bharathi airtel
-
రూ.3500 కోట్లను సమీకరించిన భారతీ ఎయిర్టెల్
దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ హోల్డింగ్ కంపెనీ భారతీ టెలికాం రూ.3500 కోట్లను సమీకరించింది. వాణిజ్య పేపర్ల జారీ చేయడం ద్వారా ఈ మొత్తం నిధులను సమీకరించినట్లు కంపెనీ ఒక ప్రకనటలో తెలిపింది. 3నెలల మెచ్యూరిటితో సగటున 6.16శాతం ఆఫర్ చేసింది. సమీకరించిన నిధులను రుణాల చెల్లింపులకు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి వినియోగిస్తామని కంపెనీని తెలిపింది. ‘‘రేట్ల మేన్‌జ్, ఇప్పటికే ఉన్న పోర్ట్‌ఫోలియో రీఫైనాన్సింగ్ నిర్వహించడానికి కంపెనీ చేసే సాధారణ ట్రెజరీ కార్యకలాపాలు ఇవి.’’ అని భారతీ గ్రూప్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. క్యూఐపీ, ఓవర్సీస్ కన్వర్టబుల్ బాండ్ల జారీతో ఇప్పటికే ఈ ఏడాదిలో భారతీ ఎయిర్టెల్ 3బిలియన్ డాలర్లను సమీకరించింది. ఎయిర్‌టెల్‌లో భారతి టెలికాం 38.79 శాతం వాటాను కలిగింది. మార్చి 31 ముగిసిన త్రైమాసికం నాటికి కంపెనీకి మొత్తం రూ.88,251 కోట్ల నికర రుణాన్ని కలిగి ఉంది. లీజ్ ఆబ్లికేషన్‌తో కలుపుకుంటే కంపెనీ మొత్తం రుణాలు రూ.1.18లక్షల కోట్లకు చేరుకుంటుందని కంపెనీ తెలిపింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా గణాంకాల ప్రకారం... ఏప్రిల్ 17, మే 15 మధ్య తేదిల్లో 3 నెలల కమర్షియల్ పేపర్ల వడ్డీ రేట్లపై 220 బేసిస్ పాయింట్లు తగ్గాయి. ఆర్బీఐ ఈ శుక్రవారం మే 22న పాలసీ రేటును శుక్రవారం 40 బేసిస్ పాయింట్లు తగ్గించిన తరువాత కమర్షియల్ పేపర్లపై వడ్డీ రేటు మరింత తగ్గే అవకాశం ఉంది. భారతీ ఎయిర్టెల్ సమీకరించిన మొత్తం నగుదు ప్రధానంగా స్వల్పకాలిక ఫైనాన్సింగ్ అవసరాలను తీర్చేందుకు, ఇప్పటికే ఉన్న అప్పుల చెల్లింపులకు వినియోగించే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు రోహణ్ దమీజా తెలిపారు. -
ఎయిర్‌టెల్‌కు భారీ షాక్
సాక్షి, న్యూఢిల్లీ: భారీ నష్టాలకు తోడు ఇటీవలి ఏజీఆర్ వివాదంతో ఇబ్బందులు పడుతున్న ప్రముఖ టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎక్స్పోర్ట్ ఆబ్లిగేషన్స్‌కు అనుగుణంగా ప్రవర్తించలేదన్న ఆరోపణలతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ భారతి ఎయిర్‌టెల్‌ను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎగుమతుల ప్రోత్సాహక పథకాల (ఇపీసీజీ) పథకం కింద ఎగుమతి నిబంధలను నెరవేర్చకపోవడంతో భారతి ఎయిర్‌టెల్‌ను విదేశీ వాణిజ్య రెగ్యులేటరీ ఈ జాబితాలో చేరింది. ఎగుమతి ప్రోత్సాహక మూలధన వస్తువుల పథకం కింద ఎగుమతి బాధ్యతను నెరవేర్చడంలో ఎయిర్టెల్ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. దీంతో ఎయిర్‌టెల్‌ను "తిరస్కరించిన ఎంట్రీ లిస్ట్" లో ఉంచినట్లు తెలిపాయి. దీంతో కంపెనీలు తమ దిగుమతి లైసెన్స్‌ను కోల్పోతాయి. మరోవైపు అవసరం లేని కారణగా 2018 ఏప్రిల్ నుండి అలాంటి లైసెన్స్ తీసుకోలేదని ఎయిర్టెల్ వివరించింది. అయినప్పటికీ గత లైసెన్సులన్నీ ముగిసిన నేపథ్యంలో కొత్త లెసెన్స్ కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నామని తెలిపింది. అయితే ఏ వస్తువులు (ఎగుమతి, దిగుమతి) ఈ లైసెన్సుల కిందికి వస్తాయనేది వెల్లడించలేదు ఈపీసీజీ పథకం కింద, ఎగుమతిదారుడు కొంతవరకు కేపిటల్ గూడ్స్‌ను సుంకాలేవీ లేకుండానే దిగుమతి చేసుకునే వీలుంటుంది. అలాగే ఎగుమతులకు సంబంధించిన ప్రక్రియలో సాంకేతికతను పెంచుకోవడం కోసం అవసరమైన పరికరాలను దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. కాగా 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు అమలులో ఉండేలా కొత్త వాణిజ్య విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం తాజాగా కసరత్తును చేస్తోంది. -
ఎయిర్టెల్ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ టెలికం సంస్థ భారతి ఎయిర్టెల్ తమ వినియోగదారులకు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. రూ. 279 రూ. 379 రీచార్జ్‌తో రెండు కొత్త ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను ఎయిర్టెల్ తమ వెబ్సైట్లో వెల్లడించింది. ఈ రీఛార్జ్‌లో ఆన్లిమిటెడ్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్లను అందిస్తుంది. వీటికి ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తోపాటు నాలుగు లక్షల జీవిత బీమాను అందిస్తోంది. ఎయిర్టెల్ ప్రీపెయిడ్ రూ. 279 రిఛార్జ్ చేసుకుంటే రోజూ 1.5 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్లు పొందవచ్చు. ఈ ప్యాక్ గడువు 28 రోజులని తెలిపింది. అలాగే రూ. 379 రీచార్జ్ చేసుకుంటే అన్లిమిటెడ్ కాల్స్, కేవలం 6 జీబీ డేటా, 900 ఎస్ఎంఎస్లు మాత్రమే పొందడానికి వీలు ఉంటుంది. ఈ ప్లాన్ గడువు 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్లు ఎయిర్టెల్ నెట్‌వర్క్‌తోపాటు ఇతర అన్ని నెట్‌వర్క్‌లకు వర్తిస్తుంది. రూ.379 రీచార్జ్ ఫాస్టాగ్ కొనుగోలుపై రూ.100 క్యాష్‌బ్యాక్‌ను కస్టమర్లకు అందిస్తోంది. వీటితోపాటు వింక్ మ్యూజిక్, ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇటీవలే ఎయిర్టెల్ వినియోగదారులకు భారీగా కోత విధించగా.. తాజాగా రెండు కొత్త ప్లాన్లను ప్రకటించి యూజర్లకు కొంత ఊరటనిచ్చింది. ఇటీవల అన్ని టెలికాం సంస్థలు ప్రీపెయిడ్ ధరలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. తమ కంపెనీ నష్టాలను పూడ్చేందుకే ఈ ధరలను పెంచుతున్నట్లు సదరు టెలికాం సంస్థలు పేర్కొన్నాయి. ఇక కొత్త ఎయిర్టెల్ ప్లాన్.. జియో, వొడాఫోన్ ఆఫర్లతో పోల్చితే మెరుగ్గానే ఉంది. జియో కూడా ప్రస్తుతం ఇలాంటి ఆఫర్‌నే అందిస్తుండగా ఆఫ్-నెట్ కాల్స్ చేసుకోడానికి ఐయూసీ ఛార్జీలు చెల్లించాలనే షరతు ఉంది. -
జియో దెబ్బ : ఎగిసిన ఎయిర్టెల్
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్టెల్ మళ్లీ ఫాం లోకి వస్తోంది. టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో టారిప్ వార్‌లో భారీగా కుదేలైన భారతీ ఎయిర్టెల్ షేర్లు బిఎస్ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్ రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్కెట్ వాల్యుయేషన్ మార్క్‌ను తిరిగి దక్కించుకుంది. రిలయన్స్ జియో 6 పైసల వడ్డన ప్రకటించిన తరువాత నుంచి భారతి ఎయర్‌టెల్ వరుసగా ఐదవరోజు కూడా లాభపడింది. దీంతో షేరు ధర మార్చి 2018 నుండి అత్యధిక స్థాయిని తాకింది. గత ఒక వారంలో 2 శాతం లాభంతో పోలిస్తే, 16 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ 27,662 కోట్ల రూపాయల మార్కెట్ అదనంగా చేకూరింది. గత వారం, రిలయన్స్ జియో ఆఫ్-నెట్ కాల్లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. వినియోగదారుల నుండి ఇంటర్ కనెక్షన్ వినియోగ ఛార్జీలను (ఐయుసీ) ప్రకటించడంతో రిలయన్స్ జియో వినియోగదారుల ఆగ్రహానికి గురవుతోంది. తద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందించిన వాయిస్ కాల్ సేవపై ఇపుడు ఛార్జీ వసూలు చేస్తుంది. ఈ చర్య ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న సంగతి తెలిసిందే. -
పోస్ట్–పెయిడ్ ఆఫర్లను తగ్గిస్తున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్.. చౌక పోస్ట్–పెయిడ్ ప్యాకేజీల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెంచే చర్యల్లో భాగంగా రూ.499 దిగువన ఉన్నటువంటి ఆఫర్ల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే రూ.299 ప్లాన్‌ను పక్కనపెట్టిన ఎయిర్టెల్.. క్రమంగా రూ.349, రూ.399 ప్యాకేజీల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఈ రంగంలో మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని విశ్లేíషిస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ సంస్థకు 28.4 కోట్ల కస్టమర్ బేస్ ఉంది. -
మహిళల రక్షణకు ఎయిర్టెల్, ఎఫ్‌ఎల్‌వోల నుంచి యాప్
న్యూఢిల్లీ: మై సర్కిల్ పేరుతో మహిళలకు అత్యవసర సందర్భాలు, ఒత్తిడి సమయంలో ఉపకరించే యాప్‌ను భారతీ ఎయిర్టెల్, ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్(ఎఫ్ఎల్వో) విడుదల చేశాయి. కేవలం ఎయిర్టెల్ యూజర్లనే కాకుండా ఇతర టెలికం యూజర్లు సైతం వినియోగించుకోవచ్చు. ఈ యాప్ సాయంతో తెలుగు, తమిళం, కన్నడ, ఇంగ్లి ష్, హిందీ సహా 13 భాషల్లో కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల్లో ఐదుగురికి ఎస్ఓఎస్ అలర్ట్స్‌ను పంపించొచ్చని విడుదలైన ప్రకటన తెలిపింది. తద్వారా తాము అత్యవసర పరిస్థితుల్లో ఉన్నామని, తమను చేరుకోవాలని సందేశాన్ని పంపొచ్చని పేర్కొంది. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ ఐవోఎస్ స్టోర్‌లో ఇది అందుబాటులో ఉంది. -
ఎయిర్టెల్ రూ.7,200 కోట్ల గ్యారంటీ ఇవ్వాలి
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్‌టెల్‌లో టాటా టెలీ సర్వీసెస్(టీటీఎస్ఎల్) విలీనానికి టెలికం డిపార్ట్మెంట్(డాట్) ఆమోదం తెలిపింది. అయితే భారతీ ఎయిర్టెల్ రూ.7,200 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలని షరతు విధించామని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల కింద రూ.6,000 కోట్లు, టాటా టెలీ సర్వీసెస్ నుంచి పొందినస్పెక్ట్రమ్ కోసం మరో రూ.1,200 కోట్ల బ్యాంక్ గ్యారంటీని ఇవ్వాలని ఆ అధికారి వివరించారు. దీంతో ఎయిర్‌టెల్‌లో టాటా టెలీసర్వీసెస్ విలీనం పూర్తవుతుందని పేర్కొన్నారు. ఈ విలీనానికి ఈ నెల 9న టెలికం మంత్రి మనోజ్ సిన్హా షరతులతో కూడిన ఆమోదాన్ని తెలిపారని ఆ అధికారి పేర్కొన్నారు. విలీనం జరగటానికి ముందే ఇరు కంపెనీలు కోర్టు కేసుల విషయమై అండర్‌టేకింగ్‌ను సమర్పించాల్సి ఉంటుందని వివరించారు. -
రూ.399 ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్
బెస్ట్ పోస్ట్ పెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేయడంలో భారతీ ఎయిర్టెల్ ఎల్లప్పుడు ముందు ఉంటుంది. కానీ ఎంట్రీ లెవల్ పోస్ట్ పెయిడ్ ప్లాన్ల విషయంలో మాత్రం ఈ కంపెనీ, వొడాఫోన్ కంటే వెనుకంజలోనే ఉంది. వొడాఫోన్ రెడ్ రేంజ్ పోస్ట్‌పెయిడ్ ప్లాన్ 299 రూపాయల నుంచి ప్రారంభమవుతుంటే, భారతీ ఎయిర్టెల్ మైప్లాన్ ఇన్ఫినిటీ ప్లాన్‌ను 399 రూపాయలకు ఆఫర్ చేస్తుంది. ఈ నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ తన రూ.399 ప్లాన్‌పై డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. 399 రూపాయల ప్లాన్‌పై 300 రూపాయల డిస్కౌంట్‌ను అందించనున్నట్టు పేర్కొంది. 50 రూపాయల చొప్పున ఈ డిస్కౌంట్‌ను ఆరు నెలల పాటు ఆఫర్ చేయనుంది. అంటే మొత్తంగా రూ.300 డిస్కౌంట్ లభించనుంది. దీంతో తర్వాత ఆరు నెలలు రూ.399 ప్లాన్ ధర రూ.349కు తగ్గనుంది. అయితే అదనపు పన్నులతో మాత్రం దీని ధర రూ.385గా ఉండనుందని ఎయిర్టెల్ చెప్పింది. ఎయిర్టెల్ రూ.399 పోస్ట్ పెయిడ్ ప్లాన్ ప్రయోజనాలు.... ఈ ప్లాన్ కింద నెలకు 20 జీబీ డేటా పొందనున్నారు. డేటా క్యారీ ఫార్వర్డ్ ఫెసిలిటీని ఎయిర్టెల్ ఆఫర్చేస్తోంది. ఎలాంటి ఎఫ్‌యూపీ పరిమితులు లేకుండా అపరిమిత వాయిస్ కాల్స్‌ను ఇది అందిస్తోంది. రోజుకు 100 ఎస్ఎంఎస్లు లభ్యం కానున్నాయి. అదనంగా ఎయిర్టెల్ టీవీ, వింక్ మ్యూజిక్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను ఎయిర్టెల్ ఆఫర్చేస్తుంది. కానీ యూజర్లు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌కు అర్హులు కారు. వొడాఫోన్ మాదిరి ఆఫర్ చేసేందుకు ఎయిర్టెల్ అదనంగా ప్రతి నెల 20 జీబీ డేటాను 12 నెలల పాటు అందిస్తుంది. దీంతో మొత్తంగా ఎయిర్టెల్ యూజర్లు 40జీబీ డేటా పొందుతారు. -
మెగా మెర్జర్ పూర్తి : ఎయిర్టెల్ ఔట్
సాక్షి,ముంబై: దేశీయ అతిపెద్ద టెలికాం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌కు మరో భారీ షాక్ తగిలింది. ఆదిత్య బిర్లా గ్రూప్ ఐడియా సెల్యులార్, వొడాఫోన్ ఇండియా విలీనం తరువాత నెం.1 స్థానం నుంచి ఎయిర్టెల్ కిందికి పడిపోయింది. వోడాఫోన్, ఐడియా మెగా మెర్జర్లో కీలకమైన ఆఖరి అంకమైన ఎన్సీఎల్టీ ఆమోదం కూడా లభించడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ భారీ మెర్జర్ తరువాత ఆవిష్కరించిన కొత్త సంస్థ వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ ఈ స్థానంలోకి దూసుకు వచ్చింది. 32.2శాతం వాటా, 408 మిలియన్ల వినియోగదారులతో అగ్రగామి సంస్థగా నిలిచింది. దీంతో 15ఏళ్లపాటు ధరిస్తూ వస్తున్న మార్కెట్ లీడర్ కిరీటాన్ని, నెం.1 స్థానాన్ని ఎయిర్టెల్ కోల్పోయింది. కొత్త ఛైర్మన్ , కొత్త బోర్డు ఆదిత్య బిర్లా గ్రూప్ ఛైర్మన్ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు. అలాగే సీఈవోగా బాలేష్ శర్మ నియామకం. ఈ మేరకు ఇరు సంస్థలు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 15,000 దుకాణాలను, 1.7 మిలియన్ల రిటైల్ టచ్ పాయింట్లు వొడాఫోన్ ఐడియా సొంతం. దేశంలో అతిపెద్ద సస్థగా అవతరించి చరిత్ర సృష్టించామని చైర్మన్ కుమార మంగళం వ్యాఖ్యానించారు. పరిణామం చెందుతున్న డిజిటల్, కనెక్టివిటీ అవసరాలను నెరవేర్చడానికి కొత్త ఉత్పాదనలు, సేవలతో తమ రిటైల్, వాణిజ్య కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించనున్నామని కొత్త సంస్థ సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. భారతదేశం అంతటా తొమ్మిది సర్కిళ్లలో కొత్త సంస్థ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి హిమాంశు కపానియా నేడు(ఆగస్టు 31, 2018) వైదొలగనున్నారు. కానీ కొత్త కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు. మరోవైపు రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ జూలైలో రికార్డు స్థాయిలో ఏకంగా 6 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను ఖాతాదారులుగా చేర్చుకుంది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధికం. మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్టెల్ 3.13 లక్షల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) వెల్లడించింది. కొత్త వినియోగదారుల చేరికతో వోడాఫోన్ మొత్తం సబ్స్క్రైబర్ల సంఖ్య 1004.08 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. అయితే ఐడియా సెల్యులార్ వినియోగదారుల బేస్ కేవలం 5,489 మాత్రమే పెరిగింది. -
భారతీ ఎయిర్టెల్ దొంగ పని, తెలిస్తే షాక్
శ్రీనగర్ : టెలికాం దిగ్గజంగా భారతీ ఎయిర్‌టెల్‌కు మంచి పేరుంది. ఈ మధ్యన ఆ కంపెనీ చేసే పనులు దాని బ్రాండ్ విలువను అదే పోగొట్టుకుంటోంది. గత కొన్ని రోజుల క్రిందట ఖాతాదారులకు చెప్పా పెట్టకుండా.. వారి తరుఫున అకౌంట్లు తెరిచేసి, గ్యాస్ అకౌంట్ రాయితీలను తన పేమెంట్ బ్యాంక్‌లోకి జమ చేసుకోవడంతో ఆర్బీఐ ఆగ్రహానికి గురైంది. ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు రద్దు చేసి, భారీ జరిమానా కూడా విధించింది. తాజాగా మరో దొంగ పని చేసి, తన బ్రాండ్ ఇమేజ్ను మరోసారి దెబ్బతీసుకుంది. భారతీ ఎయిర్టెల్ తన ప్రత్యర్థి, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ నుంచి విద్యుత్‌ను దొంగతనం చేసింది. జమ్ముకశ్మీర్‌లోని కార్గిల్ జిల్లాలో ఎయిర్టెల్ ఈ దొంగతనానికి పాల్పడిందని బీఎస్ఎన్ఎల్ ఫిర్యాదు నమోదు చేసింది. కార్గిల్‌లోని ఛానిగుండ్ వద్ద ఎక్స్‌క్లూజివ్‌గా బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్‌కు మాత్రమే వాడే విద్యుత్‌ను ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎయిర్టెల్ టవర్ దొంగతనం చేసిందని బీఎస్ఎన్ఎల్ అథారిటీలు 2018 ఆగస్టు 3న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్టు పోలీసు అధికారి చెప్పారు. దీని కోసం కార్గిల్ ఎస్ఎస్పీ టీ గ్యాల్పో, కార్గిల్ డిప్యూటీ ఎస్పీ ఇష్త్‌యాఖ్ ఏ కచో హెడ్‌గా ఎగ్జిక్యూటివ్ పీడీడీ కార్గిల్ మహమ్మద్ అల్టఫ్‌తో పాటు ఓ కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాన్ని సందర్శించిన టీమ్, ఎయిర్టెల్ టవర్ అక్రమంగా బీఎస్ఎన్ఎల్ ట్రాన్స్ఫార్మర్ నుంచి విద్యుత్ దొంగలించేందుకు ఓ కేబుల్‌ను ఏర్పాటు చేసిందని గుర్తించారు. ఛానిగుండ్‌లో బీఎస్ఎన్ఎల్ టవర్‌కు ప్రత్యేకంగా సరఫరా చేసే విద్యుత్‌ను ఎయిర్టెల్ అక్రమంగా వాడేస్తుందని టీమ్ తెలిపింది. ఎలక్ట్రిసిటీ యాక్ట్ సెక్షన్ 95 కింద కార్గిల్ పోలీసు స్టేషన్లో ఎయిర్‌టెల్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై విచారణ చేపడుతున్నారు. అయితే ఆ టవర్ టెలికాం కంపెనీకి చెందినది కాదని, దాన్ని ఇన్ఫ్రాటెల్ ఆపరేట్ చేస్తుందని, అది భారతీ గ్రూప్‌లో భాగమని ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెబుతున్నారు. నిజనిజాలు తెలియకుండా తమ కంపెనీ పేరును ఫిర్యాదులో చేర్చారని ఎయిర్టెల్ మండిపడ్డారు. దీన్ని బీఎస్ఎన్ఎల్ అథారిటీల వద్దకు తీసుకెళ్తామని, ఇదే విషయాన్ని వారికి స్పష్టీకరిస్తామని పేర్కొన్నారు. -
భారీగా పడిపోయిన భారతీ ఎయిర్టెల్
ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ క్వార్టర్ ఫలితాల్లో భారీగా పడిపోయింది. నేడు ప్రకటించిన జూన్ క్వార్టర్ ఫలితాల్లో భారతీ ఎయిర్టెల్ లాభాలు 74 శాతం క్షీణించి రూ.97.30 కోట్లగా రికార్డయ్యాయి. ఈ టెలికాం దిగ్గజం గతేడాది ఇదే క్వార్టర్లో రూ.367.30 కోట్ల లాభాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈ క్వార్టర్లో భారతీ ఎయిర్టెల్ రూ.479 కోట్ల నికర నష్టాలను నమోదు చేస్తుందని తెలిసింది. కానీ నికర నష్టాల బాధ నుంచి ఎయిర్టెల్ తప్పించుకుంది. కానీ కంపెనీ లాభాలు మాత్రం భారీగానే దెబ్బకొట్టి, బాగా క్షీణించాయి. ఈ క్వార్టర్లో కంపెనీ కన్సాలిడేటెడ్ రెవెన్యూలు రూ.20,080 కోట్లకు పడిపోయాయని ప్రకటించింది. ఇవి గతేడాది ఇదే క్వార్టర్లో రూ.21,958.10 కోట్లగా ఉన్నట్టు తెలిపింది. కానీ 2019 ఆర్థిక సంవత్సరం క్యూ1లో స్టాండలోన్ బేసిస్‌లో కంపెనీ రూ.1,457.20 కోట్ల నికర నష్టాలను నమోదు చేసిందని తన ఫలితాల ప్రకటనలో పేర్కొంది. కన్సాలిడేటెడ్ మొబైల్ డేటా ట్రాఫిక్ ఈ క్వార్టర్లో 2,236 బిలియన్ ఎంబీగా ఉన్నట్టు కంపెనీ చెప్పింది. ఏడాది ఏడాదికి ఇది 328 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు తెలిపింది. ఆపరేషనల్ వైపు, ఈబీఐటీడీఏ లు సీక్వెన్షియల్‌గా 3 శాతం తగ్గి రూ.6,837 కోట్లగా ఉన్నాయి. దేశీయ వైర్లెస్ వ్యాపారాలు ఈ క్వార్టర్లో సీక్వెన్షియల్‌గా 1 శాతం పెరిగి రూ.10,480 కోట్లగా రికార్డయ్యాయి. ఒక్కో యూజర్ సగటు రెవెన్యూ జూన్ క్వార్టర్లో రూ.105గా ఉన్నట్టు కంపెనీ తెలిపింది. గత క్వార్టర్లో ఇది రూ.116గా ఉంది. ఫలితాల ప్రకటన నేపథ్యంలో భారతీ ఎయిర్టెల్ షేర్లు 1.63 శాతం పెరిగి రూ.357.60గా నమోదయ్యాయి. -
భారతి టెలికంలో సింగ్టెల్ మరింత పెట్టుబడి
న్యూఢిల్లీ: సింగపూర్‌కి చెందిన టెలికం సంస్థ సింగ్టెల్ తాజాగా భారతి టెలికంలో రూ. 2,649 కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. దీంతో భారతి టెలికంలో సింగ్టెల్ వాటా 1.7 శాతం పెరిగి 48.9 శాతానికి చేరుతుంది. ఇందుకోసం షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రక్రియ ఈ ఏడాది మార్చిలోగా పూర్తి కానుంది. దీనికోసం షేరు ఒక్కింటి ధరను రూ.310గా నిర్ణయించారు. టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌కి భారతి టెలికం హోల్డింగ్ సంస్థ. భారతి టెలికం సంస్థకి భారతి ఎయిర్‌టెల్‌లో 50.1 శాతం వాటాలున్నాయి. తాజాగా సమకూరే నిధులను రుణ భారం తగ్గించుకోవటానికి వినియోగించుకోనున్నట్లు భారతి ఎయిర్టెల్ వెల్లడించింది. 2017 డిసెంబర్ 31 నాటికి కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన సంస్థ నికర రుణం రూ.91,714 కోట్లుగా ఉంది. భారతి టెలికం 2016లో రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,500 కోట్లు సమీకరించగా.. సింగ్టెల్ కూడా ఇన్వెస్ట్ చేసింది. రెండేళ్ల వ్యవధిలోనే తాజాగా మరో రూ.2,649 కోట్లు ఇన్వెస్ట్ చేస్తోంది. ఇది తమ సంస్థపై సింగ్‌టెల్‌కి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తోందని భారతి టెలికం ఎండీ దేవేన్ ఖన్నా పేర్కొన్నారు. మరోవైపు, భారత్‌లో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉన్నా.. దీర్ఘకాలిక దృష్టితో ఎయిర్‌టెల్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నట్లు సింగ్టెల్ సీఈవో ఆర్థర్ లాంగ్ తెలిపారు. స్మార్ట్‌ఫోన్స్, మొబైల్ డేటా వినియోగం పెరిగే క్రమంలో ప్రాంతీయంగా మార్కెట్ లీడర్‌గా ఎయిర్టెల్ ఆధిపత్యం కొనసాగగలదని ధీమా వ్యక్తం చేశారు. సోమవారం బీఎస్ఈలో ఎయిర్టెల్ షేరు 4.2 శాతం లాభపడి రూ. 439.5 వద్ద క్లోజయ్యింది. -
ఎయిర్టెల్ లాభం 39% డౌన్
న్యూఢిల్లీ: దేశీయ టెలికం రంగంలో పోటీ, అనిశ్చిత పరిస్థితుల ప్రభావం భారతీ ఎయిర్టెల్ డిసెంబర్ త్రైమాసికం ఫలితాలపైనా కొనసాగింది. కన్సాలిడేటెడ్ లాభం 39 శాతం మేర తగ్గి రూ.306 కోట్లకు పరిమితమైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన లాభం రూ.504 కోట్లు కావడం గమనార్హం. ఆదాయం రూ.20,319 కోట్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.23,336 కోట్ల ఆదాయంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గిపోయింది. దేశీయ ఇంటర్ కనెక్షన్ వినియోగ చార్జీలను తగ్గిస్తూ ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలతో సగటున ఓ వినియోగదారుడి నుంచి వచ్చే ఆదాయం మరింత తగ్గిపోయినట్టు భారతీ ఎయిర్టెల్ ఎండీ, సీఈవో (భారత్, దక్షిణాఫ్రికా) గోపాల్ విట్టల్ తెలిపారు. అంతర్జాతీయ టెర్మినేషన్ చార్జీలను తగ్గించాలన్న ఇటీవలి నిర్ణయం ఈ ఆదాయ క్షీణతను ఇంకా తీవ్రం చేస్తుందన్నారు. దీనివల్ల విదేశీ ఆపరేటర్లకే తప్ప వినియోగదారులకు మేలు జరగదని చెప్పారాయన. అయితే, కంపెనీ కస్టమర్ల సంఖ్య పెరగడం కాస్తంత ఆశాజనక విషయం. డిసెంబర్ క్వార్టర్ నాటికి 16 దేశాల్లో మొత్తం కస్టమర్ల సంఖ్య 39.42 కోట్లకు వృద్ధి చెందింది. అంతకుముందు ఏడాది ఇదే కాలంలో కస్టమర్ల సంఖ్య కంటే 9.2 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. మొత్తం ఆదాయాల్లో దేశీయ ఆదాయాలు రూ.15,294 కోట్లుగా ఉన్నాయి. వార్షిక ప్రాతిపదికన చూస్తే 11.3 శాతం క్షీణించినట్టు. ఆఫ్రికా ఆదాయాలు మాత్రం 5.3 శాతం పెరిగాయి. కన్సాలిడేటెడ్‌గా చూస్తే కంపెనీ రుణాలు రూ.91,714 కోట్లుగా ఉన్నాయి. 2016 డిసెంబర్ క్వార్టర్లో ఉన్న రూ.91,480 కోట్ల కంటే అతి స్వల్పంగా పెరిగినట్టు తెలుస్తోంది. అనుబంధ కంపెనీల నుంచి డివిడెండ్ రూపేణా వచ్చిన ఆదాయాన్ని వాటాదారులకు అందించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఒక్కో షేరుకు రూ.2.84 చొప్పున మధ్యంతర డివిడెండ్‌కు సిఫారసు చేసింది. మార్కెట్లు ముగిసిన తర్వాత ఈ ఫలితాలు వెల్లడయ్యాయి. కాగా, బీఎస్ఈలో భారతీ ఎయిర్టెల్ స్టాక్ 1.17 శాతం నష్టపోయి గురువారం రూ.494.50 వద్ద క్లోజయింది. -
టెలికాం దిగ్గజానికి ఊరట
న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌కు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) ఊరట కల్పించింది. టెలికాం సబ్స్క్రైబర్లకు ఆధార్ ఆధారిత ఈ-కేవైసీ వెరఫికేషన్ మార్చి 31 వరకు చేపట్టుకోవచ్చని పేర్కొంది. కానీ భారతీ బ్యాంకింగ్ సంస్థ ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంకుపై విధించిన ఈకైవేసీ లైసెన్స్ రద్దు ఆర్డర్‌ను మాత్రం యూఐడీఏఐ ఉపసంహరించుకోన్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. 2018 మార్చి 31 వరకు ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను భారతీ ఎయిర్టెల్ చేపట్టేందుకు యూఐడీఏఐ అనుమతి ఇచ్చిందని తాము నిర్థారిస్తున్నట్టు భారతీ ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను తాము పాటించనున్నట్టు పేర్కొన్నారు. అయితే పేమెంట్స్ బ్యాంకింగ్ సంస్థపై యూఐడీఏఐ జారీచేసిన ఆదేశాలపై స్పందించడానికి మాత్రం భారతీ ఎయిర్టెల్ ప్రతినిధి తిరస్కరించారు. ప్రస్తుతమైతే ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకింగ్ విషయంలో స్టేటస్ క్వో అమలు చేస్తున్నట్టు ఒక వ్యక్తి చెప్పారు. కస్టమర్ల ఆధార్ ఆధారిత ఈకేవైసీ వెరిఫికేషన్‌ను చేపట్టకుండా భారతీ ఎయిర్టెల్, ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుపై యూఐడీఏఐ గతేడాది డిసెంబర్లో నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఆధార్ ఈకేవైసీ ద్వారా సిమ్ వెరిఫికేషన్ ప్రక్రియ చేపడుతూ.. కస్టమర్లకు తెలియకుండా పేమెంట్ బ్యాంకు అకౌంట్లు తెరుస్తున్నట్టు యూఐడీఏఐ విచారణలో వెల్లడైంది. ఆ అకౌంట్లను ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలకు లింక్ చేసినట్టు కూడా తెలిసింది. దీంతో కస్టమర్లు లింక్ చేసిన అకౌంట్లకు కాకుండా... ఎయిర్టెల్బ్యాంకు అకౌంట్లలోకి గ్యాస్ సబ్సిడీ వెల్లుతున్నట్టు వెల్లడైంది. ఇలా కస్టమర్లకు తెలియకుండా రూ.167 కోట్ల ఎల్పీజీ సబ్సిడీలను తన ఖాతాల్లోకి మరలుచుకున్నట్టు తెలిసింది. ఈ విషయంలో ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంకుకు రూ.2.5 కోట్ల జరిమానా విధించి, వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టకుండా నిషేధం విధించింది. అనంతరం భారతీ ఎయిర్‌టెల్‌కు జనవరి 10 వరకు అనుమతి ఇచ్చినప్పటికీ, ప్రస్తుతం ఈ అనుమతిని 2018 మార్చి 31 వరకు ఇవ్వనున్నట్టు పేర్కొంది. -
ఎయిర్టెల్ చేతికి టిగో రువాండా
సాక్షి, ముంబై: దేశీయ టెలికాం దిగ్గజం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. టిగో రువాండాలో 100 శాతం వాటాను కొనుగోలు చేసింది. టిగో రువాండా లిమిటెడ్ పేరుతో ఆపరేషన్స్ నిర్వహిస్తున్న మిల్లికామ్లో 100 శాతం ఈక్విటీ వాటాను కొనుగోలు చేశామని భారతీ ఎయిర్టెల్ ఒక ప్రకటనలో తెలిపింది. మిల్లికామ్ ఇంటర్నేషనల్ సెల్యులార్కు చెందిన టిగో రువాండాతో ఒక ఖచ్చితమైన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం ప్రకారం, టిగో 370 మిలియన్ వినియోగదారులు ఎయిర్టెల్ రువాండా నెట్ వర్క్‌లో చేరతారు. అలాగే 80 మిలియన్ డాలర్ల ఆదాయంతో 40 శాతం ఆదాయాన్ని ఆర్జించనున్నట్లు ఎయిర్టెల్ తెలిపింది. ఈ కొనుగోలు ద్వారా రువాండాలో రెండవ అతిపెద్ద సంస్థగా అవతరించనున్నట్టు చెప్పింది. ఈ ఒప్పందం రెగ్యులేటరీ, చట్టబద్ధమైన ఆమోదాలకు లోబడి ఉంటుందని పేర్కొంది. టెలికాం మార్కెట్ బలహీనంగా ఉన్నదేశాల్లో నిర్మాణాన్ని ఏకీకృతం చేసేందుకు ఎయిర్‌లెట్ చురుకైన చర్యలు చేపట్టిందని ఎయిర్టెల్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ పేర్కొన్నారు. ఇప్పటికే ఘనాలో బలమైన ఆచరణాత్మక సంస్థ ఉన్న తాము ఆఫ్రికాలో లాభదాయకమైన బలమైన పోటీదారుగా ఉండటానికి టిగో రువాండాను కొనుగోలు చేయడం ఒక కీలకమైన మందడుగు వేసినట్టు చెప్పారు. -
విరాళంగా రూ.7000 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ చైర్మన్ సునిల్ మిట్టల్, తమ గ్రూప్ దాతృత్వ సంస్థ భారతి ఫౌండేషన్‌కు భారీగా విరాళం అందించారు. తమ కుటుంబ సంపద నుంచి 10 శాతం అంటే మొత్తం రూ.7000 కోట్లను విరాళంగా అందించనున్నట్ట ప్రకటించారు. అదేవిధంగా వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన బలహీన యువతకు ఉచితంగా విద్యను అందించడానికి భారతీ కుటుంబం, సత్యభారతీ యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ఈ కొత్త యూనివర్సిటీ సైన్సు అండ్ టెక్నాలజీపై దృష్టిసారించనుంది. వీటిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్ వంటి వాటిపై ఎక్కువగా ఫోకస్ చేయనుంది. ఈ యూనివర్సిటీని ఉత్తర భారత్‌లో ఏర్పాటు చేయనున్నట్టు తెలిసింది. తొలి అకాడమిక్ సెషన్ 2021 నుంచి ప్రారంభం కాబోతుంది. మొత్తం 10వేల మంది విద్యార్థులతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవలే ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, టెక్ టైటాన్ నందన్ నిలేకని, ఆయన భార్య రోహిని నిలేకని 'ది గివింగ్ ప్లెడ్జ్'లో జాయిన్ అయి, తమ సగం సంపదను దాతృత్వం ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు. వీరు ప్రకటించిన రోజుల వ్యవధిలోనే మిట్టల్ కూడా తమ గ్రూప్ దాతృత్వ సంస్థకు భారీ విరాళం ప్రకటించారు. -
ప్రమాదంలో లక్ష టెలికాం ఉద్యోగాలు
టెలికాం రంగంలో ఉద్యోగులు సంఖ్య భారీగా తగ్గిపోతుంది. దిగ్గజ కంపెనీగా పేరున్న భారతీ ఎయిర్‌టెల్‌లో గతేడాది కంటే ఈ ఏడాదికి ఉద్యోగులు 1,805 మంది తగ్గిపోయారు. గతేడాది సెప్టెంబర్‌లో 19,462గా ఉన్న ఎయిర్టెల్ ఉద్యోగుల సంఖ్య, ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి 17,657గా ఉంది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి ఉన్న కస్టమర్లు 16,960కి పెరిగారు. గతేడాది ఈ సంఖ్య 14,189గా ఉంది. ఒక్కో నెలలో ఒక్కో ఉద్యోగి రెవెన్యూ 4.1 శాతం తగ్గిపోయి, రూ.31.5 లక్షలుగా నమోదైంది. టెలికాం ఆపరేటర్ల మధ్య తీవ్ర పోటీ వాతావరణం నెలకొనడంతో, లాభాలు భారీగా తగ్గిపోతున్నాయని విశ్లేషకులు చెప్పారు. దీంతో టెలికాం కంపెనీలు చాలామంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇస్తున్నాయి. పరోక్ష ఉద్యోగాలతో పోలిస్తే మొత్తం లక్ష టెలికాం ఉద్యోగాలు వచ్చే ఏళ్లలో ప్రమాదంలో పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. భారత్‌లోనే కాక, ఆఫ్రికాలో కూడా ఎయిర్టెల్ తన ఉద్యోగుల సంఖ్యను తగ్గించేసింది. ఆఫ్రికాలో కంపెనీ ఉద్యోగులు 321 మంది తగ్గిపోయారు. ఏడాది క్రితం ఆఫ్రికాలో 4,058 మంది ఉద్యోగులుండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌కి 3,737 గా ఉన్నారు. -
ఒక్కరోజులోనే ఈ ప్రత్యర్థులకు 1.5 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ : దేశీయ టెలికాం మార్కెట్లో జరుగుతున్న యుద్ధంలో ఒక్కరిని మించి మరొకరు దూసుకుపోతున్నారు. తీవ్రమైన పోటీ వాతావరణం ఉన్నప్పటికీ ఎక్కడా కూడా ఆ ఇద్దరు మాత్రం తగ్గడం లేదు. ఇటు మార్కెట్ క్యాపిటలైజేషన్‌లోనూ తీవ్ర పోటీ నెలకొంది. రిలయన్స్ ఇండస్ట్రీ షేర్లు, భారతీ ఎయిర్టెల్ షేర్లు నేటి మార్కెట్లో మైలురాయిలకు దగ్గరగా మెరుపులు మెరిపించాయి. ప్రస్తుతం టెలికాం మార్కెట్ లీడర్‌గా ఉన్న భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ సోమవారం రూ.2 లక్షల కోట్లకు చేరుకోగా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.6 లక్షల కోట్ల దగ్గరగా వచ్చేసింది. దీంతో కేవలం ఇన్వెస్టర్లు మాత్రమే కాదు, ఆ కంపెనీ అధినేతలు కూడా భారీగా లబ్ది పొందారు. ఫోర్బ్స్ అంచనాల ప్రకారం సోమవారం రిలయన్స్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ తన నికర సంపద మరో 1.1 బిలియన్ డాలర్లను చేర్చుకోగా.. భారతీ ఎంటర్ప్రైజ్ చైర్మన్ సునిల్ భారతీ మిట్టల్ 433 మిలియన్ డాలర్లను పెంచుకున్నారు. ఇరు కంపెనీల షేర్లు నేటి మార్కెట్లో భారీగా పెరగడంతో, కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌తో పాటు వారి సంపద కూడా పైకి ఎగిసింది. మొత్తంగా అంబానీ నికర సంపద 41.3 బిలియన్ డాలర్లు. మిట్టల్ సంపద 10.1 బిలియన్ డాలర్లు. ఒక్కరోజులోనే తమ సంపదను భారీగా పెంచుకున్న టాప్-3 గెయినర్లలో ఈ ప్రత్యర్థులున్నారు. నేటి మార్కెట్లో రిలయన్స్ షేర్లు 3 శాతానికి పైగా, ఎయిర్టెల్ షేర్లు 5 శాతం మేర జంప్ చేశాయి. -
జియోకు కౌంటర్: ఎయిర్టెల్ 4జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద మొబైల్ కంపెనీ దిగ్గజం భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోకు కౌంటర్ ఇవ్వబోతుంది. దీపావళి కానుకగా ఓ సరికొత్త 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్దమవుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టడం కోసం హ్యాండ్సెట్ తయారీదారులతో ఎయిర్టెల్ జరుపుతున్న చర్చలు తుది దశలో ఉన్నట్టు కూడా తెలిసింది. 2,500 రూపాయలతో ఈ డివైజ్ మార్కెట్లోకి రాబోతుందని, ఎక్కువమొత్తంలో డేటా, వాయిస్ మినిట్స్‌తో ఎయిర్టెల్ దీన్ని తీసుకొస్తుందని సంబంధిత వర్గాలు చెప్పాయి. రిలయన్స్ జియోకు గట్టి పోటీ ఇచ్చేందుకు ఎయిర్టెల్ ఈ మేరకు 4జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తుంది. పాపులర్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఆధారితంగా ఇది రూపొందుతుంది. ఈ 4జీ డివైజ్‌ను టాప్ దేశీయ టెల్కో, హ్యాండ్సెట్ తయారీదారి కో-ప్రమోట్ చేయనుంది. గూగుల్ ప్లే యాప్ స్టోర్‌లో లభించే అన్ని రకాల యాప్స్‌ను యూజర్లు డౌన్లోడ్ చేసుకునేలా ఈ టెల్కో అనుమతి కల్పించనుంది. ఈ ఫోన్ లాంచింగ్ సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్ మొదట్లో ఉండొచ్చు. ''రూ.2,500 ధర మధ్యలో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలని ఎయిర్టెల్ కొన్ని హ్యాండ్సెట్ తయారీదారులతో చర్చలు జరుపుతోంది. ఆ స్మార్ట్‌ఫోన్, రిలయన్స్జియో ఆఫర్ చేసిన ఫీచర్ ఫోన్ కంటే మెరుగ్గా, పెద్ద స్క్రీన్, మంచి కెమెరా, మెరుగైన బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండేలా రూపొందించాలని ప్లాన్ చేస్తుంది'' అని ఎయిర్టెల్ ప్లాన్స్‌కు సంబంధించిన సీనియర్ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఈ చర్చలు చాలా అడ్వాన్స్ దశలో కూడా ఉన్నట్టు పేర్కొన్నారు. 4జీ స్మార్టఫోన్ మార్కెట్ కోసం టెలికాం మార్కెట్ లీడర్‌తో లావా, కార్బన్ కంపెనీలు వేరువేరుగా చర్చలు జరిపినట్టు ఆ కంపెనీలు ధృవీకరించాయి. అయితే మార్కెట్లో వచ్చే ఊహాగానాలపై స్పందించేది లేదని భారతీ ఎయిర్టెల్ అధికార ప్రతినిధి చెప్పారు. ఒకవేళ ఎయిర్టెల్ నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ విడుదలైతే, జియోకు ఇది గట్టిపోటీగా నిలువనుంది. మరోవైపు జియో ఫోన్ కూడా సెప్టెంబర్‌లోనే మార్కెట్లోకి వస్తుంది. రెండు డివైజ్‌లు ఒకేసారి పోటాపోటీగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. -
నోకియా ఇండియా క్లైయింట్ ఎయిర్ టెల్ అధినేత రాజీనామా
కోల్ కత్తా : భారతీ ఎయిర్ టెల్ గ్లోబల్ అకౌంట్ కు సంబంధించిన నోకియా ఇండియా అధినేత తేజిందర్ కాల్ర తన పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో జైదీప్ మినోచాను కంపెనీ నియమించనున్నట్టు తెలుస్తోంది. మినోచా ప్రస్తుతం భారత్ లో నోకియా గ్లోబల్ సేల్స్ సపోర్టు సెంటర్ కు అధినేతగా వ్యవహరిస్తున్నారు. సునీ ల్ మిట్టల్ నేతృత్వంలో మొబైల్ నెట్ వర్క్ లు కలి ఉన్న భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్రికన్ మార్కెట్లలో కంపెనీ 3జీ, 4జీ నెట్ వర్క్ ను విస్తరించేందుకు కృషిచేస్తున్నారు. భారత్ లో 13 సర్కిళ్లలో ఎయిర్ టెల్స్ మొబైల్ బ్రాండ్ బ్యాండ్ నెట్ వర్క్ ను నోకియా కలిగిఉన్నట్టు అంచనా. వచ్చే నెలలోనే మినోచా ఈ పదవీ బాధ్యతలు స్వీకరిస్తే, కంపెనీ సర్వీసుల మేనేజ్ మెంట్, ఆపరేషనల్ సపోర్టు, నెట్ వర్క్ ప్లానింగ్, సిస్టమ్స్ ఇంటిగ్రేషన్, భారతీ ఎయిర్ టెల్ సూపర్ విజన్ ను వంటి బాధ్యతలను ఆయన చేపట్టాల్సి ఉంటుంది. అయితే నోకియా ఇండియా అధినేతగా మినోచా నియమితులవుతారా..? అనే కామెంట్ పై స్పందించడానికి నోకియా తిరస్కరించింది. దేశంలో వివిధ టెలికాం క్లైయిట్స్ కలిగి ఉన్న నోకియాకు వివిధ దేశాల అధినేతలు కలిగి ఉన్నారు. ఎయిర్ టెల్ గ్లోబల్ అకౌంట్ అధినేతగా నోకియా భారత్ వ్యక్తినే కలిగి ఉండటం విశేషం. వోడాఫోన్ గ్లోబల్ అకౌంట్ అధినేతగా యూరప్ వ్యక్తి ప్రాతనిధ్యం వ్యవహరిస్తున్నారు. 4జీ ప్లేయర్ లో భారతీ ఎయిర్ టెల్ నోకియా అతిపెద్ద క్లైయింట్ గా ఉంది. -
కొత్త జీఎస్ఎం యూజర్లు నవంబర్‌లో 48.67 లక్షలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో 48.67 లక్షల మంది కొత్తగా జీఎస్ఎం మొబైల్ వినియోగదారులు జతయ్యారని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ) సోమవారం తెలిపింది. సీఓఏఐ వెల్లడించిన గణాంకాల ప్రకారం..., అక్టోబర్‌లో 68.31 కోట్లుగా ఉన్న మొత్తం జీఎస్ఎం మొబైల్ వినియోగదారుల సంఖ్య నవంబర్‌లో 68.80 కోట్లకు పెరిగింది. భారతీ ఎయిర్‌టెల్‌కు కొత్త వినియోగదారులు అధికంగా లభించారు. నవంబర్‌లో లభించిన 17.22 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 19.65 కోట్లకు పెరిగింది. ఈ కంపెనీ మార్కెట్ వాటా 28.57 శాతంగా ఉంది. అత్యధిక వినియోగదారులను సాధించిన రెండో మొబైల్ కంపెనీగా ఎయిర్‌సెల్ నిలిచింది. నవంబర్‌లో కొత్తగా లభించిన 15.4 లక్షల మంది కొత్త వినియోగదారులతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 6.52 కోట్లకు పెరిగింది. వొడాఫోన్‌కు కొత్తగా 13.3 లక్షల మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మార్కె ట్ వాటా 22.97 శాతానికి, మొత్తం వినియోగదారుల సంఖ్య 15.80 కోట్లకు పెరిగింది. ఐడియా సెల్యులర్కు 36,219 మంది వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 12.84 కోట్లకు, మార్కెట్ వాటా 18.66 శాతానికి పెరిగింది. వీడియోకాన్‌కు నవంబర్‌లో లభించిన 1.85 లక్షల కొత్త వినియోగదారులతో మొత్తం వినియోగదారుల సంఖ్య 36.7 లక్షలకు పెరిగింది. యూనినార్‌కు 36,089 మంది కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 3.23 కోట్లకు పెరిగింది. ఇక ఎంటీఎన్ఎల్కు 5,923 కొత్త వినియోగదారులు లభించారు. దీంతో ఈ కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 34.52 లక్షలకు చేరింది. -
ఎయిర్టెల్ కస్టమైజ్డ్ ప్లాన్స్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ పోస్ట్ పెయిడ్ వినియోగదారుల కోసం కస్టమైజ్డ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. వినియోగదారులు తమ వినియోగ ప్రాధాన్యతలను బట్టి ఈ ప్లాన్లను కస్టమైజ్ చేసుకోవచ్చని భారతీ ఎయిర్టెల్ సీఎంఓ(కన్సూమర్ బిజినెస్) గోవింద్ రాజన్ పేర్కొన్నారు. రూ.199 నుంచి రూ.999 రేంజ్లో ఐదు రెంటల్ ఆప్షన్లనందిస్తున్నామని వివరించారు. తామందిస్తున్న ఈ ప్లాన్స్ల్లో ఫ్రీ కాల్స్, ఎస్ఎంఎస్లు, డేటా యూసేజ్.. ఇవన్నీ నిర్దేశిత యూనిట్లలో ఉంటాయని వివరిం చారు. కొంత మంది లోకల్ కాల్స్ మీద, మరికొంతమంది ఎస్టీడీ కాల్స్ మీద, ఇంకొంతమంది డేటా వినియోగంపైనే ఎక్కువ ఖర్చు చేస్తారని పేర్కొన్నా రు. వినియోగదారులు తమ అవసరాలకనుగుణంగా ఈ ప్లాన్స్‌ను కస్టమైజ్ చేసుకోవచ్చని వివరించారు.