
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్.. చౌక పోస్ట్–పెయిడ్ ప్యాకేజీల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్‌పీయూ) పెంచే చర్యల్లో భాగంగా రూ.499 దిగువన ఉన్నటువంటి ఆఫర్ల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే రూ.299 ప్లాన్‌ను పక్కనపెట్టిన ఎయిర్‌టెల్.. క్రమంగా రూ.349, రూ.399 ప్యాకేజీల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఈ రంగంలో మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని విశ్లేíషిస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ సంస్థకు 28.4 కోట్ల కస్టమర్ బేస్ ఉంది.
Comments
Please login to add a commentAdd a comment