Post Paid
-
మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై పేటీఎమ్ బంపర్ ఆఫర్...!
Paytm Offers Rewards: ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎమ్ తన యూజర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్స్ పేమెంట్స్‌పై క్యాష్‌బ్యాక్‌ను, ఆకర్షణీయమైన ఆఫర్లను కూడా అందించనుంది. ప్రతి బిల్లు చెల్లింపులో యూజర్లకు సుమారు రూ .500 వరకు క్యాష్‌బ్యాక్‌ను అందించనుంది. అంతేకాకుండా ప్రతి బిల్ చెల్లింపుపై సుమారు 5వేల వరకు కచ్చితమైన క్యాష్‌బ్యాక్ పాయింట్లను కూడ పొందవచ్చును. ఈ క్యాష్‌బ్యాక్ పాయింట్లతో ప్రముఖ బ్రాండ్స్ డీల్స్, గిఫ్ట్ వోచర్లను పొందవచ్చును. చదవండి: వన్‌ప్లస్ 9 ఆర్టీ స్మార్ట్‌ఫోన్‌లో అదిరిపోయే ప్రాసెసర్ జియో, బీఎస్ఎన్ఎల్, ఎయిర్టెల్, వీఐ పోస్ట్‌పెయిడ్ సేవలకు సంబంధించిన అన్ని బిల్లు చెల్లింపులపై ఈ ఆఫర్లు వర్తిస్తాయి. రీఛార్జ్‌లు, బిల్లు చెల్లింపుల కోసం రివార్డులను పొందడమే కాకుండా, కంపెనీ రిఫరల్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడం ద్వారా వినియోగదారులు అదనపు క్యాష్‌బ్యాక్‌ను గెలుచుకోవచ్చు. యూజర్లకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి పేటీఎం ఇటీవల మొబైల్ బిల్లు చెల్లింపులో భాగంగా త్రీ టైమ్-క్లిక్ తక్షణ చెల్లింపు ఫీచర్‌ను మరింత మెరుగుపరిచింది. యూజర్లు యూపీఐ, వ్యాలెట్, డెబిట్, క్రెడిట్, నెట్ బ్యాకింగ్‌ను ఉపయోగించి చెల్లింపులను చేయవచ్చును. చదవండి: Work From Home: భవిష్యత్తులో ఉద్యోగులు ఇలా ఉంటారా! -
కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్
సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్ ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ తన ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఓటీటీ ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా ఈ కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. ఎయిర్టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ యాక్స్సెస్ ఇస్తున్నట్లు తెలిపింది. అయితే రూ.499, అంతకంటే ఎక్కువ ప్లాన్ కలిగిన పోస్ట్ పేయిడ్ కస్టమర్లు దీనికి అర్హులు. మై ఎయిర్టెల్ యాప్ ద్వారా వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఎయిర్టెల్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ మూడు నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 12 నెలల పాటు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్టెల్ ప్లాటినమ్ కస్టమర్లు తాజాగా జీ5 విస్తృతమైన డిజిటల్ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు.ఇందులో జీ5 ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్ స్టైల్ షోలు, కిడ్స్ షోలు, ప్లేస్ ఉంటాయి. ఎయిర్టెల్ థ్యాంక్స్ కు అద్భుతమైన స్పందన వచ్చిందని , ఈ సందర్భంగా జీ5 ఆఫర్ అందివ్వడం సంతోషంగా ఉందని భారతి ఎయిర్టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శాశ్వత్ శర్మ వెల్లడించారు. ఎగ్జిస్టింగ్ ప్లాటినమ్ కస్టమర్లకు జీ5 అందిస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు. ఎయిర్టెల్ ప్లాటినం కస్టమర్లకు ఉచిత ఆఫర్ జీ5తో తమ స్ట్రాటెజిక్ పార్ట్నర్షిప్ మరింత దృఢమవుతుందని భారతీ ఎయిర్టెల్ ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎగ్జైటింగ్ కంటెంట్ అందించడంలో ఇది కీలక అడుగు అని జీ 5 బిజినెస్ హెడ్ మనీష్ అగర్వాల్ వ్యాఖ్యానించారు. -
పోస్ట్–పెయిడ్ ఆఫర్లను తగ్గిస్తున్న ఎయిర్టెల్..!
న్యూఢిల్లీ: దిగ్గజ టెలికాం సంస్థ భారతీ ఎయిర్టెల్.. చౌక పోస్ట్–పెయిడ్ ప్యాకేజీల నుంచి క్రమంగా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఒక్కో ఖాతాదారుడి నుంచి వచ్చే సగటు ఆదాయం(ఏఆర్పీయూ) పెంచే చర్యల్లో భాగంగా రూ.499 దిగువన ఉన్నటువంటి ఆఫర్ల నుంచి తప్పుకుంటున్నట్లు సమాచారం. ఇటీవలే రూ.299 ప్లాన్‌ను పక్కనపెట్టిన ఎయిర్టెల్.. క్రమంగా రూ.349, రూ.399 ప్యాకేజీల నుంచి తప్పుకునే ప్రయత్నం చేస్తోందని టెలికం రంగ నిపుణులు చెబుతున్నారు. రిలయన్స్ జియో రంగ ప్రవేశంతో ఈ రంగంలో మూడేళ్లపాటు కొనసాగిన తీవ్రపోటీ ఇప్పుడు నెమ్మదిగా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటోందని విశ్లేíషిస్తున్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ సంస్థకు 28.4 కోట్ల కస్టమర్ బేస్ ఉంది. -
బీఎస్ఎన్ఎల్ నూతన ఆఫర్
సాక్షి, సిటీబ్యూరో: బీఎస్ఎన్ఎల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు కొత్త ప్లాన్ ఆఫర్లను ప్రకటించింది. ఈ మేరకు మంగళవారం తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్.అనంతరామ్ ఒక ప్రకటన విడుదల చేశారు. పోస్ట్‌పెయిడ్ ప్లాన్–799 (దిల్ ఖోల్ కే బోల్). ఈ ప్లాన్ నెలసరి చార్జి రూ.799. అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, 6జీబీ ఉచిత డాటా మొదటి నాలుగు నెలల తదుపరి నెలకు 3జీబీ ఉచిత డాటా. మొదటి నాలుగు నెలలకు నెలసరి అద్దె రూ.599లకు తగ్గించారు. అధిక డాటా ఆఫర్ ప్లాన్–1125లో 10జీబీ ఉచిత డాటా, ప్లాన్–1525లో 30జీబీ ఉచిత డాటా, ప్రమోషనల్ ఆఫర్‌గా ప్రస్తుత కొత్త వినియోగదారులకు మూడు నెలల పాటు వర్తిస్తుంది. వివరాలకు 1503 లేదా 18001801503 నంబర్లలో సంప్రదించొచ్చు. -
పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను పెంచిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ: భారతీ ఎయిర్టెల్ కొన్ని పోస్ట్ పెయిడ్ మొబైల్ రేట్లను 50 శాతం వరకూ పెంచింది. పెంచిన ఈ రేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ తన వినియోగదారులకు పంపించిన మెసేజ్‌ల్లో పేర్కొంది. అడ్వాండేజ్ 199 ప్లాన్ రేట్లను పెంచామని ఈ మేసేజ్‌లో కంపెనీ వివరించింది. అడ్వాండేజ్ 199 ప్లాన్‌కు సంబంధించి ఎయిర్టెల్ నంబర్లకు చేసే లోకల్, ఎస్టీడీ రేట్లను నిమిషానికి 50 పైసల నుంచి 60 పైసలకు పెంచామని పేర్కొంది. ఇక ల్యాండ్‌లైన్ కాల్స్‌కు సంబంధించి రేటు నిమిషానికి 60 పైసల నుంచి 90 పైసలకు పెరుగుతుందని. ఇతర కీలకమైన టారిఫ్‌ల్లో ఎలాంటి మార్పులు లేవని వివరించింది. కాగా రెండేళ్లలో మొబైల్ కాల్ రేట్లు వంద శాతానికి పైగా పెరిగాయి. గత ఏడాది సుప్రీం కోర్టు 2జీ లెసైన్స్‌లను రద్దు చేసిన తర్వాత కొన్ని మొబైల్ కంపెనీలు రంగం నుంచి వైదొలిగాయి. ఆ తర్వాత ప్రస్తుతం ఉన్న మొబైల్ కంపెనీలు తరుచుగా టారిఫ్‌లను పెంచుతున్నాయి.