జియో దెబ్బ ‌: ఎగిసిన ఎయిర్‌టెల్‌ | Bharti Airtel regains Rs 2 trillion m-cap | Sakshi
Sakshi News home page

జియో దెబ్బ ‌: భారీగా ఎగిసిన ఎయిర్‌టెల్‌ సంపద

Published Mon, Oct 14 2019 6:41 PM | Last Updated on Mon, Oct 14 2019 6:48 PM

Bharti Airtel regains Rs 2 trillion m-cap - Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్‌ మళ్లీ ఫాం లోకి వస్తోంది.  టెలికాం మార్కెట్‌లోకి  జియో ఎంట్రీతో టారిప్‌ వార్‌లో భారీగా  కుదేలైన భారతీ ఎయిర్‌టెల్ షేర్లు బిఎస్‌ఇలో సోమవారం 4 శాతం పెరిగి 19 నెలల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి. దీంతో ఎయిర్టెల్‌  రూ .2 లక్షల కోట్ల (ట్రిలియన్) మార్కెట్ వాల్యుయేషన్ మార్క్‌ను  తిరిగి దక్కించుకుంది.  రిలయన్స్‌ జియో 6 పైసల వడ్డన ప్రకటించిన తరువాత నుంచి భారతి ఎయర్‌టెల్‌  వరుసగా ఐదవరోజు కూడా లాభపడింది. దీంతో  షేరు ధర  మార్చి 2018 నుండి అత్యధిక స్థాయిని తాకింది. గత ఒక వారంలో 2 శాతం లాభంతో పోలిస్తే,  16 శాతం ర్యాలీ చేసింది. దీంతో కంపెనీ 27,662 కోట్ల రూపాయల  మార్కెట్‌ అదనంగా చేకూరింది. 

గత వారం, రిలయన్స్ జియో  ఆఫ్-నెట్ కాల్‌లకు నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని తెలిపింది. వినియోగదారుల నుండి ఇంటర్ కనెక్షన్ వినియోగ ఛార్జీలను (ఐయుసీ) ప్రకటించడంతో రిలయన్స్ జియో వినియోగదారుల ఆగ్రహానికి గురవుతోంది.  తద్వారా ఇప్పటివరకు ఉచితంగా అందించిన వాయిస్ కాల్ సేవపై ఇపుడు  ఛార్జీ వసూలు చేస్తుంది.  ఈ చర్య ప్రత్యర్థి టెలికాం కంపెనీలకు సానుకూలంగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్న సంగతి  తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement