సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్, తమ గ్రూప్ దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్‌కు భారీగా విరాళం అందించారు. తమ కుటుంబ సంపద నుంచి 10 శాతం అంటే మొత్తం రూ.7000 కోట్లను విరాళంగా అందించనున్నట్ట ప్రకటించారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బలహీన యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం, సత్యభారతీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త యూనివర్సిటీ సైన్సు అండ్ టెక్నాలజీపై దృష్టిసారించనుంది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయనుంది.
ఈ యూనివర్సిటీని ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. తొలి అకాడమిక్ సెషన్ 2021 నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం 10వేల మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ టైటాన్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిని నిలేకని 'ది గివింగ్ ప్లెడ్జ్'లో జాయిన్ అయి, తమ సగం సంపదను దాతృత్వం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. వీరు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మిట్టల్ కూడా తమ గ్రూప్ దాతృత్వ సంస్థకు భారీ విరాళం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment