Inc
-
Bihar politics: పాత కత్తులు.. కొత్త పొత్తులు
కులాల కుంపట్లు, పొత్తుల కత్తులు, కిచిడీ కూటములు, జంపింగ్ జపాంగ్‌లకు పెట్టింది పేరైన బిహార్‌లో రాజకీయాలు ఎప్పుడూ కాక పుట్టిస్తూనే ఉంటాయి. 40 సీట్లతో లోక్‌సభ నియోజకవర్గాల పరంగా దేశంలో నాలుగో స్థానంలో నిలుస్తున్న ఈ తూర్పు రాష్ట్రానిది జాతీయ రాజకీయాల్లో ఆది నుంచీ కీలక పాత్రే. తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మొదలు జగ్జీవన్‌రాం, నుంచి లాలూ ప్రసాద్, నితీశ్‌కుమార్ దాకా దేశ, రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉద్ధండ నేతలకు పుట్టిల్లు బిహార్. అధికారం కోసం ప్రాంతీయ, జాతీయ పార్టీల మధ్య కుమ్ములాటలు, వర్గ పోరు, పవర్ పాలిటిక్స్ ఇక్కడ సర్వసాధారణం. స్టేట్ స్కాన్ రాజకీయంగా చైతన్యవంతమైన బిహార్‌లో లోక్‌సభ ఎన్నికల ముంగిట కొత్త పొత్తులు పొడిచాయి. గత ఎన్నికల్లో బీజేపీ, జేడీ (యూ), లోక్ జనశక్తి పార్టీలతో కూడిన ఎన్డీఏ కూటమి ఏకంగా 39 సీట్లను ఒడిసిపట్టింది. బీజేపీ 17 సీట్లలో పోటీ చేసి అన్నీ గెలుచుకుంది. జేడీ(యూ) 17 సీట్లకు 16 చోట్ల, ఎల్జేపీ ఆరింటికి ఆరూ కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్, ఆర్జేడీ తదితర పార్టీల మహాకూటమి మహా ఓటమి చవిచూసింది. కాంగ్రెస్ 9 చోట్ల పోటీ చేసి ఒక్క సీటు గెల్చుకోగా ఆర్జేడీ 19 స్థానాల్లో తలపడినా సున్నా చుట్టింది. మిగతా పార్టీలదీ అదే పరిస్థితి. కేంద్రంలో మోదీ 2.0 బలమైన సర్కారు ఏర్పాటులో బిహార్ ఘనవిజయానిది ప్రధాన పాత్ర. ఈసారి పాత మిత్రులతో పూర్వ వైభవానికి కాంగ్రెస్ ప్రయతి్నస్తోంది. బిహార్‌లో 40 స్థానాల్లో ఆరింటిని ఎస్సీలకు కేటాయించారు. నితీశ్ పిల్లిమొగ్గలు... బిహార్ రాజకీయాల్లో వెలుగు వెలిగిన లాలు అవినీతి కేసుల్లో జైలుపాలైన నాటి నుంచీ రాష్ట్రంపై నితీశ్ కుమార్ పట్టుబిగించారు. ఏదో ఒక పార్టీతో పొత్తుతో 15 ఏళ్లుగా సీఎం పీఠాన్ని అంటిపెట్టుకున్నారు. జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పుతున్నారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ మహా కూటమిగా పోటీ చేశాయి. ఆర్‌ర్జేడీ అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించినా నితీశ్ సీఎం పదవి దక్కించుకున్నారు. రెండేళ్లు తిరిగేసరికి మహాకూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో జట్టుకట్టారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమితో సీట్ల సర్దుబాటు చేసుకుని అత్యధిక ఎంపీ సీట్లను దక్కించుకున్నారు. అదే జోరులో 2020 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ భాగస్వామిగా పోటీ చేసి సీఎం పీఠమెక్కారు. జేడీ(యూ) (43) కంటే బీజేపీ (74)కే ఎక్కువ సీట్లు దక్కినా నితీశ్ మళ్లీ సీఎం పదవి దక్కించుకోవడం విశేషం. రెండేళ్లలోనే ఆయన మళ్లీ ప్లేటు ఫిరాయించారు. లోక్‌సభ ఎన్నికల్లో మోదీని ఢీకొట్టడమే లక్ష్యంగా విపక్ష పార్టీలతో కలిసి పోటీ చేస్తామంటూ ఎన్డీఏ కూటమి నుంచి బయటికొచ్చేశారు. మహాకూటమి దన్నుతో మళ్లీ సీఎం అయ్యారు! ఇండియా కూటమి ఏర్పాటు కీలక పాత్ర పోషించారు. తీరా గత జనవరిలో ఎన్డీఏలోకి గెంతి మహాకూటమికి, ఇండియా కూటమికీ కోలుకోలేని షాకిచ్చారు. బీజేపీ దన్నుతో సీఎం పదవిని కాపాడుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తున్నారు. బీజేపీకి కలిసొస్తుందా...? నితీశ్‌తో కలిసి 2019 ఫలితాలను రిపీట్ చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. కానీ దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న నితీశ్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఎన్డీఏ సీట్లకు గండి కొట్టవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కులగణన చేపట్టడాన్ని నితీశ్ సొమ్ము చేసుకోవాలనుకుంటున్నారు. అది తమ ఘనతేనని కాంగ్రెస్ ప్రచారం చేసుకుంటోంది. దేశవ్యాప్తంగా ఆ హామీ ఇస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది. బీజేపీ అయోధ్య రామ మందిరంతో హిందుత్వ నినాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. మోదీ ఫ్యాక్టర్, అభివృద్ధి నినాదంపై ఆశలు పెట్టుకుంది. ఈసారి బీజేపీ 17, జేడీయూ 16, చిరాగ్ పాశ్వాన్ సారథ్యంలోని ఎల్జేపీ 5, జితన్ రామ్ మాంఝీకి చెందిన హిందుస్థాన్ ఆవామ్ మోర్చా, రా్రïÙ్టయ లోక్ సమతా పార్టీ ఒక్కో స్థానంలో పోటీ చేయనున్నాయి. కులగణన ఎవరికి ప్లస్! బిహార్ రాజకీయాలు చిరకాలంగా కులాల చుట్టూనే తిరుగుతున్నాయి. నితీశ్ చేపట్టిన కులగణన మరోసారి రిజర్వేషన్ల తేనెతుట్టెను కదిపింది. రాష్ట్రంలో 94 లక్షల కుటుంబాలు (34.13%) నెలకు రూ.6,000 సంపాదన కూడా లేక పేదరికంలో మగ్గుతున్నాయని కులగణనలో వెల్లడైంది. రాష్ట్రంలో రిజర్వేషన్లను 65 శాతానికి పెంచాల్సిందేనని నితీశ్ పేర్కొన్నారు. రాష్ట్ర జనాభాలో 19.65 శాతం ఎస్సీలు, 1.68 శాతం ఎస్టీలున్నారు. వారిలో ఏకంగా 42.7 శాతం మంది నిరుపేదలని కులగణనలో తేలింది. 27.13 శాతం ఓబీసీలున్నారు. వీరిలో 14.26 శాతం యాదవులు. దాదాపు 17 శాతం మంది ముస్లింలున్నారు. మహాకూటమి యాదవులు, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఓట్లపై కాంగ్రెస్ గురిపెట్టింది. జనాభా ప్రాతిపదికన సామాజిక న్యాయం జరగాల ని డిమాండ్ చేస్తోంది. అగ్రవర్ణాలతో పాటు ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీలనూ ఆకర్షించేలా బీజేపీ, జేడీయూ పావులు కదుపుతున్నాయి. ప్రధాని మోదీ ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. ఇండియా కూటమి పైచేయి సాధిస్తుందా? ఎన్నికల వేళ వెన్నుపోటు పొడిచిన నితీశ్‌కు గుణపాఠం నేర్పాలని కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి పట్టుదలగా ఉంది. ఆయనది పచ్చి అవకాశవాదమంటూ కాంగ్రెస్, ఆర్జేడీ దుమ్మెత్తిపోస్తున్నాయి. రాష్ట్రంలో కులగణన తమ సంకీర్ణ సర్కారు ఘనతేనని ప్రచారం చేస్తున్నాయి. ఇది దేశానికి ఎక్స్‌రే వంటిదని, కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ పదేపదే చెబుతున్నారు. మోదీ హయాంలో నిరుద్యోగం, నిత్యావసరాల ధరల పెరుగుదల, కార్పొరేట్ దోపిడీ తదితరాలను ప్రచారా్రస్తాలుగా మలచుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా 30 లక్షల ప్రభుత్వోద్యోగాలతో పాటు పలు సంక్షేమ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. 6 న్యాయాలు 25 గ్యారంటీలతో విడుదల చేసిన జాతీయ మ్యానిఫెస్టోను కాంగ్రెస్ ఊరూవాడా ప్రచారం చేస్తోంది. పొత్తులో భాగంగా ఆర్జేడీకి 26, కాంగ్రెస్ 9కి, లెఫ్ట్ పార్టీలకు 5 సీట్లు దక్కాయి. ఆర్జేడీ తమ 26 సీట్లలో మూడింటిని మాజీ మంత్రి ముకేశ్ సాహ్ని సారథ్యంలోని వికాస్‌శీల్ ఇన్సాన్ పార్టీ (వీఐపీ)కి కేటాయించింది. అబ్బాయ్–బాబాయ్ పోరు బిహార్‌లో అబ్బాయ్–బాబాయ్ అమీతుమీ అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఎల్జేపీ వ్యవస్థాపకుడు రామ్ విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం కుమారుడు చిరాగ్, సోదరుడు పశుపతి పరాస్ హోరాహోరీ తలపడ్డారు. చివరికి పార్టీని పరాస్ చేజిక్కించుకున్నారు. చిరాగ్‌కు ఎల్జేపీ (రాం విలాస్), పశుపతికి రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ (ఆర్ఎల్జేపీ) పేర్లను ఎన్నికల సంఘం కేటాయించింది. పశుపతి పార్టీకి బీజేపీ ఒక్క సీటూ ఇవ్వకపోవడంతో ఆయన కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలిగారు. సొంతంగా పోటీ చేస్తామని ప్రకటించారు. చిరాగ్‌కు బీజేపీ ఐదు సీట్లు ఇవ్వగా పట్టుబట్టి పాశ్వాన్ల కంచుకోట అయిన హాజీపూర్‌ను సాధించుకున్నారు. అక్కడ బాబాయ్ పశుపతిపై చిరాగ్ నేరుగా తలపడుతుండటం విశేషం! సర్వేల సంగతేంటి...? బిహార్‌లో ఎన్నికల సర్వేల్లో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. నితీశ్ చేరికతో ఎన్డీఏకు 32 నుంచి 35 సీట్లు రావచ్చని కొన్ని సర్వేలు అంచనా వేశాయి. ఇండియా కూటమికి 5–8 సీట్లే వస్తాయని చెప్పాయి. అయితే నితీశ్‌పై ప్రజా వ్యతిరేకత ఇండియా కూటమికి కలిసొస్తుందని ఇండియా కూటమి 15 నుంచి 20 పై చిలుకు దాకా చేజక్కించుకోవచ్చని మరికొన్ని సర్వేల అంచనా. యూపీఏ హయాంలో భారత్‌ను బలహీన దేశంగా చూసేవారు. చిన్నాచితకా దేశాల నుంచి కూడా ఉగ్రవాదులు మనపై దాడులకు తెగబడేవారు. కాంగ్రెసేమో చేతకానితనంతో వేరే దేశాలకు ఫిర్యాదు చేస్తుండేది. నేటి భారత్ అలాకాదు, అవసరమైతే ఉగ్రవాదుల ఇళ్లలో దూరి మరీ అంతం చేస్తుంది. – బిహార్ ఎన్నికల సభలో ప్రధాని మోదీ మహాకూటమి దెబ్బకు బీజేపీ, ఎన్డీఏ కంగుతిన్నాయి. అందుకే మోదీతో సహా అగ్ర నేతలంతా బిహార్‌లోనే తిరుగుతున్నారు. విపక్షాలపై కత్తిగట్టి ఈడీ, సీబీఐ కూడా ఇక్కడే మరింత ఫోకస్ చేస్తున్నాయి. పేదరికం, ఉపాధి, బిహార్ చిరకాల కోరికైన ప్రత్యేక హోదా గురించి మోదీ మాట్లాడాలి. – ఎన్నికల ప్రచారంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
జపనీస్ కంపెనీల చేతికే తోషిబా
సుమారు 140 సంవత్సరాలకుపైగా చరిత్ర కలిగిన జపనీస్ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్పొరేషన్‌ను చేయి జారిపోకుండా చూసేందుకు ఆ దేశ సంస్థలే ఏకమయ్యాయి. ఇందుకు ప్రభుత్వం సైతం చేయూత నందించింది. వెరసి పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్ ఇంక్ అధ్యక్షతన ఏర్పాటైన కన్సార్షియం 2 ట్రిలియన్ యెన్ల(15.3 బిలియన్ డాలర్లు) విలువలో కొనుగోలు చేసేందుకు బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌ను తోషిబా బోర్డు అంగీకరించింది. ఇతర వివరాలు చూద్దాం.. టోక్యో: గత కొన్నేళ్లుగా పలు సంక్షోభాలను చవిచూస్తున్న ప్రయివేట్ రంగ ఇంజనీరింగ్ దిగ్గజం తోషిబా కార్ప్‌ను స్వదేశీ సంస్థలే కొనుగోలు చేయనున్నాయి. పీఈ దిగ్గజం జపాన్ ఇండస్ట్రియల్ పార్టనర్స్(జేఐపీ) ఇంక్ ఆధ్వర్యంలో గ్రూప్‌గా ఏర్పడిన 20 సంస్థలు 15.3 బిలియన్ డాలర్లకు(సుమారు రూ. 1,26,225 కోట్లు) బిడ్ చేశాయి. ఈ ఆఫర్‌కు తాజాగా తోషిబా కార్ప్ బోర్డు ఓకే చెప్పింది. బిడ్ చేసిన కన్సార్షియంలో ఓరిక్స్ కార్ప్, రోహ్ కో, చుబు ఎలక్ట్రిక్ పవర్ తదితరాలున్నాయి. తోషిబా షేరు గురువారం ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 10 శాతం ప్రీమియంతో ఆఫర్ ఇచ్చాయి. కొన్నేళ్లుగా రకరకాల కుంభకోణాలు బయటపడటంతో కంపెనీ పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. ఫలితంగా కంపెనీ అమ్మకపు బాటలో పడింది. తోషిబా యాజమాన్యం, జపనీస్ ప్రభుత్వం, వాటాదారులు కంపెనీ భవిష్యత్‌పట్ల ఆందోళనలు చవిచూస్తున్నారు. యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు గరిష్ట రిటర్నులు ఆశిస్తుంటే.. జపనీస్ ప్రభుత్వం మాత్రం కీలకమైన సాంకేతికతలు, బిజినెస్‌లను విదేశీ హస్తాలకు చేరకుండా పరిరక్షించే యోచనలో పడింది. తోషిబా బిజినెస్ వ్యూహాలలో పలుమార్లు మార్పులు చోటుచేసుకోవడంతో స్థిరత్వం లోపించినట్లు లైట్స్ట్రీమ రీసెర్చ్ విశ్లేషకులు మియో కటో పేర్కొన్నారు. అయినప్పటికీ కొత్త వృద్ధి అవకాశాలను అందుకునేందుకు వీలుగా వర్ధమాన బిజినెస్‌లకు అనుగుణమైన చర్యలు చేపట్టవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. జాతీయ భద్రత తోషిబా అణు విద్యుత్(న్యూక్లియర్ పవర్) బిజినెస్ జాతీయ భద్రతకు చెందిన ప్రధాన అంశమని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. 2011 భూకంపం, సునామీ ధాటికి శిథిలమైన ఫకుషిమా దాయ్చీ ఆటమిక్ పవర్ ప్లాంటు మూసివేతలో కంపెనీ సేవలందించింది. ఈ నేపథ్యంలో తోషిబా యాజమాన్య నియంత్రణ విదేశీయుల చేతికి వెళ్లకుండా నిరోధించేందుకు జపనీస్ ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. కాగా.. డీల్ పూర్తయితే ఈ ఏడాది ఆసియాలోనే అతిపెద్ద లావాదేవీగా నమోదుకానుంది. అంతేకాకుండా ఈ డీల్ జపాన్ చరిత్రలోనే అతిపెద్ద పీఈ పెట్టుబడుల కొనుగోలుగా రికార్డు నెలకొల్పనుంది. అయితే ప్రస్తుత ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా జేఐపీ కన్సార్షియంకు ఫైనాన్స్ అందించేందుకు బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. కార్పొరేట్ పాలన జపాన్‌లో కార్పొరేట్ పాలనపై తోషిబా వ్యవహారాన్ని పరిశీలనాత్మక కేసుగా పరిగణించవచ్చని విశ్లేషకులు పేర్కొన్నారు. వెరసి సుప్రసిద్ధ యాక్టివిస్ట్ ఇన్వెస్టర్లు దీనికి ఒక అవకాశంగా తీసుకుని కంపెనీలో వాటాలు కొనుగోలు చేసే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ జాబితాలో బిలియనీర్ పాల్ సింగర్ సంస్థ ఇలియట్ మేనేజ్మెంట్ కార్ప్, సేథ్ ఫిషర్‌కు చెందిన ఒయాసిస్ మేనేజ్మెంట్ కో, సింగపూర్ ఫండ్స్ ఎఫిసిమో క్యాపిటల్ మేనేజ్మెంట్ పీటీఈ, 3డీ ఇన్వెస్ట్మెంట్ పార్ట్నర్స్ను పేర్కొన్నారు. కంపెనీ కొనుగోలుకి ఆఫర్లు ప్రకటించిన గ్లోబల్ పీఈ దిగ్గజాలలో బెయిన్ క్యాపిటల్, సీవీసీ క్యాపిటల్ పార్ట్నర్స్, కేకేఆర్ అండ్ కో ఉన్నట్లు వెల్లడించారు. 8 ఏళ్లుగా సవాళ్లు గత ఎనిమిదేళ్లుగా తోషిబా ఒకదాని తరువాత మరొకటిగా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. 2015లో ఖాతాల కుంభకోణం బయటపడ్డాక లాభాలు ఆవిరయ్యాయి. ఇది కంపెనీ పునర్వ్యవస్థీకరణకు కారణమైంది. తదుపరి వ్యయభరితమైన యూఎస్ న్యూక్లియర్ పవర్ బిజినెస్‌లోకి ప్రవేశించడం దెబ్బతీసింది. వెరసి 6.3 బిలియన్ డాలర్లను రైట్‌డౌన్ చేయవలసి వచ్చింది. దీంతో ఒక దశలో కంపెనీ డీలిస్టింగ్వరకూ వెళ్లింది. కంపెనీకి ఎంతో విలువైన, కీలకమైన మెమొరీ చిప్ యూనిట్‌తోపాటు, విదేశీ ఇన్వెస్టర్లకు షేర్లను విక్రయించవలసి వచ్చింది. ఆపై వాటాదారులు, ఎగ్జిక్యూటివ్‌లకు కంపెనీ భవిష్యత్ విషయంలో వివాదాలు తలెత్తాయి. కంపెనీ సహవ్యవస్థాపకుల్లో ఒకరిని, ఇతరులను 2020లో తోషిబా బోర్డులో చేర్చుకోమంటూ ఎఫిసిమో ఒత్తిడి చేసింది. అయితే దీనిని వాటాదారులు వ్యతిరేకించారు. అనుమానాస్పద రీతిలో సాగిన ఓటింగ్‌పై ఎఫిసిమో స్వతంత్ర దర్యాప్తు సంస్థలను నియమించింది. ఇక కంపెనీని విక్రయించకుండా రెండుగా విడదీసేందుకు యాజమాన్యం చేసిన ప్రతిపాదనను గతేడాది వాటాదారులు తిరస్కరించారు. దీంతో కంపెనీని విక్రయించవలసిన పరిస్థితులు తలెత్తాయి. ఈ దశలో జేఐపీ రంగంలోకి దిగింది. గతేడాది అక్టోబర్‌లో ప్రాధాన్య బిడ్డర్‌గా నిలిచింది. ఇండస్ట్రియల్ బ్యాంక్ ఆఫ్ జపాన్‌లో కెరీర్ ప్రారంభించిన హిడెమీ మో 2002లో జేఐపీని ఏర్పాటు చేశారు. -
నర్సింగ్‌లో ఏడాది రెసిడెంట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత నర్సింగ్ మండలి (ఐఎన్‌సీ) ఆస్పత్రుల్లోని క్రిటికల్ కేర్ విభాగాల్లో సేవలందించేందుకు కొత్తగా స్పెషాలిటీ కోర్సును ప్రవేశపెట్టింది. దీనిని పోస్ట్ బేసిక్ డిప్లొమా ఇన్ క్రిటికల్ కేర్ స్పెషాలిటీ నర్సింగ్– రెసిడెన్సీగా పిలుస్తారు. ఈ కోర్సులో చేరేవారికి ఏడాదిపాటు రెసిడెంట్ శిక్షణ ఇస్తారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. 200 పడకలున్న ఆస్పత్రులు ఈ కోర్సును బోధించేందుకు అనుమతిస్తారు. కరోనా కాలంలో క్రిటికల్ కేర్ వైద్యం అనేది కీలకంగా మారింది. దీంతో క్రిటికల్ కేర్ మెడిసిన్ వేగంగా అభివృద్ధి చెందింది. తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల సంరక్షణ కోసం నర్సుల నైపుణ్యాలను పెంచాల్సిన అవసరముందని ఆ మార్గదర్శకాల్లో కేంద్రం నొక్కి చెప్పింది. ఐసీయూ సేవలు అవసరమయ్యే రోగుల సంఖ్య పెరుగుతోందని పేర్కొంది. ఈ రోగులను చూసుకోవడానికి నర్సులు ఉండాల్సిన అవసరముందని తెలిపింది. రోగికి అవసరమైన పోషకాహారం, కమ్యూనికేషన్, ఎండ్ ఆఫ్ లైఫ్ కేర్ మొదలైన అంశాలపై వీరు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏడాది రెసిడెన్సీ కోర్సులో 10 శాతం థియరీ, 90 శాతం స్కిల్ ల్యాబ్, క్లినికల్ అంశాల్లో అభ్యసనం ఉంటుంది. జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ పూర్తయిన వారు ఈ కోర్సును చేయవచ్చు. ఈ కోర్సు పూర్తి చేసిన నర్సులను మల్టీ–స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏదైనా క్రిటికల్ కేర్ యూనిట్లో మాత్రమే నియమించాలి. క్రిటికల్ కేర్ విభాగంలో పనిచేసే నైపుణ్యం కలిగిన నర్సులు అవసరమని భావించి కేంద్రం ఈ కోర్సు ప్రవేశపెట్టిందని నర్సింగ్ నిపుణులు అనిల్‌కుమార్, రుఢావత్ లక్ష్మణ్ పేర్కొన్నారు. -
జనరల్ నర్సింగ్ కోర్సు ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ (జీఎన్ఎం) కోర్సుకు ప్రభుత్వం ముగింపు పలికింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి జీఎన్ఎం కోర్సు నిర్వహించేదిలేదని స్పష్టంచేసింది. ఈ మేరకు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి తాజాగా ఉత్తర్వులు జారీచేశారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో 138 ప్రభుత్వ, ప్రైవేటు నర్సింగ్ స్కూళ్లల్లో 6 వేలకు పైగా జీఎన్ఎం సీట్లు ఉన్నాయి. ఇన్ని వేల సీట్లను ఒకేసారి రద్దు చేస్తుండటంతో నర్సింగ్ విద్యను అభ్యసించే విద్యార్థుల సంఖ్య మరింత పడిపోయే ప్రమాదముంది. కొన్ని రాష్ట్రాల్లో జీఎన్ఎం కోర్సు రద్దు చేసినా, వాటి స్థానే బీఎస్సీ నర్సింగ్ కోర్సు నిర్వహించేందుకు అనుమతించారు. దీంతో జీఎన్ఎం సీట్లు పోయినా బీఎస్సీ నర్సింగ్ సీట్లు వచ్చాయి. కానీ మన రాష్ట్రంలో ఇప్పటివరకూ ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న నర్సుల్లో 80 శాతం జీఎన్ఎం అర్హత కలిగినవారే ఉన్నారు. ముఖ్యంగా ప్రైవేటు ఆసుపత్రుల్లో బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్లకంటే, జీఎన్ఎం చేసిన వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. బీఎస్సీ వాళ్ల కంటే తక్కువ వేతనాలకు పని చేయడమే ఇందుకు కారణమని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అంటున్నారు. నైపుణ్యం ఉండటం లేదు.. డీఎంఈ పరిధిలోకి జీఎన్ఎం కోర్సులు వస్తాయి. కాళోజీ హెల్త్ వర్సిటీ పరిధిలోకి బీఎస్సీ నర్సింగ్ కోర్సులు వస్తాయి. జీఎన్ఎం చేసినా చాలామంది నర్సుల్లో నైపుణ్యం ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. పైగా జీఎన్ఎం డిప్లొమా కోర్సుగా కొనసాగుతోంది. ఈ కోర్సుతో నైపుణ్యం రావడం లేదన్న ఆరోపణలతోనే కోర్సు రద్దు చేయాలని ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిర్ణయించింది. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. ఇక ‘నర్సింగ్’ వైపు కష్టమే.. ప్రస్తుతం రాష్ట్రంలో నర్సుల కొరత విపరీతంగా ఉంది. కానీ రాష్ట్రంలో 80 ప్రైవేటు, 6 ప్రభుత్వ నర్సింగ్ కాలేజీల్లో కలిపి బీఎస్సీ నర్సింగ్ సీట్లు 5 వేల లోపే ఉన్నాయి. ప్రైవేటు బీఎస్సీ నర్సింగ్‌లో కన్వీనర్ కోటా సీట్లు రాని విద్యార్థులంతా జీఎన్ఎం కోర్సుల్లో చేరుతున్నారు. జీఎన్ఎం కోర్సు ఎత్తేస్తుండటంతో నర్సింగ్ చదివే విద్యార్థుల సంఖ్య మరింత తగ్గే అవకాశముందని నర్సింగ్ నిపుణులు చెబుతున్నారు. దీంతో జీఎన్ఎం కోర్సులు అందించే నర్సింగ్ స్కూళ్లను, బీఎస్సీ నర్సింగ్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేయా లని నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కోరుతోంది. -
వయనాడ్‌లో రాహుల్ నామినేషన్
తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ పార్లమెంట్ స్థానానికి గురువారం రోజున నామినేషన్ దాఖలు చేశారు. తన సోదరి ప్రియాంక గాంధీతో కలిసి, భారీ ఎత్తున పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి నామినేషన్ వేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో అమేథీ నియోజకవర్గంతోపాటు వయనాడ్ నుంచి కూడా రాహుల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి. ఆ స్థానమే ఎందుకు? ఈ సారి రాహుల్ దక్షిణ భారతదేశం నుంచి పోటీచేయనుండటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు తమ రాష్ట్రం నుంచే పోటీ చేయాలని కోరినప్పటికి.. రాహుల్ కేరళలోని వయనాడ్ స్థానాన్ని ఎంచుకోవడం విశేషం. అయితే ఈ నియోజకవర్గం నుంచి రాహుల్ బరిలో దిగడం వెనుక పెద్ద కసరత్తు జరిగినట్లు తెలుస్తోంది. వయనాడ్ పార్లమెంట్ పరిధిలో ముస్లిం జనాభా ఎక్కువ ఉండటం, గడిచిన రెండు లోక్‌సభ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ గెలువడమే ఇందుకు కారణాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో వయనాడ్ లోక్‌సభ స్థానం అవతరించింది. వయనాడ్, కోజికోడ్, మలప్పురం జిల్లాలోని ఏడు అసెంబ్లీ సీట్లతో వయనాడ్ ఎంపీ స్థానం ఏర్పాటైంది. 2009, 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నేత ఎంఐ షానవాజ్ ఇక్కడ గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని తన సిట్టింగ్ స్థానం అమేథీలో ఓటమి భయంతోనే.. ప్రస్తుత ఎన్నికల్లో రాహుల్ రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని బీజేపీ విమర్శించింది. ఇక మరోవైపు బీజేపీని ఎదుర్కొనే సత్తా లేకనే కమ్యునిస్ట్లు బలంగా ఉండే స్థానాన్ని రాహుల్ ఎంచుకున్నారని సీపీఎం అగ్రనేత ప్రకాశ్ కారత్ ఆరోపించారు. చదవండి: చదువు కోసం మారుపేరుతో చలామణి ఎందుకీ వయనాడ్? -
కేపీఎమ్‌జీ చేతికి ‘సైబర్ ఐఎన్‌సీ’!
న్యూఢిల్లీ: ముంబైకు చెందిన ఐటీ సంస్థ ఆరియన్ ప్రొ అనుబంధ సంస్థ, సైబర్ ఐఎన్‌సీ తన ఐడెంటిటీ అండ్ యాక్సెస్ మేనేజ్మెంట్(ఐయామ్) వ్యాపారాన్ని అమెరికాకు చెందిన కేపీఎమ్‌జీ ఎల్ఎల్పీకి విక్రయించింది. ఈ విక్రయం ఈ నెల 31కల్లా పూర్తవుతుందని, డీల్ విలువ రూ.217 కోట్లని, అంతా నగదు లావాదేవీయేనని ఆరియన్‌ప్రొ వెల్లడించింది. సైబర్‌ఐఎన్‌సీ.. ప్రపంచంలోనే అతి పెద్ద ఇండిపెండెంట్ ఐయామ్ టెక్నాలజీ సేవలందించే సంస్థ అని, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, యూకేలో కార్యకాలాపాలు నిర్వహిస్తోందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 190 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపింది. సైబర్‌ఐఎన్‌సీ గత ఆర్థిక సంవత్సరంలో రూ.172 కోట్ల అంతర్జాతీయ ఆదాయం సాధించిందని, భారత ఆదాయం రూ.90 కోట్లని పేర్కొంది. సైబర్‌ఐఆన్‌సీ ఐయామ్ వ్యాపారం చేజిక్కించుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ కన్సల్టింగ్‌లో తమ అగ్రస్థానం పటిష్టమవుతుందని కేపీఎమ్‌జీ పేర్కొంది. -
ఆ రాష్ట్రాల్లో జాతీయ పార్టీలకు స్థానం లేదు
హైదరాబాద్: ప్రాంతీయ పార్టీలు బలం ఉన్నచోట జాతీయ పార్టీలు తమ బలాన్ని ప్రదర్శించలేకపోతున్నాయి. తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో కూడా ఇది రుజువైంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీలు ఏమాత్రం పురోగతి సాధించలేకపోయాయని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో పెద్ద రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడుల్లో తమ బలం పెంచుకోవాలన్న బీజేపీ, కాంగ్రెస్ ల ప్రయత్నాలు ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల ముందు నిలువలేదు. తమిళనాడులో ఏఐఏడీఎంకే, డీఎంకేల మధ్య, పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలను జాతీయ పార్టీలు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. 2014 లో లోక్ సభ సాధారణ ఎన్నికలు ఆ తర్వాత క్రమంలో 9 రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఒరవడిని పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా ప్రాంతీయ పార్టీల ప్రభావం బాగా కనిపించింది. తాజా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ లో ప్రవేశించడానికి బీజేపీ శతవిధాలా ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదు. 2011 లో జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 0 శాతం ఓట్లు సాధించగా ఎంతో ప్రయత్నించినప్పటికీ ఈసారి కూడా 3 శాతం ఓట్లు దాటలేదు. అలాగే కేరళలో ఎన్నో కొత్త ప్రయోగాలు చేసినప్పటికీ 1 శాతం ఓట్లకు మించి సాధించలేకపోయింది. తమిళనాడులోనూ అదే పరిస్థితి. ఏఐఏడీఎంకే, డీఎంకేలతో పాటు మరిన్ని ప్రాంతీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల పోరాటంలో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. 30 ఏళ్లపాటు ఏకచత్రాధిపత్యం కొనసాగిస్తూ వచ్చిన సీపీఎంను పశ్చిమ బెంగాల్ లో ప్రాంతీయ పార్టీగా ఆవిర్భవించిన తృణమూల్ కాంగ్రెస్ పెద్ద దెబ్బ తీసింది. మూడు దశాబ్దాల పాటు అధికారంలో కొనసాగిన సీపీఎం ఈసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నప్పటికీ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించలేకపోయింది. బీజేపీ అస్సాంలో చరిత్ర తిరగరాసింది. అయితే అక్కడ ప్రాంతీయ పార్టీల ప్రభావం లేదు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ నుంచి ఈసారి ఎన్నికల్లో అధికార పగ్గాలు సాధించగలిగింది. 2011 (5 స్థానాలు గెలుచుకుంది) లో 11.47 శాతం ఓట్లు సాధించిన బీజేపీ ఈసారి 29.5 శాతం ఓట్లను (60 స్థానాలను కైవసం చేసుకుంది) సాధించి అధికారాన్ని దక్కించుకుంది. 2014 లోక్ సభ సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరంగా దెబ్బతిన్నది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కొంత సానుకూల ఫలితం రాబట్టుకున్నప్పటికీ అక్కడి ప్రాంతీయ పార్టీలతో అది కూడా మూడో చిన్న పార్టీగా మాత్రమే పొత్తు పెట్టుకుని పరిమితమైన సంఖ్యలో సీట్లను గెలుచుకోగలిగింది. 2014 సాధారణ ఎన్నికలు ఆ తర్వాత జరిగిన ఆయా రాష్ట్రాల శాసనసభల ఎన్నికల ఫలితాల అనంతరం దేశంలో కాంగ్రెస్ ప్రస్తుతం ఆరు రాష్ట్రాలకే పరిమితమైంది. తాజాగా అస్సాంను కలిపితే బీజేపీ తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో కొనసాగుతోంది. అంటే దేశంలోని దాదాపు సగం రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు, మిత్రపక్షాల కూటములే అధికారంలో ఉన్నాయి. తెలంగాణ, ఏపీ, జమ్ము కాశ్మీర్, ఒడిస్సా, బీహార్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే అధికారంలో ఉండగా, మరికొన్ని రాష్ట్రాల్లో ఆయా జాతీయ పార్టీల పొత్తులతో కూడిన కూటములు అధికారంలో కొనసాగుతున్నాయి. -
పతాక స్థాయి నుంచి పతనం దాకా..
-
భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!
భారత రిటైల్ రంగంలో భారతీ ఎంటర్ ప్రైజెసెస్, వాల్ మార్ట్ స్టోర్స్ ఇంక్ ల భాగస్వామ్య వ్యాపారానికి తెరపడింది. తమ సంస్థలకు చెందిన వ్యాపార వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేందుకు భారతీ, వాల్ మార్ట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ రంగ వ్యాపారంలో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ లో తమకు అనుకూలంగా ఉండే విధానంలో వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అవగాహన ఒప్పందాలు, చెల్లింపులు, విధానాలకు సంబంధించిన అంశాలకు అమోదం లభించిన మేరకు ఒప్పందాలుంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని రకాల వ్యవహారాలు పూర్తయిన తర్వాత భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భారతీ వాటాను వాల్ మార్ట్ సొంతం చేసుకుంటుంది అని..ఆతర్వాతే బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంపై పూర్తి స్థాయి ఆజామాయిషీ లభిస్తుందని తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై భారతీ ఎంటర్ ప్రైజెసెస్ వైస్ చైర్మన్, ఎండీ రంజన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయికి తగ్గట్టూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తాం అని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థకు 212 స్టోర్లు ఉన్నాయని.. వ్యాపారాన్ని పెంచడానికి, వినియోగ దారులకు చేరువయ్యేందుకు అన్ని రకాల మార్గాలున్నాయన్నారు.