సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించిన నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదాని గ్రూపు ఎంట్రీతో తమకేమీ ఇబ్బంది లేదని, సంస్థకు ఎలాంటి నష్టం ఉందని మిట్టల్ పేర్కొన్నారు. 5జీ సేవల రేసులో పోటీదారులను తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే మూలధనం విషయంలో తాము జియోతో పోటీపడలేక పోయినా టెక్నాలజీ, 5జీ సేవల్లో మాత్రం తామే ముందు ఉంటామని పేర్కొన్నారు.
శుక్రవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ టుడే ‘ఇడియా ఎట్100 ఎకానమీ సమ్మిట్’ లో సునీల్ మిట్టల్ మాట్లాడారు. బడా పోటీదారులొచ్చినా 5జీ సేవల్లో ఎయిర్‌టెల్ అత్యుత్తమ సేవలందిస్తుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ రేసులో పోటీదారులను స్వాగతిస్తానన్నారు. అలాగే స్పెక్ట్రమ్ రేసులో అదానీ గ్రూప్‌నకు సేవ చేయడానికి ఇష్టపడతానన్నారు. తమ సాయం తీసుకోపోయినా ఫర్వాలేదు, కానీ తన అభిప్రాయం ప్రకారం.. అదానీ నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇతర పారిశ్రామిక అవసరాలకు తాము సేవలందిస్తాం. నిజానికి మరింత మెరుగ్గా చేయగలమని భావిస్తున్నామని మిట్టల్ వ్యాఖ్యానించారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు)
ఈ సందర్భంగా జర్మనీలో సొంత స్పెక్ట్రమ్ ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ వోడాఫోన్‌తో జతకట్టిందని గుర్తు చేశారు. సాంకేతికపరమైన సేవలందిస్తోంది. తామూ కూడా అలాగే అదానీ గ్రూపునకు చేయగలమని ఎయిర్‌టెల్ చైర్మన్ చెప్పారు. గత 25 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్న తాము..ఇప్పుడు డామినెంట్ పీపుల్ మార్కెట్‌లోకి వస్తారనే భయంతో మార్కెట్‌ప్లేస్ గెలవలేకపోతే, ఇక తమకు ఈ వ్యాపారంలో ఉండే హక్కు ఉండదని కూడా మిట్టల్ వ్యాఖ్యానించారు. మార్కెట్‌లో అత్యుత్తమ 5జీ సేవలందిస్తాం. మిగిలినవారు తమను ఫాలో అవుతారన్నారు. (Priyanka Chopra Jonas: భారీ ప్లాన్స్, నా బ్యూటీకి దేశీ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడతా)
టెలికాం మార్కెట్లో జియో ఆధిపత్యం గురించి మాట్లాడిన మిట్టల్, తమ క్యాపిటల్ జియోతో సరిపోలకపోవచ్చు, అయితే టెక్నాలజీ, సేవల పరంగా ఎయిర్‌టెల్ జియోకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచంలో స్పెక్ట్రమ్ వ్యాపారంలో కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకరు అమెరికా క్రెయిగ్ మెక్‌కావ్ అయితే, మరొకటి భారతి ఎయిర్‌టెల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టెలికాం వ్యాపారం డీప్ పాకెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమేనని ఆయన వివరించారు.
కాగా ఇటీవల జరిగిన 5జీవేలంలో 400 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలుతో అదానీ గ్రూప్ 5జీ రంగంలోకి ప్రవేశించింది. 26 GHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ కోసం 212 కోట్ల రూపాయలు వెచ్చించింది. తమ వ్యాపారాలను డిజిటల్‌గా ఏకీకృతం చేసి, డేటాసెంటర్లను లింక్ చేస్తామని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక క్లౌడ్ కార్యకలాపాలను నిర్మిస్తామని, 400 మిలియన్ల కస్టమర్ బేస్‌లో సేవలను అందించడానికి సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తామని అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment