KPMG
-
Nishtha Satyam: సత్య నిష్ఠతో...
వివక్ష అనేది ఎక్కడో ఉండదు. మన చుట్టూనే పొంచి ఉంటుంది. అలాంటి వివక్షను సూక్ష్మస్థాయిలో విశ్లేషిస్తోంది నిష్ఠా సత్యం. స్త్రీ సాధికారతకు సంబంధించిన కార్యక్రమాలపై నిష్ఠగా పనిచేస్తోంది... బాలీవుడ్ సినిమా ‘మొహ్రా’లోని ‘తూ చీజ్ బడీ హై మస్త్ మస్త్’ పాట యువ గళాల్లో ఎక్కువగా వినిపిస్తున్న కాలం అది. అందరిలాగే తాను కూడా ఆ పాట హమ్ చేస్తోంది నిష్ఠ. ఆమె తండ్రికి విపరీతమైన కోపం వచ్చి ‘నువ్వు ఎలాంటి పాట పాడుతున్నావో తెలుసా’ అంటు తిట్టాడు. చిన్నపాటి పనిష్మెంట్ కూడా ఇచ్చాడు. ‘సరదాగా రెండు లైన్లు పాడినందుకు ఇంత రాద్ధాంతమా?’ అనుకుంది నిష్ఠ. ఒకవేళ ఈ పాట అబ్బాయి పాడి ఉంటే ఇలాగే జరిగి ఉండేదా? ‘జరగదు’ అని బలంగా చెప్పవచ్చు. ఈ సంఘటన ఒక్కటే కాదు పెద్ద కంపెనీలలో పనిచేస్తున్న కాలంలోనూ లింగవివక్షను ఎదుర్కొంది నిష్ఠ. మల్టీనేషనల్ కంపెనీ కేపీఎమ్‌జీ, అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లలో ఎకానమిస్ట్‌గా పనిచేసిన నిష్ఠా సత్యం ఐక్యరాజ్య సమితిలోకి అడుగు పెట్టింది. ఐక్యరాజ్యసమితిలో పాట్నర్‌షిప్ అడ్వైజర్‌గా ప్రయాణం మొదలు పెట్టిన నిష్ఠ డిప్యూటీ హెడ్ హోదాలో పనిచేసింది. ఆ తరువాత యూఎన్ ఉమెన్ మిషన్ హెడ్– తిమోర్–లెస్తే బాధ్యతలు చేపట్టింది. ‘రెండు విధాలుగా మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషించాలి. ఒకటి డిఫాల్ట్ సెట్టింగ్ రెండోది డిజైన్ సెట్టింగ్. డిజైన్ సెట్టింగ్ అనేది పురుషుల నుంచి వచ్చింది. వారికి అనుకూలమైనది’ అంటుంది నిష్ఠ. స్మార్ట్ ఫోన్ల సైజ్ నుంచి పీపీయీ కిట్స్ వరకు మార్కెట్లో ఉన్న ఎన్నో వస్తువుల డిజైన్లు మహిళలకు అనుకూలంగా లేకపోవడంలోని వివక్షను ప్రశ్నిస్తుంది నిష్ఠ. ‘సాంస్కృతిక సందర్భాలు వివిధ మార్గాలలో మహిళలను శక్తిమంతం చేస్తాయి. సాధికారతకు సంబంధించి మన ఆలోచనలను వారిపై బలవంతంగా రుద్దడంలో అర్థం లేదని తిమోర్–లెస్తే మహిళల నుంచి నేర్చుకున్నాను’ అంటుంది నిష్ఠా సత్యం. -
‘చమురు’ ధరలు ముంచేస్తాయి.. భారత్ హెచ్చరిక!
న్యూఢిల్లీ: అధిక చమురు ధరలు ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణపై ప్రభావం చూపుతాయని భారత్ హెచ్చరించింది. అయితే ప్రస్తుత భౌగోళిక రాజకీయ సంక్షోభం పరిస్థితుల నుంచి ప్రపంచం బయటపడగలదన్న విశ్వాసాన్ని వెలిబుచ్చింది. భారత్ ప్రపంచంలోని మూడవ అతిపెద్ద చమురు వినియోగదారుగా ఉన్న సంగతి తెలిసిందే. తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఆర్థిక సేవల సంస్థ– కేపీఎంజీ ఫ్లాగ్షిప్ ఇన్నోవేషన్ అండ్ ఎనర్జీ 14వ ఎడిషన్– ఎన్రిచ్ 2023 కార్యక్రమంలో చమురు వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి మాట్లాడుతూ, ఇజ్రాయెల్–హమాస్ సైనిక సంఘర్షణను జాగ్రత్తగా పరిశీలిస్తున్నామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ‘సప్లై చైన్’పై ఈ ‘ఘర్షణ’ ప్రభావం పడలేదని అన్నారు. ఇజ్రాయెల్– పాలస్తీనా ఇస్లామిస్ట్ గ్రూప్ హమాస్ మధ్య సైనిక ఘర్షణల తరువాత చమురు ధరలు సోమవారం బ్యారెల్‌కు దాదాపు 3 డాలర్లు పెరిగాయి. అయితే సరఫరా అంతరాయాలపై ఆందోళనలు అక్కర్లేదన్న వార్తలతో కొంత తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో మంత్రి ప్రసంగంలో కొన్ని ముఖ్యాంశాలు. ముడి చమురు ధరలు పెరిగితే అది ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ప్రయత్నాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. గ్లోబల్ మార్కెట్లు అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటాయని నేను భావిస్తున్నాను. సరఫరా మార్గాలకు అంతరాయం కలగకపోతే, భారత్ ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తుందని భావిస్తున్నాను. పెరుగుతున్న జనాభా, క్షీణిస్తున్న వనరులు, పర్యావరణ క్షీణత, పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరల వంటి అన్ని అంశాలు ప్రస్తుత ప్రపంచం ముందు సవాళ్లుగా ఉన్నాయి. భారత్ ఇంధన డిమాండ్ విపరీతంగా వృద్ధి చెందుతోంది. భవిష్యత్ ఆర్థిక వృద్ధిలో ఇంధనం కీలకపాత్ర పోషిస్తుంది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశాలు ఏమిటంటే.. భారత్ చమురు వినియోగంలో ప్రపంచంలో మూడవ అతిపెద్ద దేశం. మూడవ అతిపెద్ద ఎల్పీజీ వినియోగదారు. నాల్గవ అతిపెద్ద ఎన్ఎన్జీ దిగుమతిదారు, నాల్గవ అతిపెద్ద రిఫైనర్. నాల్గవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కలిగి ఉన్న దేశం. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచ ఇంధన డిమాండ్ వృద్ధిలో భారత్ 25 శాతం వాటాను కలిగి ఉంటుంది. 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్! భారత్ 2050 నాటికి 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంచనా వేస్తున్నట్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ చైర్మన్ మాజీ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతనూ చక్రవర్తి తెలిపారు. బలమైన వినియోగం, ఎగుమతులు ఇందుకు దోహదపడతాయని ఆయన విశ్లేషించారు. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు 2023–24 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి దాదాపు 6.3 శాతంగా, ద్రవ్యోల్బణం 6 శాతంగా అంచనా వేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, ద్రవ్యోల్బణం సర్దుబాటు చేయకుండా చూస్తే, జీడీపీ వృద్ధి రేటు దాదాపు 12 శాతం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఈ తరహా వృద్ధి వేగం కొన్నాళ్లు కొనసాగితే, 2045–50 నాటికి 21,000 డాలర్ల తలసరి ఆదాయంతో భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుంది’’ అని కేపీఎంజీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో అన్నారు. -
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌పై పెట్టుబడులు.. మూడు రెట్లు పెరిగాయ్
న్యూఢిల్లీ: టెక్నాలజీపై పెట్టుబడులు కంపెనీల పనితీరును ఇతోధికం చేస్తున్నట్టు ‘కేపీఎంజీ గ్లోబల్ టెక్ రిపోర్ట్ 2023’ తెలిపింది. టెక్నాలజీల సాయంతో కంపెనీలు తమ లాభాలను 10 శాతానికి పైగా పెంచుకోగలుగుతున్నట్టు, గతేడాది 2.5 శాతంతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు పేర్కొంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), డేటా, అనలైటిక్స్ తదితర అత్యాధునిక టెక్నాలజీ, టూల్స్‌పై కంపెనీల పెట్టుబడులు మూడు రెట్లు పెరిగినట్టు వెల్లడించింది. కేపీఎంజీ ప్రపంచవ్యాప్తంగా 2,100 మంది టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లను (కంపెనీలకు సంబంధించిన) సర్వే చేసి ఈ వివరాలను నివేదిక రూపంలో విడుదల చేసింది. కంపెనీలు డిజిటల్ పరివర్తనంలో భాగంగా అనుసరిస్తున్న టెక్నాలజీ వ్యూహాలను ఈ నివేదిక ఏటా తెలియజేస్తుంటుంది. ► ఏఐ, క్లౌడ్‌తో తమ పనితీరు, లాభదాయకత గణనీయంగా పెరిగినట్టు 63 శాతం మంది సర్వేలో తెలిపారు. ► వర్ధమాన టెక్నాలజీలను అందిపుచ్చుకునే ధోరణి గతేడాది ఉన్న 10 శాతం నుంచి 38 శాతానికి పెరిగింది. ► కంపెనీల లక్ష్యాల సాధనకు ఏఐ ఎంతో ముఖ్యమైన టెక్నాలజీగా అవతరించింది. ► టెక్నాలజీ వల్ల ఉద్యోగుల ఉత్పాదకత పెరిగినట్టు 72 శాతం మంది చెప్పారు. ► వచ్చే రెండేళ్లలో టెక్నాలజీ కార్యకలాపాల పరంగా ఈఎస్జీ ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళతామని 48 శాతం మంది చెప్పారు. ► వివిధ టెక్నాలజీ కార్యకలాపాల్లో సమన్వయం లేమి పురోగతికి అడ్డంకింగా నిపుణులు పేర్కొన్నారు. ►కస్టమర్ అనుభవం, ఈఎస్జీ, సైబర్ సెక్యూరిటీ టెక్నాలజీ ఆవిష్కరణలకు కీలక చోదకాలుగా ఈ సర్వే పేర్కొంది. ► వచ్చే కొన్నేళ్లలో ఏఐపై మరింత దృష్టి సారించడం డిజిటల్ పరివర్తనానికి కీలకమని తెలిపింది. ► స్వల్పకాల వ్యాపార లక్ష్యాలకు ఏఐ, మెషిన్ లెర్నింగ్ తమకు ప్రాధాన్యమైనవిగా 68 శాతం మంది చెప్పారు. గతేడాది ఇలా చెప్పిన వారు 57 శాతంగా ఉన్నారు. ► టెక్నాలజీ అమలులో భద్రత కీలకమని ఈ సర్వే స్పష్టం చేసింది. ఆరంభ ప్రాజెక్టుల్లో రిస్క్ నిర్వహణ అనేది టెక్నాలజీ పరివర్తన కార్యక్రమాల విజయానికి కీలకమని 62 శాతం కంపెనీలు తెలిపాయి. భారత్‌లో అయితే ఇలా చెప్పిన కంపెనీలు 88గా ఉన్నాయి. -
పన్ను ఉపశమనం కల్పించాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపన్ను శ్లాబులలో మార్పులు చేయాలని, భారత కంపెనీలు విదేశాల్లో లిస్టింగ్ ప్రక్రియను సులభతరం చేయాలని, టీడీఎస్/టీసీఎస్ నిబంధనలను క్రమబద్ధీకరించాలని కేంద్ర ప్రభుత్వానికి కేపీఎంజీ సూచించింది. ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు కంపెనీలు అందించిన కోవిడ్ టీకాలు, వైద్య సరఫరాలపై పన్నుల్లేకపోవడంపై స్పష్టత ఇవ్వాలని కోరింది. 2022–23 బడ్జెట్‌కు ముందు కీలక సూచనలు చేసింది. ఆర్థిక శాఖకు కేపీఎంజీ సూచనలు ► కరోనా చికిత్సలకు భారీ మొత్తం ఖర్చయినందున ప్రత్యేక పన్ను మినహాయింపు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ► భారత కంపెనీలు నేరుగా విదేశాల్లో లిస్ట్ అయ్యేందుకు లేదా స్పెషల్ పర్పస్ యాక్విజిషన్ కంపెనీ మార్గంలో లిస్ట్ అయ్యేందుకు, పన్ను మినహాయింపులకు సంబంధించి నియంత్రణపరమైన కార్యాచరణను ప్రకటించాలి. ► విదేశీ కంపెనీలకు, విదేశీ బ్యాంకు శాఖలకు కార్పొరేట్ పన్నును తగ్గించాలి. దేశీ కంపెనీలకు మాదిరే రేట్లను అమలు చేయాలి. ► టీడీఎస్, టీసీఎస్‌కు సంబంధించి నిబంధనలను సరళీకరించాలి. అన్ని రకాల సెక్యూరిటీలను (డెరివేటివ్స్ సైతం) టీడీఎస్/టీసీఎస్ నుంచి మినహాయించాలి. ► బ్యాంకుల మాదిరే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) కంపెనీలకు నిబంధనల పరంగా వెసులుబాటు కల్పించాలి. ముఖ్యంగా ఎన్పీఏలకు సంబంధించి మినహాయింపును పెంచాలి. వడ్డీ ఆదాయంపై టీడీఎస్ మినహాయింపు ఇవ్వాలి. ► దేశంలో నూతన ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాల ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు.. ముఖ్యంగా ఫార్మా, హెల్త్‌కేర్ రంగంలో పరిశోధన, అభివృద్ధిపై (ఆర్అండ్డీ) కంపెనీలు చేసే వ్యయాలకు వెయిటెడ్ డిడక్షన్ ఇవ్వాలి. ► జీఎస్టీ కిందకు పెట్రోలియం ఉత్పత్తులను తీసుకురావడాన్ని పరిశీలించాలి. ► కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద కరోనా మహమ్మారి సమయంలో కంపెనీలు వినియోగించిన ఉత్పత్తులు, సేవలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సదుపాయం కల్పించాలి. -
ఎన్సీఎల్ఏటీలో డెలాయిట్, కేపీఎంజీలకు చుక్కెదురు!
న్యూఢిల్లీ: రుణ సంక్షోభంలో కూరుకుపోయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ కేసులో తమను పార్టీగా చేర్చడాన్ని సవాలుచేస్తూ ఆడిటర్లు డెలాయిట్ హాస్కిన్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ అనుబంధ విభాగం బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ దాఖలు చేసిన పిటిషన్లను ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్) బుధవారం కొట్టివేసింది. స్వతంత్ర డైరెక్టర్లు ఈ మేరకు దాఖలు చేసిన పిటీషన్‌నూ అప్పీలేట్ ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ అనుబంధ విభాగం ఐఎఫ్‌ఐఎన్‌లో మోసానికి సంబంధించి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, ముంబై ద్విసభ్య ధర్మాసనం 2019 జూలై 23న ఇచ్చిన రూలింగ్‌ను సమర్థించింది. కేసుకు సంబంధించి తమనూ యాజమాన్యంలో భాగంగా పరిగణించడం తగదని ఆడిటర్లు డెలాయిట్ హాస్కి న్స్ అండ్ సెల్స్, కేపీఎంజీ బీఎస్ఆర్ అండ్ అసోసియేట్స్ చేసిన వాదనలను అప్పీలేట్ అథారిటీ తిరస్కరించింది. ఈ కేసులో మాజీ ఆడిటర్లనూ పార్టీలుగా చేర్చి ఆస్తులనూ జప్తు చేయాలని ఎన్సీఎల్టీని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ కోరింది. దీనిని గత ఏడాది జూలై 23న ముంబై ధ ర్మాసనం ఆమోదించింది. అయితే ఈ తీర్పును ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లు ఎన్సీఎల్ఏటీలో సవాలు చేశారు. జూలై 29న అప్పీలేట్ ట్రిబ్యునల్ కేసులో స్టే ఇస్తూ, మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఈ స్టేను మరో రెండు వారాలు పొడిగించాలన్న ఆడిటర్లు, స్వతంత్య్ర డైరెక్టర్ల తాజా విజ్ఞప్తిని అప్పీలేట్ ట్రిబ్యునల్ ఆమోదించడం తక్షణం ఆయా ఆడిటర్లు, స్వతంత్ర డైరెక్టర్లకు ఊరటనిచ్చే అంశం. -
బంగారం రుణాలు @ 4.61 లక్షల కోట్లు
న్యూఢిల్లీ: బంగారం రుణాల మార్కెట్ శరవేగంగా మన దేశంలో వృద్ధి చెందుతోంది. 2022 నాటికి ఈ మార్కెట్ రూ.4,617 బిలియన్ రూపాయిలకు (రూ.4,61,700 కోట్లు) చేరుకుంటుందని కేపీఎంజీ నివేదిక వెల్లడించింది. ఐదేళ్లలో రుణాల వృద్ధి వార్షికంగా 13.4 శాతం మేర ఉన్నట్టు తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను కేపీఎంజీ శుక్రవారం విడుదల చేసింది. నివేదికలోని అంశాలు - 2018–19లో బంగారంపై రుణాలు ఇచ్చే కంపెనీలు దేశంలోని ఉత్తరాది, తూర్పు ప్రాంతాల్లోకి తమ శాఖలను వేగంగా విస్తరించాయి. - ఎన్బీఎఫ్సీలు, ఇంటి వద్దకే వచ్చి రుణాలను అందించే నూతన తరం ఫిన్‌టెక్ సంస్థలు ఈ రంగంలోకి ప్రవేశించడంతో డిజిటల్ వేదికగా కొత్త కస్టమర్లను చేరుకునేందుకు అవకాశాలు ఏర్పడ్డాయి. - బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ కంపెనీలతో కూడిన వ్యవస్థీకృత రంగం వాటా 35 శాతంగా ఉంది. బంగారం రుణ మార్కెట్లో సంఘతిత రంగంతో పోలిస్తే అసంఘటిత రంగ మార్కెట్ రెండు రెట్లు అధికంగా ఉంది. దీంతో సంఘటిత రంగం విస్తరించేందుకు అపార అవకాశాలు ఉన్నాయి. - ఇంత కాలంగా బంగారం రుణాలకే పరిమితమైన పెద్ద కంపెనీలు తమ వృద్ధిని కాపాడుకునేందుకు సూక్ష్మ రుణాలు, ఎస్ఎంఈ రుణాలపైనా దృష్టి పెట్టాయి. - బంగారం రుణ మార్కెట్ ధరల పరంగా అస్థిరత, ఎన్బీఎఫ్సీ రంగంలో నిధుల లభ్యత సమస్యలను ఎదుర్కొంటోంది. అయితే, బంగారం రుణాలను ఇచ్చే కంపెనీలు లోన్ టు వ్యాల్యూ (బంగారం విలువలో ఇచ్చే రుణ నిష్పత్తి)ను తక్కువగా నిర్ణయించడం, తక్కువ కాల వ్యవధికే రుణాలను ఇవ్వడం ద్వారా ధరల అస్థిరతలను అధిగమిస్తున్నాయి. -
డెలాయిట్, బీఎస్ఆర్ సంస్థలకు చుక్కెదురు
ముంబై: ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంస్థకు ఆడిటింగ్ సేవలు అందించిన డెలాయిట్, బీఎస్ఆర్ అసోసియేట్స్(కేపీఎంజీ సంస్థ)కు ఎన్సీఎల్టీ షాకిచ్చింది. ఐఎల్ఎఫ్ఎస్ గ్రూపులో లోపాలపై ముందుగానే హెచ్చరించడంలో ఇవి విఫలమైన సంగతి తెలిసిందే. దీంతో ఈ సంస్థలపై ఐదేళ్లపాటు నిషేధం విధించాలంటూ కేంద్ర కార్పొరేట్ శాఖ లోగడ పిటిషన్ దాఖలు చేసింది. కాగా, తమపై నిషేధం విధించాలన్న ప్రభుత్వ అభ్యర్థనపై నిర్ణయించే విషయంలో జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) అధికార పరిధిని ప్రశ్నిస్తూ డెలాయిట్, బీఎస్ఆర్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. కంపెనీల చట్టం కింద నెట్వర్క్ సంస్థలైన డెలాయిట్, బీఎస్ఆర్లను విచారించే న్యాయాధికారం తమకు ఉందని ఎస్‌సీఎల్‌టీ స్పష్టం చేసింది. దీంతో ఈ రెండు సంస్థలపై ఐదేళ్ల నిషేధానికి అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కేసు జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ), సుప్రీంకోర్టు ముందుకు వెళుతుందని తమకు తెలుసునంటూ ఆదేశాల జారీ సందర్భంగా ఎన్సీఎల్టీ బెంచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. -
ఆన్లైన్ గేమింగ్ 12 వేల కోట్లు
ముంబై: డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గణనీయంగా మెరుగుపడుతున్న నేపథ్యంలో ఆన్లైన్ గేమింగ్ రంగం భారీ స్థాయిలో వృద్ధి చెందుతోంది. 2023 ఆర్థిక సంవత్సరం నాటికి ఇది రూ.11,900 కోట్లకు చేరనున్నట్లు కేపీఎంజీ– ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ స్పోర్ట్స్ గేమింగ్ రూపొందించిన నివేదిక వెల్లడించింది. 2014 ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్లుగా ఉన్న ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ 2018 రూ.4,400 కోట్లకు చేరింది. ఇదే ధోరణి కొనసాగిన పక్షంలో 2018– 2023 మధ్యకాలంలో ఈ పరిశ్రమ ఆదాయాలు 22 శాతం వార్షిక వృద్ధితో రూ.11,900 కోట్లకు చేరతాయని నివేదిక వివరించింది. మరోవైపు గేమర్స్ సంఖ్య 2018లో 25 కోట్లకు చేరింది. ఈ రంగం ఆదాయాల్లో సింహభాగం వాటా మొబైల్ ఫోన్స్దే. 2017 ఆర్థిక సంవత్సరంలో ఇది 85 శాతంగా ఉంది. స్మార్ట్ఫోన్ల ధరలు తగ్గుతుండటం, వినియోగం పెరుగుతుండటం, ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరుగుతుండటం, డేటా ధరలు తగ్గుతుండటం తదితర అంశాలు మొబైల్ గేమింగ్ పరిశ్రమ వృద్ధికి ఊతంగా ఉంటున్నాయి. పజిల్స్, యాక్షన్ టాప్.. దేశీయంగా టాప్ గేమ్స్‌లో పజిల్స్, యాక్షన్, అడ్వెంచర్ సంబంధ గేమ్స్ ఉన్నాయి. కొత్త స్పోర్ట్స్ లీగ్స్ తెరపైకి వస్తున్న నేపథ్యంలో ఫ్యాంటసీ స్పోర్ట్స్కీ ఆదరణ పెరుగుతోంది. దేశీయంగా ఫ్యాంటసీ స్పోర్ట్స్ ఆపరేటర్స్ సంఖ్య 2016లో 10గా ఉండగా.. 2018 నాటికి ఏకంగా ఏడు రెట్లు పెరిగి 70కి చేరింది. ఇక పెద్ద నగరాలతో పోలిస్తే ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ని తరచుగా ఆడే వారి సంఖ్య చిన్న పట్టణాల్లోనే ఎక్కువగా ఉంటోంది. 7–8 టాప్ నగరాల్లోని మెజారిటీ యూజర్లు ఫ్యాంటసీ స్పోర్ట్స్‌ని వారంలో 1–3 సార్లు ఆడుతుండగా.. చిన్న పట్టణాల్లోని 70 శాతం మంది యూజర్లు వారంలో నాలుగుసార్లకు పైగా ఆడుతున్నారు. ఇక అత్యధికంగా 71 శాతం మంది ఫ్యాంటసీ క్రికెట్ ఫ్యాన్స్ కాగా, 54 శాతం మంది ఫుట్‌బాల్ ఆడారు. యూజర్లు తమ ఫేవరెట్ స్పోర్ట్స్‌లో మరింతగా పాలుపంచుకునేందుకు ఈ తరహా స్పోర్ట్స్ ఉపయోగపడతాయని కేపీఎంజీ పార్ట్నర్, మీడియా.. ఎంటర్టైన్మెంట్ విభాగం హెడ్ గిరీష్ మీనన్ చెప్పారు. -
ఆ రంగాల్లో 2.5 కోట్ల ఉద్యోగాలు
బెంగళూరు : దేశంలో ట్రావెల్, టూరిజం రంగాలు భారీగా ఉద్యోగవకాశాలు సృష్టించాయని తెలిసింది. 2017లో ఈ రంగాలు కలిసి 2.59 కోట్ల ఉద్యోగాలు సృష్టించాయని, అదేవిధంగా జీడీపీకి రూ.5 లక్షల కోట్లను అందించాయని ఇండియన్ ఇండస్ట్రి బాడీ ఫిక్కీ, సర్వీసు సంస్థ కేపీఎంజీ రిపోర్టులు వెల్లడించాయి. దేశంలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలుగా ట్రావెల్, టూరిజం రంగాలు ఉన్నాయని, ప్రత్యక్షంగానే ఈ రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలు అందించాయని ఈ రిపోర్టులు తెలిపాయి. దేశీయ ఎకానమీలో ట్రావెల్, టూరిజం, హాస్పిటాలిటీ కీలక రంగాలుగా ఉన్నాయని, ఫారిన్ టూరిస్ట్ అరైవల్స్‌లో ఏడాది ఏడాదికి 15.6 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేశాయని చెప్పాయి. ట్రావెల్ ఇండస్ట్రి భవిష్యత్తును మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా, బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, వర్చ్యువల్/ అగ్మెంటెడ్ రియాల్టీ నిర్థారించనున్నాయని ఈ రిపోర్టులు తెలిపాయి. ఆన్లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ 2017 నుంచి 2021 నాటికి 14.8 శాతం పెరగనుందని రిపోర్టులు అంచనావేశాయి. 2019 నాటికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బిజినెస్ ట్రావెల్ మార్గెట్గా భారత్ నిలువనుందని పేర్కొన్నాయి. స్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్ వాడకం పెరుగడంతో, భారత్ డిజిటల్ ఎనాబుల్ టూరిస్ట్ గమ్యంగా మారనుందని చెప్పాయి. -
కేపీఎమ్‌జీ చేతికి ‘సైబర్ ఐఎన్‌సీ’!
న్యూఢిల్లీ: ముంబైకు చెందిన ఐటీ సంస్థ ఆరియన్ ప్రొ అనుబంధ సంస్థ, సైబర్ ఐఎన్‌సీ తన ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్(ఐయామ్) వ్యాపారాన్ని అమెరికాకు చెందిన కేపీఎమ్‌జీ ఎల్ఎల్పీకి విక్రయించింది. ఈ విక్రయం ఈ నెల 31కల్లా పూర్తవుతుందని, డీల్ విలువ రూ.217 కోట్లని, అంతా నగదు లావాదేవీయేనని ఆరియన్‌ప్రొ వెల్లడించింది. సైబర్‌ఐఎన్‌సీ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండిపెండెంట్ ఐయామ్ టెక్నాలజీ సేవలందించే సంస్థ అని, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, యూకేలో కార్యకాలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 190 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. సైబర్‌ఐఎన్‌సీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.172 కోట్ల అంతర్జాతీయ ఆదాయం సాధించిందని, భారత ఆదాయం రూ.90 కోట్లని పేర్కొంది. సైబర్‌ఐఆన్‌సీ ఐయామ్ వ్యాపారం చేజిక్కించుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టింగ్‌లో తమ అగ్రస్థానం పటిష్టమవుతుందని కేపీఎమ్‌జీ పేర్కొంది. -
టెలికంలో 30 లక్షల ఉద్యోగాలు!!
అసోచాం – కేపీఎంజీ అధ్యయనంలో వెల్లడి న్యూఢిల్లీ: టెల్కోల మధ్య తీవ్ర పోటీతో టెలికం రంగం ఒత్తిడి ఎదుర్కొంటున్నప్పటికీ వచ్చే ఏడాది నాటికి గణనీయంగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. 2018 నాటికి 30 లక్షల ఉద్యోగాలు టెలికం రంగం కల్పించగలదని అసోచాం, కేపీఎంజీ ఒక సంయుక్త అధ్యయనంలో అంచనా వేశాయి. 4జీ టెక్నాలజీ విస్తృతి చెందడం, డేటా వినియోగం పెరుగుతుండటం, డిజిటల్ వాలెట్లు.. స్మార్ట్ఫోన్ల వినియోగం పెరగడం తదితర అంశాలు ఇందుకు దోహదపడనున్నట్లు వివరించాయి. పోటీతో టారిఫ్‌లు పడిపోయి, ఆపరేటర్ల ఆదాయాలు.. లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపుతున్న తరుణంలో అసోచాం–కేపీఎంజీ ఆశావహ నివేదికను రూపొందించడం గమనార్హం. యూజర్‌పై సగటు ఆదాయం తగ్గుతున్నప్పటికీ... టెలికం రంగం మెరుగ్గానే రాణించగలిగే అవకాశాలు ఉన్నాయని నివేదిక పేర్కొంది. పోటీని దీటుగా ఎదుర్కొనేందుకు కంపెనీలు తప్పనిసరిగా ఇన్ఫ్రాస్ట్రక్చర్, టెక్నాలజీపై పెట్టుబడులు పెట్టక తప్పని పరిస్థితి నెలకొందని వివరించింది. టెలికం రంగంలో ప్రస్తుతమున్న మానవ వనరులు.. సంఖ్యాపరంగాను, నైపుణ్యాలపరంగానూ రాబోయే డిమాండ్‌కు సరిపోకపోవచ్చని నివేదిక తెలిపింది. 2020 నాటికి మొత్తం సిమ్ కనెక్షన్ల సంఖ్య ప్రస్తుతమున్న 110 కోట్ల నుంచి 140 కోట్లకు చేరుతుందని అంచనా వేసింది. అప్పటికల్లా స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) టెలికం రంగ వాటా 8.2 శాతానికి చేరగలదని పేర్కొంది. ట్రేడింగ్‌లో ఫిన్లెర్న్ అకాడమీ శిక్షణ ముంబై: ముంబైకి చెందిన ఫిన్లెర్న్ అకాడమీ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్‌కు సంబంధించి అత్యాధునిక శిక్షణను ‘స్మార్ట్ ట్రేడర్’ పేరుతో ఆరంభించింది. లైవ్ మార్కెట్ వాతావరణంలో ట్రేడ్ చేయడం ఎలా అన్నదానిపై, చార్ట్‌లు, సాఫ్ట్వేర్, ఆడియో, వీడియో పాఠాల ద్వారా శిక్షణ ఇవ్వనున్నట్టు సంస్థ తెలిపింది. ఏడాది కాలవ్యవధి గల కోర్సునకు క్లాస్రూమ్ శిక్షణ అయితే రూ.40,000, ఆన్లైన్లో అయితే రూ.20,000 చార్జ్ చేస్తున్నట్టు తెలిపింది. -
బీఎస్ఎన్ఎల్కు భూమే బంగారం
♦ ఖరీదైన భూములు ♦ ఒక వంతుభూమి విలువే రూ.65,000 కోట్లు ♦ పుస్తక విలువ కంటే ఎన్నో రెట్లు అధికం న్యూఢిల్లీ: నష్టాల్లో ఉన్న ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్ఎన్ఎల్కు దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ఉన్న విలువైన భూములు, భవనాలు ఆ సంస్థకు వరం కానున్నాయి. సంస్థ ఆధ్వర్యంలోని భూముల్లో మూడింట ఒక వంతు తేలిగ్గా రూ. 65,000 కోట్ల విలువ చేస్తాయని బీఎస్ఎన్ఎల్ సీఎండీ అనుపమ్ శ్రీవాస్తవ వెల్లడించారు. కానీ, 15,000 చోట్ల భూములు, భవనాలకు సంబంధించి పుస్తక విలువ ఎన్నో దశాబ్దాల క్రితం మదింపు వేసిన రూ.975 కోట్లుగానే ఇప్పటికీ కొనసాగుతోందని ఆయన తెలిపారు. వీటి వాస్తవ విలువ తెలిసేందుకు వీలుగా తిరిగి నిపుణులతో మదింపు వేయిస్తున్నట్టు చెప్పారు. 2015–16లో బీఎస్ఎన్ఎల్ రూ.3,880 కోట్ల నష్టాలను ఎదుర్కొన్నట్టు అంచనా. దీంతో సంస్థ ఆస్తుల విలువను లెక్కించే వసుంధర ప్రాజెక్టును ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించారు. దీన్ని కేపీఎంజీ సంస్థ చూస్తోంది. ముఖ్యంగా సంస్థ నిర్వహణలోని భూములు, భవనాల్లో మూడింట ఒక వంతు అందులోనూ ప్రముఖ పట్టణాల్లో ఉన్న వాటి విలువను తేల్చే పనిలో ఉన్నారు. అది ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. ఈ పని 98% వరకు పూర్తయిందని, ఒక వంతు ఆస్తుల అసలు విలువ రూ.65,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు శ్రీవాస్తవ తెలిపారు. ఇలా లెక్కిస్తున్న వాటిలో ఢిల్లీ, ముంబై, పుణే, అహ్మదాబాద్, జైపూర్, లక్నో, చెన్నై, కోల్‌కతా తదితర నగరాల్లోని ఆస్తులు కూడా ఉన్నాయి. బీఎస్ఎన్ఎల్ కార్పొరేట్ కార్యాలయం ఒక్కదాని విలువే రూ. 2,500 కోట్లు చేస్తుందని శ్రీవాస్తవ వెల్లడించారు. వ్యాపార పునరుద్ధరణ ప్రణాళికలపైనా బీఎస్ఎన్ఎల్ దృష్టి సారించడం గమనార్హం. లాభదాయకమైనవి: బీఎస్ఎన్ఎల్ మొత్తం ఆస్తుల్లో కేవలం ఒక వంతు వాటి విలువనే ఎందుకు లెక్కిస్తున్నారన్న ప్రశ్నకు, అవి అత్యంత లాభదాయకమైనవిగా శ్రీవాస్తవ పేర్కొన్నారు. మిగిలిన వాటి విలువ మరీ అంత ఎక్కువేమీ ఉండదన్నారు. వీటిని విక్రయించి నిధులు సమీకరించాలనుకుంటే, వాణిజ్యపరంగా ఉపయోగించుకోవాలన్నా తాజా మదింపు ఉపయోగపడుతుందన్నారు. భూముల అసలు విలువ బీఎస్ఎన్ఎల్ ఖాతా పుస్తకాల్లో ప్రతిఫలిస్తుంద చెప్పారు. -
అలరిస్తున్న మీడియా, వినోదం
⇒ 2021 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు వ్యాపార విలువ ⇒ వెల్లడించిన ఫిక్కీ, కేపీఎంజీ అధ్యయనం ముంబై: దేశీయ మీడియా, వినోద రంగం మంచి జోరుమీద ఉంది. 2021 నాటికి ఈ రంగం వ్యాపార విలువ రూ.2.41 లక్షల కోట్ల స్థాయికి చేరుతుందని ఫిక్కీ, కేపీఎంజీ సంస్థల సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ముంబైలో మంగళవారం జరిగిన ఫిక్కీ ఫ్రేమ్స్ సదస్సులో దీన్ని విడుదల చేశారు. వచ్చే నాలుగేళ్ల పాటు వార్షికంగా 13.9 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని పేర్కొంది. దేశీయ మీడియా, వినోద పరిశ్రమ 2016లో మిశ్రమ ఫలితాలను ఎదుర్కొందని, బాక్సాఫీసు వద్ద సినిమాల ప్రదర్శర నిరాశపరిచిందని కేపీఎంజీ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగం డైరెక్టర్ గిరీష్ మీనన్ పేర్కొన్నారు. కేవలం ఓ అదనపు మాధ్యమంగానే ఉన్న డిజిటల్ మీడియా వేగంగా కేంద్ర స్థానంగా మారిందన్నారు. వృద్ధి వేగం పుంజుకోవాలంటే మీడియా, వినోద రంగ సంస్థలు తమ విధానాలను డిజిటల్, మార్పులకు అనుగుణంగా మలచుకోవాలని, వ్యాపారం నిలదొక్కుకునేందుకు చురుకుదనం, మార్పు కీలమకని నివేదిక పేర్కొంది. ఆర్థికంగా మెరుగైన పరస్థితులు, దేశీయ వినియోగంలో పురోగతి, రూరల్ మార్కెట్ల తోడ్పాటుతో మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 2016లో ఆరోగ్యకరమైన వృద్ధిని నిలబెట్టుకున్నట్టు తెలిపింది. ఈ సానుకూలతలకు తోడు... డీమోనిటైజేషన్ నిర్ణయం వల్ల 2.5 శాతం వరకు వృద్ధికి విఘాతం కలిగినప్పటికీ ప్రకటనల్లో 11.2 శాతం వృద్ధి వల్ల మొత్తం మీద మీడియా, వినోద పరిశ్రమ 9.1 శాతం వృద్ధిని సాధించిందని వివరించింది. డీమోనిటైజేషన్ ప్రభావం నుంచి తిరిగి గాడిన పడి స్థిరమైన వృద్ధిని కొనసాగించాల్సి ఉందని పేర్కొంది. మెరుగైన సదుపాయాల కల్పన, ప్రభుత్వ సహకారంతో ఈ పరిశ్రమ అద్భుతమైన స్థాయికి చేరుతుందని, ఉద్యోగ అవకాశాల కొనసాగింపు ద్వారా దేశానికి సామాజికంగా, ఆర్థికంగా విలువను తీసుకొస్తుందని ఫిక్కీ మీడియా, ఎంటర్టైన్మెంట్ కమిటీ చైర్మన్ ఉదయ్ శంకర్ పేర్కొన్నారు. ఏ విభాగంలో ఎంత వృద్ధి? ⇔ టెలివిజన్ పరిశ్రమ 2016లో 8.5 శాతం వృద్ధిని నమోదు చేసింది. చందాదారుల ఆదాయంలో 7 శాతమే పెరుగుదల ఉండడం, ప్రకటనల ఆదాయం అంచనా వేసిన 11 శాతానికంటే తక్కువ ఉండడం ఇందుకు కారణాలుగా పేర్కొంది. ⇔ ప్రింట్ మీడియా ఆదాయ వృద్ధి 7 శాతంగా ఉంది. ⇔ సినిమాల ఆదాయంలో వృద్ధి 3 శాతమే. ⇔ రేడియో, డిజిటల్ ప్రకటనలు, యానిమేషన్, విజువల్ ఎఫెక్టస్ విభాగాలూ వృద్ధి చెందాయి. ⇔ డిజిటల్ ప్రకటనల్లో వృద్ధి 28 శాతంగా ఉంది. మొత్తం ప్రకటనల ఆదాయంలో 15% ఈ విభాగం సొంతం చేసుకుంది. ⇔ యానిమేషన్ విభాగం 16.4 శాతం వృద్ధిని నమోదు చేసింది. -
యాక్సిస్ బ్యాంక్ ఫోరెన్సిక్ ఆడిట్ కేపీఎంజీ చేతికి
న్యూఢిల్లీ: ఖాతాల మదింపు, బ్యాంకింగ్ కార్యకలాపాల భద్రతను పెంచేందుకుగాను గ్లోబల్ అకౌంటింగ్ దిగ్గజం కేపీఎంజీతో ఫోరెన్సిక్ ఆడిట్ చేయించనున్నట్లు యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖా శర్మ వెల్లడించారు. పెద్ద నోట్ల రద్దు(డీమోనిటైజేషన్) తర్వాత పలు యాక్సిక్ బ్యాంక్ శాఖలో ఇటీవల సిబ్బంది అవినీతికి పాల్పడిన కేసులు వెలుగుచూసిన నేపథ్యంలో బ్యాంక్ ఈ చర్యలు చేపట్టింది. నోయిడాలోని ఒక యాక్సిస్ బ్రాంచ్‌లో 20 డొల్ల(షెల్) కంపెనీలను సృష్టించి అందులోకి రూ.60 కోట్లను మళ్లించి నట్లు ఐటీ శాఖ గతవారం బయటపెట్టిన సంగతి తెలి సిందే. ఈ నేపథ్యంలో బ్యాంక్ చీఫ్ శిఖా శర్మ ఖాతాదారులకు లేఖ రాశారు. బ్యాంక్ ఆర్థిక మూలాలు చాలా పటిష్టంగా ఉన్నాయని.. అయితే, ఇటీవల వెలుగు చూసిన కొన్ని కేసుల నేపథ్యంలో అనుమానాస్పద ఖాతాలను గుర్తించే చర్యలు చేపట్టామని చెప్పారు. నియంత్రణ సంస్థలు, దర్యాప్తు ఏజెన్సీల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా వీటిని గుర్తించే పనిని మొదలుపెట్టినట్లు తెలిపారు. కార్యకలాపాల మదింపు, మరింత భద్రత కోసం ఫోరెన్సిక్ ఆడిట్‌ను కూడా చేపట్టనున్నామని, ఇందుకోసం కేపీఎంజీని నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ‘కొం దరు ఉద్యోగులు అవినీతికి పాల్పడినట్లు ఇటీవల మీడియాలో వచ్చిన వార్తలతో చాలా కలత చెందా. దీనికి చింతిస్తున్నా.లావాదేవీలకు సంబంధించి బ్యాం కు అనుసరిస్తున్న విధానాలను కొంతమంది ఉద్యోగులు ఉల్లంఘించారు. వారిపై కఠిన చర్యలు తీసుకున్నాం. బ్యాంకు నియమావళిని ఉల్లంఘించినవారిని ఉపేక్షించం. ఈ ఉదంతంతో 55,000 మంది బ్యాంకు ఉద్యోగుల శ్రమ అంతా తుడిచిపెట్టుకుపోయింది. కా ర్యకలాపాల్లో ఉన్నత ప్రమాణాలను పాటించేందుకు బ్యాంకు ఎల్లవేళలా కట్టుబడి ఉంటుంది. దర్యాప్తు ఏజెన్సీలకు పూర్తిగా సహకరిస్తున్నాం’ అని ఖాతాదారులకు రాసిన లేఖలో శిఖాశర్మ పేర్కొన్నారు. -
ఈ-రిటైల్‌లో 14.5 లక్షల జాబ్స్
లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగాల్లో అత్యధికం 2021 నాటికి సాకారం: కేపీఎంజీ అప్పటికల్లా 103 బిలియన్ డాలర్లకు ఈ-కామర్స్ న్యూఢిల్లీ: మున్ముందు ఈ-రిటైల్ రంగం ఉపాధి అవకాశాల హబ్‌గా మారనుంది. 2021 నాటికి దేశీయ ఈ-రిటైల్ రంగం, దానికి అనుబంధంగా పనిచేసే లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ (గోదాములు), ఐటీ/ఐటీఈఎస్ వంటి రంగాల్లో ఏకంగా 14.5 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని స్నాప్‌డీల్, కేపీఎంజీ నివేదిక తెలియజేసింది. ఈ రెండు సంస్థలూ ‘దేశంలో ఉపాధి అవకాశాలపై ఈ-కామర్స్ ప్రభావం’ పేరుతో సంయుక్త అధ్యయన నివేదికను విడుదల చేశారుు. దేశంలోని మారుమూల ప్రాంతాలకు చేరుకోవడం ద్వారా ఈ-కామర్స్ రంగం సామాజిక, ఆర్థిక రంగంపై చెప్పుకోతగ్గ ప్రభావం చూపిస్తుందని ఈ నివేదిక పేర్కొంది. ప్రధాన రంగంతోపాటు దాని అనుబంధ రంగాల్లో ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాల కల్పన, నూతన వ్యాపార అవకాశాలు, సామాజిక - ఆర్థిక వ్యవస్థలను ఏ విధంగా ప్రభావితం చేయనున్నదీ ఈ నివేదిక ద్వారా తెలియజేయాలనుకున్నట్టు స్నాప్‌డీల్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో కునాల్ బెహల్ తెలిపారు. నివేదికలోని అంశాలు లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ రంగం అత్యధికంగా 10 లక్షల మేర ప్రత్యక్ష ఉద్యోగాలను తీసుకురానుంది. ఈటైల్ రంగంలో అధిక నైపుణ్యాలతో కూడుకున్న 4 లక్షల ఉద్యోగాలు ఏర్పడతారుు. ఈ-కామర్స్ రంగంలో కొత్తగా రానున్న ప్రతీ ఉద్యోగంతో దాని అనుబంధ రంగాల్లో మూడు నుంచి నాలుగు కొత్త ఉద్యోగాలు ఏర్పడతారుు. 2020 నాటికి ఈ కామర్స్ రంగం 103 బిలియన్ డాలర్ల (రూ.6.9లక్షల కోట్లు) స్థారుుకి చేరుకుంటుంది. ఇందులో ఈటైల్ రంగం వాటా 67 శాతం (68 బిలియన్ డాలర్లు). ఆన్లైన్ విక్రేతల సంఖ్య సైతం 2020 నాటికి 13 లక్షల సంఖ్యకు వృద్ధి చెందుతుంది. 70 శాతం ఆన్లైన్ విక్రేతలు చిన్న పట్టణాల నుంచి రానున్నారు. అత్యాధునిక టెక్నాలజీని అందిపుచ్చుకునేందుకు వీలుగా పరిశోధన అభివృద్ధిపై పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, కార్మిక సంస్కరణలను మెరుగుపరచడం, వృత్తిపరమైన శిక్షణ ద్వారా ప్రభుత్వం వైపు నుంచి సహకారం అవసరం. -
80 శాతం వైద్యులు పట్టణాల్లోనే...
60% ఆస్పత్రులు, 75% మందుల షాపులూ అక్కడే * కేపీఎంజీ, ఓపీపీఐ పరిశోధనలో వెల్లడి న్యూఢిల్లీ: దేశంలో 80 శాతం వైద్యులు జనాభాలో 28 శాతం ఉన్న పట్టణ ప్రజలకు మాత్రమే సేవలందిస్తున్నట్లు తేలింది. 60 శాతం ఆస్పత్రులు, 75 శాతం మందుల దుకాణాలు పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయని కేపీఎంజీ(ప్రముఖ ఆడిట్ సంస్థ), ఓపీపీఐ(భారత ఔషధాల తయారీదారుల సంస్థ) పరిశోధనలో తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో 37 శాతానికే ఇన్ పేషంట్ చికిత్స, 68 % మందికి అవుట్ పేషంట్ సేవలు అందుతున్నాయని పేర్కొంది. నివేదిక ప్రకారం.. భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు వెచ్చిస్తున్న మొత్తం దేశ జీడీపీలో కేవలం 4.1 శాతమే. అతి తక్కువ ఖర్చుపెడుతున్న దేశాల్లో భారత్ ఒకటి. ఒకరి నుంచి ఒకరికి సోకని జబ్బులతోనే మొత్తం మరణాల్లో 60 శాతం సంభవిస్తుండగా, దీనివల్ల 2030 నాటికి రూ. 3.11 కోట్ల కోట్లు దేశం నష్టపోనుంది. 75 శాతానికి ఆరోగ్య బీమా లేదు సగటు ఆయుర్ధాయం (2015లో 68 ఏళ్లు), ప్రతీ 1000 మందికి ఆసుపత్రి బెడ్లు బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) దేశాలన్నింటితో పోలిస్తే భారత్‌లో చాలా తక్కువని, ప్రతి 10 వేల మందికి సాధారణ వైద్యుల సంఖ్య కూడా తక్కువగా ఉందని వెల్లడించింది. ‘రోగి కేంద్రంగా ఆరోగ్య పరిరక్షణ విధానం కోసం కృషి చేయడం, నిబద్ధత చూపడం కీలకం’ అని కేపీఎంజీ, ఓపీపీఐ నివేదిక పేర్కొంది.‘ఆరోగ్యంపై చేసే ఖర్చువల్ల దేశవ్యాప్తంగా 6.3 కోట్ల మంది అప్పుల్లో ఉన్నారు. అలాగే 75 శాతం ప్రజలకు ఆరోగ్య బీమా సౌకర్యం లేదు. మధ్యస్థాయి ఆదాయ దేశాలతో పోలిస్తే భారత్‌లో ఆరోగ్య పరిరక్షణకు తక్కువ ఖర్చుపెడుతున్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం మంచి పాత్రే పోషిస్తున్నా... అవగాహన లోపం వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. తరచుగా వ్యాధి నిర్ధారణ ఆలస్యమవుతోంది’ అని కేపీఎంజీకి చెందిన ఉత్కర్ష్ పల్నిత్కర్ పేర్కొన్నారు. దీర్ఘకాలంలో విద్య, అవగాహన కల్పించడమే లక్ష్యంగా చొరవతో అందరూ కలిసి పనిచేస్తే ఆరోగ్యకర దేశ లక్ష్యాన్ని అందుకోగలమన్నారు. ఐరాస సదస్సు 2000లో నిర్వచించిన ఆరోగ్య లక్ష్యాల్ని భారత్ సాధించలేదనిఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మస్యూటికల్స్ ప్రోడ్యూసర్స్ ఆఫ్ ఇండియా చీఫ్ శైలేష్ అయ్యంగార్ చెప్పారు. -
ఉతికి ఆరేస్తే.. రూ.2 లక్షల కోట్లు
♦ దేశంలో సంఘటిత పరిశ్రమ వాటా 5 వేల కోట్లు ♦ నాలుగేళ్లలో ఇది రూ.80వేల కోట్లకు: కేపీఎంజీ ♦ కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న లాండ్రీ, డ్రైక్లీనింగ్ ♦ లాండ్రీ సేవలకు ప్రత్యేక అకాడమీ; సర్టిఫికెట్ కోర్సు ♦ భారీగా నిధుల వెల్లువ.. పోటీ సంస్థల కొనుగోళ్లు ♦ సేవల్లో హైదరాబాదీ సంస్థలు కూడా.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కార్పొరేట్ రూపాన్ని సంతరించుకుంటున్న కులవృత్తుల్లో లాండ్రీ కూడా చేరిపోయింది. చేరిపోవటమే కాదు.! జ్యోతిఫ్యాబ్రిక్స్, వాస్సాప్ వంటివి ఇతర కంపెనీల్ని కొనేస్తూ మంచి దూకుడు మీదున్నాయి. వీటితో పాటు స్టార్టప్‌లూ వేగంగా వస్తున్నాయి. ఎందుకంటే... లాండ్రీ, డ్రైక్లీనింగ్ పరిశ్రమ విలువ అక్షరాలా రూ.రెండు లక్షల కోట్లు. దీన్లో సంఘటిత రంగ వాటా కేవలం 2 శాతం. 2020 నాటికి సంఘటిత వాటా 40 శాతానికి, ఆన్లైన్ 25 శాతానికి చేరుతుందనేది కేపీఎంజీ తాజా నివేదిక సారాంశం. ఈ భవిష్యత్తును చూసి... ఈ రంగంలోకి పెట్టుబడులూ వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం దేశంలో లాండ్రీ పరిశ్రమలో 7,67,000 సంస్థలున్నాయి. వీటిలో 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులున్నవి 98% ఉండొచ్చనేది లండన్ కేంద్రంగా పనిచేస్తున్న యూరో మానిటర్ ఇంటర్నేషనల్ అంచనా. అయితే లాండ్రీ పరిశ్రమలో ఆఫ్‌లైన్ సంస్థలదే ఆధిపత్యం. అవి కూడా అత్యధికం దుస్తువులు, దుప్పట్ల వాషింగ్కే పరిమితం. జ్యోతిఫ్యాబ్రిక్స్, విలేజ్ లాండ్రీ సర్వీస్ పదేళ్ల కిందట ఆన్లైన్ వేదికగా ఈ రంగంలోకొచ్చాయి. లాండ్రీ, డ్రైక్లీనింగ్‌తో పాటు షూ, బ్యాగుల మరమ్మతు, కార్పెట్లు, సోఫాసెట్ల క్లీనింగ్... అది కూడా హోమ్ డెలివరీ చేయటం వీటి ప్రత్యేకత. జ్యోతి ఫ్యాబ్రిక్స్, వాస్సాప్, పిక్ మై లాండ్రీ, ఆప్ కా దోబీ వంటివి కాస్త పేరున్నవి కాగా... దాదాపు 40కి పైగా స్టార్టప్‌లు ఇపుడు ఆన్లైన్ సేవలందిస్తున్నాయి. ఇవెలా పనిచేస్తాయంటే... సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో శుభ్రం చేయాల్సిన దుస్తులు, డ్రైక్లీనింగ్ వివరాల్ని నమోదు చేయాలి. ఇంటికి ఆ సంస్థ ఉద్యోగులొచ్చి కస్టమర్ల ముందే దుస్తుల్ని తూకం వేస్తారు. డ్యామేజీ ఉందా? అనేది చెక్ చేసి తమతో తీసుకెళతారు. తరవాత తమ ఫెసిలిటీ కేంద్రంలో దుస్తులకు జాగ్రత్తగా ట్యాగ్స్ వేస్తారు. ఎందుకంటే దుస్తుల రంగు, తీరును బట్టి ఉతికే విధానంలోనూ తేడా ఉంటుంది కనక. కావాలనుకుంటే ఇస్త్రీ కూడా చేస్తారు. రెగ్యులర్ డెలివరీ అయితే 4 రోజుల్లో, ఎక్స్‌ప్రెస్ అయితే 24 గంటల్లో కస్టమర్లకు వాటిని తిరిగి ఇస్తారు. తూకం లెక్కనే చార్జీలు... మామూలుగా దుస్తుల్ని ఐటమ్‌ల లెక్కన ఇస్త్రీచేసి ఛార్జీలు వసూలు చేస్తారు. ఈ సంస్థలు మాత్రం కిలోల లెక్కన ఛార్జీ వసూలు చేస్తాయి. కస్టమర్ల పరంగా వర్కింగ్ ప్రొఫెషనల్స్, ఐటీ ఉద్యోగులు, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేసేవారిని, బ్యాచిలర్లను లక్ష్యంగా చేసుకొని సేవలందిస్తే... సంస్థల పరంగా గెస్ట్‌హౌస్‌లు, స్టార్ హోటళ్లు, ఆసుపత్రులు, వసతి గృహాలు, విద్యా సంస్థలు, రైలు, బస్సుల వంటి ప్రజా రవాణా వ్యవస్థల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. పెద్ద మొత్తంలో దుస్తులను ఉతికేందుకుగాను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న వాషింగ్ మిషన్లు, డిటర్జెంట్లు, కండీ షనర్స్, కలర్ బ్లీచ్‌లు వాడుతున్నారు. కొన్ని సంస్థలు ప్రతి నెలా నిర్దిష్ట సంఖ్యలో దుస్తులు ఉతికి, ఇస్త్రీ చేసి ఇచ్చేందుకు నెలవారీ ప్యాకేజీలు కూడా అందిస్తున్నాయి. ఉతకటానికైతే కిలోకు రూ.50-70, ఇస్త్రీ కూడా ఉంటే రూ.75-100 వసూలు చేస్తున్నాయి. ప్రీమియం లాండ్రీకైతే రూ.130కి పైగా చార్జీలున్నాయి. ప్రత్యేక అకాడమీ, సర్టిఫికెట్ కోర్సు కూడా... విశేషమేంటంటే దేశంలోనే తొలి సారిగా లాండ్రీ, డ్రైక్లీనింగ్ సేవలపై శిక్షణకు ప్రత్యేక అకాడమీ ఏర్పా టైంది. ఇందులో ఏడాది పాటు సర్టిఫికెట్ కోర్సు ఉంది. దుస్తుల నాణ్యత దెబ్బతినకుండా ఎలా శుభ్రం చేయాలి? ఎక్కువ మన్నేలా ఎలాంటి డిటర్జెంట్లు, లిక్విడ్స్‌ను వాడాలి? వంటి అంశాల్లో శిక్షణనిచ్చేందుకు కర్ణాటకలో ‘వాస్సాప్ అకాడమీ ఫర్ లాండ్రీ’ ఏర్పాటైంది. దీన్ని కర్ణాటక ఐటీఐతో కలిసి వాస్సాప్ సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పరిశ్రమలోని ఉద్యోగులకు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తున్నట్లు వాస్సాప్ వ్యవస్థాపకుడు బాలచందర్ ‘సాక్షి’తో చెప్పారు. మహిళా పారిశ్రామికవేత్తలకు వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ కూడా ఉందన్నారు. ‘‘మేం ఫ్రాంచైజీ మోడల్ కింద రూ.6 లక్షల పెట్టుబడితో 100 చ.అ.ల్లో లాండ్రీ షాపును పెట్టిస్తున్నాం. బెంగళూరులో 6 ఔట్లెట్లు ప్రారంభించాం. మాతో ఒప్పందం చేసుకున్న దోబీ కుటుంబాల పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వటంతో పాటు వారికి జీవిత బీమా కూడా కల్పిస్తున్నాం. ఇప్పటికే ఈ కార్యక్రమంలో 12 మంది దోబీలు చేరారు’’ అని బాలచందర్ చెప్పారు. హైదరాబాద్ సంస్థలూ ఉన్నాయ్... గతేడాది అక్టోబర్‌లో ప్రారంభమైన ఈజీవాష్కేర్ ప్రస్తుతం మాదాపూర్, గచ్చిబౌలి సహా నాలుగు ప్రధాన ప్రాంతాల్లో సేవలందిస్తోంది. వెయ్యికి పైగా కస్టమర్లున్నట్టు ఫౌండర్ కలిశెట్టి నాయుడు చెప్పారు. నల్లగండ్ల, కొండాపూర్, తార్నాక, నాగోల్, కొత్తపేట్ ప్రాంతాల్లో సేవలందిస్తున్న సేఫ్ వాష్.. దుస్తులతో పాటు తివాచీలు, కిటికీ పరదాలు, షూలు, హ్యాండ్ బ్యాగులు, సాఫ్ట్‌టాయ్స్ కూడా శుభ్రం చేస్తుంది. మూడు వేల మంది వినియోగదారులతో పాటు ల్యాంకో, ఎన్సీసీ అర్బన్ వంటి గేటెడ్ కమ్యూనిటీల్లోనూ సేవలందిస్తోంది. ఏడాదిన్నరలో కోటి రూపాయల టర్నోవర్‌కు చేరుకున్నట్లు సేఫ్‌వాష్ ఫౌండర్ దీక్షిరెడ్డి చెప్పారు. ఆన్లైన్వాషింగ్.కామ్, జెట్వాష్.ఇన్, అర్బన్దోబీ కూడా సేవలందిస్తున్నాయి. భారీగా వస్తున్న నిధులు.. ♦ వాస్సాప్ ఇప్పటివరకు 2 రౌండ్లలో రూ.8 కోట్ల నిధులను సమీకరించింది. ♦ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న డోర్‌మింట్... హీలియన్ వెంచర్స్, కలారీ క్యాపిటల్ నుంచి 3 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న పిక్ మై లాండ్రీలో జీహెచ్‌వీ యాక్సలేటర్ లక్ష డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న టూలర్ రూ.70 లక్షలు సమీకరించింది. ♦ ముుంబై కేంద్రంగా పనిచేస్తున్న ప్రెస్టూ 3.94 మిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. ♦ బెంగళూరు కేంద్రంగా అగ్రిగేటర్ సేవలందిస్తున్న మై వాష్‌లో గతేడాది ఓరిస్ వెంచర్స్ మిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టింది. ♦ విలేజ్ లాండ్రీ సర్వీసెస్ ఫ్లాగ్షిప్ బ్రాండ్ అయిన చమక్‌ను, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈజీవాష్ను ఈక్విటీ రూపంలో వాస్సాప్ సొంతం చేసుకుంది. మరో మూడు కంపెనీల కొనుగోళ్లకు కూడా చర్చలు జరుపుతున్నట్లు బాలచందర్ చెప్పారు. -
2017 నాటికి నెటిజన్లు @ 50 కోట్లు
- ఐఏఎంఏఐ, కేపీఎంజీల నివేదిక న్యూఢిల్లీ: భారత్‌లో ఇంటర్నెట్ను వినియోగించేవారి సంఖ్య జోరుగా పెరుగుతోంది. 2017 నాటికి ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుందని ఒక నివేదిక వెల్లడించింది. రానున్న కాలంలో మొబైల్ ఇంటర్నెట్ కీలకం కానున్నదంటున్న ఈ నివేదికను ఐఏఎంఏఐ, కేపీఎంజీలు సంయుక్తంగా రూపొందించాయి. మొబైల్ వినియోగదారుల సంఖ్య ఏటా 28 శాతం చొప్పున వృద్ధి చెందుతుండడమే దీనికి ప్రధాన కారణమంటున్న ఈ నివేదిక పేర్కొన్న కొన్ని ముఖ్యాంశాలు.., - ఈ ఏడాది జూన్ చివరి నాటికి భారత్‌లో మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య (వెర్లైన్, వెర్లైస్ రెండూ కలిపి) 35 కోట్లుగా ఉంది. - 2017 నాటికి మొత్తం ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 50.3 కోట్లకు పెరుగుతుంది. దీంట్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య 31.4 కోట్లుగా ఉంటుంది. 2014 నాటికి ఈ మొబైల్ ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య 15.9 కోట్లు మాత్రమే. - 2013-17 కాలానికి మొబైల్ నెట్ యూజర్ల సంఖ్య 28% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తోంది. - భవిష్యత్తులో 2జీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గి 3జీ యూజర్ల సంఖ్య బాగా పెరుగుతుంది. 2013-17 కాలానికి 3జీ వినియోగదారుల సంఖ్య 61% చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తుంది. - 2014 చివరికి 8.2 కోట్లుగా ఉన్న 3జీ కస్టమర్ల సంఖ్య 2017 నాటికి 28.4 కోట్లకు పెరుగుతుంది. - మొబైల్ ఇంటర్నెట్ కారణంగా ఇంటర్నెట్ విస్తరణ అనూహ్యంగా ఉండనున్నది. - 90 కోట్లకు పైగా ఉన్న గ్రామీణ భారతీయుల్లో 7 శాతం మంది(దాదాపు 6 కోట్లు) ఇంటర్నెట్ను చురుకుగా వినియోగిస్తున్నారు. - 2012లో మొబైల్ ద్వారా ఇంటర్నెట్ను వినియోగించే గ్రామీణుల సంఖ్య 0.4 శాతమే. రెండేళ్లలో ఈ సంఖ్య 4.4 శాతానికి పెరిగింది. -
ఈ-కామర్స్‌ను మించనున్న ఎం-కామర్స్
పెరుగుతున్న మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ వీటిల్లో అధికం షాపింగ్ యాప్‌లే కేపీఎంజీ నివేదిక వెల్లడి... ముంబై: మొబైల్ కామర్స్ జోరు అంతకంతకూ పెరిగిపోతోంది. కొన్నేళ్లలో ఈ ఎం-కామర్స్, ఈ-కామర్స్‌ను అధిగమిస్తుందని కేపీఎంజీ తాజా నివేదిక వెల్లడించింది. ఆన్లైన్ షాపింగ్ పెరుగుతుండడం, మొబైల్ యాప్‌ల వినియోగం కూడా జోరందుకోవడం దీనికి ప్రధాన కారణాలంటున్న ఈ నివేదిక వెల్లడించిన కొన్ని ముఖ్యాంశాలు... ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో మొబైల్ ఫోన్ల వినియోగదారులు 900 కోట్ల మొబైల్ యాప్‌లు డౌన్లోడ్ చేసుకుంటారని అంచనా. గతేడాది డౌన్లోడ్ చేసుకున్న యాప్‌ల కంటే ఆరు రెట్లు అధికం. డౌన్లోడ్ చేసుకుంటున్న మొబైల్ యాప్‌ల్లో అధికంగా షాపింగ్ యాప్‌లే ఉంటున్నాయి. గత రెండేళ్లలో అత్యంత వేగంగా వృద్ధి చెందిన మొబైల్ యాప్‌ల మార్కెట్‌గా భారత్ ఎదిగింది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ విషయంలో భారత్ వాటా 7 శాతంగా ఉంది. మొబైల్ యాప్‌ల డౌన్లోడ్ విషయంలో ఇండోనే సియా, చైనా, అమెరికాల తర్వాతి స్థానం మనదే. భారత్‌లో మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసిన వాళ్లు 2014లో 17.3 కోట్లుగా ఉన్నారు. గత ఏడాదితో పోల్చితే ఇది 33 శాతం ఎక్కువ. ఇలా మొబైళ్ల ద్వారా ఇంటర్నెట్ను యాక్సెస్ చేసే వారి సంఖ్య ప్రతీ ఏడాది 21 శాతం చొప్పున వృద్ధి చెందుతుందని, 2019లో ఈ సంఖ్య 45.7 కోట్లకు పెరుగుతుందని అంచనా. మొబైళ్ల ద్వారా జరుగుతున్న ఈ-కామర్స్ పోర్టళ్ల షాపింగ్ లావాదేవీలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. దీంతో మొబైల్ ప్లాట్‌ఫామ్‌పైనే ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఈ-కామర్స్ పోర్టళ్లు యోచిస్తున్నాయి. -
ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్‌కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్‌ప్రెస్‌వే, టాటా పవర్‌కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్‌సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది. న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్‌ప్రెస్‌వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్‌కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది. 4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది. ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్‌పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు. -
బడ్జెట్... విశేషాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కస్టమ్స్ సుంకాల లక్ష్యాన్ని రూ.2,01,819 కోట్లుగా కేంద్రం నిర్ణయించింది. గతేడాది కస్టమ్స్ వసూళ్లు రూ.1,75,056 కోట్ల కంటే ఇది రూ.26,763 కోట్లు అధికం. ఎగుమతుల వృద్ధికి మిషన్ ... ఎగుమతుల అభివృద్ధి మిషన్‌ను ఏర్పాటు చేస్తామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. కస్టమ్స్ అనుమతులను 24 గంటలూ ఇస్తుండే సౌకర్యాన్ని దేశంలోని మరో 13 విమానాశ్రయాలకు విస్తరిస్తామని తెలిపారు. ఈ-బిజ్ ప్లాట్‌ఫాంతో ప్రభుత్వ విభాగాల అనుసంధానం వ్యాపారవర్గాలు, ఇన్వెస్టర్లకు ప్రభుత్వ విభాగాలను మరింత అందుబాటులోకి తెచ్చే దిశగా కేంద్రం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా డిసెంబర్ ఆఖరు నాటికల్లా కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలు, శాఖలు తమ సర్వీసులను ‘ఈ-బిజ్ ప్లాట్‌ఫాం’నకు అనుసంధానం చేయాలని ఆదేశించింది. ‘మినహాయింపు’ లేని పీఎఫ్ ట్రస్టులు పన్ను పరిధిలోకి? ఆదాయ పన్ను మినహాయింపు లేకుండా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) ట్రస్టులు ఏప్రిల్ 1 నుంచి ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశముంది. ఈ ట్రస్టులు మినహాయింపు సర్టిఫికెట్ పొందేందుకు గడువును తాజా బడ్జెట్లో పొడిగించకపోవడమే ఇందుకు కారణం. బొగ్గు సమస్యల పరిష్కారానికి చర్యలు విద్యుత్ ప్లాంట్లకు కావాల్సిన స్థాయిలో బొగ్గు ఉత్పత్తిని పెంచేందుకు, నాణ్యతను మెరుగుపర్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. విద్యుత్ కంపెనీలు, బొగ్గు సంస్థల మధ్య వివాదాల పరిష్కారిస్తామని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు.ఇనుప ఖనిజం సహా మైనింగ్ రంగంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని జైట్లీ వివరించారు. సెజ్‌లకు పునరుజ్జీవం... ప్రత్యేక ఆర్థిక మండళ్ల (సెజ్‌లు) పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని కేంద్రం స్పష్టంచేసింది. పారిశ్రామిక ఉత్పత్తి, ఆర్థిక ప్రగతి, ఎగుమతుల వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కీలక సాధనాలుగా సెజ్‌లను తీర్చిదిద్దేందుకు గట్టి చర్యలు చేపడతామని బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి జైట్లీ తెలిపారు. -
బిగ్ 4 ఆడిటింగ్ నుంచి నిరుద్యోగులకు గుడ్‌న్యూస్
-
డీజిల్ రేట్లపై ఆరు నెలల్లో... నియంత్రణ ఎత్తేస్తాం
న్యూఢిల్లీ: వచ్చే ఆరు నెలల్లో డీజిల్ ధరలను పూర్తిగా డీరెగ్యులేట్ చేస్తామని చమురు శాఖ మంత్రి ఎం వీరప్ప మొయిలీ తెలిపారు. ప్రస్తుతం డీజిల్ విక్రయాలపై ఆదాయ నష్టం లీటరుకు రూ. 9.28 మేర ఉంటోందని కేపీఎంజీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన చెప్పారు. ఒక్కసారిగా రేటును రూ.3 లేదా రూ.4 చొప్పున పెంచే యోచనేదీ లేదని, స్వల్ప పెరుగుదల క్రమంగానే కొనసాగుతుందని మొయిలీ వివరించారు. ప్రస్తుత పెరుగుదలను బట్టి చూస్తే డీజిల్‌పై చమురు కంపెనీల నష్టాలు భర్తీ కావాలంటే 19 నెలలు పడుతుందని అంచనా. అయితే, రూపాయి బలపడటం, అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడం వంటి పరిణామాలు చోటుచేసుకుంటే ఆరు నెలల కాలం సరిపోవచ్చని భావిస్తున్నట్లు మొయిలీ చెప్పారు. ఎన్నికల వేళ అయినా కూడా డీజిల్ డీరెగ్యులేషన్ విషయంలో వెనక్కి పోబోమని, మూడోసారి కూడా యూపీఏ ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) ఉత్పత్తి వ్యయాల కన్నా తక్కువగా ప్రభుత్వం నిర్దేశించిన రేటుకే డీజిల్‌ని విక్రయిస్తున్నాయి. దీనివల్ల ఓఎంసీలు కోల్పోయే ఆదాయాన్ని తాను భర్తీ చేయడం వల్ల ప్రభుత్వంపై ఆర్థిక భారం పెరుగుతోంది. 2010లో పెట్రోల్ రేట్లపై నియంత్రణ తొలగించినప్పట్నించీ వాటి రేట్లు అంతర్జాతీయ సాయికి అనుగుణంగా మారుతున్నప్పటికీ డీజిల్‌పై మాత్రం నియంత్రణ పాక్షికంగా కొనసాగుతోంది. క్రమంగా దీన్ని తొలగించే దిశగా ప్రతి నెలా లీటరుపై 50 పైసల చొప్పున ధర పెంచేందుకు ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో అనుమతించింది. దీంతో ఒక దశలో డీజిల్‌పై ఓఎంసీల ఆదాయ నష్టాలు లీటరుకు రూ. 2.50కి దిగి వచ్చినప్పటికీ.. ఆ తర్వాత దేశీ కరెన్సీ మారకం విలువ బలహీనపడటంతో మళ్లీ రూ. 14కిఎగిశాయి. ప్రస్తుతం ఈ నష్టాలు లీటరుకు రూ. 9.28 స్థాయికి తగ్గాయి. ఒకవేళ నియంత్రణను ఎత్తివేస్తే ఈ స్థాయిలో డీజిల్ రేట్లు పెరుగుతాయి. ఆపై అంతర్జాతీయ రేట్లకు అనుగుణంగా పెట్రోల్ తరహాలోనే డీజిల్ రేట్లు కూడా హెచ్చుతగ్గులకు లోనవుతాయి. బ్లాకుల వేలం..: నూతన అన్వేషణ లెసైన్సింగ్ విధానం(నెల్ప్) కింద పదో రౌండు చమురు, గ్యాస్ బ్లాకుల వేలాన్ని జనవరిలో నిర్వహించే అవకాశం ఉందని మొయిలీ పేర్కొన్నారు. జనవరిలో జరిగే పెట్రోటెక్ సదస్సులో తేదీలను ప్రకటించవచ్చన్నారు.