‘z’ కా మత్‌లబ్ క్యా హై..?
తెలుసా ఈ చరితం..?
వాహనాల నెంబర్ ప్లేట్లపై రకరకాల అక్షరాలను మీరే గమనించే ఉంటారు. ఒక సీరిస్ ప్రకారం రవాణాశాఖ ప్రతి వాహనానికి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తుంది. కానీ ఆర్టీసీ బస్సులు మాత్రం ‘జడ్’ అనే అక్షరంతోనే నమోదవుతాయి. ఎందుకో తెలుసా..?నిజాం ప్రభుత్వం రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం ‘నిజాం స్టేట్ రైల్ అండ్ రోడ్డు ట్రాన్స్‌పోర్టు’ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 1932 జూన్‌లో మొట్టమొదటిసారి సిటీ బస్సులను ప్రవేశపెట్టింది. వీటిని నిజాం ఉస్మాన్ అలీఖాన్ తన తల్లి జహ్రాబేగం పేరిట నమోదు చేయించారు. అందుకే ప్రతి బస్సు నెంబర్ ఆమె పేరులోని మొదటి అక్షరం ‘జడ్’తో ప్రారంభమవుతుంది. ఆర్టీసీ ఆవిర్భవించినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆ సాంప్రదాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
నేటికీ.. అదే నెంబర్ వన్:
నిజాం కాలంలో బస్సులు హైదరాబాద్ నుం చి సికింద్రాబాద్ వరకు నడిచేవి. ఇప్పటి ట్యాంక్‌బండ్ అప్పుడు రెండు జంటనగరాల మధ్య ప్రధాన రహదారి. ముఖ్యంగా నవాబు నివాసం కింగ్ కోఠి నుంచి సికింద్రాబాద్‌కు మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బస్సు నెంబ ర్ ఒకటి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రూ ట్ నెంబర్ ఒకటే. కింగ్‌కోఠితో పాటు ఉద్యోగులు, అధికారుల నివాస ప్రాంతాలకు బస్సు లు నడిపేవారు. ఉదాహరణకు బార్కాస్‌కు రెండో నెంబర్ బస్సు వెళ్తుంది. బార్కాస్ మొదటి నుంచి సైనికులు, అధికారుల నివాస ప్రాంతం. అలా అప్పట్లో ప్రముఖుల అవసరాల మేరకు ప్రవేశపెట్టిన బస్సులు క్రమంగా సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి.