కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌ | Airtel offers free ZEE5 access to postpaid customers | Sakshi
Sakshi News home page

కస్టమర్లకు ఎయిర్‌టెల్‌ బంపర్‌ ఆఫర్‌

Published Mon, Jun 3 2019 2:42 PM | Last Updated on Mon, Jun 3 2019 7:07 PM

Airtel offers free ZEE5 access to postpaid customers - Sakshi

సాక్షి, ముంబై : ప్రముఖ మొబైల్‌ ఆపరేటర్‌ భారతి ఎయిర్‌టెల్‌ తన ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకు బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. ఓటీటీ  ప్లాట్‌ఫా జీ5లో ఉచిత ఆఫర్‌ను అందిస్తోంది. కాంప్లిమెంటరీ ఆఫర్‌గా  ఈ కొత్త ప్లాన్‌ ను తీసుకొచ్చింది.  ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రోగ్రాంలో భాగంగా తమ ప్లాటినమ్ పోస్ట్ పేయిడ్ కస్టమర్లకు అపరిమిత జీ5 కాంప్లిమెంటరీ యాక్స్సెస్ ఇస్తున్నట్లు  తెలిపింది.  అయితే రూ.499, అంతకంటే ఎక్కువ ప్లాన్ కలిగిన పోస్ట్ పేయిడ్ కస్టమర్లు దీనికి అర్హులు.  మై ఎయిర్‌టెల్ యాప్ ద్వారా  వినియోగదారులు ఈ ఆఫర్‌ను పొందవచ్చు. 

ఎయిర్‌టెల్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ మూడు నెలల పాటు, అమెజాన్ ప్రైమ్ 12 నెలల పాటు ఆఫర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్‌టెల్ ప్లాటినమ్ కస్టమర్లు  తాజాగా జీ5 విస్తృతమైన డిజిటల్ కంటెంట్‌ను ఉచితంగా పొందవచ్చు.ఇందులో జీ5 ఒరిజినల్స్, మూవీస్, టీవీ షోలు, మ్యూజిక్ వీడియోలు, లైఫ్ స్టైల్ షోలు, కిడ్స్ షోలు, ప్లేస్ ఉంటాయి.  

ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ కు అద్భుతమైన స్పందన వచ్చిందని , ఈ సందర్భంగా జీ5 ఆఫర్‌ అందివ్వడం సంతోషంగా ఉందని భారతి ఎయిర్‌టెల్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ శాశ్వత్‌ శర్మ  వెల్లడించారు. ఎగ్జిస్టింగ్ ప్లాటినమ్ కస్టమర్లకు జీ5 అందిస్తుండటం సంతోషకరమైన విషయమని చెప్పారు.  ఎయిర్‌టెల్  ప్లాటినం కస్టమర్లకు ఉచిత ఆఫర్  జీ5తో తమ స్ట్రాటెజిక్ పార్ట్‌నర్‌షిప్ మరింత  దృఢమవుతుందని  భారతీ ఎయిర్‌టెల్ ప్రకటించింది. వినియోగదారులకు మరింత ఎగ్జైటింగ్‌ కంటెంట్‌ అందించడంలో ఇది కీలక అడుగు అని జీ 5 బిజినెస్‌ హెడ్‌ మనీష్‌ అగర్వాల్‌ వ్యాఖ్యానించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement