
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు సమా పలు కంపెనీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కూడా వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్‌ఆర్ వర్టికల్స్‌లో 2,000 ఉద్యోగాలను తొలగించనుంది. వీరిలో ఎక్కువగా టీసీఎస్ అవుట్ సోర్స్ ద్యోగులు ప్రభావితం కానున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.
మొత్తం 5,800 కంపెనీల నుండి ఫైనాన్స్‌లో దాదాపు 1,500, హెచ్‌ఆర్‌లో 400 ఉద్యోగులను తొలగించనుంది. ఫైనాన్స్ , హెచ్‌ఆర్ సపోర్ట్ సేవలను తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బోయింగ్‌లో కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ మైక్ ఫ్రైడ్‌మాన్ ఉటంకిస్తూ సీటెల్ టైమ్స్ నివేదించింది. అయితే కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టీసీఎస్‌కి అవుట్సోర్స్ చేసిందని మీడియా నివేదించింది.
ఇండియాలో బోయింగ్‌లో ఇప్పుడుదాదాపు 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ సహా ఇతర సంస్థలకు సంబంధించి మరో 7వేల మంది ఉద్యోగులున్నారు. కాగా రానున్న కాలంలో వ్యయాలను తగ్గించుకునే క్రమంలో మరింత మందిని తొలగించాలని బోయింగ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలను సిద్ధం చేయడానికి మేనేజర్‌లను కోరింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన సిబ్బందిలో 10 శాతం మందిని వర్గీకరించాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment