
సాక్షి, సిటీబ్యూరో: విభిన్న రంగాల్లో చెప్పుకోదగిన విజయాలు సాధిస్తున్నప్పటికీ.. తన లక్ష్యాల జాబితా చాలా పెద్దదని చెప్పారు అపోలో లైఫ్ వైస్ చైర్‌పర్సన్, సినీనటుడు రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన కామినేని. నగరానికి చెందిన ఔత్సాహిక మహిళా వ్యాపార వేత్తలకు చెందిన ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో గురువారం ‘ఫ్రీడమ్ టు బీ మి’ అనే అంశంపై వర్చువల్ సదస్సును ఆన్‌లైన్ వేదికగా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫిక్కి మహిళా సభ్యులకు, అతిథిగా హాజరైన ఉపాసనకు మధ్య టీవీ యాంకర్ స్వప్న అనుసంధాన కర్తగా వ్యవహరించారు. విభిన్న రంగాల్లో రాణిస్తూ తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే ఫిలాంత్రపిస్ట్ పురస్కారం కూడా అందుకున్న ఉపాసన తాను మరిన్ని లక్ష్యాల సాధనకు ఇంకా ఎంతో శ్రమించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమెతో ఫిక్కి సభ్యుల ముచ్చట్లు ఆసక్తి కరంగా సాగాయి. కార్యక్రమంలో ఫిక్కి ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చాప్టర్ చైర్ పర్సన్ ఉషశ్రీ మన్నె పాల్గొని మాట్లాడారు.(శభాష్ ఉపాసనా..)
Comments
Please login to add a commentAdd a comment