బెంగళూరు : దేశంలో ట్రావెల్, టూరిజం రంగాలు భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించాయని తెలిసింది. 2017లో ఈ రంగాలు కలిసి 2.59 కోట్ల ఉద్యోగాలు సృష్టించాయని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించాయని ఇండియన్ ఇండస్ట్రి బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు వెల్లడించాయి. దేశంలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలుగా ట్రావెల్, టూరిజం రంగాలు ఉన్నాయని, ప్రత్యక్షంగానే ఈ రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలు అందించాయని ఈ రిపోర్టులు తెలిపాయి. దేశీయ ఎకానమీలో ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కీలక రంగాలుగా ఉన్నాయని, ఫారిన్ టూరిస్ట్ అరైవల్స్‌లో ఏడాది ఏడాదికి 15.6 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పాయి.
ట్రావెల్ ఇండస్ట్రి భవిష్యత్తును మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వర్చ్యువల్/ అగ్‌మెంటెడ్ రియాల్టీ నిర్థారించనున్నాయని ఈ రిపోర్టులు తెలిపాయి. ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ 2017 నుంచి 2021 నాటికి 14.8 శాతం పెరగనుందని రిపోర్టులు అంచనావేశాయి. 2019 నాటికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బిజినెస్ ట్రావెల్ మార్గెట్‌గా భారత్ నిలువనుందని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకం పెరుగడంతో, భారత్ డిజిటల్ ఎనాబుల్ టూరిస్ట్ గమ్యంగా మారనుందని చెప్పాయి.
Comments
Please login to add a commentAdd a comment