ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ యూజర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇటీవల ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ టారిఫ్‌తో పాటు డేటా ధరల్ని పెంచింది. ప్రీపెయిడ్ టారిఫ్‌ను 20 నుంచి 25 శాతం, డాటా టాప్ అప్ ప్లాన్‌ల మీద 20 నుంచి 21 శాతం పెంచేసింది. ఈ పెరిగిన కొత్త ధరలు శుక్రవారం నుంచి అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ సెలెక్టెడ్ ప్లాన్స్‌పై ప్రతిరోజూ 500ఎంబీ డేటాను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపింది.
ఆ ప్లాన్స్ ఇలా ఉన్నాయి
ప్రతిరోజు ఎయిర్‌టెల్ అందిస్తున్న 500 ఎంబీ డేటా ఉచితంగా పొందాలంటే సంబంధిత ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీ నంబర్‌పై రూ.265, రూ. 299, రూ. 719, రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా 500ఎంబీ డేటాను పొందవచ్చు. అయితే ఇది అన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లకు వర్తించదని ఎయిర్ టెల్ తన ప్రకటనలో తెలిపింది. రూ. 265 ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ 28 రోజుల పాటు రోజుకు 1.5జీబీ డేటా, రూ. 299 ప్రీపెయిడ్ ప్లాన్ 2 జీబీ డేటా 28 రోజులు, 84 రోజులకు రోజువారీ డేటాను అందిస్తుంది. రూ. 839 ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 2.5జీబీ డేటాను 84 రోజుల పాటు పొందవచ్చు. అయితే ఉచిత డేటాను పొందాలంటే పైన ఎంపిక చేసిన ప్లాన్‌లను రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఎయిర్ టెల్ పెంచిన ధరలు
♦ఎయిర్ టెల్ పెంచిన రూ. 79గా ఉన్న ప్లాన్ రేటు రూ. 99కి చేరింది. ఇది 28 రోజుల వ్యాలిడిటీ, రూ. 99 విలువ చేసే టాక్‌టైమ్, 200 ఎంబీ డేటా, సెకనుకు పైసా వాయిస్ టారిఫ్ ఉంటుంది.
♦ అన్‌లిమిటెడ్ వాయిస్ ప్లాన్లలో రూ. 149 ప్లాన్ ధర రూ. 179కి పెంచింది. అలాగే రూ. 2,498 ప్లాన్ రూ. 2,999గా మారింది. .
♦ డేటా టాప్ అప్ రూ. 48 ప్లాన్ ఇకపై రూ. 58కి (3 జీబీ డేటాతో), రూ. 98 ప్లాన్ కొత్తగా రూ. 118కి (12 జీబీ డేటా) మారింది.
♦ రూ. 251 డేటా టాప్ అప్ ప్లాన్ రేటు ఇకపై రూ. 301కి (50 జీబీ డేటా) కి చేరింది.
చదవండి: హ్హ..హ్హ..హ్హ!..హీరో అక్షయ్ కుమార్ నవ్వుతుంటే, బిగ్‌బుల్ హాయిగా నిద్రపోతున్నాడే
Comments
Please login to add a commentAdd a comment