
న్యూఢిల్లీ: ముంబైకు చెందిన ఐటీ సంస్థ ఆరియన్ ప్రొ అనుబంధ సంస్థ, సైబర్ ఐఎన్‌సీ తన ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్‌మెంట్(ఐయామ్) వ్యాపారాన్ని అమెరికాకు చెందిన కేపీఎమ్‌జీ ఎల్‌ఎల్‌పీకి విక్రయించింది. ఈ విక్రయం ఈ నెల 31కల్లా పూర్తవుతుందని, డీల్ విలువ రూ.217 కోట్లని, అంతా నగదు లావాదేవీయేనని ఆరియన్‌ప్రొ వెల్లడించింది. సైబర్‌ఐఎన్‌సీ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండిపెండెంట్ ఐయామ్ టెక్నాలజీ సేవలందించే సంస్థ అని, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, యూకేలో కార్యకాలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా మొత్తం 190 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. సైబర్‌ఐఎన్‌సీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.172 కోట్ల అంతర్జాతీయ ఆదాయం సాధించిందని, భారత ఆదాయం రూ.90 కోట్లని పేర్కొంది. సైబర్‌ఐఆన్‌సీ ఐయామ్ వ్యాపారం చేజిక్కించుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టింగ్‌లో తమ అగ్రస్థానం పటిష్టమవుతుందని కేపీఎమ్‌జీ పేర్కొంది.