను తగ్గించుకుంటామని చెప్పారు. ఇటీవల సియాటెల్ ప్రాంతంలో బోయింగ్ ఉద్యోగులు సుమారు 33,000 మంది నెల రోజులకుపైగా సమ్మెకు దిగారు. ఈ సమ్మె కారణంగా 737 మ్యాక్స్, 767, 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో కంపెనీ భారీ నష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. జరిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి, ఉద్యోగులను తొలగించడానికి సంస్థ సిద్ధమైంది. బోయింగ్ ఎదుర్కొంటున్న ఆర్థిక పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు చాలా అవసరమని గతంలో కంపెనీ సీఈఓ పేర్కొన్నారు. సంస్థ తొలగించే ఉద్యోగుల్లో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్ స్థాయి అధికారులు కూడా ఉన్నారు. అయితే ఏ విభాగంలో ఎంతమందిని తొలగిస్తున్నారనే స్పష్టమైన వివరాలు మాత్రం తెలియరాలేదు.
ఇదీ చదవండి: దుబాయ్‌లో ఎయిర్ ట్యాక్సీ నిర్వహణకు రంగం సిద్ధం
ఇటీవల బోయింగ్ ఉద్యోగుల సమ్మె కారణంగా విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో వివిధ విమానయాన సంస్థలకు అందించే 777 జెట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల డెలివరీలు ఆలస్యం కానున్నాయి. ఈ జెట్ 2026లో డెలివరీ చేయాల్సి ఉంది. కానీ ఉత్పత్తి ఆలస్యం కావడం వల్ల డెలివరీకి మరింత సమయం పడుతుందని అంచనా. దీనివల్ల సంస్థ షేర్స్ భారీగా క్షీణించాయి. ప్రస్తుతం కంపెనీ ఆర్థికంగా నిలబడటానికి ఉద్యోగుల తొలగింపు చాలా అవసరమని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment