Bharti Enterprises
-
ప్రపంచ వృద్ధికి కీలకం.. ఏఐ
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రపంచ ఎకానమీ వృద్ధికి, భౌగోళిక రాజకీయాలకు కృత్రిమ మేథ (ఏఐ) కీలక చోదకశక్తిగా ఉంటుందని భావిస్తున్నట్లు భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించుకోలేని కంపెనీలు, దేశాలు వెనుకబడిపోతాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కొత్త టెక్నాలజీలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. దీనితో కొత్త సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ఇది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా ఉన్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి’’ అని చెప్పారాయన. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన తెలియజేస్తూ... ‘‘దుబాయ్‌లోని మా సీనియర్ ఫైనాన్షియల్ అధికారికి నా గొంతును అనుకరిస్తూ, భారీ మొత్తంలో నగదును ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక ఫేక్ కాల్ వెళ్లింది. ఆ అధికారి అప్రమత్తంగా వ్యవహరించి, ఫ్రాడ్‌ను వెంటనే గుర్తించడంతో ముప్పు తప్పింది. ఆ వాయిస్ రికార్డింగ్ విన్నప్పుడు అది అచ్చం నా గొంతులాగే ఉండటం నన్ను ఆశ్చర్యపర్చింది‘ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందులోని మంచిని వాడుకోవాలని, చెడు కోణం వల్ల తలెత్తే దు్రష్పభావాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలని మిట్టల్ చెప్పారు. అయితే, మొత్తం మీద కృత్రిమ మేథతో ఒనగూరే ప్రయోజనాలపై తాను ఆశావహంగా ఉన్నట్లు ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. వ్యాపారాలపరంగా చూస్తే రొటీన్‌గా, పునరావృతమయ్యే విధులను నిర్వర్తించే ఉద్యోగాల్లో ఏఐ వల్ల కోత ఉంటోందని, కానీ వాటికి సమానంగా కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయని మిట్టల్ వివరించారు. కాల్ సెంటర్లు, వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో ఏఐతో గణనీయంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. కృత్రిమ మేథ రాకతో కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు రాగలవని, వాటి నుంచి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు.ఆదాయం పెరగాలిదేశీయంగా టెలికం మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటే సగటున యూజర్లపై వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ఇంకా పెరగాల్సి ఉంటుందని మిట్టల్ చెప్పారు. ఇటీవలి పెంపు తర్వాత 2.5 డాలర్ల స్థాయిలో స్థిరపడిన ఏఆర్పీయు 5 డాలర్లకు చేరాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, ఎడారులు, అడవులతో నిండిపోయిన 25 శాతం భూభాగంలో ఉంటున్న 5 శాతం జనాభాకు ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని మిట్టల్ చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక ’మ్యాజిక్ బులెట్’గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘తయారీ’లో మరిన్ని ఆవిష్కరణలు రావాలి: భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న నేపథ్యంలో గణనీయంగా వృద్ధి సాధించాలంటే తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలంటే నవకల్పనలు అత్యంత కీలకమని, నూతన సాంకేతికతలను స్థానికంగా అభివృద్ధి చేస్తే పరిశ్రమకు దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు. ‘విదేశాల్లో తయారైన వాటిని కాపీ కొట్టడం కాకుండా మనం కూడా టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను రూపొందించాలి. ఇతర దేశాలు మన నుంచి కాపీ కొట్టేలా మన సొంత ఉత్పత్తులను తయారు చేయాలి‘ అని కల్యాణి చెప్పారు. ఏఐతో ఉత్పాదకత, సమర్ధత, ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడగలదన్నారు.వైద్య విధానాల్లో వినూత్నత: అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డివైద్యానికి సంబంధించి ప్రస్తుత టెక్నాలజీలను మరింత మందికి చేరువ చేసేందుకు వైద్య విధానాల్లో వినూత్నమైన ఆవిష్కరణలు అవసరమని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డి చెప్పారు. విదేశీ అధ్యయనాలపై ఆధారపడకుండా దేశీయంగా ఫండమెంటల్ రీసెర్చ్ జరగాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలంటే పరిశోధనలపై గణనీయంగా వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక్క శాతం కన్నా తక్కువే వెచ్చిస్తున్నామని సునీత రెడ్డి తెలిపారు. మరోవైపు, పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సంచలనాత్మక మార్పులు కీలకమని డీసీఎం శ్రీరామ్ సీఎండీ అజయ్ శ్రీరామ్ చెప్పారు. జనధన యోజన, ఆధార్, మొబైల్ (జామ్ ట్రినిటీ) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతులతో కనెక్టివిటీ మెరుగుపడేందుకు గణనీయంగా తోడ్పడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ ముడిపదార్థాలు, పనిముట్లు రైతులకు అందుబాటులోకి ఉండేందుకు ఈ–కామర్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. -
బ్రిటీష్ టెలికంలో భారతి గ్లోబల్ పాగా
న్యూఢిల్లీ: దేశీ దిగ్గజం భారతి ఎంటర్ప్రైజెస్ అంతర్జాతీయ పెట్టుబడుల విభాగం భారతి గ్లోబల్ తాజాగా బ్రిటన్ సంస్థ బీటీ (బ్రిటీష్ టెలికం) గ్రూప్‌లో 24.5 శాతం వాటా కొనుగోలు చేయనుంది. డీల్ విలువను నిర్దిష్టంగా ప్రకటించనప్పటికీ బీటీ వేల్యుయేషన్ సుమారు 15 బిలియన్ డాలర్లు ఉంటుందని, దాన్ని బట్టి చూస్తే ఒప్పంద విలువ దాదాపు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 33,600 కోట్లు) ఉండవచ్చని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. భారతి గ్లోబల్ ప్రకటన ప్రకారం కంపెనీ ముందుగా ఆల్టిస్ సంస్థ నుంచి బీటీ గ్రూప్‌లో 9.99 శాతం వాటాను తక్షణం కొనుగోలు చేస్తుంది. నియంత్రణ సంస్థ అనుమతులు వచ్చాక మిగతా వాటాను తీసుకుంటుంది. బీటీని పూర్తిగా దక్కించుకోవడంపై గానీ బోర్డులో స్థానం తీసుకోవడంపై గానీ ఆసక్తి లేదని భారతి గ్లోబల్ పేర్కొంది. బీటీ గ్రూప్ బ్రిటన్‌లో అతి పెద్ద బ్రాడ్‌బ్యాండ్, మొబైల్ కంపెనీగా కార్యకలాపాలు సాగిస్తోంది. దానికి గతంలో 1997 నుంచి 2001 వరకు భారతి ఎంటర్ప్రైజెస్ టెలికం విభాగమైన భారతి ఎయిర్‌టెల్‌లో 21 శాతం వాటాలు ఉండేవి. బీటీ గ్రూప్‌లో బిలియనీర్ ప్యాట్రిక్ డ్రాహీకి చెందిన పెట్టుబడి సంస్థ ఆల్టిస్ 2021లో ముందుగా 12 శాతం వాటాలు తీసుకుని తర్వాత దాన్ని 24.5 శాతానికి పెంచుకుంది. భారతి గ్లోబల్ పెట్టుబడులు తమ గ్రూప్ భవిష్యత్ వృద్ధి అవకాశాలపై నమ్మకానికి నిదర్శనమని బీటీ సీఈవో అలిన్ కిర్క్‌బీ పేర్కొన్నారు. టాటా, మహీంద్రాల సరసన భారతి.. → తాజా డీల్‌తో బ్రిటన్ కంపెనీలను కొనుగోలు చేసిన టాటా, మహీంద్రా, వెల్స్పన్, టీవీఎస్ వంటి దిగ్గజ సంస్థల సరసన భారతి ఎంటర్ప్రైజెస్ కూడా చోటు దక్కించుకోనుంది. → టాటా గ్రూప్‌లో భాగమైన టాటా టీ 2000లో బ్రిటన్ సంస్థ టెట్లీ టీని కొనుగోలు 271 మిలియన్ పౌండ్లకు చేసింది. అప్పట్లో టెట్లీతో పోలిస్తే టాటా టీ పరిమాణం చాలా చిన్నది. అయినప్పటికీ 1995 నుంచి దాన్ని కొనుగోలు చేసేందుకు సుదీర్ఘంగా ప్రయత్నాలు చేసింది. టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా కూడా రంగంలోకి దిగారు. చివరికి 2000లో టాటా గ్రూప్ దాన్ని సొంతం చేసుకుని అప్పట్లో దేశీ కార్పొరేట్ చరిత్రలోనే అతి పెద్ద కొనుగోలు డీల్‌ను నమోదు చేసింది. → ఆ తర్వాత ఆరేళ్లకు 2006 జూలైలో టెక్స్టైల్స్ దిగ్గజం వెల్స్పన్ ఇండియా, బ్రిటన్‌కి చెందిన టెర్రీ టవల్ బ్రాండ్ క్రిస్టీ మాతృ సంస్థ సీహెచ్టీ హోల్డింగ్స్‌లో 85 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇందుకోసం రూ. 132 కోట్లు వెచి్చంచింది.→ టాటా గ్రూప్ తన దూకుడును కొనసాగిస్తూ ఆ మరుసటి ఏడాది 2007లో ఆంగ్లో–డచ్ ఉక్కు దిగ్గజం కోరస్ గ్రూప్‌ను దక్కించుకుంది. ఇందుకోసం టాటా గ్రూప్‌లో భాగమైన టాటా స్టీల్ 12 బిలియన్ డాలర్లు వెచి్చంచింది. దానికి కొనసాగింపుగా 2008లో టాటా మోటార్స్ 2.3 బిలియన్ డాలర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను ఫోర్డ్ మోటర్ నుంచి దక్కించుకుంది. → ఇక 2016 అక్టోబర్‌లో మహీంద్రా అండ్ మహీంద్రా బ్రిటన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల సంస్థ బీఎస్ఏ కంపెనీని రూ. 28 కోట్లకు తీసుకుంది. → 2020 ఏప్రిల్‌లో బైక్‌ల తయారీ సంస్థ నార్టన్ మోటార్‌సైకిల్స్‌ను టీవీఎస్ మోటర్ కంపెనీ 16 మిలియన్ పౌండ్లకు కొనుగోలు చేసింది. భారతి, బీటీలకు రెండు దశాబ్దాల పైగా అనుబంధం ఉంది. దిగ్గజ బ్రిటన్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం మాకు ఒక గొప్ప మైలురాయిలాంటిది – సునీల్ భారతి మిట్టల్, భారతి ఎంటర్ప్రైజెస్ చైర్మన్ -
5జీ రేసు: అదానీ,జియోపై ఎయిర్టెల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించిన నేపథ్యంలో ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదాని గ్రూపు ఎంట్రీతో తమకేమీ ఇబ్బంది లేదని, సంస్థకు ఎలాంటి నష్టం ఉందని మిట్టల్ పేర్కొన్నారు. 5జీ సేవల రేసులో పోటీదారులను తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే మూలధనం విషయంలో తాము జియోతో పోటీపడలేక పోయినా టెక్నాలజీ, 5జీ సేవల్లో మాత్రం తామే ముందు ఉంటామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ టుడే ‘ఇడియా ఎట్100 ఎకానమీ సమ్మిట్’ లో సునీల్ మిట్టల్ మాట్లాడారు. బడా పోటీదారులొచ్చినా 5జీ సేవల్లో ఎయిర్టెల్ అత్యుత్తమ సేవలందిస్తుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ రేసులో పోటీదారులను స్వాగతిస్తానన్నారు. అలాగే స్పెక్ట్రమ్ రేసులో అదానీ గ్రూప్‌నకు సేవ చేయడానికి ఇష్టపడతానన్నారు. తమ సాయం తీసుకోపోయినా ఫర్వాలేదు, కానీ తన అభిప్రాయం ప్రకారం.. అదానీ నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇతర పారిశ్రామిక అవసరాలకు తాము సేవలందిస్తాం. నిజానికి మరింత మెరుగ్గా చేయగలమని భావిస్తున్నామని మిట్టల్ వ్యాఖ్యానించారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) ఈ సందర్భంగా జర్మనీలో సొంత స్పెక్ట్రమ్ ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ వోడాఫోన్‌తో జతకట్టిందని గుర్తు చేశారు. సాంకేతికపరమైన సేవలందిస్తోంది. తామూ కూడా అలాగే అదానీ గ్రూపునకు చేయగలమని ఎయిర్టెల్ చైర్మన్ చెప్పారు. గత 25 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్న తాము..ఇప్పుడు డామినెంట్ పీపుల్ మార్కెట్లోకి వస్తారనే భయంతో మార్కెట్‌ప్లేస్ గెలవలేకపోతే, ఇక తమకు ఈ వ్యాపారంలో ఉండే హక్కు ఉండదని కూడా మిట్టల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో అత్యుత్తమ 5జీ సేవలందిస్తాం. మిగిలినవారు తమను ఫాలో అవుతారన్నారు. (Priyanka Chopra Jonas: భారీ ప్లాన్స్, నా బ్యూటీకి దేశీ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడతా) టెలికాం మార్కెట్లో జియో ఆధిపత్యం గురించి మాట్లాడిన మిట్టల్, తమ క్యాపిటల్ జియోతో సరిపోలకపోవచ్చు, అయితే టెక్నాలజీ, సేవల పరంగా ఎయిర్టెల్ జియోకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచంలో స్పెక్ట్రమ్ వ్యాపారంలో కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకరు అమెరికా క్రెయిగ్ మెక్కావ్ అయితే, మరొకటి భారతి ఎయిర్టెల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టెలికాం వ్యాపారం డీప్ పాకెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమేనని ఆయన వివరించారు. కాగా ఇటీవల జరిగిన 5జీవేలంలో 400 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలుతో అదానీ గ్రూప్ 5జీ రంగంలోకి ప్రవేశించింది. 26 GHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ కోసం 212 కోట్ల రూపాయలు వెచ్చించింది. తమ వ్యాపారాలను డిజిటల్‌గా ఏకీకృతం చేసి, డేటాసెంటర్లను లింక్ చేస్తామని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక క్లౌడ్ కార్యకలాపాలను నిర్మిస్తామని, 400 మిలియన్ల కస్టమర్ బేస్‌లో సేవలను అందించడానికి సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తామని అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారతీ ఎంటర్ప్రైజెస్ ఆస్తుల విక్రయం
న్యూఢిల్లీ: డైవర్సిఫైడ్ దిగ్గజం భారతీ ఎంటర్ప్రైజెస్ దేశ రాజధానిలోని వరల్డ్‌మార్క్‌సహా నాలుగు వాణిజ్య ఆస్తులను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తద్వారా వీటిలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ బ్రూక్‌ఫీల్డ్ 51 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. రూ. 5,000 కోట్ల ఎంటర్ప్రైజ్ విలువలో డీల్ కుదిరినట్లు భారతీ ఎంటర్ప్రైజెస్ వెల్లడించింది. మొత్తం 3.3 మిలియన్ చదరపు అడుగుల ఈ నాలుగు ఆస్తులపై భాగస్వామ్య(జేవీ) ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. ఆస్తుల జాబితాలో వరల్డ్‌మార్క్ ఏరోసిటీ(ఢిల్లీ), వరల్డ్‌మార్క్ 65, ఎయిర్టెల్ సెంటర్(గుర్గావ్), పెవిలియన్ మాల్(లూథియానా) ఉన్నట్లు పేర్కొంది. ఒప్పందంలో భాగంగా బ్రూక్‌ఫీల్డ్ రియల్టీ ఫండ్ 51 శాతం వాటాను పొందనుండగా.. మిగిలిన 49 శాతం వాటాతో భారతీ ఎంటర్ప్రైజెస్ కొనసాగనుంది. ఎంటర్ప్రైజ్ విలువ మదింపులో రుణభారాన్ని సైతం పరిగణించినట్లు కంపెనీ తెలియజేసిం ది. అయితే కచ్చితమైన ఒప్పంద విలు వను వెల్లడించలేదు. నియంత్రణ సంస్థల అనుమతుల తదుపరి లావాదేవీ అమలుకానుంది. ఆస్తులను బ్రూక్‌ఫీల్డ్ అనుబంధ సంస్థ బ్రూక్‌ఫీల్డ్ ప్రాప ర్టీస్ మేనేజ్ చేయనున్నట్లు భారతీ వెల్లడించింది. ఆస్తుల వివరాలు: 1.43 మిలియన్ చదరపు అడుగుల వరల్డ్‌మార్క్ ఏరోసిటీ మిశ్రమ వినియోగ ఆస్తికాగా.. 7 లక్షల ఎస్‌ఎఫ్‌టీగల ఎయిర్టెల్ సెంటర్ కార్పొరేట్ సౌకర్యాలను కలిగి ఉంది. ఇక వరల్డ్‌మార్క్ 65 సైతం 7 లక్షల ఎస్ఎఫ్టీలో మిశ్రమ వినియోగానికి అనువుగా నూతనంగా నిర్మాణమైంది. దేశీయంగా బ్రూక్‌ఫీల్డ్ పలు నగరాలలో 47 మిలియన్ చదరపు అడుగుల వాణిజ్య రియల్టీ ఆస్తులను నిర్వహిస్తోంది. గతేడాది రూ. 3,800 కోట్ల ఐపీవో ద్వారా దేశీయంగా రియల్ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్(ఆర్ఈఐటీ)ను ఆవిష్కరించింది. -
విప్రో, ప్రేమ్‌జీ ఫౌండేషన్ 1,125 కోట్లు
న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ముప్పును అధిగమించేందుకు విప్రో కంపెనీ, విప్రో ఎంటర్ప్రైజెస్, ఆ సంస్థల ప్రమోటర్‌కు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ సంయుక్తంగా రూ.1,125 కోట్లను ఖర్చు చేసేందుకు సంసిద్ధత ప్రకటించాయి. ఇందులో విప్రో కంపెనీ రూ.100 కోట్లు, విప్రో ఎంటర్ప్రైజెస్ రూ.25 కోట్లు, అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ రూ.1,000 కోట్లను ఖర్చు పెట్టనున్నాయి. విప్రో వార్షికంగా కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద చేసే ఖర్చుకు అదనంగా ఈ మొత్తాన్ని వెచ్చించనుంది. భారతీ ఎంటర్ప్రైజెస్ రూ.100 కోట్లు కరోనాపై పోరులో భారతీ ఎంటర్ప్రైజెస్ కూడా చేరిపోయింది. రూ.100 కోట్ల సాయాన్ని ప్రకటించింది. ప్రభుత్వరంగ పవర్‌గ్రిడ్ సంస్థ కూడా పీఎం కేర్స్‌కు తొలి విడతగా రూ.130 కోట్లను అందించింది. మరో రూ.70 కోట్లను 2020–21లో ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే, ఇఫ్కో రూ.25 కోట్లు, క్రిబ్కో రూ.2 కోట్లు, ఎన్ఎఫ్ఎల్–కిసాన్ రూ.64 లక్షలు, కల్యాణి గ్రూపు రూ.25 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించాయి. ఎల్ఐసీ రూ.105 కోట్లు.. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కరోనాపై యుద్ధంలో పాలుపంచుకుంటోంది. పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.105 కోట్ల విరాళం ఇచ్చినట్టు ప్రకటించింది. మొత్తం విరాళంలో రూ.5 కోట్లు గోల్డెన్ జూబ్లీ ఫండ్ నుంచి సమకూర్చినట్టు ఎల్ఐసీ చైర్మన్ ఎం.ఆర్.కుమార్ తెలిపారు. ఎస్బీఐ రూ.100 కోట్లు.. దేశంలోనే అతిపెద్ద బ్యాంకు, ప్రభుత్వరంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) సైతం రూ.100 కోట్లను పీఎంకేర్స్‌కు ప్రకటించింది. ఎల్జీ ఉచిత భోజన ఏర్పాట్లు.. లాక్డౌన్ నేపథ్యంలో దినసరి కూలీలు, వలస కార్మికుల సహాయార్థం కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్రాండ్ ఎల్జీ దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి భోజన ఏర్పాట్లను అందిస్తుంది. ఈ మేరకు అక్షయ పాత్ర ఫౌండేషన్‌తో ఒప్పందం చేసుకున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎంపిక చేసిన 50 రాష్ట్రాల్లోని ఆయా ఆసుపత్రుల్లో ఐసోలేషన్, క్వారంటైన్ వార్డుల్లో వాటర్ ప్యూరిఫయర్స్, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, టెలివిజన్లను అందించనున్నట్లు ఎల్జీ ఇండియా ఎండీ యంగ్ లాక్ కిమ్ తెలిపారు. పుణేలో మెర్సిడెజ్ బెంజ్ కోవిడ్ ఆసుపత్రి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ మెర్సిడెజ్ బెంజ్ పుణేలో తాత్కాలిక కరోనా ఆసుపత్రిని ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. చకాన్ ఖేడ్‌లోని మహలుంగే–ఇంగాలే గ్రామంలో ఏర్పాటు చేస్తున్న ఈ హాస్పటల్లో 1,500 మంది కరోనా రోగులకు చికిత్స అందించవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్‌కు మెర్సిడెజ్ బెంజ్ ఇండియా ఉద్యోగుల ఒకరోజు వేతనాన్ని అందిస్తున్నట్లు పేర్కొంది. రామ్‌కో ఐసోలేషన్ సెంటర్లు రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ తయారీ కేంద్రాల్లో పనిచేసే కార్మికులకు, వలస కూలీలకు మాస్క్‌లు, బియ్యం, కూరగాయలు వంటి నిత్యావసరాలను అందిస్తున్నట్లు తెలిపింది. తమిళనాడు, ఒడిశాలోని రామ్‌కో ప్లాంట్ వద్ద ఐసోలేషన్ సెంటర్లను ఏర్పాటు చేసి కార్మికులకు, స్థానిక గ్రామస్తులకు వైద్య సేవలు అందిస్తుంది. రూ.3 కోట్ల వ్యయంతో వైద్య పరికరాలు అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. ఓలెక్ట్రా రూ.17 లక్షలు.. కరోన కట్టడిలో భాగంగా ప్రభుత్వానికి సాయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్ నడుం బిగించింది. పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.17.26 లక్షల మొత్తాన్ని విరాళంగా అందించింది. ఇందులో ఉద్యోగుల ఒకరోజు వేతనం రూ.7.26 లక్షలు, కంపెనీ రూ.10 లక్షలు సమకూర్చిందని ఓలెక్ట్రా ఈడీ ఎన్.నాగసత్యం తెలిపారు. -
మెగా విలీనానికి భారతీ ఎంటర్ప్రైజ్ చెక్
న్యూఢిల్లీ : భారతీ ఎయిర్ టెల్, టాటా గ్రూప్ కంపెనీలతో చేసుకోబోతున్న మెగా విలీనానికి గండిపడింది. టాటా గ్రూప్ టెలికాం, ఓవర్సీస్ కేబుల్, ఎంటర్ప్రైజ్ సర్వీసెస్, డీటీహెచ్ టీవీ వ్యాపారాలతో మెగా డీల్ కుదుర్చుకోవాలని ప్లాన్‌ను భారతీ ఎంటర్ప్రైజ్ విరమించుకుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. సునిల్ మిట్టల్‌కు చెందిన భారతీ ఇప్పటికే తలకు మించిన అప్పులతో కొట్టుమిట్టాడుతుందని, దీంతో టాటా గ్రూప్‌తో మెగావిలీన ప్లాన్లను విరమించుకుని, కేవలం టవర్ సంస్థ భారతీ ఇన్ఫ్రాటెల్ వాటా విక్రయం, టెలినార్ ఇండియా టేకోవర్ వంటి విషయాలపై ప్రస్తుతం దృష్టిసారించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. టెలినార్ ఇండియాను సొంతం చేసుకోబోతున్న ఎయిర్టెల్, టెలికాం మార్కెట్లో తీవ్ర పోటీ వాతావరణాన్ని సృష్టించబోతుంది. మరోవైపు ఐడియా, వొడాఫోన్లు ఓ విలీన సంస్థగా ఏర్పడబోతున్నాయి. భారతీ ఎయిర్‌టెల్‌లో మూడోవంతు కన్నా ఎక్కువ కలిగి ఉన్న సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ లిమిటెడ్, టాటా టెలిసర్వీసెస్, టాటా కమ్యూనికేషన్ వ్యాపారాలపై ఎక్కువ శ్రద్ధ చూపిందని, కానీ ప్రజా షేర్‌హోల్డర్స్, ప్రభుత్వం కలిగి ఉన్న వాటాదారుల విషయంలో మేజర్ 'మల్టి-ప్లాన్' కొనుగోళ్లను చేపడుతూ సంక్లిష్టతలు తీసుకురాకూడదని అనుకుంటున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. అయితే భారతీ బోర్డే ఈ మెగా విలీనాన్ని తిరస్కరించిందా? అనేది ఇంకా తెలియరాలేదు. లిస్టెడ్ కాని టాటా టెలిసర్వీసెస్, టాటా స్కై, లిస్టు అయిన టాటా కమ్యూనికేషన్లను భారతీ ఎయిర్‌టెల్‌తో విలీనం చేయాలని ఇరువైపుల చర్చలు జరిగాయని తెలిసింది. టాటా సన్స్ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్ పదవిలోకి వచ్చాక ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఎప్పడికప్పుడూ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నామని, కానీ ప్రస్తుతం ఏమీ లేనట్టు భారతీ ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. టాటా గ్రూప్ అధికార ప్రతినిధి దీనిపై స్పందించడానికి తిరస్కరించారు. మార్కెట్ రూమర్లపై తామేమీ కామెంట్ చేయమని సింగపూర్ టెలికమ్యూనికేషన్స్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. టాటా టెలీ ఎయిర్వేస్ను ఎయిర్టెల్ దక్కించుకోవాలంటే 1.7 బిలియన్ డాలర్లను అది చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్థిక ఒత్తిళ్లతో కొనసాగుతున్న ఈ సంస్థకు ఇది అతిపెద్ద సవాలని ఇండస్ట్రి అధికారులు చెప్పారు. నష్టాల్లో ఉన్న టెలికాం వ్యాపారాలను అతిపెద్ద కంపెనీలో కలుపడం టాటాలకు ఓ అవకాశంగా పేర్కొన్నారు. గత కొన్ని ఏళ్లుగా ఈ వ్యాపారాల నుంచి వైదొలగాలని టాటాలు చూస్తున్నారు. వొడాఫోన్తో కూడా చర్చలు జరిపారు. కానీ అవి సఫలం కాలేదు. ప్రస్తుతం చంద్రశేఖరన్ టాటా గ్రూప్ చైర్మన్‌గా వచ్చాక ఈ చర్చలకు తెరతీశారు. -
రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులు..
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ మిట్టల్, టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ, ఆదిత్య బిర్లా గ్రూప్ చీఫ్ కుమార మంగళం బిర్లా, విప్రో చైర్మన్ అజీం ప్రేమ్‌జీ, అడాగ్ చీఫ్ అనిల్ అంబానీ, ఎయిర్‌బస్ సీఈవో బెర్న్‌హార్డ్ గెర్వర్ట్ తదితర దేశ విదేశ దిగ్గజాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 18 లక్షల ఉద్యోగాల కల్పన జరిగేలా డిజిటల్ రంగంపై సుమారు రూ. 4.5 లక్షల కోట్ల పెట్టుబడులను ప్రకటించారు. వచ్చే ఐదేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు బిర్లా, రూ. లక్ష కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు మిట్టల్ తెలిపారు. డిజిటల్, క్లౌడ్, టెలికం తదితర రంగాల్లో రాబోయే కొన్నేళ్లలో రూ. 10,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు అనిల్ అంబానీ వివరించారు. వచ్చే ఐదేళ్లలో నెట్వర్క్ విస్తరణ, బ్రాడ్‌బ్యాండ్ తదితర విభాగాలపై 7 బిలియన్ డాలర్లు, డిజిటల్ ఇండియా ప్రాజెక్టుల కింద మరో 2 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు కుమార మంగళం బిర్లా వెల్లడించారు. డిజిటల్ ఇండియా వీక్‌కు సాంకేతికపరమైన తోడ్పాటు అందిస్తామని వీడియో సందేశంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తెలిపారు. తైవాన్ కంపెనీ డెల్టా ఎలక్ట్రానిక్స్ వర్గాలు 500 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించాయి. రూ. 2.5 లక్షల కోట్లు వెచ్చిస్తాం... ‘‘డిజిటల్ ఇండియా సాకారంలో భాగంగా మా సంస్థలు రూ.2.5 లక్షల కోట్లు పెట్టుబడి పెడతాయి. మౌలిక సదుపాయాల విషయానికొస్తే మేం ప్రపంచంలోనే అత్యుత్తమమైన తదుపరి తరం ఇంటర్నెట్ ప్రొటోకాల్‌ను దేశంలోని 29 రాష్ట్రాల్లోనూ ఆరంభిస్తున్నాం. లక్షన్నర మంది ఎలక్ట్రానిక్ రిటైలర్లు స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ పరికరాలు సర్వీసు చేసేలా రిలయన్స్ జియో ద్వారా దేశవ్యాప్త డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చే స్తాం. వీటిని ఇండియాలోనే తయారుచేసి అందుబాటు ధరలకు అందించేందుకు ప్రధాన తయారీదారులతో మాట్లాడుతున్నాం. ఇక ఈ-గవర్నెన్స్, ఈ-విద్య, ఈ-ఆరోగ్యం, స్మార్ట్ సిటీలు, గ్రామీణ డిజిటల్ సేవల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి పెట్టుబడి పెట్టడానికి సిద్ధం. కీలక నగరాలు, పట్టణాల్లో జియో డిజిటల్ ఇండియా స్టార్టప్ నిధిని ఏర్పాటు చేస్తాం. వీటన్నిటిద్వారా మేం 5 లక్షల మందికి ఉపాధి కల్పిస్తామనేది నా అంచనా’’ - ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి -
ప్రభుత్వ మద్దతు ఉంటేనే చైనాతో పోటీపడగలం
న్యూఢిల్లీ: దేశీ కంపెనీలు చైనా సంస్థలకు దీటుగా విదేశాల్లో విస్తరించాలంటే ప్రభుత్వ మద్దతు అవసరమని భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ చెప్పారు. చైనా కంపెనీలకు ఆ దేశ ప్రభుత్వ సహకారం ఉంటుందని ఆయన తెలిపారు. కానీ భారత్‌లోని కంపెనీలకు ఈ విషయంలో గతంలో ప్రభుత్వ మద్దతు అంతగా ఉండేది కాదని, కొత్త ప్రభుత్వమైనా దీనిపై దృష్టి పెట్టాలని మిట్టల్ సూచించారు. దేశీ పారిశ్రామికవేత్తలు విదేశాల్లో ఎక్కడికి వెళ్లినా చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. ఇండియా గ్లోబల్ ఫోరమ్‌లో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలపై తన అనుభవాలను పంచుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని కొత్త ప్రభుత్వం రాకతో పలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటున్నాయని, అయితే మరిన్ని చర్యలు అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. అటు ఆఫ్రికాలో భారత్‌పై సానుకూల అభిప్రాయం ఉందని, అయితే చైనా కంపెనీల స్థాయిలో భారతీయ కంపెనీలు ఇన్వెస్ట్ చేయలేవన్నారు. ఈ విషయంలో ప్రభుత్వ తోడ్పాటు అవసరమని ఆయన పేర్కొన్నారు. -
ఇండియాలో వాల్‌మార్ట్ మరో కొత్త కంపెనీ
న్యూఢిల్లీ: అత్యంత లాభదాయకమైన దేశీ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ సన్నాహాలు చేస్తోంది. ఇందుకు వాల్‌మార్ట్ ఇండియా ప్రైవేట్ పేరుతో కొత్త కంపెనీని ఏర్పాటు చేసింది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ వివరాల ప్రకారం వాల్‌మార్ట్ ఇండియాను ఈ నెల 15న రిజిస్టర్ చేసింది. రిటైల్ కార్యకలాపాలను మొదలుపెట్టేందుకు ఇక కొత్త భాగస్వామితో ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. కాగా, అమెరికాకు చెందిన ఈ దిగ్గజ సంస్థ క్యాష్ అండ్ క్యారీ(హోల్‌సేల్) విభాగంలో ఇప్పటికే దేశీయంగా భారతీ ఎంటర్‌ప్రైజెస్‌తో జటకట్టిన విషయం విదితమే. అయితే ఆరేళ్ల భాగస్వామ్యానికి తెరదించుతూ గత అక్టోబర్‌లో ఇవి విడిపోయాయి. -
వాల్‌మార్ట్ తప్పు చేయలేదు
న్యూఢిల్లీ: భారత్‌లో సూపర్ మార్కెట్ చైన్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌లో పెట్టుబడులకు సంబంధించి అమెరికా రిటైల్ దిగ్గజ కంపెనీ వాల్‌మార్ట్‌కు ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్(ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను వాల్‌మార్ట్ ఉల్లంఘించలేదని తేల్చింది. వాల్‌మార్ట్ భారత్‌లో పెట్టుబడుల విషయంలో ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేసిన తర్వాత ఈడీ ఈ నిర్థారణకు వచ్చింది. ప్రభుత్వం ఇటీవల సవరించిన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం(ఫెమా), బహుళ బ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్‌డీఐ నియంత్రణల మార్గదర్శకాలను వాల్‌మార్ట్ ఉల్లంఘించినట్లు రుజువుకాలేదని ఈడీ పేర్కొంది. ఆర్బీఐ నుంచి తాజా మార్గదర్శకాలు వస్తే తప్ప.. ఈ దర్యాప్తు విషయంలో ముందుకు వెళ్లేందుకు బలమైన ఆధారాలు లేవని దర్యాప్తు వర్గాలు తెలిపాయి. సీపీఐ ఎంపీ అచ్యుతన్ వాల్‌మార్ట్ పెట్టుబడులపై ఆరోపణలు చేస్తూ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాసిన తర్వాత ఈడీ రంగంలోకి దిగి దర్యాప్తు నిర్వహించింది. 2010లో వాల్‌మార్ట్ భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన సెడార్ సపోర్ట్ సర్వీసెస్‌లో కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్ల ద్వారా 10 కోట్ల డాలర్లను పెట్టుబడులుగా పెట్టిందని అచ్యుతన్ పేర్కొన్నారు. భారతీ సెడార్ ద్వారా ‘ఈజీ డే‘ పేరుతో బహుళ బ్రాండ్ల చిల్లర రిటైల్ స్టోర్లను నిర్వహిస్తోంది. ఈ పెట్టుబడులు అక్రమమని, ఈ నిధులను భారతీ సూపర్ మార్కెట్ల కోసం వినియోగిస్తోందని అచ్యుతన్ ఆరోపించారు. వాల్‌మార్ట్ పెట్టుబడుల సమయానికి బహుళబ్రాండ్ల చిల్లర వర్తకంలో ఎఫ్డీఐకు అనుమతి లేదు. దర్యాప్తులో తాను గుర్తించిన విషయాలను ఈడీ ఆర్బీఐకి నివేదించింది. భారతీ రిటైల్‌లో సెడార్ పెట్టుబడులు ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన ఆదేశాలు, నోటిఫికేషన్‌కు లోబడే ఉన్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఇక, సెడార్లో 10కోట్ల డాలర్ల కంపల్సరీ కన్వర్టబుల్ డిబెంచర్లను సరైన సమయంలో 49శాతం ఈక్విటీ కింద మార్చుకోనందుకు వాల్‌మార్ట్‌తోపాటు భారతీ ఎంటర్‌ప్రైజెస్‌కు ఆర్బీఐ జరిమానా విధించడం లేదా హెచ్చరించడం చేయవచ్చని చెప్పాయి. -
భాగస్వామ్య వ్యాపారానికి వాల్ మార్ట్, భారతీలు గుడ్ బై!
భారత రిటైల్ రంగంలో భారతీ ఎంటర్ ప్రైజెసెస్, వాల్ మార్ట్ స్టోర్స్ ఇంక్ ల భాగస్వామ్య వ్యాపారానికి తెరపడింది. తమ సంస్థలకు చెందిన వ్యాపార వ్యవహారాలను సొంతంగా నిర్వహించుకునేందుకు భారతీ, వాల్ మార్ట్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. రిటైల్ రంగ వ్యాపారంలో ఫ్రాంచైజీ ఒప్పందాన్ని రద్దు చేస్తూ.. భారత్ లో తమకు అనుకూలంగా ఉండే విధానంలో వ్యాపార కార్యక్రమాల్ని నిర్వహించుకునేందుకు ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఇరు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనలో తెలిపారు. అవగాహన ఒప్పందాలు, చెల్లింపులు, విధానాలకు సంబంధించిన అంశాలకు అమోదం లభించిన మేరకు ఒప్పందాలుంటాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. అన్ని రకాల వ్యవహారాలు పూర్తయిన తర్వాత భారతీ వాల్ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లోని భారతీ వాటాను వాల్ మార్ట్ సొంతం చేసుకుంటుంది అని..ఆతర్వాతే బెస్ట్ ప్రైస్ మోడర్న్ హోల్ సేల్ క్యాష్ అండ్ క్యారీ వ్యాపారంపై పూర్తి స్థాయి ఆజామాయిషీ లభిస్తుందని తెలిపారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలపై భారతీ ఎంటర్ ప్రైజెసెస్ వైస్ చైర్మన్, ఎండీ రంజన్ భారతీ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయికి తగ్గట్టూ రిటైల్ వ్యాపారాన్ని విస్తరిస్తాం అని తెలిపారు. ఇప్పటికే తమ సంస్థకు 212 స్టోర్లు ఉన్నాయని.. వ్యాపారాన్ని పెంచడానికి, వినియోగ దారులకు చేరువయ్యేందుకు అన్ని రకాల మార్గాలున్నాయన్నారు.