భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై! | Walmart, Bharti to independently pursue retail business in India | Sakshi
Sakshi News home page

భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!

Published Wed, Oct 9 2013 12:41 PM | Last Updated on Fri, Sep 1 2017 11:29 PM

భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!

భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!

భారత రిటైల్ రంగంలో భారతీ ఎంటర్ ప్రైజెసెస్, వాల్ మార్ట్ స్టోర్స్ ఇంక్ ల భాగస్వామ్య వ్యాపారానికి తెరపడింది. తమ సంస్థలకు చెందిన వ్యాపార వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేందుకు భారతీ, వాల్ మార్ట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
రిటైల్ రంగ వ్యాపారంలో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ లో తమకు అనుకూలంగా ఉండే విధానంలో వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు.  
 
అవగాహన ఒప్పందాలు, చెల్లింపులు, విధానాలకు సంబంధించిన అంశాలకు అమోదం లభించిన మేరకు ఒప్పందాలుంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని రకాల వ్యవహారాలు పూర్తయిన తర్వాత భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భారతీ వాటాను వాల్ మార్ట్ సొంతం చేసుకుంటుంది అని..ఆతర్వాతే బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంపై పూర్తి స్థాయి ఆజామాయిషీ లభిస్తుందని తెలిపారు.
 
తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై భారతీ ఎంటర్ ప్రైజెసెస్ వైస్ చైర్మన్, ఎండీ రంజన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయికి తగ్గట్టూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తాం అని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థకు 212 స్టోర్లు ఉన్నాయని.. వ్యాపారాన్ని పెంచడానికి, వినియోగ దారులకు చేరువయ్యేందుకు అన్ని రకాల మార్గాలున్నాయన్నారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement