ఆర్ధిక ఆనిశ్చితి, డిమాండ్ తగ్గడం వంటి కారణాలతో చిన్న చిన్న కంపెనీల నుంచి అంతర్జాతీయ సంస్థల వరకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్‌వర్క్ లింక్డిన్‌కు లేఆఫ్స్ సెగ తగిలింది. తాజాగా, 716 మందికి పింక్ స్లిప్‌లు జారీ చేయగా.. అదే సంస్థ చైనా కేంద్రంగా సేవలందిస్తున్న జాబ్ అప్లికేషన్‌ను షట్‌డౌన్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
లింక్డిన్ గత సంవత్సరంలోని ప్రతి త్రైమాసికంలో ఆదాయాన్ని గడించింది. కానీ, దాని మాతృ సంస్థ మైక్రోసాఫ్ట్ లేఆఫ్స్ కొనసాగిస్తుంది. లింక్డిన్ దాదాపు 20,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో దాదాపు 3.5 శాతం ఉద్యోగాల కోతలకు దారి తీసినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.
చదవండి👉సుందర్ పిచాయ్‌పై సొంత ఉద్యోగులే ఆగ్రహం.. జీతం తిరిగి వెనక్కి ఇచ్చేస్తారా?
ఆరు నెలల్లో 2,70,000 మంది తొలగింపు
గత ఆరు నెలల్లో, ప్రపంచవ్యాప్తంగా 2,70,000కి పైగా ఐటీ ఉద్యోగులు ఉపాది కోల్పోయారు. అమెజాన్, ఫేస్‌బుక్, గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వంటి దిగ్గజ సంస్థ ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. కాగా, 2016లో లింక్డిన్ 26 బిలియన్లకు కొనుగోలు చేసిన మైక్రోసాఫ్ట్, ఇటీవలి కాలంలో దాదాపు 10,000 ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపిన విసయం తెలిసిందే
మైక్రోసాఫ్ట్ సైతం
మైక్రోసాఫ్ట్ ఈ ఏడాది ప్రారంభంలో దాదాపు 10,000 మంది ఉద్యోగులను ఫైర్ చేసింది. వారిలో సప్లయి చైన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఉన్నారు. మైక్రోసాఫ్ట్‌తో పాటు అమెజాన్, మెటా, గూగుల్ వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉద్యోగులపై వేటు వేశాయి. గత ఏడాది చివరి నుంచి మెటా 21,000 మందిని తొలగించింది. జనవరి 2023లో గూగుల్ 12,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది. అమెజాన్ ఇప్పటివరకు రెండు దఫాలుగా 27,000 మందిని తొలగించడం ఆందోళనలకు దారి తీసింది. టెక్ పరిశ్రమలో చాలా మంది తొలగింపులు కంపెనీ ఆర్థిక స్థితికి కారణమని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
చదవండి👉 ఇద్దరు ఉద్యోగుల కోసం.. యాపిల్, గూగుల్ సీఈవోల పోటీ.. చివరికి ఎవరు గెలిచారంటే?
Comments
Please login to add a commentAdd a comment