Sunil Mittal
-
ప్రపంచ వృద్ధికి కీలకం.. ఏఐ
న్యూఢిల్లీ: రానున్న రోజుల్లో ప్రపంచ ఎకానమీ వృద్ధికి, భౌగోళిక రాజకీయాలకు కృత్రిమ మేథ (ఏఐ) కీలక చోదకశక్తిగా ఉంటుందని భావిస్తున్నట్లు భారతి గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ అభిప్రాయపడ్డారు. ఏఐని ఉపయోగించుకోలేని కంపెనీలు, దేశాలు వెనుకబడిపోతాయని వ్యాఖ్యానించారు. ‘‘ఈ కొత్త టెక్నాలజీలో మంచి, చెడూ రెండూ ఉన్నాయి. దీనితో కొత్త సవాళ్లు కూడా పొంచి ఉన్నాయి. ఇది దుర్వినియోగమయ్యే అవకాశాలు కూడా ఉన్నందున మరింత అప్రమత్తంగా వ్యవహరించాయి’’ అని చెప్పారాయన. ఈ సందర్భంగా తనకు ఎదురైన ఒక అనుభవాన్ని ఆయన తెలియజేస్తూ... ‘‘దుబాయ్‌లోని మా సీనియర్ ఫైనాన్షియల్ అధికారికి నా గొంతును అనుకరిస్తూ, భారీ మొత్తంలో నగదును ట్రాన్స్ఫర్ చేయాలంటూ ఒక ఫేక్ కాల్ వెళ్లింది. ఆ అధికారి అప్రమత్తంగా వ్యవహరించి, ఫ్రాడ్‌ను వెంటనే గుర్తించడంతో ముప్పు తప్పింది. ఆ వాయిస్ రికార్డింగ్ విన్నప్పుడు అది అచ్చం నా గొంతులాగే ఉండటం నన్ను ఆశ్చర్యపర్చింది‘ అని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఇందులోని మంచిని వాడుకోవాలని, చెడు కోణం వల్ల తలెత్తే దు్రష్పభావాల నుంచి సమాజాన్ని కాపాడుకోవాలని మిట్టల్ చెప్పారు. అయితే, మొత్తం మీద కృత్రిమ మేథతో ఒనగూరే ప్రయోజనాలపై తాను ఆశావహంగా ఉన్నట్లు ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. వ్యాపారాలపరంగా చూస్తే రొటీన్‌గా, పునరావృతమయ్యే విధులను నిర్వర్తించే ఉద్యోగాల్లో ఏఐ వల్ల కోత ఉంటోందని, కానీ వాటికి సమానంగా కొత్త ఉద్యోగాలు కూడా వస్తున్నాయని మిట్టల్ వివరించారు. కాల్ సెంటర్లు, వర్క్‌ఫోర్స్ మేనేజ్మెంట్ మొదలైన వాటిలో ఏఐతో గణనీయంగా మార్పులు వస్తున్నాయని తెలిపారు. కృత్రిమ మేథ రాకతో కొత్త ఆలోచనలు, కొత్త ఐడియాలు రాగలవని, వాటి నుంచి కొత్త వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని మిట్టల్ ధీమా వ్యక్తం చేశారు.ఆదాయం పెరగాలిదేశీయంగా టెలికం మౌలిక సదుపాయాలపై మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటే సగటున యూజర్లపై వచ్చే ఆదాయం (ఏఆర్పీయూ) ఇంకా పెరగాల్సి ఉంటుందని మిట్టల్ చెప్పారు. ఇటీవలి పెంపు తర్వాత 2.5 డాలర్ల స్థాయిలో స్థిరపడిన ఏఆర్పీయు 5 డాలర్లకు చేరాల్సి ఉంటుందన్నారు. మరోవైపు, ఎడారులు, అడవులతో నిండిపోయిన 25 శాతం భూభాగంలో ఉంటున్న 5 శాతం జనాభాకు ఇంకా ఇంటర్నెట్ కనెక్టివిటీ లేదని మిట్టల్ చెప్పారు. అలాంటి ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించేందుకు శాటిలైట్ కమ్యూనికేషన్ ఒక ’మ్యాజిక్ బులెట్’గా పనిచేస్తుందని పేర్కొన్నారు. ‘తయారీ’లో మరిన్ని ఆవిష్కరణలు రావాలి: భారత్ ఫోర్జ్ ఛైర్మన్ బాబా కల్యాణి 2047 నాటికి సంపన్న దేశంగా ఎదగాలని భారత్ నిర్దేశించుకున్న నేపథ్యంలో గణనీయంగా వృద్ధి సాధించాలంటే తయారీ రంగంలో కొత్త ఆవిష్కరణలు రావాల్సిన అవసరం ఉందని భారత్ ఫోర్జ్ చైర్మన్ బాబా కల్యాణి తెలిపారు. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెట్టాలంటే నవకల్పనలు అత్యంత కీలకమని, నూతన సాంకేతికతలను స్థానికంగా అభివృద్ధి చేస్తే పరిశ్రమకు దన్నుగా ఉంటుందని పేర్కొన్నారు. ‘విదేశాల్లో తయారైన వాటిని కాపీ కొట్టడం కాకుండా మనం కూడా టెక్నాలజీలో కొత్త ఆవిష్కరణలను రూపొందించాలి. ఇతర దేశాలు మన నుంచి కాపీ కొట్టేలా మన సొంత ఉత్పత్తులను తయారు చేయాలి‘ అని కల్యాణి చెప్పారు. ఏఐతో ఉత్పాదకత, సమర్ధత, ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడగలదన్నారు.వైద్య విధానాల్లో వినూత్నత: అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డివైద్యానికి సంబంధించి ప్రస్తుత టెక్నాలజీలను మరింత మందికి చేరువ చేసేందుకు వైద్య విధానాల్లో వినూత్నమైన ఆవిష్కరణలు అవసరమని అపోలో హాస్పిటల్స్ ఎండీ సునీత రెడ్డి చెప్పారు. విదేశీ అధ్యయనాలపై ఆధారపడకుండా దేశీయంగా ఫండమెంటల్ రీసెర్చ్ జరగాలని ఆమె పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధి, ఆరోగ్య సంరక్షణ మెరుగుపడాలంటే పరిశోధనలపై గణనీయంగా వెచ్చించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం జీడీపీలో ఒక్క శాతం కన్నా తక్కువే వెచ్చిస్తున్నామని సునీత రెడ్డి తెలిపారు. మరోవైపు, పరిశ్రమ అభివృద్ధి చెందాలంటే సంచలనాత్మక మార్పులు కీలకమని డీసీఎం శ్రీరామ్ సీఎండీ అజయ్ శ్రీరామ్ చెప్పారు. జనధన యోజన, ఆధార్, మొబైల్ (జామ్ ట్రినిటీ) వంటి ప్రభుత్వ కార్యక్రమాలు రైతులతో కనెక్టివిటీ మెరుగుపడేందుకు గణనీయంగా తోడ్పడ్డాయని పేర్కొన్నారు. వ్యవసాయ ముడిపదార్థాలు, పనిముట్లు రైతులకు అందుబాటులోకి ఉండేందుకు ఈ–కామర్స్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. -
Bharti Airtel: ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌ల పెంపు
బార్సెలోనా: ఈమధ్యే పలు దఫాలుగా ప్లాన్ల టారిఫ్‌లను పెంచిన టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ మరో విడత వడ్డింపునకు సిద్ధమవుతోంది. పెట్టుబడులపై రాబడులు అత్యంత తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది మధ్యలో టారిఫ్‌లను పెంచే అవకాశం ఉందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ తెలిపారు. దీనివల్ల అట్టడుగున ఉన్నవారిపై పడే ప్రభావంపై స్పందిస్తూ.. ప్రజలు మిగతా వాటిపై చేసే ఖర్చులతో పోలిస్తే పెంపు చాలా స్వల్పమే ఉంటుందని పేర్కొన్నారు. ‘ఒక్కటి తప్ప.. అన్నీ పెరిగాయి. జీతాలు .. అద్దెలు పెరిగాయి. ఎవరూ ఫిర్యాదు చేయడం లేదు. ప్రజలు 30 జీబీ డేటాను దాదాపు ఏమీ కట్టకుండానే వినియోగిస్తున్నారు. దేశంలో మరో వొడాఫోన్ తరహా పరిస్థితి తలెత్తకూడదు. మనకు ఒక భారీ టెలికం సంస్థ అవసరం‘ అని మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ చెప్పారు. కోటి మందికి ఎయిర్టెల్ 5జీ టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ కోటి మంది 5జీ చందాదార్లను సొంతం చేసుకుంది. 2024 మార్చి నాటికి దేశంలోని ప్రతి పట్టణం, ప్రధాన గ్రామీణ ప్రాంతాల్లో 5జీ సేవలను చేర్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సోమవారం ప్రకటించింది. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో అడుగుపెట్టినట్టు తెలిపింది. ప్రపంచ స్థాయి 5జీ ప్లస్ అనుభూతిని అందించడానికి సరైన మార్గంలో ఉన్నట్టు విశ్వసిస్తున్నామని సంస్థ సీటీవో రన్‌దీప్ సిఖోన్ తెలిపారు. 2022 నవంబర్‌లో 10 లక్షల మంది కస్టమర్లు కంపెనీ 5జీ వేదికపైకి వచ్చారు. వాణిజ్య పరంగా సేవలు ప్రారంభించిన 30 రోజుల్లోనే ఈ ఘనతను సాధించామని ఎయిర్టెల్ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లను 5జీ ఎక్స్‌పీరియెన్స్ జోన్స్‌గా తీర్చిదిద్దామని కంపెనీ వివరించింది. -
పేటీఎంపై సునీల్ మిట్టల్ కన్ను!
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్.. డిజిటల్ చెల్లింపుల సేవల్లోని పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై ఆసక్తితో ఉన్నట్టు తెలిసింది. ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతీ మిట్టల్.. పేమెంట్స్ బ్యాంక్‌ను పేటీఎం పేమెంట్స్ బ్యాంకులో విలీనం చేయడం ద్వారా వాటా పొందాలనుకుంటున్నట్టు.. అలాగే, పేటీఎంలో ప్రస్తుతం వాటాలు ఉన్న ఇతరుల నుంచి కొంత కొనుగోలు చేసేందుకు చర్చలు నిర్వహిస్తున్నట్టు ఈ వ్యవహారం తెలిసిన వర్గాలు వెల్లడించాయి. పేమెంట్ బ్యాంకుల్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ లాభాలతో నడుస్తోంది. కానీ, పేటీఎం మాత్రం నష్టాల్లో ఉన్న కంపెనీ. కాకపోతే గతేడాది రూ.2,150 ఐపీవో జారీ ధరతో పోలిస్తే పేటీఎం షేరు 75 శాతం వరకు నష్టపోయి ట్రేడ్ అవుతోంది. వ్యాల్యూషన్ల పరంగా చౌకగా ఉండడంతో భారతీ ఎయిర్టెల్ సునీల్ మిట్టల్‌కు ఆసక్తి ఏర్పడినట్టు తెలుస్తోంది. -
5జీ రేసు: అదానీ,జియోపై ఎయిర్టెల్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రమ్ దక్కించుకుని టెలికాం రంగంలోకి అదానీ గ్రూప్ ప్రవేశించిన నేపథ్యంలో ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదాని గ్రూపు ఎంట్రీతో తమకేమీ ఇబ్బంది లేదని, సంస్థకు ఎలాంటి నష్టం ఉందని మిట్టల్ పేర్కొన్నారు. 5జీ సేవల రేసులో పోటీదారులను తాను స్వాగతిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే మూలధనం విషయంలో తాము జియోతో పోటీపడలేక పోయినా టెక్నాలజీ, 5జీ సేవల్లో మాత్రం తామే ముందు ఉంటామని పేర్కొన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ టుడే ‘ఇడియా ఎట్100 ఎకానమీ సమ్మిట్’ లో సునీల్ మిట్టల్ మాట్లాడారు. బడా పోటీదారులొచ్చినా 5జీ సేవల్లో ఎయిర్టెల్ అత్యుత్తమ సేవలందిస్తుందనే విశ్వాసాన్ని ఆయన ప్రకటించారు. అంతేకాదు ఈ రేసులో పోటీదారులను స్వాగతిస్తానన్నారు. అలాగే స్పెక్ట్రమ్ రేసులో అదానీ గ్రూప్‌నకు సేవ చేయడానికి ఇష్టపడతానన్నారు. తమ సాయం తీసుకోపోయినా ఫర్వాలేదు, కానీ తన అభిప్రాయం ప్రకారం.. అదానీ నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, ఇతర పారిశ్రామిక అవసరాలకు తాము సేవలందిస్తాం. నిజానికి మరింత మెరుగ్గా చేయగలమని భావిస్తున్నామని మిట్టల్ వ్యాఖ్యానించారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) ఈ సందర్భంగా జర్మనీలో సొంత స్పెక్ట్రమ్ ఉన్నప్పటికీ బీఎండబ్ల్యూ వోడాఫోన్‌తో జతకట్టిందని గుర్తు చేశారు. సాంకేతికపరమైన సేవలందిస్తోంది. తామూ కూడా అలాగే అదానీ గ్రూపునకు చేయగలమని ఎయిర్టెల్ చైర్మన్ చెప్పారు. గత 25 ఏళ్లుగా టెలికాం రంగంలో ఉన్న తాము..ఇప్పుడు డామినెంట్ పీపుల్ మార్కెట్లోకి వస్తారనే భయంతో మార్కెట్‌ప్లేస్ గెలవలేకపోతే, ఇక తమకు ఈ వ్యాపారంలో ఉండే హక్కు ఉండదని కూడా మిట్టల్ వ్యాఖ్యానించారు. మార్కెట్లో అత్యుత్తమ 5జీ సేవలందిస్తాం. మిగిలినవారు తమను ఫాలో అవుతారన్నారు. (Priyanka Chopra Jonas: భారీ ప్లాన్స్, నా బ్యూటీకి దేశీ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడతా) టెలికాం మార్కెట్లో జియో ఆధిపత్యం గురించి మాట్లాడిన మిట్టల్, తమ క్యాపిటల్ జియోతో సరిపోలకపోవచ్చు, అయితే టెక్నాలజీ, సేవల పరంగా ఎయిర్టెల్ జియోకు గట్టి పోటీ ఇస్తుందన్నారు. అంతేకాదు ప్రస్తుతం ప్రపంచంలో స్పెక్ట్రమ్ వ్యాపారంలో కేవలం ఇద్దరం మాత్రమే ఉన్నాం. ఒకరు అమెరికా క్రెయిగ్ మెక్కావ్ అయితే, మరొకటి భారతి ఎయిర్టెల్ అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం టెలికాం వ్యాపారం డీప్ పాకెట్ ఉన్న వ్యక్తులకు మాత్రమేనని ఆయన వివరించారు. కాగా ఇటీవల జరిగిన 5జీవేలంలో 400 MHz స్పెక్ట్రమ్‌ను కొనుగోలుతో అదానీ గ్రూప్ 5జీ రంగంలోకి ప్రవేశించింది. 26 GHz బ్యాండ్‌లో స్పెక్ట్రమ్ కోసం 212 కోట్ల రూపాయలు వెచ్చించింది. తమ వ్యాపారాలను డిజిటల్‌గా ఏకీకృతం చేసి, డేటాసెంటర్లను లింక్ చేస్తామని, ప్రపంచ వ్యాప్తంగా అతిపెద్ద పారిశ్రామిక క్లౌడ్ కార్యకలాపాలను నిర్మిస్తామని, 400 మిలియన్ల కస్టమర్ బేస్‌లో సేవలను అందించడానికి సూపర్ యాప్‌ను అభివృద్ధి చేస్తామని అదానీ వెల్లడించిన సంగతి తెలిసిందే. -
భారతీ టెలికంకు సింగ్టెల్ వాటా
న్యూఢిల్లీ: ప్రమోటర్ భారతీ టెలికం.. కంపెనీలో సింగ్‌టెల్‌కు గల 3.33 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మొబైల్ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తాజాగా పేర్కొంది. మాతృ సంస్థ భారతీ టెలికం ఈ వాటాను 90 రోజుల్లోగా సొంతం చేసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఇందుకు 2.25 బిలియన్ సింగపూర్ డాలర్ల(రూ. 12,895 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. కాగా.. భారతీ టెలికంలో భారతీ గ్రూప్ చైర్మన్ సునీల్ మిట్టల్ కుటుంబంతోపాటు, సింగ్టెల్ సైతం ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లావాదేవీ తదుపరి భారతీ ఎయిర్‌టెల్‌లో సింగ్టెల్ గ్రూప్ వాటా 29.7 శాతానికి చేరనుంది. రెండు సంస్థల మధ్య ఈ లావాదేవీ పూర్తయ్యాక ఎయిర్‌టెల్‌లో భారతీ టెలికం ప్రధాన వాటాదారుగా కొనసాగనున్నట్లు సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. -
నా 30 ఏళ్ల అనుభవంలో తొలిసారి: ఎయిర్టెల్ చైర్మన్ ఆశ్చర్యం, ప్రశంసలు
సాక్షి,ముంబై: 5జీ స్పెక్ట్రం కొనుగోలుకు సంబంధించి ఎయిర్టెల్ ముందస్తు చెల్లింపులు చేసిన కొన్ని గంటల్లోనే సంబంధిత స్పెక్ట్రమ్‌ను సంస్థకు కేటాయించడం విశేషంగా నిలిచింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వేగంగా స్పందించినతీరుపై ఎయిర్టెల్ వ్యవస్థాపకుడు, చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ప్రశంసలు కురిపించారు. ఊహించిన దానికంటే ముందుగానే 4జీతో పోలిస్తే 10 రెట్ల వేగంగో 5జీ సేవలు దేశంలో అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఆ మేరకు ఆయన ట్విటర్లో ఒక ప్రకటన విడుదల చేశారు ఎయిర్ టెల్ చెల్లింపులు చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 5జీ స్పెక్ట్రం కేటాయించినట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం నుంచి లేఖ అందిందని ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ భారతి మిట్టల్ సంతోషం ప్రకటించారు. నిర్ణీత ఫ్రీక్వెన్సీ బ్యాండ్ల కేటాయింపు లేఖ చేతికందిందని, ఇచ్చిన హామీ మేరకు స్పెక్ట్రమ్‌తోపాటు ఇ బ్యాండ్ కేటాయింపులు జరిగాయని వెల్లడించారు. బహుశా చెల్లింపులు జరిపిన రోజే ఇలా లేఖ అందడం ఆశ్చర్యం కలిగించిందనీ, చరిత్రలో తొలిసారి అని పేర్కొన్నారు. తన 30 అనుభవంలో తొలిసారి ఇలా జరిగిందంటూ ఉబ్బితబ్బిబ్బవుతునన్నారు. ఎలాంటి గందరగోళం, వివరాల ఆరాలు, ఆఫీసుల చుట్టూ తిరగడాలు ఈ బాదర బందీ ఏమీ లేకుండానే ఇది సాధ్యమైందని తెలిపారు. ఇదంతా టెలికాం శాఖ నాయకత్వ కృషి అని, ఈజీ బిజినెస్‌కు ఇది నిదర్శనమన్నారు. ప్రస్తుతం ఈ మార్పే అవసరమని ఇదే మనదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారడానికి ఇంధనంగా తోడ్పడు తుందంటూ మిట్టల్ అభిప్రాయపడ్డారు. Ready to lead India into the next generation of connectivity. #Airtel5G pic.twitter.com/deFlNWlZcC — Bharti Airtel (@airtelnews) August 18, 2022 టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు స్పెక్ట్రమ్ కేటాయింపు లేఖలను జారీ చేసినట్లు ప్రభుత్వం గురువారం తెలిపింది, ఎయిర్టెల్ ఈ నెలాఖరులో 5జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది.షెడ్యూల్ కంటే 4 సంవత్సరాల ముందుగానే బకాయిలను చెల్లించిందని కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ కూ ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేసారు. "5G అప్డేట్: స్పెక్ట్రమ్ అసైన్మెంట్ లెటర్ జారీ చేశాం. 5G లాంచ్‌కు సిద్ధం కావాలని సర్వీసు ప్రొవైడర్లను అభ్యర్థిస్తున్నాను" అని పేర్కొన్నారు. కాగా 5జీ స్పెక్ట్రమ్ బకాయిల కోసం టెలికాం కంపెనీలు రూ.17,873 కోట్లకు పైగా చెల్లించాయి. ఇందులో దాదాపు సగం నాలుగేళ్లకు చెందిన ముందస్తు చెల్లింపులు రూ. 8,312.4 కోట్లు భారతీ ఎయిర్టెల్ చెల్లించింది. -
5జీ మాయాజాలం: ఎయిర్టెల్ వర్సెస్ జియో..వెయ్యి నగరాల్లో!
దేశంలో 5జీ సేవల్ని వినియోగదారులకు అందించేందుకు విషయంలో ఎయిర్టెల్, జియో సంస్థల మధ్య పోటీ నెలకొంది. ఇప్పటికే మిగిలిన సంస్థ కంటే ముందుగా భారత్‌లో 5జీ టెస్ట్‌లు నిర్వహించిన ఎయిర్టెల్..అదే స్పీడుతో 5జీ సర్వీసుల్ని అందించేందుకు సిద్ధమైంది. జియో సైతం 5జీ సేవల్ని అందించనున్నట్లు ప్రకటించింది. ఆగస్ట్‌లోనే 5జీ సేవల్ని ప్రారంభించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఇందుకోసం టెలికాం పరికరాల తయారీ కంపెనీలైన ఎరిక్సన్, నోకియా, శామ్ సంగ్‌తో ఒప్పందం చేసుకుంది. ఈ నేపథ్యంలో ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో సైతం 5జీ సేవల్ని అందుబాటులో తేవడంతో అదే టెక్నాలజీ సాయంతో హెల్త్ కేర్, ఇండస్ట్రీయల్ ఆటోమెషిన్ రంగాల్లో సైతం వినియోగించేలా అభివృద్ధి చేస్తున్నట్లు ముఖేష్ అంబానీ వెల్లడించారు. రిలయన్స్ వార్షిక (క్యూ1) ఫలితాలు విడుదల నేపథ్యంలో 5జీ సేవలపై ముఖేష్ అంబానీ మాట్లాడారు. రిలయన్స్ జియో దేశ వ్యాప్తంగా 1000 నగరాల్లో 4జీ కంటే 10 రెట్ల వేగంతో పనిచేసే 5జీ నెట్ వర్క్ సేవల్ని వినియోగంలోకి తెస్తున్నట్లు చెప్పారు. 5జీని ఒక్క టెలికం రంగానికి పరిమితం చేయకుండా హెల్త్ కేర్, ఇండస్ట్రీయల్ ఆటోమెషిన్ రంగాల్లో సైతం వినియోగించేలా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందు కోసం అన్నీ నగరాల్లో రూట్ లెవల్ నుంచి 5జీ నెట్ వర్క్ కావాల్సిన అన్నీ ఎక్విప్మెంట్ను (హోంగ్రోన్ టెక్నాలజీ) తయారు చేస్తూ..వినియోగా దారుల అవసరాల్ని తీర్చేలా ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించడమే కాకుండా, జియో ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ, తక్కువ నెట్ కనెక్టివీటీ (లో లేటెన్సీ) క్లౌడ్ గేమింగ్, వీడియో డెలివరీ కోసం మల్టీ టెన్సీ, టీవీ స్ట్రీమింగ్, ఇండస్ట్రియల్ యాప్స్ వరకు ఇలా అన్నీ విభాగాల్లో 5జీ వినియోగం సాధ్యా సాధ్యాలను పరిశీలించనుంది. గూగుల్‌తో ఒప్పందం జియో తన క్లౌడ్ సొల్యూషన్ల కోసం గూగుల్‌తో చేతులు కలిపింది. 5జీతో పాటు 6జీ ( నెక్ట్స్ టెలికాం టెక్నాలజీ)లో పరిశోధన, అంచనాను వేగవంతం చేసేలా ఫిన్లాండ్లోని ఔలు యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. చదవండి👉 5జీ నెట్ వర్క్‌కు సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్లు ఇవే! -
ఎయిర్టెల్ చీఫ్ మిట్టల్ ప్యాకేజీ తగ్గింపు.. ఎంతంటే
న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2021–22) సంబంధించి టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ప్యాకేజీ 5 శాతం తగ్గింది. రూ. 15.39 కోట్లకు పరిమితం అయ్యింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరంలో ఇది రూ. 16.19 కోట్లుగా నమోదైంది. గత రెండేళ్లుగా ఆయన జీతాలు, ప్రోత్సాహకాలు యథాప్రకారంగానే ఉన్నప్పటికీ ..హోదాపరంగా లభించే కొన్ని ప్రయోజనాల విలువ కొంత తగ్గడమే మిట్టల్ ప్యాకేజీలో తగ్గుదలకు కారణం. 2020–21లో వీటి విలువ రూ. 1.62 కోట్లుగా ఉండగా తాజాగా ఇది రూ. 83 లక్షలకు పరిమితమైంది. -
నేను చెప్తున్నాగా! ఎయిర్టెల్ భవిష్యత్తు బ్రహ్మాండం!
న్యూఢిల్లీ: యుద్ధాలతో రాటుదేలిన తమ సంస్థ భవిష్యత్ బాగుంటుందని టెలికం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ ధీమా ధీమా వ్యక్తం చేశారు. నియంత్రణ సంస్థలపరమైన సవాళ్లు, మార్కెట్లో తీవ్ర పోటీ వంటి అనేక ఎత్తుపల్లాలను చూసిన ఎయిర్టెల్ ప్రస్తుతం పటిష్ట స్థితిలో ఉందని ఆయన చెప్పారు. ‘దేశీయంగా టెలికం రంగంలో ప్రస్తుతం రెండున్నర సంస్థలు మాత్రమే మిగిలాయి. ఇక భవిష్యత్ బాగానే ఉండేలా కనిపిస్తోంది. మరో సంక్షోభం ఏదైనా వస్తుందా రాదా అంటే ఏమో ఎవరు చెప్పగలరు? అయితే, మా కంపెనీ యుద్ధాలతో రాటుదేలి చాలా పటిష్టంగా మారింది‘ అని పరిశ్రమల సమాఖ్య సీఐఐ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మిట్టల్ వివరించారు. ఈ సందర్భంగా 2002–2003 మధ్య ఎయిర్టెల్ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను గుర్తుచేసుకున్నారు. ఒకానొక దశలో కంపెనీ కుప్పకూలిపోవడం ఖాయమనే భావన నెలకొందని పేర్కొన్నారు. ‘మేము దేశవ్యాప్తంగా సేవలను భారీగా విస్తరించడంపై దృష్టి పెట్టిన దశలో మా మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. చేతిలో డబ్బు వేగంగా కరిగిపోతోంది ఆదాయాలు పెరగడం లేదు. కొన్నాళ్ల క్రితమే రూ. 45 దగ్గర లిస్టయిన షేరు ధర రూ.19కి పడిపోయింది. ఓడలో పగుళ్లు ఏర్పడుతున్నాయి. ఏది చేసినా కలిసి రావడం లేదు. అలాంటప్పుడు సరైన వ్యూహం, సరైన టెక్నాలజీ ఉంటే కచ్చితంగా గెలుపు మాదే అవుతుందనే నమ్మకంతో ముందుకెళ్లాం. అదే ఫలితాలనిచ్చింది. 18 నెలల్లోనే షేరు రూ.19 నుంచి ఏకంగా రూ.1,200కు ఎగిసింది‘ అని మిట్టల్ వివరించారు. 2008–09లో కొత్తగా 12 సంస్థలు టెలికం లైసెన్సులు పొందినప్పుడు కూడా గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. కానీ తాము ఈసారి సిద్ధంగా ఉండి, దీటుగా ఎదుర్కొనగలిగామని మిట్టల్ పేర్కొన్నారు. -
శాటిలైట్ ఇంటర్నెట్ కోసం ఇస్రోతో వన్ వెబ్ కీలక ఒప్పందం
ప్రపంచంలో పెనుమార్పులు తీసుకురానున్న యుకె ఆధారిత గ్లోబల్ కమ్యూనికేషన్ శాటిలైట్ ప్రొవైడర్ వన్ వెబ్ సంస్థలో భారతి ఎయిర్టెల్ భారీగా వాటాను కొనుగోలు చేసిన మనకు తెలిసిందే. వన్ వెబ్ సంస్థ చేపట్టిన ప్రాజెక్టు విజయవంతమైతే ఇంటర్నెట్ కొత్త దశలోకి అడుగుపెడుతుంది. ఇక ఈ భూగోళం మీద ఎక్కడైనా ఆన్లైన్ సేవలు అందుకోవచ్చు. మారుమూల ప్రాంతాలకు.. కనీస రవాణా సౌకర్యాలు లేని ప్రదేశాల్లోని వారు కూడా ఇంటర్నెట్ను వినియోగించే అవకాశం ఉంటుంది. ఎటువంటి ప్రకృతి విపత్తులు వచ్చినా సేవలు నిలిచిపోయే సమస్య రాదు. అటువంటి వన్ వెబ్ ప్రాజెక్టు ఉపగ్రహాలను అంతరిక్ష కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం భారత అంతరిక్ష సంస్థ ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం గురుంచి భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ తెలిపారు. "భారత నేల నుంచి వన్ వెబ్ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మేము(వన్ వెబ్) ఇస్రోతో ఒప్పందం చేసుకున్నాము. ఈ రోజు ఈ ఒప్పందం గురుంచి మీ అందరితో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను" అని సునీల్ మిట్టల్ చెప్పారు. అసలు ఏమిటి వన్ వెబ్ ప్రాజెక్టు ఇప్పటి వరకు ప్రపంచంలో అన్నీ ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం కేబుల్స్ వేయడం, టవర్లు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని. అందుకే నేరుగా ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సేవలు అందించనున్నారు. ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించడం కోసం వన్ వెబ్ ప్రాజెక్టు పేరుతో లండన్ కేంద్రంగా 2012లో జార్జివేలర్ అనే వ్యక్తి స్థాపించాడు. అయితే, ఆ కంపెనీ దివాళా తీసే సమయంలో మన దేశ దిగ్గజ టెలికామ్ కంపెనీ, యుకె ప్రభుత్వం అందులో భారీ వాటాను దక్కించుకున్నాయి. (చదవండి: ఎంజీ ఆస్టార్ వచ్చేసింది. ధర ఎంతంటే?) ఇప్పుడు ఆ ప్రాజెక్టు శర వేగంగా దూసుకెళ్తుంది. ఈ ప్రాజెక్టులో భాగంగానే తొలి దశలో 150 కిలోల బరువున్న 650 ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఇప్పటికే 322 ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరుకొన్నాయి. రెండో దశలో దాదాపు 1900కి పైగా ఉపగ్రహాలను ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహాలను ఫ్లోరిడాలోని ఒక కంపెనీ తయారు చేస్తోంది. ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్ స్పేస్ కంపెనీ రష్యా సోయజ్ రాకెట్ల సాయంతో ఇప్పటి వరకు అంతరిక్షంలోకి పంపించేవారు. కానీ, ఇప్పుడు ఈ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టడం కోసం ఇస్రోతో వన్ వెబ్ ఒప్పందం చేసుకుంది. ఈ చిన్న ఉపగ్రహాలు గంటకు 27వేల కిలోమీటర్ల వేగంతో ప్రయాణించి భూభ్రమణాన్ని 90-120 నిమిషాల్లో పూర్తి చేస్తాయి. వన్ వెబ్ కీ పోటీగా స్పేస్ ఎక్స్ స్టార్ లింకు ప్రాజెక్టు దూసుకెళ్తుంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా ప్రారంభించింది. -
సునీల్ మిట్టల్ ప్రయత్నాలు.. ఏకతాటిపైకి టెల్కోలు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో కేంద్రం భారీ సంస్కరణలు ప్రకటించిన నేపథ్యంలో భారత డిజిటల్ లక్ష్యాలను సాకారం చేసేందుకు టెల్కోలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చేందుకు భారతి ఎయిర్టెల్ చీఫ్ సునీల్ మిట్టల్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వొడాఫోన్ గ్రూప్ సీఈవో నిక్ రీడ్‌తో మాట్లాడినట్లు గురువారం ఆయన తెలిపారు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీతో కూడా మాట్లాడనున్నట్లు మిట్టల్ వెల్లడించారు. టెల్కోలు కుమ్మక్కయ్యే అవకాశాలను గట్టిగా తోసిపుచ్చారు. పరిశ్రమ పరిస్థితులు, మార్కెట్ పంపిణీ వ్యవస్థ వంటి అంశాలపైనే తాము చర్చిస్తామని, టారిఫ్‌ల గురించి ప్రస్తావన ఉండదని మిట్టల్ చెప్పారు. కాగా, టెలికం టారిఫ్‌లు మరింత పెరగాల్సిన అవసరం ఉందని ఒక వర్చువల్ సమావేశంలో మిట్టల్ తెలిపారు. -
టారిఫ్‌లు పెరిగితేనే టెల్కోలకు మనుగడ
న్యూఢిల్లీ: టెలికం రంగంపై పన్నుల భారం భారీగా ఉంటోందని, టెల్కోలకు వచ్చే ఆదాయంలో ఏకంగా 35 శాతం ట్యాక్సులు.. సుంకాలకే పోతోందని దిగ్గజ టెల్కో భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. వీటికి తోడు ఏజీఆర్‌పరమైన (సవరించిన స్థూల ఆదాయం) బాకీలు, స్పెక్ట్రం చెల్లింపుల భారాలతో టెల్కోలు కుదేలవుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో టెలికం సంస్థలు మనుగడ సాగించాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పన్నుల మోతను తగ్గించి పరిశ్రమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ. 21,000 కోట్ల నిధుల సమీకరణకు సంబంధించి ఇన్వెస్టర్లతో నిర్వహించిన సమావేశంలో మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. ‘నెలకు ఒక్కో యూజరు సగటున 16 జీబీ డేటా వినియోగిస్తున్నారు. పరిశ్రమ లాభసాటిగా మారాలంటే టారిఫ్‌లు పెరగాల్సిన పరిస్థితి ఉంది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అమలు చేయాలన్నా, నెట్‌వర్క్‌లు విస్తరించాలన్నా పెట్టుబడులపై సముచిత రాబడులు వస్తేనే సాధ్యం. టారిఫ్‌లు పెంచాల్సి వస్తే ఎయిర్టెల్ వెనక్కి తగ్గబోదు. (చౌక టారిఫ్‌ల విషయంలో) మా ఓపిక నశించిందనడానికి ఇటీవల మేము రేట్లు పెంచడమే నిదర్శనం‘ అని మిట్టల్ పేర్కొన్నారు. అయితే, మార్కెట్లో ఇతర సంస్థలు కూడా ఉన్నప్పుడు నిర్దిష్ట స్థాయి దాకా మాత్రమే పెంచగలమని, పరిమితి దాటితే నష్టపోయే ప్రమాదమూ ఉందని ఆయన తెలిపారు. ‘పరిశ్రమ మనుగడ సాగించాలంటే ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ ఏఆర్పీయూ (ప్రతి యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ. 200 స్థాయికి చేరాలి. ఆ తర్వాత క్రమంగా రూ. 300కి చేరాలి. అప్పుడు కస్టమర్లకు టన్నుల కొద్దీ డేటా, సంగీతం, వినోదం.. అన్నీ ఇవ్వడానికి వీలవుతుంది‘ అని మిట్టల్ చెప్పారు. -
వారికోసం సరికొత్త ప్లాన్లను ప్రకటించిన ఎయిర్టెల్..!
ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్ పలు దిగ్గజ ఐటీ కంపెనీలతో జత కట్టనుంది. గూగుల్ క్లౌడ్, సిస్కో కంపెనీల భాగస్వామ్యంతో ‘ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్’ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను ఎయిర్టెల్ లాంచ్ చేసింది. అభివృద్ధి చెందుతున్న చిన్న వ్యాపార సంస్థల కోసం, ప్రారంభ దశలో ఉన్న టెక్ స్టార్టప్ కంపెనీల డిజిటల్ కనెక్టివిటీ అవసరాల కోసం ఏకీకృత ఎంటర్ప్రైజ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్టెల్ ప్రకటించింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ధరలు రూ. 999 నుంచి ప్రారంభమవ్వనున్నాయి. ఎయిర్టెల్ ఇంటర్నెట్ సేవల్లో భాగంగా అనేక రకాల యాడ్ ఆన్ సేవలను కూడా పొందవచ్చును. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అందిపుచ్చుకోవడానికి ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ ఎంతగానో ఉపయోగపడనుందని కంపెనీ చైర్మన్ సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్లు ‘వన్ ప్లాన్, వన్ బిల్’తో ఏకీకృత పరిష్కారాలను చూపిస్తోందని వెల్లడించారు. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్ సేవలు... ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా వ్యాపార సంస్థలకు, టెక్ స్టార్టప్ కంపెనీలకు అపరిమిత లోకల్/ఎస్టీడీ కాలింగ్‌తో పాటు 1జీబీపీఎస్ వరకు అధిక వేగంతో ఎఫ్టీటీహెచ్ బ్రాడ్‌బ్యాండ్ సేవలను ఇవ్వనుంది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ ప్లాన్‌లో భాగంగా గూగుల్ వర్క్‌స్పేస్ లైసెన్స్‌ను, డీఎన్ఎస్ సెక్యూరిటీ బై సిస్కో, ఫ్రీ ప్యారలల్ రింగింగ్ సర్వీసులను ఎయిర్టెల్ అందిస్తోంది. హానికరమైన, అవాంఛిత డొమైన్లు, వైరస్లు, సైబర్‌దాడుల నుంచి ఆయా వ్యాపార సంస్థలకు భద్రతను సిస్కో, కాస్పర్‌స్కై అందించనున్నాయి. ఎయిర్ తన కస్టమర్ల భద్రత కోసం కొద్ది రోజుల క్రితమే కాస్పర్స్కైతో చేతులను కలిపింది. ఎయిర్టెల్ ఆఫీస్ ఇంటర్నెట్ హెచ్డీ నాణ్యతతో అపరిమిత, సురక్షితమైన కాన్ఫరెన్సింగ్ వీడియో కాలింగ్ కోసం ఉచితంగా ఎయిర్టెల్ బ్లూజీన్స్ లైసెన్స్‌ను కూడా ఎయిర్టెల్ అందిస్తోంది. -
మొబైల్ రీఛార్జ్... మోత తప్పదా ?
న్యూఢిల్లీ: టెలికం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ అన్నారు. టారిఫ్‌లు పెరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎయిర్టెల్ వెనుకంజ వేయబోదని పేర్కొన్నారు. అయితే ఇది ఏకపక్షంగా చేయలేమని వెల్లడించారు. ఒకరినొకరు... టెలికం టారిఫ్‌లపై సునీల్ మిట్టల్ మాట్లాడుతూ... ‘ఒకరినొకరు చంపడం ఎంతకాలం కొనసాగించగలరు. చాలా కంపెనీలు ఇబ్బందులు పడుతున్నాయి. టారిఫ్‌లను పెంచడం ఎల్లప్పుడూ చెడ్డదిగా అనిపిస్తుంది. గతంలో ఉన్న స్థాయికి తిరిగి తీసుకురండి. ప్రభుత్వం, అధికారులు, టెలికం శాఖ ప్రస్తుత సమస్యపై దృష్టిసారించాలి. భారత డిజిటల్ కల చెక్కుచెదరకుండా చూసుకోవాలి. భారతి ఎయిర్టెల్ ఈక్విటీ మరియు బాండ్ల ద్వారా సమయానుసారంగా తగినంతగా నిధులను సేకరించింది. రాబోయే సంవత్సరాల్లో మార్కెట్‌కు సేవ చేయడానికి కంపెనీ బలంగా ఉంది’ అని వివరించారు. చదవండి : గుడ్ న్యూస్: ఉచితంగా మైక్రోసాఫ్ట్ పీడీఎఫ్ మేనేజర్ సాఫ్ట్వేర్ -
నెలకు 1.6 జీబీ మాత్రమే : లేదంటే మోతే!
సాక్షి, ముంబై: రానున్న కాలంలో మొబైల్ సేవల చార్జీల మోత మోగనుంది. టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ఈ సంకేతాలను సోమవారం వెల్లడించారు. రాబోయే ఆరు నెలల్లో మొబైల్ సేవల ధరల పెరగనున్నాయంటూ ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ చెప్పారు. తక్కువ రేటుతో డేటా సేవలను అందించడం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. తక్కువ ధరకు డేటా ఇవ్వడం వల్ల టెలికాం పరిశ్రమ మనుగడ ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఉందని మిట్టల్ అందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు 160 రూపాయలకే నెలకు 16జీబీ డేటా ఇవ్వడం బాధాకరం అన్నారు. (చదవండి : క్రికెట్ ప్రియులకు జియో బంపర్ ఆఫర్) నెలకు1.6 జీబీ వినియోగానికి అలవాటు పడాలి లేదా ప్రస్తుతం చెల్లిస్తున్న దానికంటే చాలా ఎక్కువ చెల్లించడానికి సిద్ధం కావాల్సిందేనని మిట్టల్ వ్యాఖ్యానించారు. అమెరికా యూరప్ లో లాగా 50-60 డాలర్లు కాకపోయినా, ఖచ్చితంగా నెలకు 160 రూపాయలకు 16జీబీ వినియోగం మాత్రం ఒక విషాదమే అని తేల్చి చెప్పారు. ఆరు నెలల కాలంలో యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్(ఏఆర్పీయూ) 200 రూపాయలు దాటొచ్చని అంచనా వేశారు. భారతీ ఎంటర్ ప్రైజెస్ ఎగ్జిక్యూటివ్ అఖిల్ గుప్తా రాసిన పుస్తకం విడుదల సందర్భంగా మిట్టల్ ఈ వ్యాఖ్యలు చేశారు. డేటా కోసం అయితే 100 సరిపోతుంది కానీ టీవీ, మూవీస్, ఎంటర్ టైన్ మెంట్ లాంటి చూడాలంటే మాత్రం వాటికి కస్టమర్ కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. తమకు 300 ఏఆర్పీయూ కావాల్సిందేనని మిట్టల్ పేర్కొన్నారు. మిట్టల్ సూచించిన లెక్కల ప్రకారం ఏఆర్పీయూ 60శాతం పెరిగితే మంచిది. కనీసం 27శాతం పెరగాలి. ప్రస్తుతం ఒక జీబీకి చెల్లిస్తున్న10 రూపాయలకు బదులుగా భవిష్యత్తులో100 రూపాయలు చెల్లించాలి. అలాగే నెలకు 45 రూపాయలు చెల్లిస్తున్న వారు రెట్టింపు కంటే ఎక్కువగా 100 రూపాయలు చెల్లించాలి. కష్ట కాలంలో కూడా టెలికాం ఆపరేటర్లు దేశానికి సేవ చేశారని, అలాగే 5జీ, ఆప్టికల్ ఫైబర్స్, సబ్ మెరైన్ కేబుల్స్ లో పెట్టుబడులు పెట్టాల్సి ఉందని మిట్టల్ వెల్లడించారు. కేవలం 2-3 ఆపరేటర్లతో సంక్షోభంలో పడిన పరిశ్రమ స్థిరంగా కొనసాగాలంటే రాబోయే 5-6 నెలల్లో ఖచ్చితంగా 200-250 మార్కును దాటాల్సిందేనని మిట్టల్ వెల్లడించారు. టెలికాం వ్యాపారం డిజిటల్ బాట పట్టాల్సిన అవసరం ఉందన్నారు. కాగా డిసెంబర్ 2019లో టారిఫ్ పెంచిన అనంతరం జూన్ 30 నాటికి తొలి క్వార్టర్ లో ఎయిర్ టెల్ ఏఆర్పీయూ రూ.157కి పెరగడం గమనార్హం. -
పన్నుల విధానాన్ని సమీక్షించాలి: సునీల్ మిట్టల్
ముంబై: దేశీయ టెలికాం రంగం పుంజుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం పన్ను విధానాలను సమీక్షించాలని మొబైల్ దిగ్గజం భారతి ఏయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ శుక్రవారం తెలిపారు. టెలికాం రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఆయన వెబ్ కాన్పరెన్స్ సమావేశంలో మాట్లాడుతూ.. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికాం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు చేపట్టాలని సూచించారు. టెలికాం రంగం మూలధన కొరత తదితర సమస్యలను ఎదుర్కొంటుందని అన్నారు. మరోవైపు టెలికాం రంగాన్ని ఆధునికరించడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని పేర్కొన్నారు. -
టెలికంలో అసాధారణ సంక్షోభం..
న్యూఢిల్లీ: సవరించిన స్థూల ఆదాయాల (ఏజీఆర్) ప్రాతిపదికన టెల్కోలు భారీ బకాయిలు కట్టాల్సి రావడం .. టెలికం పరిశ్రమలో గతంలో ఎన్నడూ చూడని విధంగా, అసాధారణ సంక్షోభం తలెత్తిందని భారతి ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్ వ్యాఖ్యానించారు. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం బాకీలను కట్టేందుకు తాము కట్టుబడి ఉన్నామని, సాధ్యమైనంత త్వరగా మిగతా చెల్లింపులు జరుపుతామని ఆయన చెప్పారు. తమకు మార్చి 17 దాకా సమయం ఉన్నప్పటికీ.. ఈలోగానే కట్టేస్తామని వివరించారు. గురువారం కేంద్ర టెలికం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో భేటీ అయిన తర్వాత మిట్టల్ ఈ విషయాలు తెలిపారు. భేటీ సందర్భం గా పరిశ్రమపై భారీ పన్నుల భారం ఉంటోందని, వీటిని తగ్గించాలని ఆయన కోరారు. మరో రూ. 1,000 కోట్లు కట్టిన వొడాఫోన్ ఏజీఆర్ బకాయిల కింద టెలికం సంస్థ వొడాఫోన్ ఐడియా గురువారం మరో రూ. 1,000 కోట్లు.. టెలికం శాఖకు (డాట్) చెల్లించింది. సోమవారమే కంపెనీ 2,500 కోట్లు కట్టిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఐడియా మొత్తం రూ. 53,000 కోట్ల బాకీలు కట్టాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మరోవైపు, టాటా టెలీసర్వీసెస్ నుంచి మిగతా బాకీల వసూలుకు ఒకటి.. రెండు రోజుల్లో నోటీసులు పంపించనున్నట్లు వివరించాయి. డాట్ లెక్కల ప్రకారం టాటా టెలీ సర్వీసెస్ దాదాపు రూ. 14,000 కోట్లు కట్టాల్సి ఉండగా..ఆ సంస్థ సోమవారం నాడు రూ. 2,197 కోట్లు మాత్రమే కట్టింది. ఏజీఆర్ లెక్కల మదింపులో కేంద్రం.. ఇక ఏజీఆర్ బాకీలు డాట్ చెబుతున్న దానికంటే చాలా తక్కువగా ఉంటాయని టెల్కోలు చెబుతున్న నేపథ్యంలో టెలికం శాఖ ఈ అంశంపై దృష్టి సారించింది. మార్చి 17లోగా టెల్కోల లెక్కలను టెలికం శాఖ మదింపు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని టెల్కోల గణాంకాలను టెస్ట్ చెక్ చేయనున్నప్పటికీ.. మొత్తం బాకీలు కట్టేశామంటున్న సంస్థలతో ముందుగా ఈ ప్రక్రియ మొదలుపెట్టనున్నట్లు వివరించాయి. డాట్ సొంత లెక్కలు, టెల్కోల లెక్కలకు మధ్య ఉన్న వ్యత్యాసాలను కనిపెట్టేందుకు ఇది ఉపయోగపడనుంది. టెలికం సంస్థలు కట్టాల్సిన లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలను లెక్కించేందుకు టెలికంయేతర కార్యకలాపాల ద్వారా కూడా వచ్చిన ఆదాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చంటూ డాట్‌కు అనుకూలంగా సుప్రీం కోర్టు గతేడాది ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం టెలికం సంస్థలు ఏకంగా రూ. 1.47 లక్షల కోట్లు కట్టాల్సి రానుంది. గతంలో విధించిన జనవరి 23 డెడ్‌లైన్‌ను టెల్కోలు ఉల్లంఘించడంపై ఆగ్రహించిన సుప్రీం కోర్టు తాజాగా దీనిపై విచారణను మార్చి 17కి వాయిదా వేసింది. అందరికీ ప్రయోజనంపై కేంద్రం దృష్టి.. ఏజీఆర్ బాకీల విషయంలో అటు సుప్రీం కోర్టు ఆదేశాలు అమలు చేస్తూనే.. ఇటు టెలికం రంగం.. వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటంపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. టెలికం సంస్థలు ఇప్పటిదాకా రూ. 16,000 కోట్ల ఏజీఆర్ బాకీలు చెల్లించినట్లు వివరించాయి. మరో 7–8 రోజుల్లో మరిన్ని చెల్లింపులు జరుపుతామని టెల్కోలు చెప్పాయని ఓ అధికారి పేర్కొన్నారు. టెల్కోల బాకీల్లో వడ్డీ, పెనాల్టీలే అధికం.. టెలికం సంస్థలు లైసెన్సు ఫీజు బాకీల కింద కట్టాల్సినది రూ. 22,589 కోట్లని.. అయితే వడ్డీ, పెనాల్టీలు కలిపితే ఇది రూ. 92,641 కోట్లకు పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలు కట్టాల్సినది రూ. 16,746 కోట్లు ఉంటుందని పేర్కొన్నాయి. భారతి ఎయిర్టెల్ బాకీలు రూ. 5,529 కోట్లు, వొడాఫోన్ ఐడియా రూ. 6,871 కోట్లు, టాటా గ్రూప్ రూ. 2,321 కోట్లు, టెలినార్ (ప్రస్తుతం ఎయిర్‌టెల్‌లో విలీనమైంది) రూ. 529 కోట్లు, బీఎస్ఎన్ఎల్ రూ. 614 కోట్లు, ఎంటీఎన్ఎల్ బకాయిలు రూ. 876 కోట్లు ఉంటాయని వివరించాయి. ఈ లెక్కలను జూలైలో తయారు చేశారని, తాజాగా మరోసారి లెక్కింపు ప్రక్రియ జరుగుతోందని ఓ అధికారి తెలిపారు. డాట్ లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజుతో పాటు టెలికం సంస్థలు దాదాపు రూ. 55,054 కోట్ల మేర స్పెక్ట్రం యూసేజి చార్జీలు కూడా కట్టాల్సి ఉంది. -
తీవ్ర ఒత్తిడిలో టెలికాం రంగం : సునీల్ మిట్టల్
న్యూఢిల్లీ: గత ఐదేళ్లుగా దేశీయ టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటుందని ప్రముఖ పారిశ్రామికవేత్త, భారతి ఎయిర్టెల్ అధినేత సునీల్ మిట్టల్ బుధవారం తెలిపారు. దేశ అభివృద్ధిలో టెలికాం రంగం కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. టెలికం రంగాన్ని వేగంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం నిర్మాత్మకమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) లెక్కల ప్రకారం లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీల కింద టెల్కోలు బకాయిలను చెల్లించాలని టెలికాం శాఖ ఆదేశించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు, ప్రభుత్వ డెడ్లైన్ల నేపథ్యంలో మొబైల్ దిగ్గజం భారతి ఎయిర్టెల్ ప్రభుత్వానికి బకాయిపడిన రూ 10,000 కోట్లను టెలికాం శాఖకు చెల్లించింది. స్వయం మదింపు కసరత్తు పూర్తయిన తర్వాత మిగిలిన బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామని కంపెనీ వెల్లడించింది. -
ఎకానమీ ప్రగతికి ఏం చేద్దాం..
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ మందగమనం నేపథ్యంలో వ్యాపార దిగ్గజాలతో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సమావేశమయ్యారు. ఎకానమీ ఎదుర్కొంటున్న సవాళ్లు, వృద్ధి.. ఉపాధి కల్పనకు ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యలు తదితర అంశాలపై చర్చించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా, భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ మిట్టల్, అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. టీవీఎస్ చైర్మన్ వేణు శ్రీనివాసన్, ఎల్అండ్టీ అధినేత ఏఎం నాయక్ మొదలైన వారు దీనికి హాజరయ్యారు. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019–20 ఏడాదికి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కార్పొరేట్లతో ప్రధాని భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. సవాళ్లతో సమరం..: డిమాండ్ మందగమనం, తయారీ రంగం బలహీనత తదితర అంశాల కారణంగా జులై–సెప్టెంబర్ త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మరింత నెమ్మదించి.. ఆరేళ్ల కనిష్టమైన 4.5 శాతానికి పడిపోయింది. వృద్ధికి ఊతమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను గతేడాది గణనీయంగా తగ్గించుకుంటూ వచ్చింది. అటు కేంద్ర ప్రభుత్వం కూడా బ్యాంకులకు మరింత మూలధన నిధులివ్వడం, పలు బ్యాంకులను విలీనం చేయడంతో పాటు కార్పొరేట్ ట్యాక్స్ రేటును 30% నుంచి 22%కి తగ్గించడం వంటి సంస్కరణలు ప్రవేశపెట్టింది. అయితే, ఇవేవీ కూడా బలహీనపడిన వినియోగ డిమాండ్‌ను నేరుగా పెంచేందుకు దోహపడేవి కావనే విమర్శలు ఉన్నాయి. దీంతో వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ఇటీవలి కాలంలో వివిధ రంగాలకు చెందిన 60 మంది పైగా వ్యాపారవేత్తలతో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. అటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా బడ్జెట్ కసరత్తులో భాగంగా పరిశ్రమవర్గాలతో సమావేశమవుతున్నారు. దీంతో రాబోయే బడ్జెట్లో మరిన్ని సంస్కరణలపై అంచనాలు నెలకొన్నాయి. కార్పొరేట్లపై కక్ష సాధింపు అనుకోవద్దు.. అవినీతి కట్టడి చర్యలపై మోదీ వ్యాఖ్యలు న్యూఢిల్లీ: అవినీతికి పాల్పడుతున్న కొన్ని సంస్థలపై తీసుకుంటున్న చర్యలను కార్పొరేట్లపై కక్ష సాధింపుగా భావించరాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఎలాంటి అవరోధాలు లేని పారదర్శక పరిస్థితుల్లో కార్పొరేట్లు నిర్భయంగా సంపద సృష్టి జరపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన చెప్పారు. కిర్లోస్కర్ బ్రదర్స్ వందో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రధాని ఈ విషయాలు తెలిపారు. చట్టాల సాలెగూళ్ల నుంచి పరిశ్రమను బైటపడేసేందుకు గడిచిన అయిదేళ్లుగా తమ ప్రభుత్వం నిజాయితీగా పనిచేస్తోందని మోదీ పేర్కొన్నారు. కాగా, కిర్లోస్కర్ బ్రదర్స్ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రూపొందించిన పోస్టల్ స్టాంపును, సంస్థ వ్యవస్థాపకుడు లక్ష్మణ్‌రావ్ కిర్లోస్కర్ జీవిత కధ ‘యాంత్రిక్ కి యాత్ర’ హిందీ వెర్షన్‌ను ప్రధాని ఆవిష్కరించారు. -
జీ వాటాపై బిలియనీర్ల కన్ను?
సాక్షి, న్యూఢిల్లీ: బడా పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ మిట్టల్ ప్రముఖ మీడియా సంస్థ జీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ వాటాలపై కన్నేసినట్లు వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. దేశీయ బిలియనీర్లు ముకేశ్ అంబానీ, సునీల్ మిట్టల్ జీ ఎంటర్టైన్మెంట్ ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తొలి దశ చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్‌బెర్గ్ క్వింట్ తాజాగా పేర్కొంది. త్వరలోనే జీ ఎంటర్టైన్మెంట్లో సుభాష్ వాటా కొనుగోలుకు నిమిత్తం ప్రాథమిక బిడ్స్ దాఖలు చేయవచ్చని, ఈ మేరకు అధికారిక ప్రతిపాదన త్వరలోనే రానుందని రిపోర్ట్ చేసింది. అయితే వాటా కొనుగోలు రేసులో ఆర్ఐఎల్, ఎయిర్టెల్ ఉన్నాయన్న వార్తలపై ఎయిర్టెల్ స్పందించింది. ఈ ఊహాగానాలను ఎయిర్టెల్ ప్రతినిధి తిరస్కరించారు. జీలో వాటాల కొనుగోలు రేసులో ఎయిర్టెల్ లేదంటూ ఒక ప్రకటన జారీ చేశారు. కాగా ఎస్సెల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తదితర కార్యకలాపాలలో పెట్టుబడుల కారణంగా ఆర్థిక సమస్యలు ఎదురుకావడంతో జీ ప్రమోటర్ సుభాష్ చంద్ర కొంతమేర వాటాను విక్రయించేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టిన విషయం సంగతి తెలిసిందే. -
రూ.5000 కోసం అడుక్కున్నా : ఎయిర్టెల్ చైర్మన్
ఇటీవలే రూ.7000 కోట్లను విరాళంగా ప్రకటించిన భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్, ఒకానొక సమయంలో రూ.5000 కోసం అభ్యర్థించే దీన స్థితిలోకి వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి. సైకిల్ విడిభాగాల వ్యాపారాలకు ఓనర్‌గా ఉండే సునిల్ మిట్టల్, ప్రస్తుతం భారతీ ఎయిర్‌టెల్‌తో టెలికమ్యూనికేషన్ ప్రపంచాన్నే మార్చేశారు. ఒకానొక సమయంలో తన వద్ద డబ్బే ఉండేది కాదంటూ ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న రోజుల్ని గుర్తుచేసుకున్నారు. రూ.5000 కోసం బ్రిజ్మోహన్ లాల్ ముంజల్‌ను ఆశ్రయించానని తెలిపారు. '' అంకుల్ నాకు రూ.5000 కావాలి'' అని కోరానని, తన ఇన్వాయిస్లు తీసుకుని, అవసరమైన మొత్తాన్ని ఇచ్చారని పేర్కొన్నారు. సరిగ్గా ఆ సమయంలో బ్రిజ్మోహన్ చెప్పిన మాటలు తన హృదయాన్ని తాకాయని.. వెళ్లి పోయే సమయాన్ని తనని ఆపిన బ్రిజ్మోహన్...ఇదే అలవాటుగా మార్చుకోకు అంటూ గట్టి సలహా ఇచ్చారని తెలిపారు. ఢిల్లీలో జరిగిన టైకాన్ సదస్సులో మాట్లాడుతూ ఆయన తన వ్యాపార ప్రయాణంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ఆఫ్రికాలో అడుగుపెట్టాలనుకోవడం కూడా తప్పయిందని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఆఫ్రికాలో అడుగుపెట్టాలన్నది కొంత తొందరపాటు నిర్ణయమేననీ, దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయాల్సి వచ్చిందని సునిల్ మిట్టల్ చెప్పారు. ''తప్పు చేయడం మానవ సహజం. అందరూ చేస్తూనే ఉంటారు. వెనుదిరిగి చూసుకుంటే, అప్పుడలా చేసి ఉండాల్సి కాదు.. మరింత ఆలోచించి ఉంటే బాగుండేది.. అనిపించే సందర్భాలు అందరి జీవితాల్లోనూ ఉంటాయి'' అని మిట్టల్ చెప్పారు. -
జియో వల్ల భారీగా పెట్టుబడులు రైటాఫ్
రిలయన్స్ జియో ఉచిత వాయిస్, డేటా ఆఫర్ల వెల్లువ టెలికాం కంపెనీలను భారీగా దెబ్బతీసింది. దాదాపు 50 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడులను టెలికాం కంపెనీలు రైటాఫ్ చేసినట్టు భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్ తెలిపారు. ఇన్ని కోట్ల మేర పెట్టుబడుల రైటాఫ్‌కు ప్రధాన కారణం జియో ఉచిత కాల్స్, డేటా ఆఫర్లేనని పేర్కొన్నారు. అయితే టెలికాం ఇండస్ట్రీలో వేగంగా జరిగిన కన్సాలిడేషన్‌తో భారతీ ఎయిర్టెల్ లబ్ది చెందిందని చెప్పారు. నెంబర్ 2 వొడాఫోన్, నెంబర్3 ఐడియాలు విలీనం అపూర్వమైనదని, కానీ రెండు బలమైన కంపెనీల విలీనాన్ని మనం చూడటం లేదని మిట్టల్ అన్నారు. ప్రస్తుతం భారతీ ఎయిర్టెల్, ఎయిర్‌సెల్‌ను కొనుగోలు చేసే ప్రక్రియపై చర్చలు జరుపుతోంది. ఎయిర్‌సెల్ అంతకముందు, ఆర్‌కామ్‌లో విలీనమవ్వాలనుకుంది. కానీ ఆ విలీనం చివరి దశలో రద్దయింది. ట్రేడింగ్ డీల్ ద్వారా రూ.3,500 కోట్లకు ఎనిమిది సర్కిళ్లలో 2300 ఎంహెచ్‌జెడ్ బ్యాండ్‌లో ఎయిర్‌సెల్ 4జీ ప్రసారాలను ఎయిర్టెల్ గతేడాది కొనుగోలు చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో జియో ప్రవేశం అనంతరం దేశీయ టెలికాం కంపెనీలు తమ కస్టమర్లను కాపాడుకోవడానికి టారిఫ్ రేట్లను తగ్గించాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జియో ఛార్జీలు విధించడం ప్రారంభించింది. అయితే వాయిస్ కాల్స్ మాత్రం జీవితకాలం ఉచితం. జియో వల్ల ఏర్పడిన ధరల యుద్ధంతో టెల్కోల రెవెన్యూలు, లాభాలు, నగదు నిల్వలు భారీగా దెబ్బతిన్నాయి. ఈ క్రమంలోనే వొడాఫోన్, ఐడియాలు విలీనం కాబోతున్నాయి. ఆర్‌కామ్, ఎయిర్‌సెల్‌లు ఒత్తిడిలో కొనసాగుతున్నాయి. -
విరాళంగా రూ.7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్, తమ గ్రూప్ దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్‌కు భారీగా విరాళం అందించారు. తమ కుటుంబ సంపద నుంచి 10 శాతం అంటే మొత్తం రూ.7000 కోట్లను విరాళంగా అందించనున్నట్ట ప్రకటించారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బలహీన యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం, సత్యభారతీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త యూనివర్సిటీ సైన్సు అండ్ టెక్నాలజీపై దృష్టిసారించనుంది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయనుంది. ఈ యూనివర్సిటీని ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. తొలి అకాడమిక్ సెషన్ 2021 నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం 10వేల మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ టైటాన్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిని నిలేకని 'ది గివింగ్ ప్లెడ్జ్'లో జాయిన్ అయి, తమ సగం సంపదను దాతృత్వం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. వీరు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మిట్టల్ కూడా తమ గ్రూప్ దాతృత్వ సంస్థకు భారీ విరాళం ప్రకటించారు. -
ఒక్కరోజులోనే ఈ ప్రత్యర్థులకు 1.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం మార్కెట్లో జరుగుతున్న యుద్ధంలో ఒక్కరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ ఇద్దరు మాత్రం తగ్గడం లేదు. ఇటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లోనూ తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు, భారతీ ఎయిర్టెల్ షేర్లు నేటి మార్కెట్లో మైలురాయిలకు దగ్గరగా మెరుపులు మెరిపించాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లీడర్‌గా ఉన్న భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.2 లక్షల కోట్లకు చేరుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్ల దగ్గరగా వచ్చేసింది. దీంతో కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, ఆ కంపెనీ అధినేతలు కూడా భారీగా లబ్ది పొందారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం సోమవారం రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన నికర సంపద మరో 1.1 బిలియన్ డాలర్లను చేర్చుకోగా.. భారతీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ సునిల్ భారతీ మిట్టల్ 433 మిలియన్ డాలర్లను పెంచుకున్నారు. ఇరు కంపెనీల షేర్లు నేటి మార్కెట్లో భారీగా పెరగడంతో, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పాటు వారి సంపద కూడా పైకి ఎగిసింది. మొత్తంగా అంబానీ నికర సంపద 41.3 బిలియన్ డాలర్లు. మిట్టల్ సంపద 10.1 బిలియన్ డాలర్లు. ఒక్కరోజులోనే తమ సంపదను భారీగా పెంచుకున్న టాప్-3 గెయినర్లలో ఈ ప్రత్యర్థులున్నారు. నేటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు 3 శాతానికి పైగా, ఎయిర్టెల్ షేర్లు 5 శాతం మేర జంప్ చేశాయి. -
5 రోజుల్లోనే డీల్ పూర్తి, అదెలా?
వ్యాపారాల్లో మార్పులు ఎంత వేగవంతంగా జరుగుతాయో మరోసారి భారతీ గ్రూప్, టాటా టెలిసర్వీసు విషయంలో రుజువైంది. కేవలం ఐదే ఐదు రోజుల్లో టాటా టెలిసర్వీసెస్, ఎయిర్టెల్ గూటికి చేరింది. అంతా అయిపోయిందనుకున్న క్షణంలో టాటా టెలిసర్వీసెస్‌కు కొత్త ఊపిరి పోసినట్టైంది. నిజానికి టాటాలకు, భారతీ కంపెనీలకు మధ్య ఈ విషయంపై గత కొన్ని నెలలుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఆగస్టులో వీరి చర్చలు సమసిపోయాయి. ఇక ఎలాంటి డీల్‌ను కుదుర్చుకునేది లేదని తేల్చేసుకున్నాయి. సెప్టెంబర్ చివరి వరకు ఎలాంటి డీల్ కానీ, దానిపై ఇసుమంతైనా ప్రస్తావన లేదు. రిలయన్స్ జియో, ఇతర టెల్కోలతో టాటా గ్రూప్ చర్చలు జరిపినప్పటికీ, అవి కూడా విజయవంతం కాలేదు. చివరికి టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయాలనే టాటా గ్రూప్ నిర్ణయించింది. ఈ విషయంపై టాటా గ్రూప్‌కు చెందిన టాప్ అధికారులు న్యూఢిల్లీలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం అధికారులను కలిశారు. తమ టెలికాం వ్యాపారాలను మూసివేస్తున్నట్టు గత శుక్రవారం ప్రభుత్వానికి చెప్పేశారు. కానీ టాటా సన్స్‌కు కొత్త చైర్మన్‌గా వచ్చిన ఎన్ చంద్రశేఖరన్(చంద్ర) టాటా టెలిసర్వీసెస్‌ను మూసివేయడానికి అసలు ఇష్టపడలేదు. ప్రధానమంత్రి కార్యాలయంలోని అధికారులతో పాటు పలు ప్రభుత్వ సీనియర్ అధికారులతో భేటీ అయిన చంద్రశేఖరన్, ఈ విషయంపై పలు దఫాల చర్చించారు. ఇప్పటికే టెలికాం పరిశ్రమ ఒత్తిడిలో ఉందని, ఈ సమయంలో ఎలాంటి కంపెనీ మూత పడటానికి ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఇష్టపడలేదు. గత వీకెండ్ నుంచి పరిస్థితుల్లో మెల్లమెల్లగా మార్పులు రావడం ప్రారంభమైంది. భారతీ చైర్మన్ సునిల్ మిట్టల్, చంద్రతో సమావేశమయ్యారు. కేవలం ఐదు రోజుల్లోనే ఈ డీల్‌పై ఓ క్లారిటీకి వచ్చేశారు. తమ టెలికాం వ్యాపారాలను విలీనం చేసుకునేందుకు రెండు కంపెనీలు ఆమోదించడం అన్నీ చకాచకా జరిగిపోయాయి. టాటాలు కూడా తమ 149 ఏళ్ల చరిత్రలో ఏ కంపెనీని మూసివేసిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో టాటా టెలిసర్వీసెస్‌ను, ఎయిర్‌టెల్‌లో కలిపేశారు.